బీఓబీ బేస్ రేటు పావు శాతం తగ్గింపు | Bank of Baroda cuts base rate by 25 bps to 10% | Sakshi
Sakshi News home page

బీఓబీ బేస్ రేటు పావు శాతం తగ్గింపు

Published Wed, May 6 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

బీఓబీ బేస్ రేటు పావు శాతం తగ్గింపు

బీఓబీ బేస్ రేటు పావు శాతం తగ్గింపు

న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కనీస రుణ రేటు (బేస్ రేటు)ను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 10 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయంతో బ్యాంక్ ఆటో, గృహ, ఇతర రుణ రేట్లు తగ్గే అవకాశం ఉంది. మే 6వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని బీఎస్‌ఈకి పంపిన ఒక ఫైలింగ్‌లో బ్యాంక్ తెలిపింది.  రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా...

బ్యాంకింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఈ దిశలో ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌సహా పలు బ్యాంకులు రుణ రేటును 0.15 శాతం నుంచి 0.25 శాతం వరకూ తగ్గించాయి. జనవరి నుంచీ ఆర్‌బీఐ కీలక పాలసీ రేటును రెండు దఫాలుగా పావుశాతం చొప్పున మొత్తం అరశాతం తగ్గించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement