దగదర్తి, న్యూస్‌లైన్: ఎకరాకు 4 పుట్ల ధాన్యం దిగుబడి ఇచ్చే భూములవి. సాగునీరు కూడా పుష్కలంగా వస్తోం ది. పైరుగా ఏపుగా పెరుగుతోంది. ఈ ఏడాది తమ పంట పండినట్టేనని రైతు లు భావించారు. ఇంతలో చిరుపొట్ట ద శకు చేరుకునే సమయంలో పైరు ఒక్కసారిగా గిటకబారసాగింది.
వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన వరిపైరు గిటకబారి ఎండిపోతుండటంతో అన్నదాత లబోదిబోమంటున్నారు. దళారి నకిలీ విత్తనాలు అంటగట్టడంతోనే తాము ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. దగదర్తి మండలం పెదపుత్తేడు గ్రామంలోని రైతుల కష్టాలివి. సాధారణంగా ధాన్యం అమ్ముకునే సమయంలో దళారుల చేతిలో దగాపడే అన్నదాత సాగు మొదట్లోనే కోలుకోలేని దెబ్బతిన్నారు.
రేణంగి కాంతమ్మకు భర్త లేరు. కుమారుడు కష్టపడి సంపాదిం చిన మొత్తంలో ఎక్కువ శాతం సేద్యానికే వెచ్చిస్తుంది. నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరిపంట సాగు చేస్తోంది. పైరు ఎండిపోతుండటం, ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఓజిలి శూలం
మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. అప్పులు తెచ్చి సాగుచేసిన పంట ఎండుముఖం పట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు.
షేక్ రహంతుల్లా
ఆరెకరాల భూమిలో వరిసాగు చేస్తున్నారు. పంట ఎండుముఖం పట్టడంతో దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నాడు. దళారిని నమ్మడంతో నకిలీ విత్తనా లు అంటగట్టాడని, ఎండుతున్న పంట దున్నేందు కు తప్ప దేనికీ పనికిరాదని వాపోతున్నాడు.
గెరికపాటి ఓబయ్య
ఐదెకరాల భూమిని కౌ లుకు తీసుకు ని వరి సాగుచేశాడు. మంచి దిగుబడులు సాధించి అప్పులు తీర్చుకోవాలని భావించిన ఈయన కల కల్లయిం ది. ఏపుగా పెరిగిన వరి ఒక్కసారిగా గిటకబారిందని, నాసిరకమైన విత్తనాలు అంటగట్టి దళారి మోసం చేశాడని బోరుమంటున్నాడు.
పంటలను పరిశీలిస్తా:
ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయా లి. ఎండుతున్న వరిపంటను పరిశీ లించి అధికారులకు వివరిస్తాం. రసీదులు, విత్తనాలు ఇచ్చిన సంచులు ఉంటే దళారులపై తగిన చర్యలు తీసుకుంటాం.
- విజయభాస్కర్,
వ్యవసాయాధికారి, దగదర్తి
దళారి చేతిలో అన్నదాత దగా
Published Wed, Jan 22 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement