- టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రంగారావు
వ్యవసాయానికి 18 గంటల కరెంటిస్తున్నాం
Published Wed, Jul 20 2016 10:07 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
కమలాపూర్ : వ్యవసాయానికి పగలు 9 గంటల కరెంటుతోపాటు రాత్రి పూట సైతం మరో 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ స్వర్గం రంగారావు తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు సంబంధించి మండలంలోని ఉప్పల్ సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ సామర్థ్యం గల అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ హామీ మేరకు ప్రతి సబ్‌స్టేషన్‌లో ఫీడర్లను రెండు గ్రూపులుగా విభజించి మొదటి గ్రూపునకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో గ్రూపునకు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు, పగటి పూట 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం విద్యుత్ కొరత లేనందున రాత్రి 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అన్ని ఫీడర్లకు కరెంట్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సబ్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. డీఈ తిరుపతి, ఏడీఈలు తిరుపతి, శ్రీనివాస్, ఏఈలు శంకరయ్య, సంపత్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ నవీన్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ సంపత్‌రావు, సర్పంచ్ దేవేందర్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంపత్, నాయకులు సంపత్‌రావు, తిరుపతి, బాబు, వార్డు సభ్యులు, విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement