
న్యూఢిల్లీ: కొనుగోలుదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కేజీ–డీ6 బ్లాక్‌లో కొత్తగా ఉత్పత్తి చేయబోయే గ్యాస్ బేస్ ధరను రిలయన్స్ ఇండస్ట్రీస్ 7 శాతం తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ–డీ6 బ్లాక్‌లోని ఆర్–క్లస్టర్ క్షేత్రం నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ కొనుగోలు కోసం రిలయన్స్ బిడ్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం.. గడిచిన మూడు నెలల బ్రెంట్ క్రూడ్ సగటు రేటులో 9 శాతం స్థాయిలో గ్యాస్ బేస్ ధరను నిర్ణయించింది. తాజా మార్పుతో బేస్ రేటు 8.4 శాతం స్థాయిలో ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment