vijay bhaskar
-
విజయ భాస్కర్‌కు ఊరట
సాక్షి, చైన్నె: జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదికలో తన పేరు నమోదు విషయంగా మాజీ మంత్రి విజయ భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మధురై ధర్మాసనం స్పందించింది. ఆరోపణలలో ఆయన పేరును తొలగించే విధంగా సోమవారం ఆదేశాలను న్యాయమూర్తి జారీ చేశారు. వివరాలు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో గత ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ కొన్ని సంవత్సరాల పాటూ విచారించి 2022లో డీఎంకే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో విజయ భాస్కర్‌పై ఆరోపణలు చేస్తూ కమిషన్ కొన్ని అంశాలను పొందు పరిచినట్టు సమాచారాలు వెలువడ్డాయి. తనను సాక్షిగా విచారించిన కమిషన్, ఆరోపణలలో తనపేరును చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ మఽద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని విజయ భాస్కర్ ఆశ్రయించారు. 2013 నుంచి 2021 వరకు ప్రజల చేత శాసన సభకు ఎన్నోకో బడిన తాను ఎనిమిదేళ్లుగా ఆరోగ్య మంత్రిగా పనిచేసినట్లు వివరించారు. అయితే ఆర్ముగ స్వామికమిషన్ జయలలిత మరణం విచారణలో తనను ఓ సాక్షిగా పిలిచి విచారించినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆరోపణల వ్యవహారంలో తన పేరు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయన్నారు. తనకు ప్రజల్లో మంచి పేరు ఉందని, ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు మచ్చగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచారణ వ్యవహరంలో తన పేరును ఆరోపణలలో పేర్కొనడాన్ని అంగీకరించ లేకున్నానని, ఆ కమిషన్ నివేదిక ఆధారంగా చార్జ్ షీట్లో వివరాలను పొందు పరిచే పనిలో ఉన్నారని వివరించారు. ఈ దృష్ట్యా, తన పేరును ఆ నివేదిక నుంచి తొలగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈపిటిషన్ను న్యాయమూర్తి ఇలం దిరయన్ విచారించారు. వాదనల అనంతరం కమిటీ నివేదికలో ఉన్న విజయ భాస్కర్ పేరును తొలగించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.ఉపాధ్యాయుడిపై పోక్సో కేసుతిరువొత్తియూరు: విద్యార్థినులపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థునులకు అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అయ్యప్పన్ (52) లైంగిక వేధింపులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై ఫిర్యాదు మేరకు జియాపురం పోలీస్ విచారణ చేపట్టారు. ఇందులో విద్యార్థునులకు అయ్యప్పన్ లైంగికంగా వేధింపులు ఇచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడు అయ్యప్పన్‌ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.ఐసీఎఫ్‌ను సందర్శించిన సంజయ్‌కుమార్ పంకజ్కొరుక్కుపేట: ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ను రైల్వే బోర్డు (ప్రొడెక్షన్ యూనిట్) అడిషన ల్ మెంబర్ సంజయ్‌కుమార్ పంకజ్ సోమవారం సందర్శించారు. ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ యు.సుబ్బారావు, ఇతర అధికారులతో కలసి ఐసీఎఫ్ వద్ద జరుగుతున్న వివిధ పనులు, ప్రాజెక్టుల గురించి, అమృత్ భారత్ కోచ్‌లు, విస్టాడోమ్ డైనింగ్ కార్, హైడ్రోజన్ రైలు, ఉత్పత్తిలో ఉన్న వివిధ ఉత్పత్తులను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అడ్వాన్సుడ్ వెల్డింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేసిక్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. -
సీరత్ కపూర్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కనుందా..?
టాలీవుడ్లో తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్‌గా కె. విజయ భాస్కర్ గుర్తింపు పొందారు. త్రివిక్రమ్ కూడా తన సినీ కెరీర్ ప్రారంభంలో విజయ్ భాస్కర్ సినిమాలకు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి ఇండిస్ట్రీలో మంచి హిట్ సినిమాలను నిర్మించారు. అయితే, కొంత కాలం తర్వాత త్రివిక్రమ్ డైరెక్టర్‌గా తనే పలు సినిమాలు తెరకెక్కించి టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ మధ్య పలు విభేదాలు వచ్చాయని రూమర్స్ వచ్చాయి. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ కలిసి 'ఉషా పరిణయం' సినిమా సెట్లో కలిశారు. దీంతో ఆ రూమర్స్‌కు చెక్ పెట్టారు. అయితే, తాజాగా అదే ఫోటోను సీరత్ కపూర్ తన సోషల్‌మీడియాలో పంచుకుంది.విజయ భాస్కర్ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా స్వీయ దర్శకత్వంలో 'ఉషా పరిణయం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా నటిస్తున్నారు. శ్రీ కమల్‌కు జోడీగా తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతుంది. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్‌లో సీరత్ కపూర్ దుమ్మురేపింది. ఆ పాట షూటింగ్ చివరి రోజులో సెట్స్‌లో త్రివిక్రమ్ కూడా సందడి చేశారు. ఆ సమయంలో ఆయనతో సీరత్ కపూర్ ఫోటోలు దిగింది. వాటిని ఇప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాటి విషయాలను పంచుకుంది.ఉషా పరిణయం సినిమా సెట్స్‌లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా త్రివిక్రమ్ సార్ వచ్చారు. మానిటర్ దగ్గర కూర్చొని నా క్లోజ్ అప్ షాట్‌ని చాలా తీక్షణంగా గమనించారు. ఆప్పుడు నాకు ఆ విషయం తెలియదు. షూట్ పూర్తి అయిన తర్వాత ఆయన నన్ను మెచ్చుకున్నారు. ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాం. అందుకు ఎన్ని ప్రశంసలు వచ్చినా అవన్నీ దర్శకులు విజయ భాస్కర్‌కు దక్కుతాయి.' అని ఆమె తెలిపింది. అయితే, తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది.సీరత్ కపూర్ టాలెంట్‌కు ఫిదా అయిన త్రివిక్రమ్ ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తర్వాతి సినిమాలో సీరత్ కపూర్‌తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు నెట్టింట వార్త వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమాలో ఆమె ఒక్కసారి మెరిస్తే మళ్లీ టాలీవుడ్లో అవకాశాల బాట పట్టడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సీరత్ కపూర్ నటించిన ఉషా పరిణయం సినిమా ఆగష్టు 2న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) -
జిలేబి సినిమా పోస్టర్ లాంచ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న డైరెక్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన వెంకటేశ్
‘‘విజయ భాస్కర్‌గారు నాకు ఇష్టమైన డైరెక్టర్. నా ఫేవరేట్ చిత్రాలైన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’లను ఆయన ఎంత చక్కగా తీశారో మనందరికీ తెలుసు. ఆయన తీసిన ‘జిలేబి’ కూడా తప్పకుండా మంచి వినోదాత్మక చిత్రం అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు హీరో వెంకటేశ్. దర్శకుడు విజయ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జిలేబి’. ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తున్నారు. విజయ భాస్కర్ దర్శకత్వంలో అంజు అశ్రాని సమర్పణలో ఎస్ఆర్కే పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసిన అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘జిలేబి’తో నటుడిగా పరిచయమవుతున్న కమల్‌కి, నిర్మాతలు రామకృష్ణ, అంజులకు ఆల్ ది బెస్ట్. ఇది అందరూ చూసే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘వెంకటేష్‌గారి చేతులమీదుగా మా అబ్బాయి నటించిన ‘జిలేబి’ గ్లింప్స్ లాంచ్ కావడం సంతోషంగా ఉంది. ‘జిలేబి’ అందమైన ప్రయాణం. మణిశర్మగారు, రామకృష్ణ, అంజు, కెమెరామేన్ సతీష్... ఇలా అందరం కలిసి ఓ కుటుంబంలా పనిచేశాం’’ అన్నారు విజయ్ భాస్కర్. ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ‘జిలేబి’’ అన్నారు శివాని. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ఇది. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను ఫారిన్లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు రామకృష్ణ. ‘‘విజయభాస్కర్లాంటి దర్శకునితో మా తొలి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు అంజు. -
చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్
‘స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కె. విజయ్ భాస్కర్ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ఆయన దర్శకత్వంలో రానున్న 13వ చిత్రాన్ని ఎస్ఆర్కే ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధింన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. నటి, నిర్మాత జీవితా రాజశేఖర్, ‘కార్తికేయ’ నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్, ప్రొడ్యూసర్ వంకాయలపాటి మురళీకృష్ణ పాల్గొని రామకృషకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజయదశమి రోజున షూటింగ్ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు దసరా నాడే ప్రకటిస్తాం’’ అని రామకృష అన్నారు. -
నేను కొట్టలేదు అంతా అవాస్తవం: నరసరావుపేట డీఎస్పీ విజయ్ భాస్కర్ రావు
-
మాజీ మంత్రి ఆస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఇటీవల కాలంలో మాజీ మంత్రుల ఆస్తులపై పంజా విసురుతూ వస్తున్న అవినీతి నిరోధకశాఖ మరోసారి జూలు విదిల్చింది. మాజీ మంత్రి సి.విజయభాస్కర్ ఆస్తులపై సోమవారం ఏకకాలంలో ఆరు జిల్లాల్లో (44 చోట్ల) మెరుపుదాడులు చేసింది. 2011–16, 2016–21 హయాంనాటి అన్నాడీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు తమ పదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆరోపణలు చేయడంతోపాటూ విచారణకు ఆదేశించాల్సిందిగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం డీఎంకే అధికారం చేపట్టిన నేపథ్యంలో అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న మాజీ మంత్రుల ఆస్తులపై ఏసీబీ దాడులు చేస్తూ వస్తోంది. మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, ఎస్పీ వేలుమణి, కేసీ వీరమణి ఆస్తులపై ఏసీబీ వరుసగా దాడులు చేసి కేసులు పెట్టింది. ఇందుకు కొనసాగింపుగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఉన్న మాజీ మంత్రి సి. విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలు వంటి 44 చోట్ల సోమవారం ఉదయం మెరుపుదాడులు ప్రారంభించారు. మాజీ మంత్రి సొంతూరైన పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలై సమీపం ఇలుపూరులోని ఇంటిలోకి సోమవారం ఉదయం 6 గంటలకు సుమారు సుమారు 50 మందికిపైగా ఏసీబీ అధికారులు ప్రవేశించి తనిఖీలు ప్రారంభించారు. ఆ తరువాత పలు బృందాలుగా విడిపోయి 6.30 గంటలకు ఏకకాలంలో పుదుక్కోట్టై జిల్లాలో 30 ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. విజయభాస్కర్ సోదరుల, స్నేహితుల ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలపై దాడులు జరిపారు. మదర్ థెరిసా విద్యా చారిటబుల్ ట్రస్ట్ పేరున స్థాపించిన 14 విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. కరోనా కాలంలో భారీగా అక్రమాలు కరోనా కాలంలో వైద్య చికిత్సకు సంబంధించి మందులు, ఉపకరణాల కొనుగోలులో భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆదాయానికి మించి రూ.27.22 కోట్లు కూడబెట్టినట్లు, చెన్నైలో రూ.14 కోట్లతో లగ్జరీ నివాసం, విదేశీ మోడల్ కారు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్లో విజయభాస్కర్ భార్య రమ్య పేరును కూడా చేర్చారు. పుదుకోట్టైతో పాటూ చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిరాపల్లి, కాంచీపురం, చెంగల్పట్టు..మొత్తం ఆరుజిల్లాల్లో జరిగిన తనిఖీల్లో సుమారు వందమందికి పైగా ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. పీపీఈ దుస్తులతో తనిఖీలు చెన్నై కీల్పాక్కంలోని విజయభాస్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో అతని భార్య రమ్య, పెద్ద కుమార్తె కరోనాకు గురై హోం క్వారంటైన్లో ఉన్నారు. దాడుల్లో భాగంగా ఇంట్లోకి ప్రవేశించిన తరువాత ఏసీబీ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో పీపీఈ దుస్తులు, చేతికి గ్లౌజులు ధరించి భార్య, కుమార్తె ఉన్న గదితో సహా ఇల్లంతా తనిఖీలు సాగించారు. కాగా ఏసీబీ దాడులను నిరసిస్తూ అన్నాడీఎంకే శ్రేణులు మాజీ మంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కాగా ఈ సోదాల్లో రూ. 23 లక్షల నగదు, 4.87 కేజీల బంగారం, 136 భారీ వాహనాలకు సంబంధించి రికార్డులు బయటపడ్డాయి. అలాగే 19 హార్డ్ డిస్‌్కలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి.. -
అవిశ్వాసం అడ్డు తొలగింది
బాల్టిక్ సముద్రతీరంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి, సముద్రానికి మధ్యన ఓ మట్టి పర్వతం ఉంది. అది 1872వ సంవత్సరం. ఇద్దరు స్నేహితులు సాయం సమయాన, సముద్రతీరానికి వ్యాహ్యాళికి వెళ్లారు. వారిలో ఒకరు ఆస్తికుడు. మరొకరు నాస్తికుడు. నాస్తికుడు ఆస్తికుడితో వాదిస్తున్నాడు. ‘‘దేవుడు లేడు. మత గ్రంథాలన్నీ కల్పితం. ఉదాహరణకు బైబిలు గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పిన మాట. ‘మీరు విశ్వాసము కలిగి సందేహింపక ఈ కొండను చూసి, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని చెప్పిన యెడల ఆలాగున జరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను’ (మత్తయి 21:21) అనేది పూర్తిగా అబద్ధం, అసాధ్యం’’ అన్నాడు నాస్తికుడు. ‘‘దేవుని మాటలను, శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు’’ అన్నాడు ఆస్తికుడు. అందుకు నాస్తికుడు, ‘‘నీకు విశ్వాసం ఉంటే మరి ప్రార్థించు. ఈ సముద్ర తీరాన ఉన్న కొండ.. సముద్రంలో పడవేయబడాలని. తద్వారా మనం రోజూ వ్యాహ్యాళికి సముద్ర తీరానికి రావాలంటే ఈ కొండను ఎక్కి దిగాల్సిన కష్టం ఉండదు’’ అన్నాడు. అతడి మాటల్లో హేళన ధ్వనించింది. ఆస్తికుడు విశ్వాసముతో అక్కడే మోకరిల్లి దేవుడిని ప్రార్థించసాగాడు. ప్రార్థన పూర్తవుతుండగానే వాతావరణంలో పెను మార్పు చోటు చేసుకుంది! అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతం అయింది. గాలులు బలంగా వీస్తున్నాయి. వర్షం మొదలైంది. ఇద్దరు మిత్రులూ వర్షంలో తడిసిపోతామని, వెంటనే అక్కడి నుంచి బయల్దేరారు. వీలైనంత వేగంగా కొండను ఎక్కి, వడివడిగా కిందికి దిగి తమ గృహాలను చేరుకున్నారు. రాత్రంతా పెద్ద తుపాను చెలరేగింది. ఇళ్ల పైకప్పులు సైతం ఎగిరిపోయాయి. ఏదో విధంగా బిక్కబిక్కుమంటూ ఆ రాత్రిని వెళ్లబుచ్చారు ఇద్దరు మిత్రులు. తెల్లవారేసరికి వర్షం తెరిపినివ్వడంతో మొదట నాస్తికుడు తన గృహం నుండి బయటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా, బురదలోనే మోకరిల్లి రోదిస్తూ దేవుడిని ప్రార్థించాడు! ‘దేవా నీవున్నావు. నా అజ్ఞాన గృహాన్ని కూలగొట్టుకున్నాను. నన్ను క్షమించు యేసు ప్రభూ’’అని వేడుకున్నాడు. గ్రామానికి, సముద్రానికి మధ్య ఉన్న కొండ ఆ రాత్రి వచ్చిన తుపానుకు కరికి, కొట్టుకుపోయి, సముద్రంలో కలిసిపోవడమే అందుకు కారణం. ఆస్తికుడు బయటికి వచ్చి చూసి, ఇంకా మోకరిల్లినట్లుగానే పడివున్న నాస్తికుడికి చెయ్యి అందించి పైకి లేపాడు. అతడిని తన హృదయానికి హత్తుకున్నాడు. విశ్వాసమే దేవుడు. క్రిస్మస్ శుభాకాంక్షలు. – యస్. విజయ భాస్కర్ -
రాడాన్ గ్రూపులో ఐటీ దాడులు
-
మద్యం మత్తులో పాఠశాలకు..
గార్లదిన్నె: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. దీంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట గ్రామంలోని ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విజయ్‌భాస్కర్ పని చేస్తున్నారు. కాగా విజయ్‌భాస్కర్ పాఠశాలకు మద్యం మత్తులో హాజరవుతున్నట్లు విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన డీఈవో విజయ్‌భాస్కర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పిడుగుపాటుకు వ్యక్తికి తీవ్రగాయాలు
టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ మోదుగులగూడెం సమీపంలోని ఓ పత్తిచేనులో శుక్రవారం పిడుగుపడింది.ఆ ప్రాంతంలో పాయం విజయ్ భాస్కర్ అనే వ్యక్తి ఉండటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
యూత్‌ఫుల్ లవ్!
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులకు ఆద్యంతం వినోదం అందించేలా తెరకెక్కిన చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. విజయ్‌భాస్కర్, వివేక్, పూజిత ముఖ్యతారలుగా మరిపి విద్యాసాగర్ నిర్మించిన ఈ చిత్రానికి గణమురళి దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘నేటి యువతీయువకుల మనస్తత్వాలకు అద్దం పట్టే చిత్రం ఇది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాశ్, మాధవ్, సంగీతం: ప్రణవ్. -
ఆర్తి చాలా అమాయకురాలు
-
ఆర్తి చాలా అమాయకురాలు
ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయని, చిన్న వయసులోనే చనిపోవడం దురదృష్టకరమని దర్శకుడు విజయ్ భాస్కర్ అన్నారు. ఆర్తి మరణించారనే వార్త విని షాకయ్యానని చెప్పారు. టాలీవుడ్లో ఆర్తి తొలిసారి విజయ్ భాస్కర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నటించారు. 2001లో ముంబైలో ఆర్తి ఫొటో చూసిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లడి సినిమాలో నటించే అవకాశం ఇచ్చానని విజయ్ భాస్కర్ గుర్తు చేసుకున్నారు. ఆర్తి చాలా అమాయకురాలని, కష్టపడేతత్వమని చెప్పారు. అప్పట్లో ఆమెకు అనారోగ్య సమస్యలున్నట్టు తనకు తెలియదని, ఆ తర్వాత వచ్చి ఉండొచ్చని విజయ్ భాస్కర్ అన్నారు. ఆర్తికి మంచి భవిష్యత్ ఉంటుందని అనుకున్నానరి, చిన్న వయసులో చనిపోవడం బాధాకరమని విజయ్ భాస్కర్ అన్నారు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన ఆర్తి నటించిన నువ్వు నాకు నచ్చావు ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో మంచి గుర్తింపు పొందిన ఆర్తి ఆ తర్వాత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. -
బ్రౌన్ శాస్త్రి ఇక లేరు
కడప కల్చరల్, న్యూస్‌లైన్: సుప్రసిద్ద సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఇక లేరన్న వార్త శుక్రవారం జిల్లా వాసులను దిగ్భ్రాంతికి లోను చేసింది. రెండు నెలలుగా అస్వస్థతులుగా ఉన్న ఆయన శుక్రవారం ఉదయం 6.50 గంటలకు కన్ను మూసిన విషయం తెలుసుకున్న సాహితీవేత్తలు రిమ్స్‌కు వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకున్నారు. అనంతరం బ్రౌన్ గ్రంథాలయ సంస్థ ప్రతినిధులు, ఆస్పత్రి అధికారుల సహకారంతో డాక్టర్ హనుమచ్చాస్త్రి కుమారుడు జానమద్ది విజయభాస్కర్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దేహాన్ని కడప నగరంలోని ఆయన కలల సౌధం సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి చేర్చారు. పురజనుల సందర్శనార్థం ఆయనను మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం కుటుంబ సభ్యులు ఎర్రముక్కపల్లెలోని ఆయన స్వగృహానికి చేర్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన పార్థివ దేహాన్ని నగరంలోని పలు ముఖ్యమైన కూడళ్ల ద్వారా ఊరేగింపుగా రామకృష్ణ జూనియర్ కళాశాల వద్దగల శ్మశాన వాటికకు చేర్చారు. అక్కడ బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తులు, పరిచయస్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన గురించి తెలిసిన ప్రజలు, అభిమానులు విషణ్ణ వదనాలతో నివాళులర్పించారు. పలువురి నివాళి... డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆయన మృతదేహాన్ని దర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు సురేష్‌బాబు, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి, నాయకులు హరిప్రసాద్, వైవీయూ వీసీ బేతనభట్ల శ్యాంసుందర్, రిజిస్ట్రార్ టి.వాసంతి, వైవీయూ పూర్వ పాలక మండలి సభ్యులు, డాక్టర్ కె.మనోహర్, ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు పి.రామసుబ్బారెడ్డి, పరిశ్రమలశాఖ జీఎం గోపాల్, శాంతిసంఘం కార్యదర్శి రాజారత్నం ఐజాక్, టీడీపీ నాయకులు గోవర్దన్‌రెడ్డి, జిల్లా ప్రముఖులు పుష్పగిరి విద్యా సంస్థల అధినేత ఎం.వివేకానందరెడ్డి, రాజోలి వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, ఆడిటర్ల సంఘం జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకోటిరెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.చెంచిరెడ్డి, నిర్మల హైస్కూలు ఉపాధ్యాయ బృందం, వైవీయూ అధ్యాపకులు, విద్యార్థులు ఆయన బౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వ అంధుల పాఠశాల సంగీత ఉపాధ్యాయుడు సాంబశివుడు ఆయనను స్తుతిస్తూ ప్రార్థనా గీతాలను ఆలపించారు. జానమద్ది మృతిపై సంతాపం ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతిపై రాష్ట్ర స్థాయిలో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారిలో కొందరి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి మా కుటుంబం మరిచిపోలేని మహోన్నత వ్యక్తి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. -వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేను ఏనాడో బ్రౌన్ శాస్త్రి అని పెట్టిన పేరు డాక్టర్ జానమద్దికి అక్షరాల తగినదని ఇప్పటికీ భావిస్తున్నాను. -డాక్టర్ సి.నారాయణరెడ్డి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి సున్నిత హృదయుడు. సునిశిత శ్రామికుడు. -నరాల రామారెడ్డి, శతాశధాని, అమెరికా శాస్త్రజ్ఞుడినైన నాకు డాక్టర్ జానమద్ది పరిచయం కొత్త స్ఫూర్తినిచ్చింది. వైవీయూలో వీసీగా ఉన్నంతకా లం ఆయనతో కలిసి చేసిన కార్యక్రమాలను జీవితంలో మరువలేను. - ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి, పూర్వ ఉప కులపతి, వైవీయూ జానమద్దిలాంటి మహోన్నత వ్యక్తి పరిచయం లభించడం పూర్వజన్మ సుకృతం. ఆయన మరణం వైవీ యూ ప్రగతికి, బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం అభివృది ్ధకి తీరని లోటు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. -ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్, ఉప కులపతి, వైవీయూ విదేశీయుడైనా బ్రౌన్ తెలుగుజాతికి మరువలేని సాహితీ సేవలు అందించగా, ఆయనను గుర్తుకు తెస్తూ మొట్టమొదటి స్మారక భవనాన్ని నిర్మించిన ఖ్యాతి జానమద్దిదే. -ఆచార్య టి.వాసంతి, కుల సచివులు, వైవీయూ జానమద్ది బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర నిర్మాణానికి చేసిన కృషి తెలుగుజాతి మరువలేదు. జిల్లా ప్రజల మనసులో ఆయన సుస్థిర స్థానం సాధించారు. -ఆచార్య ధనుంజయనాయుడు, ప్రిన్సిపాల్, వైవీయూ శిథిలమైపోతున్న తాళపత్ర గ్రంథాలను సంస్కరించి పుస్తకాలుగా ముద్రించడం ద్వారా డాక్టర్ జానమద్ది తెలుగుజాతికి చేసిన సేవను తెలుగు ప్రజలు మరవలేరు. -ఆచార్య ఎం.రామకృష్ణారెడ్డి, మాజీ కుల సచివులు, వైవీయూ రుణం తీర్చుకున్న రిమ్స్ కడప కల్చరల్:జానమద్ది హనుమచ్ఛాస్త్రి రుణం రిమ్స్ తీర్చుకుంది. అవును వెనుకబడిన ప్రాంతంలో అత్యున్నత విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావిస్తే, అందులోని తొలిబ్యాచ్‌కు అమూల్యమైన సలహాలు, సూచనలు అందజేసిన వ్యక్తి జానమద్ది. 2006లో రిమ్స్ వైద్య విద్యార్థుల తొలిబ్యాచ్ ఫ్రెషర్స్‌డే రోజున ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులు అమూల్యమైన సూచనలు చేశారు. కడప రిమ్స్ తొలిబ్యాచ్ వైద్యవిద్యార్థులు భావి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. 2014 సంవత్సరం వచ్చేకొద్ది అదే రిమ్స్ జానుమద్ధి బ్రౌన్ శాస్త్రికి చికిత్సలు చేపట్టింది. రిమ్స్‌లో వైద్యులు, ఉద్యోగులు సుమారు అర్ధశతకం రోజులు తమ శాయశక్తులా సేవలందించా రు. రిమ్స్ వైద్యుల నుంచి మొదలు డెరైక్టర్ డాక్టర్ సిద్దప్పగౌరవ్ వరకూ ఎప్పటికప్పుడు అవసరమైన మందులు అందిస్తూ కంటికి రెప్పలా చూసుకోవడంతో రిమ్స్ తన రుణం తీర్చుకుందని సాహిత్యాభిమానులు పేర్కొంటున్నారు. జానమద్ది సాహిత్యసేవ అమూల్యం వైవీయూ:ప్రముఖ రచయిత, కవి, సీపీ బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపకులు జానమద్ధిహనుమచ్ఛాస్త్రి సాహిత్యసేవలు అమూల్యమైనవని వైవీయూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ అన్నారు. శుక్రవారం వైవీయూలోని సర్ సీవీ. రామన్ సమావేశమందిరంలో నిర్వహించిన జానమద్ది సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని తెలుగుసాహిత్యానికి మరిన్ని సేవలందించేలా బ్రౌన్ లైబ్రరీని అభివృద్ధి పరుస్తామన్నారు. అనంతరం మౌనం పాటించి నివాళులర్పించారు. కలెక్టర్లతో అనుబంధం బ్రౌన్ శాస్త్రి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రికి పలువురు కలెక్టర్లతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. నిస్వార్థంగా సీపీ బ్రౌన్ పేరిట గ్రంథాలయాన్ని నెలకొల్పాలని, దాన్ని అత్యున్నత స్థాయికి చేర్చాలని ఆయన పడుతున్న తపనను గమనించిన అధికారులు ఆయనను ఎంతో గౌరవించేవారు. జిల్లాకు కలెక్టర్లకుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు పీఎల్ సంజీవరెడ్డి, జంధ్యాల హరినారాయణ, ఏకే ఫరీడా, రమణాచారి, జయేష్‌రంజన్, చంద్రమౌళి, అశోక్‌కుమార్,కృష్ణబాబు, శశిభూషణ్‌కుమార్, గిరిజాశంకర్, జయలక్ష్మి, కాంతిలాల్దండేలు ఆయనను గురుభావంతో గౌరవించేవారు. అలాగే ఆయనకు రాష్ర్ట అధికారభాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన నాటి సి.నారాయణరెడ్డి నుంచి నేటి మండలి బుద్దప్రసాద్ వరకు ఆత్మీయమైన పరిచయాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇంకాపలువురు సాహితీవేత్తలు, పుస్తక ప్రచురణ కర్తలతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. జానమద్ది మృతికి సంతాపం సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతికి రాజంపేట ఎంపీ ఎ.సాయిప్రతాప్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను సాహిత్య కేంద్రంగా నిలిపేందుకు ఆయన చేసిన కృషి అనితర సాధ్యమన్నారు. అంజాద్బాష నివాళి:వైఎస్సార్ సీపీ కడప నియోజకవర్గ కన్వీనర్ అంజాద్బాష శుక్రవారం జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతదేహాన్ని దర్శించి నివాళులర్పించారు. ఆయనతోపాటు నాయకులు మాసీమబాబు, హరూన్బజాజ్ సంస్థ డెరైక్టర్ అహ్మద్‌బాష, అబ్దుల్ వాజిద్ నివాళి అర్పించారు. రాటా అధ్యక్షుడు శేషగిరి జానమద్ది మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. బ్రౌన్ గ్రంథాలయం, భాషా పరిశోధన కేంద్రం ఏర్పాటులో డాక్టర్ హనుమచ్ఛాస్త్రి కృషి అనితర సాధ్యం.ఈ సంస్థలు ప్రజలకు ఎంతగా ఉపయోగపడితే బ్రౌన్ శాస్త్రి హృదయం అంతగా సంతోషిస్తుంది. -శశిశ్రీ, వైవీయూ పాలక మండలి పూర్వ సభ్యులు సున్నిత హృదయం, సునిశిత అధ్యయనం గల జానమద్ది తెలుగుభాషకు చేసిన సేవ మరువరానిది. వారి బహుముఖ భాషా పాండిత్యం వల్ల తెలుగులో దాదాపు 30 గ్రంథాలు వచ్చాయి. జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా ఆయన చేసిన 20 ఏళ్ల కృషి జిల్లాను సాహితీ కేంద్రంగా నిలిపింది. -ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, బాధ్యులు, సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం. బ్రౌన్ శాస్త్రి జీవితం ఆంధ్ర సారస్వత లోకానికి ఆదర్శం. జిల్లా సంసృ్కతికి వారి ఆరు పదుల జీవితం ఒక ప్రత్యేక గుర్తింపును కల్పించింది. హిందీ, ఆంగ్లం, ఆంధ్ర భాషల్లో ఆయనకు గల అభినివేశం ఎన్నో వ్యాసాల రూపంలో వెలువడి తెలుగు సంస్కృతిని పరిపుష్ఠం చేశాయి -విద్వాన్ కట్టా నరసింహులు, పూర్వ బాధ్యులు, సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, కడప. డాక్టర్ జానమద్ది సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి చేసిన కృషి గొప్పది. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. -పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సాహిత్య సేవా రంగాలలో జానమద్ది కృషి అనిర్వచనీయం. ఆయన దివంగతులైనా ఆయన మనస్సు సీపీ బ్రౌన్ గ్రంథాలయంలోనే పరిభ్రమిస్తూ దాని అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటుంది. -మలిశెట్టి జానకిరాం, పూర్వ సంయుక్త కార్యదర్శి, సీపీ బ్రౌన్ మెమోరియల్ ట్రస్టు డాక్టర్ జానమద్ది చరితార్థుడు. చరిత్రాత్మకుడు. -ఆచార్య వకులాభరణం రామకృష్ణ డాక్టర్ హనుమచ్ఛాస్త్రి బ్రౌన్ మీదున్న గౌరవంతో యాచన చేయడానికైనా వెనుకాడని వ్యక్తి .-డాక్టర్ వీబీ సాయికృష్ణ , వెంకటగిరి కొత్తగా చూసే కళ్లకు బ్రౌన్ స్మారక గ్రంథాలయం మాత్రమే కనిపిస్తుంది. తెలిసిన కళ్లకు ఆనందాశ్రయుల మధ్య సార్థక స్వరూపి, స్నేహశీలి, అనంతానంత ఆకారుడైన ఒక వయోవృద్ధుడు చిరునవ్వుతో కనిపిస్తాడు. ఆ వ్యక్తే జానమద్ది హనుమచ్చాస్త్రి, - పి.రామకృష్ణారెడ్డి, ప్రముఖ కథా రచయిత, హైదరాబాద్. డాక్టర్ జానమద్ది సారథ్యంలో జిల్లా రచయితల సంఘం, బ్రౌన్ గ్రంథాలయం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం లభించింది. ఆయన నాకు నిత్య స్మరణీయుడు. - ఎన్సీ రామసుబ్బారెడ్డి, వ్యవస్థాపక సభ్యుడు, బ్రౌన్ మెమోరియల్ ట్రస్టు. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఇక లేరన్న వార్త నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆంగ్ల దొర బ్రౌన్ తెలుగుభాషకు చేసిన సేవలను నేటితరానికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి జానమద్ది. ఆయన తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలు మరువలేనివి.- డాక్టర్ రమణాచారి, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం ఏర్పాటు, అబివృద్దికి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకోవాలి. గ్రంథాలయ ప్రాంగణంలో ఆయన శిలా విగ్రహాన్ని వీలైనంత త్వరలో ఏర్పాటు చేస్తేనే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారవుతాం. - జనార్దన్ పురాణిక, బ్రౌన్ శాస్త్రికి ఆప్త శిష్యుడు -
దళారి చేతిలో అన్నదాత దగా
దగదర్తి, న్యూస్‌లైన్: ఎకరాకు 4 పుట్ల ధాన్యం దిగుబడి ఇచ్చే భూములవి. సాగునీరు కూడా పుష్కలంగా వస్తోం ది. పైరుగా ఏపుగా పెరుగుతోంది. ఈ ఏడాది తమ పంట పండినట్టేనని రైతు లు భావించారు. ఇంతలో చిరుపొట్ట ద శకు చేరుకునే సమయంలో పైరు ఒక్కసారిగా గిటకబారసాగింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన వరిపైరు గిటకబారి ఎండిపోతుండటంతో అన్నదాత లబోదిబోమంటున్నారు. దళారి నకిలీ విత్తనాలు అంటగట్టడంతోనే తాము ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. దగదర్తి మండలం పెదపుత్తేడు గ్రామంలోని రైతుల కష్టాలివి. సాధారణంగా ధాన్యం అమ్ముకునే సమయంలో దళారుల చేతిలో దగాపడే అన్నదాత సాగు మొదట్లోనే కోలుకోలేని దెబ్బతిన్నారు. రేణంగి కాంతమ్మకు భర్త లేరు. కుమారుడు కష్టపడి సంపాదిం చిన మొత్తంలో ఎక్కువ శాతం సేద్యానికే వెచ్చిస్తుంది. నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరిపంట సాగు చేస్తోంది. పైరు ఎండిపోతుండటం, ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓజిలి శూలం మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. అప్పులు తెచ్చి సాగుచేసిన పంట ఎండుముఖం పట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. షేక్ రహంతుల్లా ఆరెకరాల భూమిలో వరిసాగు చేస్తున్నారు. పంట ఎండుముఖం పట్టడంతో దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నాడు. దళారిని నమ్మడంతో నకిలీ విత్తనా లు అంటగట్టాడని, ఎండుతున్న పంట దున్నేందు కు తప్ప దేనికీ పనికిరాదని వాపోతున్నాడు. గెరికపాటి ఓబయ్య ఐదెకరాల భూమిని కౌ లుకు తీసుకు ని వరి సాగుచేశాడు. మంచి దిగుబడులు సాధించి అప్పులు తీర్చుకోవాలని భావించిన ఈయన కల కల్లయిం ది. ఏపుగా పెరిగిన వరి ఒక్కసారిగా గిటకబారిందని, నాసిరకమైన విత్తనాలు అంటగట్టి దళారి మోసం చేశాడని బోరుమంటున్నాడు. పంటలను పరిశీలిస్తా: ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయా లి. ఎండుతున్న వరిపంటను పరిశీ లించి అధికారులకు వివరిస్తాం. రసీదులు, విత్తనాలు ఇచ్చిన సంచులు ఉంటే దళారులపై తగిన చర్యలు తీసుకుంటాం. - విజయభాస్కర్, వ్యవసాయాధికారి, దగదర్తి -
నృత్యం..హృద్యం
ఆమనగల్లు,న్యూస్‌లైన్: ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో నిర్వహిస్తున్న ధ్యాన మహాసభలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ధ్యాన మహాసభలు శుక్రవారం నాటికి పదో రోజుకు చేరుకున్నాయి. ఆ మహాసభలలో భాగంగా ఉదయం ప్రాతఃకాల ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రచించిన పుస్తకాలను, ధ్యానాంధ్రప్రదేశ్ జనవరి నెల సంచికను ది పిరమిడ్ స్పిరిచ్యుయల్ సొసైటీ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షీ సుభాష్‌పత్రీజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షీ పత్రీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ శరీరం విలువ తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు వెలగపూడి లక్ష్మణరావ్, నందాప్రసాదరావ్, దామోదరరెడ్డి, సాంబశివరావ్, నిర్మల, ఎస్ఆర్ ప్రేమయ్య, రవిశాస్త్రి, ధ్యానాంద్ర ప్రదేశ్ ఎడిటర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ధ్యాన మహాసభలలో భాగంగా తిరుపతికి చెందిన ప్రముఖ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం ఆకట్టుకుంది. హైద్రాబాద్‌కు చెందిన విజయ్‌భాస్కర్‌చే స్వర, లయ, సుధ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్న వివిద కళాప్రదర్శనలు ధ్యానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇక ఈసీలు, సీసీలు
సాక్షి, హైదరాబాద్: ఇకపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(ఈసీ)లు, సర్టిఫైడ్ కాపీలు(సీసీ-దస్తావేజు నకళ్లు) ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం ఆదేశించారు. ప్రస్తుతం ఈసీలు, సీసీలు కేవలం మీసేవా కేంద్రాల్లోనే ఇస్తున్నారు. అయితే మీసేవా కేంద్రాల్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులతోపాటు, 1990కి ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములకు సంబంధించిన నకళ్ల జారీలో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. దీంతో ఆయా దరఖాస్తుదారులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళుతున్నారు. అయితే దరఖాస్తుదారులు వస్తున్నా సబ్రిజిస్ట్రార్లు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సబ్రిజిస్ట్రార్ల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయభాస్కర్, స్థితప్రజ్ఞలు మంగళవారం మంత్రి తోట నరసింహంను కలిసి.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసీలు, సీసీలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
సినిమా రివ్యూ: వెంకటేశ్, రామ్ బ్రాండ్ 'మసాలా'
తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో మహానటులు ఎన్ టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్ బాబులు కృష్ణ, కృష్టం రాజులతో కలిసి అనేక మల్టీ స్టారర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించారు. జనరేషన్ మారిన తర్వాత స్టార్ డమ్ ఇమేజ్ లో చిక్కుకుపోయిన ప్రస్తుత హీరోలు మల్టీస్టారర్ చిత్రాలవైపు చూడటానికి జంకారు, ఆలోచించడానికి వెనకడుగు వేశారు. టాలీవుడ్ తెరపై మల్టీ స్టారర్ చిత్రాల ఉనికి ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో తాజాగా విక్టరీ వెంకటేశ్ ఓ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితమే మహేశ్ తో కలిసి వెంకటేశ్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఆ చిత్రం అందించిన విజయోత్సహాంతో మళ్లీ రామ్ తో జతకట్టి 'మసాలా' చిత్రంలో నటించగా, రాంచరణ్ తో వెంకటేశ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కు తెరతీస్తూ.. హిందీలో ఘనవిజయం సాధించిన 'బోల్ బచ్చన్' చిత్ర రీమేక్ గా 'మసాలా'తో వెంకటేశ్ గురువారం నవంబర్ 14 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ తో కలిసి నటించిన మసాలా చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లొద్దాం! కోర్టు తీర్పుతో యావదాస్తిని కోల్పోయిన రహమాన్ (రామ్), సోనియా(అంజలీ)లను వారి తండ్రి స్నేహితుడు నారాయణ(ఎంఎస్ నారాయణ) చేరదీసి తన ఊరు భీమరాజపురంకి తీసుకెళుతాడు. భీమరాజపురంలో ధనవంతుడైన బలరాం వద్ద నారాయణ పనిచేస్తుంటాడు. బలరాం (వెంకటేశ్) దేనినైనా సహిస్తాడు కాని అబద్దం ఆడిన వాళ్ల ప్రాణలు తీయడానికైనా వెనుకాడడు. బలరాంకు మీనాక్షి అనే సోదరి ( షాజన్ పదాంసీ) ఉంటుంది. ఆ ఊరిలో బలరాంకు నాగరాజు (పోసాని) అనే దుష్టుడికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్ఠాయిలో విభేదాలు ఉంటాయి. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఎన్నో ఏళ్లుగా ఓ ఆలయం మూతపడి ఉంటుంది. అయితే ఆ ఆలయ కొలనులో పడిన బాలుడిని రక్షించడానికి రెహమాన్ గుడి తాళం పగులగొట్టి, తలుపులు తెరుస్తాడు. దాంతో రహమాన్ పై నాగరాజు దాడికి పాల్పడుతున్న సమయంలో బలరాం వచ్చి కాపాడుతాడు. గుడి తలుపులు తెరిచిన రహమాన్ వివరాలు బలరాం అడుగుతాడు. ఆలయ తలుపులు తీసింది ఓ ముస్లిం అని చెబితే గొడవ అవుతుందనే ఉద్దేశంతో రహమాన్ పేరును రామ్ అని నారాయణ కుమారుడు (ఆలీ) అబద్దం ఆడుతాడు. రహమాన్ ఉరఫ్ రామ్ ప్రవర్తన నచ్చి బలరాం ఉద్యోగం ఇస్తాడు. ఒక అబద్దం ఆడిన రామ్.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్దాలు ఆడాల్సి వస్తుంది. అంతేకాక రహమాన్, మీనాక్షిలు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. అయితే అనేక అబద్దాలు ఆడిన రామ్.. బలరాంను ఎలా మెప్పించి, మీనాక్షితో పెళ్లిని ఎలా ఒప్పించాడు అనే సాదాసీదా కథతో 'మసాలా' చిత్రం రూపొందింది. వెంకటేష్ బ్రోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడటం బలరాం పాత్ర ప్రత్యేకత. కెరీర్ లో వెంకటేశ్ కు ఇది విభిన్నమైన పాత్ర. మల్టీస్టారర్ చిత్రాల్లో ఉండే పరిమితులు, ఇతర కారణాల వల్ల బలారాం పాత్ర కొంత మూసలో సాగినా.. పర్వాలేదనిపించింది. బలరాం పాత్ర చుట్టే ఇతర పాత్రలు తిరుగుతుంటాయి కాబట్టి వెంకటేశ్ ఈ చిత్రానికి వెన్నుముక అని చెప్పవచ్చు. ఇక రామ్, రహమన్ రెండు రకాల పాత్రలతో రామ్ ప్రేక్షకులను ఆలరించాడమే కాకుండా ఆకర్షించాడు కూడా. రామ్ పాత్ర కొంత అమాయకంగా ఉంటుంది. రహమాన్ గే (స్వలింగ సంపర్కుడు) రూపంతో నవ్వులు పూయించాడు. రామ్ లో ఉండే ఎనర్జీ గే పాత్రకు చాలా ప్లస్ అయింది. గే పాత్ర పోషించడానికి స్టార్స్ సహజంగానే వెనుకాడుతుంటారు. అయితే రామ్ ఇలాంటి పాత్రను చేయడమనేది ఓ సాహాసామే అని చెప్పవచ్చు. సోనియా పాత్రలో అంజలి తన పరిధి మేరకు ఓకే అనిపించింది కాని ఈ చిత్రంపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మీనాక్షిగా పదాంసీ చిన్న చిన్న సీన్లలో కనిపించినా.. పాటలకు మాత్రమే పరిమితమైంది. మీనాక్షి పాత్రకు ఇంకెవర్నినైనా సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారాయణ, ఆలీ బృందం గురించి. నారాయణ కొడుకుగా ఆలీ నటించాడు. ఆలీ మసాలా అనే డ్రామా కంపెనీని నడుపుతుంటాడు. కామెడి, డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆలీ ట్రాక్ ను తెలుగు వాతవరణానికి అనుగుణంగా చక్కగా డిజైన్ చేశారు. హిందీ 'బోల్ బచ్చన్' పోల్చకుంటే కృష్ణ, ఏఎన్నార్ కారెక్టర్లను బాగా ఇంప్రూవ్ చేసి ఆలీతో చేయించడం ఆకట్టుకుంది. అంతేకాక చింతామణి పాత్రలో కోవై సరళ తన మార్కును నిలబెట్టుకుంది. పాత సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కు కోవై సరళతో డ్యాన్సులు చేయించడం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. జయప్రకాశ్, పోసానిలకు రొటిన్ పాత్రలే దక్కాయి. మీనాక్షి పాట ఒక్కటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండేలా ఉంది. ఎందుకంటే ప్రోమోలో ఎక్కువగా కనిపించడమేమో. తమన్ మళ్లీ అదే సంగీతం రొటిన్. తమన్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పడం చాలా కష్టం. అనిల్ డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. ఇక 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు' 'మల్లీశ్వరి' లాంటి ఫ్యామీలీ ఎంటర్ టైనర్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నదర్శకుడు విజయ భాస్కర్ ను ఇటీవల కాలంలో ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. చాలా కాలం తర్వాత 'బోల్ బచ్చన్' రీమేక్ తో అక్కడక్కడా తన మార్కును చూపించినా.. ప్రయోగాలకు దూరంగానే ఉన్నట్టు కనిపించింది. బోల్ బచ్చన్ సినిమాను సీన్ టూ సీన్ ను కదపకుండా.. టాలీవుడ్ ట్రెండ్ కు తగినట్టుగా రూపొందించారు. ఈ చిత్ర సెకండాఫ్ లో కొంత గందరగోళం అనిపించానా.. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చేసింది. వెంకటేశ్ ఇంగ్లీష్ డైలాగ్స్ బీ, సీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంపైనే 'మసాలా' చిత్ర విజయం కొంత ఆధారపడి ఉంటుంది. వెంకటేశ్, రామ్ అందించిన 'మసాలా' చిత్రంలో ఘాటు ఎక్కువైందనిపిస్తుంది. లాజిక్కులన్ని వదిలేసి.. వినోదాన్ని ఆశించే ప్రేక్షకులు 'మసాలా'ను ఎంజాయ్ చేయవచ్చు అనే రేంజ్ టాక్ ను సంపాదించుకుంది. వెంకట్రామ్ (వెంకటేశ్, రామ్) బ్రాండ్ మసాలాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచిచూద్దాం! -
తారల తళుకుల మధ్య 'మసాలా' ఆడియో
హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ ఆధారంగా రూపొందించిన మసాలా చిత్రం ఆడియో విడుదల చేశారు. తొలిసారి విక్టరీ వెంకటేష్, రామ్ కలిసి నటించిన ఈ చిత్రానికి దర్శకుడు విజయ భాస్కర్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పించగా, 'స్రవంతి' రవికిశోర్ నిర్మించారు. మసాలా చిత్రంలో అంజలి, షాజన్ పదమ్సీ కథానాయికలు. పక్కా మాస్, మసాలా అంశాలతో ఈ సినిమా రూపొందింది. వినోదానికి పెద్ద పీట వేశాం. సంభాషణలు అమితంగా ఆకట్టుకుంటాయి అని ‘స్రవంతి’ రవికిషోర్ తెలిపారు.