
పెద్దపల్లిరూరల్/ధర్మారం: సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. ఎస్సారెస్పీ నీరు అందడంలేదని అన్నదాతలు కన్నెర్ర చేశారు. పెద్దపల్లి, ధర్మారం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి–మంథని రంగాపూర్‌లోని ఎస్సారెస్పీ కాలువ వద్ద ఆదివారం 4 గంటలపాటు బైఠాయించారు. మంగళవారం కల్లా నీరందేలా చూస్తానని డీఈఈ హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.