శ్రీశైలం డ్యాం తనిఖీ
Published Thu, Nov 3 2016 11:45 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల నీలం సంజీవరెడ్డిసాగర్ డ్యాంను నిపుణుల కమిటీ గురువారం తనిఖీ చేసింది. డ్యాం పటిష్టత, గేట్ల ఆపరేషన్, గ్యాలరీ నిర్వహణ, ప్లంజ్‌ఫుల్, స్టాఫ్‌లాక్, ఎలిమెంట్లను పరిశీలించింది. వార్షిక మరమ్మతు పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో వరదలు వచ్చినప్పటికి కూడా శ్రీశైలం డ్యాంకు ఎటువంటి ముప్పు లేదని, పటిష్టమైన కాంక్రీట్ తదితర పనులు ఇంకా చేయాల్సి ఉందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. కమిటీలో అడ్వైజర్ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ అబ్దుల్ బషీర్, రిటైర్డు ఎస్‌ఈ సత్యనారాయణ, పరిశీలనాధికారి కృష్ణారావు, ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డి, క్వాలీటీ కంట్రోల్ డీఈ శంకరరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఈలు మాణిక్యాలరావు, వరహాలరావు, డీఈఈలు గన్యానాయక్, సేనానంద్ ఉన్నారు.
Advertisement