Superintendent Engineer (SE)
-
పోచంపాడు వద్ద మరోసారి ఆందోళనకు దిగిన రైతులు
-
ఎస్ఈ అక్రమాస్తులు..రూ. 50 కోట్లు
♦ రెండోరోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు ♦ బ్యాంకు లాకర్లు, ఖాతాలూ తనిఖీ చేస్తామని వెల్లడి ♦ ఎస్ఈ రాఘవేంద్రరావును ఏసీబీ స్టేషన్‌కు తరలింపు లక్ష్మీపురం (గుంటూరు) : జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేవీ రాఘవేంద్రరావు అక్రమాస్తులు రూ.50 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. గుంటూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం పది ప్రదేశాల్లోని ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. గురు, శుక్రవారాల్లో గుర్తించిన ఆస్తుల మొత్తం ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ.50 కోట్లు పైనే ఉంటుందని తెలుస్తోంది. గతంలో 2009లో ఎస్ఈ రాఘవేంద్రరావు విజయవాడలో ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో కూడా ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆస్తుల వివరాలను, రికార్డులను తెలియపరచాల్సిందిగా కోరుతూ కేసు నమోదు చేశారు. గతంలో ఆ కేసును కొట్టివేశారు. తిరిగి 2015 నుంచి గుంటూరు జిల్లాలో ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్న రాఘవేంద్రరావు బినామీ కాంట్రాక్టర్లతో అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత దాడులు నిర్వహించారు. అయితే జిల్లాలో ఏసీబీ అధికారులు ఒకే అధికారిపై రెండు పర్యాయాలు దాడులు నిర్వహించడం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. శుక్రవారం నాటి సోదాల వివరాలను ఏసీబీ డీఎస్పీ దయానంద్ శాంతో వెల్లడించారు. అధికారులకు సహకరించని ఎస్ఈ ఏసీబీ దాడులు నిర్వహించినప్పటికీ ఎస్ఈ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ వారికి సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. బినామీ కాంట్రాక్టర్లు, బిల్డర్లతో పాటు రాఘవేంద్రరావు తండ్రి సుబ్బారావు పేరుతో, తమ్ముడు వరుస అయ్యే రఘు, మరికొందరు బినామీలుగా వ్యవహారం నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. గుంటూరులో ఓ కాంట్రాక్టర్ భాస్కరరావు అనే వ్యక్తికి బినామీ పేర్లతో కాంట్రాక్టులు అప్పజెప్పి సొమ్ము చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అధికారులు గుర్తించిన అక్రమ ఆస్తుల వివరాలు.. మంగళగిరిలో 968 గజాల స్థలాన్ని 2014లో రూ.28.29 లక్షలకు కొనుగోలు చేశారు. 2010లో రూ.9 లక్షలతో హోండా కారు, ఎస్ఈ కుమారుడు వంశీ కృష్ణ పేరుతో మచిలీపట్నంలో 2014లో 572.33 గజాల ప్లాట్‌ను రూ.9 లక్షలు, మంగళగిరిలో 968 గజాల ప్లాట్‌ను 2014లో రూ.26.31 లక్షలు, గుంటూరు గోరంట్లలో 2015లో 200 గజాల ప్లాట్‌ను రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. అదే విధంగా వ్యవసాయ భూములు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌లో 1.5 ఎకరాల భూమిని 2010లో రూ.1.35 లక్షలకు, తుళ్లూరు గ్రామంలో 52 సెంట్ల భూమిని 2014లో రూ.2.08 లక్షలకు, నెల్లూరు జిల్లాలో 1.95 సెంట్ల భూమిని 2013లో రూ.5.85 లక్షలకు కొనుగోలు చేశారు. ఆయన తండ్రి సుబ్బారావు పేరుతో మంగళగిరిలో 1413.16 గజాల స్థలాన్ని 2013లో రూ.42.39 లక్షలకు, గుంటూరు రూరల్ అంకిరెడ్డిపాలెంలో 338 గజాల భూమిని 2013లో రూ.5.07 లక్షలకు, మచిలీపట్నంలో 598.66 గజాల భూమిని 2014లో రూ.9.5 లక్షలకు, గుంటూరు శ్యామలానగర్‌లో 744 గజాల భూమిని 2014లో రూ.66.95 లక్షలకు ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌లో 2011లో ఒక ఎకరా భూమిని రూ.1.75 లక్షలకు, అదే ప్రాంతంలో 4.28 సెంట్ల భూమిని రూ.7.49 లక్షలకు కొనుగోలు చేశారు. శ్రీనివాస చౌదరి పేరుతో రూ.12 లక్షలతో కారు, కృష్ణాకుమార్ అనే బినామీ పేరుతో రూ.18 లక్షల విలువ చేసే కారును కొనుగోలు చేశారు. వీటితో పాటుగా రూ.30 లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ బాండ్లు, వజ్రాభరణాలు రూ.32 లక్షలు, బంగారం రూ.8 లక్షలు, వెండి 3 కేజీలు రూ.1.50 లక్షలు, నగదు రూ.5.77 లక్షలు, రూ.10 లక్షల విలువ చేసే సామగ్రి ఉన్నట్లు కేసు దర్యాప్తులో గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వివరించారు. ఎస్ఈ రాఘవేంద్రరావును శుక్రవారం అరెస్ట్ చేసి ఏసీబీ స్టేషన్‌కు తరలించారు. బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ ఖాతాలను కూడా తనిఖీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. -
సాగునీటికి కరువు లేదు
ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు గుడ్లవల్లేరు (గుడివాడ) : ఈ ఖరీఫ్‌లో సాగునీటికి కరువు లేనట్లేనని ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు అన్నారు. ఆయన పల్లెనిద్ర కోసం సోమవారం కౌతవరం ఇరిగేషన్ బంగళాకు వచ్చారు. బంటుమిల్లి కాలువ నుంచి విడుదలవుతున్న సాగునీటిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మునేరు నుంచి 8వేల క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు తెలిపారు. కట్టలేరు, వైరా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కీసరకు 11వేల క్యూసెక్కుల నీరు చేరిందని పేర్కొన్నారు. పట్టిసీమ నుంచి 7,200 క్యూసెక్కులు విడుదలైనట్లు తెలిపారు. పట్టిసీమ ద్వారా 2015 నుంచి ఇప్పటి వరకు 98 టీఎంసీల నీరు విడుదలైందని, త్వరలోనే 100 టీఎంసీలకు చేరుతుందని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ప్రకాశం బ్యారేజీ వద్ద 11.7 అడుగుల నీటి మట్టం నమోదైనట్లు వివరించారు. తమ పరిధిలోని 5.67లక్షల హెక్టార్లకు, 4.28 లక్షల్లో వరి సాగు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీలోపు వరినాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సాగునీటికి ఇబ్బందులు లేకుండా పులిచింతలలో 3.7టీఎంసీలను నిల్వ ఉంచినట్లు వివరించారు. డ్రెయినేజీ ఈఈ చంద్రశేఖర నాయుడు, ఇరిగేషన్ ఏఈ సిద్ధార్థ, లాకు సూపరింటెండెంట్ ఉదయభాస్కర్ పాల్గొన్నారు. -
63 మండలాల్లో గోదాములు
అనంతపురం సిటీ : స్పెషల్ డెవలప్‌మెంట్‌ఫండ్ (ఎస్డీఎఫ్) నిధులు రూ.16 కోట్లతో జిల్లాలోని 63 మండల కేంద్రాల్లో కొత్తగా గోదాములు నిర్మాణం చేపట్టాల్సి ఉందని పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరావు తెలిపారు. ప్రతి మండలంలోనూ గోడౌన్ నిర్మించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. వీటిని మూడు నెలల్లోపు పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. ఒక్కో గోడౌన్ నిర్మాణానికి రూ.24.60 లక్షలు ప్రభుత్వం కేటాయించిందన్నారు. -
ఛేంజ్ ఇస్తేనే మీటర్ ఎక్స్ఛేంజ్
♦ పాత విద్యుత్ మీటర్ మార్చేందుకు రూ.200 డిమాండ్ ♦ అధికారులు, ఏజెన్సీ నిర్వాహకుల చేతివాటం ♦ ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు నెల్లూరు (టౌన్): వెంకటాచలం మండలం కాకుటూరులో రాపూరు హరిబాబు నివాసం ఉంటున్నారు. ఇంటికి విద్యుత్ పాత మీటరు ఉండటంతో కొత్తగా వచ్చిన ఐఆర్డీఏ పోర్డ్ మీటరను అమర్చేందుకు ఏజెన్సీ నిర్వాహకులు గురు వారం ఇంటికి వచ్చారు. అయితే రూ. 200లు ఇస్తేనే కొత్త మీటరు బిగిస్తామని స్పష్టం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో మీటరు మార్చకుండానే అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఈ సమస్య ఒక హరిబాబుకే కాదు.. జిల్లాలోని ప్రతి విద్యుత్ వినియోగదారుడికీ ఉంది. రీడింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు విద్యుత్ శాఖ పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను బిగించాలని నిర్ణయించింది. రీడింగ్‌ను పరికరం సహాయంతో స్కానింగ్ చేయడంతో కచ్చితమైన రీడింగ్ వస్తుందని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పాత మీటర్ల స్థానంలో కొత్తగా ఐఆర్డీఏ పోర్డ్ మీటర్లును విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు జిల్లాకు పంపిణీ చేశారు. జిల్లాలోని గృహ సర్వీసులకు సంబంధించి చెడిపోయిన మీటర్లతో పాటు పని చేస్తున్న మీటర్ల స్థానంలో కొత్తగా వచ్చిన ఐఆర్డీఏ పోర్డ్ మీటర్లును మార్చే ప్రక్రియను చేపట్టారు. జిల్లాలో 9 లక్షల 60 వేలకు పైగా గృహ సర్వీసులు ఉన్నాయి. జిల్లాలో మీటర్లను మార్చే బాధ్యతను ఒక్కో డివిజన్లో ఒక్కో ఏజెన్సీకి అప్పగించారు. తొలుత ఒక మీటరు మార్పునకు రూ.20లు సంబంధిత కాంట్రాక్టర్లుకు విద్యుత్‌శాఖ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ధర సరిపోదని చెప్పడంతో మీటరు మార్పునకు రూ.70లను పెంచి ఆధర ప్రకారం చెల్లిస్తున్నారు. మార్పునకు రూ.200లు చెడిపోయినా, పాత మీటర్లు ఉన్నా వాటి స్థానంలో వినియోగదారుల నుంచి ఎలాంటి పైసా తీసుకోకుండా ఉచితంగా ఐఆర్డీఏ పోర్డ్ మీటరును మార్చాల్సి ఉంది. అయితే సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్లు మీటరు మార్పునకు వినియోగదారుడి నుంచి రూ.200లు వసూలు చేస్తుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లించే రూ.70లతో పాటు అదనంగా వినియోగదారుడు నుంచి రూ. 200లు వసూలు చేసి రెండు చేతులతో దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కమ్మక్కు మీటరు మార్పు విషయంలో కాంట్రాక్టర్లు వినియోగదారుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న నగదులో అధికారులుకు కూడా వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. ఇంటికి వచ్చి నేరుగా డబ్బులు వసూలు చేసే ధైర్యం ఉందంటే వారికి అధికారుల అండ కూడా కచ్చితంగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా మీటరు మార్పునకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుని డిమాండ్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వినియోగదారులు అడిగినంత డబ్బులు ఇచ్చి మీటరును మార్చుకుంటే డబ్బులు ఇవ్వని వినియోగదారులు మీటర్లు మాత్రం యథాతథంగానే ఉన్నా యని చెబుతున్నారు. జిల్లాలో గృహాలకు ఉన్న 9 లక్షల 60వేలు మీటర్లకు సగం మంది దగ్గర రూ. 200లు వసూలు చేసినా రూ. 8 కోట్లుకు పైగానే వసూలవుతుందని విద్యుత్‌శాఖ అధికారులే చెప్పడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో ముమ్మరంగా మీటర్లు మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మీటరు మార్పునకు డబ్బు వసూలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవా లని వినియోగదారులు కోరుతున్నారు. మీటరు మార్పునకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీటర్లను మార్చేందుకు ఆయా డివిజన్లు వారీగా కాంట్రాక్టర్లకు అప్పగించాం. మీటరు మార్చినందుకు ఒక పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు వసూలు చేస్తున్నారన్న విషయం తెలియదు. ఈ విషయంపై విచారణ జరిపి వసూలు చేస్తున్నారని తేలితే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – కళాధరరావు, ఎస్ఈ ట్రాన్స్‌కో -
ప్రభుత్వ విద్యుత్ బకాయి రూ.350 కోట్లు
- బిల్లు కట్టని వారికి నోటీసులు పంపాం - విద్యుత్‌శాఖ ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి మడకశిర : జిల్లా వ్యాప్తంగా రూ.350 కోట్ల ప్రభుత్వ విద్యుత్ బకాయిలు ఉన్నట్లు ఆశాఖ ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాలిటీలు రూ.30 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఎక్కువగా కదిరి, రాయదుర్గం, మడకశిర, ధర్మవరం మున్సిపాలిటీలు ఎక్కువ విద్యుత్ బకాయిలు పడ్డాయని తెలిపారు. అలాగే జిల్లాలోని స్థానిక సంస్థలు రూ.140 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ రూ.65 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లకు సంబంధించి రూ.25 కోట్లు వసూలు కావాల్సి ఉందని చెప్పారు. గృహ వినియోగదారుల బకాయిలు కూడా రూ.20 కోట్ల వరకు వసూలు అవ్వాల్సి ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి రూ.20 కోట్లు, సత్యసాయి తాగునీటి పథకానికి సంబంధించి రూ.55 కోట్లు, పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించి రూ.10 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ బకాయిలను చెల్లించాలని ఆయా శాఖల అధికారులకు నోటీసులు కూడా జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో హిందూపురం డీఈ శేషగిరిరావు, ఏడీఈ రవిప్రసాద్ ఉన్నారు. -
ఆదర్శప్రాయుడు
రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ సుబ్రమణ్యం ఆదాయపన్ను చెల్లింపులో అధికారులందరికీ ఆదర్శంగా నిలిచారు. 2016–17వ సంవత్సరానికి నిజాయితీగా పన్ను చెల్లించినందుకు ఆ శాఖ ఆయనను ప్రశంసిస్తూ మంగళవారం 'ప్రశంసా పత్రం' అందజేసింది. -
మూడు టీఎంసీల నీళ్లు
సత్యవేడు :తమిళనాడుకు తాగునీటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు గంగ నీటిని 3 టీఎంసీలు విడుదల చేస్తుందని ఎస్ఈ సన్యాసి నాయుడు తెలిపారు. కండలేరు నుంచి కాలువలో ప్రవహిస్తున్న గంగ నీరు మంగళవారం సాయంత్రం 6 గంటలకు సత్యవేడు సమీపంలోని ఆబాకం వద్దగల జీరో పాయింట్ చేరింది. 151.837 కిలోమీటరు వద్ద రాష్ట్ర సరిహద్దులో జీరో పాయింట్‌ను గంగనీరు దాటే సమయంలో తమిళనాడు రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి బెంజిమన్, పూందమల్లి, గుమ్మిడిపూడి, పొన్నేరి ఎమ్మెల్యేలు ఏలుమలై, విజయకుమార్, బలరామన్ గంగనీటికి పూలుచల్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బెంజిమన్ మాట్లాడుతూ గంగ కాలువ ద్వారా నీరు రెడ్‌హిల్స్ చెరువుకు పంపుతారని, అక్కడ నీటిని శుభ్రం చేసి చెన్నై పట్టణానికి పైపుల ద్వారా అందిస్తామని తెలిపారు. తమిళనాడులో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలుగుగంగ ఈఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాగునీటి కోసం తమిళనాడుకు తెలుగుగంగను సరఫరా చేస్తోందని, ప్రస్తుత ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్‌లో చెరువులకు నీటి సరఫరా లేదని చెప్పారు. నీటి కోసం నిరీక్షణ గంగ నీరు జీరో పాయింట్‌కు మంగళవారం ఉదయం పది గంటలకే చేరుతుందని అక్కడికి ఆంధ్ర, తమిళనాడు నీటి పారుదలశాఖ అధికారులు చేరుకున్నారు. కాలువలో పూడిక అధికంగా ఉండడంతో నీటి ప్రవాహం వేగం తగ్గింది. దీంతో సాయంత్రం జీరో పాయింట్‌కు చేరే వరకు అధికారులు నిరీక్షించారు. వారితోపాటు గుమ్మిడిపూడి, తిరువళ్లూరు, ఊత్తుకోటకు చెందిన ఏడీఎంకే నాయకులు వేచి ఉన్నారు. తమిళనాడు అధికారుల డీఆర్డీఏ పీడీ మహేంద్రన్, ఎస్ఈ భక్తవత్సలం, ఈఈఈ శ్రీనివాసన్, తెలుగుగంగ అధికారులు ఈఈ వెంకటరమణారెడ్డి, డీఈ సురేష్‌బాబు, ఏఈలు ప్రశాంత్, రవి, సంజయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
టీబీ డ్యాంను సందర్శించిన ఎస్ఈ
కర్నూలు సిటీ: ఎల్లెల్సీలో నీటి మట్టం తగ్గిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ యస్.చంద్రశేఖర్ రావు ..బుధవారం టీబీ డ్యాంను పరిశీలించేందుకు హోస్పెట్‌కు వెళ్లారు. డ్యాంలో నీటి నిల్వలు, ఏఏ కాలువకు ఎంత నీరు ఇస్తున్నారో, ఎక్కడెక్కడ నీటిని చౌర్యం చేస్తున్నారో తెలుసుకునేందుకే డ్యాం దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీ, కర్ణాటక ఇండెంట్‌తో కలిపి ఎల్లెల్సీకి మొత్తం 1120 క్యుసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇందులో ఏపీ వాటాగా సరిహద్దు దగ్గర 650 క్యుసెక్కుల నీరు చూపించాలి. కానీ ప్రస్తుతం 200 క్యుసెక్కుల నీరు రావడం లేదు. ఏపీలోని 135నుంచి 250 కి.మీ వరకు ఉన్న కాలువ బోర్డు పరిధిలో ఉండడం వల్లే కర్ణాటక రైతులు ఇష్టానుసారంగా నీటిని వాడుకుంటున్నారు. ఎస్ఈ పర్యటన ముందుగానే చెబితే జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో రహస్యంగా వెళ్ళినట్లు తెలిసింది. -
మా వాటా నీళ్లు మాకివ్వండి
300 క్యూసెక్కుల చొప్పున జలచౌర్యం బళ్లారి కలెక్టర్‌కు హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు ఫిర్యాదు అనంతపురం సెంట్రల్ : కర్ణాటక ప్రాంత ప్రజలు జలచౌర్యానికి పాల్పడుతుండటంతో తుంగభద్ర ఎగువకాలువ(హెచ్చెల్సీ)పై ఆధారపడిన అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు బళ్లారి జిల్లా కలెక్టర్ రాంప్రసాద్ మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన తుంగభద్ర బోర్డు ఎస్ఈ శశిభూషణ్‌రావుతో కలిసి బళ్లారిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంలోకి నీరు రాకపోవడంతో ఈ ఏడాది హెచ్చెల్సీ రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ నీటిపై ఆధారపడిన రైతులు హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ కాలువల కింద పంటలు సాగు చేశారని, కరువు జిల్లాలో తాగునీటి అవసరాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కానీ హెచ్చెల్సీకి ఈ ఏడాది కేవలం 10 టీఎంసీలు మాత్రమే కేటాయించారన్నారు. నికరంగా 32 టీఎంసీలు రావాల్సిన చోట కేవలం 10 టీఎంసీలే వస్తున్నందున జిల్లాలో నీటి అసవరాలు అధికంగా ఉన్నాయన్నారు. కొద్దిరోజుల నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీరు విడుదల చేస్తున్నారన్నారు. అనంతపురం కోటా వచ్చిన సమయంలో హెచ్చెల్సీకి 1,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని బోర్డు అధికారులు చెబుతున్నా జిల్లాకు 1,000 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. 100 కిలోమీటర్ల మేర హెచ్చెల్సీ కర్ణాటకలో ప్రవహిస్తుండటంతో కాలువ వెంబడి దాదాపు 300 క్యూసెక్కులు అక్రమంగా తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీనివల్ల అనంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి జలచౌర్యాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. హెచ్చెల్సీ కోటా మొత్తం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, అదనపు బలగాలు ఏర్పాటు చేసి నీటి పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని ఎస్ఈ తెలిపారు. -
కరకట్ట పటిష్టతపై సర్వే
పెదకళ్లేపల్లి (మోపిదేవి): కృష్ణాకరకట్ట పటిష్టతపై సర్వే చేపట్టినట్లు క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ ఎంపీ రాజు తెలిపారు. మోపిదేవి వార్పు నుంచి పెదకళ్లేపల్లి కృష్ణానది కరకట్ట బలాన్ని పరిశీలించేందుకు గురువారం ఇంజనీరింగ్ అధికారులు మండలంలో పర్యటించారు. ఎస్ఈ మాట్లాడుతూ ఇటీవల కృష్ణానదికి వదిలిన 1.60 లక్షల క్యూసెక్కుల వరదనీటిని తట్టుకునే సామర్థ్యం ఎంతవరకు కరకట్టకు ఉందనే విషయంపై సర్వేచేపట్టినట్లు తెలిపారు. గతంలో 2009లో కృష్ణానదికి అధిక మొత్తంలో వరదనీరు రావడంతో కరకట్ట తెగి గుంటూరు జిల్లాను ముంచెత్తినందున ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో 2009 నాటి వరద పునరావృత్తమైతే చేపట్టాల్సిన చర్యలతో పాటు పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వివరించారు. ఈఈ ఉమామహేశ్వరావు, ఆర్సీ ఏఈ చలపతిరావు, ఎంపీటీసీ సభ్యులు యక్కటి హనుమాన్‌ప్రసాద్ ఉన్నారు. -
సింగూర్‌కు సందర్శకులు రావొద్దు
పుల్కల్: సింగూర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చే వారు మరో మూడు రోజుల వరకు ఇటు వైపు రావొద్దని ఎస్ఐ సత్యానారాయణ సూచించారు. సదాశివపేట-సింగూర్ రోడ్డుతో పాటు అత్మకూర్- బొబ్బిలిగామ, సింగూర్-మాలపాహడ్ రహదారులు పూర్తిగా తెగిపోయి ప్రమాద కరంగా ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉందన్నారు. వర్షాలు తగ్గే వరకు ఇటు వైపు రావొద్దని కోరారు. -
శ్రీశైలం డ్యాంను సందర్శించిన ఎస్ఈ
శ్రీశైలం ప్రాజెక్టు: జలాశయంలో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో జలవనరుల శాఖ ఎస్ఈ మల్లికార్జునరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం డ్యాంను సందర్శించారు. గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తే అప్రమత్తంగా ఉండాలని ఇంజినీర్లకు సూచించారు. వస్తున్న వరదనీరు, దిగువ ప్రాంతాలకు విడుదలవుతున్న నీటి వివరాలు పక్కాగా ఉండాలని గేజింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయనతోపాటు డిప్యూటీ ఎస్ఈ బాబూరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాణిక్యాలరావు, డీఈ సేనానంద్ ఉన్నారు. -
'ఎస్ఈ ఆఫీసులలో ఎమర్జెన్సీ కాల్ సెంటర్లు'
హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కార్యాలయాల్లో ఎమర్జెన్సీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఆదేశించారు. ఒక ప్రత్యేక ఫోన్‌నంబర్ ఏర్పాటు చేసి అన్ని టీవీ ఛానళ్లు, ఇతర వార్త ప్రసార సాధనాల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి ఇరిగేషన్ శాఖ సన్నధ్దంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన వర్షాలపై సీఈ, ఎస్ఈ, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఆందోళన కల్గిస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నధ్దంగా ఉండాలన్నారు. వర్షాలతో వేలాది చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయని, ఈ దృష్ట్యా ఇంజనీరంతా క్షేత్రస్థాయికి వెళ్లి విధులు నిర్వహించాలన్నారు. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున వరద నీటిని సురక్షితంగా అతి తక్కువ నష్టంతో దిగువకు విడుదల చేయాలని కోరారు. వరద నీరు చేరుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి గ్రామ సర్పంచులు, వీఆర్వోలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చెరువు కట్టలు, కాల్వల గండ్లను, బుంగలను వెంటనే పూడ్చేందుకు ఇసుక బస్తాలను సిధ్దం చేసుకోవాలని ఆదేశించారు. అన్ని స్థాయిల్లో ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను, ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే చర్యలు తీసుకోవాలన్నారు. కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు మంత్రి పేషీకి, రెవెన్యూ అధికారులకు, ఉన్నతాధికారులకు అందించాలని సూచించారు. -
టీబీ బోర్డు సమావేశం వాయిదా
అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర బోర్డు సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నెల 14న సమావేశం నిర్వహిస్తున్నట్లు తొలుత ఉత్తర్వులు వెలువరించారు. అయితే.. హెచ్చెల్సీకి నీటి విడుదలలో అన్యాయం జరుగుతోందనే ఉద్దేశంతో తాము సమావేశానికి హాజరుకాలేమని ఎస్ఈ శేషగిరిరావు లేఖ రాశారు. దీంతో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని టీబీ బోర్డు అధికారులు తెలిపారు. -
నీళ్లెందుకు వదలరు?
కౌతవరం(గుడ్లవల్లేరు): నీళ్లెందుకు వదలడం లేదు... సీఈ ముందు ప్రజాప్రతినిధుల నిలదీత...నీళ్లెందుకు వదలడం లేదు.. కింది అధికారులపై సీఈ ఆగ్రహం.... నెపాన్ని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. కౌతవరం ఇరిగేషన్ బంగ్లాలో ఈ తమాషా చోటుచేసుకుంది. కాలువలకు ఎందుకు నీళ్లు వదలలేదని ఇరిగేషన్ ఇంజనీర్లపై సీఈ వై.సుధాకర్ మండిపడ్డారు. మూడు రోజులుగా బంటుమిల్లి కాల్వలో సాగునీరు రాకుండా నిలిపివేశారని సీఈకి పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మంగళవారం కౌతవరం ఇరిగేషన్ బంగ్లాకు వచ్చిన సీఈ ఎందుకు నీరు ఇవ్వటం లేదని స్థానిక అధికారులపై ఆగ్రహించారు. బంటుమిల్లి హెడ్ వద్ద కాల్వ గట్టు పటిష్టం చేసే పనులు చేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. దానితో ఆగ్రహించిన సీఈ వెంటనే 400 క్యూసెక్కులు వదలాలని ఆదేశించడంతో హుటావుటిన నీటి విడుదల చేశారు. నీరొచ్చినా నారు లేదని సీఈకి ఎమ్మెల్యే కాగిత చెప్పారు. బయట నుంచి ఎక్కువ ధరకు నారు కొనుగోలు చేసుకున్న తమ ప్రాంత రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారన్నారు. తీరా మూడు రోజులుగా నీరు నిలిపివేయటంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. -
గిరిజన సంక్షేమ శాఖలో రూ.139 కోట్లతో పనులు
బుట్టాయగూడెం : 2016–17 ఆర్థిక సంవత్సరానికి గిరిజిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.139 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఎస్ఈ ప్రసాద్ తెలిపారు. శనివారం మండలంలోని ఇప్పలపాడు సమీపంలో సుమారు రూ.3 కోట్లతో నిర్మిస్తున్న ఐటీఐ భవన నిర్మాణం పనులు, కామయ్యపాలెంలోని కోటి రూపాయలతో నిర్మిస్తున్న అదనపు తరగతి భవనాల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్ఈ విలేకరులతో మాట్లాడుతూ ఈ నిధులతో 13 జిల్లాల్లోని అన్ని ఐటీడీఏల్లో వసతి గృహాలు, ఇతర భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో మినీ ఆడిటోరియంను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 10 ఏకలవ్య మోడల్ స్కూల్స్ మంజూరయినట్టు చెప్పారు. ఈఈ టీవీఎస్ జోగారావు, డీఈ జి.రామ్‌గోపాల్, ఏఈ అచ్యుతం పాల్గొన్నారు. -
ధన్సింగ్తోనే మారుమూల గ్రామాలకు విద్యుత్
ఆయన సేవలు చిరస్మరణీయం ఎస్ఈ ధన్సింగ్ సంస్మరణ సభలో సీఎండీ వెంకటనారాయణ ఖమ్మం: ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో మారుమూల గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ధన్సింగ్ ఎంతో కృషి చేశాడని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ వెంకటనారాయణ అన్నారు. అందుకే ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ ఎస్ఈ ధన్సింగ్ శుక్రవారం నగరంలోని రామకృష్ణ ఫంక్షన్ హాలులో నిర్వహంచిన సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి సీఎండీ పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతటి పనినైనా పాజిటివ్ దృక్పథంతో అలోచించి పనిని పూర్తిచేయడంలో ధన్సింగ్ దిట్ట అన్నారు. ధన్సింగ్ అకాల మృతి ఆయన కుటుంబానికే కాకుండా సంస్థకు కూడా తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ బుగ్గవీటి వెంకటేశ్వరరావు, సీఈ సబర్లాల్, నగేష్, వరంగల్ కార్పొరేట్ కార్యాలయం పర్చేజింగ్ ఎస్ఈ తిరుమలరావు, తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సామ్యానాయక్, ఖమ్మం ఎస్ఈ నాగప్రసాద్, డీఈలు సురేందర్, రవి, ప్రతాపరెడ్డి, మల్లికార్జున్, నరేష్, బాబూరావు, జీహెచ్ఎంసీ డీఈ వేణుమాధవ్, ఏడీలు, ఏఈలు, యూనియన్ నాయకులు శేషగిరిరావు, సత్యనారాయణరెడ్డి, గోపాల్, ప్రసాద్‌లు ధన్‌సింగ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. -
ఎస్ఈ ఇంట్లో భారీ చోరీ
సీతమ్మధార: సీతమ్మధారలోని నార్త్ ఎక్స్‌టెన్స¯Œæలోని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. 168 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రూరల్ డెవలప్మెంట్ వాటర్ వర్క్స్ డిపార్టుమెంట్ (ఆర్డబ్ల్యూఎస్)లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రభాకర్ కుటుంబ సభ్యులతో సీతమ్మధారలోని నార్త్ ఎక్స్‌నెన్స¯Œæలో నివాసం ఉంటున్నారు. విధుల్లో భాగంగా సోమవారం రాత్రి ఎస్ఈ అరకు వెళ్లడంతో అతని భార్య ఆదిలక్ష్మి, కుమార్తె ఇంటిలో నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు కిటికీ నుంచి కర్రతో తలుపు గెడ తీసి లోపలకు ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. తెల్లవారి జామున కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి తలుపు తీసి ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించి ప్రభాకర్ భార్య ఆదిలక్ష్మి ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 168 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈస్ట్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, క్రైం ఎస్ఐ నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్కాడ్‌తో పాటు క్లూస్ టీం సీఐ రామచంద్రరావు సిబ్బందితో తనిఖీలు చేశారు. ఫోర్తుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెలుగులు
నిరంతరం అందిస్తాం – 220మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ – విద్యుత్ అంతరాయం తెలుసుకునేందుకు వైర్లెస్ సెట్ల వినియోగం – ‘సాక్షి’ ఇంటర్వ్యూలో విద్యుత్ శాఖ ఎస్ఈ కె.రాముడు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాలలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్‌శాఖ సర్వం సమాయత్తమైందని, ఇప్పటికే 52 పుష్కరఘాట్లలో విద్యుద్దీకరణ పనులను ప్రారంభించి పూర్తిచేసే దశలో ఉన్నట్లు జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.రాముడు పేర్కొన్నారు. పుష్కరఘాట్లలో విద్యుత్ సరఫరా కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆయన ‘సాక్షి’ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లో... రూ.12.73కోట్లతోఏర్పాట్లు జిల్లాలో 52పుష్కరఘాట్లలో ఏడు ఘాట్లను వీఐపీ, అత్యధిక రద్దీగల ఘాట్లుగా భావించి, అందుకనుగుణంగా విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తున్నాం. గొందిమళ్ల, సోమశిలలో విద్యుత్ సరఫరా పనులను ఇప్పటికే పూర్తిచేశాం. బీచుపల్లి, రంగాపూర్, పాతాళగంగ, సోమశిల సాధారణ ఘాట్లలో విద్యుత్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. పుష్కరాల్లో విద్యుత్ అవసరాలు తీర్చడానికి తమ శాఖ రూ.12.73కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే 208ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో బిగించాం. అత్యధిక విద్యుత్ సామర్థ్యం కలిగిన 315 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను 12చోట్ల ఏర్పాటు చేస్తున్నాం. వీటిని బీచుపల్లిలో 4, రంగాపూర్‌లో 5, గొందిమళ్లలో 3 ఇప్పటికే ఇప్పటికే బిగించాం. 24గంటల విద్యుత్ పుష్కరఘాట్లున్న గ్రామాల్లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. పుష్కరాల్లో విద్యుత్ సేవలు అందించడానికి 220మంది ఉద్యోగులను ప్రత్యేకంగా వినియోగిస్తున్నాం. చీఫ్ ఇంజనీర్స్ సైతం పుష్కరాల్లో పాల్గొని విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తారు. నిరంతరం విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఎక్కడైనా బ్రేక్‌డౌన్ కలిగిస్తే తక్షణం సమాచారం అందేలా ఉండేందుకు వైర్లెస్ సెట్లను ఉపయోగించనున్నాం. ఇందుకోసం ఉన్నతాధికారుల అనుమతి కోరాం. విద్యుత్ సరఫరా అనుకోకుండా నిలిచిపోయినా భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టాం. ఆయా ప్రాంతాల్లో 77జనరేటర్లు ఏర్పాటు చేశాం. 5లోగా పనులు పూర్తి పుష్కర యాత్రికులకు సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అయితే పార్కింగ్‌స్థలాల నిర్మాణం, నిర్ధారణ పూర్తికాని ప్రాంతాల్లోనే విద్యుత్ సౌకర్యం కొంత ఆలస్యమైంది. ఈ నెల 5వతేదీ వరకు మా శాఖాపరంగా చేయాల్సిన అన్ని పనులను పూర్తిచేసి ట్రయల్‌రన్ చేస్తాం. విద్యుత్ వెలుగులు అన్ని ఘాట్లలో పెద్ద ఎత్తున ఉండేలా శక్తివంతమైన లైట్లను వాడుతున్నాం. ప్రతి చోటా 2, 4, 6 స్తంభాల లైన్లను ఏర్పాటు చేసి, ఒక్కొ స్తంభానికి 10 నుంచి 20, 20 నుంచి 40వరకు 400 నుంచి 1000వాట్స్ సామర్థ్యం గల లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. పుష్కరాల్లో తాత్కాలికంగా వ్యాపారాలు నిర్వహించుకునే చిరు వ్యాపారులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నాం. ఇందుకోసం ప్రత్యేక టారీఫ్‌ను రూపొందించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే గొందిమళ్ల వీఐపీ ఘాట్‌లో నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం. జోగుళాంబ దేవత, తెలంగాణ తల్లి వంటి చిత్రపటాలను ఏర్పాటుచేసి ఆకర్షణీయంగా రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరిస్తాం. ‘‘ఎక్కడ విద్యుత్ అంతరాయం కలిగినా తక్షణమే తెలుసుకునేందుకు ప్రతి పుష్కరఘాట్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. పుష్కరఘాట్లున్న ప్రాంతాల్లో 24 గంటలూ విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.’’ – కె.రాముడు, విద్యుత్ ఎస్ఈ -
వ్యవసాయానికి 18 గంటల కరెంటిస్తున్నాం
టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రంగారావు కమలాపూర్ : వ్యవసాయానికి పగలు 9 గంటల కరెంటుతోపాటు రాత్రి పూట సైతం మరో 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్ఈ స్వర్గం రంగారావు తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు సంబంధించి మండలంలోని ఉప్పల్ సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ సామర్థ్యం గల అదనపు ట్రాన్స్ఫార్మర్ను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ హామీ మేరకు ప్రతి సబ్‌స్టేషన్‌లో ఫీడర్లను రెండు గ్రూపులుగా విభజించి మొదటి గ్రూపునకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో గ్రూపునకు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు, పగటి పూట 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం విద్యుత్ కొరత లేనందున రాత్రి 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అన్ని ఫీడర్లకు కరెంట్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సబ్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. డీఈ తిరుపతి, ఏడీఈలు తిరుపతి, శ్రీనివాస్, ఏఈలు శంకరయ్య, సంపత్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ నవీన్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ సంపత్‌రావు, సర్పంచ్ దేవేందర్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంపత్, నాయకులు సంపత్‌రావు, తిరుపతి, బాబు, వార్డు సభ్యులు, విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
త్వరలో రైతులకు 9 గంటల విద్యుత్
మెరుగైన విద్యుత్ సేవలే లక్ష్యంగా కృషి ఎన్పీడీసీటీఎల్ ఎస్ఈ శ్రీరాములు వికారాబాద్ రూరల్ : విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సదరన్ పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ జిల్లా సౌత్ సర్కిల్ ఎస్ఈ శ్రీ రాములు అన్నారు. వికారాబాద్ సబ్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన హరితహారంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా అందజేస్తామన్నారు. మే నెలలో వర్షాలు, గాలి వానలకు కూలిన స్తంభాల స్థానంలో ఐదు వేల స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ సరఫరాలో జరిగే సమస్యలను వినియోగదారులకు ఎక్కువ ఇబ్బందులు తలెత్తకుండా పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే సబ్స్టేషన్లలో ఆపరేటర్ల నియామకం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆపరేటర్లుగా దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ చదివి, తప్పనిసరిగా విద్యుత్ స్తంభం ఎక్కాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా సర్కిల్ పరిధిలో 10 వేల మొక్కలు నాటాలన్న లక్ష్యం నిర్ధేంచగా వికారాబాద్ డివిజన్లో ఆరు వేలు, రాజేంద్రనగర్, చంపాపేట పరిధిలో రెండేసి వేల చొప్పున మొక్కలు నాటుతున్నామన్నారు. ఇప్పటికే వికారాబాద్ డివిజన్లో ఏడు వేల మొక్కలు నాటామన్నారు. నాటిన మొక్కల్లో ఆయుర్వేదం, పువ్వులు, పండ్ల మొక్కలు అధికంగా ఉన్నాయన్నారు. విద్యుత్ పరమైన పనులు పురోగతిలో, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో వికారాబాద్ మిగితా డివిజన్ల కంటే ముందుందని అభినందించారు. కార్యక్రమంలో డీఈ దుర్గారావు, యూనియన్ నాయకుడు నీలకంఠరావు, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
దాహార్తి తీరుస్తాం
సాక్షి, మహబూబ్‌నగర్ : ఈ ఏడాది వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు పక్కాగా అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృపాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు సరిగాలేని కారణంగా భూగర్భజలాలు వేగంగా అడుగంటుతున్నందున తాగునీటి కోసం ప్రత్యేక ప్రణాళిక రచించినట్లు తెలిపారు. అందుకోసం ఇదివరకే సర్వే కూడా చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఆలోచనల మేరకు ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు తమ సిబ్బంది నిరంతరం పనిచేస్తారని, వేసవి ముగిసే వరకు సెలవులు తీసుకోకుండా ఆదివారం కూడా విధులకు హాజరవుతారని స్పష్టం చేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఆర్డబ్ల్యూఎస్ తీసుకున్న చర్యలపై ఎస్ఈ కృపాకర్‌రెడ్డి ‘సాక్షి ’కి వివరించారు. సాక్షి: వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొవడానికి ప్రణాళికలు చేశారా? కృపాకర్‌రెడ్డి: ఈసారి వేసవిలో తాగునీటికి తీవ్రఇబ్బందులు ఉంటాయనే ఆలోచనతో పక్కా ప్రణాళిక రచించాం. సాధారణంగా జిల్లాలో 604 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 476 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలాలు తీవ్రంగా అడుగంటుతున్నాయి. సాధారణంగా గతేడాది 8.75 మీటర్ల లోతులో ఉన్ననీరు ప్రస్తుతం 11.35 మీటర్ల లోతుకు పడిపోయింది. వర్షాలు సరిగా కురవకపోవడంతో నీటి ఇబ్బంది రావచ్చనే ఉద్దేశంతో చాలా అప్రమత్తతంగా ఉన్నాం. గత ఏడాది నవంబర్, డిసెంబర్లోనే మా సిబ్బంది జిల్లాలోని అన్ని గ్రామాలను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో గుర్తించాం. సాక్షి: ఏ మేరకు ఇబ్బంది ఉన్నట్లు మీ సర్వేలో తేలింది. కృపాకర్‌రెడ్డి: మేం ఊచినట్లే జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగానే ఉంది. ఇప్పటివరకు మా సిబ్బంది గుర్తించారు. జిల్లాలో మొత్తం 1313 గ్రామ పంచాయతీల పరిధిలో 3,417 ఆవాసాలున్నాయి. వీటిలో 483 ఆవాసాలకు మల్టీవిలేజ్ స్కీం ద్వారా తాగునీరందిస్తున్నాం. 2216 ఆవాసాల్లో పీడబ్ల్యూఎస్, 1250 ఎంపీడబ్ల్యూఎస్ ద్వారా తాగునీరు అందిస్తున్నాం. కానీ ఈసారి జిల్లాలో మొత్తంగా 363 గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తనున్నట్లు మా సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక సర్వేలో తేలింది. సాక్షి: వాటిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కృపాకర్‌రెడ్డి: తాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు మేం ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. చేతిపంపులు, బోరు మోటర్లను పరీక్షించిన తర్వాత సమస్యాత్మకంగా ఉన్న 363 గ్రామాలకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాం. గుర్తించిన గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయడానికి ప్రభుత్వ అనుమతి లేదు. కాబట్టి 195 గ్రామాల్లో ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, మిగతా 168 గ్రామాల్లో లీజు బోర్ల ద్వారా తాగునీరు అందించాలని నిర్ణయించాం. సాక్షి: లీజుకు తీసుకున్న బోర్లకు, ట్యాంకర్లకు డబ్బుల చెల్లింపు బాధ్యత ఎవరిది? కృపాకర్‌రెడ్డి: వీటికి నిధుల సమస్య రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఇదివరకే నివేదిక అందజేశాం. సీఆర్ఎఫ్ ఫండ్ ద్వారా రూ.5.74కోట్లు అవసరమవుతాయని అంచనాలు పంపించాం. అలాగే నాన్ సీఆర్ఎఫ్ ఫండ్ ద్వారా రూ.47.13 లక్షలు అవసరమవుతాయని తెలిపాం. సాక్షి: వీటి నిర్వాహణ బాధ్యత ఎవరిది? కృపాకర్‌రెడ్డి: తాగునీటి నిర్వాహణ బాధ్యతను కూడా పక్కాగా ఉండేట్లు చర్యలు తీసుకున్నాం. మండల స్థాయిలో ఎంపీడీఓ, తహశీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కలిసి ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉంటుందో అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ట్యాంకర్, లేదా లీజుబోరు ఏది అవసరమైతే వాటిని ఉపయోగించేలా చర్యలు తీసుకొని వారికి నిధులు అందేలా చూస్తారు. సాక్షి: నీటి ఎద్దడిని గుర్తించిన గ్రామాల్లో సరఫరాను ప్రారంభించారా? కృపాకర్‌రెడ్డి: చర్యలు ప్రారంభించాం. 363 గ్రామాలకు గాను ప్రస్తుతం 12 గ్రామాల్లో చర్యలు ప్రారంభించాం. ఐదు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, మరో ఏడు గ్రామాల్లో లీజు బోర్ల ద్వారా నీటి ఎద్దడి తీరుస్తున్నాం. సాక్షి: మీ సర్వేలో తేలని గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తితే పరిస్థితి ఏంటి? కృపాకర్‌రెడ్డి: వాటి విషయంలో కూడా ఓ కన్నేసి ఉంచాం. ముఖ్యంగా వేసవిలో తాగునీటి కారణంగా ప్రజలు ఇబ్బంది పడరాదనేదే మా ప్రధాన ఉద్దేశం. అందుకోసం మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు అన్ని గ్రామాలను పర్యవేక్షిస్తుంది. తహశీల్దార్, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ముగ్గురు కూడా నిరంతరం పర్యవేక్షించి ఇబ్బంది ఉంటే మాకు సమాచారం అందజేస్తారు. సాక్షి: నీటి ఎద్దడి పరిష్కారం కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక విభాగం ఉందా? కృపాకర్‌రెడ్డి: జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. ఫిర్యాదు స్వీకరించి ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం ప్రత్యేక మానిటరింగ్ విభాగం ఏర్పాటు చేసి, కొంతమంది సిబ్బందిని కూడా నియమించాం. అంతేకాదు ఈ విభాగం ప్రతిరోజూ అన్ని మండలాలను పర్యవేక్షిస్తుంది. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తిందని ఫోన్లో తెలిపినా వెంటనే చర్యలు తీసుకుంటాం. మానిటరింగ్ సెల్ కూడా ఇదివరకే ప్రారంభమైంది. సెలవు రోజైన ఆదివారం కూడా మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే వేసవి ముగిసేంత వరకు.. జూన్ దాకా సిబ్బంది ఏ ఒక్కరూ సెలవు తీసుకోవడానికి వీల్లేదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. -
నీటి ఎద్దడి రానివ్వం
ఏలూరు :జిల్లాలో రబీ పంటను సాగునీటి ఎద్దడి నుంచి గట్టెక్కించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఇరిగేషన్ ఏలూరు సర్కిల్ ఎస్ఈ బి.శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయమై మంగళవారం ఆయనను ప్రశ్నించగా, కార్యాచరణ ప్రణాళికను వెల్లడిం చారు. కాలువలు, డ్రెయిన్లలో అడ్డుకట్టలు వేయడంతోపాటు పెద్దఎత్తున ఆయిల్ ఇంజిన్లు వినియోగించి నీటిని ఎత్తిపోస్తామని ఆయన పేర్కొన్నారు. వంతులవారీ విధానాన్ని పర్యవేక్షించేందుకు 45 మంది రిటైర్డ్ లస్కర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో వినియోగిస్తున్నామన్నారు. డ్రెయినేజీ డివి జన్ పరిధిలోని 25 మంది రెగ్యులర్ లస్కర్ల సేవలను అవసరమైన ప్రాం తాల్లో ఉపయోగిస్తున్నామని తెలిపారు. డెల్టాలో నీటిఎద్దడి గల శివారు ఆయకట్టుకు ఎత్తిపోతల ద్వారా నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో కాలువలు, డ్రెయిన్లపై 127 చోట్ల అడ్డుకట్టలు వేసి నీటిని మళ్లించాలని నిర్ణయించామని గుర్తు చేశారు. అయితే, అంతమేరకు అవసరం లేకుండానే 30 చోట్ల అడ్డుకట్టలు వేసి 65 ఆయిల్ ఇంజిన్లు ఏర్పాట్లు చేసి శివారు ప్రాంతాలకు నీరిస్తున్నామన్నారు. కొన్నిచోట్ల తూములను ఎత్తివేసి నీటిని అనధికారికంగా మళ్లిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెట్రోలింగ్ జరిపించేందుకు నిర్ణయించామని ఎస్ఈ వివరించారు. మూడు వారాల పాటు వంతులవారీ విధానంలో నీళ్లిస్తే పంటలను రక్షించుకోవచ్చన్నారు. ఇప్పటివరకు వచ్చిన సమస్యలు పెద్దవి కానప్పటికీ, వాటిని అధిగమించి పంటలను పూర్తిస్థాయిలో రక్షించాలన్న కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సాగు చేపట్టిన 4.60 లక్షల ఎకరాల్లో 40 శాతం విస్తీర్ణంలో ముందుగానే నాట్లు పడ్డాయన్నారు. అక్కడ కోతలు పూర్తయితే శివారు ప్రాంతాలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. సీలేరు నుంచి అదనపు జలాలు గోదావరి నుంచి 3,800 క్యూసెక్కుల ప్రవాహ జలాలు, సీలేరు నుంచి 4,900 క్యూసెక్కులతో కలిపి మొత్తం 7,277 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎస్ఈ చెప్పారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీలేరు నుంచి అదనంగా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలాఖరు నాటికి కాలువలను కట్టివేస్తామని చెప్పారు. తాగునీటి అవసరాలకు మంచినీటి చెరువుల్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఎత్తిపోతలతో సాగునీరు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)కి చెందిన ఎత్తిపోతల పథకం ద్వారా యలమంచిలి మండలంలోని శివారు ఆయకట్టులో 3వేల ఎకరాలకు సాగునీటిని మళ్లించే పనులను ప్రారంభించామని ఎస్ఈ తెలిపారు. నక్కల డ్రెయిన్ వద్ద 150 హెచ్‌పీ మోటార్లతో డ్రెయిన్ నీటిని మళ్లిస్తామన్నారు. మొగల్తూరు మండలంలోని ఎత్తిపోతల పథకానికి రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి శేరేపాలెం, కొప్పర్రు ప్రాంతాలకు ఆయిల్ ఇంజిన్లు ద్వారా పంపింగ్ చేస్తామని చెప్పారు. నేడు కలెక్టర్ సమీక్ష రబీ పంటకు నీటి సరఫరా విషయమై కలెక్టర్ కె భాస్కర్ బుధవారం సమీక్షించనున్నారు. ఇందులో మండల, డివిజన్ స్థాయిలో నీటిని సరఫరాపై గస్తీ బృందాల ఏర్పాటు, ఎత్తిపోతల నుంచి నీటి మళ్లింపుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కృష్ణా నుంచి 300 క్యూసెక్కుల మళ్లింపు గోదావరి కాలువ కింద శివారు ప్రాంతాలకు తూర్పులాకుల నుంచి 300 క్యూసెక్కుల కృష్ణా నీటిని ప్రజాప్రతినిధుల చొరవతో వెనక్కి మళ్లిస్తున్నామని చెప్పారు. దెందులూరు, కొవ్వలి, పొతునూరు చానల్, భీమడోలు, పూళ్ల ప్రాంతాలకు కూడా ఈ నీటిని రెండు రోజుల్లో మళ్లించే అవకాశం ఉందన్నారు. నీటిని క్రమశిక్షణతో వాడుకోవాలి రానున్న కాలంలో పంటను కాపాడుకునేందుకు రైతులు క్రమశిక్షణ పాటించి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఎస్ఈ శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఇష్టారాజ్యంగా నీటిని వాడుకుని దుర్వినియోగం చేయకుండా, అవసరాల మేరకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. మార్చి నెలాఖరు నాటి వరకు రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయంలో అగ్నిప్రమాదం
-
చెత్త డంప్‌పై నిరసన
నెల్లూరు(సిటీ): నగరంలోని బోడిగాడతోటలో కార్పొరేషన్ శానిటరీ సిబ్బంది ఆటోలతో చెత్తను డంప్ చేసేందుకు రావడంతో స్థానికులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఈ ఇమాముద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. నగరంలోని బోడిగాడితోట అరవపాళెంలో దాదాపు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నగరంలోని చెత్తను బోడిగాడితోటలోనే డంపింగ్ చేస్తుండేవారు. మూడునెలల కిందట డంపింగ్‌యార్డ్‌లోని చెత్తకు కార్పొరేషన్ అధికారులు నిప్పంటించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కొన్ని ఇళ్లు బూడిదయ్యాయి. అప్పటి నుంచి కార్పొరేషన్ అధికారులు అక్కడ చెత్త వేయడం లేదు. నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం రాత్రికి రాత్రే బోడిగాడితోటలోని దాదాపు మూడు ఎకరాల చుట్టూ పట్టలు కప్పి అక్కడ చెత్త వేసేందుకు సిద్ధమయ్యారు. నగరంలోని అన్ని డివిజన్లలోని బుధవారం సేకరించి దానిని ఆటోల్లో శానిటరీ సిబ్బంది తీసుకొచ్చారు. స్థానికులు ఆటోలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఆటోలను అక్కడే నిలిపి వేశారు. చెత్తను డంప్ చేయడం ద్వారా రోగాలపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఎస్ఈ ఇమాముద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే స్థానికులు ససేమిరా అనడంతో వారు వెనుతిరిగారు. కమిషనర్, కలెక్టర్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఇమాముద్దీన్ తెలిపారు. చివరికి 20 ఆటోల్లోని చెత్తను అక్కడే డంప్ చేసి వెళ్లారు. నగరంలో రెండు డంపింగ్ యార్డ్లు నగరంలోని అన్ని డివిజన్లలో రోజుకు దాదాపు 20 టన్నుల చెత్తను శానిటరీ సిబ్బంది సేకరిస్తుంటారు. ఈ చెత్తను ఆటోల ద్వారా నగరం నుంచి దొంతాలి వరకు దాదాపు 25 కి.మీ వెళ్లాల్సి ఉంది. ఆ దారి గుంతలు మయం కావడంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. దీంతో నగరంలోనే రెండు మినీ చెత్త డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేయాలని నగర పాలక సంస్ధ అధికారలు భావించారు. ఈ క్రమంలో బోడిగాడితోట, చిల్డ్రన్స్‌పార్క్ సమీపంలో మినీ డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేయాలనుకున్నారు. మొదట బోడిగాడితోటలో డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేశారు. -
తిర‘కాసు’..!
సాక్షి ప్రతినిధి, కడప: ఆ ఎస్ఈ తెలంగాణ ప్రాంతానికి బదిలీ అయ్యేందుకు సిద్ధపడ్డారు.. జిల్లాలో ఉన్నంత కాలం విధులు నిర్వర్తించాం.. తుది అవకాశం సద్వినియోగం చేసుకుందామనే దిశగా పావులు చురుగ్గా కదిపారు.ముంపు బాధితుల కోటాలో అనర్హులకు అగ్రపీఠం వేశారు. ఉద్యోగాలో... మొర్రో అంటూ ఓవైపు అర్హులు వాపోతుంటే, మరోవైపు అనర్హులకు అందలమెక్కిస్తూ చేతివాటం ప్రదర్శించారు. ఇదివరకే లబ్ధిపొందిన కుటుంబాలకు చెందిన మరో ఇరువురికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలుగుగంగ ముంపు బాధితులు ఇంకా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల కాలంలో సుమారు 200 మందికి వివిధ ఉద్యోగాలు దక్కాయి. మరో ఐదువేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దళారుల చేతివాటం కారణంగా అనర్హులకు అవకాశం దక్కుతోంది. తెలుగుగంగ ఎస్ఈ కార్యాలయం ఇందుకు వేదికైంది. టెక్నికల్ అసిస్టెంట్లుగా ఆరుగురిని నియమించేందుకు ఎస్ఈ యశశ్వని జిల్లా కమిటీ ద్వారా ఇటీవల ఉత్తర్వులు సిద్ధం చేశారు. ఆ ఆరుగురిలో ముగ్గురు అనర్హులంటూ ఆధారాలతోసహా ముంపు వాసులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వారికి పోస్టింగ్ నిలిపినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా వారిలో ఇరువురికి పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రొసీడింగ్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందివచ్చిన తుది అవకాశం.... తెలుగుగంగ ఎస్ఈ యశశ్వని తెలంగాణ ప్రాంతవాసి. ఆ రాష్ట్రానికి ఇటీవల బదిలీ ఉత్తర్వులొచ్చాయి. ఆమేరకు గురువారం రిలీవ్ అయ్యారు. ఇరువురికి ఉద్యోగాలు అప్పగించేందుకు, మరో ఇరవై మందిని అర్హుల జాబితాలో చేర్చేందుకు ఆ కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. జీఓ నెంబర్ 98 ప్రకారం మునకలో అవార్డు పొందిన వారికి ఉద్యోగం కల్పించాల్సి ఉంది. అయితే ఒకే అవార్డుపైన ఇరువురికి అవకాశం కల్పిస్తున్నారు. ఇదివరకే కుటుంబంలో అవార్డు పొందిన పి.శ్రీనివాసులరెడ్డి, బి.శ్రీనివాసులరెడ్డిలకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు అన్ని రకాల లాంఛనాలు పూర్తి అయినట్లు సమాచారం. చాపాడు మండలం చీపాడులో ఒకరు, మైదుకూరు మండలం గుడ్డివీరయ్యసత్రంలో స్థిరపడిన మరొకరికి ప్రస్తుతం అవకాశం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఇది వరకే ఉద్యోగాలు దక్కాయి. అదే జరిగితే రెండ వ వ్యక్తికి ఒకే అవార్డు కింద ఉద్యోగాలు ఇవ్వరాదన్న నిబంధనలు ఉల్లంఘించినట్లే. అంతేకాకుండా మరో ఇరవై మంది అనర్హులను జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఎస్ఈ బదిలీకి రెండు రోజుల ముందు ఈ ప్రక్రియ వేగవంతం చేశారనే గుసగుసలు వినిపిస్తున్నారు. ఎస్ఈ యశశ్వని ఏమన్నారంటే.... ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. అయితే ఆ ఇరువురిపై ఫిర్యాదులందాయి. ఆమేరకు ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశాం. తదుపరి వచ్చే అధికారి ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. నేను ఎవరికీ ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వలేదు -
విద్యుత్ శాఖలో రాజకీయ అలజడి
సాక్షి, ఏలూరు : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో బదిలీల రాజకీయం తారస్థాయికి చేరుతోంది. రాజకీయ నేతలు రేపుతున్న అలజడితో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ పోస్టుపై ఉత్కంఠ వీడకపోగా, తాజాగా ఏలూరు, నిడదవోలు డీఈ పోస్టుల విషయంలోనూ రాజకీయ జోక్యం మొదలైంది. ఈ రెండు స్థానాలను దక్కించుకోవడానికి కొందరు ఉద్యోగులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. నిడదవోలు డీఈగా ప్రస్తుతం వీఎస్ మూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. రాజమండ్రి సర్కిల్ నుంచి కొన్ని నెలల క్రితమే ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పుడు అదే సర్కిల్లో డీఈ స్థాయి అధికారిజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా నిడదవోలు డీఈగా వచ్చేందుకు సిఫార్సు చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఏలూరు డీఈ బి.వేదమూర్తి స్థానానికి వచ్చేందుకు ఒక ఏడీఈ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పదోన్నతులు ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ డీఈ పోస్టు కోసం ఏడీఈ ప్రయత్నాలు చేస్తుండటం విద్యుత్ ఉద్యోగులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎస్ఈ, డీఈ పోస్టులకే కాదు ఏడీఈ పోస్టులకూ పైరవీలు జోరుగా సాగుతున్నాయి. తణుకు ఏడీఈ పోస్టుకు గట్టిపోటీ ఏర్పడింది. ఏలూరు సర్కిల్ కార్యాలయం, చింతల పూడి డివిజన్లకు చెందిన ఏడీఈలు తణుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు, రేపు జిల్లాలో సీఎండీ పర్యటన ఈ పరిస్థితుల్లో శుక్ర, శనివారాల్లో సంస్థ సీఎండీ మిరియాల వెంకట శేషగిరిబాబు జిల్లా పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం నిడదవోలు డివిజన్‌లోను, శనివారం భీమవరం డివిజన్‌లోను సీఎండీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో సమావేశం అవుతారు. పలు సెక్షన్ కార్యాలయాలను కూడా తనిఖీ చేస్తారు. ఉద్యోగుల బదిలీపై నెలకొన్న ఉత్కంఠకు సీఎండీ తెరదించుతారా, లేదా .. రాజకీయ పైరవీలపై ఆయన నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనే విషయమై విద్యుత్ శాఖ సిబ్బంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
శిక్ష పడేనా?
* ట్రాన్స్‌కో స్టోర్‌లో కాపర్,అల్యూమినియం మాయం * నేడు విచారణకు రానున్న ఎస్ఈ * గతంలోనే నలుగురు అధికారుల సస్పెన్షన్ * సిబ్బంది, అధికారులలో చర్చ నిజామాబాద్ నాగారం: ట్రాన్స్‌కో స్టోర్‌లో లక్షల రూపాయల విలువ చే సే కాపర్, అల్యూమినియం మాయమైంది. ఏడు నెల ల క్రితం ఒక ఏడీఈ, నలుగురు ఏఈలు సస్పెండ్ అ య్యారు. శుక్రవారం ఎస్ఈ విచారణకు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ కుంభకోణం ట్రాన్స్‌కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షిస్తారా.. బయట పడేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులలో వెలువడిన కాపర్, అల్యూమినియంను అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్లు స్టోర్ రూమ్‌కు అప్పజెప్పి రసీదు తీసుకోవాలి. అప్పుడే మరమ్మతులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తారు. అయితే కాంట్రాక్టర్లు కాపర్, అల్యూమినియంను స్టోర్‌రూమ్‌కు అందజేయకున్నప్పటికీ ముట్టజెప్పినట్లుగా రశీదు తీసుకున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారుల మధ్య అవగాహన ప్రకారమే ఈ తతంగం చా లా రోజులుగా కొనసాగినట్లు తెలిసింది. కాపర్‌ను బయటే అమ్ముకుని డబ్బులను పంచుకునేవారు. ఈ క్రమంలో 2011-12లో నిజామాబాద్‌లోని స్టోర్ ఏఈగా పని చేస్తున్న శ్రీహరి బదిలీపై కరీంనగర్ జిల్లాకు వెళ్లారు. జిల్లాలోని నవీ పేట మండలం ఏఈగా పని చేస్తున్న ప్రశాంత్‌రెడ్డికి స్టోర్ ఏఈగా బదీలీ చేశారు. బాధ్యతలు తీసుకునే సమయంలో రికార్టులు అన్నీ సరి చూసుకుంటుండగా కాపర్, అల్యుమిని యం స్టాక్ తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీంతో బాధ్యత లు తీసుకోవడానికి ప్రశాంత్‌రెడ్డి నిరాకరించారు. ఒప్పందం ప్రకారం విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం, కరీంనగర్ స్టోర్ ఏడీఈ ప్రకాశం, నిజామాబాద్ స్టోర్ ఏడీఈగా పనిచేస్తున్న రఘుకుమార్ రంగంలోకి దిగి, శ్రీహరి,ప్రశాంత్‌రెడ్డి మధ్య ఒప్పందం కుదిర్చారు. ఈ మేరకు శ్రీహరి రూ.10 లక్షలు ఇవ్వాలి. దీంతో పూర్తి బాధ్యత ప్రశాంత్‌రెడ్డి తీసుకుంటారు. ఒప్పందం ప్రకారం ముందుగా రూ.5 లక్షలు ప్రశాంత్ రెడ్డికి ముట్టాయి. ఇప్పటి వరకు కథ బాగానే నడిచింది. మిగతా రూ. 5 లక్షల చెల్లింపులో తీవ్ర జ్యాపం జరగడంతో ఇద్దరి మధ్య రగడ మొదలైంది. మళ్లీ కరీంనగర్ ఏడీఈ, నిజామాబాద్ స్టోర్ ఏడీఈ, ఏఈ శ్రీహరి, ఏఈ ప్రశాంత్‌రెడ్డి సమావేశ మయ్యారు. శ్రీహరి మరో రూ.2 లక్షలు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ అకౌంట్లోకి పంపించారు. ఈలోగా ఇక్కడ స్టోర్ ఏడీఈగా పని చేస్తున్న రఘుకుమార్ కామారెడ్డికి బదీలీపై వెళ్లారు. దోమకొండలో పనిచేస్తున్న ఏడీఈ వెంకటరమణ స్టోర్ ఏడీఈగా బదీలీపై వచ్చారు. దీంతో కొత్తగా వచ్చిన ఏడీఈకి సదరు కాంట్రాక్టర్ తన అకౌంట్లోకి రూ. రెండు లక్షలు ఏవిధంగా వచ్చాయో చెప్పాడు. స్టోర్ ఏడీఈ బాధ్యతలు తీసుకున్నప్పుడు అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని సంతకం పెట్టిన వెంకటరమణ, తనకు అందాల్సిన వాటా రాకపోవడంతో అప్పటి ఎస్ఈకి విషయాన్ని చేరవేశారు. అప్పటికే దీనిపై ‘సాక్షి’ లో వరుస కథనాలు రావడంతో ఎస్ఈ విషయాన్ని సీఏండీ దృషికి తీసుకెళ్లారు. వెంటనే నలుగురు ఏఈలు, ఏడీలు, అనంతరం స్టోర్ ఏఈ సస్పెండయ్యారు. విచారణను నిలిపేందుకు యత్నాలు ఇదే విషయంలో వెనువెంటనే విచారణ చేయిస్తే మరింత మంది అధికారులు, కాంట్రాక్టర్లు బయటకు వస్తారని తెలి సింది. దీంతో అక్రమాల్లో భాగస్వాములు ఉన్నవారు విచారణను నిలిపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇంత పెద్దమొత్తంలో కుంభకోణం జరగడం, ఇందులో కేవలం అధికారులను బలి చేయడం జరిగిపోయింది. కాంట్రాక్టర్లు తప్పు లు చేసినట్లు తెలిసినా అప్పటి ఎస్ఈ వారి పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టలేదు. వారిని వెనకేసుకు వచ్చారు. దీంతో సద రు కాంట్రాక్టర్లు అందుకు కానుకగా ఒక ఏసీని, ఒక టీవీ, విలువైన పర్నిచర్‌ను కార్యాలయానికి అందజేశారని సమాచారం. దీంతో పెద్దసారు సంతృప్తి చెంది వారిని ఏమీ అనలేదు. ఎస్ఈ బదీలీ అయ్యేంత వరకు అక్కడే ఉన్న టీవీ, మ రికొన్ని వస్తువులు కొత్త ఎస్ఈ వచ్చేలోగా మాయం చేశారు. నేడు విచారణలో ఏం జరుగుతుందో.. వరంగల్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి ఎస్ఈ శుక్రవారం జిల్లాకు రానున్నారు. స్టోర్ ఏడీఈగా ఉన్న వెంకటరమణ, కామారెడ్డి ఎడీఈ రఘుకుమార్, కరీంనగర్ ఏఈ శ్రీ హరి, సస్పెండ్ అయిన ఏఈ ప్రశాంత్‌రెడ్డిపై విచారిస్తారు. అసలు ఏం జరిగింది. ఎంత మొత్తంలో అక్రమాలు జరి గాయి అన్ని విషయాలు తెలియాల్సి ఉంది. విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం లేకపోలేదు. -
ఎంజీఎంలో స్పీకర్ ఆకస్మిక పర్యటన
- రోగులకు పరామర్శ - ఆస్పత్రికి ప్రత్యేక విద్యుత్ లైను ఏర్పాటుచేయాలని ఎస్ఈకి ఆదేశం - స్పీకర్ సందర్శనతో అప్రమత్తమైన అధికారులు ఎంజీఎం : ప్రమాదంలో గాయపడి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన కళావతిని శనివారం స్పీకర్ మధుసూదనాచారి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న వైద్యులను ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐసీసీయూ విభాగంలో గుండె నొప్పితో చికిత్సపొందుతున్న అదే గ్రామానికి చెందిన బోజ ఉదయమ్మను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రిలో ఆయన సుమారు 40 నిమిషాలకుపైగా ఉండగా విద్యుత్ సరఫరా లేని విషయాన్ని గమనించి అధికారులను వివరణ అడిగారు. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ సమాధానమిస్తూ ఎంజీఎం ఆస్పత్రికి ప్రత్యేకమైన విద్యుత్ లైన్ లేదని, దీంతో విద్యుత్ సరఫరా లేని సమయంలో అత్యవసర వార్డులకు జనరేటర్ ద్వారా విద్యుత్ అందిస్తామని తెలిపారు. మిగతా వార్డులకు సరఫరా చేసే జనరేటర్ లేదని పేర్కొన్నారు. దీంతో స్పందించిన స్పీకర్ నాలుగు జిల్లాల పేదప్రజలకు పెద్దాస్పత్రిగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రికి వెంటనే ప్రత్యేక విద్యుత్‌లైన్ ఏర్పాటు చేయాలని విద్యుత్‌శాఖ ఎస్ఈని ఫోన్లో ఆదేశించారు. ఎలాంటి ఆవాంతరాలు ఎదురైనా వీలైనంత త్వరగా ఆస్పత్రికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ఎస్ఈకి తెలిపారు. పరుగెత్తుకొచ్చిన ఎంజీఎం పరిపాలనాధికారులు స్పీకర్ మధుసూదనాచారి అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా ఆకస్మికంగా ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. రెండో శనివారం కావడంతో ఎంజీఎంలో పరిపాలనాధికారులు ఎవరూ అందుబాటులో లేరు. స్పీకర్ వచ్చారనే విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి పరుగులు తీశారు. స్పీకర్ వచ్చిన 20 నిమిషాలకు ఆర్ఎంఓ నాగేశ్వర్రావు చేరుకోగా.. ఆ తర్వాత సూపరింటెండెంట్ మనోహర్, ఆర్‌ఎంఓలు హేమంత్, శివకుమార్ తరలివచ్చారు. -
వంశ‘ధార’పారింది
ప్రధాన కాలువల ద్వారా సాగునీరు విడుదల హిరమండలం: వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎస్ఈ బి.రాంబాబు ముందుగా వంశధార నదికి పూజలు నిర్వహించి నీరు విడిచిపెట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినారుమడులు ఎండిపోతున్నాయన్న రైతుల కోరికతోపాటు, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు నీరు విడిచి పెట్టామన్నారు. నదిలో ఇన్‌ఫ్లో తక్కువగా వస్తున్నందు నీటిని రైతులు పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు. కుడికాలువ ద్వారా 55 కిలోమీటర్ల పరిధిలోని హిరమండలం, ఎల్.ఎన్,పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మండలాల్లోని 62,280 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 104 కిలోమీటర్ల మేర హిరమండలం, జలుమూరు. టెక్కలి, పోలాకి, సంతబొమ్మాళి, పలాస, నరసన్నపేట, మెళియాపుట్టి, సారవకోట, కోటబొమ్మాళి, నందిగాం, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నట్టు ఎస్ఈ పేర్కొన్నారు. కుడికాలువ ద్వారా 50 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు నీటిని విడిచిపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార ఈఈ లు రామచంద్రరావు, మన్మథరావు, డీఈఈ ఎస్.జగదీశ్వరరావు, ఏఈఈలు పాల్గొన్నారు. -
సాగర్ ఎడమ కాల్వ ఇక మూడు సర్కిళ్లు!
ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్ జిల్లాలోని ఆయకట్టు ప్రకారం కార్యాలయాల ఏర్పాటు డేటా నమోదు చేస్తున్న ఎన్నెస్పీ అధికారులు నీటిసంఘాల్లో పెద్ద ఎత్తున మార్పులు ఖమ్మం : ఇప్పటి వరకు ఒక రాష్ట్రం.. ఒకే కాల్వగా ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాల్వ ఇక నుంచి రెండు రాష్ట్రాలు.. మూడు ముక్కలుగా మారబోతోంది. జూన్ రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సాగర్ ఎడమకాల్వ పరిధిలోని రెండు రాష్ట్రాల ఆయకట్టును కూడా విడగొట్టారు. దీని ప్రకారం కాల్వలను, సిబ్బందిని, కార్యాలయాలను సైతం కేటాయించారు. ఆ పనులన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. ఇక ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న జిల్లాల్లో సైతం ఆయకట్టును విడగొట్టి ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్‌గా మార్చబోతున్నారు. అంటే ఖమ్మం, నల్లగొండ, కృష్ణా మూడు జిల్లాల్లో మూడు సర్కిళ్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు ఆ జిల్లాల్లో ఉన్న ఆయకట్టు ప్రకారం సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి అవసరమైన నివేదిక కోసం ఆయకట్టు వివరాలు, ప్రస్తుతం ఉన్న కార్యాలయాల డేటాను నమోదు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎన్నెస్పీ టేకులపల్లి (ఖమ్మం) ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈలు, డీఈలతో పాటు సిబ్బంది లెక్కలు తీశారు. జిల్లాలో ఒకే సర్కిల్... ఎన్నెస్పీ కెనాల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు టేకులపల్లి సర్కిల్ పేరుతో (ఖమ్మం) కార్యాలయం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని కొంత ఆయకట్టు, కృష్ణా జిల్లాలోని కొంత ఆయకట్టు.. ఇలా మూడు జిల్లాల పరిధిలోని 5 లక్షల 49 వేల 296 ఎకరాల భూమి ఈ సర్కిల్ పరిధిలో ఉండేది. ఇప్పుడు జిల్లాల వారీగా సర్కిల్ మార్పులతో ఖమ్మం పరిధిలో 2 లక్షల 51 వేల 800 ఎకరాల ఆయకట్టు మాత్రమే మిగిలి ఉంది. గతంలో నల్లగొండ జిల్లాలోని 20,681 ఎకరాలు, కృష్ణా జిల్లాలోని 2 లక్షల 70 వేల ఎకరాలు ఖమ్మం పరిధిలో ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఆయా జిల్లాల సర్కిల్ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇక గతంలో నూజివీడు డివిజన్ పరిధిలో ఉన్న జిల్లా ఆయకట్టు 13,994 ఎకరాలు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కలవనుంది. ఈ ఆయకట్టు ఖమ్మం జిల్లాకు చెందినప్పటికీ జోన్-3 పరిధిలో ఉండేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని జోన్-2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జోన్-2 పరిధిలోకి వచ్చే భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు విడుదల చేసేందుకు అధికారులు రూ.20 కోట్లకు పైగా అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్రం విడిపోకముందే ప్రభుత్వానికి అందించారు. జిల్లాలో మొత్తం ఆయకట్టును ఒకే సర్కిల్ కార్యాలయం పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. గతంలో కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలో కలిసి ఉన్న ఆయకట్టుకు సెక్షన్ కార్యాలయాలు ఉండేవి. రాష్ట్రాలు విడిపోవడంతో జిల్లా ఆయకట్టును మినహాయించి అటువైపు ఉన్న ఎనిమిదో సెక్షన్, ఒక సబ్‌డివిజన్ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. జిల్లాలో మరో మానిటరింగ్ సబ్ డివిజన్ కార్యాలయం? జిల్లాలో ఉన్న ఆయకట్టు ప్రకారం 750 నుంచి1200 ఎకరాలకు ఒక సెక్షన్, 30 వేల నుంచి 40 వేల ఎకరాలకు ఒక సబ్ డివిజన్, లక్ష నుంచి లక్షా 50 వేల ఎకరాలకు ఒక డివిజన్ కార్యాలయాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలను సైతం ఇదే తరహాలో తయారు చేయబోతున్నారు. దీంతో గతంలో ఉన్న నీటి సంఘాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు ఎడమకాల్వ మొత్తానికి మానిటరింగ్ డివిజన్ కార్యాలయం ఖమ్మంలోనే ఉంది. దాని పరిధిలోనే ఐదు సబ్ డివిజన్ కార్యాలయాలు (మిర్యాలగూడెం, హూజూర్‌నగర్, నాయకన్‌గూడెం, టేకులపల్లి, తిరువూరులలో) ఉన్నాయి. రాష్ట్రం విడిపోవడంతో తిరువూరు సబ్ డివిజన్‌ను జగ్గయ్యపేటలో విలీనం చేశారు. దాని స్థానంలో ఖమ్మం జిల్లాలో కల్లూరు సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తే నీటి పర్యవేక్షణతో పాటు పరిపాలన పరంగా వెసులుబాటు ఉంటుందని, దాని ప్రకారమే ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని అధికారులు చెబుతున్నారు. -
షిప్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకున్నారు!
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు విద్యుత్ సబ్స్టేషన్లలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేసి షిప్ట్ ఆపరేటర్ పోస్టులను ఎస్ఈ నాగశయనరావు అమ్ముకున్నారని జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి హజరత్తయ్య ఆరోపించారు. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలను ప్రశ్నించేందుకు సోమవారం నెల్లూరులోని విద్యుత్ భవన్‌కు వచ్చిన కాంట్రాక్టర్లను ఎస్ఈ లోనికి అనుమతించలేదు. దీంతో వారు కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ అంశం తమ పరిధిలోది కాదని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని కార్యాలయ పీఓ చిన్నయ్య వా రికి సర్దిచెప్పారు. హజరత్తయ్య మాట్లాడుతూ జిల్లాలో 130 షిప్ట్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయన్నారు. వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇ వ్వాల్సి ఉండగా, ఏఈలు, ఏడీఈల సహకారంతో ఎస్ఈ నాగశయనరావు అమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. మంత్రి పేరు చెప్పి భారీ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించామని, కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో చట్టా న్ని అతిక్రమించి ఎస్ఈ నియామకాలు చేపట్టారని చెప్పారు. ఈ విషయాన్ని తాము లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మానవ హక్కుల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ఆ సంఘం ప్రతి నిధులు వస్తే వారిని లోపలికి కూడా అనుమతించకపోవడం దారుణమని, ఎస్ఈ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు. కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం పబ్లిక్ అడ్వైజర్ దత్తాత్రేయ, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ప్రతినిధి చిట్టిబాబు, కాంట్రాక్ట్ అసోసియేషన్ నేతలు రమణారెడ్డి, శ్రీనివాసులు, గౌస్‌బాషా, రాఘవేంద్ర పాల్గొన్నారు. -
బిగుస్తున్న ఉచ్చు !
సాక్షి, గుంటూరు :గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఎస్ఈగా పనిచేసి సస్పెండైన రాజారావుపై నలువైపుల నుంచి ఉచ్చు బిగుస్తోంది. గుంటూరుతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణ బృందం గుర్తించింది. ఆయనతో పాటు ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులై, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకట సుబ్బారావుపైనా క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రెవెన్యూ రికవరీ యాక్టు (ఆర్ ఆర్ యాక్టు) ఉపయోగించి దుర్వినియోగం జరిగిన నిధుల్ని తిరిగి రాబట్టే ఆలోచనలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. గుంటూరులో క్వాలిటీ కంట్రోల్ సీఈ జగన్మోహన్ నేతృత్వంలో పలువురు ఎస్ఈలు గుంటూరులోనే మకాం వేసి మూడ్రోజుల పాటు విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏఈలు, డీఈలు మొత్తం 90 మందిని పిలిపించి విచారణ బృందం విచారణ చేసింది. మరోవైపు పారిశుధ్య మిషన్ సిబ్బంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. రాజారావు వద్ద నుంచి తీసుకున్న అడ్వాన్స్ తాలూకూ వివరాలు, నిల్వ సొమ్మును ఏఈలు, డీఈల వద్ద నుంచి లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. అయితే ఈ నిధుల కుంభకోణంలో నలుగురైదుగురు డీఈల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వీరు తీసుకున్న అడ్వాన్స్‌లు, అనుసరించిన రీయింబర్స్ విధానంపై లోతుల్లోకెళ్ళి విచారణ నిర్వహిస్తున్నారు. వీరు కూడా సెల్ఫ్ చెక్కులు వినియోగించారా, నిధుల ఖర్చు వివరాలపైనా ఆరా తీస్తున్నారు. వెంకట సుబ్బారావు చేతిలో రాజారావు కీలుబొమ్మగా మారారా? నిధుల ఖర్చు వ్యవహారంలో వెంకట సుబ్బారావు చేతిలో రాజారావు కీలుబొమ్మగా మారారా ..ఈ ప్రశ్నకు ఆర్‌డబ్ల్యుఎస్ సిబ్బంది నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎస్ఈగా తనకున్న విశేషాధికారాలను సుబ్బారావు కోసం వినియోగించారని తెలుస్తోంది. ఇరువురికి ఉన్న సత్సంబంధాలతోనే ఇంత పెద్ద మొత్తంలో నిధుల గోల్మాల్ జరిగింది. మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్ల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున నిధుల్ని వెంకటసుబ్బారావు సమీకరించుకున్నారు. వెంకట సుబ్బారావు అనతి కాలంలోనే స్థిరాస్తుల కొనుగోలుతో పాటు విలాసవంతమైన జీవితానికి ఆలవాటుపడ్డారు. నెల్లూరులోనూ వేళ్ళూనుకున్న రాజారావు అవినీతి రాజారావు ఎస్ఈగా గుంటూరుతో పాటు నెల్లూరు జిల్లాలోనూ ఇంచార్జిగా పనిచేశారు. ఆ సమయంలో అక్కడ నిధుల్ని దారి మళ్ళించి గుంటూరులో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో నెల్లూరు జిల్లాలోని రికార్డులను పరిశీలించి లెక్కలు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సీఈ జగన్మోహన్ నేతృత్వంలో ఎస్ఈల బృందం ఫిబ్రవరి మొదటి వారంలో అక్కడకు వెళ్ళనున్నారు. అక్కడ ఎంతమేర నిధుల దుర్వినియోగం జరిగింది? నిధుల బదలాయింపు వ్యవహారంపై సమగ్ర విచారణ చేయనున్నట్లు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సీఈ జగన్మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. రాజారావును కాపాడేందుకు ముఖ్య నేత చేసిన ప్రయత్నాలు విఫలం రాజారావును కాపాడేందుకు జిల్లాకు చెంది పొరుగు రాష్ట్రంలో ఉన్న ఓ ముఖ్య నేత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాజారావుపై గత ఏడాది నవంబరులోనే ఓ ప్రాజెక్టు డెరైక్టర్ విచారణ చేసి నివేదిక సమర్పించారు. అయితే అప్పట్లో రాజారావుపై చర్య తీసుకోకుండా కాపాడినా చివరకు సస్పెన్షన్, అవినీతి వ్యవహారాన్ని ఆపలేకపోయారు. రాజారావు అవినీతిలో ఆర్డబ్ల్యుఎస్లోని ఇరువురు ఉన్నతాధికారులకు భాగం ఉన్నట్లు సమాచారం. వారిపై లోకాయుక్తలో ఫిర్యాదులు కూడా వున్నాయి. తన పోస్టును ఖరారు చేసుకునేందుకు రాజారావు ఓ ఉన్నతాధికారికి పెద్ద మొత్తంలో ఇచ్చినట్టు సమాచారం. రాజారావు అవినీతిని రూఢీ చేస్తూ ఓ ప్రాజెక్టు డెరైక్టరు రెండు నెలల కిందట నివేదిక ఇచ్చినా అప్పట్లోనే సస్పెండ్ చేయకుండా హైదరాబాదులో సరెండర్ చేసి, కొద్ది కాలం సెలవులో వెళ్ళాలని ఇరువురు ఉన్నతాధికారులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే రాజారావుకు ఏలూరులో పోస్టింగ్ ఇవ్వాలని భావించగా, కథ అడ్డం తిరిగింది. సస్పెండైన రాజారావును తాము విచారణకు పిలవకున్నా, విచారణ జరిగే ప్రదేశానికి హాజరయ్యారని, ఆయనే వచ్చి తమకు విస్తుగొలిపే విషయాలు వెల్లడించినట్లు విచారణాధికారులు చెప్పడం పరిశీలనాంశం. అయితే రాజారావు క్రిమినల్ కేసును ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
తుంగభద్ర నదిపై ఆనకట్ట నిర్మాణానికి కదలిక
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: నగర సమీపంలో తుంగభద్ర నదిపై ఆనకట్ట, రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. డీటైల్ ప్రాజెక్టు సర్వే చేసేందుకు నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నిర్మాణంతో నదికి అవల వైపు గ్రామాల ప్రజలు గ్రామాలకు రాకపోకలు సులభం కానున్నాయి. ఈ.తాండ్రపాడు, గొందిపర్ల, దేవమడ, పూలతోట, సుందరయ్య నగర్, వసంతనగర్, దొడ్డిపాడు, మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్ద శింగవరం, అలంపూర్, చిన్న శింగవరం, భైరాపురం, కాశాపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం లాంచీలు, పుట్టిల సహాయంతో తుంగభద్ర నదిపై కర్నూలు నగరానికి చేరుకుంటున్నారు. ఆయా గ్రామాల ప్రజలు నగరానికి రోడ్డు మార్గంలో నగరానికి రావాలంటే 18 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. బస్సు చార్జీలు ఖర్చు అధికమవుతుండటంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నదిపైనే ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. 2009లో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు నదీ తీర గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించగా సానుకూలంగా స్పందించారు. ప్రజల మాటున ప్రజాప్రతినిధి కోసం: నదీ తీర ప్రాంత ప్రజల అవసరాల కోసమైతే వంతెన మాత్రమే నిర్మించాల్సి ఉంది. అయితే ఓ ప్రజాప్రతినిధి తన ఫ్యాక్టరీలకు శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కోసమే ఆనకట్ట, రోడ్డు నిర్మిస్తున్నారని ప్రతి పక్షపార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆనకట్ట నిర్మాణంపై నదీ తీర గ్రామాల ప్రజలు, ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పంతాన్ని నెగ్గించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నదిపై రూ. 64 కోట్లతో ఆనకట్ట, రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మే నెలలో కర్నూలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు సర్వే చేసేందుకు జూలైలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. దీంతో ప్రభుత్వం రూ. 30 లక్షలు మంజూరు చేసి టెండర్లు ఆహ్వానించింది. ఇటీవల హైదరాబాద్‌కి చెందిన ఐడియల్ ఏజెన్సీ రూ.27 లక్షలకే సర్వే టెండరును దక్కించుకుంది. సర్వే చేసేందుకు ప్రభుత్వం మూడు నెలలు మాత్రమే గడువు విధించినట్లు ఇరిగేషన్ ఎస్ఈ ఆర్. నాగేశ్వరరావు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా గుండ్రేవుల ప్రాజెక్టు సర్వే, సుంకేసుల జలాశయ పూర్తి స్థాయి మరమ్మతులకు నిధులు రెండులు మంజూరు చేయడం లేదు. -
అలుపెరుగని పోరు
సాక్షి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదాలు మోర్మోగుతున్నాయి. అనంతపురం నగరంలో జాక్టో ఆధ్వర్యంలో మంగళవారం రిలే దీక్షలు కొనసాగించిన ఉపాధ్యాయులు... కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించి... దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘మొద్దునిద్రలో ఉన్న మంత్రులను గునపాలతో గుచ్చి లేపుతున్నట్లు’గా ఉపాధ్యాయులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో వినూత్న ప్రదర్శన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. సాయినగర్ మల్లాలమ్మ ఆలయం వద్ద విద్యార్థులు సామూహిక ప్రార్థనలు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. నీటిపారుదల, పీఏసీఎస్, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సేతు, విన్సెంట్ డీపాల్, రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ పాఠశాలల విద్యార్థులు ఎస్కేయూ వద్దకు ర్యాలీగా వెళ్లి... అక్కడ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు. రోడ్డుపైనే ఖోఖో, వాలీబాల్, క్రికెట్, స్కిప్పింగ్ తదితర ఆటలు ఆడారు. ఎస్కేయూ విద్యార్థి, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు రోడ్లపైనే ఆటల పోటీలు నిర్వహించారు. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, గుంతకల్లులో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టికుండలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జాతీయ నాయకుల వేష ధారణలో జాతి సమైక్యతను చాటారు. వైద్య ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో సమైక్యవాదులు నిరసన తెలిపారు. కదిరిలో విద్యార్థి నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులు రోడ్లను శుభ్రపరిచి నిరసన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టారు. తలుపులలో భవన నిర్మాణ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. నల్లచెరువులో డాక్టర్లు ర్యాలీ చేశారు. కళ్యాణదుర్గంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నాయీ బ్రాహ్మణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది ర్యాలీ చేపట్టడమే కాకుండా... రోడ్డుపైనే రోగులకు చికిత్స చేశారు. జేఏసీ నాయకులు ఆటో రిక్షాలతో ర్యాలీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను మూసేయించారు. అమరాపురంలో జేఏసీ నాయకులు కేసీఆర్ మాస్కులు ధరించి ర్యాలీ చేశారు. పుట్టపర్తి, ఓడీ చెరువులలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థులు ర్యాలీ, జేఏసీ నాయకులు చెక్కభజనతో నిరసన తెలిపారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకులు శరీరానికి మట్టి పూసుకుని నిరసన తెలిపారు. పెనుకొండలో టింబర్ డిపోల అసోసియేషన్ సభ్యులు, రొద్దం, యల్లనూరులో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. సోమందేపల్లిలో వెలితడకల గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. రాయదుర్గంలో మేదర్లు రోడ్లపైనే బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. ఇదే పట్టణంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో దళితులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. రాప్తాడులో ఉపాధ్యాయులు హోమం, శింగనమలలో సమైక్యవాదులు భిక్షాటన చేశారు. గార్లదిన్నెలో ఎనుములకు కేసీఆర్ దిష్టిబొమ్మను కట్టి ర్యాలీ నిర్వహించారు. బుక్కరాయసముద్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల సిబ్బంది ఆందోళన చేపట్టారు. తాడిపత్రిలో వైద్య, ఆరోగ్య జేఏసీ, సర్‌సీవీ రామన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో కళ్లు, ముక్కు, చెవులు మూసుకుని వినూత్న నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. గుంతకల్లులో వైఎస్ఆర్సీపీ నేతల రిలే దీక్షలు కొనసాగాయి. యాడికిలో నాయీ బ్రాహ్మణులు వినూత్న నిరసన తెలిపారు. సమైక్యవాదులు రోడ్లపైనే శిరోముండనం చేయించుకున్నారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ రిలేదీక్షలు రెండో రోజూ కొనసాగాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బెళుగుప్పలో నిరసనలు హోరెత్తాయి. వజ్రకరూరులో సమైక్యవాదులు జనగర్జన నిర్వహించారు. -
పెంచుకొని.. పంచుకునేందుకే!
ఎస్సారెస్పీ కాల్వ రీమోడలింగ్‌లో గోల్మాల్ రూ.108 కోట్లకు కాంగ్రెస్-టీడీపీ నేతల టెండర్! రంగంలో కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలు పంచుకునేందుకు అంచనాల పెంపు పోటీ కాంట్రాక్టర్లకు బెదిరింపులు సాక్షి ప్రతినిధి, వరంగల్: అడ్డగోలు పనులు.. అక్రమ చెల్లింపులకు కేంద్రంగా మారిన ఎస్సారెస్పీ కాల్వలకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలసికట్టుగా టెండర్ పెట్టారు. ఓ కేంద్ర మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ముఖ్య నేతలు ఒక్కటై తమకు అనుయాయుడైన కాంట్రాక్టర్‌కు టెండర్ కట్టబెట్టి.. వచ్చిన లాభాలు పంచుకునేలా పథకం పన్నడం విస్మయపరుస్తోంది. ఎస్సారెస్పీ మొదటి దశలో భాగమైన కాకతీయ కెనాల్ పరిధిలోని డీబీఎం-48 మేజర్ కాల్వ పరిధిలోని మైనర్లు, సబ్ మైనర్ కాల్వలన్నింటికీ మరమ్మతులతో పాటు ఒక క్యూమెక్ నీటి సరఫరాకు వీలుగా సీసీ లైనింగ్‌తో రీ మోడలింగ్ చేసేం దుకు రూ.108 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ పిలిచారు. వరంగల్ జిల్లాలో సంగెం మండలం తీగరాజుపల్లి నుంచి డోర్నకల్ మండలం వెన్నారం వరకు ఉన్న డీబీఎం-48లో కిలోమీటర్ 4 నుంచి కిలోమీటరు 50 వరకు ఈ పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి రూ.107 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపిస్తే... ప్రభుత్వం రూ.108 కోట్లకు పరిపాలనా అనుమతి ఎందుకు మంజూరు చేసిందో అంతుచిక్కని తిరకాసు. నిజానికి ఈ కాల్వలకు మరమ్మతులు తప్ప రీ మోడలింగ్ అవసరమేమీ లేదు. కానీ పర్సంటేజీల దురాశతో టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే ఈ పని సృష్టించారు. ఇంజనీర్లపై ఒత్తిడి పెంచి రూ.70 కోట్ల విలువ చేసే పనులను అమాం తం రూ.108 కోట్లకు పెంచారు. దీనికి తోడు తాము సూచిం చిన కాంట్రాక్టరుకు పని దక్కేలా టెండరు నిబంధనలు మార్చాలని ఇంజనీర్లపై ఒత్తిడి పెంచారు. గతంలో ఇక్కడ పని చేసిన ఎస్ఈ అం దుకు నిరాకరించగా, ఆమెను బదిలీ చేయించి.. తమకు అనుకూలంగా ఉండే అధికారిని తెచ్చుకున్నారు. కొత్త ఎస్ఈ వచ్చీ రాగానే.. టెండర్ ఫైలు వేగంగా కదిలింది. ఆగస్టు 14న ఈపీసీ విధానంలో ఈ పనులకు టెండర్లు పిలిచారు. ఈనెల 4న టెం డర్ల దాఖలు గడువు ముగిసింది. మొత్తం 9 కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. ఐవీఆర్సీఎల్, కేఎస్ఆర్ ప్రాజెక్ట్స్, రాఘవ కన్స్ట్రక్షన్స్, ఎస్వీఈసీ కన్స్ట్రక్షన్స్, శ్రీసాయి లక్ష్మి, జీవీరెడ్డి, జీవీపీఆర్, హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. టెక్నికల్ అర్హతలకు అనుగుణంగా కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసి.. గురువారం ఫైనాన్షియల్ బిడ్ తెరవాల్సి ఉంది. అరుుతే ఇంకా పరిశీలన పూర్తి కాలేదని.. ఈనెల 18వ తేదీకి వాయిదా వేసినట్లు ఎస్ఈ తెలిపారు. నేతలు కోరిన కాంట్రాక్టర్‌కు టెండర్ కట్టబెట్టేందుకే టెక్నికల్ అర్హతలను మార్చేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఎస్సారెస్పీ పరిధిలో రూ.40 కోట్ల పనులకు సైతం జాయింట్ వెం చర్ కాంట్రాక్టుకు అనుమతించారు. కానీ, ఈ టెండర్లో నిరాకరించారు. ముందు జాగ్రత్తగా జాయింట్ వెంచర్ ఇవ్వొద్దంటూ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో సీఎంకు, ఉన్నతాధికారులకు లేఖ రాయించారు. మొత్తం రూ.108 కోట్ల పనుల్లో కేవలం రూ.2 కోట్ల అంచనా వ్యయమయ్యే షట్టర్లు బిగించే పనులున్నాయి. వీటిని సాకుగా చూపించి కాంట్రాక్టర్లకు షట్టర్ల పనులు చేసిన అనుభవం తప్పనిసరనే నిబంధనను పొందుపరిచారు. మరోవైపు ఈ పనులకు పోటీకి రావద్దంటూ స్వయానా కేంద్రమంత్రి కొందరు కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేశారు. ‘మా ఏరియాలో పనులెలా చేస్తారో చూస్తాం.. విత్ డ్రా చేసుకోండి’ అంటూ టెండర్ వేసిన కాంట్రాక్టర్లను స్వయంగా కలిసి హెచ్చరించినట్లు సమాచారం. కాగా, నిబంధనలు, అర్హతల మేరకే టెండర్ల ప్రక్రియ జరుగుతోందని ఎస్ఈ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.