కరువు జిల్లా పాలమూరు..సీమ ముఖద్వారం కర్నూలు అనుబంధం తరతరాలది. ఈ రెండు జిల్లాల మధ్య ఆప్యాయతలు పండాయి..
కరువు జిల్లా పాలమూరు..సీమ ముఖద్వారం కర్నూలు అనుబంధం తరతరాలది. ఈ రెండు జిల్లాల మధ్య ఆప్యాయతలు పండాయి..అనురాగాలు వెల్లివిరిశాయి.. బంధుత్వాలు దృఢపడ్డాయి. సాగునీటి విషయంలోనూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. సౌహార్ధ్రాన్ని పెంచుకున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో నీటి పంపకాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఆర్డీఎస్ నుంచి కర్నూలు జిల్లాకు, కేసీకెనాల్ నుంచి పాలమూరుకు సాగునీరు అందుతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘సాగు’ బంధం కొనసాగుతుందా
అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలైన మహబూబ్‌నగర్-కర్నూలు జిల్లాల మధ్య సాగునీటి బంధం పెనవేసుకొని ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూపిస్తారనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలి బండ డైవర్షన్‌స్కీం ద్వారా(ఆర్డీఎస్) కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతోంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని కర్నూలు-కడప కెనాల్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని గ్రామాలకు సాగునీరు సరఫరా అవుతోంది. తెలంగా ణ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమో దం తెలిపిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చినట్లేనని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అయితే రాష్ట్రం విడిపోకుండా స మైక్యంగా ఉండాలని సీమాంధ్ర ప్రాంతం లో ఉద్యమం సాగుతోంది. ఈ నేపథ్యం లో ఇరుప్రాంతాల మధ్య విద్వేషాలు రగులుతున్న విషయం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో రెండు జిల్లాలపై ఆధారపడి సాగునీటిని వినియోగించుకుంటున్న గ్రా మాలకు మున్ముందు సాగునీరు అందడం కష్టతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. మహబూబ్‌నగర్ జిల్లా నైసర్గిక స్వ రూపం చూస్తే తుంగభద్రా న దికి అవతల కొన్ని , ఇవతలి వైపు ఉన్న కొన్ని గ్రామా లు ఉన్నాయి. ఇవి కర్నూలు జిల్లాకు అతి సమీపంలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ గ్రామాలకు కేసీ కెనాల్, ఆర్డీఎస్‌ల ద్వా రా నీరందించారు. రాష్ట్ర విభజన దాదా పు ఖాయం కావడంతో ఆయా గ్రామాల సాగు నీటి సరఫరాలో అయోమయం నెల కొనే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్డీఎస్ పరీరక్షణ సమితి ఆధ్వర్యంలో జీఓఎంకు వినతి పత్రం కూడా అందజేశారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనే విషయంపై స్పష్టత కొరవడింది.
కర్నూలు జిల్లాలో
గ్రామాలకు ఆర్డీఎస్ నీళ్లు :
కర్నూలు జిల్లాకు చెందిన నాలుగు గ్రామాలకు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ ద్వారా సాగునీటిని అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఈ-తాండ్రపాడు, గొందిపర్ల, దేవమాడ గ్రామాలకు చెందిన రైతులు ఆర్డీఎస్ డీ-40 ద్వారా, పంచలింగాల గ్రామానికి 37(బి) కాలువ ద్వారా ఆయకట్టుకు సాగు నీరుఅందిస్తున్నారు. ఆర్డీఎస్ పరిధిలో మొత్తం 87,500 ఎకరాలు ఉండగా వీటిలో కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న పంచలింగాల ఆయకట్టు-1863, ఈ-తాండ్రపాడు-166, గొందిపర్లకు 777 ఎకరాలకు, దేవమాడ-372 ఎకరాలు మొత్తం 3508 ఎకరాల ఆయకట్టుకు ఆర్డీఎస్ ద్వారా నీళ్లు అందిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా గ్రామాలకు కేసీ నీళ్లు :
మహబూబ్‌నగర్ జిల్లాలోని సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు గ్రామాల్లోని దాదాపు 2600 ఎకరాలకు కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్ ద్వారా సాగునీరు అందుతోంది. సుల్తానాపురంలో 1150 ఎకరాలు, ర్యాలంపాడు-850 ఎకరాలు, జిల్లెలపాడు-600 ఎకరాలు వరకు సాగు నీరు అందిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే సాగునీటి వాడకంలో ఈ గ్రామాలకు ఎలాంటి పరిష్కారం చూపుతారో అర్థంకాని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.