koilsagar project
-
పాలమూరు వరప్రదాయిని.. 67వ వసంతంలోకి..
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టుగా ఉన్న కోయిల్‌సాగర్ 67వ వసంతంలోకి అడుగిడింది. దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 1947లో నిజాం పాలనలో నిర్మాణ పనులు ప్రారంభించి 1955 సంవత్సరంలో పూర్తిచేశారు. ఆనాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసింది కేవలం రూ.85 లక్షలే. ప్రాజెక్టు అలుగు స్థాయి ఎత్తు 26.6 అడుగులుగా నిర్మించారు. ఆనాటి ఆయకట్టు కింద 8 వేల ఎకరాలు ఉండగా.. కుడి, ఎడమ కాల్వల ద్వారా మొదటిసారి 1955లో జూలై 7న నీటిని వదిలారు. సిమెంట్ స్టీల్ ఉపయోగించని ఆనాడు అందుబాటులో ఉన్న సున్నం గచ్చు కలిపి రాతి కట్టడంతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రస్తుతం 67వ వసంతంలోకి చేరుకున్న ప్రాజెక్టు నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు. 1981లో క్రస్టుగేట్ల ఏర్పాటు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఆధునీకరించే పనులు 1981లో కాంగ్రెస్ హయాంలో చేపట్టారు. అలుగుపై 13 గేట్లను నిర్మాణం చేసి ప్రాజెక్టు కట్టను రెండు వైపులా ఆరు అడుగుల వరకు పెంచి బలోపేతం చేశారు. దీనికి గాను రూ.92 లక్షల వ్యయం అయింది. గేట్ల నిర్మాణంతో ప్రాజెక్టులో 32.6 అడుగుల మేర నీటిమట్టం పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.27 టీఎంసీలకు చేరింది. ఆయకట్టు కింద 8 వేల నుంచి 12 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అవకాశం లభించింది. -
8 ఏళ్ల తర్వాత నిండిన కోయిల్‌సాగర్
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో గల కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు 8 గేట్లను అధికారులు మంగళవారం ఎత్తివేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయింది. అయితే... ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో ప్రాజెక్టుకు చెందిన 8 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కాగా... కోయిల్ సాగర్ ప్రాజెక్టు 2009 తర్వాత మళ్లీ ఇపుడు నిండింది. అప్పట్లో ప్రాజెక్టు నిండడంతో గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ 8 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు నిండింది. -
కోయిల్‌సాగర్‌పై శీతకన్ను
మహబూబ్‌నగర్, దేవరకద్ర: కోయిల్‌సాగర్‌పై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గేట్లవద్ద లీకేజీలు పెరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ఇటీవలే ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ పరిధిలోకి చేర్చినా ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో ప్రాజెక్టు నిండినప్పుడు నెల కొన్న సమస్యలే మళ్లీ కనిపిస్తున్నాయి. దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసి ఎత్తిపోతల పథకం ద్వార ప్రాజెక్టును నీటితో నింపుతున్నారు. కానీ ఇక్కడ నెలకొన్న సమస్యలను మాత్రంగా గాలికి వదిలేశారు. గేట్ల కింది నుంచి లీకేజీ ప్రాజెక్టు నీటి మట్టం మంగళవారం 29 అడుగులకు చేరువలో ఉంది. పాత అలుగు స్థాయి 27 అడుగుల వరకే ఉండడంతో సోమవారం నుంచే గేట్ల కింద నుంచి లీకేజీలు ప్రారంభమయ్యాయి. లీకేజీల వల్ల కొంత వరకు నీరంతా వృథాగా వాగులోకి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు గేట్ల స్థాయి 33 అడుగులు కాగా మరో నాలుగు అడుగుల నీరు చేరితే గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది. 1981లో కోయిల్‌సాగర్ అలుగు కట్టపై షెట్టర్లను బిగించి గేట్లను ఏర్పాటు చేశారు. చాలా కాలంగా గేట్లను ఉపయోగించక పోవడం వల్ల కింద నుంచి లీకేజీలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే షెట్టర్ల కింద నుంచి లీకేజీలు కనిపించాయి. కానీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ముందస్తు చర్యలు అవసరం 27 అడుగులకు నీటి మట్టం చేరక ముందే నీటి లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అధికారులు పట్టించుకోక పోవడం వల్ల లీకేజీలు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా కాలం క్రితం షెట్టర్ల కింద వేసిన రబ్బర్ వాచర్లు పూర్తిగా అరిగిపోవడం వల్లే నీరు లీకేజీ అవుతోంది. గతంలో ఉన్న చిన్ననీటి పారుదుల శాఖ అధికారులు ప్రతి ఏడాది లీకేజీలు అరికట్టడానికి తాత్కాలికంగా గోనే సంచులను షెట్టర్ల కింద జొప్పించేవారు. నీటి మట్టం షెట్టర్లను దాటడం వల్ల గోనేసంచులు పెట్టడానికి కూడ వీలులేని పరిస్థితి ఉంది. ఇదిలాఉంటే అలుగు కట్టపై పిచ్చి మొక్కలు మొలిచాయి. కనీసం వాటిని కూడా తొలగించడంలేదు. అధ్వానంగా గెస్ట్‌హౌస్ ప్రాజెక్టు వద్దకు వచ్చే అధికారుల విడిది కోసం ఏర్పాటు చేసిన గెస్ట్‌హౌస్‌ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నిర్వహణలేక పోవడం వల్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గెస్ట్‌హస్ వద్దకు వెళ్లే రోడ్డు కూడా కనిపించకుండా పోయింది. ప్రాజెక్టు కట్టపై పాదాచారులు నడిచే సీసీ అంతా కొట్టుకు పోయింది. కట్టపైకి వెళ్లడానికి ఉపయోగిం చే మెట్లు కూడా పనికి రాకుండా మారాయి. ఇక లైటింగ్ కూడా లేక రాత్రి వేళ చీకట్లు అలుముకుంటున్నాయి. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెలుగులోకి రావడంలేదు. ఇప్పటికైనా అధికారులు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పట్టించుకుని పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది. -
రబీకి హామీ
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రబీ పంటలు ఎండిపోకుండా ఉండేందుకు జిల్లా సాగునీటి సలహా బోర్డు ఓ నిర్ణయం తీసుకుంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద 9803 ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ 15 నుంచి సాగునీరు విడుదల చేసేందుకు తీర్మానించింది. బుధవారం కలెక్టర్ ఎం. గిరిజాశంకర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఐఏబీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ.. కోయిల్‌సాగర్ కింద 2013-14 రబీలో 290 ఎకరాల వరి సాగుకు, 9513 ఎకరాల ఆరుతడి పంటల కు సాగునీరు అందించనున్నట్లు తెలిపా రు. మొత్తం ఐదు విడతల్లో 20 రోజుల చొప్పున సాగునీరు అందిస్తామన్నారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. సమావేశం ప్రారంభమైన వెం టనే దేవరకద్ర ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు షెట్టర్లు సరిగా పనిచేయడం లేదని, నాలుగు సంవత్సరా ల నుంచి మరమ్మతులు చేయడం లేదన్నా రు. కాలువలో పూడిక పేరుకుపోయి, తూ ములు ధ్వంసమై ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందటం లేదని తెలిపా రు. కాలువపై గ్యాంగ్మెన్లు సరిగా విధు లు నిర్వహించడం లేదని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు ఏకరువు పెట్టిన రైతులు.... పల్లి పంట వేసుకున్నాం.. నీరు రాకపోవడంతో పైర్లు ఎండిపోతున్నాయని కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తూములను బాగు చేయించి, పిల్ల కాలువలన్నింటిలో ఉపాధి హామీ పథకం కింద పూడిక తీయించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ.. వారంలోగా షెట్టర్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రధాన కాలువలో ఉపాధి హామీ ద్వారా పూడిక తీయిస్తామని తెలి పారు. జూరాల ప్రాజెక్టు నుంచి మార్చి వర కు ఊటనీరు వచ్చే అవకాశం ఉన్నందున కోయిల్‌సాగర్ కింద వీలైతే మరొక తడికి నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటి విడత నీరు వదలి నిలుపుదల చేసిన అనంతరం యాంత్రాల ద్వారా ప్రధాన కాలువలో పూడిక తీసేం దుకు చర్యలు తీసుకంటామని వివరించా రు. ఈ లోగా ప్రాజెక్టును, కాలువలను ప్రత్యేక్షంగా పరిశీలించి షెట్టర్లు, తూముల మరమ్మతులకు అంచనాలు సమర్పించాలని చిన్ననీటి పారుదల ఈఈ బన్సీలాల్‌ను ఆదేశించారు. ప్రాజెక్టు కింద పని చేసే గ్యాంగ్మెన్ల పేర్లను సంబంధిత గ్రామ పంచాయితీ నోటీస్ బోర్డులలో రాయాల ని, అలాగే వారి సెల్‌ఫోన్ నంబర్లు కూడా అందులో పొందుపరచాలని ఆదేశించారు. కాలువపై అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేయవద్దని రైతులకు విజ్ఙప్తి చేశారు. సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎస్ఈ శ్రీరామకృష్ణ, డీఆర్ఓ రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
‘కోయిల్‌సాగర్’ కాల్వలకు భూములివ్వం
మరికల్, న్యూస్‌లైన్: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద పిల్లకాల్వల ఏర్పాటు కోసం మంగళవారం జరిపిన భూసేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. తక్కువ ధరకే భూములను కొనుగోలు చేస్తున్నారంటూ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మరికల్ శివారులో కోయిల్‌సాగర్ పిల్లకాల్వల కోసం 44 ఎకరాల భూమిని అధికారులు భూసేకరించారు. భూములు కోల్పోయిన రైతుల వివరాలు సేకరించి వారితో భూములు స్వాధీనం చేసుకోవడం కోసం మంగళవా రం పంచాయతీ కార్యాలయంలో రెవె న్యూ అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. అయితే గతనెల 17న సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఇన్నాళ్లకు భూసేకరణ సమావేశం ఎలా నిర్వహిస్తున్నారని రైతులు వారిని నిలదీశారు. కేఎస్పీ పిల్ల కాల్వలకు తమ భూములు మాత్రం ఇవ్వం.. వాటి నుంచి తమ పొలాలకు ఏమాత్రం ప్రయోజనం లేదని కింది గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపడానికే కాల్వలు తీస్తున్నారని మండిపడ్డారు. భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులకు తేల్చిచెప్పారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు తమకు ఇప్పించండి లేదా ఎకరా ఖుష్కి భూమికి రూ. 25 లక్షలు, బోరుబావులున్న ఎకరా భూమికి రూ. 30 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరా ఖుష్కి భూమికి రూ. 1.16 లక్షలు, బోరుబావులు ఉన్న భూమికి రూ. 1.30 లక్షల నష్టపరిహారం ఇస్తామని కోయిల్‌సాగర్ భూసేకరణ డిప్యూటీ తహశీల్దార్ యాదగిరిరావు, జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్‌రెడ్డిలు రైతులకు చెప్పడంతో రైతులు అధికారులను నిలదీస్తూ ఆ నష్టపరిహారం ‘మాకొద్దు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ లేదా రైతుల డిమాండ్ మేరకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. న్యాయపరమైన నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు రైతులు వినతిపత్రం అంజేశారు. కార్యక్రమంలో రైతులు వెంకటేశ్, కొండప్ప, వీరన్న, శ్రీరాములు, మహాదేవమ్మ, వెంకటయ్య, కుర్మన్నలు పాల్గొన్నారు. -
‘కోయిల్‌సాగర్’ కాల్వలకు భూములివ్వం
మరికల్, న్యూస్‌లైన్: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద పిల్లకాల్వల ఏర్పాటు కోసం మంగళవారం జరిపిన భూసేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. తక్కువ ధరకే భూములను కొనుగోలు చేస్తున్నారంటూ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మరికల్ శివారులో కోయిల్‌సాగర్ పిల్లకాల్వల కోసం 44 ఎకరాల భూమిని అధికారులు భూసేకరించారు. భూములు కోల్పోయిన రైతుల వివరాలు సేకరించి వారితో భూములు స్వాధీనం చేసుకోవడం కోసం మంగళవా రం పంచాయతీ కార్యాలయంలో రెవె న్యూ అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. అయితే గతనెల 17న సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఇన్నాళ్లకు భూసేకరణ సమావేశం ఎలా నిర్వహిస్తున్నారని రైతులు వారిని నిలదీశారు. కేఎస్పీ పిల్ల కాల్వలకు తమ భూములు మాత్రం ఇవ్వం.. వాటి నుంచి తమ పొలాలకు ఏమాత్రం ప్రయోజనం లేదని కింది గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపడానికే కాల్వలు తీస్తున్నారని మండిపడ్డారు. భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులకు తేల్చిచెప్పారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు తమకు ఇప్పించండి లేదా ఎకరా ఖుష్కి భూమికి రూ. 25 లక్షలు, బోరుబావులున్న ఎకరా భూమికి రూ. 30 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరా ఖుష్కి భూమికి రూ. 1.16 లక్షలు, బోరుబావులు ఉన్న భూమికి రూ. 1.30 లక్షల నష్టపరిహారం ఇస్తామని కోయిల్‌సాగర్ భూసేకరణ డిప్యూటీ తహశీల్దార్ యాదగిరిరావు, జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్‌రెడ్డిలు రైతులకు చెప్పడంతో రైతులు అధికారులను నిలదీస్తూ ఆ నష్టపరిహారం ‘మాకొద్దు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ లేదా రైతుల డిమాండ్ మేరకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. న్యాయపరమైన నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు రైతులు వినతిపత్రం అంజేశారు. కార్యక్రమంలో రైతులు వెంకటేశ్, కొండప్ప, వీరన్న, శ్రీరాములు, మహాదేవమ్మ, వెంకటయ్య, కుర్మన్నలు పాల్గొన్నారు.