కోలారు, న్యూస్‌లైన్ : కోలారు జిల్లాపై సీఎం సిద్దరామయ్య వరాలు కురిపించారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం తాలూకాలోని వేమగల్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అన ంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కోలారు జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన శాశ్వత నీటిపారుదల సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
జిల్లాకు తాగునీటితో పాటు సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిన హొళె పథకాన్ని తీసుకు వచ్చిందని, ఈ పథకానికి రూ.1000 కోట్లను ఇప్పటికే బడ్జెట్‌లో రిజర్వు చేశామన్నారు. పథకం టెండర్ దశలో ఉందని తెలిపారు. దీనికి తోడు పరమశివయ్య నివేదికను అమలు చేసినట్లయితే జిల్లాలో తాగు, సాగు నీటి సమస్య పూర్తిగా పరిష్కారమౌతుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) తయారీకి రూ. 50 కోట్లను కేటాయించామన్నారు. డీపీఆర్ సిద్ధమైన తరువాత పథకం అమలుకు సత్వరమే చర్యలు తీసుకుంటావ ున్నారు.
అభివృద్ధితో పాటు సమాజం అన్ని రంగాలలో ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. తమ ప్రభుత్వం వ్యవ సాయ రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ట్లు వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించడంపై మండలిని ఏర్పాటు చేసి, అందులో రైతు నాయకులు, ప్రజా ప్రతినిధులను సభ్యులుగా తీసుకుని వారి సలహాలు సూచనలతో రైతులకు గిట్టుబాటు ధరలు అందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గితే ప్రభుత్వం రంగ ప్రవేశం చేసి రైతు నుంచి నేరుగా కొనుగోలు చేసి వారికి నష్టం కలుగకుండా ఆదుకుంటుందన్నారు. చిన్న, సన్నకారు రైతుల వలసలు ఆపాలనే ఈ నిర్ణయం తీసుకుంటోందన్నారు.
చెరువుల ఆధునికీకరణకు చర్యలు
జిల్లాలో చెరువుల ఆధునికీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి సంబంధించి రూ. 1100 కోట్లు అవసరమవుతాయని సీఎం తెలిపారు. నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని, కేంద్ర మంత్రులు సత్వరమే నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అక్రమ ఇసుక రవాణా జరిగితే కలెక్టర్, ఎస్పీలే బాధ్యులు
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరిగితే జిల్లా కలెక్టర్, ఎస్‌పీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవ డానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకు వస్తామని తెలిపారు.
కోలార్‌కు మెడికల్ కళాశాల
వచ్చే ఏడాది కోలార్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. అదే విధంగా పాల పౌడర్ తయారీ యూనిట్‌ను జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కే హెచ్ మునియప్ప, జిల్లా ఇన్‌చార్జి మంత్రి యూటీ ఖాదర్, రాష్ట్ర నగరావృద్ధి శాఖా మంత్రి వినయ్‌కుమార్ సోరకే, ఎమ్మెల్యేలు వర్తూరు ప్రకాష్, కొత్తూరు మంజునాథ్, మంజునాథ్‌గౌడ, వై రామక్క, నారాయణస్వామి, రమేష్‌కుమార్, ఎమ్మెల్సీలు డీఎస్ వీరయ్య, వైఏ నారాయణస్వామి, నజీర్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
మోడి కల ఫలించదు
దేశ ప్రధాని కావాలనే నరేంద్ర మోడీ కలలు ఎన్నటికీ ఫలించవని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోస్యం చెప్పారు. నగర సమీపంలోని నారాయణి కన్వెన్షన్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూబీజేపీ నరేంద్ర మోడని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిందని, అయితే ఆయన నిజంగానే ప్రధాన మంత్రి అయినట్లు కలలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రధాని కాలేరన్నారు. కర్ణాటకలో మోడీ ప్రభావం ఏ మాత్రం లేదన్నారు.
తాగు, సాగు నీటికి ప్రాధాన్యం
Published Thu, Sep 26 2013 3:55 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement