రంపచోడవరం, న్యూస్‌లైన్ :అడ్డతీగల, వై.రామవరం, గంగవరం మండలాల్లో రైతు రుణాల పేరుతో దళారులు, బ్యాంకు అధికారులు రూ.కోట్లు దిగమింగినట్టు అందిన ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అడ్డతీగలలోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు కేంద్రంగా జరిగినట్టు చెపుతున్న ఈ అక్రమాలపై ఎన్నికలకు ముందే ఫిర్యాదులందగా ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించామని ఏఎస్పీ విజయరావు శనివారం చెప్పారు. కాగా.. అడ్డతీగల మండలం వేటమామిడికి చెందిన పల్లా కళ్యాణరావు చేసిన ఫిర్యాదు వివరాలిలా ఉన్నా యి. కళ్యాణరావు కుమారుడు రాంబాబు వికలాంగుడు.
చాపరాతిపాలెం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడైన పాపారావు రుణమిప్పిస్తానని రాంబాబుతో బ్యాంక్ ఖాతా తెరిపించి, తెల్లకాగితాలపై సంతకాలు చేయించాడు. తర్వాత అడిగితే రుణం మంజూరు కాదన్నాడు. 2012లో రాంబాబు మరణించాడు. 2013 డిసెంబర్‌లో రూ.19,867 బకాయి చెల్లించాల్సిందిగా బ్యాంక్ నోటీసు ఇవ్వడంతో కళ్యాణరావు ఏఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కాగా.. మూడు మండలాల పరి ధిలోని రైతు రుణాల పేరుతో గత మూడేళ్లలో రూ. కోట్లు పంచుకున్నారని తెలుస్తోంది. కొందరికి త క్కువ రుణమిచ్చి.. బ్యాంకు రికార్డుల్లో ఎక్కువ ఇ చ్చినట్టు నమోదు చేయడం, కొందరికి అసలు ఇ వ్వకుండానే ఇచ్చినట్టు చూపడం, నకిలీ పట్టాదా రు పాస్ పుస్తకాలతో రుణాలు మంజూరు చే యడం వంటి అక్రమాలు జరిగినట్టు సమాచారం.
రైతుల పేరుతో దా‘రుణం’!
Published Sun, Jun 1 2014 12:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement