
సాక్షి, హైదరాబాద్: ఏటీఎంల నిర్వహణ లోపం సేవా లోపం కిందకే వస్తుందని రాష్ట్ర వినియోగదారుల ఫోరం తేల్చి చెప్పింది. ఏటీఎంల్లో నగదు తీసుకునేటప్పుడు చోటు చేసుకునే సాంకేతిక, ఇతర పొరపాట్లకు బ్యాం కులే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు జస్టిస్ బీఎన్ రావు నల్లా, సభ్యులు పాటిల్ విఠల్ రావులతో కూడి న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా, షామీర్‌పేట్‌కు చెందిన శ్యామ్‌రావుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో ఖాతా ఉంది. 2011 అక్టోబర్ 31న సికింద్రాబాద్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీ ఎం నుంచి ఆయన నగదు తీసుకోవడానికి వెళ్లా డు. కార్డు పెట్టి కావాల్సిన మొత్తం ఎంటర్ చేయగా.. ఏటీఎం స్క్రీన్‌పై సదరు లావాదేవీ విఫలమైనట్లు సందేశం వచ్చింది.
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్‌డ్రా అయినట్లు మినీ స్టేట్‌మెంట్‌లో నమోదైంది. దీనిపై ఆయన బ్యాంక్ అధికారులను సంప్రదించగా.. ఖాతాలోకి నగదు వస్తుందన్నారు. నగదు రాకపోవడంతో ఆయన ఇరు బ్యాంకులకు లీగల్ నోటీసు ఇచ్చారు. బ్యాంకుల నుంచి స్పందన లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఫోరం శ్యామ్‌రావుకు ఇవ్వాల్సిన రూ.10 వేల తో పాటు పరిహారంగా రూ.3 వేలు ఇవ్వాలని, ఖర్చుల కింద మరో రూ.1,000 చెల్లించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. దీనిపై సదరు ఎస్‌బీఐ బ్రాంచ్ ఫోరంలో అప్పీల్ దాఖలు చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం.. ఎస్‌బీఐ అప్పీల్‌ను కొట్టేసింది. ఏటీఎంల నిర్వహణ లోపాలకు బ్యాంకులే బాధ్యత వహించాలని తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment