irrigation water
-
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్‌ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్‌కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్‌ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్‌ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్‌కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్‌ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో పీపుల్‌ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్‌లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్‌వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు
కందుకూరు/లింగసముద్రం: సాగునీటి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం ప్రాజెక్టు వద్ద బైఠాయించి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని నినదించారు. ఈ ఏడాది రాళ్లపాడు ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు కుడి కాలువ కింద ఉన్న లింగసముద్రం, కొండాపురం మండలాల రైతులు నెల రోజులుగా పెద్ద ఎత్తున నార్లు పోశారు. వారం కిందట కుడికాలువ గేటు ఊడి కింద పడిపోవడంతో నీటి విడుదల నిలిచిపోయింది. గేటుకు మరమ్మతులు చేసి పైకి లేపడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో నీరు రాక నారు ఎండిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఒక్కసారిగా రెండు మండలాల రైతులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుపై రోడ్డు మీద బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయకట్టు రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో చేపల పెంపకంపై ఉన్న శ్రద్ధ... రైతులపై లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో పది రోజుల కిందట చేప పిల్లలను వదిలారని, అవి పెరిగేందుకు నీరు అవసరం కావడంతో కావాలనే కొందరు నాయకులు నీటి విడుదల కాకుండా జాప్యం చేయిస్తున్నారని ఆరోపించారు.ధర్నా చేయడానికి వీల్లేదంటూ గొడవఈ ఏడాది ప్రాజెక్టులో చేపలు వేసిన టీడీపీ నాయకుడు మద్దెల రామారావు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదని రైతులతో వాగ్వాదానికి దిగారు. రామారావుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ప్రాజెక్టులో చేపలు వేసి గేట్లు పైకి లేవకుండా మీరే చేస్తున్నారా...’ అని మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నంఈ తరుణంలో చినపవని గ్రామానికి చెందిన తూమాటి బాలకోటయ్య అనే రైతు పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా, వెంటనే తమకు న్యాయం జరగకపోతే ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని మరోరైతు సిద్ధమయ్యారు. మిగిలిన రైతులు వారిని అడ్డుకుని సమస్య పరిష్కారం కోసం పోరాటం చేద్దామని సర్ది చెప్పారు. అదే సమయంలో అక్కడి చేరుకున్న వలేటివారిపాలెం ఎస్ఐ మదిరినాయుడు, గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావ్, ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, నీరు ఇచ్చే వరకు ధర్నాను విరమించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. చేతులెత్తేసిన నిపుణుడు బాషా ఊడిపడిపోయి కిందకు చేరిన గేటును పైకి లేపేందుకు నాలుగైదు రోజులుగా ప్రయత్నం చేస్తున్న నరసరావుపేటకు చెందిన నిపుణుడు, మెకానిక్ బాషా ఆదివారం పూర్తిగా చేతులెత్తేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉండడం వల్ల మరమ్మతులు చేయడం సాధ్యంకాని, ఇక తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటంపై రైతుల ఆగ్రహంకాలువకు నీరు రాక తాము అల్లాడుతుంటే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం నీటిని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నీరు విడుదలయ్యాయో... లేదో.. మా పొలాల వద్దకు వచ్చి చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు. 25 ఎకరాల్లో వరినారు పోశానుప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చాయని తెలియడంతో 25 ఎకరాల్లో వరి నారుమడులు పెట్టాను. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దుక్కులు కూడా దున్నాను. కుడికాలువకు నీరు విడుదల చేస్తారని 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీరు విడుదల కాకపోవడం వరినారు ఎండిపోయింది. – ఇనుకొల్లు సతీష్, ఆయకట్టు రైతు, చినపవని, లింగసముద్రం మండలం చేపల కోసమే నీరు విడుదల చేయడం లేదుకొందరు నేతలు రాళ్లపాడు ప్రాజెక్టులో చేపలు వదిలారు. చేపలకు నీరు ఉంచుకోవాలనే ఉద్దేశంతో సాగుకు సక్రమంగా నీటిని విడుదల చేయడం లేదు. ఈ ఏడాది పుష్కలంగా ప్రాజెక్టులో నీరు ఉండడంతో 10 ఎకరాల్లో వరినార్లు పోశాను. నీరు విడుదల కాకపోవడంతో నార్లు ఎండిపోతున్నాయి. – టి.కమలాకర్‌రెడ్డి, పెదపవని, లింగసముద్రం మండలం -
అడుగంటిన రిజర్వాయర్లు.. మంత్రి ఉత్తమ్‌కు హరీష్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తి గా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ‘‘గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. .. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నా. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను’’ అని లేఖలో అన్నారు. -
సాగు నీటిలో నవచరిత్ర
ర్యాడిసన్ బ్లూ రిసార్ట్స్ వేదికగా దేశంలో 57 ఏళ్ల తరువాత ప్రతిష్టాత్మక సదస్సు.. దేశ విదేశాల నుంచి నగరానికి చేరుకున్న ప్రతినిధులు 5న తాటిపూడి రిజర్వాయర్, ఆయకట్టు నీటి సరఫరా పరిశీలన నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే సదస్సు ప్రధాన అజెండా ఏటా కోటి ఎకరాలకుపైగా నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర సాగు, ఆహార భద్రతే లక్ష్యంగా అన్నదాతకు దన్నుగా అడుగులు సాక్షి, అమరావతి: సాగునీటి ఎద్దడిని అధిగమించి మానవాళికి ఆహార భద్రత చేకూర్చడమే అజెండాగా విశాఖ వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) 25వ సదస్సును జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. ఐసీఐడీ ఛైర్మన్ డాక్టర్ రగబ్ అధ్యక్షతన ఈ నెల 8వతేదీ వరకు జరిగే ఈ సదస్సులో సాగునీటి కోసం ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు, అధిక దిగుబడులను అందించే వ్యవసాయ సాంకేతిక విధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు దీనికి హాజరు కానుండగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. సాగునీటి కోసం ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగం (సముద్రపు నీటిని డీశాలినేషన్ చేయడం, మురుగు నీటిని శుద్ధి చేయడం తదితరాలు), తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు, అధిక ఉత్పాదకత విధానాలపై పరిశోధన నివేదికలను సదస్సులో సమర్పించి చర్చించనున్నారు. ఈ అంశాలపై రెండు అంతర్జాతీయ సెమినార్లు, అంతర్భాగంగా పది కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 4న అవార్డుల ప్రదానోత్సవం ప్రపంచవ్యాప్తంగా జల సంరక్షణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సంస్థలకు, ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపికైన ప్రాజెక్టులకు ఈనెల 4న అవార్డులు ప్రదానం చేయనున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గోస్తని నదిపై 1963–68 మధ్య 3.175 టీఎంసీల సామర్థంతో నిర్మించిన తాటిపూడి రిజర్వాయర్‌ను ఈనెల 5న ఐసీఐడీ ప్రతినిధుల బృందం పరిశీలించి నీటి పారుదల వ్యవస్థను అధ్యయనం చేయనుంది. సదస్సు ముగింపు సందర్భంగా ఈనెల 8న ఐఈసీ (ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ) 74వ సమావేశాన్ని నిర్వహిస్తారు. అదే రోజు ఐఈసీ ఆఫీస్ బేరర్స్ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. 9న ఐసీఐడీ ప్రతినిధులు అరకు వ్యాలీని సందర్శించడంతో సిల్వర్ జూబ్లీ (25వ వేడుక) కాంగ్రెస్ పూర్తవుతుంది. 57 ఏళ్ల తర్వాత విశాఖ వేదికగా అంతర్జాతీయంగా సుస్థిర సాగునీటి నిర్వహణ లక్ష్యంగా 1950 జూన్ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్ 1951 జనవరి 11–16 వరకు ఢిల్లీలో జరిగింది. మన దేశంలో చివరిగా ఐసీఐడీ ఆరో కాంగ్రెస్ 1966 జనవరి 4–13 వరకూ జరిగింది. సంస్థ ఆవిర్భవించిన 57 ఏళ్ల తరువాత సిల్వర్ జూబ్లీ వేడుకలు విశాఖలో జరగనుండటం గమనార్హం. ఈ ప్రతిష్టాత్మక సదస్సును కేంద్ర జలసంఘం, కేంద్ర జల్ శక్తి శాఖ, ఇన్సిడ్(ఇండియన్ నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఐసీఐడీ సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్‌కు విశాఖ అందంగా ముస్తాబైంది. సదస్సును ర్యాడిసన్ బ్లూ రిసార్ట్స్ వేదికగా నిర్వహించనున్నారు. సర్కారు చిత్తశుద్ధికి దక్కిన గౌరవం నదీ జలాలను ఒడిసి పట్టి భూగర్భ జలాలను సంరక్షిస్తూ మెరుగైన యాజమాన్య పద్ధతులలో అధిక ఆయకట్టుకు నీళ్లందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2019లో రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లందించి రికార్డు నెలకొల్పారు. అదే ఒరవడితో 2020, 2021, 2022లోనూ కోటి ఎకరాలకు నీళ్లందించి అన్నదాతలకు దన్నుగా నిలిచారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందిస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. సూక్ష్మ నీటిపారుదల (డ్రిప్, స్పింక్లర్లు) విధానాలకు పెద్దపీట వేస్తున్నారు. సాగునీటికి సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఐసీఐడీ సిల్వర్ జూబ్లీ సదస్సును ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇది సుస్థిర సాగునీటి నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆహార భద్రతకు ప్రాధాన్యం అధిక ఆయకట్టుకు సుస్థిరంగా సాగునీటిని అందించి ఆహార భద్రత చేకూర్చడమే లక్ష్యంగా సీఎం జగన్ నీటిపారుదల రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఐసీఐడీ సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్ నిర్వహణకు విశాఖను వేదికగా ఎంపిక చేసింది. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర నీటిపారుదల రంగంలో నవ చరిత్రను లిఖిస్తాం. సీఎం జగన్ నేతృత్వంలో ప్రపంచంలో అత్యత్తుమ నీటిపారుదల విధానాలను ఈ సదస్సు ద్వారా అందిపుచ్చుకుని రైతులకు బాసటగా నిలుస్తాం. – శశిభూషణ్‌కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అత్యుత్తమ నీటి విధానాలే లక్ష్యం సుస్థిర సాగునీటి నిర్వహణతో రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అందులో భాగంగానే వరద నీటిని ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే ప్రాజెక్టులు చేపట్టాం. పోలవరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మెరుగైన యాజమాన్య పద్ధతుల ద్వారా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆయకట్టుకు నీళ్లందిస్తున్నాం. ప్రపంచంలో అత్యుత్తమ నీటిపారుదల విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ నేడు విశాఖ సదస్సుకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో మొదలయ్యే 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీ (ఐసీఐడీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం ఉదయం 7.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. సదస్సుకు హాజరైన అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. -
రెండు రెట్లు కడలి పాలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తాగు, సాగునీటి కోసం వినియోగిస్తున్న నదీ జలాల కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా కడలి పాలవుతున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నదీ జలాలను మళ్లించకుంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. దేశంలో సగటు వర్షపాతం, నదుల్లో ప్రవాహం, ఉపయోగించుకోదగిన జలాలు, ప్రస్తుతం వాడుకుంటున్న నీరు, భవిష్యత్ అవసరాలపై సీడబ్ల్యూసీ సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో ప్రధానాంశాలు ఇవీ.. ► దేశంలో ఏటా సగటున 1,298.6 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. వర్షపాతం రూపంలో 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ► వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను ఉపయోగించుకుంటున్నాం. అంటే ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలుస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది. ► దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం. ► ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ► దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జలాశయాలను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ► నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చ కుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుంది. ► దేశంలో ప్రజల రోజువారీ అవసరాలు, తాగునీటి కోసం తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (వెయ్యి లీటర్లు ఒక క్యూబిక్ మీటర్‌కు సమానం) ఉంది. 2011 నాటికి 1,545 క్యూబిక్ మీటర్లకు, 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయింది. నదీ జలాలను మళ్లించకుంటే తలసరి నీటి లభ్యత 2031 నాటికి 1367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1228 క్యూబిక్ మీటర్లకు తగ్గుపోతుంది. తాగు, రోజువారీ అవసరాల కోసం నీటి కొరత తీవ్రమవుతుంది. -
నిండుకుండల్లా జలవనరులు.. రబీకి జలసిరులు
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జలసిరులు తాండవిస్తున్నాయి. గడిచిన మూడేళ్లుగా చెరువులు, ప్రాజెక్ట్‌ల్లో నీరు పుష్కలంగా ఉంది. నదులు పొంగిపొర్లుతున్నాయి. జలవనరుల్లో నీటి లభ్యతనుసరించి ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు అంచనాలకు తగినట్లుగా కేటాయించిన సాగునీటి వినియోగం తగ్గింది. జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు ఏ మాత్రం తగ్గకపోవడంతో పాటు, కార్తెలకు తగినట్లుగా వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలకు కొదవలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు కేటాయించిన నీటి వినియోగం జరగలేదు. తాజాగా రబీకి నీటి కేటాయింపులను ఆదివారం ఐఏబీ సమావేశంలో నిర్ణయించనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జిల్లాలో నీటికి కొరతే లేదు. జలాశయాలు పూర్తి సామర్థ్యానికి చేరుకుంటున్నాయి. రైతుల్లో నీటి గురించి ఏ మాత్రం చింత లేదు. సోమశిల, కండలేరు ప్రాజెక్ట్‌లతో పాటు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజీ పూర్తయిన తర్వాత జరిగే మొట్టమొదటి ఐఏబీ సమావేశం. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 66.192 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఆరంభంలోనే సోమశిల 76 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు భారీగా వరద రావడంతో అంతే సామర్థ్యంలో నీటిని పెన్నానది ద్వారా సముద్రానికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం 45,885 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. రానున్న రోజుల్లో కురిసే వర్షాలకు వచ్చే వరద నీటిని సమన్వయం చేసుకుంటూ డిసెంబర్ నెలకు 78 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డెడ్ స్టోరేజీ, తాగునీటి అవసరాలు, రాళ్లపాడు జలాశయం, నీటి ఆవిరి శాతం పోనూ మొత్తం 65.102 టీఎంసీల నీటిని రబీ సీజన్లో ఇప్పటికే స్థిరీకరించిన ఆయకట్టుతో పాటు తాజాగా స్థిరీకరించిన అదనంగా 55.1000 ఎకరాలకు నీటిని అందించనున్నారు. పది వేల ఎకరాలకు ఒక టీఎంసీ అందించే అవకాశం ఉంది. దీన్ని బట్టి సోమశిల కింద సుమారు 6.50 లక్షల ఎకరాలు సాగునీటిని అందించనున్నారు. కండలేరు కింద 3.50 లక్షల ఎకరాలు కండలేరు జలాశయంలో ప్రస్తుతం 53.852 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డిసెంబర్ నాటికి డెడ్ స్టోరేజీ నీటి ఆవిరి మినహా 60.854 టీఎంసీలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుగంగ పథకం కింద చెన్నై నగరానికి నీటి సరఫరాతో పాటు నెల్లూరు జిల్లాలో 74,436 ఎకరాలకు, తిరుపతి జిల్లాలో 1,72,423 ఎకరాల మెట్ట భూములతో పాటు చెరువుల కింద 1.08,357 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. చెన్నై తాగునీటి అవసరాలకు, రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు, స్వర్ణముఖి బ్యారేజీకి తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని కేటాయించనున్నారు. ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా పరిషత్‌లో 10 గంటలకు సాగునీటి సలహా మండలి సమావేశం కానుంది. నీరు సమృద్ధిగా ఉండడంతో ఐఏబీ సమావేశంలో నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. -
కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన మంత్రి అంబటి
సాక్షి, విజయవాడ: కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదలైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీటిని విడుదల చేశారు. ఖరీఫ్ పంట కోసం కృష్ణా డెల్టాలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకి 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకి 500 క్యూసెక్కులు సాగునీరు విడుదలైంది. కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని విడుదల చేయడం రికార్డు. నెలరోజుల ముందే సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా.. కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి. పులిచింతలలో పుష్కలంగా నీరు ఉండటంతో 35 టీఎంసీల సాగునీరు అందుబాటులోకి వచ్చింది. మరో రెండు రోజులలో ఏపీలో రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. రుతు పవనాల రాకతో సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు అంటున్నారు. ఇప్పటికే జూన్ ఒకటి నుంచి గోదావరి డెల్టా పరిధిలోనూ సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాగునీటిని ముందుగా విడుదల చేయడంతో నవంబర్‌లో ఖరీఫ్ పూర్తి కానుంది. రెండో పంటని కూడా డిసెంబర్ నెలలోనే వేసుకునే అవకాశం ఉంది. కృష్ణా డెల్టాకి 155 టీఎంసీల సాగునీరు అవసరమవుతుందని సాగునీటి అధికారులు అంచనా వేస్తున్నారు. -
AP: ముందస్తు ఏరువాక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్‌లో జలాశయాల కింద రైతులకు ముందుగానే సాగునీరు అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ సీజన్‌ను ముందుగా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు సోమశిల కింద ఉన్న ప్రాజెక్టులు, రాయలసీమ ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్‌కు ముందస్తుగా నీటిని విడుదల చేయాలని గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. తుపానుల బారిన పడి రైతులు పంటలు నష్టపోకుండా ఉండేలా ఖరీఫ్‌కు ముందస్తు నీటి విడుదల ప్రణాళికకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో హెల్త్ హబ్‌లకు భూములను కేటాయించడంతో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. 2022–27 ఏపీ ఎగుమతుల ప్రోత్సాహక విధానానికి, 2022–27 ఏపీ లాజిస్టిక్ విధానానికి పచ్చ జెండా ఊపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో వివరించారు. వరుసగా వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు నీటితో మూడో పంటకు అవకాశం ► వైఎస్సార్ హాయాంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం జగన్ హయాంలోనూ పుష్కలంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు బాగున్నాయి. దీంతో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్‌కు ముందస్తుగా నీటి విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని రైతులకు ముందుగా తెలిజేయడం ద్వారా ముందస్తు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఏర్పాట్లును చేసుకుని సమాయత్తం అవుతారు. ► గతంలో ఆగస్టులో నీటిని విడుదల చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఖరీఫ్‌కు వివిధ ప్రాజెక్టుల నుంచి ముందుగానే నీటిని విడుదల చేస్తున్నాం. దీనివల్ల నవంబర్, డిసెంబర్లలో వచ్చే తుపానుల బారిన పడకుండా రైతులు పండించిన పంట చేతికి వస్తుంది. అలాగే రబీకి కూడా ముందస్తుగా నీటిని విడుదల చేయడం వల్ల మూడో పంట కింద అపరాలు, ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ► గోదావరి డెల్టాకు జూన్ 1వ తేదీన నీటి విడుదల చేయనున్నాం. పోలవరం రివర్ స్లూయిస్ డెడ్ స్టోరేజీ నుంచి, ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తాం. కృష్ణా డెల్టాకు, గుంటూరు చానల్‌కు జూన్ 10వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తాం. పులిచింతలలో 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులిచింతల పునరావాసానికి రూ.100 కోట్లు చెల్లించడంతో ఇది సాధ్యమైంది. దీంతో పట్టిసీమతో సంబంధం లేకుండా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తాం. ► పెన్నా బేసిన్‌లోని గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల ప్రాజెక్టుల నుంచి జూన్ 10న సాగునీటిని విడుదల చేస్తాం. సోమశిలలో 56 టీఎంసీల నీరు ఉంది. రాయలసీమలో ఎస్ఆర్బీసీ పరిధిలోని అవుకు, గోరుకల్లు నుంచి జూన్ 30వ తేదీన నీటిని విడుదల చేస్తాం. నాగార్జున సాగర్ కింద కుడిగట్టు ఆయకట్టుకు జూలై 15న నీళ్లిస్తాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆధారంగా నీటి విడుదలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఆర్బీకేల ద్వారా అన్ని విధాలా భరోసా ► ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులతో పాటు సమస్తం రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ► కొన్ని ప్రాంతాల్లో ఖరీప్ సీజన్ ముందుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభం కావడంతో ధాన్యం సేకరణలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల కింద ముందస్తుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభించడంతో ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తవని భావిస్తున్నాం. అలాగే మూడో పంట ద్వారా పంటల మార్పిడికి అవకాశం కలుగుతుంది. సాగునీటి విడుదల షెడ్యూల్ ఆధారంగా సాగు నీటి సలహా మండలి సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. సంక్షేమ క్యాలెండర్ అమలుకు ఆమోదం ► ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు కేబినెట్ ఆమోదించింది. సీఎం మే 13వ తేదీన ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా, మే 16న వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభిస్తారు. మే 19న పశువులకు చెందిన అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభిస్తారు. ► జూన్ 6న 4,014 కమ్యునిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402 కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు. ఖరీఫ్–21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను జూన్ 14న, జూన్ 21న అమ్మ ఒడి పథకం అమలు చేస్తాం. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇలా.. ► కృష్ణా జిల్లా పామర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)గా అప్‌గ్రేడ్. 38 అదనపు పోస్టులు మంజూరు. అప్‌గ్రెడేషన్ కోసం రూ.8.18 కోట్లు వ్యయం. ► పులివెందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు. 26 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ. ► వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సదుపాయాలు, ఫాంగేట్ మౌలిక సదుపాయాలు, తదితర పనుల కోసం ఆర్థిక సంస్థల నుంచి రూ.1,600 కోట్ల రుణ సమీకరణకు ఆమోదం. ► మార్క్‌ఫెడ్‌లో 8 డిప్యుటీ మేనేజర్లు, 22 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మంజూరు. ► నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో దివంగత మంత్రి గౌతం రెడ్డి పేరుతో వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటు. ► నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ప్లాంట్ పెట్టనున్న క్రిబ్కో. వ్యాపార కార్యకలాపాల్లో మార్పుల కారణంగా ఎరువులకు బదులు బయో ఇథనాల్ ఉత్పత్తి చేస్తామన్న క్రిబ్కోకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో 16 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం. ► రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలకు కేబినెట్ ఆమోదం. కోవిడ్ లాంటి విపత్తుల నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ హబ్స్‌లో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థలకు భూముల కేటాయింపు. మచిలీపట్నంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించనున్న ఆస్పత్రి కోసం ఎకరా భూమి కేటాయింపునకు ఆమోదం. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 3 ఎకరాలు, నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో అత్యాధునిక ఆస్పత్రికి 4 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం. రూ.100 కోట్లకు పైబడి పెట్టుబడితో పాటు 50 శాతం పడకలు ఆరోగ్య శ్రీకి కేటాయించాలనే నిబంధన. వైఎస్సార్ జిల్లా చిన్నమాచుపల్లిలో 3 ఎకరాల్లో మెడికల్ హబ్ కింద ఏర్పాటు కానున్న ఆస్పత్రికి భూమి కేటాయింపు. ► సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు, పడమటి కండ్రిగ గ్రామాల్లో 11.19 ఎకరాల భూమి టెక్స్టైల్ పార్క్‌కు కేటాయింపు. ► శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ డివిజన్ మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీఐఐసీకి 235 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ఇదే గ్రామంలో మరో 63.16 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. మడకశిర మండలంలోని గౌడనహళ్లిలో 318.14 ఎకరాలు, ఇక్కడే మరోచోట 192.08 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, పశు సంవర్థక, మినరల్స్, టెక్స్టైల్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం. ► పెనుగొండలో మెగా స్పిరిట్యువల్ సెంటర్, టూరిస్ట్ బేస్ క్యాంప్‌నకు 40.04 ఎకరాలు ఇచ్చేందుకు అనుమతి. ► తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం గౌడమాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి 41.77 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ► అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కోటవూరులో టూరిజం రిసార్ట్‌కు 10.50 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్. ► కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో రిసార్ట్ కోసం ఏపీటీడీసీకి 56 ఎకరాలు కేటాయింపు. ► విశాఖపట్నం జిల్లా ఎండాడలో కాపు భవన్ నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయింపునకు ఆమోదం. ► బాపట్ల జిల్లా అద్దంకిలో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వేస్ట్ కంపోస్ట్ ప్లాంట్ నిర్మాణాలకు 19 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ► నంద్యాల జిల్లా ప్యాపిలిలో హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ కోసం 25.93 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ► బాపట్ల జిల్లాలో రేపల్లె కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ఆ మేరకు సవరించిన సరిహద్దులకు కేబినెట్ ఆమోదం. ► పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో నర్సపూర్ అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్‌కు ఇచ్చిన 1,754.49 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్‌కు ఇచ్చి, ప్రస్తుతం ఆ భూమిని అనుభవిస్తున్న లీజుదారులకు ఎకరా కేవలం రూ.100 చొప్పున పూర్తి హక్కులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం. దీని వల్ల 1000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ► పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తూ గతంలో జారీ చేసిన జీవో సవరణకు కేబినెట్ ఆమోదం. ► జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపునకు ఆమోదం. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రకారమే ప్రస్తుతం స్థలాల కేటాయింపు. -
గోదావరి గట్టెక్కింది
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/ధవళేశ్వరం: సాగు నీటి ఎద్దడి లేకుండా రబీ రైతు గట్టెక్కేసినట్టే. ప్రభుత్వ సంకల్పానికి గోదారమ్మ తోడైంది. సహజ జలాలు తక్కువగా ఉండటంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరందదని ఆందోళన చెందినా ప్రభుత్వ పట్టుదలకు పరిస్థితులు సానుకూలంగా కలిసొచ్చాయి. దీంతో రైతులు గుండె నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 10న కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 5.50 అడుగుల కనిష్టానికి నమోదైంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిని డెల్టాల సాగు కోసం విడిచిపెట్టారు. అరకొరగా సాగునీరు అందుతోందని అందోళన చెందుతోన్న సమయంలో అఖండ గోదావరి ఎగువన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలతో తెలంగాణాలోని లక్ష్మీ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జనవరి 14 నాటికి బ్యారేజ్ వద్ద నీటి సామర్థ్యం పూర్తి స్థాయికి చేరుకుంది. అప్పటివరకూ ఆందోళన చెందిన రైతులు ఉపసమనం చెందారు. జనవరి నెలాఖరుకు సాగు వసరాలకు నిల్వలు సరిపోవడంతో ఈ సారి అనూహ్యంగా మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గడచిన పదేళ్లలో జనవరిలో మిగులు జలాలను విడుదల చేయడం తొలిసారిగా బ్యారేజీ రికార్డులకు ఎక్కింది. ఫలితంగా నెలంతా సాఫీగానే సాగునీరు సరఫరా సాగింది. ఫిబ్రవరిలోనే ఏర్పడిన ధీమా ఫిబ్రవరి 13 నుంచి నీటి మట్టం తగ్గడంతో మరోసారి రబీ రైతులు టెన్షను పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిశాయి. ఆ వర్షాలతో గోదావరి జలాలు కాటన్ బ్యారేజ్‌కి చేరాయి. ఫలితంగా ఫిబ్రవరి నెలంతా సాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు విడుదలైంది. ప్రభుత్వ భరోసాతో రైతులు ధైర్యంగా చేపట్టిన పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రబీకి సాగునీటి కొరత లేదనే విషయం దాదాపు ఖాయమైంది. సాగు, తాగు నీటికి మొత్తం 94టీఎంసీలు అవసరమని ప్రాథమికంగానే నీటిపారుదలశాఖాధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 62.82 టీఎంసీలు ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రబీ సీజన్ ముగిసే నాటికి మరో 32 టీఎంసీల నీరు విడుదలచేస్తే సరిపోతుంది. అవసరమైతే రెడీగా సీలేరు నీరు విశాఖ జిల్లా సీలేరు నుంచి మన డెల్టాలకు 38 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు 9.09 టీఎంసీలు మాత్రమే వినియోగించుకున్నాం. భవిష్యత్ అవసరాల కోసం సీలేరులో 29 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రభుత్వం రబీ సాగు ప్రణాళిక ప్రకటన రోజు ఏమని చెప్పిందో దానిని నిజం చేసి చూపించిందని చెప్పవచ్చు. ఇందుకు ప్రకృతి కూడా తోడ్పాటునందించడంతో ఎలాంటిì ప్రతిబంధకాలు లేకుండా రబీ గట్టెక్కినట్టేనని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ రబీలో 8,96,533 లక్షల ఎకరాలకు 87టీఎంసీల సాగు నీరు అవసరమని ఇరిగేషన్ అధికారులు తొలుత అంచనా వేశారు. సాగు, తాగు నీటికి మరో 7 టీఎంసీలతో కలిపి మొత్తం 94 టీఎంసీలు అవసరమని లెక్కతేల్చారు. సోమవారం నాటికి మూడు డెల్టాలకు కలిపి బ్యారేజ్ నుంచి 62.82 టీఎంసీలు విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 18.37టీఎంసీలు, మధ్య డెల్టాకు 12.01టీఎంసీలు, పశ్చిమ డెల్టా 32.44టీఎంసీలు విడుదలయ్యాయి. రబీకి పుష్కలంగా సాగునీరు రబీలో ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతి ఎకరాకు సాగు నీరందించగలగుతున్నాం. అవసర సమయంలో ఎగువన వర్షాలు కురవడం, పోలవరం ప్రాజెక్టులో నీరు కూడా ఈ సీజన్లో కలిసి వచ్చింది. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఇది సాధ్యమైంది. మార్చి నెలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరందిస్తాం. – పి.రాంబాబు, సూపరింటెండెంట్ ఇంజినీర్, నీటి పారుదల శాఖ, ధవళేశ్వరం -
సంగారెడ్డికి గోదారమ్మ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకోబోతున్నాయి. సముద్రమట్టానికి ఎత్తై న ప్రాంతంలో ఉండే నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు గోదావరి జలాలను తరలించాలనే ఇక్కడి రైతుల ఎన్నో ఏళ్ల కళ సాకారమవబోతోంది. ఈ రెండు ఎత్తిపోతల పనులకు సీఎం కేసీఆర్ సోమవారం భూమి పూజ చేయనున్నారు. తర్వాత నారాయణఖేడ్ శివారులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీలు తరలించి.. సంగమేశ్వర, బసవేశ్వర పథకాలకు రాష్ట్రం రూ.4,427 కోట్లు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. మొత్తం 397 గ్రామాలకు చెందిన రైతులు లబ్ధి పొందనున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయం నుంచి సుమారు 12 టీఎంసీల నీటిని సింగూరు జలాశయానికి తరలిస్తారు. అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా ఆయకట్టుకు మళ్లించేలా ఈ పథకాలను డిజైన్ చేశారు. రెండు ఎత్తిపోతల పథకాలకు కలిపి 5 పంప్‌హౌజ్‌లను నిర్మించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నీటి పారుదల శాఖ ఇప్పటికే టెండరు ప్రక్రియను పూర్తి చేయగా మెగా కంపెనీ పనులు దక్కించుకుంది. సంగారెడ్డి సస్యశ్యామలం: హరీశ్ నారాయణఖేడ్: సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న రెండు ఎత్తిపోతల పథకాలు సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయనిగా మారనున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం నారాయణఖేడ్‌లో జరగనున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలసి ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఈ ప్రాంత అభివృద్ధికోసం రూ.4,500 కోట్లతో రూ.3.89 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను మంజూరు చేశారన్నారు. ఈ ప్రాజెక్టులతో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో 406 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, సర్వే పనులు పూర్తయ్యేందుకు ఏడాది పట్టిందని తెలిపారు. -
శివారు చేలకూ నీరిస్తాం
కాకినాడ సిటీ: ఉభయ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి రెండో పంటకు సైతం సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. శనివారం కాకినాడలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏడు స్థాయీ సంఘాల ఎన్నికలకు సంబంధించి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, జ్యోతుల చంటిబాబుతో కలసి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. గోదావరిలో నీటి నిల్వలు తగ్గిన దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో రెండో పంట సాగునీటి అవసరాలకు 18 టీఎంసీల నీటి కొరత ఏర్పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి రెండో పంట రబీలో చివరి ఎకరాకు సైతం సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో రాజమహేంద్రవరంలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి నీటి పంపిణీపై చర్చిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఇటీవల అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఈ క్రాప్ బుకింగ్ ద్వారా నమోదు చేసి.. రైతులు నష్టపోకుండా సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
రబీ జోరు.. రైతన్న హుషారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరుగా సాగుతోంది. రెండో ఏడాది కూడా రెండో పంటకు సాగు నీరివ్వడం.. సాగు సేవలన్నీ ముంగిటకు చేరడం.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి తోడు నాణ్యమైన విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉండటంతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో దాళ్వా (రబీ) సాగు చేపట్టారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్–డిసెంబర్ మధ్య 296 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 370.3 మిల్లీమీటర్లు నమోదైంది. విజయనగరం, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగిలిన 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవడంతో జలాశయాలు, కుంటలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. అందుబాటులో నాణ్యమైన విత్తనాలు రబీలో 3,19,987 క్వింటాళ్ల విత్తనాల సరఫరాకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయగా.. రైతు భరోసా కేంద్రాల ద్వారా 2,06,731 మంది రైతులకు రూ.35.56 కోట్ల సబ్సిడీతో కూడిన 1,64,408 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశారు. ఖరీఫ్ పంట చివరి దశకు చేరిన సమయంలో నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు 1,03,129 క్వింటాళ్ల విత్తనాలిచ్చేందుకు ఏర్పాట్లు చేయగా, ఇప్పటివరకు 39,481 మందికి రూ.23.28 కోట్ల సబ్సిడీపై 49,854 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశారు. ఈ సీజన్లో సాగు లక్ష్యం 58.92 లక్షల ఎకరాలుగా నిర్దేశించగా.. ఇప్పటివరకు 39.10 లక్షల ఎకరాల్లో ఇప్పటికే సాగు మొదలైంది. రెండేళ్ల కంటే మిన్నగా వరి ప్రస్తుత రబీలో వరి సాగు లక్ష్యం 19.79 లక్షల ఎకరాలు కాగా.. జనవరి రెండో వారానికి 12.60 లక్షల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉంది. అయితే, ఇప్పటికే 13.19 లక్షల ఎకరాల్లో (105 శాతం) నాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 11.61 లక్షల ఎకరాలు, 2019లో 11.54 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. కాగా సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న, ఇతర చిరు ధాన్యాల సాగు విస్తీర్ణం 8.91 లక్షల ఎకరాలు కాగా, జనవరి రెండో వారానికి 6.33 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 4.10 లక్షల ఎకరాలు (65 శాతం) సాగులోకి వచ్చాయి. మినుము సాగులోనూ మిన్న రబీలో అపరాల సాగు లక్ష్యం 24.06 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 18.29 లక్షల ఎకరాల్లో (81శాతం) సాగు మొదలైంది. ప్రధానంగా పప్పుశనగ 9.95 లక్షల ఎకరాలకు గాను.. 8.83 లక్షల ఎకరాల్లోను, మినుములు 9.55 లక్షల ఎకరాలకు గాను 7.06 లక్షల ఎకరాల్లోను సాగు మొదలైంది. గతేడాది ఇదే సమయానికి మినుము 6.47 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ ఏడాది పెసలు 3.16 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. 1.49లక్షల ఎకరాల్లో ఇప్పటికే మొదలైంది. నూనె గింజల సాగు లక్ష్యం 3.73 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1.65 లక్షల ఎకరాల్లో(76 శాతం) సాగులోకి వచ్చాయి. వేరుశనగ 2.28 లక్షల ఎకరాలకు గాను.. 1.31 లక్షల ఎకరాల్లో ఇప్పటికే సాగు మొదలైంది. పొగాకు 1.69 లక్షల ఎకరాలకు గాను 1.09 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. సీజన్ ముగిసే నాటికి మొత్తం పంటలు లక్ష్యాన్ని అధిగమించే సూచనలు కన్పిస్తున్నాయి. రబీ సీజన్లో 22.64 లక్షల టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. సీజన్ ఆరంభంలోనే 10,53,880 టన్నులు అందుబాటులోకి వచ్చాయి. లక్ష్యం దిశగా.. రాష్ట్రంలో రబీ సాగు లక్ష్యం దిశగా పయనిస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువుల్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. వరుసగా రెండో ఏడాది కూడా రెండో పంటకు సాగునీరివ్వడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారానికే నిర్దేశించిన లక్ష్యం మేరకు పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం – హెచ్.అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయ శాఖ -
80 మోటార్లతో ఎత్తిపోతలు
సిరిసిల్ల: కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని, గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించామని రాష్ట్ర ప్రభుత్వం సగౌరవంగా చెబుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే 9వ ప్యాకేజీ పనులకు ఇప్పుడు భూగర్భంలో ఉబికి వస్తున్న నీటి ఊటలు ప్రతిబంధకంగా మారాయి. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించే ఈ ప్యాకేజీ పనులను దసరా నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ సొరంగంలో నీటి ఊటలతో లక్ష్యం నీరుగారుతోంది. కాంట్రాక్టర్లు 900 హెచ్‌పీల సామర్థ్యంతో 80 మోటార్లను అమర్చి రేయింబవళ్లు సొరంగంలోని నీటిని బయటకు ఎత్తిపోస్తున్నా..ఉబికి వస్తున్న ఊటలు తగ్గడం లేదు. సొరంగంలో లైనింగ్ పనులు సాగడం లేదు. ఇదీ లక్ష్యం.. జిల్లాలోని మధ్యమానేరు బ్యాక్ వాటర్ సిరిసిల్ల పట్టణాన్ని తాకి ఉన్నాయి. ఈ నీటిని అప్రోచ్ కెనాల్ ద్వారా సిరిసిల్ల నుంచి కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ వరకు సొరంగం ద్వారా మళ్లించాల్సి ఉంది. ఇందు కోసం 13 కిలోమీటర్ల సొరంగం పనులు 2013 నుంచి కొనసాగుతున్నాయి. సొరంగంలోని లైనింగ్ కెనాల్‌తో గ్రావిటీ ద్వారా మల్క పేట వరకు గోదావరి జలాలు చేరుతాయి. మల్కపేట వద్ద పంపింగ్ స్టేషన్లో రెండు 30 మెగావాట్ల మోటార్లతో నీటిని ఎత్తి మల్కపేట రిజర్వాయర్‌లో పోస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గంభీరావు పేట మండలం సింగసముద్రం చెరువులోకి అక్కడ ఏర్పాటు చేసిన రెండు 2.25 మెగావాట్ల మోటార్లతో నీటిని ఎత్తిపోస్తారు. గ్రావిటీ ద్వారా ముస్తఫానగర్ బట్టలచెరువు నింపి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నర్మాల ఎగువ మానేరు నింపుతారు. 2.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎగువ మానేరు నిండితే.. సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.996.01 కోట్లతో 9వ ప్యాకేజీ పనులు చేపట్టారు. కానీ ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలోని కూడెల్లి, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగులు పారడంతో సిరిసిల్ల జిల్లాలోని నర్మాల ఎగువ మానేరు నిండి మత్తడి దూకుతోంది. మంత్రి కేటీఆర్ కాళేశ్వరం నీటితో ఎగువ మానేరు నింపాలని భావించగా.. సమృద్ధిగా వర్షాలు పడి అప్పర్ మానేరు నిండడం విశేషం. కాగా, 9వ ప్యాకేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఆర్థికంగా నీటిని ఎత్తిపోయడం అదనపు భారమే. సమాంతరంగా ఇతర పనులు చేయిస్తున్నాం.. సొరంగంలో నీటి ఊటల కారణంగా పనులకు ఆటంకం ఏర్పడింది. నీటిని మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. సొరంగంలో లైనింగ్ పనులు సాగడం లేదు. సమాంతరంగా ఇతర పనులు చేయిస్తున్నాం. సింగసముద్రం వద్ద పంపు, మోటారు ఏర్పాటు, గ్రావిటీ కెనాల్ పనులు చేయిస్తున్నాం. నీరు తగ్గగానే సొరంగంలో లైనింగ్ పనులు పూర్తి అవుతాయి. టాప్ ప్రయార్టీగా 9వ ప్యాకేజీ పనులు చేస్తున్నాం. – గంగం శ్రీనివాస్‌రెడ్డి, 9వ ప్యాకేజీ ఈఈ -
వేగంగా నే‘రడి’
సాక్షి, అమరావతి: వంశధార జలాల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 57.5 టీఎంసీల నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేరడి బ్యారేజీని నిర్మించి రోజుకు 8 వేల క్యూసెక్కులను మళ్లించడం ద్వారా వంశధార స్టేజ్–2 ఫేజ్–2 కింద 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. వంశధార జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నేరడి బ్యారేజీ పనులు చేపట్టేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది. బ్యారేజీ నిర్మాణం ద్వారా ఒడిశాలో ముంపునకు గురయ్యే 106 ఎకరాలను గుర్తించేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) నేతృత్వంలో సంయుక్త సర్వేకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్న అంశాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి ఇప్పటికే తెచ్చింది. 106 ఎకరాల భూసేకరణకు అయ్యే వ్యయాన్ని ఒడిశా సర్కార్ వద్ద డిపాజిట్ చేసి నేరడి బ్యారేజీ పనులను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో పంటకూ సాగునీరు.. ► ఒడిశా సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయిం చడంతో అభ్యంతరాలను పరి శీలించాలని వంశధార ట్రిబ్యునల్‌ను న్యాయ స్థానం ఆదేశించింది. ► నేరడి బ్యారేజీతో ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని గుర్తించేందుకు వంశధార ట్రిబ్యునల్ సీడబ్ల్యూసీ ఎస్ఈ నేతృత్వంలో సంయుక్త సర్వేకు ఆదేశిం చినా ఒడిశా సహాయ నిరాకరణతో ముందుకు సాగడం లేదు. ఇదే అం శాన్ని సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం వంశ ధార ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలని కోరింది. నేరడి బ్యారేజీ పూర్తయితే వంశధార ఆయకట్టుకు రెండో పంటకూ నీళ్లందించవచ్చునని సాగు నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాట్రగడ్డ సైడ్ వియర్‌తో 8 టీఎంసీలే మళ్లింపు.. ► నాలుగున్నర దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధారపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 33.704 కి.మీ. పొడవైన హైలెవల్ కెనాల్ ద్వారా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను తరలించి సింగిడి, పారాపురం, హీర మండలం రిజర్వాయర్ల ద్వారా నీళ్లందించాలని నిర్ణయించారు. ► నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులకు ముందస్తుగా ఫలాలను అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేసి భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్(మత్తడి) నిర్మించి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. సైడ్ వియర్ నిర్మాణం వల్ల గరిష్టంగా ఎనిమిది టీఎంసీలను మళ్లించవచ్చు. ► నేరడి బ్యారేజీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వంశధార ట్రిబ్యునల్ 2017 సెప్టెంబరు 13న తుది తీర్పు ఇచ్చింది. బ్యారేజీ కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు, ఎడమ కాలువ ద్వారా ఒడిశాకు నీటిని సరఫరా చేయాలని, వ్యయాన్ని దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని నిర్దేశించింది. -
వైఎస్సార్ హయాం సాగునీటి శకం
ఆంధ్రప్రదేశ్ తెలుగు క్యాలెండర్లో కొత్త పండగ చేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రైతు దినోత్సవం అయింది. ముక్కారు పంటలతో అన్నపూర్ణగా విరాజిల్లుతున్న సింహపురిలో వైఎస్సార్ హయాం సాగునీటి శకంగా మారింది. వ్యవసాయ రంగాన్ని ప్రస్తావించాలంటే క్రీ.పూర్వం.. క్రీ.శకం అన్నట్లుగా దశాబ్దం ముందు వైఎస్సార్, దశాబ్దం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. ఈ రోజు పల్లెకు ఆ పండగొచ్చింది. వైఎస్సార్ కేవలం ఐదేళ్ల తన పాలనలో వందేళ్ల అవసరాలు తీర్చేలా సాగునీటి రంగం అభివృద్ధికి పునాదులు వేశారు. ఆయన హయాంలోనే కొన్ని ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. మరి కొన్ని పురుడు పోసుకున్నాయి. జిల్లాలో చారిత్రాత్మకంగా చెప్పుకో దగిన ప్రాజెక్ట్‌ల్లో 78 టీఎంసీ సామర్థ్యం కలిగిన సోమశిల ఒకటి. దాదాపు మూడు దశాబ్దాలుగా 35 టీఎంసీల సామర్థ్యం దాటని ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తి సామర్థ్యానికి పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది. దివంగత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి స్వగ్రామం వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ రెండోది. సీఎంగా ఉండి నేదురుమల్లినే పూర్తి చేయలేకపోయిన స్వర్ణముఖిని వైఎస్సార్ రెండేళ్లలోనే పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. చారిత్రాత్మకమైన నెల్లూరు పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీలకు శ్రీకారం చుట్టితే.. దశాబ్ద కాలంగా పురోగతికి నోచుకోలేదు. వీటిని ఈ ఏడాది ఆఖరులోగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు కానుకగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రధానంగా చెప్పుకునే తెలుగుగంగ, ఎస్ఎస్ కెనాల్‌తో పాటు ప్రధాన పట్టణాల దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నిర్మించి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. సాక్షి, నెల్లూరు: అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన సింహపురిని జలపురిగా మార్చిన అపర భగీరథుడు. దాదాపు మూడు దశాబ్దాలపైకు పైగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు జలయజ్ఞం చేసిన పాలక కర్షకుడు. వందల రూ.కోట్లతో ప్రాజెక్ట్‌లకు పునాదులు వేసి, పూర్తి చేసిన జలయాజి్ఞకుడు.. రాజశేఖరుడిని దశాబ్దం తర్వాత కూడా జిల్లా రైతాంగం స్మరిస్తోంది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్సార్ నిర్వహించిన పాదయాత్ర తర్వాత జిల్లాలో బస్సు యాత్రలో అడుగడుగునా అన్నదాతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 2004లో ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో సాగునీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. జలయజ్ఞం ద్వారా వందల రూ.కోట్లతో సమగ్ర సోమశిల నుంచి పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణం వరకు అన్నింటికి ఆయన అంకురార్పణ చేశారు. ప్రధానంగా 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిల నీటి సామర్థ్యాన్ని రెండు దశల్లో 78 టీఎంసీల స్థాయికి తీసుకు వచ్చారు. సమగ్ర సోమశిలలో భాగంగా 104 కిలో మీటర్ల పొడవునా ఉత్తర కాలువను సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు అభివృద్ధి చేసి నీటి ఔట్ ఫ్లో సామర్థ్యాన్ని పెంచారు. జిల్లాలోనే కీలక ప్రాజెక్ట్‌లైన సంగం, పెన్నా బ్యారేజీలపై దృష్టి సారించారు. సంగం బ్యారేజీ.. 2006 మే 28న రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీ శంకుస్థాపన చేశారు. 800 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు. అయితే ఆ తర్వాత బ్యారేజీ స్వరూపం మారడంతో 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు. ఆయన మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత పాలకులు దీనిపై నిర్లక్ష్యం వహించడంతో పనులు నేటికి సాగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించి పనులు వేగవంతం చేయించారు. ప్రస్తుతం 85 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 1,185 మీటర్ల పొడవు, 84 గేట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 42 ర్యాంపులకు గాను 38 పూర్తి చేశారు. బ్యారేజీ పూర్తయితే.. జిల్లాలోని 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు దోహపడుతుంది.పెన్నా డెల్టా లో 2.47 లక్షల ఎకరాలకు, కనుపూరు కెనాల్ పరిధిలో 63 వేల ఎకరాలు, కావలి కెనాల్ 75 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రానున్న రోజుల్లో కొత్త ఆయకట్టు సాగులోకి రావడానికి దోహదపడుతుంది. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో సాగుకు లబ్ధి చేకూరుతుంది. సోమశిల నుంచి 40 కిలో మీటర్ల దిగువ భాగంలో దీన్ని నిర్మించడం ద్వారా కుడి వైపున నెల్లూరు చెరువు, నెల్లూరు కాలువ, కనుపూరు కాలువ, కనిగిరి ప్రధాన కాలువ, దువ్వూరు కాలువ, కావలి కాలువ పరిధిలోని 3.85 లక్షల ఎకరాల సాగుకు ఇబ్బంది లేకుండా నీటి విడుదల జరుగుతుంది. పెన్నా బ్యారేజ్.. 2008లో పెన్నా బ్యారేజీ రూ.126 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజీని నిర్మిస్తున్నారు. 0.55 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో తలపెట్టిన పెన్నాబ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా ప్రస్తుతం రూ.149.39 కోట్లకు చేరి 90 శాతం పనులు పూర్తి చేసుకుంది. దివంగత మహానేత హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి మళ్లీ ఆయన తనయుడు దృష్టి సారించడంతో వేగంగా సాగుతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొద్ది నెలల్లో పూర్తయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తామని ప్రకటించారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణంతో 5 మండలాల్లోని 72 గ్రామాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. సర్వేపల్లి కాలువ, జాఫర్‌సాహెబ్ కాలువల పరిధిలోని ఈ ఆయకట్టుకు పూర్తిగా నీరందుతుంది. నెల్లూరు నగర తాగునీటి అవసరాలు తీరుతాయి. నెల్లూరు–కోవూరు రహదారి మార్గంలోనూ పూర్తిగా ఇబ్బందులు తొలగుతాయి. 35 ఏళ్ల కల.. మూడేళ్లలో సాకారం వాకాడు: స్వర్ణముఖి నదిపై బ్యారేజీ కం బ్రిడ్జి నిర్మాణం చేయాలనే 50 ఏళ్ల డిమాండ్.. 35 ఏళ్ల కలను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడేళ్లలో పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. పాతిక వేల ఎకరాల వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేశారు. నదీ పరివాహక ప్రాంతమైనా సాగునీటి కొరత కారణంగా కరువు తాండవం చేసేది. 1972లో స్వర్ణముఖి నదిపై గ్రైయిన్ వాల్ ఆనకట్ట నిర్మాణానికి అప్పటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావుతో రూ.6 కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేయించారు. కానీ పూర్తి చేయలేకపోయారు. 1990లో జనార్దన్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైతాంగం కష్టాలు తీర్చాలని స్వర్ణముఖి నదిపై బ్యారేజ్ నిర్మించాలని భావించారు. 1991లో జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మాణానికి రూ.11 కోట్లతో శంకుస్థాపన చేశారు. దురదృష్టవశావత్తు బ్యారేజీ పనులు ప్రారంభించకుండానే జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. 2005లో వైఎస్సా ర్ జలయజ్ఞంలో భాగంగా స్వర్ణముఖి నదిపై రూ. 50 కోట్లు వ్యయంతో బ్యారేజీ కం‡బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో పనులు పూర్తి చేసి 2008లో బ్యారేజీని రైతులకు అంకితమిచ్చారు. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, చిట్టమూరు, కోట మండలాల్లో బ్యారేజీ ఆధారంగా సుమారు 25 వేల ఎకరాల్లో వ్యవసాయం సస్యశ్యామలంగా మారింది. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చేశారు. బీడు భూముల్లో సైతం ఏడాదికి మూడు పంటలు పండించి సుభిక్షంగా ఉన్నారు. ప్రస్తుతం బ్యారేజీ 2 మీటర్లు ఎత్తుతో 34 గేట్లు, 35 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉండే ట్యాంక్ ఉంది. కరువు నేలపై జలసిరులు వెంకటగిరి: కరువు నేలపై జల సిరులు పారించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. కరువుతో అల్లాడే నియోజకవర్గ రైతాంగ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎస్ఎస్ కెనాల్, తెలుగుగంగ బ్రాంచ్ కాలువలు వంటి భారీ ప్రాజెక్ట్‌లకు పునాదులు పడ్డాయి. చారిత్రిక ప్రసిద్ధి చెందిన వెంకటగిరిని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో వెంకటగిరికి పురపాలక సంఘం హోదా కల్పించారు. రాబోయే 100 ఏళ్లలో పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి సమస్య తలెత్తకుండా పట్టణ ప్రజల దాహర్తిని తీర్చేందుకు సుమారు రూ.72 కోట్లతో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌ను తీసుకువచ్చారు. మెట్ట ప్రాంతమైన వెంకటగిరి రైతులను ఆదుకునేందుకు జలయజ్ఞం ద్వారా తెలుగుగంగ బ్రాంచ్ కాలువల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారు. వెంకటగిరితో పాటు చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో 2.50 లక్షల ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు 2006లో రూ.344 కోట్లు అంచనాతో స్వర్ణముఖి–సోమశిల లింక్ కెనాల్ నిర్మాణానికి రాపూరులో ఆయన శంకుస్థాపన చేశారు. వెంకటగిరీయుల సెంటిమెంట్‌ను గౌరవించి విశ్వోదయ కళాశాల స్థలాలను అమ్మబోమని బహిరంగ సభలో ప్రకటించి నూతన కళాశాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. వెంకటగిరికి అతి చేరువలో మన్నవరం వద్ద ఎనీ్టపీసీ, భెల్ ప్రాజెక్ట్‌లు సంయుక్తంగా రూ.6,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎన్బీపీపీఎల్ పరిశ్రమను తీసుకువచ్చిన ఘనత ఆయనదే. గూడూరు దాహార్తికి.. శాశ్వత విముక్తి గూడూరు: గూడూరు దాహార్తికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి శాశ్వత విముక్తి కల్పించారు. గూడూరు పట్టణ ప్రజలకు ఎండాకాలం వచ్చిందంటే గొంతెండేది. పట్టణానికి తాగునీరందించేందుకు విందూరు, వేములపాళెం గ్రామాల వద్ద ఉన్న వాటర్ వర్క్స్ నుంచి తాగునీరు సరఫరా అయ్యేది. ఎండాకాలంలో తాగునీటి వనరులైన బోర్లు ఒట్టిపోయి పట్టణ ప్రజలు తాగునీటికి అల్లాడే పరిస్థితి. ఈ క్రమంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఇప్పటి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి గూడూరు పట్టణ ప్రజలు తాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారని, వారి దాహార్తిని శాశ్వతంగా తీర్చాలంటూ వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన 2008లో కండలేరు నుంచి గూడూరుకు పైప్లైన్ల ద్వారా తీర్చేందుకు రూ.64.15 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో 2009 కండలేరు నుంచి గూడూరుకు తాగునీటిని తీసుకొస్తున్నారు. వేములపాళెం వద్ద, రిజర్వాయర్ ఏర్పాటు చేయడంతో పాటు, శుద్ధి చేసే పరికరాలను, కండలేరు నుంచి పైప్‌లైను ఏర్పాటు పనులు జరిగి పట్టణ ప్రజల శాశ్వత దాహార్తి తీరింది. పల్లెబాట వరం.. ఎస్ఎస్ ట్యాంక్ సూళ్లూరుపేట: దశాబ్దాల సూళ్లూరుపేట దాహార్తిని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కమాటతో శతాబ్దానికి సరిపడా తీర్చారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాలో సూళ్లూరుపేటలో ప్రారంభించిన పల్లెబాటలో స్థానిక నేతలు అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపారు. వందేళ్లలో పెరిగే పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటికి ఇబ్బందులు రాకుండా కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో సమ్మర్ స్టోరేజీని నిర్మించారు. సమ్మర్ స్టోరేజీని నింపుకోవడానికి తెలుగుగంగ ఏడో నంబర్ బ్రాంచ్ కాలువ నుంచి 14 ఆర్ కాలువ ద్వారా నీటిని అందించాలనేది వైఎస్సార్ ప్లాన్. ఆ ప్లాన్‌లో గడిచిన ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. 2012–13లో రూ.117 కోట్లతో నీటి పథకాలు, మరో రూ. 75 కోట్లతో ఇంకో ఎస్ఎస్ ట్యాంక్ మంజూరు చేస్తానని హామీ ప్రతిపాదనలకే పరిమితమైంది. టీడీపీ హయాంలో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు ప్రతిపాదన మరుగున పడింది. ప్రస్తుతం వైఎస్సార్ ఇచ్చిన సమ్మర్ స్టోరేజీ మాత్రం పట్టణవాసులు గొంతు తడుపుతోంది. అపర భగీరథుడు సైదాపురం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో గంగ జలాలను సైదాపురానికి తీసుకువచ్చిన అపర భగీరథుడు. మెట్టప్రాంతానికి కండలేరు జలాలను తెప్పించి తద్వారా బీడు భూములను మాగాణి భూములుగా మార్చారు. సుమారు 23 వేల ఎకరాల భూములు నేడు నిత్యం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జలయజ్ఞం ద్వారా గంగ బ్రాంచ్ కాలువలను నిర్మాణానికి నిధులను పుష్కలంగా విడుదల చేశారు. కండలేరు నుంచి 2ఏ బ్రాంచ్ కాలువ నిర్మాణానికి నిధులను విడుదల చేశారు. 2ఏ నిర్మాణ ద్వారా ఈ ప్రాంతంలోకి గంగ నీరు వచ్చి చేరుతుండటంతో మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి. సుమారు 15 వేల ఎకరాలు సాగవుతోంది. గతంలో వర్షాధారంగా ఆధారపడి ఉన్న రైతులకు 2ఏ బ్రాంచ్ కెనాల్ ద్వారా ప్రతి చెరువుకు సాగు నీరు అందించిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. అలాగే 2 బీ కెనాల్ ద్వారా మరో 7 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. సమగ్ర సోమశిల సాక్షి, నెల్లూరు: సింహపురి సిగలో జలనిధి ఉన్నా.. వ్యవసాయానికి సాగునీటి కరువు వెంటాడేది. 78 టీఎంసీల సామర్థ్యం ఉన్న సోమశిల ప్రాజెక్ట్‌కు సంబంధించి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 35–40 టీఎంసీలకే పరిమితమైంది. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండేళ్లలోనే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సంకలి్పంచారు. వైఎస్సా ర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపులను పూర్తి చేసి 2007 నాటికి 72 టీఎంసీల నీటిని నిల్వ చేసి రైతులకు అంకితమిచ్చి చెరగని ముద్ర వేసుకున్నారు. మూడు దశాబ్దాల తర్వాత.. పెన్నానదికి ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురిసిన వర్షాలకు జలాశయాలు నిండి వృథాగా సముద్రంలో కలుస్తుంటే కరువు ప్రాంతాల గొంతు తడపాలన్న ప్రయత్నమే జిల్లాలోని సోమశిల జలాశయానికి పునాది పడింది. సోమశిల ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 5,84,500 ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు ప్రతిపాదన చేశారు. ఇందులో 4,05,500 ఎకరాలు మాగాణి భూముల స్థిరీకరణతో పాటు కొత్తగా 1,79,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల వద్ద పెన్నానదిపై జలాశయం నిర్మించేందుకు 1973లో ఐదో పంచవర్ష ప్రణాళికలో రూ.17.20 కోట్ల అంచనాలతో అనుమతులు ఇచ్చారు. అన్ని అనుమతులతో ఈ ప్రాజెక్ట్ 1976లో ప్రారంభమైనప్పటికీ పనులు పురోగతిలో లేకుండాపోయాయి. 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినా.. 1989 నాటికి కూడా ప్రాజెక్ట్ ముఖ్య నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా నది వరద నీటిని శ్రీశైలం డ్యాం నుంచి కరువు ప్రాంతమైన రాయలసీమకు కేవలం 1,500 క్యూసెక్కుల తరలించేందుకు ఎనీ్టఆర్ 1983లో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ప్రారంభించారు. కరువు ప్రాంతాల కడగండ్లు తీర్చడానికి ఆ నీళ్లు సరిపోవని బచావత్ ట్రిబ్యునల్ కాదన్నా, అప్పటి తెలంగాణ నాయకులు జలదోపిడీ విమర్శలు చేసినా లెక్క చేయకుండా 2005 సెపె్టంబర్ మహానేత వైఎస్సార్ జీఓ 170 ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నీటి తరలింపు సామర్థ్యాన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులని చెప్పినా వాస్తవంగా 1,10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలు తరలించే విధంగా డిజైన్ చేయించారు. ఆ నాటి కృషి ఫలితమే నెల్లూరు జిల్లాలో వర్షాలు కువరకపోయినా రైతాంగం ధీమాగా పంటలు పండించుకొనే పరిస్థితి వచ్చింది. జగన్ హయాంలో కల సాకారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సమగ్ర సోమశిల ముఖచిత్రం మారింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ భూములకు నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటేందుకు రూ.450 కోట్లు ఆ శాఖకు కేటాయించారు. ఇప్పటి వరకు సోమశిలకు భారీ వరదలు వచ్చినా కేవలం 73 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచేవారు. మిగిలిన 5 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు లభించలేదు. కొత్త ప్రభుత్వం రాకతో అటవీ భూములకు పరిహారం కొలిక్కి రావడంతో 78 టీఎంసీల నీరునిల్వ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది కురిసిన వర్షాలకు 78 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. -
సాగునీరిచ్చి రైతులను ఆదుకుంటాం
సాక్షి, గుండాల(ఆలేరు) : గుండాల మండల రైతులకు సాగునీరు అందించి ఆదుకుంటామని గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం నవాబుపేట రిజర్వాయర్ సాగు జలాలను గుండాల మండలానికి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాల ఘనపురం, గుండాల రైతులకు రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలన్నారు. రిజర్వాయర్‌లో కెపాసిటీకి అనుగుణంగా నీటిని నిల్వ ఉంచి నీరు విడుదల చేస్తామన్నారు. ఆయకట్టు కింద ఉన్న రైతులు అధైర్య పడొద్దని సూచించారు. రిజర్వాయర్ కింద ఉన్న రైతులకు చిత్తశుద్ధితో సాగు నీరు అందించి వారి కష్టాలు తీరుస్తామని పేర్కొన్నారు. నీటి విడుదలలో హైడ్రామా..! నీటిని విడుదల కన్న ముందు హైడ్రామా చోటు చేసుకుంది. మంత్రి దయాకర్‌రావు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముగ్గురు ఉదయం 8గంటలకు నీటిని విడుదల చేస్తారని సమాచారం ఉంది. అనుకున్న సమయానికి మంత్రి, ఆలేరు ఎమ్మెల్యే వచ్చారు. అయితే స్టేషన్ ఘన్పూర్ నుంచి వచ్చే నీటి ప్రవాహానికి రిజర్వాయర్‌కు అడ్డంగా ఉన్న కట్ట తెగిపోయింది. దీంతో మంత్రి, ఆలేరు ఎమ్మెల్యే తమతమ నియోజకవర్గాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం తిరిగి ఆలేరు ఎమ్మెల్యే నవాబుపేట రిజర్వాయర్‌కు చేరుకొని మధ్యాహ్నం వరకు మంత్రి, ఎమ్మెల్యే రాజయ్య కోసం వేచిచూశారు. అప్పటికే ఎమ్మెల్యే రాజయ్య కూడా కాలువను పరిశీలించి వెళ్లారు. అయితే సాయంత్రం మంత్రి హడావుడిగా వచ్చి కాల్వలో పూలు చల్లి మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆలేరు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు వచ్చి గంగమ్మకు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ తాండ్ర అమరావతి, జెడ్పీటీసీ కోలుకొండ లక్ష్మి, నాయకులు జి.సోమిరెడ్డి, జి.పాండరి, ఎన్.రామకృష్ణారెడ్డి, కె.యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ఇక ఎత్తిపోసుడే
సాక్షి, హైదరాబాద్: ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు మంగళవారం ఉదయానికి జూరాల చేరనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జూరాలకు వచ్చే నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. జూరాల నిర్ణీత మట్టాలకు నిల్వ చేరిన వెంటనే నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పంపులను ప్రారంభించి కృష్ణా జలాల ఎత్తిపోతలను చేపట్టనుంది. గతేడాది 50 టీఎంసీల మేర నీటిని జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు తరలించగా ఈ ఏడాది అంతకుమించి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎగువ నుంచి రాగానే ఎత్తిపోత పశ్చిమ కనమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరిగిన విషయం తెలిసిందే. సోమవారం సైతం ఆల్మట్టిలోకి లక్ష క్యూసెక్కుల మేర వరద వస్తుండగా అంతే మొత్తం నీటిని దిగువ నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టిలో ప్రస్తుతం 129 టీఎంసీలకుగాను 123 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఇక నారాయణపూర్‌లో సైతం 37 టీఎంసీలకుగాను 32 టీఎంసీల నిల్వ ఉండగా అందులోంచి 18 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలారు. ఈ నీరు జూరాల వైపు వస్తోంది. సోమవారం మధ్యాహ్నమే జూరాలకు ముందున్న కర్ణాటకలోని గూగల్ బ్యారేజీని కృష్ణా వరద దాటగా మంగళవారం ఉదయానికి జూరాలను చేరుకోనుంది. జూరాలలో ప్రస్తుతం 9.66 టీఎంసీలకుగాను 1.99 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఇందులో మరో 5 టీఎంసీల నీరు చేరిన వెంటనే భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పంపులు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటే జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగనుంది. చర్యలు చేపట్టండి: కేసీఆర్ గోదావరి పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతోపాటు కడెం, ఎల్లంపల్లిలో వరద మొదలైనందున వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వరద నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో వరద పరిస్థితిపై కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కడెంకు చేరుకుంటున్న వరదతో ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లికి వరద చేరుకునే అవకాశం ఉండటంతో గోలివాడ వద్ద ఉన్న పంపుల్లో ఎన్ని మోటార్లను నడిపిస్తారో పరిశీలించి నీటిని ఎత్తిపోయాలన్నారు. అలాగే కృష్ణా బేసిన్లో భారీ వరదలు వస్తున్నందున దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా గరిష్ట నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శ్రీశైలానికి వరద చేరిన వెంటనే కల్వకుర్తి పంపులను సైతం నడిపించి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నారు. దీంతోపాటే ప్రతి బ్యారేజీ వద్ద గేట్ల నిర్వహణ, పంపులు మోటార్ల మరమ్మతు పనులు ఉంటే తక్షణమే చేసుకొని ఇంజనీర్లు ఆయా ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎంవో స్మితా సబర్వాల్, ఓఎస్డీ శ్రీపతి దేశ్‌పాండే, ఈఎన్సీ మురళీధర్ తదితరులు హాజరయ్యారు. -
అన్నదాతకు హంద్రీ–నీవా వరం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కళ్లెదుటే గలగలా నీళ్లు పారుతున్నా ఏడేళ్లుగా పొలాలకు పారించుకోలేని దుస్థితి సీమ రైతన్నలకు ఇక తొలగిపోనుంది. రాయలసీమ సాగునీటి కష్టాలు తీర్చే బృహత్తర ప్రాజెక్టు హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–1 ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని, ఫేజ్–2లో చెరువులకు నీరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్లో ప్రకటించడం పట్ల అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘సీమ’ వాసుల 15 ఏళ్ల స్వప్నం సాకారమై బీడు భూములు కృష్ణా జలాలతో తడిసి బంగారు పంటలు పండించనున్నాయని పేర్కొంటున్నారు. 2004 జూలై 24న వైఎస్సార్ శంకుస్థాపన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం పనులకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి ‘సీమ’లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకానికి 2004 జూలై 24న శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో రూ.4,340.36 కోట్లు ఖర్చు చేశారు. అయితే వైఎస్ మృతి చెందటం హంద్రీ–నీవాకు శాపంగా మారింది. ఎట్టకేలకు 2012లో కృష్ణమ్మ కర్నూలు జిల్లాలోని పందికోన, కృష్ణగిరితోపాటు ‘అనంత’లోని జీడిపల్లి రిజర్వాయర్లకు చేరుకున్నా రైతులకు మాత్రం నిరాశే మిగిలింది. 2012 నవంబర్ 29న ‘అనంత’లోని జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరాయి. 2014 ఖరీఫ్‌లోనే హంద్రీ–నీవా తొలి దశ కింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని ప్రకటించిన నాటి టీడీపీ సర్కారు మాట నిలబెట్టుకోలేదు. పైగా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేయవద్దని 2015 ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 22 జారీ చేయడం గమనార్హం. దీంతో ఐదేళ్లుగా కృష్ణా జలాలు కళ్లెదుటే పారుతున్నా పొలంలోకి మళ్లించుకోలేని దుస్థితిలో సీమ రైతులు ఉన్నారు. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలని డీపీఆర్‌లో నిర్దేశించారు. ఫేజ్–1లో 1.98 లక్షల ఎకరాలున్నాయి. కృష్ణగిరి, పందికోన, జీడిపల్లి రిజర్వాయర్లు ఇందులో ఉన్నాయి. వీటి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలి. ఇందులో కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. నిత్యం కరువుతో అల్లాడే ఆలూరు నియోజకవర్గంలో 48 వేల ఎకరాలు, పత్తికొండలో 10 వేల ఎకరాలకు నికరంగా సాగునీరు అందనుంది. ఉరవకొండలో కూడా 70 వేల ఎకరాలకు అత్యధికంగా సాగునీరు అందనుంది. సాగునీరు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో డిస్ట్రిబ్యూటరీ పనులు ఇక వేగవంతం కానున్నాయి. పిల్ల కాలువ పనుల్లో గత సర్కారు తాత్సారం.. కర్నూలు జిల్లాలో పందికోన రిజర్వాయర్ నుంచి 61,400 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఇందులో కుడి కాలువ కింద 50,626 ఎకరాలు, ఎడమ కాలువ కింద 10,774 ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి కాలువ పరిధిలో 32 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా 28 డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యాయి. ఎడమ కాలువ పరిధిలోని మొత్తం 11 డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తయ్యాయి. అయితే వీటి నుంచి పిల్ల కాలువల పనులు చేయడంలో గత ప్రభుత్వం తాత్సారం చేసింది. రెండు ప్యాకేజీలుగా పిల్ల కాలువ పనులకు టెండర్లు పిలిచారు. 28వ ప్యాకేజీ పనులను మాక్స్ ఇన్ఫ్రా దక్కించుకుంది. 29వ ప్యాకేజీ పనులను ఆర్‌మెహిత్, బూరత్నమ్(జాయింట్ వెంచర్) కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు 87–90 శాతం పనులు పూర్తి చేశాయి. మిగతా పనులు నిలిపివేయడంతో పిల్ల కాలువల పనులకు బ్రేక్ పడింది. అనంతపురం జిల్లాలో 36వ ప్యాకేజీ ద్వారా అత్యధికంగా 80,600 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి. ఈ పనులను రూ.336 కోట్లతో ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది. ఈ పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఆయకట్టుకు నీరు అందలేదు. వీటిని సమీక్షించి పనులు చేయని కాంట్రాక్టులను రద్దు చేసి త్వరగా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే కనీసం వచ్చే ఖరీఫ్ నుంచైనా ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అప్పుల నుంచి అన్నదాతలకు విముక్తి హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరందిస్తే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. వర్షాధారంగా పంటలు సాగు చేసి అప్పుల పాలయ్యే దుస్థితి రైతన్నలకు తప్పుతుంది. రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పని ఉండదు. ఫేజ్–2లో కూడా చెరువులకు నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్ల పరిధిలోని రైతులకు మేలు జరుగుతుంది. -
సాగునీరందక ‘అనంత’లో రైతన్నల అగచాట్లు
నీళ్లున్నా ఐదేళ్లుగా ఇయ్యిలేదు... ‘నేను రెండు వేలు పింఛన్ ఇచ్చాండా..! మీరంతా మాకు అండగా ఉండాలి అంటాండారు. మాకు కావల్సింది రెండు వేలు పింఛన్ కాదయ్యా! మా పొలాలకు నీళ్లు.. నీళ్లు ఇత్తే అట్టాంటి రెండు వేల కాగితాలు మేమే పదిమందికి దానం ఇత్తాం! నాలుగేళ్ల పొద్దయింది! సాగునీళ్లు లేవు. వరిమడి ఏత్తే ఎండిపోవడమే! శనక్కాయన్న ఏత్తామని దిగితే వర్షం రాక అదీ ఎండిపాయ! వర్షం లేక, సాగునీళ్లు లేక శానా ఇబ్బంది పడతాండాం. మా మనసును శానా బాధ పెట్టేదేందంటే... ఏటా హంద్రీ–నీవా నీళ్లు వత్తాండాయి. ఐదేళ్ల నుంచి వత్తాన్నా ఎవరాకూ నీళ్లు ఇయ్యిలేదయ్యా! నీళ్లు సూచ్చే గుండె తరుక్కుపోతాది. మాకు ఏమీ సేయొద్దు! మా పొలాలకు సాగునీళ్లు ఇచ్చే సాలు...’’ – ఇదీ కరువు జిల్లా ‘అనంత’ రైతన్నల ఆవేదన అనంతపురం రైతులకు తెలిసినంతగా రాష్ట్రంలో బహుశా దేశంలోనే మరే జిల్లాకు నీళ్ల విలువ తెలియదంటే అతిశయోక్తి కాదేమో! సాగునీళ్లు లేక, పంటలు పండక 2014 జూన్‌లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి ఇప్పటి వరకూ 273 మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఇక్కడ సాగు సంక్షోభం ఎంత ప్రమాదకరంగా ఉందో బోధపడుతోంది. రాష్ట్రంలో రైతన్నలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? కష్టాల కడగండ్ల పాలైనవారికి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందిందా? మొత్తంగా ఐదేళ్ల టీడీపీ పాలనపై సంతృప్తిగా ఉన్నారా? ఎన్నికల తరువాత ఎలాంటి నాయకుడు, ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? అనే అంశాలపై అన్నదాతల మనోగతాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం రోటరీపురం గ్రామంలో పొలాలకు వెళ్లి పలువురు రైతులను ‘సాక్షి’ ప్రతినిధి పలకరించారు. పుచ్చ తోట సాగు చేస్తున్న నాగరాజుతో మాట్లాడుతుండగా మరో 15 మంది రైతులు అక్కడకు వచ్చారు. పొలం గట్టున వేప చెట్టు కింద వారితో సంభాషణ కొనసాగింది. ‘ఏం పెద్దాయనా..? వ్యవసాయం ఎట్టుండాది! గిట్టుబాటు అయితాండాదా? రుణమాఫీ అయిందా? సాగు నీళ్లు అందుతున్నాయా...?’ అన్న ప్రశ్నలకు అంతా చెప్పిన సమాధానం ఒక్కటే!... ‘ఎక్కడయ్యా! నీళ్లు లేక శానా ఇబ్బందిగుండాది! అంతా రైతుల గురించే మాట్టాడతారు. కానీ గత ఐదేళ్లలో రైతుకు సేసిన అన్నాయం సూత్తే కడుపు తరుక్కుపోతాది.. రుణమాఫీ దేవుడెరుగు. అది వడ్డీలకు కూడా సరిపోక అప్పుల్లో కూరుకుపోయాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం చెరువులో నీళ్లు ఎండిపోవడంతో పశువుల మేత కోసం దున్నుతున్న రైతు నాగరాజు 12 ఎకరాల పొలంలో టమాటా, ఆముదం, వరి, వేరుశనగ సాగు చేస్తాడు. ఐదేళ్లుగా హెచ్చెల్సీ కాలువకు నీళ్లు సరిగా వదలకపోవడంతో ఏటా పంట నష్టపోతూనే ఉన్నాడు. వరికి బదులుగా పుచ్చకాయలు సాగు చేసినా నీళ్లు చాలక అది కూడా చేతికి అందలేదని వాపోయాడు. మల్లిఖార్జున వరికి నీళ్లు చాలక నష్టాలు రావడంతో మొక్కజొన్న సాగు చేశాడు. పెట్టుబడి కోసం బ్యాంకులో తీసుకున్న రూ.60 వేల రుణం సరిపోకపోవడంతో బయట రూ.2 వడ్డీ చొప్పున రూ.30 వేలు తీసుకున్నాడు. మొక్కజొన్నకూ నీళ్లు చాలక నష్టపోయాడు. రూ.90 వేల అప్పు మిగిలింది. వడ్డీలు అదనం. నాలుగేళ్లలో రూ.3 లక్షలు అప్పు చేశాడు. పంట పండితే కానీ అప్పు తీరదు... సాగు నీళ్లు వత్తేగానీ పంట పండదు’ అని ఆక్రోశించాడు. ఇది మోసం కాదా?: రైతు నాగరాజు ‘2012లోనే జిల్లాకు హంద్రీ–నీవా నీళ్లు వచ్చినాయి. 2014 నుంచి ఏటా 20–30 టీఎంసీలొత్తాండాయిని పేపర్లో రాత్తాండారు. మాకు తెలిసి ఈ నీళ్లతో 2–3 లక్షల ఎకరాల వరి మడి పండుతాది. ఆరుతడి పంటలైతే 4 లక్షల ఎకరాలకు ఇవ్వొచ్చు. కానీ ఐదేళ్లలో ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు! సాగు నీరిత్తామని 2014 నుంచి మంత్రులు, ఎస్ఈలు ఏటా పేపర్లో ప్రకటనలు ఇత్తాండారు. కానీ ఇవ్వలేదు. ఇది మోసం చేయడం కాదా? అసలు ఇన్ని నీళ్లు ఏం సేసినారు? పోనీ చెరువుల కింద ఆయకట్టుకైనా ఇచ్చినారా అంటే అదీ లేదు’ అని రైతు నాగరాజు సూటిగా ప్రశ్నించాడు. రైతులకు నీళ్లివ్వకుండా రాజకీయాలా? నాగభూషణం రైతు జోక్యం చేసుకుంటూ ‘ఒక్క టీఎంసీ నీళ్లు మల్యాల నుంచి జిల్లాకు రావాలంటే రూ.14 కోట్లు కరెంటు బిల్లు అవుతుందట! ఈ లెక్కన ఏటా 25 టీఎంసీలు వచ్చినా రూ. 350 కోట్లు నీళ్లుకు ఖర్చవుతుంది. ఇంత విలువైన నీళ్లు రైతులకు ఇవ్వలేదు.. ఏ ఎమ్మెల్యేకు బలం ఉంటే వాళ్ల చెరువులకు తీసుకుపోయి రాజకీయాలు సేయడం మినహా ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు...’ అని వ్యాఖ్యానించాడు. కొట్టినోన్ని, పెట్టినోన్ని ఎప్పటికీ మర్సిపోం... ‘కరెంటు బకాయిలుంటే కరెంటోళ్లు, పోలీసోళ్లు వరి పొట్టమీద ఉన్నపుడు వచ్చి స్టాటర్లు తీసుకెళ్లారు. డబ్బులు కట్టలేక, నీళ్లు లేక పంటలు ఎండిపోయి ఎంత నష్టపోయామో మాకు తెలుసు..’ అని విలపించాడు వెంకటేశ్ అనే రైతు. అన్నదాతల కష్టాలు గుర్తించిన దివంగత వైఎస్ కరెంటు బకాయిలు పూర్తిగా మాఫీ చేశారు. దీనివల్ల రైతులు వెంకటేశ్‌కు రూ.18 వేలు నాగరాజుకు రూ.10 వేలు, మల్లిఖార్జునకు రూ.11 వేలు చొప్పున ఇలా ప్రతివారికీ మాఫీ అయినట్లు చెప్పారు. ఈరోజు కరెంటోళ్లు చేను కాడికి రావడం లేదంటే ఆ మహానుభావుడు ఉచితంగా ఇచ్చిన కరెంటు పుణ్యమే.. అంటూ వైఎస్సార్‌ను తలచుకుంటూ రెండు చేతులెత్తి నమస్కరించాడు నారాయణ అనే పెద్దాయన. ‘రైతు భరోసా’తో చిగురిస్తున్న ఆశలు.. తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం కింద అందచేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీపై నారాయణరెడ్డి అనే రైతు స్పందిస్తూ.. ‘పెట్టుబడికి ఉపయోగపడతాది. జగన్ శానా మంచిపని సేత్తానంటాండాడు..’ అని చెప్పాడు. రుణమాఫీ, సాగునీళ్ల సంగతి సరే..! కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కిందా? అని అడిగితే రైతు నాగభూషణం మాట్లాడుతూ.. ‘నాకు నాలుగు ఎకరాలుంది. 2017లో వేరుశనగ వేసింటిని. నాకు బాగా గుర్తు... క్వింటాలు రూ.4,400 రేటుతో కొనుగోలు సేత్తామని ప్రభుత్వం ప్రకటించింది. పంట పండిన రెండు నెలలకు కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు సేయలేదు. జిల్లాలో 12 లక్షల క్వింటాళ్ల దిగుబడి వత్తే కేవలం 2 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు సేసినారు. దీంతో 3,400కి అమ్మినా! ఇక 2015, 2016, 2018లో అసలు కొనుగోలు కేంద్రమే ఏర్పాటు చేయలేదు. ఇదీ రైతులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ! దేవున్ని మొక్కుతాండానయ్యా...! ‘నాకు 20 ఎకరాల పొలం ఉంది. నీళ్లు లేక కంది పంట మొత్తం ఎండిపోయింది. ఒంట్లో సత్తువ తగ్గడంతో మా పిల్లోళ్లు వ్యవసాయం సేత్తాండారు. ఇన్నేండ్లు వ్యవసాయం సేసినా నేను సంపాదించింది ఏమీ లేదు. నా పిల్లోళ్లు కూడా నాలాగే ఇబ్బంది పడతారా? అని భయమేత్తాంది. నాకు ఆరు మంది పిల్లోళ్లు! జగన్ వచ్చాడు నాయనా! సాగునీళ్లు ఇత్తాడు. పంటలకు భయం ఉండదని పిల్లోల్లంతా సెబుతాండారు. ఆ మహానుభావుడే రావాలని దేవున్ని మొక్కుతాండానయ్యా...!’ – నారాయణ, రైతు, రోటరీపురం కచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిందే! హెచ్చెల్సీ నుంచి ఐదేళ్లుగా సాగు నీరు ఇవ్వలేదు. మేం నీటి తీరువా కడుతున్నాం! కచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిందే! హెచ్చెల్సీకి నీరు ఇబ్బంది అయితే హంద్రీ–నీవా నీళ్లను హెచ్చెల్సీకి మళ్లించి పంటలకు ఇవ్వాలి. రైతులకు మేలు చేయాలి’ – వెంకటేశ్, రైతు, రోటరీపురం అప్పు కట్టలేక మోటర్ అమ్మేసినా...! నాకు 1.90 ఎకరాల భూమి ఉంది. బోరు మోటార్‌కు రూ.35 వేలు, పైపులకు రూ.15 వేలు ఖర్సయింది. ఏడాదికే బోరు ఎండిపోయింది. అప్పు తీర్చేందుకు మోటార్ అమ్మితే రూ.18 వేలకు కొన్నారు. అప్పు అలాగే మిగిలిపోయింది. అందుకే మాకు సాగు నీళ్లు ఇచ్చే నాయకుడు కావాలి.– ఎర్రిస్వామి, రైతు, రోటరీపురం -
నీళ్లను కూడా అమ్ముకుంటున్న తెలుగు తమ్ముళ్లు
గుంటూరు వెస్ట్: దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. మట్టి, ఇసుక అమ్ముకుని కోట్లు గడించిన నేతలు చివరకు రైతులకు అందాల్సిన సాగునీటిని కూడా దారి మళ్లించి అమ్మేసుకుంటున్న వైనం సోమవారం మీ కోసం కార్యక్రమంలో వెలుగులోకి వచ్చింది. అమరావతి మండలం నరుకుళ్ళపాడు, పరిసర గ్రామాల రైతులు దాదాపు 400 మంది వచ్చి ఈ విషయమై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ.ఎం.డి.ఇంతియాజ్, డి.ఆర్.ఒ.శ్రీలత, జెడ్పీ సీఈఓ సూర్య ప్రకాశరావు, జె.సి–2 విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. మీ కోసం కార్యక్రమానికి వచ్చిన కొన్ని ఫిర్యాదులివి. నీళ్ళు అమ్ముకుంటారా? రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం అదే రైతుల నోట్లో మట్టి కొడుతుంటే అధికారులు వేడుక చూస్తున్నారు. పాటిబండ్ల, మండెపూడి డొంక ద్వారా నరుకుళ్ళపాడు ఎం.మైనర్ కాలువకు వచ్చే నీటిని అధికార పార్టీ కార్యకర్తలు తూముల ద్వారా నీటిని మళ్లించి అక్రమంగా ట్యాంకర్ల ద్వారా విక్రయించుకుంటున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో దాదాపు 300 ఎకరాలకు నీళ్లు అందడంలేదు. బీద బడుగు వర్గాల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో స్థానిక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితంలేదు. కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయకపోతే రాస్తారోకో చేస్తాం. –కె.హరిబాబు, అల్లం దేవదానం రెడ్డి తదితరులు తహసీల్దార్ అమ్ముడుపోయి మాకు అన్యాయం చేశాడు మాది శావల్యాపురం మండలం మతుకుమల్లి గ్రామం. ఇక్కడ మాకు ఎకరం పొలం ఉంది. దీనికి పట్టాదారు, రైతు హక్కు పుస్తకం, బి–1 ఫారాలు, శిస్తు అన్నీ ఉన్నాయి. మా పొలం సరిహద్దులో ఉండే వ్యక్తికి అమ్ముడుపోయిన తహసీల్దార్, వీఆర్వోలు మాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మా అమ్మకు ఇప్పుడు 70 ఏళ్లు. అధికారులు మాకు న్యాయం చేయకపోగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. –ఎం.రంగమ్మ, కుమారుడు వికలాంగులనే కనికరం కూడా లేదా? నా కుమార్తె కమలకు వినబడదు, మాట్లాడలేదు. గతంలో మాకు మానసిక వికలాంగురాలు కింద సర్టిఫికెట్ ఇచ్చారు. వాస్తవానికి మాకు రావాల్సింది డెఫ్ అండ్ డంబ్ సర్టిఫికెట్. దీనికోసం ఎన్నో పర్యాయాలు తిరిగినా ఫలితం లేదు. జీజీహెచ్‌కు వెళ్లమని చెబుతున్నారు. అక్కడ మా గోడు వినేవాడే లేడు. గతంలోనూ కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాం. వికలాంగుల పట్ల కాస్త దయతలచండి. –జానపాటి విద్యావాణి పేదలకందని ప్రభుత్వ పథకాలు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు నెలకు రూ.35 వేలు జీతం తీసుకుంటోంది. ఆమె భర్తకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్లో రూ.2 లక్షలు రుణం కూడా పొందాడు. ఈ విషయాలను ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురించినా ఎందుకు చర్యలు చేపట్టలేదు. నేను ఎంతో కాలంగా తెల్ల రేషన్ కార్డు కోసం తిరుగుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. –ఎం.జార్జి, తాడేపల్లి -
నీరివ్వకుండా పంటలను ఎండబెడుతున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుకు సాగునీరు అందించక పోతే పాపం అన్న కేసీఆర్..ఎస్సారెస్పీ రైతులకు ఎందుకు నీరు విడుదల చేయడం లేదని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నీరు ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్న ప్రభుత్వం.. అడిగితే రైతులపై కేసులు పెడుతోందని, గ్రామాల్లో రైతులను నిర్బంధిస్తోందని విమర్శించారు. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ముందు రోడ్లపై పడిన గోతులను పూడ్చి తర్వాత ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడాలన్నారు. పబ్లిసిటీ ట్వీట్లకు తప్పా..రోడ్ల గురించి అడిగే ట్వీట్లకు కేటీఆర్ స్పందించరని ఎద్దేవా చేశారు. పోలీసింగ్‌తో నేరాలను అరికట్టామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం యాదాద్రి ఘటనలకు ఏం సమాధానం చెబుతుందన్నారు. వ్యభిచార ముఠాల అసాంఘిక చర్యలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలు, ప్రజా, మహిళా సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. -
కడుపులో పెట్టుకుని చూసుకుంటాం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలోని బీడు భూముల్లో గోదావరి, కృష్ణా జలాలు పారించే ప్రయత్నంలో భాగంగా గ్రామాలు, భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని కొచ్చగుట్టపల్లి నిర్వాసితులకు పునరావాసం, ఉపాధిలో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లిలో 140 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి బుధవారం మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రిజర్వాయర్‌లో గ్రామం మొత్తం మునిగిపోతోందని, పాత గ్రామానికి తీసిపోని విధంగా కొత్త గ్రామం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిర్వాసితుల త్యాగ ఫలంతోనే.. సంస్కృతి, సంప్రదాయాలు, తీపి గుర్తులను త్యా గం చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి చేయూతనిచ్చిన నిర్వాసితుల త్యాగఫలమే రాష్ట్రానికి సాగునీరు అని హరీశ్ అన్నారు. మల్లన్న సాగర్ కింద 8 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వారికి గజ్వేల్ పక్కనే మొట్రాజుపల్లి వద్ద నూతన గ్రామాలు నిర్మిస్తామన్నారు. మరోవైపు కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిపోయే మరో రెండు గ్రామాలకు తునికి బొల్లారం వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని తెలిపారు. 123 జీవో ప్రకారం వారికి పరిహారం ఇచ్చామన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అధిక మొత్తం లో డబ్బులు చెల్లించలేకపోతున్నామని, అందుకే 21/2017 సవరణ చట్టం కింద మెరుగైన పరిహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలు నిర్మించడం, ఉపాధి, యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి హామీనిచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
పెద్దపల్లిరూరల్/ధర్మారం: సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. ఎస్సారెస్పీ నీరు అందడంలేదని అన్నదాతలు కన్నెర్ర చేశారు. పెద్దపల్లి, ధర్మారం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి–మంథని రంగాపూర్‌లోని ఎస్సారెస్పీ కాలువ వద్ద ఆదివారం 4 గంటలపాటు బైఠాయించారు. మంగళవారం కల్లా నీరందేలా చూస్తానని డీఈఈ హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. -
ఆశలు బీడు..
మడకశిర: కర్ణాటక సరిహద్దులోని మడకశిర నియోజకవర్గం ఎత్తయిన ప్రదేశంలో ఉండటంతో వర్షం నీరు దిగువ కర్ణాటకలోని చెరువుల్లోకి చేరుతోంది. భారీ వర్షపాతం నమోదయినా ఇక్కడి చెరువుల్లో చుక్కనీరు నిలవడం కూడా గగనమవుతోంది. ఫలితంగా ఆయకట్టు బీడువారుతోంది. మొత్తం 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల పరిధిలో 13,769 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులు నిండని పరిస్థితుల్లో యేటా సగం ఆయకట్టు కూడా సాగయ్యే పరిస్థితి లేకుండా పోతోంది. ఈ కారణంగా రైతుల బతుకు భారమవుతోంది. వర్షం నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చిన్న నీటి పథకాలే శరణ్యం. ఇందులో భాగంగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో రెండు చిన్న నీటి పథకాలను మంజూరు చేశారు. ఇందులో ఒకటి నాచేపల్లి సప్లయ్ చానల్.. కాగా మరొకటి తమ్మడేపల్లి సప్లయ్ చానల్. 2006లోనే ఈ రెండింటికీ కలిపి రూ.2కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే ఆయన మరణానంతరం పాలక ప్రభుత్వాలు వీటిని పూర్తిగా విస్మరించడంతో నిధులు మురిగిపోయాయి. తమ్మడేపల్లి.. = అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి సమీపంలో ఈ చానల్‌ను నిర్మించాల్సి ఉంది. = కర్ణాటకలోని క్యాదిగుంట చెరువుకు వెళ్లే వర్షపు నీటిని తమ్మడేపల్లి చెరువులోకి మళ్లించే అవకాశం ఉంటుంది. = దాదాపు 600 ఎకరాలు సాగులోకి వస్తాయి. = భూగర్భ జలమట్టం పెరుగుతుంది. = దాదాపు 1000 వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పెరిగి మరో 500 ఎకరాలు సాగులోకి వస్తాయి. నాచేపల్లి.. = గుడిబండ మండలంలోని నాచేపల్లి వద్ద సప్లయ్ చానల్ నిర్మిస్తే వర్షపు నీటిని కర్ణాటకకు వెళ్లకుండా సద్వినియోగం చేసుకునే వీలుంది. = ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలోనే మోరుబాగల్ చెరువు అతిపెద్దది. ఈ చెరువు నిండి మరువ పడితే నీరంతా కర్ణాటకలోని బాణిగెర చెరువుకు చేరుతోంది. = ఈ నీటిని సప్లయ్ చానల్ ద్వారా నాచేపల్లి, హేమావతి చెరువుల్లోకి మళ్లిస్తే దాదాపు 750 ఎకరాలకు సాగునీటి సౌకర్యం లభిస్తుంది. కార్యరూపం దాల్చని గంగులవాయిపాళ్యం వాగు మళ్లింపు మడకశిర మండలంలోని గంగులవాయిపాళ్యం వాగును మడకశిర చెరువులోకి మళ్లించే ప్రతిపాదన ఇంత వరకు కార్యరూపం దాల్చని పరిస్థితి. ఈ వాగులో ప్రవహించే మొత్తం వర్షపు నీరంతా కర్ణాటకలోని బిదురుకెర చెరువుకి చేరుతోంది. ఈ వాగును మడకశిర చెరువులోకి మళ్లిస్తే దాదాపు 1000 ఎకరాలు సాగులోకి వస్తాయి. అంతే కాకుండా మడకశిర పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం రైతులకు శాపంగా మారుతోంది. ఫైళ్లను పరిశీలిస్తాం సప్లయ్ చానళ్ల విషయమై ఫైళ్లను పరిశీలించాల్సి ఉంది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్చించాలి. ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తాం. అధికారులతోనూ ఈ విషయమై చర్చిస్తాం. – మక్బుల్ సాహెబ్, జలవనరుల శాఖ ఎస్ఈ పొలం బీడు పెట్టుకుంటున్నా తమ్మడేపల్లి చెరువు కింద నాకు ఐదెకరాల భూమి ఉంది. సాగునీరు లేకపోవడంతో ఏనాడు కూడా పూర్తి స్థాయిలో సాగు చేయలేకపోయా. భారీ వర్షం కురిసినా ఇక్కడి చెరువు నిండని పరిస్థితి. వర్షం నీరంతా కర్ణాటక ప్రాంతంలోని చెరువుకు చేరుతోంది. యేటా పొలం బీడు పెట్టుకోవాల్సి వస్తోంది. జీవనం భారమవుతోంది. – సదానందగౌడ, రైతు, తమ్మడేపల్లి, అమరాపురం మండలం -
గోదావరి టూ కావేరి.. తెలంగాణ దారి
సాక్షి, హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానంపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అంతర్రాష్ట్ర జల వివాదాలు, ముంపు సమస్యల్లో చిక్కుకుపోయిన ఈ ప్రక్రియకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది. మూడు రాష్ట్రాల్లో లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటితోపాటు పరీవాహక ప్రాంతాల్లోని వారికి తాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చేలా కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించింది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని సూచించింది. దీనికి మొత్తంగా రూ.45,049 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు సాంకేతిక సాధ్యాసాధ్యాల ప్రతిని (టెక్నికల్ ఫీజబులిటీ నోట్) సిద్ధం చేసింది. కొత్త అధ్యయనం.. కొంగొత్త అధ్యాయం! దక్షిణాదిలో నదుల అభివృద్ధి కోసం ద్వీపకల్ప నదుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. అదనపు జలాల లభ్యత ఉన్న నదుల నుంచి ఇతర నదులకు నీటిని తరలించాలని నిర్ణయించింది. మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్నట్లుగా అంచనాలున్న దృష్ట్యా... ఆ నీటిని కృష్ణా, కావేరి పరీవాహకాలకు తరలించాలన్నది కేంద్ర ప్రయత్నం. ఇందుకోసం తొలుత తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రతిపాదించింది. కానీ ఈ నిర్ణయాన్ని ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా తప్పుపట్టాయి. దాదాపు ఏడాది పాటు మరుగున పడిన ఈ అంశం తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో తిరిగి తెరపైకి వచ్చింది. అయితే ఒడిశాలోని మణిభద్ర ప్రాజెక్టు, తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న ఇచ్చంపల్లి ప్రాజెక్టులు నిర్మించలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసింది. ఇచ్చంపల్లికి 74 కిలోమీటర్ల దిగువన ఇంద్రావతి ఉపనది గోదావరిలో కలిశాక అకినేపల్లి వద్ద సుమారు 716 టీఎంసీలు లభ్యతగా జలాలు ఉంటాయని లెక్కించింది. అందులో తెలంగాణ, ఏపీలు తమ ప్రాజెక్టులకు వినియోగించుకోగా.. 324 టీఎంసీల మేర మిగులు జలాలు ఉంటాయని అంచనా వేసింది. దీంతో అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్‌కు నీటిని తరలించేలా ప్రణాళిక వేసింది. ఈ కాలువ పెద్దవాగు, కిన్నెరసాని, మురేడు. పాలేరు, మూసీ నదులను దాటి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అనుసంధానం ప్రతిపాదనలివీ.. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉపనదులు కలసిన తర్వాత గోదావరి నది నిండుగా ప్రవహిస్తుంది. ఇచ్చంపల్లికి 63 కిలోమీటర్ల దిగువన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అవసరాలుపోగా... 50 శాతం నీటి లభ్యత ఆధారంగా 8,194 మిలియన్ క్యూబిక్ మీటర్లు(289 టీఎంసీలు), 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 12,104 మిలియన్ క్యూబిక్ మీటర్లు (427 టీఎంసీలు) మిగులు ఉంటుందని అంచనా వేసింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో అకినేపల్లి బ్యారేజీ నుంచి రోజుకు 62.3 మిలియన్ క్యూబిక్ మీటర్ల (సుమారు రెండు టీఎంసీలు) చొప్పున తరలించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలోని ప్రధాన అంశాలు.. – గోదావరి నదిపై అకినేపల్లి వద్ద 590 మిలియన్ క్యూబిక్ మీటర్ల (సుమారు 20 టీఎంసీలు) నిల్వ సామర్థ్యంతో 72.50 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలి. దీనితో 12 వేల హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుంది. అయితే ఈ భూమి అంతా నదీ గర్భంలోనే ఉంటుంది కాబట్టి ముంపు సమస్య ఉండదు. – అకినేపల్లి బ్యారేజీ నుంచి 30 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. తర్వాత కాలువ ద్వారా 4.3 కిలోమీటర్ల దూరం తరలిస్తారు. అక్కడి నుంచి తిరిగి 100.57 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తారు. 324.2 కిలోమీటర్ల పొడవున కాలువ, 12.50 కిలోమీటర్ల సొరంగాల ద్వారా గ్రావిటీతో నాగార్జునసాగర్‌కు నీరు చేరుతుంది. – నాగార్జునసాగర్ కుడిగట్టు వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మిస్తారు. దాని నుంచి 393.02 కిలోమీటర్ల పొడవైన కాలువల(1.265 కిలోమీటర్ల సొరంగం కలిపి)ద్వారా నీటిని సోమశిల (పెన్నా) రిజర్వాయర్‌కు తరలిస్తారు. – సోమశిల రిజర్వాయర్ కుడిగట్టుపై రెగ్యులేటర్ నిర్మిస్తారు. దాని నుంచి కండలేరు వరద కాలువకు సమాంతరంగా 529.19 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వి తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కావేరీ నదిపై నిర్మించిన గ్రాండ్ ఆనకట్టకు జలాలను చేరుస్తారు. – మొత్తంగా ఈ అనుసంధానం పూర్తి చేయడానికి రూ.45,049 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. దీనిని రెండు దశల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. తొలిదశలో అకినేపల్లి–నాగార్జునసాగర్ వరకు.. రెండో దశలో నాగార్జునసాగర్–సోమశిల–కావేరీ గ్రాండ్ ఆనకట్ట వరకు పనులు చేస్తారు. మూడు రాష్ట్రాలకూ ప్రయోజనకరమే.. నదుల అనుసంధానంతో మూడు రాష్ట్రాలకూ ప్రయోజనం దక్కుతుందని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సాగు అవసరాలు తీరడంతో పాటు పరీవాహక గ్రామాల తాగు అవసరాలు, పరిశ్రమల నీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనల ప్రకారం.. అనుసంధానంతో మొత్తంగా 11.16 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇందులో తెలంగాణలో 3.10 లక్షల హెక్టార్లు, ఏపీలో 4.04 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4.01 లక్షల హెక్టార్లకు నీరందుతుంది. ఆయకట్టులో పండించే పంటలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కాలువ గట్లపై పండ్ల మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ.13,354 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది. జలాల తరలింపు ఇలా.. గోదావరి నుంచి కృష్ణాకు: 247 కృష్ణా నుంచి పెన్నాకు: 143 పెన్నా నుంచి కావేరికి: 88.83 రాష్ట్రాల వారీగా ఉండే ఆయకట్టు.. (హెక్టార్లలో) రాష్ట్రం ఆయకట్టు తెలంగాణ 3,10,200 ఏపీ 4,04,600 తమిళనాడు 4,01,400 మొత్తం 11,16,200 వ్యయ అంచనాలు ఇవీ.. (రూ.కోట్లలో) అనుసంధానం వ్యయం గోదావరి–కృష్ణా 16,868 కృష్ణా–పెన్నా 14,822 పెన్నా–కావేరి 13,359 మొత్తం 45,049 -
సాగునీటి కోసం రైతులు పోరాటం..
-
నీటివాటాలో సీమకు అన్యాయం
- సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం - ఉద్యమించకుంటే మిగిలేది కన్నీరే - 21న నంద్యాలలో జల చైతన్య సభ - సీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి కర్నూలు సిటీ: నీటివాటాలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి ఆరోపించారు. బుధవారం కర్నూలులోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ సోమశేఖర్ శర్మ(అరుణ్), హంద్రీనీవా పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సాధన సమితి నాయకులు తిరుపతి రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడారు. సీమలో ప్రకృతి వనరుల లభ్యత అధికంగా ఉన్నా.. వినియోగంలో మాత్రం చాలా వెనుకంజలో ఉన్నామన్నారు. రాయలసీమ అంటే కరువు ప్రాంతం అని గుర్తుకు వచ్చేందుకు ప్రకృతి వైపరీత్యాలు కారణం కాదని, పాలకుల నిర్లక్ష్యం, ప్రజలలో సరైన అవగహన లేకపోవడమేనన్నారు. నీటి వాటాలపై చట్టబద్ధత ఏదీ? రాష్ట్రం విస్తీర్ణం 394.88 లక్షల ఎకరాలని, ఇందులో 41.99 శాతం రాయలసీమలోను, దక్షణ కోస్తాలో 43.32 శాతం, ఉత్తర కోస్తాలో 14.69 శాతం భూములు ఉన్నాయన్నారు. ఇందులో సాగుకు యోగ్యమైన భూమి 45.37 శాతం(98.95 లక్షల ఎకరాలు), దక్షిణ కోస్తాలో 41.78 శాతం(91.14 లక్షల ఎకరాలు), ఉత్తర కోస్తాలో 12.85 శాతం(28.03 లక్షల ఎకరాలు) ఉందన్నారు. రాయలసీమలో వ్యవసాయ యోగ్యమైన భూమి 15.5 శాతం మాత్రమేనన్నారు. దక్షిణ కోస్తాలోని కృష్ణా, గూంటురు జిల్లాల్లో 83.5 శాతం భూమికి సాగు నీటి సదుపాయం ఉందన్నారు. అయినా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు ఆ ప్రాంతంలోనే నిర్మిస్తోందని ఆరోపించారు. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న జిల్లాలకు నిధులు, నీళ్లు కేటాయిస్తున్నారని, దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా డెల్టాకు సాగు నీటి కోసం పులిచింతల, పట్టిసీమ, పోలవరంతో పాటు మొత్తం 6 స్థీరికరణ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. రాయలసీమలో మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్నారు. పట్టిసీమ, పులిచింతల ద్వారా ఎన్ని నీళ్లు ఇస్తున్నారో.. అదే స్థాయిలో శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చట్టబద్ధథ కల్పించాలన్నారు. పట్టిసీమతో సీమ సస్యశ్యామలమని చెప్పి అధికార పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. మేల్కోకపోతే కన్నీటి కష్టాలు.. కరువు సీమను కాపాడేందుకు ప్రజలంతా ఏకం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే మిగులు జలాలపై నిర్మించిన ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలన్నారు. సీమలో ఒక్కో జిల్లాకు 100 టీఎంసీల నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల21వ తేదీన నంద్యాలలో జరిగే జల చైతన్య సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
కంకణధారులై..
ఆత్మకూరురూరల్: సాగునీటి సాధన కోసం ఈ నెల 21వ తేదీ నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న జల చైతన్య సదస్సును విజయవంతం చేసేందుకు రైతులు కంకణధారులవుతున్నారు. బొజ్జా దశర«థ రామిరెడ్డి నాయకత్వంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి..రైతులను జాగృతం చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు, నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లెలో సన్నాహక సమావేశాలు జరిపారు. ఈ సమావేశాల్లో రైతుల చేత హరిత కంకణధారణ చేయించారు. సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలని, కృష్ణా నది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని బొజ్జా దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. -
సాగునీటిపై చంద్రబాబువి తప్పుడు లెక్కలు
– రేపు వందకేంద్రాల్లో సాగునీటి కోసం సత్యాగ్రహాలు - బొజ్జ దశరథరామిరెడ్డి వెల్లడి నంద్యాలరూరల్: సాగునీటి విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబువి అన్ని తప్పుడు లెక్కలు అని, రాయలసీమకు ఆయన తీరని అన్యాయం చేస్తున్నారని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. శనివారం నంద్యాలలోని మాజీ ఎంపీ బొజ్జా వెంకటరెడ్డి గృహంలో సాగునీటి సత్యాగ్రహం వాల్‌పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బొజ్జదశరథరామిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమకు 500 టీఎంసీల నీరు అందిస్తామని బాబు చెప్పడం పచ్చి అబద్ధంగా అభివర్ణించారు. పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీరు ఇస్తామని చెప్పి చుక్కనీరు ఇవ్వలేదని మండిపడ్డారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ పెద్దలు మభ్యపెట్టి మోసం చేయడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలకు వివరించి రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసేందుకు రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేడపతున్నామన్నారు. ఈనెల 3వ తేదీ సోమవారం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అన్ని మండల ముఖ్య కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సీమ సత్యాగ్రహం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, నంది రైతు సమాఖ్య నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, కేసీ పరిరక్షణ సమితి కన్వీనర్ బాలీశ్వరరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు మహేశ్వరరెడ్డి, బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి తూముశివారెడ్డి, ప్రచార కార్యదర్శి కానాల సుధాకరరావు‡, తదితరులు పాల్గొన్నారు. -
తడారి.. చేలు ఎడారి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కాలువలు తడారుతున్నాయి. చేలు ఎడారులను తలపిస్తున్నాయి. రబీలో సాగునీటి ఎద్దడి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వంతులవారీ విధానం సక్రమంగా అమలు కాకపోవడంతో శివారు ప్రాంతాల్లోని చేలు నీరందక బీటలు వారుతున్నాయి. అయితే, చేపల చెరువులకు మాత్రం మోటార్ల సా యంతో యథేచ్ఛగా నీటిని తోడేసుకుంటున్నారు. దీంతో వరి పండిం చే డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా.. 80 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని స్పష్టం చేసింది. సాధారణం గా రబీకి చివరి రోజుల్లో సీలేరు నుంచి అదనపు జలాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది తొలి దశలోనే సాగునీటి ఎద్దడి తలెత్తిం ది. నాట్లు పూర్తికాకుండానే జనవరి 22 నుంచి వంతులవారీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీనివల్ల శివారు ప్రాంతాల్లోని 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా నీరు అందటం లేదు. చాలాచోట్ల ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీరు తోడుకోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల పం ట కాలువలు, బోదెలు నీరులేక తడారిపోవడంతో పొలాలు ఎండిపోయి బీటలు వారుతున్నాయి. ఇదిలావుంటే.. వంతులవారీ విధా నం అమలయ్యే ప్రాంతాల్లో చేపల చెరువులకు కాలువ నీటిని తోడేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు, ఉండి నియోజకవర్గాలో కొన్నిచోట్ల వరి పొలాలు బీటలు వారుతున్నా యి. నీటికోసం రైతుల మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి దుబ్బు కట్టే దశలో ఉంది. పొట్ట దశ, ఈనిక దశలో నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఆ సమయంలో తగినంత నీరు అందకపోతే ఎలుకలు చేరి పంటను నాశనం చేస్తాయి. ఇప్పటికే తెగుళ్లు ఆశించి పురుగు మం దుల కోసం ఎక్కువ పెట్టుబడి పె ట్టాల్సి వస్తోంది. ప్రస్తుత అవసరాలకు 6 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే తప్ప శివారు ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేదు. అయితే, 4 వేల క్యూసెక్కులకు మించి నీరివ్వడం లేదు. మరోవైపు పంట కాలువల్లో గుర్రపుడెక్క, తూడు, కర్రనాచు పెరిగిపోయింది. వీటిని తొలగించే చర్యలు చేపట్టలేదు. పంట బోదెలు ఆక్రమణలకు గురికావడంతో కుచించుకుపోయా యి. డెల్టా ఆధునికరణ పనులు సక్రమంగా జరగకపోవడం వల్లే శివారు ప్రాంతాలకు నీరందని ప రిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి ఆ ధునికీకరణ పనులు కొనసాగుతూ నే ఉన్నాయి. రైతులు ఇప్పటికే ఎకరాకు రైతులు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. నీటిసమస్య వల్ల దిగుబడి తగ్గితే నష్టపోవాల్సి వస్తుంది. చాలాచోట్ల లస్కర్ల కొరత వల్ల వంతులవారీ విధానం కూడా సక్రమంగా అమలు కా వడం లేదు. గత ఏడాది శివారు ప్రాంతాలకు అయిల్ ఇంజిన్లు పెట్టుకుంటే ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా చాలాచోట్ల అమలు కాలేదు. ఈ రబీలో ఆ భరోసా కూడా రైతులకు లేకుండా పోయింది. -
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా
- మార్చి 20 వరకు నీరస్తామని కలెక్టర్ మాట తప్పారు - కేసీ, హంద్రీనీవా ఆయకట్టు రైతులను ఆదుకోండి - నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కల్లూరు(రూరల్): హంద్రీనీవా, కేసీ కెనాల్ ఆయకట్టు కింద సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా ఎవరికీ పట్టడం లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయకట్టు రైతులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సమృద్ధిగా నారు పోసి పంటలు సాగు చేస్తున్న సమయంలో ఈ నెల 3వ తేదీన హంద్రీనీవా పథకం 2 పంపులు, కేసీ కెనాల్‌కు 2 పంపులను బంద్ చేయించారన్నారు. విషయాన్ని కలెక్టర్ విజయమోహన్ దృష్టికి తీసుకెళ్లడంతో 4వ తేదీన మళ్లీ హంద్రీనీవా, కేసీ కెనాల్ సాగునీటిని విడుదల చేశారన్నారు. తిరిగి 10వ తేదీ శుక్రవారం హంద్రీనీవా, కేసీ కెనాల్‌కు సాగునీటిని నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. మార్చి 20 వరకు సమృద్ధిగా సాగునీటిని అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో సమస్యను ఫోన్లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడండని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడితే కలెక్టర్, ఎస్ఈ, సీఈతో మాట్లాడి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని స్పష్టం చేశారు. హంద్రీనీవా, కేసీ కెనాల్ నుంచి వచ్చే 800 క్యూసెక్కుల సాగునీరు నిలిచిపోయిందన్నారు. రైతులను టీడీపీ ప్రభుత్వం నానా అవస్థలకు గురి చేస్తోందని మండిపడ్డారు. శ్రీశైలం జలాశయం 886 అడుగుల ఉందని, హంద్రీనీవా మల్యాల, ముచ్చుమర్రి వద్ద 846 అడుగులు ఉన్నా రైతులకు నీళ్లు ఎందుకివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏమైనా అయితే ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలని చెప్పారు. అనంతపురం జిల్లాకు హంద్రీనీవా నుంచి పుష్కలంగా నీళ్లు పారుతున్నాయని చెప్పారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీనీవా, కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేంత వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు. సంకిరేణిపల్లె మాజీ సర్పంచ్ కె. పక్కీరయ్య మాట్లాడుతూ రబీ సీజన్లో మినుములు, వేరుశనగ, వరి, కంది పంటలు వేసుకున్నామని, సాగునీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలంటే లేదంటే పంటలు ఎండిపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. సమావేశంలో రైతులు ప్రభాకర్‌రెడ్డి, కేశవరెడ్డి, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, కురువన్న, ఈశ్వరయ్య, కె మల్లయ్య, ఆనంద్, బాలయ్య, చిన్న కురుమన్న, నాగేశ్వరరావు, గోపన్న, నాగమల్లయ్య పాల్గొన్నారు. -
పంటకు తంటా
వంతులవారీ విధానంతో కష్టాలు చేలకు నీరందక అన్నదాతల అవస్థలు దువ్వ చానల్లో పేరుకుపోయిన కర్ర నాచు తణుకు టౌన్ : వంతులవారీ విధానం రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. గోదావరిలో పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో లేకపోవడంతో జల వనరుల శాఖ అధికారులు వంతులవారీ విధానంలో కాలువలకు నీరందిస్తున్నారు. కాలువల్లో కర్ర నాచు పెరిగిపోవడం, నీటిమట్టాలు దిగువ స్థాయిలో ఉండటంతో దాళ్వా పంటకు వంతు సమయంలోనూ నీరందటం లేదు. ముఖ్యంగా అత్తిలి, జీ అండ్ వీ కెనాల్ ఆయకట్టు పరిధిలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. తణుకు నియోజకవర్గంలో దువ్వ చానల్ ద్వారా తణుకు మండలం దువ్వ, అత్తిలి మండలం వరిఘేడు, తిరుపతిపురం, బి.కొందేపాడు, ఎగువన ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి, సూర్యారావుపాలెం ఆయకట్టు పొలాలకు సాగునీరు అందటం లేదు. ఈ కాలువకు ఇచ్చిన వంతు సమయంలో అతి స్వలంగానే చేలకు నీరు వచ్చింది. జనవరి 27నుంచి వంతు ముగియడంతో ఈ కాలువ ఆయకట్టు పరిధిలోని చేలు తడారి ఎండిపోతున్నాయి. కర్ర నాచుతో అవస్థలు సాగుకు సమాయత్తం కార్యక్రమం పేరిట పశ్చిమ డెల్టాలో పలు కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టినా దువ్వ కాలువను పూర్తిగా వదిలేశారు. పూడిక పేరుకుపోవడం, కర్రనాచు పెరగడంతో ఈ కాలువలో నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. ఫలితంగా శివారు ప్రాంతాలైన వరిఘేడు, తిరుపతిపురం, బి.కొండేపాడు ఆయకట్టులోని పొలాలకు నీరందక ఎండుతున్నాయి. ఽ రైతులపైనే భారం పూడిక, కర్రనాచు తొలగింపు పనులను జల వనరుల శాఖ చేపట్టాల్సి ఉండగా.. అధికారులు గాలికొదిలేశారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దిక్కులేని పరిస్థితుల్లో వరిఘేడు, తిరుపతిపురం, బి.కొండేపాడు నీటి సంఘాల బాధ్యుల ఆధ్వర్యంలో సుమారు 500 మంది రైతులు కాలువలోని కర్రనాచును స్వచ్ఛందంగా తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. పసలపూడిలో గొడిచర్ల లాకుల నుంచి ఈ పనులు చేపట్టారు. దువ్వ, తిరుపతిపురం, వరిఘేడు, బి.కొండేపాడు గ్రామాలకు చెందిన రైతులు వ్యయప్రయాసలతో కర్ర నాచు తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. డెల్టాలో నవంబర్‌లో చేపట్టిన కాలువల తవ్వకం, నాచు తొలగింపు పనులను ఈ కాలువ పరిధిలో చేయకపోవడం వల్ల తమకు ఈ కష్టాలొచ్చాయని రైతులు వాపోతున్నారు. ఈ కాలువలో పనులు చేపట్టకపోవడం వల్ల సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. వరినాట్లు పూర్తిచేసి నెల రోజులైనా ఇప్పటికీ మొదటి విడత ఎరువులు వేయలేదని, ప్రస్తుతం రెండవ విడత ఎరువులు వేయాల్సి ఉన్నా నీరు సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు చేలు ఎండిపోవడం, మరోవైపు కలుపు పెరిగిపోవడంతో పంటల్ని కాపాడుకునేందుకు అంతా కలిసి కాలువను ప్రక్షాళన చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. చేలు ఎండిపోతున్నాయ్ వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా కొన్ని చేలలో మొదటి విడత ఎరువులు చల్లలేదు. కొన్ని పొలాల్లో ఎరువులు వేసినా.. సాగు నీరందక కలుపు విపరీతంగా పెరిగిపోయింది. మొదట్లోనే ఈ కాలువలో పూడిక తీయిస్తే ఈ రోజున ఇబ్బందులు వుండేవి కాదు. బోడపాటి వెంకట సూర్యనారాయణ, నీటి సంఘం డైరెక్టర్, వరిఘేడు, అత్తిలి మండలం నీరందట్లేదు వరి చేలకు సాగు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దాళ్వా పంటకు ఇప్పుడే ఇలా వుంటే మున్ముందు ఇంకెన్ని కష్టాలు పడాలోనని భయంగా ఉంది. సాగు నీటి కోసం రాత్రి పగలు తేడా లేకుండా కాలువ గట్ల వెంట తిరిగినా ఫలితం ఉండటం లేదు. దువ్వ చానల్లో నీటిమట్టం తక్కువగా రావడంతో చేలకు నీరు సరిపోవడం లేదు. కాలువలో పెరిగిపోయిన కర్ర నాచు వల్ల నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. దొంగ వెంకటేశ్వరరావు, నీటి సంఘం డైరెక్టర్, తిరుపతిపురం, అత్తిలి మండలం దువ్వ కాలువపై నిర్లక్ష్యం వరి పంటకు సాగు నీరందించే విషయంలో అధికారులు దువ్వ కాలువను నిర్లక్ష్యం చేస్తున్నారు. వంతులవారీ విధానంలో నీరిచ్చనా.. నాలుగు రోజులుగా నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. మొదటి నుంచీ ఈ కాలువలో పూర్తిస్థాయి నీటి ప్రవాహం లేదు. పొలాలు అరకొరగానే తడుస్తున్నాయి. కొన్నిచోట్ల బీటలు వారుతున్నాయి. అధికారులు స్పందించి కాలువలో ఉన్న కర్ర నాచును పూర్తి స్థాయిలో తొలగించాలి. అరిగెల బాబి, వైఎస్సార్ సీపీ నాయకుడు, దువ్వ సాగు ఆలస్యమవుతుందని.. దువ్వ చానల్లో పేరుకుపోయిన కర్ర నాచును తొలగించడానికి.. కాలువ తవ్వడానికి ప్రతిపాదనలు చేశాం. అయితే, సాగు ఆలస్యమవుతుందని రైతులు అభ్యంతరం చెప్పడంతో ఆ పనులు చేపట్టలేదు. ప్రస్తుత వంతులవారీ విధానంలో నీటిమట్టం తగ్గడంతో శివారు పొలాలకు సాగు నీరందడం కష్టంగా ఉంది. రైతులు కర్ర నాచు తొలగించుకుంటున్నారు కాబట్టి ఇబ్బందులు తొలగిపోతాయి. జీఎస్ హరికిషన్, ఇరిగేషన్ ఏఈ, తణుకు -
బాబు పాలనలోనే సీమకు అన్యాయం
బనగానపల్లె రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలోనే రాయల సీమకు సాగు నీటి విషయంలో పూర్తి అన్యాయం జరిగిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. మంగళవారం బనగానపల్లె పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో రాయలసీమ సాగునీటి సాధన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ శైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులను జీవో నంబర్ 69 ద్వారా తగ్గించింది చంద్రబాబునాయుడేనని చెప్పారు. రాయలసీమకు సాగునీరు, తాగు నీరు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే 1996లో ఆ జీవో విడుదల చేశారని ఆరోపించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమేనన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో పథకం నిర్మాణం అగిపోయిందన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితితో పాటు ఇక్కడి రైతులు చేస్తున్న ఉద్యమాలకు కంటితుడుపు చర్యగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని బాబు ప్రారంభించారన్నారు. బాబుకు ధైర్యం ఉంటే పట్టిసీమ ద్వారా రాయలసీమకు వచ్చే 191 టీఎంసీల నీటి హక్కులపై చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు. సీమకు ఇచ్చే నీటి విషయంలో చట్టబద్ధత కల్పించాలని మే నెలలో నంద్యాల లేదా సిద్ధేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ ఎత్తున రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ ఎ. రామచంద్రారెడ్డి, నంద్యాల రైతు సంఘం నాయకులు వై.ఎన్.రెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు జిల్లెల్ల శివరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు దొనపాటి యాగంటిరెడ్డి, మహానందరెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలకే నీరు!
– జీడీపీ కింద రబీలో 24,372 ఎకరాల ఆయకట్టు – ప్రాజెక్టులో 1.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ - 6, 500 ఎకరాలకే సాగు నీరు! – విడుదలకు అనుమతులు ఇచ్చిన కలెక్టర్ కర్నూలు సిటీ: హంద్రీ నదిపై నిర్మించిన గాజులదిన్నె మధ్య తరహా ప్రాజెక్టు కింద ఆరు తడి పంటలకు మాత్రమే సాగు నీరు ఇవ్వనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ శనివారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అనుమతులు ఇచ్చారు. అయితే, 6500 ఎకరాలకు మాత్రమే ఆనీరు అందనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు కింద కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, కృష్ణగిరి మండలాలకు చెందిన 24,372 ఎకరాల ఆయకట్టు, 21 గ్రామాలకు తాగు నీరు అందించాలని లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో ఆయకట్టు లేదు. జీడీపీకి ఈ ఏడాది గతంలో ఎప్పుడు కూడా లేనంతా నీరు వచ్చి చేరింది. అయితే, తుంగభద్ర దిగువ కాలువ నీరు చివరి ఆయకట్టుకు రాకపోవడం, వర్షాలు సకాలంలో కురవక పోవడంతో ఎండుతున్న ఖరీఫ్ పంటలకు నీరు ఇచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన ఇంజినీర్లు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీరు ఇచ్చారు. అయితే, జీడీపీ కింద రబీ ఆయకట్టు 24,372 ఎకరాలకు నీరు వస్తుందనే అశతో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పుడు 6500 ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చేందుకు కలెక్టర్ అనుమతులు ఇవ్వడంతో వారికి దిక్కుతోచడం లేదు. పట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలు, అధికారులు ఖరీఫ్ పంటలు కాపాడామని చెప్పుకుంటున్న నేతలు, అధికారులు హంద్రీనీవా ద్వారా ఎక్కువ నీటిని తీసుకువచ్చి రబీలో సైతం ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే, ఆ దిశగా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం పందికొన నుంచి హంద్రీనీవా నీరు జీడీపీకి రోజుకు 200 క్యుసెక్కుల చొప్పున వదులుతున్నారు. కానీ ప్రాజెక్టులోకి గత నెల 3 నుంచి 379 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నీటి విడుదలను 500 క్యుసెక్కులకు పెంచడానికి అవకాశం ఉన్నా అధికారులు ఆ వైపు దృష్టి పెట్టడం లేదు. 24,372 ఎకరాల ఆయకట్టుకు 2.5 టీఎంసీల నీరు అయితే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న 1.8 టీఎంసీల నీటికి హంద్రీనీవా నీటి విడుదలను పెంచితే పంటలకు పూర్తిసాయిలో నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. మనకేందుకులే అనే ధోరణిలో అధికారులు ఉండడంతో స్థిరీకరించిన ఆయకట్టులో 25 శాతానికి మాత్రమే నీరు అందనుంది. ఇచ్చే నీటిలో అధిక శాతం డిప్యూటీ సీఎం సొంత మండలమైన కృçష్ణగిరి మండలానికి వెళ్లే కుడి కాలువ కింద ఆయకట్టే అధికంగా ఉంది. ఎడమ కాలువ కింద పత్తికి ఒక తడి నీరు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిసింది. కుడి కాలువకు ఇప్పటికే నీటిని విడుదల చేయగా ఎడమ కాలువకు నేడు విడుదల చేయనున్నారు. 6,500 ఎకరాలకే సాగునీరు – లక్ష్మన్‌కుమార్, జీడీపీ డీఈఈ జీడీపీ నుంచి రబీకి నీరు విడుదల చేసేందుకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. 6500 ఎకరాలకు మాత్రమే నీరు ఇస్తాం. మిగతా ఆయకట్టుకు ఇప్పటికే ఖరీఫ్‌లో నీరు ఇచ్చాం. ఇవ్వని ఆయకట్టుకు మాత్రమే నీరు ఇవ్వనున్నాం. కుడి కాలువకు నీరు విడుదల చేశాం. -
ప్రణాళిక కొత్తది..ప్రతిపాదనలు పాతవే
– అభిప్రాయ సేకరణకు ప్రచారం కరువు – కొత్త ప్రాజెక్టులు సూచించాలన్న అధికారులు – పాత వాటికే దిక్కులేదన్న ప్రజా సంఘాలు కర్నూలు సిటీ: జిల్లాలో సాగు నీటి వనరుల పెంపు కోసం అభిప్రాయణ సేకరణ ప్రణాళిక కొత్తదే అయినా..ప్రతిపాదనలన్నీ పాతవే వచ్చాయి. శుక్రవారం స్థాని జెడ్పీ హాల్లో జల వనరుల శాఖ అభిప్రాయ సేకరణ చేపట్టింది. సీఈ నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఎస్ఈలు చంద్రశేఖర్ రావు, సూర్యకూమార్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీసీఈ జి.విశ్వనాథం హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందే ఇంజినీర్లు.. గతంలో ప్రతిపాదనలు చేసిన ప్రాజెక్టులు కాకుండా కొత్తవాటిని సూచించాలని ప్రజా సంఘాల నాయకులను కోరారు. ఈ సందర్భంగా ఆదోనికి చెందిన ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. పాత ప్రాజెక్టులే దిక్కులేదన్నారు. జల వనరుల శాఖకు సంబంధించిన ప్రణాళిక తయారులో శాఖల మధ్య సమన్వమం లేదన్నారు. కలెక్టర్ సూచించిన వాటినే ఇంజినీర్లు చెప్పడం కాకుండా ఇంజినీర్లు కలెక్టర్‌కు చెప్పే స్థాయిలో ఉండాలన్నారు. జీఆర్పీ నుంచి ఈ ఏడాది చుక్క నీరు ఇవ్వలేదన్నారు. దీంతో జీఆర్పీ ఈఈ నారాయణ స్వామి మాట్లాడుతూ.. అన్ని స్కీమ్‌ల నుంచి నుంచి నీరు ఇచ్చామని కావాలంటే చూపిస్తామన్నారు. – ఎల్ఎల్సీ నీటి పరిరక్షణ సమతి సభ్యులు సాయిబాబు మాట్లాడుతూ.. చింతకుంట వాగు, మెదేహాలు వాగు, హాలహర్వి వాగు, హరివాణం గజ్జి వాగు, ఎరిగేరి–బదినేహాళల్ళు మధ్య రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ఈ వాగుల నుంచి ఏడాదికి సగటున 3 నుంచి 5 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం మేళిగనూరు దగ్గర తుంగభద్రపై ఆనకట్ట నిర్మించాలనే సూచన వచ్చింది. ఈ సమావేశంలో ఆయా ప్రాజెక్టుల ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు. -
సాగునీరివ్వకుంటే రైతుల ఆగ్రహానికి గురవుతాం
డెల్టాకు 26న నీరు విడుదల నాన్ డెల్టా అధ్యయానికి కమిటీ ఏర్పాటు సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలను విజయవంతం చేయాలి పింఛన్లు, ఇండ్లు ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్లలేమన్న నాయకులు సభావేదికపైకి పిలవకపోవడంపై అలిగిన నేతలు టీడీపీ సమన్వయ, కార్యవర్గ సమావేశంలో మంత్రులు శిద్దా, నారాయణ సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో రెండోపంటకు నీరివ్వకుంటే రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని, ఐఏబీ సమావేశం పెట్టకుండా నీటి విడుదలను జాప్యం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయించింది. జిల్లా నాయకులు నీటి సమస్యను జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 26వ తేదిన డెల్టాకు నీరు విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రులు జిల్లా నేతలతో చర్చించారు. ప్రధానంగా డెల్టాకు ఈ నెల 26న నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నాన్‌డెల్టాకు ఎంత నీరు కావాలన్న దానిపై అధ్యయనం చేసేందుకు వ్యవసాయ అధికారులతో కమిటీ ఏర్పటు చేయాలని సూచించారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా నవంబర్ 1న జరిగే ఐఏబీ సమావేశంలో జిల్లా కలెక్టర్ తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు శిద్దా, నారాయణలు సూచించారు. జిల్లాలోని మెట్టప్రాంతాల్లో తాగునీరు ఎద్దడి ఏర్పడకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీకి చెందిన ఉపాధ్యాయులు, పట్టభద్రులతో పాటు ఇతర పార్టీçల నుంచి వచ్చేవారిని కలుపుకుని పోయి విజయం కోసం పనిచేయాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు, జనచైతన్యయాత్రలపై.. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నవంబర్ 1వ తేదినుంచి జరుగు పార్టీ సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని మంత్రులు శిద్దా, నారాయణలు ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నరేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలను వివరించి ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించాలని తెలిపారు. ప్రజల సమస్యలను పార్టీ నాయకత్వం, అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయతం చేయాలని సూచించారు. దీంతో కొంత మంది నాయకులు జిల్లాలో ఎక్కువ మంది ఫించన్లు, ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని.. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలను ఏ విధంగా నిర్వహించాలని మంత్రులను నిలదీశారు. మండలంలో ఏ ఒకరిద్దరకో అందకపోతే అది సాకుగా తీసుకుని చెప్పడం సరికాదని వారు బదులిచ్చారు. రాష్ట్రం అర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధికి సీఎం పాటుపడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని మంత్రులు జిల్లా నాయకులను ఆదేశించారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయిందని, పార్టీలో ఒకరి మీద ఒకరూ చాడీలు చెప్పుకుంటూ అంతర్గతంగా కొట్లాడుకుంటే ప్రతిపక్ష పార్టీ దానిని అడ్వాంటేజిగా తీసుకుని బలపడుతుందని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకుని పోయి పనిచేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల మీద ఉంటుందన్నారు. పదవుల విషయాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నాయకుల పనీతీరుపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నారని, సర్వే ఆధారంగా వచ్చిన నెగెటివ్ పాయింట్లను ఆయా నియోజకవర్గ నేతలకు తెలియజేశారని, వాటిని సరిదిద్దుకోవాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మండల కమిటీ సమావేశాలను వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. అలిగిన నేతలు జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశంలో సభావేదికపైకి పిలవలేదంటూ కొందరు పార్టీ నేతలు సమావేశం నుంచి అలిగి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. సభా వేదికపై నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రమేష్‌రెడ్డిలు రాగా.. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పేర్లు లేవని కిందికి దిగిపోవాలని సూచించారు. ఇదే తరహాలో రాష్ట్ర మహిళా నాయకురాలు తాళ్లపాక అనూరాధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడికి కూడా అవమానం జరగడంతో నలుగురూ సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఈ విషయం జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
సాగునీటి కోసం ఉద్యమిద్దాం
యాదగిరిగుట్ట : భువనగిరి, ఆలేరు ప్రాంతానికి సాగు, తాగు నీటి కోసం ఉద్యమానికి సిద్ధమవుతామని మాజీమంత్రి, టీడీపీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగు నీటి కోసం మిషన్ భగీరథ ప్రవేశపెట్టే బదులు ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో గంధమల్ల, బస్వాపూర్‌లో రిజర్వాయర్లు వేగంగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటు తపాస్‌పల్లి ద్వారా రాజాపేట, ఆలేరు మండలాలకు నీరిందించాలన్నారు. జిల్లా సాధించిన మాదిరిగా, గోదావరి జలాలు సాధించి తీరుతామన్నారు. అనంతరం తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు రాజకీయ, భూ వ్యాపార బ్రోకర్లుగా అవతారమెత్తి ప్రజలను జలగల్లా పీల్చుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలపైనే పోలీసులతో లాఠీచార్జ్ చేయించిన ఘనత గొంగిడి సునీతకే దక్కిందన్నారు. టీ డీపీ మండల అధ్యక్షుడు దడిగె ఇస్తారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పల్లెపాటి బాలయ్య, రాజాపేట మండల అధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్, ఆకుల రాజేష్, ఆరె శ్రీను, గొట్టిపర్తి శ్రీనివాస్‌గౌడ్, కందుల మల్లేష్, పులుగం భిక్షపతి, రేగు బాలనర్సయ్య, చల్లూరి స్వామి, మచ్చ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ ఆశలు గల్లంతే!
1.84 లక్షల ఎకరాల్లో పడని నాట్లు 4.50 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డా నీటి కొరతతో ఎండిపోయే ప్రమాదం బ్యారేజ్ నుంచి అరకొరగా నీటి విడుదల మచిలీపట్నం: ఖరీఫ్ సాగుపై ఆశలు గల్లంతవుతున్నాయి. సెప్టెంబరు నెల 15 రోజులు దాటినా పూర్తిస్థాయిలో కాలువలకు నీరు విడుదల చేయలేదు. ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా మంగళవారం నాటికి 4.50 లక్షల ఎకరాల్లో సాగు నమోదైనట్లు వ్యవసాయాధికారులు లెక్క తేల్చారు. మిగిలిన 1.84 లక్షల ఎకరాల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. అరకొరగా సాగునీటిని విడుదల చేస్తుండటం, వరుణుడు గత పది రోజులుగా ముఖం చాటేయడంతో పైరు ఎండిపోయే దశకు చేరుతోంది. నీరు లేక ఇప్పటికే సాగు చేసిన వరిపైరులో ఎదుగుదల కనిపించటం లేదు. ఈ ఖరీఫ్ సీజన్ రైతుల కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సముద్రంలోకి వదులుతారు తప్ప... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమైనా పూర్తిస్థాయిలో అన్ని కాలువలకు మూడు రోజులకు మించి సాగునీటిని విడుదల చేయలేదు. జూన్, జూలై నెలల్లో వర్షాలు కురిసినా అప్పటికి సాగునీటిని కాలువలకు వదలలేదు. పుష్కరాల అనంతరం ప్రకాశం బ్యారేజీకి వరదనీరు వచ్చినా ఆ నీటిని సముద్రంలోకి వదిలారు తప్ప కాలువలకు విడుదల చేయని పరిస్థితి నెలకొంది. కృత్తివెన్ను మండలంలోని నీలిపూడి, కొమాళ్లపూడి, కృత్తివెన్ను, లక్ష్మీపురం, గరిసిపూడి తదితర ప్రాంతాలకు నేటికీ నీరు చేరలేదు. ప్రధాన కాలువలకు సక్రమంగా నీరు రాకపోవటంతో 15శాతానికి మించి ఈ మండలంలో వరినాట్లు పూర్తికాని దుస్థితి. బంటుమిల్లి చానల్లో మల్లేశ్వరం వంతెన వద్ద రెండు అడుగులకు మించి నీటిమట్టం పెరగటం లేదు. దీంతో రైతులు ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని పొలాలకు మళ్లించుకుంటున్నారు. కలెక్టరు ముందుకే నీటి సమస్య మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాలకు సాగునీటిని అందించే రామరాజుపాలెం కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల కాలేదు. 3,500 క్యూసెక్కుల నీటిని రైవస్ కాలువలకు వదిలితే రామరాజుపాలెం కాలువకు నీరు వచ్చే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి రైవస్ కాలువకు 2400 క్యూసెక్కులు వదిలారు. సాయంత్రానికి 2,800 క్యూసెక్కులకు పెంచారు. 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గాని రామరాజుపాలెం కాలువ శివారున ఉన్న బుద్దాలపాలెం, జింజేరు, తాళ్లపాలెం, కానూరు గ్రామాలకు నీరు చేరే పరిస్థితి లేదని నీటిపారుదలశాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కానూరు, తాళ్లపాలెం, కొత్తమాజేరు, పూషడం, దాలిపర్రు, లంకపల్లి, యండకుదురు, దాలిపర్రు తదితర గ్రామాలకు చెందిన రైతులు సోమవారం కలెక్టర్ బాబు.ఎ వద్దకు వచ్చి తమ గోడను వెళ్లబోసుకున్నారు. ఓ అడుగు ముందుకు వేసిన తాళ్లపాలెం, కానూరు రైతులు మూడు రోజుల్లోగా నీరు రాకుంటే కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలకు దిగుతామని చెప్పారు. -
నీళ్లెందుకు వదలరు?
కౌతవరం(గుడ్లవల్లేరు): నీళ్లెందుకు వదలడం లేదు... సీఈ ముందు ప్రజాప్రతినిధుల నిలదీత...నీళ్లెందుకు వదలడం లేదు.. కింది అధికారులపై సీఈ ఆగ్రహం.... నెపాన్ని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. కౌతవరం ఇరిగేషన్ బంగ్లాలో ఈ తమాషా చోటుచేసుకుంది. కాలువలకు ఎందుకు నీళ్లు వదలలేదని ఇరిగేషన్ ఇంజనీర్లపై సీఈ వై.సుధాకర్ మండిపడ్డారు. మూడు రోజులుగా బంటుమిల్లి కాల్వలో సాగునీరు రాకుండా నిలిపివేశారని సీఈకి పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మంగళవారం కౌతవరం ఇరిగేషన్ బంగ్లాకు వచ్చిన సీఈ ఎందుకు నీరు ఇవ్వటం లేదని స్థానిక అధికారులపై ఆగ్రహించారు. బంటుమిల్లి హెడ్ వద్ద కాల్వ గట్టు పటిష్టం చేసే పనులు చేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. దానితో ఆగ్రహించిన సీఈ వెంటనే 400 క్యూసెక్కులు వదలాలని ఆదేశించడంతో హుటావుటిన నీటి విడుదల చేశారు. నీరొచ్చినా నారు లేదని సీఈకి ఎమ్మెల్యే కాగిత చెప్పారు. బయట నుంచి ఎక్కువ ధరకు నారు కొనుగోలు చేసుకున్న తమ ప్రాంత రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారన్నారు. తీరా మూడు రోజులుగా నీరు నిలిపివేయటంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. -
సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రామన్నపేట : ప్రభుత్వవైఫల్యం వల్లనే ధర్మారెడ్డిపల్లికాలువ ద్వారా రైతులకు సాగునీరు అందడంలేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఆదివారం రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాలకు చెందిన పార్టీనాయకులు, రైతులతో కలిసి ధర్మారెడ్డిపల్లి కాలువవెంట ఆయన పర్యటించారు. గోకారం చెరువువద్ద తలుపులకు తట్టినచెత్తను, తూముకు అడ్డంగాపడిన రేకును తొలగించారు. ధర్మారెడ్డిపల్లి కత్వవద్ద నీటిప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం రామన్నపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు మండలాలకు సాగునీరుఅందించే ధర్మారెడ్డిపల్లి కాలువకు నీటిని తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఆయనవెంట జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, చిట్యాల మండలకాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, మాజీఎంపీపీ నీల దయాకర్, వైస్‌ఎంపీపీ బద్దుల ఉమారమేష్, సర్పంచ్ బొక్క భూపాల్‌రెడ్డి, జిట్ట బొందయ్య, జడల ఆదిమల్లయ్య, బండమీది స్వామి, మీర్జా బషీర్‌బేగ్, బొడ్డు అల్లయ్య, కన్నెబోయిన సైదులుయాదవ్, ఏళ్ల వెంకట్ రెడ్డి, కట్టంగూరి మల్లేశం, ఎండీ.జమీరుద్దిన్, దొమ్మాటి లింగారెడ్డి, బండ అంజిరెడ్డి, లింగస్వామి, సతీష్, సైదులు ఉన్నారు. -
కావడి కష్టాలన్నీ పంట కోసమే
మిరపరైతుల భగీరథ ప్రయత్నం అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు): రైతులకు ఈ ఏడాది కూడా సాగునీటి కష్టాలు తప్పలేదు. కన్నబిడ్డల్లాంటి పంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సాగర్ జలాలు రాక, వర్షాలు లేక వాగులు, కుంటలు ఎండి పోవటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. దేవుడిపై భారం వేసి రైతులు మిర్చి మొక్కలు నాటుతున్నారు. ఎక్కడా నీరు లేక పోవటంతో బావుల నుండి, బోరుల నుంచి పొలం దగ్గర కుంటలను ఏర్పాటు చేసుకొని నీటిని నింపుకుంటున్నారు. చెమటోడ్చి అక్కడి నుంచి కావిళ్లతో, బిందెలతో నీటిని తెచ్చుకొంటున్నారు. దీని కోసం రైతులను మొదట్లోనే ఖర్చులు పెరుగుతున్నాయి. సాగునీటి కష్టాలు ఏర్పడ్డా గత ఏడాది మిర్చి ధరలు అధికంగా ఉండటంతో ఈ ఏడాది మండలంలో 5 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. మిర్చి మొక్కలు ప్రస్తుతం మొక్క దశలోనే ఉన్నాయి. ఈ దశలో నీరు లేక బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులు పైపాట్లు చేసుకోవటంతో పాటు వారానికి ఒకసారి లీటరు నీటికి 10 నుంచి 15 గ్రాములు యూరియా పిచికారి చేసినట్లయితే మొక్కలను రక్షించుకోవచ్చని గరికపాడుృకషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. -
రైతులంటే బాధ్యతలేని సీఎం
వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ధ్వజం మైలవరం యార్డులో పెసర రైతులకు సంఘీభావం మైలవరం: రైతులకు సాగునీరు లేదు, మద్దతు ధర లేక విలవిల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆరోపించారు. మైలవరం మార్కెట్ యార్డులో వర్షానికి తడిచి మొలకలెత్తుతున్న పెసలను శుక్రవారం ఆయన పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో 14రోజులుగా పెసలు అమ్ముకోడానికి తీసుకవచ్చినుట్లు రైతులు తెలిపారు. రెండు రోజుల్లో పెసలు కొంటామన్న మార్కెట్ కమిటీ స్పందించడం లేదని రైతులు వాపోయారు. నిన్న కురిసిన వర్షానికి పెసలు తడిచిపోయి మొలకలెత్తుతున్నాయని రైతులు వాపోయారు. దీనిపై స్పందించిన జోగి మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి తడిచిన పెసలతో సహా కొనుగోలు చేయకుంటే మార్కెటింగ్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామన్నారు. పెసలను కొనకపోతే ముట్టడిస్తాం పుష్కరాల్లో 12 రోజులు హారతిలో పాల్గొంటున్న ముఖ్యమంత్రికి సమీపంలోని జూపూడిలో సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు కన్పించలేదన్నారు. ప్రభుత్వం క్వింటా పెసలు రూ.4850 చెల్లిస్తామని చెబుతున్నా ఇప్పటివరకు కొనుగోళ్లు చేపట్టలేదని, దళారులు క్వింటా రూ.4500 నగదు చెల్లిస్తామని వస్తున్నారన్నారు. క్వింటాకు రూ.6 వేలు మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జోగి వెంట మైలవరం, రెడ్డిగూడెం మండలాల పార్టీ కన్వీనర్లు పామర్తి శ్రీనివాసరావు, మురళీ మోహనరెడ్డి, మైలవరం పట్టణ కన్వీనర్ షేక్ కరీమ్, మైనార్టి కన్వీనర్ షేక్ నన్నేబాబు, ఎన్. అజాద్, పి. శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి జి. స్వామిదాసు, ఉయ్యూరు సత్యనారాయణరెడ్డి, బుర్రి ప్రతాప్, రెడ్డిగూడెం, మైలవరం మండలాల నాయకులు పాల్గొన్నారు. -
సాగునీటి కోసం ఎదురుచూపు
కోడూరు : ‘ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ కాలువలకు సాగునీరు ఇవ్వలేదు. సాగునీరు ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వమే పంటవిరామం ప్రకటించాలి. నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి...’ అని పలువురు రైతులు ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో డీసీ అధ్యక్షుడు పాలేటి జగన్మోహనరావు అధ్యక్షతన సాగునీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా నాయకుడు ఆవుల బసవయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు దిగువ కాలువలకు నీరు రాకపోవడంతో 15వేల ఎకరాల్లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులను ఇష్టానుసారంగా నిర్వహించడం వల్ల కాలువల వెంట వచ్చే కొద్దిపాటి సాగునీరు కూడా దిగువకు వెళ్లడం లేదన్నారు. ఈ సమస్యలను పరిష్కరించలేకపోతే ప్రభుత్వమే పంటవిరామం ప్రకటించి, రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తీరప్రాంతాల్లో రెండేళ్లుగా పంటలు లేక భూములు బీడువారాయని, ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని రామకష్ణాపురం మాజీ ఉప సర్పంచి దేవనబోయిన వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. కాలువల పనులను ఇష్టానుసారంగా చేస్తున్నారని హంసలదీవి మాజీ సర్పంచి వేణుగోపాలరావు మండిపడ్డారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు : డీఈ మండలంలో సాగునీటి సమస్యలను ఉన్నతాధికారులకు వివరించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ వేణుగోపాలరావు రైతులకు హామీ ఇచ్చారు. కాలువల ఎగువ నుంచి దిగువ భూముల వరకు అనధికార తూములను తొలగించి, ప్రతి ఎకరాకు నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎంపీపీ మాచర్ల భీమయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరావు, డీసీ ఉపాధ్యాక్షుడు కాగిత రామారావు, ఇన్చార్జి ఏఈ శ్రీనివాస్, నీటి సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
సాగర్ జలాల కోసం ఎదురుచూపు
ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడు : వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సాగర్ జలాలను విడుదల చేసి పంటలను కాపాడాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జూలై నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు నూజివీడు, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలలోని రైతులు వరి, పత్తి, మిరప, టమోటా తదితర పంటలు సాగుచేశారన్నారు. 50 రోజులుగా చినుకు జాడే లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. పది రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయని, దీంతో బోర్ల నుంచి సాగునీరు అందించినా ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే వాటిని ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. జిల్లాకు జలవనరుల శాఖ మంత్రి ఉన్నందున ఇప్పటికైనా తెలంగాణ మంత్రులతో మాట్లాడి మూడో జోన్‌కు సాగర్ జలాలను రప్పించి చెరువులన్నింటినీ నింపాలని కోరారు. -
ఖరీఫ్‌కు గడ్డుకాలం..
కృష్ణాడెల్టాకు అరకొరగా నీరు ఇప్పుడు నాట్లు వేస్తే జనవరిలో కోతలు ఆందోళనలో రైతులు మచిలీపట్నం : కృష్ణా డెల్టాకు గడ్డు కాలం. పాలకుల నిర్లక్ష్యంతో వరిసాగు చేసే రైతుల పాలిట శాపంగా మారింది. ఆగస్టు ముగుస్తున్నా పూర్తిస్థాయిలో కాలువలకు నీరు విడుదల చేయలేదు. వర్షాలు కురవని సమయంలో అన్ని ప్రధాన కాలువలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 15 వేల క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంది. 9,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కాలువల్లో నీటిమట్టం పెరగని పరిస్థితి నెలకొంది. ఎండిపోతున్న పైరు.. గతంలో నెలలో కురిసిన ఓ మోస్తరు వర్షానికి రైతులు నారుమళ్లు పోశారు. కొంత మేర నాట్లు వేశారు. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పైరు సగం మేర చనిపోయింది. నాలుగు రోజులుగా కాలువలకు నీరు విడుదల చేస్తున్నా పొలాలకు ఎక్కేంతగా నీట్టి మట్టం పెరగటం లేదు. దీంతో కాలువ పక్కనే భూములు ఉన్న రైతులు ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారు. 2.40 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉంది. ఆగస్టు 15లోపే వరినాట్లు పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడ రూరల్, కంకిపాడు, ఉంగుటూరు, గుడివాడ, తోట్లవల్లూరు, పామర్రు తదితర మండలాల్లో సబ్మెర్సిబుల్ పంపులు ఉన్న బోర్ల ద్వారా దాదాపు 2.40 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తిచేశారు. వెద పద్ధతితో కొంతమేర వరినాట్లు వేసినా, నీరు లేకపోవటంతో ఎండిపోయింది. ఖరీఫ్‌లో ఏ రకం వరివంగడం సాగు చేసినా కనీసంగా 145 రోజులకు కోతకు వస్తుంది. పట్టిసీమ పేరుతో మాయ.. ప్రకాశం బ్యారేజీ నుంచి అన్ని ప్రధాన కాలువలకు రోజుకు 15 వేల క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంది. పట్టిసీమ నుంచి 8,500 క్యూసెక్కుల నీరు వచ్చినా డెల్టాకు ఏ విధంగా సాగునీటి అవసరాలను తీరుస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే డెల్టా బీడుగా మారి దర్శనమిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు దీని ప్రభావం అపరాల సాగుపై తీవ్రంగా ఉంటుందని వాపోతున్నారు. -
రాయలసీమకు నీళ్లెప్పుడిస్తావు బాబూ
ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విజయవాడ సెంట్రల్ : పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఎప్పుడిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమతో రాయలసీమ నీటి అవసరాలను తీరుస్తామని పదేపదే చెప్పిన చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వెల్లడించాలన్నారు. కృష్ణా– గోదావరి జలాల అనుసంధానం జరిగినట్లు చెబుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే మూడుసార్లు పట్టిసీమకు ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. రాయలసీమ పేరు చెప్పి పబ్బం గడుపుకుందామనుకుంటే కుదరదని హెచ్చరించారు. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా రాష్ట్రంలో సాగునీటి రిజర్వాయర్లు ఒట్టికుండల్లా మారాయని చెప్పారు. రిజర్వాయర్ల నీటితో సాగు, తాగు అవసరాలు తీర్చుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం నేపథ్యంలో రాష్ట్రంలో జలాశయాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా అక్రమ ప్రాజెక్టుల్ని ప్రభుత్వం అడ్డుకోవాలని సూచించారు. -
కరువు నివారణ చర్యలేవి?
రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుండటం బాధాకరం. తాగునీరు, సాగునీరు లేక రైతులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. పంటలు ఎండిపోతున్నాయి. తోటలు మాడిపోతున్నాయి. గడ్డిలేక పశువులను చౌక ధరలకు అమ్ముకుంటూ ఆ మూగజీవులను కబేళాలకు తరలించడం హృదయవిదారకం. ట్యాంకర్లతో నీటిని కొని బత్తాయి తోటకు నీరు పోస్తున్న రైతు దంపతుల వెతలు చూసి కళ్లు చెమర్చుతున్నాయి. రైతులు, రైతు కూలీలు వలసబాట పట్టడం దారుణం. కళ్లముందు ఇంత ఉత్పాతాలు జరుగు తున్నా మన పాలకులు ఏం చేస్తున్నారు? కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగలేరు. ఎందుకంటే అక్కడ మిత్రపక్షం గనుక. తెలంగాణ పాలకులు మన నీటిని ఎగువనే దోచేస్తుంటే తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఓటుకు కోట్లు కేసును తిరగతోడి గుక్క తిప్పుకోనీయరే మోనని భయం కారణం కావచ్చు. ఎంతసేపూ ఇంకుడు గుంతలు తవ్వుకోండి అనటం తప్ప ఇంతగా ఎండలు మండి పోతుంటే, చెరువులు, కాల్వలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నట్లు? కేంద్రంతో మాట్లాడి అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి రైల్వే ట్యాంకర్లతో విధిగా నీటిని కరువు ప్రాంతాలకు సరఫరా చేయించాలి. రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల నుంచి నీటిని కరువు ప్రాంతాలకు సరఫరా చేయించాలి. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి మన నదీజలాల్ని దోచుకోకుండా అడ్డుకోవాలి. అప్పట్లో కర్నాటక ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచి మన నీటిని దోచు కుంటుంటే కృష్ణా ట్రిబ్యునల్ వరకు వెళ్లి పరిష్కార మార్గాలను వెతుక్కున్నాం కదా. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మహారాష్ట్రకు తన అను చరులతో వెళ్లి బాబ్లీ వివాదంలో అరెస్టు అయ్యారు కూడా. మరి ఆ పోరాట పటిమ, స్ఫూర్తి ఇప్పుడే మయ్యాయి? ఆనాడు వైఎస్సార్ తలపెట్టిన జలయజ్ఞాన్ని నేడు దారి మళ్లించారు. ఇంకా పోలవరాన్ని పూర్తి చేయలేక పోతున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసి రాయలసీమకు మళ్లించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చని ఆ మధ్య ఒక విద్యావేత్త రాశారు. రాజధాని ప్రాంతంలోని సస్యశ్యామలమైన, ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని నిర్జీవ భవనాల కోసం దుర్వినియోగపరిస్తే ఆ ప్రభావం రాష్ట్రాన్ని ఇంకా భ్రష్టు పట్టించకమానదు. చంద్రబాబు, కరువు కవలపిల్లలు అని జనంలో నమ్మకం ప్రబలుతోంది. ముంచు కొచ్చిన ప్రస్తుత కరువును చూస్తే ఇది నిజమనిపిస్తోంది కూడా. ఆయన పరిపా లనలో గతంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడూ అలాగే జరుగుతోంది. ఆయన ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక స్వభావం గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత కేంద్రాన్ని నిలదీస్తుంటే తప్పనిసరై కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు తప్పితే ముఖ్యమంత్రి ఈ అంశంపై ఏమాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధ పడక పోవడం దారుణం. - అచ్యుత, సామాజిక కార్యకర్త, కవి, కర్నూలు మొబైల్: 7675958696 గొంతెండుతోంది దాహం దాహం కేకలు/ గొంతెండుతున్న జనం అడుగంటిన జలం / మండుతున్న ఎండలు ఎండుతున్న బతుకులు / కరువు కోరల కాలం చిమ్మిన ఛిద్రమైన గాయం బిందెల బొందలో బురదనీళ్లే తాగి బతుకీడుస్తున్న ప్రజలు... గుక్కెడు నీళ్ల కోసం / నెర్రెలిచ్చిన నాలుక... ఇంకిపోయిన మడుగులా మొహం చిన్న నీటి తుంపర్ల ఆశలు ‘మద్యం’ పొంగిపొరలుతున్న రక్తపు రహదారులు... పర్యావరణాన్ని ప్రేమించలేనప్పుడు పక్షులు పాటలే పాడనప్పుడు వృక్షాలనే అడ్డంగా నరికితే... నరకయాతనల కేకలు పెట్టాల్సిందే! కుళాయిలో కాకుల్లా రాళ్లు కూర్చాల్సిందే!! గొంతెండుతోంది.. గొంతెండుతోంది అని మేఘాలకై మొహం చూడాల్సిందే తంగిరాల సోని, కంచికచర్ల మొబైల్: 9676609234 -
ఆరుతడి వరికి ‘సెన్సార్ల’ దన్ను!
సెన్సార్లు అమర్చిన పొలాల్లో నిశ్చింతగా ఆరుతడి వరి సాగు నీరు నిల్వ కట్టనక్కర్లేదు.. భూమిలో కొంత మేరకు తేమ ఆరిన తర్వాత సెన్సార్ల ద్వారా రైతుకు ఎస్సెమ్మెస్ వరి మాగాణుల్లో 30-40% వరకు సాగు నీరు ఆదా! {పభుత్వ సంస్థ ‘వాలంతరి’ క్షేత్ర స్థాయి అధ్యయనంలో వెల్లడి కరువు కోరలు చాచి పంటలను కబళిస్తోంది. కరువు కరాళ నృత్యం చేస్తున్న కష్ట కాలం ఇది. బోర్లపై ఆధారపడే మెట్ట పొలాల్లోనే కాదు.. భారీ ప్రాజెక్టుల పరిధిలో సాగు నీటి భరోసా ఉందనుకున్న పొలాల్లోనూ నీటి బొట్టు లేని దుస్థితి. బోర్లలో ఉన్న కొద్ది నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటను కాపాడుకోవడం ఇప్పుడు వారి ముందున్న సవాలు. నీటిని నిల్వగట్టకుండా కాలువ కింద భూముల్లో ఆరుతడి వరి సాగు చేసుకోవచ్చని, నేలలో జాన లోతు వరకు నీటి తేమ ఆరిన తర్వాత మళ్లీ తడి పెట్టుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరు తడి పద్ధతుల్లో వరి సాగు చేస్తే దిగుబడి నష్టపోయే ప్రమాదమేమీ లేదా? ముమ్మాటికీ లేదంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. సాయి భాస్కర్‌రెడ్డి. సెన్సార్లను పొలంలో అమర్చుకోవడం ద్వారా నేలలో తేమ గురించి ఎప్పటికప్పుడు సమాచారం పొందుతూ.. పంట ఎండిపోతుందేమోనన్న భయం లేకుండా నిశ్చింతగా ఆరుతడి వరి సాగు చేయవచ్చంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద మాగాణుల్లో సాగు నీటిని సమర్థవంతంగా వాడుకోవడాన్ని రైతులకు అలవాటు చేయాలన్న సంకల్పంతో ‘వాలంతరి’ అనే ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ‘క్లైమడాప్ట్’ ప్రాజెక్టు సమన్వయకర్తగా డా. సాయిభాస్కర్రెడ్డి పనిచేశారు. ఈ క్రమంలో సాగు నీటిని ఆదా చేసుకునేందుకు తోడ్పడే తక్కువ ఖర్చుతో కూడిన అల్ట్రాసోనిక్ సెన్సార్లను రూపొందించారు. నల్గొండ, గుంటూరు జిల్లాల్లో కొందరు రైతుల పొలాల్లో ప్రయోగాత్మకంగా వాటర్ ట్యూబులు పాతారు. నేలలోకి అల్ట్రాసోనిక్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. 30-40 శాతం సాగు నీటిని ఆదా చేసుకోవచ్చని రుజువైందన్నారు. వరి పొలంలో నీరు నిల్వ లేకపోతే దిగుబడి తగ్గిపోతుందేమోనని రైతులు సాధారణంగా కంగారు పడుతుంటారు. అయితే, నీటి తేమ 15 సెం.మీ.(ఆరు అంగుళాల) లోతు వరకు పొడిబారే వరకు వేచి ఉండి.. తడి పెట్టినా ఇబ్బంది లేదని రైతులు అనుభవపూర్వకంగా గ్రహించారని డా. సాయి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆరుతడి పద్ధతుల్లో వరిని సాగు చేసినప్పుడు వేళ్లు మరింత లోతుకు చొచ్చుకెళ్తున్నందున పిలకలు ఎక్కువగా వస్తున్నాయని, ధాన్యం దిగుబడి కూడా పెరిగినట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి తీయడానికి సెన్సార్లు ఉపకరిస్తున్నాయన్నారు. నీటిని నిల్వగట్టే పద్ధతిలో రెండున్నర ఎకరాల(హెక్టారు)లో వరి పంటను సాగు చేయడానికి వాడే నీటికి లీటరుకు పైసా చొప్పున ఖరీదు కడితే రూ. 1,20,000 చెల్లించాల్సి వస్తుంది. కానీ, హెక్టారుకు రైతుకు వచ్చే ఆదాయం మాత్రం రూ. 30 వేలకు మించి ఉండటం లేదు. ఎంతో విలువైన జల వనరులను అతిపొదుపుగా వాడుకోవడానికి అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం ఉత్తమం. కాలువల ద్వారా చుక్క నీరు వచ్చే వీల్లేని ఈ కరువు కాలంలో బోరు నీటి సదుపాయం కలిగిన రైతులు సెన్సార్లను అమర్చుకొని నిశ్చింతగా ఆరుతడి వరిని పండించుకోవచ్చని డా. సాయి భాస్కర్ రెడ్డి సూచిస్తున్నారు. పంట కాలువల్లో / పొలాల్లో నీటి మట్టం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, నేలలో తేమ, పొలంలో నిల్వ ఉన్న నీటి మట్టం, పంటలున్న పొలం మట్టిలో నీటి తేమ ఎంత కాలంలో ఎంత లోతు వరకు ఆరిపోతున్న విషయాన్ని కూడా ఈ సెన్సార్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆరుతడి పంటలు, పూర్తి వర్షాధార పంటలు, పండ్ల తోటల్లోనూ ఇటువంటి సెన్సార్లను ఏర్పాటు చేసుకోవచ్చు. పొలంలో నాలుగు చోట్ల సెన్సార్లు ఏర్పాటు చేసుకుంటే చాలని డా. సాయి భాస్కర్ రెడ్డి (96767 99191) తెలిపారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆరుతడి వరిలో సెన్సార్లతో ఉపయోగమే! నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఏడెకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నా. మా పొలంలో డా. సాయి భాస్కర్‌రెడ్డి మూడేళ్ల క్రితం సెన్సార్లను ఏర్పాటు చేశారు. మా పొలంలో మూడు చోట్ల సెన్సార్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు కాలువ నీరు ఎప్పుడూ చేనులో నుంచి పై నుంచి కిందికి పారుతూ ఉండేది. ఎప్పుడు నీరు నిల్వ ఉంచేవాళ్లం. సెన్సార్లు పెట్టిన తర్వాత నీరు నిల్వగట్టడం మానేశాను. పొలం మట్టిలో జాన లోతు వరకు తేమ ఆరిన తర్వాత తడి పెట్టడం నేర్చుకున్నాను. అవసరమైనప్పుడు నీటి తడి పెడితే చాలని సెన్సార్లు పెట్టిన తర్వాత తెలుసుకున్నాను. దిగుబడి కూడా పెరిగింది. గత ఖరీఫ్‌లో 1121 రకం 45 బస్తాలు, బీపీటీ 40 బస్తాల దిగుబడి వచ్చింది. నిరుడు ఆరుతడి పంటను సుడి దోమ అంతగా దెబ్బతీయలేదు. నీరు నిల్వగట్టిన పంటకు సుడిదోమ దెబ్బ ఎక్కువగా ఉంది. సెన్సార్లు ఉపయోగకరమే. ఈ సంవత్సరం కాలువ నీళ్లు రాలేదు. బోరు నీటితో 3 ఎకరాల్లో ఆరుతడి వరి సాగు చేస్తున్నా. - కొడాలి ప్రభాకరరావు (90522 46301), కొండప్రోలు, దామరచర్ల మండలం, నల్గొండ జిల్లా నీళ్లు జాగ్రత్తగా వాడటం నేర్చుకున్నా! మా రెండెకరాల వరి పొలంలో 4 చోట్ల సెన్సార్లు పెట్టాం. అంతకుముందు 24 గంటలూ పొలంలో నుంచి నీరు పారుతూనే ఉండేది. సెన్సార్లు పెట్టిన తర్వాత రోజుకు రెండు సార్లు సెల్‌కు మెసేజ్ వస్తుంది. నీటి లోతు, గాలిలో తేమ, ఉష్ణోగ్రత వివరాలుంటాయి. దీంతో నీళ్లు జాగ్రత్తగా వాడటం నేర్చుకున్నాను. ఇప్పుడు బోరు నీటితో ఆరుతడి వరి సాగు చేస్తున్నా. మామూలుగా 3 ఎకరాలకు సరిపోయే నీరు 5 ఎకరాలకు సరిపోతున్నది. - గోవిందు (99121 91838), గేలి తండా, దామరచర్ల, నల్గొండ జిల్లా -
సాగు ‘నిల్లే’!
♦ నీళ్లు లేక వెలవెలబోతున్న రిజర్వాయర్లు ♦ నేడు సాగునీటి సలహా మండలి సమావేశం ♦ తాగునీటిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ♦ హాజరుకానున్న హెచ్చెల్సీ పరిధిలోని ప్రజాప్రతినిధులు అనంతపురం ఇరిగేషన్ : జిల్లాకు ప్రధాన నీటి వనరు అయిన తుంగభద్ర జలాశయంతో పాటు శ్రీశైలం డ్యాంలోకి ఆశించిన మేర నీరు చేరడం లేదు. ఎక్కడా వర్షాల్లేకపోవడంతో డ్యాంలలో నీటి లభ్యతపై సందిగ్ధత కొనసాగుతోంది. సాగునీరు కాదు కదా..కనీసం తాగునీటి అవసరాలైనా పూర్తిగా తీరతాయో, లేదోనన్న ఆందోళన అధికారుల్లో కన్పిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే శుక్రవారం సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సమావేశం కూడా వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తమ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు,చెరువులకు నీటిని విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసే అవకాశముంది. తమ జిల్లాకు కేటాయించిన నీటిని ఎప్పుడూ విడుదల చేయలేదని, ఈసారైనా న్యాయం చేయాలని వైఎస్సార్ జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబట్టే సూచనలూ కనిపిస్తున్నాయి. ఎవరి డిమాండ్లు ఎలా ఉన్నా.. ప్రాజెక్టులలో ఆశించినంత నీటిమట్టం లేనందున ఈ ఏడాది తాగునీటికే ప్రథమ ప్రాధాన్యతిస్తూ చర్చ జరిగే అవకాశముంది. ఆయోమయంలో అధికారులు జిల్లాకు ప్రధాన సాగు, తాగునీటి వనరు తుంగభద్ర డ్యాం ఒక్కటే. హంద్రీ-నీవా ఉన్నప్పటికీ శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోవడంతో కాలువకు నీటి విడుదల అనుమానమే. దీంతో ఎక్కువగా హెచ్చెల్సీ నీటిపైనే దృష్టి కేంద్రీకరించవలసి వస్తోంది. తుంగభద్ర డ్యాంలో కూడా ఆశించిన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో కేటాయించిన నీటిని విడుదల చేయడంపై సందేహం నెలకొంది. ప్రస్తుతం డ్యాంలో 64.430 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 7,254 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,159 క్యూసెక్కులు. గత ఏడాది ఇదే సమయానికి 92 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 1,42,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,66,000 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండేది. ఈ ఏడాది తుంగభద్ర నుంచి 22.689 టీఎంసీల నీటిని మన వాటా కింద నిర్ణయించారు. అయితే ఆ స్థాయిలో విడుదల చేయడంలేదు. జిల్లా సరిహద్దు వద్ద హెచ్చెల్సీలో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహంతో మాత్రమే నీరు వస్తోంది. ఈ ప్రవాహంతో 10 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చే అవకాశముంది. గత నెల 24న నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకు 0.92 టీఎంసీలు మాత్రమే జిల్లాకు వచ్చాయి. పీఏబీఆర్‌లో గత ఏడాది ఇదే సమయానికి 2.26 టీఎంసీల నీరు ఉండేది. ఈ ఏడాది నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో 1.46 టీఎంసీలు మాత్రమే ఉంది. తుంగభద్ర నీరు చేరే సమయానికి పీఏబీఆర్‌లో ఒక టీఎంసీ నిల్వవుండగా.. అదనంగా 0.46 టీఎంసీ మాత్రమే వచ్చి చేరింది. మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌లో గత ఏడాది ఇదే సమయానికి 0.60 టీఎంసీ నీరు ఉండగా.. ప్రస్తుతం 0.32 టీఎంసీ మాత్రమే ఉంది. దీంతో ఈసారి ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించుకొనే అవకాశం కనిపిస్తోంది. నీటి ఆవిరి, సరఫరా నష్టాలు పోతే ఏస్థాయిలో నీళ్లు మనకు లభిస్తాయన్నది అధికారులను కూడా ఆందోళనకు, ఆయోమయానికి గురిచేస్తోంది. 2015-16 సంవత్సరానికి వివిధ ఉపకాలువల కింద పట్టణాలు, గ్రామాలకు ప్రతిపాదించిన తాగునీటి నికర కేటాయింపులు ఇలా ఉన్నాయి. మొత్తం 5.716 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించారు. ఇందులో రాయదుర్గం మునిసిపాలిటీ, గొడిసెలపల్లి, ఇతర గ్రామాలకు 0.406 టీఎంసీలు, గుంతకల్లు బ్రాంచికెనాల్(జీబీసీ) ద్వారా గుంతకల్లు పట్టణం, గడేకల్లు, కొనకొండ్లతో పాటు 13 ఇతర గ్రామాలకు 0.857 టీఎంసీలు, మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ద్వారా శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కింద బుక్కరాయసముద్రంతో పాటు 19 గ్రామాలు, బి.పప్పూరుతో పాటు 26 గ్రామాలకు 0.504 టీఎంసీలు, శ్రీరామరెడ్డి, శ్రీ సత్యసాయి నీటి పథకాల కింద హిందూపురం పట్టణం,అనంతపురం నగరంతో పాటు 700 గ్రామాలకు 1.732 టీఎంసీలు, మైలవరం కాలువ ద్వారా పొద్దుటూరు పట్టణానికి 0.200 టీఎంసీలు, పులివెందుల బ్రాంచి కెనాల్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కదిరి, ఇతర 79 గ్రామాలకు, పుట్టపర్తి,ఇతర 92 గ్రామాలకు, పులివెందుల పట్టణానికి 2.017 టీఎంసీల నీటిని తాగునీటి కోసం కేటాయించారు. సాగు ఎలా? తాగునీటికే కటకటలాడాల్సిన పరిస్థితుల్లో సాగునీటిని ఎలా విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు నీళ్లు వదలడం కష్టమేనని, కొద్ది రోజుల తరువాత డ్యాంలలో నీటిమట్టం ఎంత ఉంటుందన్న దానిపై ఓ అంచనాకు వస్తామని అంటున్నారు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హంద్రీనీవాపై వాడీవేడి చర్చ? సమావేశంలో ప్రధానంగా హంద్రీ-నీవాపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. హంద్రీనీవా నీటిని తన సొంత నియోజకవర్గం కుప్పంకు తరలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఈ అంశంతో పాటు హంద్రీనీవా పనుల్లో జాప్యం, అవినీతిపై కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులను గట్టిగా నిలదీసే అవకాశముంది. -
నేడు ఉరవకొండలో రైతు సదస్సు
- హంద్రీ-నీవా ఆయకట్టుకునీటి సాధనే లక్ష్యం - జిల్లా నలుమూలల నుంచి తరలిరానున్న రైతులు - హాజరుకానున్న అఖిలపక్ష నేతలు ఉరవకొండ/ ఉరవకొండ రూరల్ : హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం (హెచ్ఎన్ఎస్ఎస్) మొదటి దశ కింద జిల్లాలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న డిమాండ్‌తో సోమవారం ఉరవకొండలోని వీరశైవ కల్యాణ వుండపంలో రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలతో కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రావుకృష్ణ, వుధు, జిల్లా కార్యదర్శులు హాజరుకానున్నారు. ఉదయుం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. జిల్లా నలువుూలల నుంచి రైతులు భారీగా తరలిరావాలని ఆయకట్టు సాధన సమితి సభ్యులు అశోక్, తేజోనాథ్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. హంద్రీ-నీవా పథకం పనులను 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. మొదటివిడత కింద జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ప్రధాన కాలువ పూర్తి చేశారు. దీని ద్వారా గతేడాది 16.9 టీఎంసీల కృష్ణా జలాలు వచ్చాయి. ఈ నీటితో కనీసం 1.50 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. మొదటి విడత కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది వచ్చిన నీటితో ఈ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని ఇవ్వడంతో పాటు చెరువులనూ నింపొచ్చు. ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల (ఉప, పిల్లకాలువలు) నిర్మాణం చేపట్టకపోవడంతో ఆయకట్టుకు నీరందించే వీల్లేకుండా పోయింది. రూ.వంద కోట్లు ఖర్చు చేస్తే మొదటివిడతలో డిస్ట్రిబ్యూటరీలు పూర్తవుతాయి. అయితే.. సీఎం చంద్రబాబు కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటరీల పనులు ఆలస్యం చేయాలని జీవో నెంబర్ 22 జారీ చేశారు. ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం : ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండలో సోమవారం జరిగే రైతు సదస్సు ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం ఆయన ఉరవకొండ మండలం చిన్నవుూస్టురులో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హంద్రీ-నీవా మొదటి దశ ఆయకట్టుకు నీరివ్వకుండా ఆ నీటిని సొంత నియోజకవర్గానికి తరలించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నారు. హంద్రీ-నీవాను పూర్తిగా తాగునీటి ప్రాజెక్టుగా వూర్చేలా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రను అఖిల పక్షాలతో కలిసి తిప్పికొడతామన్నారు. రైతు సదస్సులో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. కార్యక్రవుంలో వైఎస్సార్సీపీ వుండల కన్వీనర్ సుంకన్న, జిల్లా కమిటీ సభ్యులు తేజోనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీ అండతో నిధులు స్వాహా
పెళ్లకూరు : అన్నదాతలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులన్నీ కాంట్రాక్టర్ల బొక్కసంలోకి చేరుతున్నాయి. టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ చేసిన చెరువు మరమ్మతు పనులన్నీ నాసిరకంగా ఉండడంతో అధికారులు పనులు రద్దు చేశారు. అయితే అధికార పార్టీ అండతో హైదరాబాద్ స్థాయిలో బిల్లులు చేసుకుని సుమారు రూ.9.5లక్షల నిధులు స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని శిరసనంబేడు గ్రామంలో చిన్నప్పగుంట చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాలకు పైగా సేద్యం సాగుతోంది. 2014లో చెరువు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేశారు. చెరువు తూములు, కలుజు పనులను నిబంధనల మేరకు చేపట్టి, కట్ట ఉపరితలం మూడు మీటర్ల వెడల్పుతో మూడు లేయర్లు వేసి రోలింగ్ చేయించాలి. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ తనకున్న పొక్లెయిన్‌తో చెరువు కట్ట అంచు మట్టితీసి కట్టపై వేయించాడు. తూములు, కలుజు పనులన్నీ నాసిరరకంగా చేపట్టడం, కట్ట ఉపరితలం కనీసం 50 సెంటీమీటర్లు కూడా లేకపోవడంతో పలువురు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్వాలిటీ కంట్రోల్ అధికారులు నాసిరక పనులు పరిశీలించారు. నిబంధనల మేర పనులు చేపట్టకపోవడంతో పనులను రద్దు చేశారు. సదరు కాంట్రాక్టర్ తనకున్న పలుకుబడితో బిల్లులు చేయించుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్ నుంచి నిధులు రికవరీ చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ సుబ్బారావుని వివరణ కోరగా ఉన్నతాధికారుల సూచనల మేరకు కాంట్రాక్టర్‌కు నిధులు తగ్గించి మంజూరు చేశామని చెప్పారు. -
నేడు డిండికి శంకుస్థాపన
మరోమారు జిల్లాకు సీఎం కేసీఆర్ ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 3 లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చిన ప్రభుత్వం ఎన్నో అంచనాలు.. ఎన్నెన్నో అనుమానాలు.. ఊహాగానాలు.. హెలికాప్టర్లో ముఖ్యమంత్రే స్వయంగా చక్కర్లు.. రోజుల తరబడి సర్వేలు.. వీటన్నింటికీ తెరతీస్తూ సీఎం కేసీఆర్ డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు పనులను కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. మర్రిగూడ మం డలం శివన్నగూడెంలో రిజర్వాయర్ నిర్మించనున్న ప్రదేశంలో పైలాన్‌ను ఆవిష్కరించి శంకుస్థాపన చేస్తారు. డిండి ఎత్తిపోతల పథకం మొదట అనుకున్నట్లుగా కాకుండా ప్రాజెక్టు స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. దేవరకొండ : డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గతంలోనే హామీఇచ్చిన కేసీఆర్ అనేకమంది ఇంజినీరింగ్ నిపుణుల సలహాలు, అత్యధిక ప్రయోజనం దృష్ట్యా ప్రాజెక్టు స్వరూపం మార్చి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా శ్రీశైలం నుంచి నక్కలగండి వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడినుంచి మిడ్ డిండి వద్ద 11 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేసి, అక్కడినుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయాలని భావించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖర్చు అధికం కావడంతో పాటు ప్రజలకు ఒనగూరే ప్రయోజనం కూడా తక్కువ కావడంతో దీని డిజైన్‌ను మార్చాలనుకున్నారు. ఇందుకోసం మరో రెండు డిజైన్లను కూడా రూపొందించారు. అయితే రెండు డిజైన్లలో ఏదో ఒక డిజైన్‌లో ప్రాజెక్టును చేపడతారని భావించగా అనూహ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్‌ను పూర్తిగా మార్చి నిర్ణయం తీసుకుంది. మారిన ప్రాజెక్టు స్వరూపం ఇలా.. ఈ ప్రాజెక్టు విషయమై ఇంజినీరింగ్ నిపుణులతో ఏరియల్ సర్వే చేయించడంతోపాటు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే రెండు సార్లు ఏరియల్ సర్వే చేశారు. ఆ తరువాత ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్‌తో సంబంధం లేకుండా నేరుగా శ్రీశైలంనుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ప్రకారం శ్రీశైలం నుంచి 30 టీఎంసీల నీటిని డ్రా చేసి నిల్వ చేసుకోవడంతోపాటు నల్లగొండ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 3 లక్షల 40వేల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించేందుకు డిజైన్ రూపొందించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెండు కిలోమీటర్ల మేర ఓపెన్ చానెల్‌ను తవ్వుతారు. అక్కడినుంచి 500 మీటర్ల మేర టన్నెల్‌ను నిర్మించి అక్కడినుంచి 100 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తారు. అక్కడినుంచి 7.5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానెల్ తవ్వి ఆలేరు అనే ప్రదేశంలో సిస్టర్న్ నిర్మించి అక్కడినుంచి గ్రావిటీ ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీటిని లిఫ్ట్ చేస్తారు. డిండి ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరిన తర్వాత అక్కడినుంచి 92 కిలోమీటర్ల మేర జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు నీటిని అందించేలా ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని చారగొండ, నల్లగొండ జిల్లాలోని ఇద్దంపల్లి, తూర్పుపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం గ్రామాల సమీపంలో 5 రిజర్వాయర్లను నిర్మిస్తారు. ఈ 5 రిజర్వాయర్లలో 30 టీఎంసీల సామర్థ్యంతో నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.7800 కోట్లు ఖర్చు పెట్టనుంది. -
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం
కేజీ టూ పీజీ విద్య అమలుకు కృషి మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల : రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలను అమలు చేసి వారి శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకుంటుందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు నూతనంగా పలు ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. గురువారం వీపనగండ్లలో స్వర్గీయ వంగూరు కృష్ణారెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40ఏళ్ల క్రితమే కృష్ణారెడ్డి నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో వీపనగండ్లలో పాఠశాల, హాస్టల్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 1969తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ప్రజలను చైతన్యం చేశారని చెప్పారు. సమితి ప్రసిడెంట్‌గా, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కేజీ టూ పీజీ విద్యను అమలు చేసి ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యతో పాటు రైతులకు, గ్రామాల్లో ప్రజలకు విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ ఏర్పాటే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎం.లోకారెడ్డి, తహశీల్దార్ దానప్ప, ఎంపీడీఓ కృష్ణయ్య, సర్పం చ్ క్యాతం శివుడు, పీఏసీఎస్ చైర్మన్ జగ్గారి శ్రీధర్‌రెడ్డి, పెద్దగంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, ఎత్తం బాలస్వామి, రవీందర్‌రెడ్డి, గోపి, రాకేష్, తదితరులు పాల్గొన్నారు. -
రైతుకు కడగండ్లు
నెల్లూరు (రవాణా): పాలకులకు ముందుచూపు కొరవడటం, అధికారుల అలసత్వం వెరసి అన్నదాతలకు నీటి కడగండ్లను మిగిల్చాయి. మొదటి పంట చేతికందే సమయంలో సాగునీటిపై అధికారులు చెతులెత్తేశారు. జలాశయాల్లో నీరు అడుగంటుతున్నాయంటూ వారానికొకసారి కాల్వలకు సాగునీరు వదులుతున్నారు. ఓవైపు ప్రకృతి సైతం అన్నదాతలపై కన్నెర్రజేసింది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా ఈ ప్రాంతంలో మాత్రం అలాంటి జాడలు ఎక్కడా కనబడటం లేదు. దీంతో అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఓవైపు జలాశయాల్లో నీరు అడుగంటుతున్నా.. ఒప్పందం ప్రకారమేనంటూ చెన్నైకు తెలుగుగంగ నీటిని అధికారులు వదులుతూనే ఉన్నా రు. సాగునీటి విషయంపై కొన్ని ప్రాం తా ల్లో అన్నదాతలు ఘర్షణకు దిగుతుం టే, మరికొన్ని ప్రాంతాల్లో ధర్నాలకు దిగుతు న్న సంఘటనలు కనిపిస్తున్నాయి. రెండోపంటకు మాత్రం నీరు అందించలేమం టూ ముందే అధికారులు చేతులెత్తేయడం పై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పొట్టదశలో వరి జిల్లాలో 8 లక్షల ఎకరాలల్లో పంటను సాగుచేస్తున్నారు. అందులో 7 లక్షల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. వాటిలో నెల్లూరు డెల్టా కింద లక్ష ఎకరాలు, సంఘం బ్యారేజి కింద 1.5 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. వీటితో పాటు కనిగిరి రిజర్వాయర్, కనుపూరు, తెలుగుగంగ, కండలేరు రిజర్వాయర్ల కింది లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉంది. ఇప్పుడు వరికి నీరు అందించకపోతే నిలువునా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఉద్యానపంటలైన నిమ్మ, మామిడి, పుచ్చ తదితర పంటలను సాగుచేస్తున్నారు. అవి కూడా కొన్ని పూతదశలో ఉంటే కొన్ని రకాల పంటలు పిందె దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం నీరు అందకపోయినా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా కావలి, నెల్లూరు, సర్వేపల్లి, గూడూరు, పొదలకూరు, రాపూరు తదితర ప్రాంతాల రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడుగంటిన జలాశయాలు సోమశిల రిజర్వాయర్ అడుగంటే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం 18 టీఎంసీలు నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వేసవికాలంలో 3.5 టీఎంసీలు నీటిని తాగునీటి అవసరాలకు నిల్వ చేయాల్సి ఉంది. సోమశిల డెడ్‌స్టోరేజి 7.2 టీఎంసీలుగా అధికారులు నిర్ణయించారు. అంటే తాగునీటిని కలుపుకొని తక్కువలో తక్కువ 12 టీఎంసీలు నీరు సోమశిల రిజర్వాయర్‌లో ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన 7 టీఎంసీల నీటిని సాగునీటికి వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మార్చి నెలాఖరు వరకు పంటలకు నీరు అందించాల్సి ఉంది. అదే గతేడాది ఈసీజన్‌కు 40.43 టీఎంసీలు ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రతి 3 రోజులకు ఒక టీఎంసీ నీరు పంటలకు వదులుతున్నారు. అంటే అధికారుల చెబుతున్న లెక్కల ప్రకారం మరో 18 రోజులు సాగుకు నీరు అందించవచ్చు. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. కాలువల కింద చాలామంది అనధికారికంగా మోటార్లుతో నీటిని వినియోగిస్తున్నారని, వీటితో కలుపుకొంటే మరో 10రోజుల కంటే ఎక్కువ రావని రైతులు అంటున్నారు. పైగా ఆయుకట్టు చివరి భూములుకు ఇప్పటికే నీరు అందడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. కండలేరులో కూడా ప్రస్తుతం 12.5 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. కండలేరు డెడ్‌స్టోరేజి 8.4 టీఎంసీగా అధికారులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం చెన్నైకు 15 వేల క్యూసెక్కులు తాగునీటిని వదులుతున్నారు. ఒప్పందం ప్రకారం ఏడాది పొడవునా తాగునీటిని వదాలాల్సి ఉంది. శ్రీశైలంలో రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గిపోయింది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యూలేటర్ ద్వారా వచ్చే నీరు ఆగిపోతుంది. రెండోపంట లేనట్టే.... ప్రతి ఏటా జిల్లాలో రెండోపంటగా సుమారు 2 లక్షలకు ఎకరాలకు పైగా సాగుచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితుల్లో 3 లక్షల ఎకరాలల్లో సాగు ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో రెండో పంటకు నీరు అందించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో అన్నదాతలు అధికారులు, నేతలపై మండిపడుతున్నారు. కొరవడిన ముందుచూపు జిల్లా సాగు, తాగునీటి అవసరాలపై అటు పాలకులు, ఇటు అధికారులకు ముందుచూపు కొరవడింది. వరదల సమయంలో కృష్ణానది నుంచి ఎక్కువ మొత్తంలో నీరు పెన్నాకు వస్తుంది. కడప జిల్లా నిప్పులవాగును వెడల్పు చేస్తే వరద సమయంలో 22 వేల క్యూసెక్కులకు పైగా నీరువచ్చే అవకాశం ఉంది. అయితే ఆదిశగా నేతలు, పాలకులు దృష్టిసారించడం లేదు. నిప్పుల వాగును వెడల్పు చేసేందుకు రూ.30 కోట్లు ఖర్చు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా నీటికోసం ఇబ్బందులు పడకుండా నిప్పులవాగు వెడల్పుపై జిల్లా నేతలు ఆలోచించాలి. -
అటకెక్కిన ఆనకట్ట!
ఊసేలేని సిద్దేశ్వరం ప్రాజెక్టు సాక్షి, కర్నూలు : కృష్ణానదిపై కొత్తపల్లి సమీపంలోని సిద్దేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మిస్తే రాయలసీమకు సాగునీటి విషయంలో న్యాయం జరుగుతుందని ప్రభుత్వాలకు తెలిసినా పట్టించుకోవడంలేదు. 854 అడుగుల ఎత్తులో ఆనకట్ట నిర్మాణం జరిగితే సాగు,తాగు నీటి సమస్య తొలగిపోతుంది. అయినా నిర్మాణం ఏళ్లతరబడి రికార్డులకే పరిమితమైంది. శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకు నీటిమట్టం చేరిన వెంటనే పోతిరెడ్డిపాడు నుంచి దిగువప్రాంతాలకు నీటిని విడుదల చేసుకోవచ్చుననే నిబంధనలు ఉన్నాయి. అయితే 860 అడుగులకు నీటిమట్టం చేరినా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసుకోవటానికి ప్రభుత్వాలు అనుమతిని ఇవ్వని దుస్థితి నెలకొని ఉంది. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల గరిష్టస్థాయి నీటినిల్వ సామర్థ్యాన్ని మెయింటెన్ చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవోను విడుదల చేశారు. అయితే దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మరించి గతంలో తాను విడుదల చేసిన జీవో మేరకు నీటిమట్టం 824 అడుగులకు చేరేవరకు నీటిని వాడుకోవచ్చని పేర్కొంటూ నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతాలకు ఇష్టారాజ్యంగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రాయలసీమ ప్రాంతాల ప్రజలు సాగు, తాగునీరు అందక ఇబ్బందిపడుతున్నారు. రాయలసీమకు గుండెకాయలాంటి పోతిరెడ్డిపాడు ద్వారా సాగు, తాగునీరు అందాలంటే తప్పనిసరిగా సిద్దేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాల్సిందేనని భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నించే సమయంలోనే ఆయన అకాలమరణం చెందారు. దీంతో ఐదేళ్లుగా ఆనకట్ట నిర్మాణం అటకెక్కింది. గుండ్రేవుల పూరైతేనే నందికొట్కూరు, ఆత్మకూరులకు ప్రయోజనం.. శ్రీశైలం జలాశయం నిర్మాణం కోసం సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వీధిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని రైతులు, ప్రజలకు ప్రయోజనం కలగాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు పనులు పూర్తిచేయాల్సి ఉంది. అంతేకాకుండా కేసీ కాల్వకు రావాల్సిన 12 టీఎంసీల నీటి వాటాలో జీవో నం. 3 ద్వారా అనంతపురం జిల్లాకు 10 టీఎంసీలు తరలించుకెళ్తున్నారు. దీంతో 0-120 కిలోమీటర్ల మేర ఉన్న 60 వేల ఎకరాల ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రెండు కార్ల పంటలను పండించుకునే కేసీ రైతులు ప్రస్తుతం ఒక్క కారు పంటనూ సక్రమంగా పండించుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీ రైతులు రెండు కార్ల పంటలను సంమృద్ధిగా పండించుకోవాలంటే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి కేసీ రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పెండింగ్‌లో ఉన్న మల్యాల ఎత్తిపోతల పథకం, జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసి మెట్ట రైతుల పొలాలకు సాగునీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పథకాలు పూర్తికాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినా నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయమై అసెంబ్లీ, పార్లమెంట్లలో ప్రస్తావించి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నీరున్నా కన్నీరేనా..?
తుమ్మికాపల్లి ఆనకట్ట పనులు పూర్తయ్యేదెప్పుడంటున్న రైతులు అసంపూర్తి నిర్మాణాన్ని పరిశీలించిన జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ గజపతినగరం రూరల్ : విజయనగరం డివిజన్ పరిధిలోని తుమ్మికాపల్లి ఆనకట్ట పనులు ముందుకు సాగకపోవడంతో ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1988లో అప్పటి మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు హయాంలో తుమికాపల్లి ఆనకట్ట నుంచి నీటిని వి డుదల చేశారు. రెండేళ్ల పాటు బాగానే నీరు వచ్చినా ఆ తర్వాత నుంచి ఒక్క నీటిబొట్టు కూడా రైతు పొలాల్లోకి వెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి రైతులు సాగునీరు ఇస్తారేమో అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆనకట్ట పరిధిలో భూపాల పురం, ఆనందపురం, చింతలపేట,నడుపూరు, కొత్తపేట, నారాయణ పట్నంతో పాటు మరి కొన్ని గ్రామాల భూములు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ భూములు బీడువారుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఆనకట్టకు అప్పట్లో *89.60 లక్షలు విడుదలయ్యాయి. అందులో ఎంత ఖర్చు చేశారు అని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. దీంతో విజయనగరం నుంచి నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.వెంకటరమణతో పాటు ఆ శాఖ డీఈ, జేఈ, వర్క్ ఇన్స్పెక్టర్లు బుధవారం తుమ్మికాపల్లి ఆనకట్ట వద్ద పరిశీలించారు. 70 లక్షల ఖర్చంట... ఆనకట్ట నిర్మాణానికి ప్రభుత్వం అప్పట్లో విడుదల చేసిన *89.60 లక్షల్లో *70 లక్షలను హుద్‌హుద్ ముందు ఖర్చు చేశామని అధికారులు చెబుతుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1991 నుంచి ఒక్క నీటి చుక్క కూడా పొలాలకు రాలేదని, అంత ఖర్చు చేశామని చెబితే ఎలా నమ్మేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆనకట్ట వద్ద ఉన్న సుమారు 50 పాలింగ్ షెట్టర్లు పాడైపోయి, సాగు నీటి కాలువ వద్ద పూడికలు పేరుకుపోయి, బెర్ములు లేకుండా ఉన్న సమయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని ఎలా చెప్పగలుగుతున్నారని నిలదీస్తున్నారు. అసంపూర్తి ఆనకట్టల నిర్మాణానికి చర్యలు: ఈఈ జిల్లాలోని అసంపూర్తి ఆనకట్టల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా నీటి పారుదల శాఖ ఈఈ ఎం.వెంకటరమణ తెలిపారు. ఆయన బుధవారం తుమికాపల్లి ఆనకట్టను ఆయన సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుమ్మికాపల్లి ఆనకట్టకు *78లక్షల అంచనా విలువను వేయగా ప్రభుత్వం *89.60లక్షలు విడుదల చేసిందని, అందులో *70లక్షలను ఆనకట్టకు ఖర్చు చేశారని, *19.60లక్షలతో మిగిలిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తాటిపూడి ప్రాజెక్ట్ ఆధునికీకరణకు సంబంధించి ’24 కోట్లు రాగా అందులో *7కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. మెంటాడ మండలం గుర్ల వద్ద అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ పనులు కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక దేవుడు జేఈ, ఇరిగేషన్ డీఈ ఎల్.గోవిందరావు, జేఈ స్వామి నాయుడు, వర్క్ ఇన్స్పెక్టర్లు రామచంద్రి నా యుడు, సూర్యనారాయణ రాజు, రైతులు పాల్గొన్నారు. -
సోయి లేకనే..
నారింజ నుంచి నీరంతా వృథా పొలాలన్నీ బీళ్లు.. తాగు నీటికీ తిప్పలు మన నీటితో సాగు చేసుకుంటున్న పక్క రాష్ర్టం కారంజ ప్రాజెక్ట్‌కు జలకళ.. ‘సాక్షి’ విజిట్‌లో వెలుగు చూసిన వాస్తవాలు పక్క రాష్ట్రానికున్న సోయి మనకు లేకుండా పోయింది. మనం వృథాగా వదిలేసిన నీటి ఆధారంగా కర్ణాటక పాలకులు ఓ ప్రాజెక్టునే నిర్మించారు. వేలాది ఎకరాల్లో సాగు చేయడమే కాదు తాగు నీటికీ వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా మన నారింజ ప్రాజెక్టు వెలవెలబోతుండగా పక్క రాష్ర్టంలోని కారంజలో జలకళ సంతరించుకుంది. మహానేత వైఎస్ హయాంలో నారింజ నీటి నిల్వ కోసం ప్రణాళిక రచించినా ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో గద్దెనెక్కిన పాలకులు పట్టించుకోలేదు. ఫలితంగా ఇక్కడి రైతులు కన్నీటి సాగు చేస్తుండగా.. జనం తాగు నీటికోసం పరితపిస్తున్నారు. శనివారం ‘సాక్షి’ బృందం నారింజ.. కారంజ ప్రాజెక్టులను సందర్శించగా ఈ భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్ టౌన్ : మనం దాచుకోలేక వృథాగా వదిలేసిన వాగు వరద నీటిని పక్క రాష్ట్రం ఒడిసిపట్టుకుంది. పక్కా ప్రణాళికతో కారంజ ప్రాజెక్టు కట్టింది. వేల ఎకరాలకు సాగునీరు... రెండు పెద్ద పట్టణాలకు తాగు నీటిని అందిస్తోంది. ఏడాదికి సగటున 6 టీఎంసీల నీరు మెతుకు సీమ నుంచి కారంజ ప్రాజెక్టులో చేరుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం చొరవ ఫలితంగా ఆ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. వేసవి రాకముందే పల్లెల గొంతు ఎండిపోతున్న వేళ వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందకు ‘సాక్షి’ బృందం శనివారం జహీరాబాద్‌లోని నారింజ వాగు పరీవాహక ప్రాంతంలో పర్యటించింది. కొత్తూరు వద్ద నారింజ ప్రాజెక్టును, కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని కారంజ ప్రాజెక్టులను పరిశీలించింది. నారింజ నుంచే కారంజకు.. కోహీర్ మండలం బిలాల్పూర్లో పుట్టిన నారింజ వాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నీరంతా నేరుగా కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్లిపోయి తిరిగి మళ్లీ తెలంగాణలోకే వస్తుంది. చిరాగ్పల్లి వద్ద మన రాష్ట్ర సరిహద్దును దాటి దాదాపు 25 నుంచి 30 కిలో మీటర్లు ప్రవహించి కర్ణాటకలోని కారంజ ప్రాజెక్టును నింపుతుంది. ప్రాజెక్టు నిండిన తరువాతమళ్లీ తిరిగి జహీరాబాద్‌కే వచ్చి మంజీరలో కలుస్తుంది. వర్షాల ఉధృతిని బట్టి ఏడాదికి కనీసం 5 నుంచి 7 టీఎంసీల నీళ్లు వృథాగా పోయి ఇందులో కలుస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల అంచనా ప్రకారం.. జహీరాబాద్, ఝరాసంగం నేలలు ఎర్ర నేలలు అయినందున ఇక్కడ ఒక్క టీఏంసీ నీటితో 8 వేల ఎకరాలు సాగు చేయవచ్చు. వృథాగా పోతున్న నీటిలో కనీసం సగమైనా అంటే 3 టీఎంసీల నీటినైనా ఆపలిగితే 24 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. కొత్తూరు రెగ్యులేటరీ.. 1970లో జహీరాబాద్ మండలం కొత్తూరు వద్ద రూ.కోటి వ్యయంతో నారింజ వాగుపై రెగ్యులేటరీ బ్రిడ్జిని నిర్మించారు. కనీసం దీన్ని ఆధునికీకరించినా ఎడమ కాలువ కింద ఉన్న కొత్తూరు, బూర్ధిపాడు, బూచినెల్లి, చిరాగ్పల్లి, సత్వార్, మిర్జాపూర్, మల్కాపూర్, తదితర గ్రామాలకు రెండు కాలాలకు తాగు, సాగు నీరు అందేది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ చిన్ననీటి వనరు పూర్తిగా ఎండిపోయింది. పశువులు కూడా నీళ్లు తాగే పరిస్థితి లేదు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నీటికోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నారు. ఇంకొన్ని రోజులు పోతే ప్రతి కుటుంబంలో ఒకరికి పూర్తిగా తాగు నీరు మోయడానికే సరిపోతుంది. నాణ్యమైన అల్లం, ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటి వాణిజ్య పంటలు పండే భూములు నీళ్లు లేక బీడుగా మారాయి. సేద్యం మీద మమకారం చంపుకోలేని రైతులు అక్కడక్కడా కంది, మొక్కజొన్న పంటలతో నెట్టుకొస్తున్నారు. కారంజ కింద పచ్చని పొలాలు.. నారింజ వాగు వరద మీద ఆధార పడే కర్ణాటక ప్రభుత్వం బీదర్ జిల్లా హల్హళ్లి ప్రాంతంలో కారంజ ప్రాజెక్టును కట్టింది. మొత్తం 13 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. అవసరమైతే 0.374 టీఎంసీ డెడ్ స్టోరేజీ వరకు నీటిని వినియోగించుకునే విధంగా డిజైన్ చేశారు. ప్రాజెక్టు డ్యాం గరిష్ట ఎత్తు: 589.15 మీటర్లు కాగా ప్రస్తుతం 578.55 మీటర్ల వద్ద నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులో ఏడాది పొడవునా నీళ్లు ఉంటాయి. దీంతో అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడి రైతులు చెరుకుతోపాటు అల్లం, ఉల్లి, వెల్లుల్లి పంటలు వేశారు. రబీ సీజన్‌కు 14 వేల హెక్టార్లకు సాగు నీటిని అందించాలని అక్కడి ప్రభుత్వం సంకల్పించినా ఈ ఏడాది నారింజ వాగుకు సరిగా వరద నీరు చేరక పోవడంతో కారంజ పూర్తిగా నిండలేదు. అయినప్పటికీ ప్రాజెక్టు కింద 20 వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో చెరుకు, ఉల్లి తోటలు విస్తారంగా కనిపించాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో రైతులు బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వం సాగు కోసం నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. నారింజ నీరు కర్ణాటక రాష్ట్రానికి చేరక ముందే ఒడిసిపట్టుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లోనే సంకల్పించారు. సర్వే చేసి, వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ శాఖ అధికారులను అప్పట్లోనే ఆదేశించారు. పాలన పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైఎస్సార్ అప్పటికప్పుడు నారింజ వాగును మైనర్ ఇరిగేషన్ విభాగం నుంచి మేజర్ ఇరిగేషన్ విభాగానికి బదలాయించారు. వాగు వద్ద వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వేర్ మైల్స్, గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. ఈ లెక్కన నారింజ వాగు నుంచి ఏడాదికి 5 టీఎంసీలకు పైగా నీరు వృథాగా కర్ణాటకకు తరలిపోతోంది.వాగు కర్ణాటకలోకి ప్రవేశించడానికంటే ముందే సింగూరుకు మళ్లిస్తే కనీసం ఒక టీఎంసీ నీటిని జహీరాబాద్ నియోజకవర్గం రైతులకు అందించవచ్చని గుర్తించారు. వాగును మళ్లించడానికి జహీరాబాద్ మండ లం అల్గోల్ గ్రామం అనువైన ప్రాంతంగా గుర్తించారు. అల్గోల్ గ్రామం నుంచి కాలువ తవ్వకాలు మొదలు పెట్టి ఝరాసంగం మండలం మేదపల్లిలోని కొత్త చెరువులకు కలపాలి. అక్కడి నుంచి జీర్లపల్లి చెరువు మీదుగా దుబ్బ వాగుకు కలపాలి. అక్కడి నుంచి నీటిని సింగూరులోకి మళ్లించాలని ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు. ఈ మొత్తం కాలువ దూరం కేవలం 15.35 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని నిర్ధారించారు. ప్రాజెక్టు పనులు, కాలువ నిర్మాణం కోసం రూ 67.66 కోట్లు వ్యయం అవుతోందని అంచనా వేశారు. ఇలా సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఇరిగేషన్ శాఖ అధికారులు వైఎస్సార్ ప్రభుత్వానికి పంపారు. ఆ తరువాత జరిగిన పరిణామంతో ఈ ప్రతిపాదనల ఫైల్ అటకెక్కింది. ఆ తరువాత గద్దెనెక్కిన వారెవరూ నారింజ వాగు వైపు చూడకపోవడంతో ఇక్కడి రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ సర్కార్ నారింజపై దృష్టిసారించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
రైతన్న జలఘోష
బోయినపల్లి: రైతన్న సాగు నీటికోసం పెద్ద సమరమే చేస్తున్నాడు. రబీ పంటలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. గత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వరదకాలువ పరిస ర ప్రాంతాల్లోని బోర్లు, బావులు సైతం ఎండిపోయాయి. రబీలో వేసిన వరి, మొక్కజొన్న పంటలను దక్కించుకోవడం రైతులకు కష్టతరంగా మారింది. ఇక ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వరదకాలువ లో నీటివేట సాగిస్తున్నారు. కాల్వలో పెద్ద ఎత్తున గుంతలు తవ్వి వాటి ద్వారా పంటలకు నీరందించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీటికోసం రైతులు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం లేకపోవడం అన్నదాతలకు గుదిబండగా తయారైంది. గతంలో ఎస్సారెస్పీ నిండగా వరదకాలువ ద్వారా భారీగా నీరు విడుదల చేశారు. బోయినపల్లి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, ఇల్లంతకుంట తదితర వరదకాలువ పారకం ఉన్న మండలాల్లోని రైతులు పంటలు సాగు చేసుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గ త ఖరీఫ్ సీజన్ నుంచి ఇప్పటివరకు వర్షాభావంతో శ్రీరాంసాగర్ జలాశయం నీరు లేక వెలవెలబోతోంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. నీరు సమృద్ధిగా లేక ఖరీఫ్‌లో వరద కాలువకు అరకొరగా నీటిని వదిలారు. దీంతో జిల్లాలో దాదాపు 125 కిలోమీటర్లున్న వరద కాలువ వట్టిపోయింది. సాగు నీటి కోసం తపిస్తున్న రైతులు వరద కాలువలో పొక్లెయిన్లతో గుంతలు తవ్వుతున్నారు. గుంతలు, పైప్లైన్ల నిర్మాణానికి ఒక్కో రైతు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా తవ్విన గుంతల్లో సైతం నీటి ఊటలు కరువై అన్నదాతలు పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. మరోవైపు బావుల్లో నీరు అడుగంటడంతో మెజారిటీ రైతులు బోరు బావుల తవ్వకాలు చేపడుతున్నారు. రూ. లక్షలు ఖర్చు చేసి బోర్ల తవ్వకాలు చేస్తున్న రైతులకు బోరు సక్సెస్ కావడం లక్కీ లాటరీగా మారింది. అయినా పట్టువదలని అపరభగీరథుల్లా కొంతమంది రైతులు నాలుగైదు బోర్లు వేస్తున్నారు. వేసవికి ముందే నీటి ఊటలు అడుగంటడంతో వేసవికాలం ఎలా గడుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. -
సాగు నీటి కోసం రైతుల ఘర్షణ
వెంకటాచలం : కనుపూరు కాలువ కింద వరి సాగు చేస్తున్న రైతులు సోమవారం సాగునీటి కోసం ఘర్షణ పడ్డారు. కనుపూరు, చవటపాళెం, కసుమూరు, కురిచెర్లపాడు, వెంకటకృష్ణాపురం రైతులు 200 మందికి పైగా కొమ్మలపూడి బ్రాంచ్ కాలువ వద్దకు చేరుకుని తమ గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ముందుగా సాగునీరు తమ కే కావాలంటూ వాగ్వాదం పడ్డారు. ఒక దశలో ఘర్షణ పడటంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ షేక్ రహమతుల్లా, ఇరిగేషన్ అధికారులు బాల సుబ్రహ్మణ్యం, వీరాస్వామి, ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకుని అన్ని గ్రామాల రైతులతో చర్చించారు. ప్రతి గ్రామానికి నీటి తీరువాలు పెట్టి సమస్యను పరిష్కరించారు. రైతులు మాట్లాడుతూ సాగు నీరు లేక వరినాట్లు పూర్తిగా ఎండి పోతున్నాయన్నారు. డీఈ సమీవుల్లా సూచన మేరకే ఈ ఏడాది వరి సాగు చేశామని, లేదంటే ఈ ఏడాది సాగు విరమించుకునే వారమన్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డీఈ వచ్చి తమ సమస్య పరిష్కరించాలని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఇరిగేషన్ సిబ్బంది రైతులకు సర్ది చెప్పి పంపివేశారు. -
దోస సాగుతో ఆదాయం
జిల్లాలో రైతులు ఇప్పుడిప్పుడే దోస సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ పంటను ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చని కడప ఉద్యానశాఖ అధికారి రేణుకాప్రసాదరెడ్డి తెలిపారు. దోస రకాలు, పంటకాలం, సాగు కు అనుకూలించే నేలల గురించి రైతులకు తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... -కడప అగ్రికల్చర్ నేలలు: నీరు నిల్వని, ఒక మోస్తరు నుంచి సారవంతమైన గరప నేలలు, ఎర్రనేలలు, ఇసుక నేలలు, నల్లరేగడి నేలలు, మురికి నీరు ఇంకి పోయే నేలలు చాలా అనుకూలం. రకాలు: ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న రకాల్లో ప్రధానమైనవి కుందన్; కోహినూర్, నాంధారి-910, కళ్యాణ్ రకాలు ఉన్నప్పటికి ఎక్కువగా గోల్డెన్గ్లోరి, కుందన్ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఈనెల నుంచి జనవరి నెల 17వ తేదీలోపల విత్తనాలను పూడ్చుకోవద్దు. అయితే నాంధారి-910 రకం చాలా అనుకూలమైందని రైతులు చెబుతున్నారు. పంట కాలం: ఈ రకాలు అతి తక్కువ పంటకాలం అంటే కేవలం 2, 2 1/2 నెలలోపే దిగుబడులు మార్కెట్‌కు వస్తాయి. పంటను, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి సాగు చేసుకుంటే మంచిది. రైతులు ఆయా రకాలకు ఈ సీజన్లో మార్కెట్ ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం మంచిది. పొలం తయారీ ఇలా... భూమిని బాగా దుక్కిదున్ని మెత్త పరచుకోవాలి. పశువుల ఎరువు 2 టన్నులు లేదా అంతే పరిమాణంలో వానపాముల ఎరువు, 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేసిన తరువాత 6-8 అడుగుల దూరంలో బెడ్లు తయారు చేసుకోవాలి. డ్రిప్ సౌకర్యం చేయదలుచుకుంటే బెడ్ల మధ్యలో డ్రిప్ లేటరల్ పైపులను ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు పూడ్చడానికి ముందురోజు కనీసం 4-5 గంటలు డ్రిప్ ద్వారా నీరు పారించాలి. విత్తనం పూడ్చిన వెంటనే నీరు డ్రిప్ ద్వారా సాధారణంగా పారించాలి. సాగులో ఎరువుల, నీటి తడుల యాజమాన్యం పూడ్చిన వారంలోపు విత్తనాలు మొలకెత్తుతాయి. ఈ దశలో మొలకెత్తక ముందే గింజలను ఎలుకలు తినేయడం వల్ల చాలా చోట్ల ఖాళీలు ఏర్పడతాయి. అలాగే చిన్న మొలకలను మిడతలు, గుమ్మడి పురుగులు తినేయడం వల్ల కూడా ఖాళీలు ఏర్పడతాయి. వీటి నివారణకు ఫోరేట్ గుళికలు విత్తనం వేసే రోజే విత్తనం వద్ద 5-6 అంగుళాల లోతులో గుళికలు పడేలా పోయాలి. మొలకెత్తిన తరువాత తీగలు 3-4 ఆకుల దశలో 1 గ్రాము బోరాక్స్ లేదా సోలుబోరాన్ లీటరు నీటికి కలిపి వారంలో రెండుసార్లు పిచికారి చేయాలి. దీనివల్ల ఆడపూలు ఎక్కువగా వచ్చి మగపూలు తక్కువ ఏర్పడతాయి. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. మొలకెత్తిన వారం రోజుల తరువాత డ్రిప్ ద్వారా ప్రతి రెండు రోజులకు ఒకసారి ఎకరాకు 2 1/2 కిలోల యూరియా, 2 కిలోల పొటాష్ ఎరువులను 15 విడ తలుగా 45 రోజుల వరకు వేస్తుండాలి. ఆ తరువాత 2 కిలోల యూరియా, 3 కిలోల పొటాష్ ఎరువును నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా పంపించాలి. పూత, పిందె ప్రారంభమైన తరువాత మల్టికె-10 లేదా 0.5 మిల్లీ లీటర్ల స్కోర్‌ను లీటరు నీటికి కలిపి 2-3 సార్లు పిచికారీ చేయాలి. నీటిపారుదల: పంటను సాగు చేసిన కాలాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి రోజు లే దా రోజు విడిచి రోజుకు 2-3 గంటలు నీటిని డ్రిప్‌తో అందించాలి. కాయలు పెరిగే దశలో, పక్వానికి వచ్చే దశలో నీటి తడులలో హెచ్చు తగ్గులు లేకుండా పొలంలో తేమ తగు మాత్రంగా సమంగా ఉండేలా చూసుకోవాలి, లేకుంటే కాయలు పగుళ్లు వస్తాయి. సస్యరక్షణ: దోస పంటపై ప్రారంభ దశ నుంచే పురుగుల తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఎర్రనల్లి, గుమ్మడి పురుగులు వైరస్ తెగులు ఆశించే అవకాశం ఎక్కువ. గుమ్మడి పురుగులు రెండు ఆకుల దశ నుంచి 4 ఆకుల దశ మధ్యలో ఆరంజి రంగులో ఉండే ఈ గుమ్మడి పురుగులు ఆకులను, మొలకలను తిని నష్టపరుస్తాయి. దీని నివారణకు 2 మిల్లీ లీటర్ల క్వినాల్ఫాస్ లేదా 2 1/2 మిల్లీ లీటర్ల క్లోరిఫైరిపాస్ లీటరు నీటికి కలిపి ఒకసారి పిచికారి చేయాలి. ఎర్రనల్లి ఆరంజి,ఎరుపు రంగులో ఉండే సన్ననివి, నల్లులు పెద్దవి, పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా ఆకుల కింది చేరి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుని పోయి పురుగుదల లేకుండా మొక్క మందగిస్తుంది. ఈ ఎర్రనల్లి తీవ్రత ఎక్కువైతే ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు 2 మిల్లీ లీటర్ల ఎక్సోడస్+1 గ్రాము బయోస్పార్క్ లేదా 2 మిల్లీ లీటర్ల ఇధియాన్ లేదా 2 మిల్లీ లీటర్ల ప్రోపర్గేట్ లేదా 0.5 మిల్లీ లీటర్ల వర్టిమెక్ లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. -
ఆశల సాగు
కల్హేర్: అసలే సాగునీరు అంతంత మా త్రం...ఆపై అనావృష్టి..ఖరీఫ్‌లో వేసిన పంటలన్నీ నాశనమయ్యాయి. వ్యవసాయమే తప్ప మరొకటి తెలియని రైతన్నలు భూమాతనే నమ్ముకుని రబీకి సిద్ధమయ్యారు. కానీ ఈ సారి సొంత భూముల్లో కాకుండా శిఖం భూముల్లో అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. సాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే కావడంతో ప్రత్యామ్నాయంగా తేమశాతం ఎక్కువగా ఉండే నిజాంసాగర్ ప్రాజెక్టు వైపు దృష్టి మళ్లించారు. అనుమతులు లేకున్నప్పటికీ మరో దారిలేక శిఖం భూమిని దున్ని శనగ విత్తనాలు వేసుకుంటున్నాడు. సాగర్‌లో శనగసాగు జిల్లాలో విస్తరించిన నిజాంసాగర్ శిఖం భూములు వేల ఎకరాల వరకు ఉంటాయి. ఈసారి వర్షాలు అంతంతమాత్రమే కావడంతో నిజాంసాగర్ శిఖం భూముల్లో నీరు చేరలేదు. ప్రస్తుతం 10 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉండడంతో అందులో శనగ పండించేందుకు సమీప ప్రాంతాల రైతులు సిద్ధమయ్యారు. కల్హేర్ మండలంలోని రాంరెడ్డిపేట, బాచేపల్లి, ఖానాపూర్(బి), దామర్చెరువుతో పాటు నారాయణఖేడ్ మండలం నిజాంపేటకు చెందిన రైతులు ఒకరి చూసి మరొకరు శనగ విత్తనాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం వైపు పరుగు తీస్తున్నారు. వారం రోజులుగా సుమారు 500 మందికు పైగా రైతులు శిఖం భూముల్లో హద్దులు ఏర్పాటు చేసుకుని దుక్కి దున్నడంతో పాటు విత్తనం కూడా వేసేశారు. మరికొంత మంది ఇపుడిపుడే దుక్కికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ శిఖం భూముల్లో 200 వరకు నాగళ్లు, 20 వరకు ట్రాక్టర్లతో దుక్కి పనులు జరుగుతున్నాయి. దేవుడిపైభారం వేసి నిజాంసాగర్ శిఖం భూముల్లో సాగు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకున్నా రైతులు ఈ భూముల్లో సాగుకు సిద్ధమయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో విత్తనాలు వేస్తున్నా, అధికారులు ఎప్పుడొచ్చి అడ్డుకుంటారోనన్న భయంతో హడావుడిగా పనులు కానిస్తున్నారు. ఒకవేళ అధికారులు అడ్డుకోకపోయినా, ప్రతి యేటా సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్‌కు వదిలే 3 టీఎంసీల నీరు వచ్చినా శిఖం భూములు మునిగిపోతాయి. అయినప్పటికీ వరుణుడు ఈ రబీలోనూ కరుణ చూపడన్న అంచనాలతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. శిఖం భూముల కోసం గొడవలు ఒకరిని చూసి మరొకరు ఇలా రైతులంతా నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖంలో పెద్ద ఎత్తున సాగుకు సిద్ధం కావడంతో శిఖం భూమి కోసం డిమాండ్ ఏర్పడింది. దీంతో కొందరు రైతులు భూమి కోసం ఘర్షణకు దిగుతున్నారు. గొడవలకు దిగకుండా రైతులు సంయమనం పాటిస్తే కరువు కాలంలో కాసిన్ని శనగలైనా పండించుకుని బతికిపోవచ్చని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. -
సాగులో సాంకేతిక పద్ధతులు అవలంబించాలి
శాస్త్రవేత్తలందరూ 5 బృందాలుగా విడిపోయి, గ్రామ పరిధిలోని పొలాలకు వెళ్లారు. ఎక్కడ ఏ భూములున్నాయి, ఏ పంటలు వేశారు, అక్కడ ఎలాంటి వనరులున్నాయి వంటి అంశాలను జీపీఎస్ ద్వారా గుర్తించారు. పనికిరాని మొక్కలనుకునేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, సంప్రదాయ పంటసాగు విధానం నుంచి ఆధునిక సాంకేతిక సాగుపై డాక్యుమెంటరీకి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. మట్టి నమూనాలను సేకరించి, అందులో అధికంగా ఉన్న పోషక లోపాలను గుర్తించారు. పత్తి పంట సాగుపై ఆరా పత్తిపంటను ఎందుకు సాగు చేస్తున్నారని, ఎలాంటి విత్తనాల ఎంపిక చేసుకుంటున్నారు, ఆశించే రోగాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం రైతులతో కలిసి శాస్త్రవేత్తలు సమావేశం నిర్వహించారు. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంపై రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలిచ్చారు. ఆముదం, కంది, పెసర, కుసుమ పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచించగా, ఆ పంటలు లాభసాటిగా లేవని, పత్తి పంట లాభసాటిగా ఉందని వివరించారు. సాగు నీరు, కరెంటు అందిస్తే ప్రభుత్వం ఏ రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదని నెల్లికంటి బాబు అనే రైతు శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లాడు. విద్యాశేఖర్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ పత్తి విత్తనాలు 50మి.మీ.లకు పైగా వర్షం కురిసినప్పుడే విత్తాలన్నారు. లేకపోతే పత్తి పంట తొందరగా బెట్టకొస్తుందన్నారు. మరికొంత మంది శాస్త్రవేత్తలు కందులు నాటే విధానం, వరిసాగు వెదజల్లే విధానం, మెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకునే విధానాన్ని వివరించారు. 69 వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలకు శిక్షణ సీనియర్ శాస్త్రవేత్త కె.హనుమంతరావు మాట్లాడుతూ దేశంలోనే 69 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలకు నార్మ్ శిక్షణ ఇస్తుందన్నారు. యువ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసేందుకు దేశంలో 12 గ్రామీణ ప్రాంతాలను గుర్తించామన్నారు. వారు అక్కడి గ్రామాల్లో 3 వారాల పాటు పరిశోధనలు చేస్తారన్నారు. దీని ద్వారా వ్యవసాయంపై నూతన ప్రణాళికలు రూపొందించడానికి ఉపయోగపడుతు ందన్నారు. శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చేది దేశంలో నార్మ్ మాత్రమేనన్నారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బృందం హెడ్ డాక్టర్ సంధ్యాషైనా, సీనియర్ శాస్త్రవేత్తలు వీకే.జయరావు, పద్మయ్య, సతీష్, షేక్మీరా, కో-ఆర్డినేటర్ సొట్టంకె, తమ్మరాజా, వెంకటేశం, వెంకట్‌కుమార్, సూర్య రాథోడ్ ,గ్రామా సర్పంచ్ ఎర్ర మల్లేష్, ఏఓ శ్రీనివాస్‌లు, ఏఈఓ నర్సింహ తదితరులున్నారు. -
కృష్ణమ్మను రప్పించండి: వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, కడప : జిల్లా రైతులు ప్రతిసారి కరువు కొరల్లో చిక్కుకుపోతున్నారు.. మిగతా జిల్లాలకు ఎప్పుడో కరువు వస్తే.. ఇక్కడ మాత్రం పిలవని పేరంటంలా వచ్చి ఇబ్బంది పెడుతోంది. తుంగభద్ర నుంచి సాగునీరు సక్రమంగా రాక పులివెందుల, జమ్మలమడుగు రైతులు అల్లాడుతున్నారు... కృష్ణా జలాలైనా సంపూర్ణంగా వస్తే తప్ప.. కేసీ కాలువతోపాటు ఇతర ప్రాంతాల రైతులకు పంటలు పండించుకునే అవకాశం ఉండదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, గండికోట, జీఎన్ఎస్ఎస్ అధికారులతో వైఎస్ జగన్ శుక్రవారం విడివిడిగా సమీక్షించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డితో కలిసి వైఎస్ జగన్ అధికారులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలను గండికోటకు ఈసారైనా తీసుకురావాలని.. ఇంతలోపే ముంపు గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సిన పరిహారం మొత్తాన్ని ఇవ్వాలన్నారు. కృష్ణా జలాలు గండికోటకు వస్తే అక్కడ నుంచి పైడిపాలెంకు తీసుకరావచ్చని.. అలాగే సీబీఆర్‌కు కూడా పంపింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. పైడిపాలెం, సీబీఆర్, పీబీసీ, బైపాస్ కాలువలకు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్‌లో ఎందుకున్నాయని ఆయన ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ ఉన్నప్పుడే 80శాతం పైగా పనులు పూర్తయితే.. ఇప్పటివరకు ఇంకా పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు. తుంగభద్ర నుంచి ఈసారైనా పులివెందులకు పూర్తి కోటా నీరు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని.. ఐఏబీ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ మేరకు డిమాండు చేస్తారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పీబీసీకి 4.4 టీఎంసీతోపాటు, మైలవరానికి 1.300టీఎంసీల పూర్తికోటా నీటిని అందించాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్లను ఇబ్బంది పెట్టొదు రేషన్ డీలర్లకు సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు మెరుగ్గా నిత్యావసర వస్తువులను అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని.. అలా కాకుండా కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేయడం తగదని వైఎస్ జగన్ సూచించారు. నిజంగానే డీలర్ అన్యాయంగా సొమ్ము చేసుకుంటుంటే చర్యలు తీసుకుంటే బాగుంటుంది కానీ.. అనవసరంగా ఎలాగోలాగా ఇబ్బందులు పెట్టి తొలగించాలని చూడటం మంచి పద్దతి కాదన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించండి : పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉన్న గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. గ్రామాల్లో సమస్యలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమావేశాలలో మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో రఘునాథరెడ్డి, పీబీసీ, పైడిపాలెం ప్రాజెక్టుల ఈఈలు రాజశేఖర్, చెంగయ్యకుమార్‌లతోపాటు పలువురు డీఈలు, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ రఘురామయ్య, ఏడు మండలాల తహశీల్దార్లు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, శివరామయ్య, శ్రీనివాసులు, ఎల్.వి.ప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవోలు మురళీమోహన్‌మూర్తి, సమత, జ్ఞానేంద్రరెడ్డి, మైథిలీ, బాలమునెయ్య, వెంకటేష్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. పింఛన్లను సక్రమంగా పంపిణీ చేయండి నెలకొకమారు వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న రూ. 200 పింఛన్‌ను అధికారులు సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఏ సమయానికి ఎక్కడ పింఛన్ ఇస్తున్నారో.. ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా తెలపకపోవడంతో లబ్ధిదారుల పింఛనంతా ఆటో ఛార్జీలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల పేరుతో ఇబ్బందులు సృష్టించడం తగదని.. మాన్యువల్ పద్దతిలోనే లబ్ధిదారులకు ఠంచన్‌గా పింఛన్ అందేదన్నారు. -
పునాదుల్లోనే పులకుర్తి
అధికారంలోకి వచ్చిన వెంటనే పులకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తి చేయిస్తాం. కరువును పారదోలి రైతులను ఆదుకుంటాం. - పాదయాత్ర సమయంలో గూడూరు, సి.బెళగల్ మండల కేంద్రాల్లో రైతులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తోంది. పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. కర్నూలు రూరల్: పాలకుల నిర్లక్ష్యంతో కోడుమూరు నియోజకవర్గంలో పులకుర్తి ఎత్తిపోతల పథకం పనులు మందుకు సాగడం లేదు. శంకుస్థాపన చేసి ఏడాది దాటిపోయిన ఈ పథకం పునాదులకే పరిమిత మయింది. తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని టెయిల్‌పాండ్ కాలువ అయిన కర్నూలు బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న 23 వేల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు. ఈ భూములకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత నేత శిఖామణి 2006 మార్చిలో జిల్లాకు వచ్చిన అప్పటి సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్ సానుకూలంగా స్పందించడంతో పులకుర్తి ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు 2006 మే నెల 11వ తేదీన నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి సర్వే ఉత్తర్వులు వచ్చాయి. అయితే శిఖామణి మరణంతో ఆ పథకం పనులు సాగలేదు. గత ఏడాది జూన్ నెలలో హడావుడిగా కోడుమూరులో ఉన్న దిగువ కాలువ సబ్‌డివిజన్ ఆఫీస్ అవరణంలోనే శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పంపింగ్ స్టేషన్ పనులు పునాదులతో నిలిచిపోయాయి. శంకుస్థాపనకు ముందే భూసేకరణ చేయాల్సి ఉన్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో పథకం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడతున్నాయి. ఈ పథకం నుంచి సి.బెళగల్ చెరువుకు తుంగభద్ర జలాలు అందనున్నాయి. ఈ చెరువు కింద ఉన్న సుమారు 1250 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ పథకం ద్వారా గుండ్రేవుల దగ్గర వాటర్ పంపింగ్ స్టేషన్ నుంచి పులకుర్తి సమీపంలోని రిజర్వాయర్కి నీటిని సరఫరా చేయాల్సింది. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..పులకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. భూ సేకరణే అసలు సమస్య పులకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 2013 జూన్ నెలలో శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్, పైపు లైన్ల కోసం అవసరమైన 122ఎకరాల భూసేకరణ జరుగాల్సింది. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. భూసేకరణకు ప్రభుత్వ నిబంధనల మార్పు వల్లే అనుమతులు రావడం లేదు. - ఆర్.నాగేశ్వర్రావు, నీటిపారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ -
ఖరీఫ్ కష్టం!
అన్నదాతకు కష్టకాలమొచ్చింది. ఓ వైపు భానుడు ఇప్పటికీ చండ ప్రచండంగా విరుచుకుపడుతుండ గా, మరోవైపు వరుణుడు కరుణించకపోవటంతో ఖరీఫ్ పంటల పరిస్థితి అగమ్య గోచరంగా తయూరైంది. జూన్ ముగుస్తున్నా.. చుక్క చినుకైనా రాలకపోవటంతో వ్యవసాయ పనులు ముందుకు సాగటం లేదు. సాగునీటి లభ్యతపై అనుమానాల కారణంగా జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే పరిస్థితి నెలకొంది. ఫలితంగా రానున్న రోజుల్లో సాధారణ జనానికీ ఇబ్బందులు తప్పేలా లేవు. కొరిటెపాడు(గుంటూరు): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే కష్టాలెదురవటంతో జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాల ధరలు పెరగటం.. బ్యాంకు రుణాల మాఫీపైనా.. కొత్త రుణాల మంజూరుపైనా సందిగ్ధత నెలకొనటంతో ఇప్పటికే తల్లడిల్లుతున్న అన్నదాతలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కలవరం కలిగిస్తోంది. మరోవైపు.. వేళాపాళా లేని విద్యుత్ కోతలు భయపెడుతున్నారుు. సాధారణంగా ఈ సమయానికి రైతులు పొలం పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటారు. అలాంటిది ఈ ఏడాది ఇప్పటివరకు చిన్న చినుకు కూడా రాలకపోవడంతో వ్యవసాయ పనులు ప్రారంభించలేదు. జూలైలోగా ఖరీఫ్ పంటల సాగు ప్రారంభం కాకపోతే రబీలో కూడా ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఆలస్యమైతే ఖరీఫ్ పంటల దిగుబడి వచ్చే సమయూనికి తుపాన్ల బారిన పడి నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అలాగే రబీలో పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న వంటి పంటల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ వర్షపాతం పరిస్థితి.. జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 8.64 సెంటీ మీటర్లు కాగా గతేడాది 11.08 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క మిల్లీమీటరు వర్షం కూడా పడలేదు. ఆందోళన కలిగిస్తున్న సాగు విస్తీర్ణం.. సాగునీరు అందదేమోనన్న భయం కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే పరిస్థితి నెలకొనటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 13.85 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25,778 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు వేశారు. పత్తి 12,500 ఎకరాలు, నువ్వులు 8,000, ఆముదం 1560, చెరుకు 263, పెసలు 40, ఇతర పంటలు 3,415 ఎకరాల్లో సాగవుతున్నారుు. గత ఏడాది ఇదే సమయానికి 37,500 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. -
జూలైలో పుష్కరనీరు విడుదల చేయాలి
జగ్గంపేట : మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను అందించే పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా జూలై మొదటి వారం నుంచే రైతులకు సాగునీరు విడుదల చేయాలని పుష్కర ఇరిగేషన్ అధికారులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. పుష్కర పథకం సాగునీరు అందించడంలో ఏర్పడే సమస్యలు, వాటి పరిష్కారం తదితర అంశాలపై శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్యోతుల మాట్లాడుతూ పుష్కర పథకం ద్వారా మూడేళ్లుగా ఖరీఫ్‌లో రైతులకు నీరు సరఫరా చేస్తున్నా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. మొత్తం 1,86,000 ఎకరాలకు నీరు అందించేందుకు రూపొందించిన ఈ పథకం ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో 59 వేల ఎకరాలకు నీరు రావాలన్నారు. అయితే 20 వేల ఎకరాలకు నీరందే పరిస్థితి నెలకొందన్నారు. కాలువల్లో పూడిక తీయడానికి సమయం లేనందున ఉపాధి పథకం ద్వారా వీలైనంత త్వరగా చిన్న చిన్న కాలువలను శుభ్రపరచాలన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం క్షేత్రస్థాయిలో కాలువల పరిశీలన చేద్దామన్నారు. జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల నుంచి వచ్చిన రైతులు సమీక్షలో పుష్కర సమస్యలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి ధవళేశ్వరం ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు అత్తులూరి సాయిబాబు, డీఈఈలు రామచంద్రరావు, శ్రీరామచంద్రమూర్తి, ప్రశాంత్ బాబు, హోలిపుల, జేఈ మనోహర్ చంద్రశేఖర్, ఇన్చార్జి ఎంపీడీఓ నరసింగరావు, జగ్గంపేట సర్పంచ్ ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు. -
రెండో పంటకు 2.50 లక్షల ఎకరాలకు నీరు !
సాక్షి, నెల్లూరు : సోమశిల జలాశయం పరిధిలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో రెండో పంటకు సాగునీరు అందించే అవకాశముందని కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో మరోమారు చర్చించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని గోల్డెన్ జూబ్లీహాల్లో గురువారం ఆయన అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. వివిధ అవసరాలకు పోను జలాశయంలో ఉన్న 18 టీఎంసీల నీటిని దృష్టిలో ఉంచుకుని 1.50 లక్షల ఎకరాలకు నీరు అందించాలని మొదట అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు నివేదిక సమర్పించారు. దీనిపై రైతు సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు. డెడ్‌స్టోరేజీ కింద 7.5 టీఎంసీలు అవసరం లేదని, 5 టీఎంసీలకు కుదించవచ్చన్నారు. ఏప్రిల్ 15 నాటికి సుమారు 6 టీఎంసీల నీరు అదనంగా లభిస్తుందన్నారు. ఈక్రమంలో 25 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని వివరించారు. ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలు సాగుచేయవచ్చని, ఈ లెక్కన 2.50 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగుచేయవచ్చని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్ అధికారుల్లో కొందరు కావలి కాలువ పరిధిలో నీటిని అమ్ముకుంటున్నారని రైతు సంఘం నేత బెజవాడ గోవిందరెడ్డి ఫిర్యాదు చేశారు. లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు నాసిరకంగా చేసి దోపిడీకి పాల్పడ్డారని పలువురు కలెక్టర్‌కు వివరించారు. నీటి కేటాయింపులపై స్పందించిన కలెక్టర్ రైతు సంఘాల నేతల అభిప్రాయంతో ఏకీభవించారు. 2 లక్షల 50 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు నేతల సూచనలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించాలని ఇరిగేషన్ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. నీటి విడుదల తేదీని త్వరలో ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం కాలువల ఆధునికీకరణ పనులు జరుగుతున్న తీరుపై రైతు సంఘాల నేతలు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకంగా పనులు జరుగుతుంటే క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మొహమాటాలకు తావివ్వవద్దని, ఇంజనీర్లు ఇంజనీర్లుగానే వ్యవహరించాలని మండిపడ్డారు. కావలి కాలువ కింద నీటి అమ్మకాలు జరుగుతున్న విషయం గతంలోనూ తన దృష్టికి వచ్చిందని, భవిష్యత్‌లో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రేఖారాణి పాల్గొన్నారు. పొదుపుగా వాడుకోవాలి.. సోమశిల ప్రాజెక్టులో ప్రస్తుతం 43.5 టీఎంసీల నీరు ఉంది. డెడ్‌స్టోరేజ్, తాగునీరు తదితర అవసరాలకు పోను 35 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ నీరు వృథా కాకుండా పొదుపుగా వినియోగిస్తే 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు సరఫరా చేయవచ్చు. నేరుగా పొలాలకు నీరు సరఫరా చేసేలా అధికారుల చర్యలు తీసుకోవాలి. దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి పంట ఎండకుండా చూడాలి అరుతడి విధానం ద్వారా పంటలు సాగు చేస్తే 1 టీఎంసీ నీటితో 14 వేల ఎకరాలు సాగు చేయవచ్చు. సకాలంలో సాగునీరు సరఫరా చేసి పంటలు ఎండిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంకమరాజు -
దళారి చేతిలో అన్నదాత దగా
దగదర్తి, న్యూస్‌లైన్: ఎకరాకు 4 పుట్ల ధాన్యం దిగుబడి ఇచ్చే భూములవి. సాగునీరు కూడా పుష్కలంగా వస్తోం ది. పైరుగా ఏపుగా పెరుగుతోంది. ఈ ఏడాది తమ పంట పండినట్టేనని రైతు లు భావించారు. ఇంతలో చిరుపొట్ట ద శకు చేరుకునే సమయంలో పైరు ఒక్కసారిగా గిటకబారసాగింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన వరిపైరు గిటకబారి ఎండిపోతుండటంతో అన్నదాత లబోదిబోమంటున్నారు. దళారి నకిలీ విత్తనాలు అంటగట్టడంతోనే తాము ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. దగదర్తి మండలం పెదపుత్తేడు గ్రామంలోని రైతుల కష్టాలివి. సాధారణంగా ధాన్యం అమ్ముకునే సమయంలో దళారుల చేతిలో దగాపడే అన్నదాత సాగు మొదట్లోనే కోలుకోలేని దెబ్బతిన్నారు. రేణంగి కాంతమ్మకు భర్త లేరు. కుమారుడు కష్టపడి సంపాదిం చిన మొత్తంలో ఎక్కువ శాతం సేద్యానికే వెచ్చిస్తుంది. నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరిపంట సాగు చేస్తోంది. పైరు ఎండిపోతుండటం, ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓజిలి శూలం మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. అప్పులు తెచ్చి సాగుచేసిన పంట ఎండుముఖం పట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. షేక్ రహంతుల్లా ఆరెకరాల భూమిలో వరిసాగు చేస్తున్నారు. పంట ఎండుముఖం పట్టడంతో దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నాడు. దళారిని నమ్మడంతో నకిలీ విత్తనా లు అంటగట్టాడని, ఎండుతున్న పంట దున్నేందు కు తప్ప దేనికీ పనికిరాదని వాపోతున్నాడు. గెరికపాటి ఓబయ్య ఐదెకరాల భూమిని కౌ లుకు తీసుకు ని వరి సాగుచేశాడు. మంచి దిగుబడులు సాధించి అప్పులు తీర్చుకోవాలని భావించిన ఈయన కల కల్లయిం ది. ఏపుగా పెరిగిన వరి ఒక్కసారిగా గిటకబారిందని, నాసిరకమైన విత్తనాలు అంటగట్టి దళారి మోసం చేశాడని బోరుమంటున్నాడు. పంటలను పరిశీలిస్తా: ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయా లి. ఎండుతున్న వరిపంటను పరిశీ లించి అధికారులకు వివరిస్తాం. రసీదులు, విత్తనాలు ఇచ్చిన సంచులు ఉంటే దళారులపై తగిన చర్యలు తీసుకుంటాం. - విజయభాస్కర్, వ్యవసాయాధికారి, దగదర్తి -
ఆధునికీకరణ.. అస్తవ్యస్తం
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: గాజులదిన్నె ప్రాజెక్టు ఆధునికీకరణ అస్తవ్యస్తంగా మారింది. కోట్లు ఖర్చుచేసినా ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు పెరగడం లేదు. హంద్రీ నదిపై 1977 సంవత్సరంలో ఈ జలాశయాన్ని నిర్మించారు. 5.25 టీఎంసీల సామర్థ్యంతో 32,500 ఎకరాలకు రబీలో సాగునీరు అందించాలనేది ప్రధాన ఉద్దేశం. అయితే ప్రాజెక్టు కరకట్టలు బలహీనంగా ఉండడం, గేట్లు శిథిలావస్థకు చేరి, పంట కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీంతో ఆయకట్టు ఏటేటా తగ్గుతూ వస్తోంది. సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టు.. తాగునీటి జలాశయంగా మారింది. ప్రాజెక్టు పటిష్టతకు చర్యలు తీసుకోకపోతే మనుగడ కష్టమని 1996 సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్, ఈఎన్సీల బృందం ఇచ్చిన నివేదిక మేరకు 2009 సంవత్సరంలో ప్రాజెక్టును ఆధునీకరించడం కోసం జపాన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెన్సీ(జేఐఏసీ) సహాయంతో 43 కోట్లతో పనులు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. 2011 సంవత్సరంలో హైదరాబాద్‌కు చెందిన హార్విన్ కన్స్ట్రక్షన్ గ్రూపు ఒక శాతం తక్కువతో టెండర్ వేసి అగ్రిమెంట్ చేసుకుంది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఏజెన్సీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. రాజకీయ నాయకుల వాటాలు.. అధికారుల పర్సంటేజీల వల్ల పనులు అడ్డగోలుగా చేశారు. వీటిని తనిఖీ చేసేందుకు ఆయకట్టు అభివృద్ధి శాఖ స్పెషల్ కమీషనర్ వెంకట్రామయ్య, జైకా ప్రతినిధులు శుక్రవారం గాజులదిన్నెకు వస్తున్నారు. ఆధునికీకరణ ఇలా.. జలాశయానికి ఉన్న ఆరు స్లూయిజ్‌ల గోడలు బలహీన పడ్డాయి. వీటికి మరమ్మతులు చేసి, వరద ఉదృతికి తట్టుకునేలా అదనంగా రెండు స్లూయిజ్‌లను నిర్మించాల్సి ఉంది. జలాశయం కుడికాలువ 36 కి.మీ., ఎడమ కాలువ 22 కి.మీ., వరకు లైనింగ్ పనులు చేయాలి. కుడి కాలువ 24 కి.మీ, ఎడమ కాలువ 16 కి.మీ వరకే లైనింగ్ చేసి, డిస్రీబ్యూటరీ కాలువలు చేయకపోవడంతో చేసిన పనులు ప్రయెజనకరంగా లేవని ఆయకట్టుదారులు వాపోతున్నారు. ఈ పనులు తుంగభద్ర దిగువ కాలువ ఈఈ పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. అయితే దిగువ కాలువకి దాదాపు సంవత్సరంన్నర నుంచి రెగ్యులర్ ఈఈ లేకపోవడం ఇన్చార్జిగా చిన్న నీటిపారుదల శాఖ కర్నూలు సర్కిల్ ఈఈ శ్రీనివాసులు పని చేస్తున్నారు. నాసిరకంగా జరిగిన పనుల్లో కొన్ని... కుడి కాలువ 2 నుంచి 12 కిలో మీటర్ల వరకు చేసిన పనుల్లో నాణ్యత డొల్లతనం కనిపిస్తోంది. 7.9 కి.మీ., వద్ద కాలువ లైనింగ్లో నాణ్యత లేకపోవడంతో చీలికలు ఏర్పడ్డాయి. 8.90 కి.మీ., వద్ద కంకర రాళ్లు బయటికే కనిపిస్తున్నాయి. 4.15 కిలో మీటర్ల వద్ద చేపట్టిన తూము పనులు అసంపూర్తిగానే వదిలేశారు 5.9, 7.10 కి.మీ., వద్ద ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు కాల్వల్లో ఎక్కడ చూసిన చీలికలే అగుపిస్తాయి. ఇవి పైకి కనిపించకుండా మట్టితోనే కప్పివేశారు. కెనాల్ గట్ల పటిష్టతకు గ్రావెల్ ఫెన్సింగ్ చేయాల్సి ఉన్నా సదరు కాంట్రాక్టర్ సమీపంలో ఉన్న రైతుల పొలాల గట్ల దగ్గరి నాసిరకమైన మట్టిని పోసి సోకు చేసేశారు. మరికొన్ని చోట్ల సిమెంట్‌తో అతుకులు వేశారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వేమీ పట్టించుకోకుండా బిల్లులు చెల్లించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆధునీకరణ పనుల్లో గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో పగుళ్లు ఇచ్చాయి. ప్రాజెక్టు బిడ్డింగ్ కూడా సక్రమంగా వేయకపోవడంతో పగులు ఇచ్చి కుంగిపోయే విధంగా తయారయ్యింది. ఇప్పటి వరకు చేసిప పనులకు సుమారు 40 కోట్ల వరకు చెల్లించారు. మిగిలిన రెండు కోట్ల రూపాయల ఆఖరి బిల్లును చెల్లించేందుకు కూడ రంగం సిద్ధం అయింది. -
నిండినా..ఎండిపోవడమే
ఉప్పునుంతల, న్యూస్‌లైన్: జిల్లాలో సాగునీరు వనరుల్లో ఒకటైన డిండి రిజర్వాయర్ ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటితో నిండినా జిల్లా రైతులకు మాత్రం పంటలు పండించుకునే అదృష్టం లేకుండాపోయింది. నల్గొండ జిల్లాతో పాటు పాలమూరు రైతులకు నీరందించే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం చేపట్టిన కుడికాల్వ ఆధునికీకరణ పనులు నాసిరకంగా చేపట్టడం, కాల్వ చివరి వరకు పనులను పూర్తి చేయకపోవడంతో ప్రాజెక్టు నీరంతా వృథాగా పోతుంది. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల సరిహద్దులో నిర్మించిన డిండి ప్రాజెక్టును 14ఏళ్ల క్రితం అలుగు ఎత్తు పెంచడంతో పాటు కుడికాల్వ ద్వారా జిల్లాలోని కొంత ఆయకట్టుకు నీరందేలా పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే మండలంలోని లత్తీపూర్, గువ్వలోనిపల్లి శివారులోని 330 ఎకరాలకు సాగునీరందే విధంగా మర్రికుంట వరకు మట్టికాల్వలను తీశారు. నాలుగేళ్ల క్రితం ఏడు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మట్టికాల్వ ఆధునికీకరణ కోసం జపాన్ రూ.1.50 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ నిధులతో ఐదుకిలోమీటర్ల మేర కాల్వను ఆధునికీకరణ పనులు చేపట్టారు. అందులో కొంతదూరం ఇంతకుముందు రాళ్లతో కట్టిన పాతకాల్వ మరమ్మతుతో పాటు మట్టికాల్వను కాంక్రిట్ పనులు చేశారు. పాతకాల్వకు అక్కడక్కడ సిమెంట్ పూతలు పూశారని రైతులు ఆరోపిస్తున్నారు. కాంక్రిట్ పనులు నాసిరకంగా చేపట్టడంతో కాల్వలకు పగుళ్లు వచ్చాయి. మరో రెండు కిలోమీటర్ల మేర మట్టికాల్వను ఆధునీకరించకుండానే వదిలేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టరు కావడంతో పనులు నామమాత్రంగా చేసి దులుపుకున్నారు. దీంతో నాలుగేళ్లు కూడా దాటనిదే కాంక్రిట్కాల్వలు పగుళ్లు వచ్చాయి. దీంతో కాల్వవెంట నీరు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ఆయకట్టు రైతుల మండిపాటు పనులకు పర్యవేక్షించే అధికారులు నల్గొండ జిల్లా వారు కావడం, ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేసి డబ్బులు దండుకున్నారని గువ్వలోనిపల్లికి చెందిన ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. పూర్తిస్థాయిలో కాలువ ఆధునీకరణకు నిధులు మంజూరయ్యావని అధికారులు తొలుత ప్రకటించినా తర్వాత నిధులు లేవని మిగిలిపోయిన పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేశారని వాపోతున్నారు. కాల్వ పనుల్లో నాణ్యతలోపించిన విషయాన్ని నల్గొండ ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఐదేళ్ల వరకు కాంట్రాక్టరుకే బాధ్యత ఉంటుందని చెప్పి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. డిండి ప్రాజెక్టు నిండినా తమ పొలాలకు నీరందని స్థితిలో కాల్వలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిపోయిన కాల్వలను ఆధునీకరించి తాము పంటలు పండించుకునే శ్రద్ధ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
6 నుంచి ‘పోచారం’ నీటి విడుదల
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : వచ్చే జనవరి 6వ తేదీ నుంచి పోచారం ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలని మంగళవారం నిర్వహించిన ఆయకట్టు రైతుల సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి తీర్మానించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇరిగేషన్ డీఈఈ విజయేందర్‌రెడ్డి, ఎంపీడీవో సురేందర్, డిప్యూటీ తహశీల్దార్ బాలయ్య, వ్యవసాయాధికారి సంతోష్, ఈజీఎస్ ఏపీవో సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై చర్చించారు. రబీ సీజన్లో ఆయకట్టు పరిధిలోని ‘బి’జోన్ రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు అం దించేందుకు కావాల్సిన చర్యలపై ప్రణాళిక రూ పొందించారు. కాలువలో చాలా చోట్ల నాచు, పిచ్చిమొక్కలు పేరుకుపోవడం వల్ల వాటిని ఉపాధిహామీ ద్వారా తొలగించాలని తీర్మానించారు. పలుచోట్ల ఎక్కువగా ఉండడంతో వాటిని జేసీబీ ద్వారా తొలగించాలని నిర్ణయించారు. పోచారం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండడంతో పాటు రెండు మండలాల్లోని చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉందన్నారు. రైతులు సాగునీటిని వృథా చేయకుండా ముందు జాగ్రత్త చర్యలుగా కాలువలకు ఉన్న గండ్లను పూడ్చివేయాలని ఎమ్మెల్యే సూచించారు. రబీ సీజన్లో రైతులు ఎక్కువ మొత్తంలో పంటలను సాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచేలా చూడాలని ఆదేశించారు. ముందుగా నిర్ణయించిన సమయానుసారం ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేయాలని తీర్మానించారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు దేవేందర్, శ్రీనివాస్‌రెడ్డి, నారాగౌడ్, మైదపు శ్రీనివాస్, వెంకటేశం, నాయకులు కృషారెడ్డి, నక్కగంగాధర్, సాయాగౌడ్, నర్సింహారెడ్డి, తిరుపతిరెడ్డితో పాటు ఆయా గ్రామాల రైతులు, నీటి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆశలు
బిట్రగుంట, న్యూస్‌లైన్ : అధికారుల్లో కొరవడిన ముందు చూపు.. ప్రణాళిక లేని చర్యలు అన్నదాతల పాలిట శాపంగా మారింది. రబీ సీజన్ ప్రారంభానికి ముందే ఐఏబీ సమావేశం నిర్వహించి నీటి విడుదల ప్రణాళిక రూపొందించినా కాలువలకు నీటి విడుదల చేయడంలో అధికారులు అలవికాని నిర్లక్ష్యం ప్రదర్శించారు. వ్యవసాయానికి సాగునీరందించే ప్రధాన జలాశయంలో పుష్కలంగా నీరుండటంతో సాగునీటికి ఎలాంటి ఢోకా లేదని భావించిన రైతులు వరినాట్లు వేశారు. రోజులు గడుస్తున్నా.. చెరువులకు, కాలువలకు సాగునీరు విడుదల చేయకపోవడంతో చెరువుల్లోని అరకొర నీటితో పైర్లను కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం చెరువులు అడుగంటిపోవడంతో పైర్లకు నీరు లేక ఎండు ముఖం పట్టాయి. వరి నాటిన పొలాలు బద్దలు బద్దలుగా బీటలు వారాయి. పైర్లను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని నీటి కుంటలు, కాలువల్లోని కొద్దిపాటి నీటిని మోటార్లు పెట్టి నీటిని పైపుల ద్వారా పైర్లను కాపాడుకుంటుంటే.. మరి కొందరు బిందెలతో నీటిని తెచ్చి పైర్లకు ఊపిరి పోస్తున్నారు. 10 వేల ఎకరాల్లో ఎండు దశలో పైర్లు కావలి కాలువ కింద శ్రీవెంకటేశ్వరపాళెం మేజర్ కాలువ ఉంది. ఎస్వీపీఎం కింద దామవరం, చామదల, గౌరవరం మైనర్ కాలువలు ఉన్నాయి. ఎస్వీపీఎం కింద 25 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, ఐఏబీ నిర్ణయంతో సుమారు 20 వేల ఎకరాల్లోనే వరి పైర్లు సాగు చేశారు. ప్రస్తుతం పైర్లు లేత పొట్టదశలో ఉన్నాయి. అయితే సాగునీటిని విడుదల చేయడంలో సోమశిల అధికారులు జాప్యం చేయడం వల్ల దాదాపు 10 వేల ఎకరాల్లో పైర్లు ఎండు ముఖం పట్టాయి. దామవరం, చామదల, గౌరవరం కాలుల కింద ఆయకట్టు చివరి ప్రాంతాలకు సాగు నీరందకపోవడంతో పైర్లు బతికించుకునేందుకు రైతులు అల్లాడిపోతున్నారు. ఆయిల్ ఇంజన్లు, మోటార్లు వినియోగించి కాలువలు, వాగుల్లోని ప్రతి చుక్కను పొలానికి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. సోమశిల నీటి విడుదలలో మరింత జాప్యం సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు సాగునీటిని అధికారికంగా విడుదల చేసినా.. పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది. కావలి కాలువ హైలెవల్లో ఉండటం వల్లే ఈ దుస్థితి. కావలి కాలువలో పూర్తిస్థాయిలో నీటి మట్టం పెరగాలంటే బ్యారేజీ వద్ద ఇసుక బస్తాలు వేసి అక్కడ నీటి మట్టం పెంచడం వల్లే సాధ్యమవుతుంది. ఈ పనిని చేపట్టడంలో సోమశిల అధికారులు దాదాపు రెండు నెలలుగా జాప్యం చేశారు. ఎట్టకేలకు ఈనెల 9వ తేదీ నుంచి సంగం బ్యారేజీ వద్ద ఇసుక బస్తాలు వేసే చర్యలు చేపట్టారు. ఈనెల 15వ తేదీలోగా పనులు పూర్తి చేసి నీటి మట్టం పెంచి కావలి కాలువకు నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచుతామనిసోమశిల అధికారులు ప్రకటించారు. కావలి కాలువ కింద ఆయకట్టు ఎండిపోతున్న పరిస్థితుల్లో కావలి ఆర్డీఓ సైతం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈనెల 18వ తేదీన కావలి కాలువకు నీటిని విడుదల చేస్తారని ఆర్డీఓ సైతం ప్రకటించారు. అయితే సంగం బ్యారేజీ వద్ద ఇంకా ఇసుక బస్తాలు వేసే పనులు పూర్తి కాలేదు. ఇంకా రెండు..మూడు రోజులు పట్టే అవకాశం ఉందని సంబంధితశాఖాధికారులు చెబుతున్నారు. ఈ పనులు పూర్తయితే.. బ్యారేజీ వద్ద నీటి మట్టం పెంచి ఆ తర్వాత కానీ కావలి కాలువకు నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచే అవకాశం లేదు. అక్కడ నుంచి కావలి కాలువలో పూర్తిస్థాయిలో నీటి మట్టం పెరిగితే శ్రీవెంకటేశ్వరపాళెంకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం కావలి కాలువ కింద సుమారు 80 ఎకరాల్లో వరి సాగులో ఉంది. అన్ని పొలాలకు తక్షణం నీటి ఆవశ్యకత ఉంది. అన్ని ప్రాంతాల రైతులు సాగనీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఏ ప్రాంతానికి తొలుత నీటిని అందించినా మిగతా ప్రాంతాల్లో పైర్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వేలాది ఎకరాలు బీటలు వారాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు ఆవేదనతో అల్లాడి పోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకుని యుద్ధప్రాతిపదికన సాగునీటిని అందించి అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. -
సాగుతుందా !
కరువు జిల్లా పాలమూరు..సీమ ముఖద్వారం కర్నూలు అనుబంధం తరతరాలది. ఈ రెండు జిల్లాల మధ్య ఆప్యాయతలు పండాయి..అనురాగాలు వెల్లివిరిశాయి.. బంధుత్వాలు దృఢపడ్డాయి. సాగునీటి విషయంలోనూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. సౌహార్ధ్రాన్ని పెంచుకున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో నీటి పంపకాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఆర్డీఎస్ నుంచి కర్నూలు జిల్లాకు, కేసీకెనాల్ నుంచి పాలమూరుకు సాగునీరు అందుతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘సాగు’ బంధం కొనసాగుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలైన మహబూబ్‌నగర్-కర్నూలు జిల్లాల మధ్య సాగునీటి బంధం పెనవేసుకొని ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూపిస్తారనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలి బండ డైవర్షన్‌స్కీం ద్వారా(ఆర్డీఎస్) కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతోంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని కర్నూలు-కడప కెనాల్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని గ్రామాలకు సాగునీరు సరఫరా అవుతోంది. తెలంగా ణ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమో దం తెలిపిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చినట్లేనని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అయితే రాష్ట్రం విడిపోకుండా స మైక్యంగా ఉండాలని సీమాంధ్ర ప్రాంతం లో ఉద్యమం సాగుతోంది. ఈ నేపథ్యం లో ఇరుప్రాంతాల మధ్య విద్వేషాలు రగులుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రెండు జిల్లాలపై ఆధారపడి సాగునీటిని వినియోగించుకుంటున్న గ్రా మాలకు మున్ముందు సాగునీరు అందడం కష్టతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. మహబూబ్‌నగర్ జిల్లా నైసర్గిక స్వ రూపం చూస్తే తుంగభద్రా న దికి అవతల కొన్ని , ఇవతలి వైపు ఉన్న కొన్ని గ్రామా లు ఉన్నాయి. ఇవి కర్నూలు జిల్లాకు అతి సమీపంలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ గ్రామాలకు కేసీ కెనాల్, ఆర్డీఎస్ల ద్వా రా నీరందించారు. రాష్ట్ర విభజన దాదా పు ఖాయం కావడంతో ఆయా గ్రామాల సాగు నీటి సరఫరాలో అయోమయం నెల కొనే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్డీఎస్ పరీరక్షణ సమితి ఆధ్వర్యంలో జీఓఎంకు వినతి పత్రం కూడా అందజేశారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనే విషయంపై స్పష్టత కొరవడింది. కర్నూలు జిల్లాలో గ్రామాలకు ఆర్డీఎస్ నీళ్లు : కర్నూలు జిల్లాకు చెందిన నాలుగు గ్రామాలకు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ ద్వారా సాగునీటిని అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఈ-తాండ్రపాడు, గొందిపర్ల, దేవమాడ గ్రామాలకు చెందిన రైతులు ఆర్డీఎస్ డీ-40 ద్వారా, పంచలింగాల గ్రామానికి 37(బి) కాలువ ద్వారా ఆయకట్టుకు సాగు నీరుఅందిస్తున్నారు. ఆర్డీఎస్ పరిధిలో మొత్తం 87,500 ఎకరాలు ఉండగా వీటిలో కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న పంచలింగాల ఆయకట్టు-1863, ఈ-తాండ్రపాడు-166, గొందిపర్లకు 777 ఎకరాలకు, దేవమాడ-372 ఎకరాలు మొత్తం 3508 ఎకరాల ఆయకట్టుకు ఆర్డీఎస్ ద్వారా నీళ్లు అందిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గ్రామాలకు కేసీ నీళ్లు : మహబూబ్‌నగర్ జిల్లాలోని సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు గ్రామాల్లోని దాదాపు 2600 ఎకరాలకు కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్ ద్వారా సాగునీరు అందుతోంది. సుల్తానాపురంలో 1150 ఎకరాలు, ర్యాలంపాడు-850 ఎకరాలు, జిల్లెలపాడు-600 ఎకరాలు వరకు సాగు నీరు అందిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే సాగునీటి వాడకంలో ఈ గ్రామాలకు ఎలాంటి పరిష్కారం చూపుతారో అర్థంకాని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. -
సాగు నీరిస్తారా..ఇవ్వరా?
కావలి/జలదంకి, న్యూస్‌లైన్ : సాగునీరు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ జలదంకి మండల రైతులు శనివారం కావలి వెంగళరావునగర్‌లో ఉన్న సోమశిల ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించారు. జలదంకి మండల రైతు సంఘం నాయకుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండపాళెం, బ్రాహ్మణక్రాక, బీకే అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. కావలి కాలువ డీఈ రాజేంద్రప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. పంటలు ఎండుతున్నా కనికరం కూడా లేదంటూ మండిపడ్డారు. ఐఏబీ సమావేశం నిర్ణయం మేరకు తాము సాగు చేపట్టామన్నారు. వరినాట్లు వేసి రోజులు తరబడి ఎదురుచూస్తున్న కావలి కాలువ నుంచి సాగు నీరు విడుదల కాలేదన్నారు. రెండు రోజుల్లో నీరు విడుదల కాకుంటే తమ పైర్లు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు సాగునీటి కోసం పడుతున్న కష్టాలను చూసి కూడా అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రతి సీజన్లో కావలి కాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ డీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూడిక తీత పనులు నాసిరకంగా చేసి నీటి విడుదల కూడా జాప్యం చేయడం వెనుక కారణమేమిటని నిలదీశారు. నీరు విడుదల ఎప్పుడు చేసేది చెప్పేంత వరకు కార్యాలయం నుంచి కదలబోమని రైతులు భీష్మించారు. డీఈ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నీరు విడుదలకు ఆలస్యం ఎందుకు అవుతుందనే విషయాలను తాను నేరుగా చెప్పలేనన్నారు. ఈనెల 18వ తేదీ ఉదయం చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కావలి కాలువ నుంచి నీటిని పంపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 19న ఉదయం హనుమకొండపాళెం పెద్ద చెరువుకు కావలి కాలువ నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. పంటలు ఎండుతున్న విషయంపై తమకు బాధ కలుగుతుందన్నారు. -
సాగు సంక్షోభం
కావలి, న్యూస్‌లైన్ : సోమశిల ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ కావలి కాలువ ఆయకట్టు రైతులు సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు నీరు విడుదల చేసినా చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు కూడా చేరని పరిస్థితి నెలకొంది. దీని కారణంగా ఇటీవలే రూ. 74 లక్షలతో చేపట్టిన పూడికతీత పనులు నాసిరకంగా చేపట్టడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. తీరు పైర్లు ఎండు దశకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితితో తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐఏబీ నిర్ణయం మేరకు కావలి కాలువ ఆయకట్టు కింద సుమారు 70 వేల ఎకరాలకు పైగా చేపట్టి వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువ చివరి వరకు సుమారు 57 కిలో మీటర్ల ఉంది. ఈ కాలువ ద్వారా 55 చెరువుల వరకు సాగు నీరు అందుతుంది. ఐఏబీ సమావేశంలో 74 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అధికారులు తీర్మానించారు. అందుకు గత నెలలో రూ.74 లక్షలతో కాలువలో పూడిక తీత పనులు చేపట్టారు. అయితే పూడికతీత పనులను హడావుడిగా నాసిరకంగా చేశారు. దీంతో అప్పట్లో రైతులు పనులపై ఆందోళన వ్యక్తం చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం సంగం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తే కాలువలో నీరు ముందుకు సాగలేదు. సకాలంలో నీటి విడుదల జరుగుతుందని భావించిన రైతులు ఎంతో ఆశతో కావలి రూరల్, జలదంకి, బోగోలు, దగదర్తి మండలాల్లో కావలి కాలువ ఆయకట్టు రైతులు వరి సాగు చేపట్టారు. అయితే ఈ రోజు నాటికి నీరు కాలువలో పారకపోవడతో పైర్లు ఎండుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో సాగునీరు ఆయకట్టు పొలాలకు అందకుంటే వరి పైర్లు ఎండిపోతాయని వ్యవసాయశాఖ అధికారులే చెబుతున్నారు. అయితే ఐఏబీ నిర్ణయం మేరకు ఈ సీజన్లో సాగునీరు అందివ్వడం సాధ్యం కాదని సోమశిల ప్రాజెక్టు అధికారులు చావు కబురు చల్లగా చెబుతున్నారు. కావలి కాలువ కింద హనుమకొండపాళెం మేజర్, గౌరవరం మేజర్‌కు ఈసారి సాగునీరు అందివ్వడం ఎంతో కష్ట సాధ్యమని చెపుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నా.. చేతులెత్తేస్తున్నారు సోమశిల జలాశయంలో పుష్కలంగా నీళ్లున్నా.. కావలి కాలువకు నిర్ణయించిన మేరకు కూడా నీళ్లివ్వలేమని అధికారులు చెబుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఐఏబీ సమావేశం జరిగిన అక్టోబరు 21వ తేదీ నాటికి సోమశిల జలాశయంలో 48 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. అప్పటి నీటి నిల్వననుసరించి కావలి కాలువ కింద 74 వేల ఎకరాలకు మాత్రమే నీటిని అందించగలమని అధికారులు, పాలకులు ప్రకటించారు. ఆ తర్వాత ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి సుమారు 68 టీఎంసీలకు పైగా నీరొచ్చింది. ఈ తరుణంలో ముందు నిర్ణయించిన దాని కంటే అదనంగా నీటిని విడుదల చేస్తామని అధికారులు, పాల కులు చెప్పారు. అయితే ప్రస్తుతం ఐఏబీ నిర్ణయం మేరకు కూడా నీటిని విడుదల చేయలేమని చెబుతున్నారు. జలాశయం లో నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండి కూడా నీటిని విడుదల చేయలేకపోవడం వెనక రాజకీయ దురుద్దేశంతో పాటు కావలి కాలువలో చేపట్టిన తాత్కాలిక పూడిక తీత పనుల్లో జరిగిన అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. -
రబీకి హామీ
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రబీ పంటలు ఎండిపోకుండా ఉండేందుకు జిల్లా సాగునీటి సలహా బోర్డు ఓ నిర్ణయం తీసుకుంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద 9803 ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ 15 నుంచి సాగునీరు విడుదల చేసేందుకు తీర్మానించింది. బుధవారం కలెక్టర్ ఎం. గిరిజాశంకర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఐఏబీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ.. కోయిల్‌సాగర్ కింద 2013-14 రబీలో 290 ఎకరాల వరి సాగుకు, 9513 ఎకరాల ఆరుతడి పంటల కు సాగునీరు అందించనున్నట్లు తెలిపా రు. మొత్తం ఐదు విడతల్లో 20 రోజుల చొప్పున సాగునీరు అందిస్తామన్నారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. సమావేశం ప్రారంభమైన వెం టనే దేవరకద్ర ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు షెట్టర్లు సరిగా పనిచేయడం లేదని, నాలుగు సంవత్సరా ల నుంచి మరమ్మతులు చేయడం లేదన్నా రు. కాలువలో పూడిక పేరుకుపోయి, తూ ములు ధ్వంసమై ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందటం లేదని తెలిపా రు. కాలువపై గ్యాంగ్మెన్లు సరిగా విధు లు నిర్వహించడం లేదని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు ఏకరువు పెట్టిన రైతులు.... పల్లి పంట వేసుకున్నాం.. నీరు రాకపోవడంతో పైర్లు ఎండిపోతున్నాయని కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తూములను బాగు చేయించి, పిల్ల కాలువలన్నింటిలో ఉపాధి హామీ పథకం కింద పూడిక తీయించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ.. వారంలోగా షెట్టర్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రధాన కాలువలో ఉపాధి హామీ ద్వారా పూడిక తీయిస్తామని తెలి పారు. జూరాల ప్రాజెక్టు నుంచి మార్చి వర కు ఊటనీరు వచ్చే అవకాశం ఉన్నందున కోయిల్‌సాగర్ కింద వీలైతే మరొక తడికి నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటి విడత నీరు వదలి నిలుపుదల చేసిన అనంతరం యాంత్రాల ద్వారా ప్రధాన కాలువలో పూడిక తీసేం దుకు చర్యలు తీసుకంటామని వివరించా రు. ఈ లోగా ప్రాజెక్టును, కాలువలను ప్రత్యేక్షంగా పరిశీలించి షెట్టర్లు, తూముల మరమ్మతులకు అంచనాలు సమర్పించాలని చిన్ననీటి పారుదల ఈఈ బన్సీలాల్‌ను ఆదేశించారు. ప్రాజెక్టు కింద పని చేసే గ్యాంగ్మెన్ల పేర్లను సంబంధిత గ్రామ పంచాయితీ నోటీస్ బోర్డులలో రాయాల ని, అలాగే వారి సెల్‌ఫోన్ నంబర్లు కూడా అందులో పొందుపరచాలని ఆదేశించారు. కాలువపై అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేయవద్దని రైతులకు విజ్ఙప్తి చేశారు. సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎస్ఈ శ్రీరామకృష్ణ, డీఆర్ఓ రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ అడ్డంకులే..
=‘ఇందిర జలప్రభ’కు బాలారిష్టాలు =మోటార్లకు ధర నిర్ణయంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ తాత్సారం =ఎస్సీ,ఎస్టీల భూములకు అందని సాగునీరు సాక్షి, విశాఖపట్నం: ఎస్సీ,ఎస్టీ భూములను సాగులోకి తెచ్చేందుకు చేపట్టిన ఇందిర జలప్రభ పథకం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ ముహూర్తాన దీనికి శ్రీకారం చుట్టారో గానీ అన్నీ అడ్డంకులే. ప్రభుత్వ అలక్ష్యానికి అధికారులు చిన్నచూపు తోడయింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఈ పథకం పరిస్థితి తయారైంది. గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో బోర్లు తవ్వకాలకు రిగ్ యజమానులు కొంతకాలం ముందుకు రావడంలేదు. పథకం ప్రవేశపెట్టిన రెండేళ్ల అనంతరం కొందరు ఆసక్తి చూపడంతో జిల్లా వ్యాప్తంగా 155 బోర్లు వేశారు. కానీ విద్యుత్ సౌకర్యం, పంపు సెట్లు అమర్చడంలో అధికారులు విఫలమయ్యారు. ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం కల్పించినా సరైన ధర ఇవ్వలేదంటూ పంపు సెట్లు ఏర్పాటుకు కంపెనీలు ముఖం చాటేశాయి. దీంతో ఏళ్ల క్రితం డ్రిల్లింగ్ చేసిన బోర్లు నిరుపయోగమయ్యాయి. ధర విషయంలో కాస్తా వెసులుబాటు కల్పిస్తూ ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మరోసారి అధికారులు టెండర్లు పిలిచారు. కానీ ప్రభుత్వ స్థాయిలో ఏమైందో.. గడువు ముగియకుండానే వాటిని మధ్యలోనే రద్దు చేశారు. వివిధ శాఖల అధికారులు సభ్యులగా ఉన్న జిల్లా పర్చేజింగ్ కమిటీ నిర్ణయించిన ధరకు పంపు సెట్లు కొనుగోలు చేసి అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడా కమిటీ పంపుసెట్ల ధర నిర్ణయంలో తాత్సారం చేస్తోంది. రేటు నిర్ణయించకుండా వాటిని కొనుగోలు చేసే అధికారం సంబంధిత అధికారులకు లేదు. దీంతో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న డ్వామా అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుతం 28 బోర్లు విద్యుత్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నా పంపుసెట్లు లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీల భూములకు సాగునీరందించలేని దుస్థితి. పంపుసెట్లు అమరిస్తే మరో127 బోర్లుకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ట్రాన్స్‌కో అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా జిల్లా పర్చేజింగ్ కమిటీ తాత్సారంతో ఇప్పుడు ఇందిర జల ప్రభ అక్కరకు రాకుండాపోయింది. -
తాగు, సాగు నీటికి ప్రాధాన్యం
కోలారు, న్యూస్‌లైన్ : కోలారు జిల్లాపై సీఎం సిద్దరామయ్య వరాలు కురిపించారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం తాలూకాలోని వేమగల్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అన ంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కోలారు జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన శాశ్వత నీటిపారుదల సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జిల్లాకు తాగునీటితో పాటు సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిన హొళె పథకాన్ని తీసుకు వచ్చిందని, ఈ పథకానికి రూ.1000 కోట్లను ఇప్పటికే బడ్జెట్లో రిజర్వు చేశామన్నారు. పథకం టెండర్ దశలో ఉందని తెలిపారు. దీనికి తోడు పరమశివయ్య నివేదికను అమలు చేసినట్లయితే జిల్లాలో తాగు, సాగు నీటి సమస్య పూర్తిగా పరిష్కారమౌతుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) తయారీకి రూ. 50 కోట్లను కేటాయించామన్నారు. డీపీఆర్ సిద్ధమైన తరువాత పథకం అమలుకు సత్వరమే చర్యలు తీసుకుంటావ ున్నారు. అభివృద్ధితో పాటు సమాజం అన్ని రంగాలలో ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. తమ ప్రభుత్వం వ్యవ సాయ రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ట్లు వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించడంపై మండలిని ఏర్పాటు చేసి, అందులో రైతు నాయకులు, ప్రజా ప్రతినిధులను సభ్యులుగా తీసుకుని వారి సలహాలు సూచనలతో రైతులకు గిట్టుబాటు ధరలు అందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెట్లో ధరలు గణనీయంగా తగ్గితే ప్రభుత్వం రంగ ప్రవేశం చేసి రైతు నుంచి నేరుగా కొనుగోలు చేసి వారికి నష్టం కలుగకుండా ఆదుకుంటుందన్నారు. చిన్న, సన్నకారు రైతుల వలసలు ఆపాలనే ఈ నిర్ణయం తీసుకుంటోందన్నారు. చెరువుల ఆధునికీకరణకు చర్యలు జిల్లాలో చెరువుల ఆధునికీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి సంబంధించి రూ. 1100 కోట్లు అవసరమవుతాయని సీఎం తెలిపారు. నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని, కేంద్ర మంత్రులు సత్వరమే నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమ ఇసుక రవాణా జరిగితే కలెక్టర్, ఎస్పీలే బాధ్యులు ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరిగితే జిల్లా కలెక్టర్, ఎస్పీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవ డానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకు వస్తామని తెలిపారు. కోలార్‌కు మెడికల్ కళాశాల వచ్చే ఏడాది కోలార్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. అదే విధంగా పాల పౌడర్ తయారీ యూనిట్‌ను జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కే హెచ్ మునియప్ప, జిల్లా ఇన్చార్జి మంత్రి యూటీ ఖాదర్, రాష్ట్ర నగరావృద్ధి శాఖా మంత్రి వినయ్‌కుమార్ సోరకే, ఎమ్మెల్యేలు వర్తూరు ప్రకాష్, కొత్తూరు మంజునాథ్, మంజునాథ్‌గౌడ, వై రామక్క, నారాయణస్వామి, రమేష్‌కుమార్, ఎమ్మెల్సీలు డీఎస్ వీరయ్య, వైఏ నారాయణస్వామి, నజీర్అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మోడి కల ఫలించదు దేశ ప్రధాని కావాలనే నరేంద్ర మోడీ కలలు ఎన్నటికీ ఫలించవని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోస్యం చెప్పారు. నగర సమీపంలోని నారాయణి కన్వెన్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూబీజేపీ నరేంద్ర మోడని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిందని, అయితే ఆయన నిజంగానే ప్రధాన మంత్రి అయినట్లు కలలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రధాని కాలేరన్నారు. కర్ణాటకలో మోడీ ప్రభావం ఏ మాత్రం లేదన్నారు.