టీబీ డ్యాంను సందర్శించిన ఎస్‌ఈ | se visits tb dam | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంను సందర్శించిన ఎస్‌ఈ

Published Thu, Oct 13 2016 12:53 AM | Last Updated on Sat, Sep 15 2018 8:15 PM

ఎల్లెల్సీలో నీటి మట్టం తగ్గిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ యస్‌.చంద్రశేఖర్‌ రావు ..బుధవారం టీబీ డ్యాంను పరిశీలించేందుకు హోస్పెట్‌కు వెళ్లారు.

కర్నూలు సిటీ: ఎల్లెల్సీలో నీటి మట్టం తగ్గిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ యస్‌.చంద్రశేఖర్‌ రావు ..బుధవారం టీబీ డ్యాంను పరిశీలించేందుకు హోస్పెట్‌కు వెళ్లారు. డ్యాంలో  నీటి నిల్వలు, ఏఏ కాలువకు ఎంత నీరు ఇస్తున్నారో, ఎక్కడెక్కడ నీటిని చౌర్యం చేస్తున్నారో తెలుసుకునేందుకే డ్యాం దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీ, కర్ణాటక ఇండెంట్‌తో కలిపి ఎల్లెల్సీకి మొత్తం 1120 క్యుసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇందులో ఏపీ వాటాగా సరిహద్దు దగ్గర 650 క్యుసెక్కుల నీరు చూపించాలి. కానీ ప్రస్తుతం 200 క్యుసెక్కుల నీరు రావడం లేదు. ఏపీలోని 135నుంచి 250 కి.మీ వరకు ఉన్న కాలువ బోర్డు పరిధిలో ఉండడం వల్లే కర్ణాటక రైతులు ఇష్టానుసారంగా నీటిని వాడుకుంటున్నారు. ఎస్‌ఈ పర్యటన ముందుగానే చెబితే జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో రహస్యంగా వెళ్ళినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement