bank officers
-
ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి ‘ఎస్బీఐ’ శాఖ
జంజ్‌గిర్–చంపా(ఛత్తీస్‌గఢ్): ఆన్లైన్ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్ బ్రాంచ్ వద్దకే. అలాంటి బ్యాంక్ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు ‘ఫిక్స్డ్’ డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు. శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎస్బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. బ్యాంక్ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. -
అఖిలమ్మా... అప్పు కట్టమ్మా! మాజీ మంత్రి ఇంటి ముందు నిరసన
ఆళ్లగడ్డ: అప్పు చెల్లించాలని మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు బ్యాంకు అధికారులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దివంగత భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ కోసం నంద్యాల ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఆయన మృతి చెందినప్పటి నుంచి వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారసులకు పలు దఫాలు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో యూనియన్ బ్యాంకు (ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ విలీనమైంది) లోన్ రికవరీ అధికారులు ఆళ్లగడ్డ చేరుకుని అఖిలప్రియ ఇంటి ముందు అప్పు చెల్లించాలని ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిసింది. అనంతరం ఈ అప్పునకు ష్యూరిటీ పెట్టిన ఏవీ సుబ్బారెడ్డికి చెందిన హోట్‌ల్ ముందు కూడా ‘బ్యాంక్ మనీ పబ్లిక్ మనీ, మా బకాయిలు చెల్లించండి–సగర్వంగా జీవించండి’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ విషయంపై అఖిలప్రియ ఫోన్లో బ్యాంకు అధికారులతో మాట్లాడి కొంత గడువు ఇస్తే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. -
నేడు, రేపు బ్యాంకుల బంద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నేడు, రేపు (శుక్ర, శనివారం) బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయనున్నారు. ఈ రెండు రోజులు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు సాగవని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 శాతం వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ తొలగింపు వంటి 11 డిమాండ్లతో కార్మిక శాఖ, కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని.. అందుకే సమ్మెకు సిద్ధమయ్యామని యూఎఫ్‌బీయూ తెలిపింది. శుక్ర, శనివారాల్లో జరగనున్న సమ్మెలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ, ఎన్‌ఓబీడబ్ల్యూ, ఎన్ఓబీఓ బ్యాంకింగ్ సంఘాలు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. గ్రామీణ బ్యాంకులు మాత్రమే సమ్మెలో పాల్గొనడం లేదని, మద్దతు మాత్రం తెలుపుతున్నట్లు ఆల్ ఇండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో మార్చి 11, 12, 13 తేదీల్లో కూడా సమ్మె ఉంటుందని యూఎఫ్‌బీయూ హెచ్చరించింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజు కూడా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలోనే పాల్గొంటారు. 2వ తేదీ ఆదివారం. అంటే వరుసగా 3 రోజులు బ్యాం కులు పనిచేయవు. పునఃప్రారంభం సోమవారమే. -
అలా వెళ్లాడు.. ఇలా దొరికిపోయాడు
సాక్షి, కదిరిటౌన్: తన వద్దనున్న వేరొకరి బ్యాంకు పాసుపుస్తకం తీసుకుని, ఖాతాదారు సంతకం ఫోర్జరీ చేసి నగదు డ్రా చేసేందుకు వెళ్లిన మోసగాడిని బ్యాంకు అధికారులు గుర్తించి పట్టుకున్నారు. కదిరికి చెందిన గంగిశెట్టి 2019 జూన్ 30న స్థానిక ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లాడు. నిరక్షరాస్యుడు కావడంతో బ్యాంకులో చిప్పలమడుగుకు చెందిన శివ అనే వ్యక్తి సహాయంతో విత్‌డ్రా ఫాం పూరించి, అందులో సంతకం చేశాడు. అదే సమయంలో సెల్‌ఫోన్‌కు ఎవరో కాల్ చేయడంతో గంగిశెట్టి మాట్లాడేందుకని విత్డ్రాం ఫాం, బ్యాంకు పాసుపుస్తకం సదరు వ్యక్తి వద్దే ఉంచేసి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. దరఖాస్తు రాసిచ్చిన శివ అనే వ్యక్తికి దురాశ కలిగింది. సంతకం చేసేసి ఉన్న రూ.27వేల విత్ డ్రా ఫాం తీసుకుని కౌంటర్లోకి వెళ్లాడు. అక్కడ సిబ్బంది ఖాతాదారు ముఖం చూడకుండానే నగదు ఇచ్చేశారు. ఆ తర్వాత నెల రోజులకు గంగిశెట్టి తన పాసుపుస్తకం పోయిందని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన కంప్యూటర్లో పరిశీలించగా ఖాతాలోంచి రూ.27వేలు నగదు డ్రా అయిపోయిన విషయం బయటపడింది. తనకు సహాయం చేసిన వ్యక్తే ఈపని చేసి ఉంటాడని తెలపగా మేనేజర్ కొత్త పాసుపుస్తకం జారీ చేశారు. పాత పుస్తకం ఎవరైనా తీసుకువస్తే స్వాదీనం చేసుకోవాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు. చదవండి: మైనర్‌పై అత్యాచారం.. 65 ఏళ్ల వృద్ధుడికి మరణ శిక్ష ఈ క్రమంలో శివ శనివారం మరోసారి గంగిశెట్టి ఖాతాలోంచి రూ.2వేలు నగదు డ్రా చేసుకుందామని ఆంధ్రాబ్యాంకుకు వెళ్లాడు. విత్‌డ్రా ఫాం నింపి, పాసుపుస్తకం తీసుకుని కౌంటర్‌కు వెళ్లాడు. అక్కడ నీ పేరేమి అని అడిగితే వాస్తవ ఖాతాదారు పేరు కాకుండా తన పేరు శివ అని చెప్పాడు. మరోసారి అడిగేసరికి పేరు పూర్తిగా చెప్పలేక నీళ్లు నమిలాడు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి శివను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
బతికుండగానే చంపేశారు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ‘అర్జున్ సురవరం’ సినిమా వచ్చింది. నిరుద్యోగుల డిగ్రీ సర్టిఫికెట్లను వారికి తెలియకుండా సేకరించి, బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటారు. ఈలోగా లోన్ కట్టలేదంటూ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులొచ్చి అరెస్టు చేస్తారు. బాధితుడైన హీరో.. ఆ స్కాంను బయటపెట్టడంతో కథ సుఖాంతమవుతుంది. సరిగ్గా హైదరాబాద్‌లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. తమ తోటి వ్యాపార భాగస్వామి తండ్రిని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, వారి ఆస్తినే తాకట్టు పెట్టి రూ.16 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆస్తులకు సంబంధిం చిన డాక్యుమెంట్లు నేర స్వభావం ఉన్నవారి చేతిలో పడితే చిక్కులు ఎదురవుతాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. సీన్ కట్ చేస్తే..: బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 5లో రెన్‌లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రక్తం నుంచి తీసిన సీరమ్, అల్బుమిన్ తదితరాలను సేకరించి విక్రయిస్తుంది. 2017లో ఈ కంపెనీని ఆరుల్ ప్రకాశ్, మహమ్మద్ అబ్దుల్ అజీజ్‌లు స్థాపించారు. వీరిద్దరూ కూడా కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. తర్వాత కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజయ్.. మైసూర్ రాఘవేంద్ర మూడో డైరెక్టర్‌గా చేరాడు. రాఘవేంద్ర కుటుంబం పేరు మీద దక్షిణ బెంగళూరులోని కెంగెరి గ్రామంలో 3.3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై ఆరుల్, అజీజ్‌లు కన్నేశారు. రాఘవేంద్రకు తెలియకుండా ఈ భూమి నకిలీ సేల్ డీడ్ సంపాదించారు. జానకీ రమాశర్మ అనే ఫైనాన్సియల్ కన్సల్టెంట్ సాయంతో సదరు భూమిని తనఖాగా ఉంచి రుణం కోసం తొలుత ఎస్బీఐ సైఫాబాద్ శాఖలో రుణం కోసం యత్నించారు. అక్కడ యత్నం బెడిసికొట్టింది. ఈసారి మరింత పకడ్బందీగా మహబూబ్‌గంజ్ ఎస్బీఐ బ్రాంచ్‌లో రాఘవేంద్ర పేరిట రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. నకిలీ డెత్ సర్టిఫికెట్.. డైరెక్టర్ రాఘవేంద్ర తండ్రి బతికుండగానే చనిపోయినట్లు, నకిలీ డెత్ సర్టిఫికెట్, నకిలీ ఫొటోలు, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు సంపాదించారు. రుణం కోసం దరఖాస్తు పత్రాలకు జతచేసిన వివరాలు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లోని వివరాలతో పొంతనలేదు. అయినా వాటిని అలాగే సమర్పించారు. ఈ పత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే.. మహబూబ్‌గంజ్ బ్రాంచ్ ఆర్ఎంఎంఈ పవన్‌కుమార్, చీఫ్ మేనేజర్ జే.నాగేశ్వరశర్మ, బ్యాంకు మేనేజర్ శశిశంకర్లు రూ.16 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్ర అవాక్కయ్యాడు. తన తండ్రి చనిపోయాడంటూ పత్రాలు సృష్టించారని తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ విషయంపైతానే స్వయంగా దర్యాప్తు చేశాడు. బ్యాంకుకు వచ్చి లోను మంజూరు చేసినఫైళ్లలో ఫొటో, సంతకం తనవి కావని నిరూపించాడు. దీంతో నాలుక్కరుచుకున్న ఎస్బీఐ ఉన్నతాధికారులు లోను ఖాతాను నిరర్ధక ఆస్తి (నాన్‌పెర్ఫామింగ్ అసెట్)గా గతేడాది మార్చి 8న ప్రకటించారు. బ్యాంకు అంతర్గత విచారణలో విభాగాధిపతి ధనార్జనరావు సహా పలువురు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. అనంతరం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తమ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని కోరారు. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గురువారం రాత్రి నిందితులుగా ఉన్న ఎస్బీఐ అధికారులు, రెన్‌లైఫ్ నిందితుల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. -
26న బ్యాంకుల సమ్మె
ప్రభుత్వ రంగంలోని మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా డిసెంబర్ 26న (బుధవారం) సమ్మెకు దిగనున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొననున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటు వేతనాల పెంపు డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్స్ శుక్రవారం ఒక రోజు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 3.20 లక్షల మంది అధికారులు పాల్గొన్నారు. ఈ మూడు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్రం సెప్టెంబర్‌లో ప్రతిపాదించింది. అయితే, ఈ విలీనం వల్ల ఇటు బ్యాంకులకు గానీ అటు కస్టమర్లకు గానీ ఎటువంటి ప్రయోజనం ఉండబోదని, పైగా రెండు వర్గాల ప్రయోజనాలకు ప్రతికూలమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్ని స్తోందని, అయితే మొత్తం ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ కలిపేసినా టాప్ 10 గ్లోబల్ బ్యాంకుల్లో చోటు దక్కే అవకాశాలు లేవని వ్యాఖ్యానించింది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ తదితర 9 యూనియన్లు.. యూఎఫ్‌బీయూలో భాగం. -
‘మనీ’వేదన!
పాలమూరు : బ్యాంక్ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం జాతీయ బ్యాంకులు మూతపడ్డాయి. ఇక నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవులు.. ఇలా వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడడంతో నిత్యం లావాదేవీలు నడిపించే వ్యాపారులు మొదలు సాధారణ ప్రజలు వరకు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రధాన లావాదేవీలు నడిచే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, తదితర జాతీయ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో శుక్రవారం తెరుచుకోకపోగా విషయం తెలియని సామాన్యులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత రెండు రోజుల సాధారణ సెలవులు రాగా.. సోమవారం ఒక రోజు మాత్రమే బ్యాంకులు తెరుచుకోనున్నా యి. మళ్లీ మంగళవారం క్రిస్మస్ సెలవు, ఆ మరుసటి రోజు బుధవారం మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. దీంతో సోమవారం తప్పించి వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడుతున్నట్లవుతోంది. నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు వ్యాపారులే కాకుండా సాధారణ ప్రజలు నిత్యం బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతారు. ప్రధానంగా వ్యాపారులకు బ్యాంకుల ద్వారా డబ్బు పంపడం, తీసుకోవడం సర్వసాధారణం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వర్గా ల వారు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకు వేతన సవరణల్లో అన్ని తరగతుల అధికారుల కు ఒకే రకమైన సవరణ ఉండేది. 11వ వేతన సవరణలో అధికారుల పనితీరు ఆధారంగా వేతన సవరణ చేయాలన్న యాజమాన్యాలు నిర్ణయించి, అమలు చేస్తుండడాన్ని నిరసిస్తూ బ్యాంకు అధికారులు సమ్మెకు వెళ్తున్నారు. దీం తో పాటు చిన్న బ్యాంకుల విలీనాన్ని చేయ రాదని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో సాధారణ సెలవులు, క్రిస్మస్ సెలవు రావడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వరుస సెలవులతో వెతలు బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె కారణం గా బ్యాంకుల సేవలు ఐదు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఈనెల 21న బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేశారు. ఈనెల 22న నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు పని చేయవు. 23న ఆదివారం సాధారణ సెలవు. 24వ తేదీ సోమవారం బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి. ఇక ఈనెల 25న కిస్మస్ పండగ సెలవు. 26న బ్యాంకు ఉద్యోగుల సామూహిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఆ రోజు బ్యాంకులు పని చేయవు. మొత్తం మీద వారం రోజుల్లో ఒక రోజు మాత్రమే బ్యాంకులు పని చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. నగదు కొరత ఏర్పడే అవకాశం నెలకొంది. సాధారణ రోజుల్లోనే ఏటీఎంలో నగదు లేక ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏటీఎంలలో గురువారం పెట్టిన నగదు శనివారం ఉదయం వరకు ఖాళీ అయ్యింది. దీంతో చాలా మంది ఏటీఎంల చుట్టూ డబ్బు కోసం తిరగడంకనిపించింది. ఈనెల 25న క్రిస్మస్ పండగ ఉండటంతో క్రిస్టియన్లు నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లాలి. కానీ పరిస్థితిని చూస్తే పండుగ జరుపుకునేందుకు నగదు ఎలా సమకూర్చుకోవాలని వారు ఆలోచనలో పడ్డారు. కాగా, ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్, ఐసీఐసీఐతో పాటు సహకార బ్యాంకులు తప్ప మిగిలిన జాతీయ బ్యాంకులన్నీ మూతపడటంతో వారం రోజుల పాటు నగదు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. ఏటీఎంలన్నీ ఖాళీ జిల్లాలో ఎక్కడ చూసినా ఏటీఎంలు ఖాళీగానే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా డబ్బు పెట్టకపోవడంతో జనం నిరాశగా వెళ్తున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలోనే 30కుపైగా ఏటీఎంల్లో ఏ ఒక్కదాంట్లోనూ డబ్బు లేకపోవ డం గమనార్హం. ప్రధాన ఏటీఎంల్లో కొంత డ బ్బు పెడుతున్నా గంటలోపే అయిపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడైనా ఏటీఎంలో డబ్బు ఉన్నట్లు తెలియగానే విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఇందులో కొందరికే డబ్బు అందుతుండగా.. మిగతా వారే నిరాశతో వెనుతిరుగుతున్నారు. రూ.5వేల కోసం 10ఏటీఎంలు తిరిగాను నాకు ఈరోజు ఉదయం అత్యవసరంగా రూ.5వేలు కావాల్సి వచ్చింది. ఖాతాలో డబ్బు ఉందన్న ధైర్యంతో ఏటీఎంకు వెళ్తే ‘నో క్యాష్’ బోర్డు కనిపించింది. అలా పట్టణంలోని దాదాపు 10ఏటీఎంలు తిరిగినా అదే పరిస్థితి ఎదురైంది. మామూలు రోజుల్లో ఏటీఎంల్లో డబ్బు పెట్టరు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కువ డబ్బు ఉంచడమో లేదా ప్రతిరోజు రెండు పూజలా డబ్బు పెట్టడమో చేస్తే మాలాంటి వారికి ఇబ్బందులు తప్పుతాయి. – వినోద్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ -
డ్వాక్రా యానిమేటర్లకు సర్కార్ షాక్!
సాక్షి, అమరావతి : డ్వాక్రా యానిమేటర్లకు ఏడాదిపాటు రూ.3వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చింది. ఏడాది కాదు కేవలం ఐదు నెలలే అంటూ సెలవు రోజున ఆ జీవోకు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి ఈనెల 6న ఇచ్చిన జీఓ నెం.1243ను సవరిస్తూ శనివారం కొత్తగా జీవో నెం.1300ను విడుదల చేసింది. వాస్తవానికి శనివారం సచివాలయ సిబ్బందికి సెలవు దినం. తాజా నిర్ణయం బయటకు పొక్కకూడదనే ఉద్దేశ్యంతోనే సెలవు రోజున జీవో ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా యానిమేటర్లకు నవంబరు ఒకటి నుంచి ఏడాది పాటు నెలనెలా రూ.3 వేల చొప్పున చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజు ఈనెల 6న ఉత్తర్వులిచ్చారు. కానీ, ప్రభుత్వం తాజాగా జారీచేసిన సవరణ జీవోలో ఏడాది పాటుకు బదులు 2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో సెర్ప్‌కు కేటాయించిన నిధులు అందుబాటులో ఉన్నంత వరకే అని పేర్కొన్నారు. అంటే.. 2019 మార్చి నాటికి 2018–19 బడ్జెట్ కేటాయింపులన్నీ అయిపోతాయి. దీంతో కేవలం ఐదు నెలలపాటే రూ.3వేల చొప్పున ఆర్థిక సహాయం చేసే వీలు ఉంటుంది. అడగడుగునా మోసమే రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 27,718 మంది యానిమేటర్లు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 7.30 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాలు ఉండగా, వాటిని 27,710 గ్రామ సమైఖ్యలుగా వర్గీకరించారు. సంఘ ఆర్థిక లావాదేవీలను, ఇతర వ్యవహారాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయడం, బ్యాంకు అధికారులతో మాట్లాడి సంఘాలకు రుణాలు ఇప్పించడం వంటి కార్యకలాపాల నిర్వహణకు ప్రతి గ్రామ సమైఖ్యకు ఓ యానిమేటర్‌ను ప్రభుత్వం నియమించింది. వీరికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెలా రూ.2 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దానిని రద్దుచేశారు. గౌరవ వేతనం కొనసాగించాలంటూ 2015లో 75 రోజులపాటు యానిమేటర్లు సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. యానిమేటర్లను ఉద్యోగులుగా పరిగణించలేమని.. జీతాలు ఇచ్చేదిలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమ్మె విరమించకపోతే వేరొకరిని నియమిస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో యానిమేటర్లు విధిలేని పరిస్థితుల్లో సమ్మె విరమించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే యానిమేటర్లకు గౌరవ వేతనం చెల్లిస్తామని ఆ పార్టీ హామీ ఇవ్వడంతో చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. గౌరవ వేతనంగా కాకుండా ఏడాదిపాటు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు మాట మార్చి కేవలం ఐదు నెలల కాలానికి పరిమితమ్యేలా నిబంధనలు పెట్టి సవరణ ఉత్తర్వులిచ్చింది. -
బ్యాంకులే బాధ్యత వహించాలి
సాక్షి, హైదరాబాద్: ఏటీఎంల నిర్వహణ లోపం సేవా లోపం కిందకే వస్తుందని రాష్ట్ర వినియోగదారుల ఫోరం తేల్చి చెప్పింది. ఏటీఎంల్లో నగదు తీసుకునేటప్పుడు చోటు చేసుకునే సాంకేతిక, ఇతర పొరపాట్లకు బ్యాం కులే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు జస్టిస్ బీఎన్ రావు నల్లా, సభ్యులు పాటిల్ విఠల్ రావులతో కూడి న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా, షామీర్‌పేట్‌కు చెందిన శ్యామ్‌రావుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఖాతా ఉంది. 2011 అక్టోబర్ 31న సికింద్రాబాద్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీ ఎం నుంచి ఆయన నగదు తీసుకోవడానికి వెళ్లా డు. కార్డు పెట్టి కావాల్సిన మొత్తం ఎంటర్ చేయగా.. ఏటీఎం స్క్రీన్‌పై సదరు లావాదేవీ విఫలమైనట్లు సందేశం వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్‌డ్రా అయినట్లు మినీ స్టేట్మెంట్లో నమోదైంది. దీనిపై ఆయన బ్యాంక్ అధికారులను సంప్రదించగా.. ఖాతాలోకి నగదు వస్తుందన్నారు. నగదు రాకపోవడంతో ఆయన ఇరు బ్యాంకులకు లీగల్ నోటీసు ఇచ్చారు. బ్యాంకుల నుంచి స్పందన లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఫోరం శ్యామ్‌రావుకు ఇవ్వాల్సిన రూ.10 వేల తో పాటు పరిహారంగా రూ.3 వేలు ఇవ్వాలని, ఖర్చుల కింద మరో రూ.1,000 చెల్లించాలని ఎస్బీఐని ఆదేశించింది. దీనిపై సదరు ఎస్బీఐ బ్రాంచ్ ఫోరంలో అప్పీల్ దాఖలు చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం.. ఎస్బీఐ అప్పీల్‌ను కొట్టేసింది. ఏటీఎంల నిర్వహణ లోపాలకు బ్యాంకులే బాధ్యత వహించాలని తీర్పునిచ్చింది. -
ఇలాగే ఉంటే డిపాజిట్లు కూడా చేయరు
సాక్షి, హైదరాబాద్: ‘‘బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేవు. సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. కూలీలకు రెండు వేల రూపాయల నోట్లు ఇస్తే ఎలా పంచుకుంటారు. బ్యాంకుల తీరు ఇలాగే ఉంటే ప్రజలు ఎవరూ డిపాజిట్లు కూడా చేయరు. దీర్ఘకాలంలో అది మీకే ఇబ్బంది. ఇలాంటి వాటిని ప్రజలు భరించే పరిస్థితు ల్లో లేరు. రాష్ట్రంలో డబ్బు కొరత లేకుండా చూడండి’’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బ్యాంకు అధికారులకు సూచించారు. నగదు కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరామని చెప్పారు. బ్యాంకుల్లో ఇబ్బందుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం 18వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీ సీ) జరిగింది. ఆర్థిక మంత్రి ఈటలతో పాటు వ్యవసాయ మంత్రి పోచారం్డ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నాబార్డ్ జీఎం సత్యప్రసాద్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ మణికందన్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజల కోసం అనే ఫీలింగ్ లేదు.. ట్రాక్టర్లపై 50 శాతం సబ్సిడీ ఇచ్చిన తర్వాత కూడా డీడీ ఇవ్వడానికి డిపాజిట్ చేయించుకోవడం దారుణమని, బ్యాంకులు ప్రజల కోసం ఉన్నాయనే ఫీలింగ్ రావడం లేదని పేర్కొన్నారు. వ్యాపారం చేసే సత్తా ఉండి డబ్బులు లేనివారికి సాయం అందించాలని, లోన్ ఇచ్చి వదిలేయకుండా.. నెలనెలా పర్యవేక్షించాలని సూచించారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు బ్యాంకుల మద్దతుకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలపుతున్నామని ఈటల చెప్పారు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం వల్ల మోటార్లు కాలిపోలేదని, రైతుకి డబ్బులు ఆదా అయ్యాయని, గతంలో కరెంటు ఇవ్వకపోవడం వల్ల పరిశ్రమలు మూతపడి బ్యాంకులు నష్టపోయాయని అన్నారు. తమ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ ఇవ్వడం వల్ల పరిశ్రమలకు డబ్బులు వచ్చాయని, బ్యాంకులకు ఈఎంఐలు అందాయని, అందుకే ప్రజలకు మద్దతివ్వాలని కోరారు. ఎస్ఎల్బీసీ నిర్ణయాలు కింది స్థాయి వరకు అమలు కావాలన్నారు. ఇబ్బందులు పెట్టి శత్రువులు కావొద్దు: పోచారం రైతులకు సరిపోయేంతగా నగదు సిద్ధం చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం సూచించారు. పెట్టుబడి సాయంవిషయంలో రైతులను ఇబ్బంది పెట్టి వారికి శత్రువులు కావొద్దని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 58 లక్షల మంది రైతుల్లో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులేనని, వారికి ఎలాంటి సమస్యలూ రాకుండా, ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వ్యవసాయానికి తొలి ప్రాధాన్యత సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రాధాన్యతా రంగాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఇన్ని సమీక్షలు చేసినా పేదరికంలో ఉన్న వారికి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకడం లేదని, వారికి బ్యాంకులు విశ్వాసం కల్పించాలన్నారు. పేదలకు ప్రభుత్వం రూ.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తోందని, ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నా.. తామే ప్రజలకు డబ్బులు ఇస్తున్నామన్న ఆలోచన నుంచి బ్యాంకులు బయటికి రావాలని సూచించారు. చిన్న రుణానికి సెక్యూరిటీ పెట్టాలని బ్యాంకులు ఇబ్బంది పెట్టడం సరికాదని, పాత పద్ధతులకు స్వస్తి పలకాలని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలని తాము అడగడం లేదని, మహిళా సంఘాలకు, పేదలకు ఇవ్వమని కోరుతున్నామన్నారు. -
కుమారుడి అప్పు కింద తల్లి పింఛన్ జమ!
వెంకటాపురం (నూగూరు): కుమారుడు బ్యాం కులో తీసుకున్న అప్పు కింద తల్లి ఆసరా పింఛన్‌ను జప్తు చేశారు బ్యాంకు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంక టాపురం(నూగూరు) మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన కోగిల భూషమ్మ అనే వృద్ధురాలు ఆసరా పింఛన్ తీసుకునేందుకు గురువారం ఉదయం స్థానిక ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లింది. అయితే, అదే బ్యాంక్‌లో భూషమ్మ కుమారుడు కోగిల వెంకటేశ్వర్లు 3,900 రూపాయలు బాకీ ఉన్నాడు. ‘అతడు అప్పు తీర్చడం లేదు, నీకు వచ్చే ఆసరా పింఛన్‌ను నీ కొడుకు బాకీ కింద జమ చేసుకుంటున్నాం’ అని బ్యాంకు అధికారులు చెప్పారు. రూ.1,000 వెంక టేశ్వర్లు అకౌంట్లో జమ చేసుకుని రసీదును వృద్ధురాలు చేతిలో పెట్టారు. తన కొడుకు అప్పు ఉంటే ఆయన వద్ద కట్టించుకోకుండా తన పింఛన్ డబ్బులను బ్యాంక్ అధికారులు జమ చేసుకు న్నారని భూషమ్మ కంటతడి పెట్టింది. ఈ విషయంపై వృద్ధురాలు ఎంపీడీవో బెక్కంటి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎంపీడీవోను వివరణ కోరగా.. బ్యాంక్ అధికారులు వృద్ధురాలి ఆసరా పింఛన్ సొమ్మును కొడుకు అప్పు కింద జమ చేసుకున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. -
డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు
డిచ్పల్లి: డబ్బులు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు తిప్పించుకుంటున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక డీసీసీబీ వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చారు. అయితే ఇంటర్నెట్ పనిచేయటం లేదని సిబ్బంది బదులిచ్చారు. దీంతో, నాలుగు రోజులుగా ఇదే మాట చెబుతూ తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ రైతులంతా కలిసి రహదారిపై బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించటంతో రైతులు శాంతించారు. -
27 మంది బ్యాంకు అధికారుల సస్పెన్షన్
నోట్ల రద్దు అనంతరం పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తింపు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన అవకతవకలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 27 మంది సీనియర్ అధికారుల్ని కేంద్రం సస్పెండ్ చేసి, ఆరుగుర్ని బదిలీ చేసింది. వీరంతా పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో వీరి అక్రమాలు వెలుగు చూశారుు. బెంగళూరులో ఇద్దరు వ్యాపార వేత్తల నుంచి కొత్త నోట్ల రూపంలో గురువారం రూ. 5.7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని అక్రమాల్లో అధికారుల పాత్ర ఉందని తేలిందని, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వారు పనిచేసినట్లు గుర్తించామని ఆర్థిక శాఖ వెల్లడించింది. అక్రమాల్ని సహించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ హెచ్చరించింది. మనీల్యాండరింగ్‌కు పాల్పడుతున్న వారిని, అక్రమ సంపాదనను సక్రమంగా మార్చుకుంటోన్న నల్ల కుబేరుల్ని వదిలిపెట్టేది లేదని, సంబంధిత విభాగాలు వారి కోసం వేటాడుతున్నాయని కేంద్రం ఆర్థిక శాఖ కూడా శుక్రవారం స్పష్టం చేసింది. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు. -
బాబు వ్యాఖ్యలపై బ్యాంకర్ల మండిపాటు!
-
బాబు వ్యాఖ్యలపై బ్యాంకర్ల మండిపాటు!
విజయవాడ : సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని బ్యాంక్ అధికారులు చెప్పారు. విజయవాడలో మంగళవారం ఏబీఓసీ కృష్ణాజిల్లా శాఖాధికారులు మీడియాతో మాట్లాడుతూ...తమపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని సోమవారం సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల అసమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని బాబు అన్నారు (చదవండి : బ్యాంకర్ల వల్లే అవస్థలు) బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదికాదన్నారు. క్యాష్ కంట్రోల్ తమ చేతిలో ఉండదని ఆర్బీఐ నుంచి డబ్బును వచ్చినట్లుగా పంపిణీ చేస్తున్నామని బ్యాంక్ అధికారులు చెప్పారు. -
‘ముద్ర’ రుణాలకు హామీ అవసరం లేదు
ఎంఎస్ఎంఈడీసీఐ చైర్మన్ రామారావు గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ముద్ర’ రుణాలు పొందేందుకు ఎలాంటి హామీలు అవసరం లేదని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బి.వి.రామారావు తెలిపారు. గుంటూరులోని ఆర్అండ్బీ ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఆదివారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి హామీలు లేకుండానే రూ. 50 వేలు నుంచి రూ.10 లక్షల వరకు రుణా లు పొందవచ్చని తెలిపారు. బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వకుంటే తనకు ఫోన్ చేయాలని చెప్పారు. 9866649369, 8179422248లో ఎప్పుడు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. బ్యాంకు అధికారులకు రుణ దరఖాస్తు అందించిన వెంటనే రశీదు తీసుకోవాలని సూచించారు. -
సకాలంలో రుణాలు మంజూరు చేయండి
- కలెక్టర్ జానకి నెల్లూరు(రెవెన్యూ) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 20వ తేదీ లోపు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జానకి బ్యాంక్ అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక గోల్డన్ జూబ్లీహాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. చిన్న, మధ్య తరహ పరిశ్రమల స్థాపనకు సహకారం అందించాలన్నారు. వివిధ రంగాల్లో శిక్షణ పొందిన మహిళా పారిశ్రామికవేత్తల కు రుణాలు మంజూరు చేయాలన్నారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేసిన లబ్ధిదారుల అకౌంట్ నంబర్లు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలన్నారు. ప్రధాన మంత్రి జనధనయోజన ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభించిన లబ్ధిదారులందరికీ రూపేకార్డులు అందించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రూ.5 వేలు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి 20 లీటర్ల నీటని రూ.2కు అందించేందు కు ముందుకు వచ్చిన వారికి రూ.3.5 నుంచి రూ.5 లక్షల వరకు రుణ సదుపాయాం కల్పించాలన్నారు. రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకర్లు నియమించిన వ్యాపార ప్రతినిధులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారన్నారు. బ్యాంక్ మిత్రలను వెంకటాచలంలోని శిక్షణ కేంద్రానికి పంపించాలన్నారు. ప్రధాన మంత్రి జనధనయోజన ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభించిన లబ్ధిదారులు ఆరు నెలల పాటు లావాదేవీలు కొనసాగించి ఉండాలన్నారు. సిండికేట్ బ్యాంక్ ఆర్ఎం శ్రీకృష్ణ, ఆంధ్రాబ్యాంక్ ఆర్ఎం సురేంద్రనాథ్, డీఆర్డీఎ పీడీ చంద్రమౌళి పాల్గొన్నారు. -
అద్దాల మేడ అలంకారమేనా..?
సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ : పై ఫొటోలోని బిల్డింగ్ కరీంనగర్ నడిబొడ్డున ప్రధాన రహదారిపై నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) వాణిజ్య భవన సముదాయం. మూడంతస్థుల ఈ భవనాన్ని గత రెండేళ్లుగా ఖాళీగా ఉంచారు. ఈ భవనానికి చుట్టుపక్కల ఉన్న కార్యాలయాలు రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన ఈ భవనాన్ని కూడా అద్దెకిస్తే ప్రతినెలా కనీసం రూ.2లక్షలకుపైగా ఆదాయం వచ్చేది. గత రెండేళ్లుగా రూ.50లక్షల ఆదాయం అద్దె రూపంలో జమ అయ్యేది. కానీ కేడీసీసీబీ అధికారులకు ఈ భవనం గురించి ఏమాత్రం పట్టింపులేదు. అద్దెకు ఇవ్వాలనే ధ్యాస కానీ, సొంతంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన కానీ వీరికి లేదు. ఎందు కంటే అధికారుల సొంత ఆస్తి అయితే కదా! రైతుల సొమ్ము కాబట్టి ఏం చేసినా అడిగేవారు లేరనే ధీమాతో ఉన్నారు. కేడీసీసీ బ్యాంకుకు నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా పాత భవనం ఉంది. ప్రస్తుతం పాత భవనం లోనే బ్యాంకు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ బ్యాంకు అధికారులు రెండేళ్ల క్రితం రూ.3కోట్లకుపైగా వెచ్చించి పక్కనే ఉన్న స్థలంలో నూతన భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్థులో బ్యాంకింగ్ కార్యకలాపాలతోపాటు సమావేశాలకు, రెండు, మూడు అంతస్థులు అద్దెకు ఇవ్వాలనే ఆలోచనతో ఈ భవనాన్ని నిర్మించారు. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పీఆర్ యాక్ట్ ప్రకారం ఏ బ్యాంకు అయినా తమ సొంత ఆస్తులను అద్దెకు ఇవ్వకూడదు. సొంత అవసరాాలకే ఉపయోగించుకోవాలి. ఈ విషయం కేడీసీసీ అధికారులకూ తెలుసు. అయినప్పటికీ నగరం నడిబొడ్డున వాణిజ్య సముదాయాల ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో భవనాన్ని నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతినెలా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అని భావించారు. అనుకున్నదే తడవుగా మూడంతస్థుల భవనాన్ని అందంగా నిర్మించారు. ఒక్కో ఫ్లోర్లో మూడు వేలకుపైగా చదరపు అడుగుల చొప్పున నిర్మాణాలను పూర్తి చేశారు. అందులో మొదటి ఫ్లోర్లో సగభాగం మాత్రమే బ్యాంకు కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన సగభాగంతోపాటు పైన ఉన్న రెండంతస్థులను రెండేళ్లుగా ఖాళీగా ఉంచారు. తాము ఇచ్చే ప్రతి రూపాయిపై నిక్కచ్చిగా వడ్డీ వసూలు చేయడమే బ్యాంకుల ప్రధాన లక్ష్యమని అందరికీ తెలిసిందే. అందులోనూ రైతుల సొమ్ముతో నడిచే సహకార బ్యాంకు డబ్బును వెచ్చించే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.కోట్లు వెచ్చించి భవనాన్ని నిర్మించి అద్దెకు ఇవ్వాలనుకోవడమే అధికారుల మొదటి తప్పిదం. అయితే భవనాన్ని నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా బ్యాంకుకు ఏటా రూ.25 లక్షలకుపైగా ఆదాయాన్ని సమకూర్చాలనుకోవాలనే ఉద్దేశంతో ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించారనే అనుకుందాం. అలాంటప్పుడు రెండేళ్లుగా ఈ భవనాన్ని ఎందుకు ఖాళీగా ఉంచారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్బీఐ నుంచి ఇబ్బందులు వస్తాయని భావిస్తే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించే విధంగానైనా తీర్చిదిద్దవచ్చు. అధికారులు కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేదు. ఇప్పటికైనా వెంటనే కేడీసీసీ అధికారులు నూతన భవనాన్ని అద్దెకు ఇచ్చే అంశంపై త్వరగా నిర్ణయ తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
రుణాలు చెల్లించని రైతుల బంగారం వేలం
విజయవాడ : వ్యవసాయ రుణం కోసం రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేసేందుకు కృష్ణాజిల్లా చల్లపల్లి కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు సిద్ధమయ్యూరు. 207మంది రైతులు తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు వేలం ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు ...అధికారం చేపట్టిన తర్వాత మాత్రం రుణాల మాఫీలో నిర్లిప్తత వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో పలుచోట్ల ప్రాంతాల్లో రైతులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారులు వేలం వేస్తున్నారు. -
బంగారం వేలం ప్రకటనపై రైతుల ఆగ్రహం
వజ్రకరూరు: బంగారం తాకట్టుపెట్టి పొందిన రుణాలు రైతులు వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని లేకపోతే ఆభరణాలను వేలం వేస్తామని బ్యాంకు అధికారు లు ప్రకటించడంపై వైఎస్సార్సీపీ, బీజే పీ, మాలమహానాడు నాయకులు, రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం స్థానిక స్టేట్ బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ బంగారు వేలంపాట నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయారన్నారు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయు డు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం తో రైతులు రుణాలను చెల్లించలేదన్నా రు. రైతులకు గడువు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిబంధనలను సడలించాలన్నారు. రైతు రుణాలతోపా టు బంగారు రుణాలన్నీ మాఫీచేయాల ని డిమాండ్‌చేశారు. ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలు స్తంభించా యి. బంగారు వేలం పాటను ఆపాలని ,రైతులకు కొత్తరుణాలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ, వాతావారణ బీమాను వెం టనే విడుదల చేయాలని నినాదాలు చేశా రు. బ్యాంకు మేనేజర్ వచ్చి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. మేనేజర్ అక్కడకు చేరుకుని రైతులు, నాయకుల తో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని సూచించినట్లు ఆమె వివరించా రు. గడువు కావాలని కోరుతూ వినతిపత్రం అందచేస్తే ఉన్నతాధికారులకు పం పి తగిన నిర్ణయం తీసుకుంటామని మేునేజర్ వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బ్యాంకు వద్ద అతికించిన వేలం నోటీస్‌ను తొలగించా రు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వడ్డెరఘురాములు, మాలమహానాడు రాష్ట్ర ఉ పాధ్యక్షుడు మొలకబాల రామాంజి నేయులు, వైఎస్సార్సీపీ నాయకులు చిన్నపులికొండ, రియాజ్, బెస్త నాగరా జు, సామాజిక కార్యాకర్త రామాంజనేయులు పాల్గొన్నారు. ఐఎంఎస్ ఉపాద్యక్షుడు కిరణ్, సుధాకర్, మాలమహానాడు నాయకులు మనోహర్, నరసింహులు, రామక్రిష్ణ, దళిత నాయకులు సదా,మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామాంజనేయులు మద్దతు పలికారు. -
ఇదేమి సహకారం?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రతికూల పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోయినప్పటికీ రైతులు పంట రుణాలు సకాలంలో చెల్లించారు. ఈ ఏడాది మార్చి 31లోపు బకాయిలు కట్టేశారు. ఇలా రైతుల ముక్కుపిండి రుణాలు వసూలు చేసిన సహకార బ్యాంకు అధికారులు వారికి తిరిగి పంట రుణం మంజూరు చేయడానికి ముఖం చాటేస్తున్నారు. ఖరీఫ్ పంట కాలం దగ్గర పడుతున్నప్పటికీ పైసా కూడా అప్పు మంజూరు కావడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించక, కొత్త రుణం కూడా దొరకక రైతులు నష్టపోతున్నారు. ఇలా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలోని అనేక మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసేదేమీ లేక రైతులు సాగు అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను, ప్రైవేటు అప్పులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు అప్పులతో వడ్డీల భారం మీదపడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇలాంటి బాధి త రైతులు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఉన్నా రు. నిబంధనల ప్రకారం పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు తిరిగి రుణం మంజూరు చేయాలి. పంటలు వేసుకునే సమయంలోనే అంటే మే మాసంలోనే ఈ రుణాలు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్న బ్యాంకు అధికారులు అన్నదాతల సంక్షేమాన్ని గాలికొదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కాగజ్‌నగర్ బ్రాంచ్ పరిధిలోనే రూ.1.01 కోట్లు కాగజ్‌నగర్ డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో దహెగాం, కౌటాల, సిర్పూర్, బెజ్జూరు, కొత్తపేట సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 421 మంది రైతుల నుంచి రూ.1.01 కోట్ల పంట రుణాలు ముక్కుపిండి వసూలు చేశారు. వీరికి మే నెలలోనే పంట రుణాలు మంజూరు చేయాలి. కానీ మరో నెల రోజుల్లో ఖరీఫ్ పంటలు చేతికందే తరుణం వస్తున్నప్పటికీ పైసా రుణం ఇవ్వలేదు. మంచిర్యాల బ్రాంచ్ పరిధిలోని రైతుల వద్ద రూ.8 లక్షలు, చెన్నూరు బ్రాంచ్ పరిధిలోని రైతుల వద్ద రూ.18 లక్షలు, లక్సెట్టిపేట బ్రాంచ్ పరిధిలో మరో రూ.7 లక్షలు రైతుల వద్ద వసూలు చేశారు. కానీ వీరికి పైసా రుణం ఇచ్చిన దాఖలాల్లేవు. బెల్లంపల్లి డీసీసీబీ బ్రాంచ్ పరిధిలోని రైతులదీ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. సుమారు 325 మంది రైతుల వద్ద రూ.1.20 కోట్లు వసూలు చేశారు. వీరందరికి తిరిగి రుణం ఇవ్వాల్సి ఉండగా, కొందరికి మాత్రమే కేవలం రూ.30 లక్షల రుణం ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మంజూరు చేస్తాం.. - అనంత్‌కుమార్, డీసీసీబీ సీఈవో సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు కొందరికి తిరిగి రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. ఈ విషయంలో కొంత స్పష్టత లోపించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజుల్లోనే పంట రుణాలను మంజూరు చేస్తాం. -
అర్హులైన రైతుల జాబితా పంపించాలి
రాంనగర్ :మండలస్థాయి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ టి.చిరంజీ వులు ఆదేశించారు. గురువారం స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పంట రుణాల వివరాలను బ్యాంకు అధికారులు ఇప్పటికే అందించారన్నారు. వాటిని గ్రామం వారీగా, కుటుంబం వారీగా పరిశీలించి ప్రతి కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ అయ్యే విధంగా జాబితా రూపొందించి ప్రతి గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. అలాగే ఈ నెల 29న గ్రామ సభలు నిర్వహించి లిస్టులు ఫైనల్ చేసి పంపించాలని కలెక్టర్ సూచించారు. ఒకే రైతు రెండు, మూడు బ్యాంకుల్లో రుణం పొంది ఉన్నట్లైతే వాటిని కన్సాలిడేట్ చేసి ముందు తీసుకున్న అప్పు లేదా ఏది ఎక్కువ అప్పు ఉంటే అందులో నుంచి రూ. లక్ష వరకు మాఫీ అయ్యే విధంగా లిస్టు ఫైనల్ చేయాలన్నారు. రుణమాఫీకి అర్హులైన ఏ ఒక్క రైతు కూడా జాబితాలో మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా రుణమాఫీకి అర్హులు కాని వారి పేర్లు విధిగా తొలగించాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే డాటాను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు కోరారు. కొన్ని చోట్ల డాటాను కంప్యూటరీకరించడంలో వెనుకబడి ఉన్నందున ఆయా ప్రాంతాలలో ఆర్డీఓలు చొరవ తీసుకుని వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. డాటా ఎంట్రీల విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఎక్కడైనా హాజరుకాకపోయినట్లైతే వారిని సస్పెండ్ చేయాలని డీపీఓకు ఆయన ఆదేశించారు. మున్సిపల్ ప్రాంతాలలో కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి డాటా ఎంట్రీని వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన భూమికి వెంటనే డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయాలని తహసీల్దార్లకు కోరారు. అతేగాకుండా రేషన్‌కార్డులకు ఆధార్ సీడింగ్ కూడా ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ప్రీతిమీనా, జేడీఏ నర్సింహారావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వేలం వేస్తాం..!
జమ్మలమడుగు: ‘వ్యవసాయంతో పాటు బంగారంపై బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించవద్దు... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతోటే తొలి సంతకం రుణమాఫీపైనే పెడతారు...మొత్తం బ కాయిలన్నీ రద్దవుతాయి.. అసలుగానీ ఒక్క పైసా వడ్డీగానీ కట్టవద్దంటూ’ టీడీపీ నాయకులు ఇటీవలి ఎన్నికలలో విసృ్తత ప్రచారం చేశారు.. గోడలపై రాతలు రాశారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయకపోగా కమిటీని ఏర్పాటు చేశారు. 45రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే తాము ఇచ్చిన డబ్బులను వడ్డీతో సహా చెల్లించకుంటే మీ బంగారం మొత్తం వేలం వేస్తామంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రాయలసీమ రైతు సేవా సహకారం సంఘం అధికారులు 103మంది రైతులకు నోటీసులు పంపారు. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని అనేకసార్లు కోరినా కట్టకపోవడంతో వేలం నోటీసులు జారీ చేస్తున్నామంటూ వివరించారు. ఈనెల 11వ తేదీ లోపు డబ్బులు చెల్లించాలని లేనిపక్షంలో 21వతేదీ ఉదయం 11గంటలకు వేలం పాట వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారులిచ్చిన గడువు ముగియడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంతవరకు రుణ మాఫీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. పంటలు లేవు.. నాకున్న పది ఎకరాల పొలంలో మూడు ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మిగిలిన ఏడు ఎకరాలలో సపోట చెట్లను నాటాను. వాటికి ఏడాది వయసు కూడా రాలేదు. అంతర్పంటగా కంది వేశాను. సక్రమంగా పంటలేదు. 2012లో వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి రూ. 2లక్షలు అప్పు తెచ్చుకున్నాను. ప్రస్తుతం అసలు వడ్డీకలిసి 2లక్షల 72 వేల 990 రూపాయలు అయింది. మొత్తం కట్టాలని నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా బ్యాంకు అధికారులు వేలం వేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారు. - బోరు నారాయణరెడ్డి, రైతు,తాళ్లప్రొద్దుటూరు -
అప్పు తీర్చాలంటూ బ్యాంకు నోటీసులు
లబోదిబో మంటున్న భీమోలు రైతులు గోపాలపురం : మండలంలోని భీమోలు గ్రామంలో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలను వెంటనే చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేయవద్దని చెప్పకపోవడం దారుణమని రైతులు పేర్కొన్నారు. ఎస్బీఐ తాళ్లపూడి బ్రాంచి నుంచి భీమోలు రైతులు 2011, 2012, 2013 సంవత్సరాలలో పంట రుణాలు తీసుకున్నారు. 15 రోజలలోగా అప్పు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు మాఫీ ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు. రుణాలు మాఫీ అవుతాయని ఆశ పడ్డ రైతులకు ఈ నోటీసులు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. వెంటనే రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం చులకనవుతుంది వెంటనే రుణ మాఫీ చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వం రైతులు, ప్రజలలో చులకన అవుతుంది. వాగ్దానాల ప్రకారం వ్యవసాయ రుణాలు మాఫీచేసి సన్నచిన్నకారు రైతులను ఆదుకోవాలి. -వింటి వెంక ట్రావు, రైతు చంద్రబాబు ప్రచారంతో వడ్డీ భారం పెరిగింది బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలు తీర్చవద్దని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారంతో బకాయిలు పెరిగేలా చేసి ఇప్పుడు రైతు నడ్డివిరిచేలా వ్యవహరిస్తున్నారు. -బండారు జగన్మోహన్రావు, రైతు రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం ఆరు నెలల క్రితం అకాల వర్షాలకు పంటలు పోయినా ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. తీసుకున్న అప్పులు తీర్చాలని బ్యాంకు అదికారులు నోలీసులు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రుణమాఫీ పథకాన్ని అమలు చేయకపోతే ఆత్మహత్యలే శర ణ్యం -బండారు ప్రసాద్, రైతు -
రైతుల పేరుతో దా‘రుణం’!
రంపచోడవరం, న్యూస్‌లైన్ :అడ్డతీగల, వై.రామవరం, గంగవరం మండలాల్లో రైతు రుణాల పేరుతో దళారులు, బ్యాంకు అధికారులు రూ.కోట్లు దిగమింగినట్టు అందిన ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అడ్డతీగలలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కేంద్రంగా జరిగినట్టు చెపుతున్న ఈ అక్రమాలపై ఎన్నికలకు ముందే ఫిర్యాదులందగా ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించామని ఏఎస్పీ విజయరావు శనివారం చెప్పారు. కాగా.. అడ్డతీగల మండలం వేటమామిడికి చెందిన పల్లా కళ్యాణరావు చేసిన ఫిర్యాదు వివరాలిలా ఉన్నా యి. కళ్యాణరావు కుమారుడు రాంబాబు వికలాంగుడు. చాపరాతిపాలెం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడైన పాపారావు రుణమిప్పిస్తానని రాంబాబుతో బ్యాంక్ ఖాతా తెరిపించి, తెల్లకాగితాలపై సంతకాలు చేయించాడు. తర్వాత అడిగితే రుణం మంజూరు కాదన్నాడు. 2012లో రాంబాబు మరణించాడు. 2013 డిసెంబర్లో రూ.19,867 బకాయి చెల్లించాల్సిందిగా బ్యాంక్ నోటీసు ఇవ్వడంతో కళ్యాణరావు ఏఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కాగా.. మూడు మండలాల పరి ధిలోని రైతు రుణాల పేరుతో గత మూడేళ్లలో రూ. కోట్లు పంచుకున్నారని తెలుస్తోంది. కొందరికి త క్కువ రుణమిచ్చి.. బ్యాంకు రికార్డుల్లో ఎక్కువ ఇ చ్చినట్టు నమోదు చేయడం, కొందరికి అసలు ఇ వ్వకుండానే ఇచ్చినట్టు చూపడం, నకిలీ పట్టాదా రు పాస్ పుస్తకాలతో రుణాలు మంజూరు చే యడం వంటి అక్రమాలు జరిగినట్టు సమాచారం.