కేజీ టూ పీజీ విద్య అమలుకు కృషి
మంత్రి జూపల్లి కృష్ణారావు
వీపనగండ్ల : రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం విధానాలను అమలు చేసి వారి శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకుంటుందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు నూతనంగా పలు ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
గురువారం వీపనగండ్లలో స్వర్గీయ వంగూరు కృష్ణారెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40ఏళ్ల క్రితమే కృష్ణారెడ్డి నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో వీపనగండ్లలో పాఠశాల, హాస్టల్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 1969తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ప్రజలను చైతన్యం చేశారని చెప్పారు. సమితి ప్రసిడెంట్‌గా, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కేజీ టూ పీజీ విద్యను అమలు చేసి ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యతో పాటు రైతులకు, గ్రామాల్లో ప్రజలకు విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ ఏర్పాటే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎం.లోకారెడ్డి, తహశీల్దార్ దానప్ప, ఎంపీడీఓ కృష్ణయ్య, సర్పం చ్ క్యాతం శివుడు, పీఏసీఎస్ చైర్మన్ జగ్గారి శ్రీధర్‌రెడ్డి, పెద్దగంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, ఎత్తం బాలస్వామి, రవీందర్‌రెడ్డి, గోపి, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం
Published Fri, May 15 2015 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement