శ్రీశైలం డ్యాంను సందర్శించిన ఎస్‌ఈ
శ్రీశైలం ప్రాజెక్టు: జలాశయంలో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో జలవనరుల శాఖ ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం డ్యాంను సందర్శించారు. గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తే అప్రమత్తంగా ఉండాలని ఇంజినీర్లకు సూచించారు. వస్తున్న వరదనీరు, దిగువ ప్రాంతాలకు విడుదలవుతున్న నీటి వివరాలు పక్కాగా ఉండాలని గేజింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయనతోపాటు డిప్యూటీ ఎస్‌ఈ బాబూరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాణిక్యాలరావు, డీఈ సేనానంద్ ఉన్నారు.