జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రబీ పంటలు ఎండిపోకుండా ఉండేందుకు జిల్లా సాగునీటి సలహా బోర్డు ఓ నిర్ణయం తీసుకుంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద 9803 ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ 15 నుంచి సాగునీరు విడుదల చేసేందుకు తీర్మానించింది. బుధవారం కలెక్టర్ ఎం. గిరిజాశంకర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఐఏబీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ.. కోయిల్‌సాగర్ కింద 2013-14 రబీలో 290 ఎకరాల వరి సాగుకు, 9513 ఎకరాల ఆరుతడి పంటల కు సాగునీరు అందించనున్నట్లు తెలిపా రు. మొత్తం ఐదు విడతల్లో 20 రోజుల చొప్పున సాగునీరు అందిస్తామన్నారు.
రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. సమావేశం ప్రారంభమైన వెం టనే దేవరకద్ర ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు షెట్టర్లు సరిగా పనిచేయడం లేదని, నాలుగు సంవత్సరా ల నుంచి మరమ్మతులు చేయడం లేదన్నా రు. కాలువలో పూడిక పేరుకుపోయి, తూ ములు ధ్వంసమై ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందటం లేదని తెలిపా రు. కాలువపై గ్యాంగ్‌మెన్లు సరిగా విధు లు నిర్వహించడం లేదని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
సమస్యలు ఏకరువు పెట్టిన రైతులు....
పల్లి పంట వేసుకున్నాం.. నీరు రాకపోవడంతో పైర్లు ఎండిపోతున్నాయని కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తూములను బాగు చేయించి, పిల్ల కాలువలన్నింటిలో ఉపాధి హామీ పథకం కింద పూడిక తీయించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ.. వారంలోగా షెట్టర్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రధాన కాలువలో ఉపాధి హామీ ద్వారా పూడిక తీయిస్తామని తెలి పారు.
జూరాల ప్రాజెక్టు నుంచి మార్చి వర కు ఊటనీరు వచ్చే అవకాశం ఉన్నందున కోయిల్‌సాగర్ కింద వీలైతే మరొక తడికి నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటి విడత నీరు వదలి నిలుపుదల చేసిన అనంతరం యాంత్రాల ద్వారా ప్రధాన కాలువలో పూడిక తీసేం దుకు చర్యలు తీసుకంటామని వివరించా రు. ఈ లోగా ప్రాజెక్టును, కాలువలను ప్రత్యేక్షంగా పరిశీలించి షెట్టర్లు, తూముల మరమ్మతులకు అంచనాలు సమర్పించాలని చిన్ననీటి పారుదల ఈఈ బన్సీలాల్‌ను ఆదేశించారు. ప్రాజెక్టు కింద పని చేసే గ్యాంగ్‌మెన్ల పేర్లను సంబంధిత గ్రామ పంచాయితీ నోటీస్ బోర్డులలో రాయాల ని, అలాగే వారి సెల్‌ఫోన్ నంబర్లు కూడా అందులో పొందుపరచాలని ఆదేశించారు. కాలువపై అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేయవద్దని రైతులకు విజ్ఙప్తి చేశారు. సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎస్‌ఈ శ్రీరామకృష్ణ, డీఆర్‌ఓ రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.
రబీకి హామీ
Published Thu, Dec 12 2013 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement