డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు
డిచ్‌పల్లి: డబ్బులు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు తిప్పించుకుంటున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక డీసీసీబీ వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చారు. అయితే ఇంటర్నెట్ పనిచేయటం లేదని సిబ్బంది బదులిచ్చారు. దీంతో, నాలుగు రోజులుగా ఇదే మాట చెబుతూ తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ రైతులంతా కలిసి రహదారిపై బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించటంతో రైతులు శాంతించారు.