నీళ్లెందుకు వదలరు?
నీళ్లెందుకు వదలరు?
Published Tue, Sep 6 2016 11:09 PM | Last Updated on Sat, Sep 15 2018 8:15 PM
కౌతవరం(గుడ్లవల్లేరు):
నీళ్లెందుకు వదలడం లేదు... సీఈ ముందు ప్రజాప్రతినిధుల నిలదీత...నీళ్లెందుకు వదలడం లేదు.. కింది అధికారులపై సీఈ ఆగ్రహం.... నెపాన్ని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. కౌతవరం ఇరిగేషన్ బంగ్లాలో ఈ తమాషా చోటుచేసుకుంది. కాలువలకు ఎందుకు నీళ్లు వదలలేదని ఇరిగేషన్ ఇంజనీర్లపై సీఈ వై.సుధాకర్ మండిపడ్డారు. మూడు రోజులుగా బంటుమిల్లి కాల్వలో సాగునీరు రాకుండా నిలిపివేశారని సీఈకి పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మంగళవారం కౌతవరం ఇరిగేషన్ బంగ్లాకు వచ్చిన సీఈ ఎందుకు నీరు ఇవ్వటం లేదని స్థానిక అధికారులపై ఆగ్రహించారు. బంటుమిల్లి హెడ్ వద్ద కాల్వ గట్టు పటిష్టం చేసే పనులు చేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. దానితో ఆగ్రహించిన సీఈ వెంటనే 400 క్యూసెక్కులు వదలాలని ఆదేశించడంతో హుటావుటిన నీటి విడుదల చేశారు. నీరొచ్చినా నారు లేదని సీఈకి ఎమ్మెల్యే కాగిత చెప్పారు. బయట నుంచి ఎక్కువ ధరకు నారు కొనుగోలు చేసుకున్న తమ ప్రాంత రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారన్నారు. తీరా మూడు రోజులుగా నీరు నిలిపివేయటంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
Advertisement