
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుకు సాగునీరు అందించక పోతే పాపం అన్న కేసీఆర్..ఎస్సారెస్పీ రైతులకు ఎందుకు నీరు విడుదల చేయడం లేదని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నీరు ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్న ప్రభుత్వం.. అడిగితే రైతులపై కేసులు పెడుతోందని, గ్రామాల్లో రైతులను నిర్బంధిస్తోందని విమర్శించారు. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ముందు రోడ్లపై పడిన గోతులను పూడ్చి తర్వాత ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడాలన్నారు. పబ్లిసిటీ ట్వీట్లకు తప్పా..రోడ్ల గురించి అడిగే ట్వీట్లకు కేటీఆర్ స్పందించరని ఎద్దేవా చేశారు. పోలీసింగ్‌తో నేరాలను అరికట్టామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం యాదాద్రి ఘటనలకు ఏం సమాధానం చెబుతుందన్నారు. వ్యభిచార ముఠాల అసాంఘిక చర్యలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలు, ప్రజా, మహిళా సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment