Minister JUPALLY Krishnarao
-
కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం
సాక్షి, భూపాలపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం వస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రలో భాగంగా బుధవారం ములుగులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉత్తమ్ మాట్లాడారు. ఎవరు ఎన్ని ప్రయ త్నాలు చేసినా 2019లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన కుటుంబమే బంగారుమయం అయిందని ఎద్దేవా చేశారు. ములుగును సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తానని మేడారంలో హామీ ఇచ్చి తప్పిన కేసీఆర్‌కు.. అమ్మల శాపం తగులుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమ్మల పేరిట జిల్లా చేసి తీరుతామని స్పష్టం చేశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులను అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాడ్వాయి మండలం జలగలంచ గుత్తికోయ మహిళలను చెట్లకు కట్టి అవమానించడం సిగ్గు చేటన్నారు. గిరిజన యూనివర్సిటీకి ఇప్పటి వరకు స్థల సేకరణ జరగలేదని, నిర్మాణానికి బడ్జెట్లో కేటాయించిన రూ.10 లక్షల ఏ మూలకు సరిపోతాయని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రతీ పనికి 6 శాతం కమీషన్ తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నా రని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మొక్కజొన్న, వరి, సజ్జలకు రూ.2 వేలు, పత్తికి రూ. 6 వేలు, మిర్చికి రూ.10 వేలకు తగ్గకుం డా మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పండించిన పంటను కొను: రేవంత్ కోటి ఎకరాలకు నీటిని అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్.. ముందు రైతులు పండించిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రం ఏమైన బాగు పడిందా అని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుడు అరుణ్ తప్పుడు పత్రాలతో రూ.86 కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ వారికి టెండర్లు ఇస్తే తన అవినీతి బయటపడుతుందని, ఆంధ్రవారికి అప్పగిస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ అసెంబ్లీలో రైతుల సమస్యలను ప్రస్తావించినందుకే సభ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్ట ని అన్నారు. సభలో షబ్బీర్‌అలీ, మల్లు భట్టివిక్రమార్క, మల్లు రవి, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
8 స్థానిక సంస్థలకు పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 8 స్థానిక సంస్థలకు ఉత్తమ పంచాయతీ పురస్కారాలు దక్కాయి. జాతీయ పంచాయతీ దివస్ సందర్భంగా ఏప్రిల్ 24న ఈ అవార్డులను ఏటా కేంద్రం అందజేస్తోంది. ఇందులో ఈ ఏడాదికి దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్‌ను తెలంగాణలోని ఒక జిల్లా పరిషత్‌తోపాటు, 2 మండల పరిషత్‌లను, మరో 4 గ్రామపంచాయతీలను కేంద్రం ఎంపిక చేసింది. జిల్లా పరిషత్ విభాగంలో ఆదిలాబాద్, మండల పరిషత్ విభాగంలో సిద్దిపేటతోపాటు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల పరిషత్‌కు పురస్కారం దక్కింది. గ్రామపంచాయతీ విభాగంలో రాజన్న సిరిసిల్ల మండలం ముష్టిపల్లి, సిద్దిపేట మండలం ఇర్కోడు, రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్ మండలం గంటల్‌పల్లి, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల పురస్కారం దక్కించుకున్నాయి. అవార్డుకు ఎంపికైన జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు, మండల పరిషత్‌లకు రూ.25లక్షలు, గ్రామపంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్రం అందజేస్తుంది. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారాన్ని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి దక్కించుకుంది. ఈ కేటగిరీ కింద 10 లక్షల నగదు ప్రోత్సా హకం దక్కనుంది. 24న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగే కార్యక్రమంలో 2016–17లో ప్రతిభ కనబర్చిన అవార్డు గ్రహీతలకు కేంద్రం పురస్కారాలు అందజేయనుంది. అవార్డు గ్రహీతలను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. -
సర్పంచ్ల గౌరవ వేతన బకాయిలకు మోక్షం
రూ. 26.08 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు అందాల్సిన గౌరవ వేతన బకాయిలకు ఎట్ట కేలకు మోక్షం లభించింది. 2015 అక్టోబరు నుంచి 2016 మార్చి వరకు ఆరునెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సర్పం చులు పెద్దెత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఇటీవల సర్పంచ్ల సంఘాలను పిలిపించుకొని వారి సమస్యలపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టమైన హామీలను కూడా ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు పాత వేతన బకాయిల నిమిత్తం రూ.26.08 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెజరీల నుంచి సర్పంచులు తమ వేతనాలను తీసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల పంచాయతీ అధి కారులను కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. ప్రతినెలా గౌరవవేతనం చెల్లింపు వివరాలను కమిషనర్ ఆఫీసుకు విధిగా పంపాలని డీపీవోలకు సూచించారు. చెక్కులపై ఈవోపీఆర్డీ సంతకం ఇకపై అక్కర్లేదు! రెండేళ్లుగా ప్రభుత్వానికి సర్పంచులకు మధ్య నలుగుతున్న చెక్ పవర్ వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి నిధుల వినియోగంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటుగా ఈవో పీఆర్డీ (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్)కు కూడా కౌంటర్ సిగ్నేచర్ అధికారాన్ని కల్పిస్తూ 2015 జూన్‌లో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే.. ప్రజలే నేరుగా ఎన్నుకున్న తమను ప్రభుత్వం దొంగలుగా చూస్తోందని, తమపై నమ్మకం లేకనే బిల్లులపై ఈవోపీఆర్డీ కౌంటర్ సిగ్నేచర్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సర్పంచుల నుంచి రోజురోజుకూ ఆందోళన తీవ్రమవుతుండటంతో ప్రభుత్వం పాత విధానాన్నే అవలంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయమై సానుకూలంగా స్పందిం చడంతో ఈ వివాదం తాజాగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పంచా యతీల బిల్లులపై ఈవోపీఆర్డీ కౌంటర్ సిగ్నేచర్ పద్ధతిని రద్దు చేస్తూ నేడో, రేపో ఉత్తర్వులు కూడా జారీ అవనున్నాయని తెలంగాణ సర్పంచుల సంఘం కన్వీనర్ ఎం.పురుషోత్తం రెడ్డి సోమవారం సాక్షికి తెలిపారు. -
ఈజీఎంఎం ద్వారా 20 వేల ఉద్యోగాలు
వచ్చే రెండేళ్లలో కల్పిస్తాం: మంత్రి జూపల్లి హైదరాబాద్: ఎంప్లారుుమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) ద్వారా వచ్చే రెండేళ్లలో 20 వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతేడాది శిక్షణ పొంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారితో సోమవారం ఇక్కడ తారామతి బారాదరిలో జరిగిన ఈజీఎంఎం సమ్మేళనంలో మంత్రి కృష్ణారావు మాట్లా డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తు న్నాయని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పరి శ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ నిస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించవచ్చని అన్నారు. ఉద్యోగాలు పొందేందుకు ఈజీఎంఎంను తొలిమెట్టుగా భావించాలని నిరుద్యోగులకు సూచిం చారు. నిరుద్యోగులకు ఉపాధి, రాష్ట్ర ఆదాయం పెంచే లక్ష్యంతోనే నూతన పారిశ్రామిక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని మంత్రి అన్నారు. టీఎస్ ఐపాస్ కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 50 వేల కోట్ల పెట్టుబడులు, 2-3 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భవిష్యత్ లో ఈజీఎంఎం ద్వారా మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ సరైన మార్గనిర్ధేశం లేకనే గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఈజీఎంఎం ద్వారా నిరుద్యోగులకు అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు కూడా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈజీఎంఎం కృషి చేస్తోందన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రవిబాబు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈజీఎంఎం పనితీరు మెరుగ్గా ఉందని ప్రశంసించారు. అనం తరం ఈజీఎంఎం ద్వారా శిక్షణ పొందిన యువకుల విజయగాథలతో రూపొందించిన 100 స్మైల్స్ పుస్త కాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఉద్యోగాలు పొందిన యువతీ యువకులతోపాటుగా వారి తల్లిదండ్రులను కూడా మంత్రి జూపల్లి ఘనంగా సన్మానించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మధుకర్ బాబు, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జాప్యాన్ని సహించేది లేదు
రహదారుల పనులపై అధికారులకు జూపల్లి హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యాన్నీ ఉపేక్షించేది లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తున్న కార్యక్రమాల పురోగతిపై అన్ని జిల్లాల ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా చేపట్టిన రహదారులు, నాబార్డ్ నిధులతో చేపట్టిన వంతెనల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గతేడాది మంజూరైన పనులన్నింటినీ పూర్తిచేయాలని అన్ని జిల్లాల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇకపై పంచాయతీ రహదారులకు అంచనాలు, సాంకేతిక అనుమతుల వంటి ప్రక్రియలను 45 రోజుల్లో పూర్తి చేయాలని, లేనిపక్షంలో సదరు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. టెండర్లు దక్కించుకొని నెలల తరబడి పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలన్నారు. నాణ్యత విషయంలో తేడాలు వస్తే ఉపేక్షించబోమన్నారు. అటవీశాఖ అనుమతుల కారణంగానే రహదారుల నిర్మాణంలో జాప్యమేర్పడుతుందని కొందరు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై అటవీశాఖ మంత్రితో మాట్లాడతానని జూపల్లి తెలిపారు. తెలంగాణ రాష్ట్రమేర్పడిన ఏడాదిన్నరలోనే గ్రామ పంచాయతీల్లో రూ.5వేల కోట్లతో సుమారు 12వేల కిలోమీటర్ల మేర రహదారులను ప్రభుత్వం మంజూరు చేసిందని జూపల్లి తెలిపారు. ఇందులో సగానికి పైగా పనులు పూర్తయ్యాయని, మిగిలినవి మరింత వేగంగా చేయాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూపల్లిని బర్తరఫ్ చేయాలి: నాగం
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ప్రాజెక్టులో అ క్రమాలు, అవకతవకలపై విచారణ జరిపిం చి మంత్రి జూపల్లి కృష్ణారావును బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈపీసీ టెండర్లలో జరిగిన అవినీ తిపైనా విచారణ జరిపించాలన్నారు. 2008లో ఇచ్చిన విజిలెన్స్ నివేదిక, ఆ తర్వాత కాగ్ ఇచ్చిన నివేదికల్లోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందన్నా రు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... కల్వకుర్తి ఐదు లిఫ్టుల్లో ఒక్క దానికే నీళ్లు వదిలి పాలమూరుకు స్వర్ణయుగమంటూ టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈ ఏడాది 3 నెలల కింద నీరు విడుదల చేసినా కనీసం మొక్కజొన్న, ఆరుతడి పంటలకు ఉపయోగపడేవన్నారు.కల్వకుర్తి కోసం రెండేళ్లలో రూ.245కోట్లు మాత్రమే ఖర్చు చేసి హరీశ్‌రావు రూ.2వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొవడం దారుణమన్నారు. -
పుష్కరాలకు వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా
30 మందికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం మహబూబ్‌నగర్ జిల్లా గురజాల వద్ద ఘటన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి జూపల్లి ఎల్లారెడ్డిపేట : కృష్ణ పుష్కరాల కోసం భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్ జిల్లా గురజాల సమీపంలోని మాచారం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో వెళ్తున్న సుమారు 30 మంది గాయపడ్డారు. వీరిలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరిపరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు, పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణ పుష్కరాల్లో భాగంగా పుణ్యస్నానాలు చేసేందుకు మండలంలోని అల్మాస్‌పూర్‌కు చెందిన 50 మంది భక్తులతోపాటు గొల్లపల్లికి చెందిన ముగ్గురు, నారాయణపూర్‌కు చెందిన ఒకరు, నిజామాబాద్ జిల్లా చుక్కాపూర్కు చెందిన నలుగురు సిద్దిపేటకు చెందిన ఓ ప్రైవేటు బస్సులో మహబూబ్‌నగర్ జిల్లా జోగులాంబ పుష్కరఘాట్‌కు మంగళవారం వేకువజామున బయల్దేరారు. వాహనం మహబూబ్‌నగర్ జిల్లా గురజాల సమీపంలోని మాచారం వద్దకు చేరుకోగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో 30 మంది గాయపడ్డారు. అల్మాస్‌పూర్‌కు చెందిన రోండ్ల కిష్టారెడ్డి, బోడ్డు నర్సవ్వ, వంగల మణెమ్మ, మారోజు భూమయ్య, కుమ్మరి లక్ష్మి, గుమ్మడిదారి లక్ష్మి, ఉచ్చిడి శంకర్‌రెడ్డి, పెద్దవేణి మల్లవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చాలామందికి కాళ్లుచేతులు విరిగినట్లు సమాచారం. ఇదే గ్రామానికి చెందిన గురిజాల వెంకట్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఈయనను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మిగిలిన క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి కేటీఆర్ దృష్టికి ప్రమాదం ప్రైవేటు బస్సు బోల్తాపడిన విషయం తెలుసుకున్న స్థానిక జెడ్పీటీసీ తోట ఆగయ్య మంత్రి కేటీఆర్‌కు చేరవేశారు. ఆయన వెంటనే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును అప్రమత్తం చేశారు. కేటీఆర్ సూచన మేరకు జూపల్లి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని ప్రత్యేక వాహనంలో వారివారి స్వగ్రామాలకు పంపించారు. -
కాంగ్రెస్ నేతలే ప్రజా కంటకులు
విపక్ష నేతలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నేతలే ప్రజా కంటకులని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. అధికారమే పరమావధిగా భావించి ఢిల్లీకే పరిమితమైన జైపాల్‌రెడ్డికి, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి జైపాల్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఎలా ప్రజా కంటకుడు అవుతారో జైపాల్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన వందిమాగధులు సాగిస్తున్న కుట్రల్లో భాగంగానే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సాధన పేరుతో పాదయాత్రలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ నేతలు తమ సిద్ధాంతాలను గాలికొదిలి దుష్టచతుష్టయంలా మారారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టులపై త్వరలోనే ప్రతిపక్ష పార్టీలకు బహిరంగ లేఖ రాస్తానని, వారికి దమ్ముంటే తాను అడిగే ప్రశ్నలకు సమధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ రాములు నాయక్, బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య పాల్గొన్నారు. -
పెండ పట్టే వారికి విమర్శించే అర్హత లేదు
మంత్రి జూపల్లిపై డీకే అరుణ ధ్వజం గద్వాల: పెండ పట్టేవారికి, పెండ తినేవారికి తనను విమర్శించే నైతిక అర్హత లేదని ఎమ్మెల్యే డీకే అరుణ మంత్రి జూపల్లినుద్దేశించి ధ్వజమెత్తారు. తనపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నాకు మెదడు ఉంది కాబట్టే.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి దశకు వచ్చాయి. మంత్రి జూపల్లికి మెదడులో పెండ ఉంది కాబట్టే.. పూర్తయ్యే ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మంచిగా మాట్లాడితే మంచిగా సమాధానాలు వస్తాయనే విషయాన్ని మంత్రి జూపల్లి గుర్తించుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల పేరుతో అడ్డమైన గడ్డి తిని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వారి కమీషన్ల కక్కుర్తి వల్లే జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం కూడా విరిగిపోయిందని ఆరోపించారు. వారి నీతి ఏమిటో ఇందులోనే అర్థమవుతుందని పేర్కొన్నారు. -
ఉపాధి పనులకు జీపీఎస్ టెక్నాలజీ
ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాలపై సమీక్షలో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ కార్యక్రమాల అమలులో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) టెక్నాలజీని వినియోగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని టీసీపార్డ్లో ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాలపై గ్రామీణాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ఉపాధి నిధులతో చేపడుతున్న నిర్మాణ పనుల ఫొటోలను నగరం నుంచే పర్యవేక్షించడం ద్వారా, పనుల పరిశీల నతో పాటు పారదర్శకతకూ దోహదపడుతుందన్నారు. పలు అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తులను కన్సల్టెంట్లుగా పెట్టుకోవాలని సూచిం చారు. పనుల్లో వేగం పెంచేందుకు సరైన గౌరవవేతనమిచ్చి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. అంచనాలు, డిజైన్ల రూపకల్పనకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 2కల్లా గ్రామాలన్నీ పరిశుభ్రంగా.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాల్లోనూ ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని, జూన్ 2కల్లా గ్రామాలన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్‌ను మంత్రి జూపల్లి ఆదేశించారు. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం అమలులో భాగంగా రైతులకు లాభసాటి వ్యవసాయ, పాడి పరిశ్రమ పద్ధతులను తెలపాలన్నారు. అమూల్ పాల విక్రయ సంస్థ రూపొందించిన బిజినెస్ మోడల్‌ను పరిశీలించాలని సూచించారు. జూన్ 24 నుంచి అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనుల్ని స్వయంగా పరిశీలించేందుకు వెళుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. సమీక్షలో పీఆర్ శాఖ డెరైక్టర్ అనితా రామ్‌చంద్రన్, పలువురు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ఆధార్’ను 100% అమలు చేస్తాం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడంలో ఆధార్, బయోమెట్రిక్ ప్రక్రియలను 100 శాతం అమలు చే స్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై శుక్రవారం సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు స్త్రీ నిధి ద్వారా రూ.1,300 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 55 లక్షల మంది ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్లు ఉన్నారని, అందులో కనీసం 25 లక్షల మందికైనా 100 రోజుల ఉపాధి కల్పించాలని ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కూలీలకు పనులను అప్పగించే ఫీల్డ్ అసిస్టెంట్లకు 5 వేల పనిదినాల టార్గెట్‌ను తొలగించి, గ్రామంలో 50 శాతం మంది జాబ్‌కార్డుదారులకు 100 రోజుల ఉపాధి కల్పించడాన్ని టార్గెట్‌గా పెడతామని చెప్పారు. ఉపాధి హామీ, సెర్ప్ తదితర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాల పెంపు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడం.. వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని జూపల్లి కృష్ణారావు తెలిపారు. -
ఆప్కోలో తవ్వినకొద్దీ అక్రమాలు
* వేరుపడినా ఉమ్మడిగానే వస్త్రాల కొనుగోలు * క్లోజింగ్ స్టాక్ వివరాలు వెల్లడించని అధికారులు * మంత్రి ఆదేశించినా జరగని విచారణ.. రాజకీయ జోక్యమే కారణం! సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్థ (ఆప్కో)లో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఆప్కోలో గోల్మాల్ రూ.600 కోట్లు..’ శీర్షికన ఆప్కోలో అవకతవకలను ‘సాక్షి’ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. సొసైటీల నుంచి వస్త్రాల కొనుగోలు మొదలుకుని ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేసేదాకా కాగితాలపై లెక్కలు చూపుతున్న అధికారులు... వాటికి సంబంధించిన అసలు అంశాలను తొక్కిపెడుతున్నారు. అసలు ఆప్కో అక్రమాలపై విచారణ జరపాలని మంత్రి జూపల్లి కృష్ణారావు గతేడాది ఏప్రిల్‌లోనే ఆదేశించినా... రాజకీయ జోక్యంతో ఆ విచారణ నిలిచిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏడాది కాలంగా విచారణ జరగకపోవడానికి కారణమేంటి, ఈ వ్యవహారంలో బాధ్యులెవరనేదానిపై మంత్రి కార్యాలయం ఇప్పటికీ వివరణ కోరకపోవడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మరెన్నో అక్రమాలు అసలు 2010 నుంచి ప్రారంభమైన ఆప్కో అక్రమాల పర్వం రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగింది. 2015 అక్టోబర్31 నాటికి ఆప్కో గోదాముల్లో ఉన్న వస్త్ర నిల్వలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 42:58 నిష్పత్తిలో పంచుకోవాలని... ఎవరికి వారు సొంతంగా కార్యకలాపాలు నిర్వహించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. అయితే సొసైటీల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాల నిల్వలకు సంబంధించి ఆప్కో అధికారులు నేటికీ లెక్కలు చూపడం లేదు. 2015 అక్టోబర్31 నాటికి ఉన్న క్లోజింగ్ స్టాక్ వివరాలు ఇవ్వాల్సిందిగా చేనేత, జౌళిశాఖ నుంచి తాఖీదులు వెళ్లినా స్పందన లేదు. ఇలా తెలంగాణ వాటాకు సంబంధించిన లెక్కలు చూపలేకపోతున్న అధికారులు... 2015 అక్టోబర్31 తర్వాత కూడా ఉమ్మడిగానే లావాదేవీలు నిర్వహించారు. ఉమ్మడిగా వస్త్రాల కొనుగోలుతో తెలంగాణ సొసైటీలకు నష్టం వాటిల్లుతుందని, ఉమ్మడి లావాదేవీలు నిలిపివేయాలని ఉన్నతాధికారులకు సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదు. మరోవైపు 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు కొనుగోలు చేసిన వస్త్రం విలువకు, వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖల నుంచి వచ్చినట్లుగా చెప్తున్న ఆర్డర్ ఇండెంట్ లెక్కలకు పొంతన కుదరకపోవడం గమనార్హం. ఉత్పత్తి సామర్థ్యంపై తప్పుడు లెక్కలు రాష్ట్రంలో ఉన్న చేనేత సొసైటీలు, వాటి ఉత్పత్తి సామర్థ్యం, పనిచేస్తున్న కార్మికులు తదితర అంశాలపై ఆప్కో వద్ద సమగ్ర సమాచారం లేదు. అయినా సొసైటీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 90 లక్షల మీటర్ల మేర ఉందని లెక్కలు చూపుతూ... పొరుగు రాష్ట్రాల నుంచి యంత్రాలపై తయారైన వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. గోల్మాల్ వ్యవహారంపై వార్తలు రావడంతో... హడావుడిగా ముంబైకి చెందిన ఓ వస్త్ర పరిశ్రమ నుంచి నాణ్యత లేని వస్త్రాన్ని కొనుగోలు చేసి, లెక్కలు చూపాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాము ఉత్పత్తి చేసిన వస్త్రాల నాణ్యతను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ సొసైటీల్లో తయారైన చేనేత వస్త్రం శాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నారు. ప్రభుత్వ విభాగాలకు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన నాణ్యత లేని వస్త్రాన్ని సరఫరా చేస్తున్నారు. ఉన్ని సంఘాల పేరిట ప్రభుత్వ విభాగాలకు బ్లాంకెట్ల సరఫరాలోనూ కొందరు సొసైటీ పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నారు. హర్యానాలోని పానిపట్ నుంచి బ్లాంకెట్లు కొనుగోలు చేస్తూ సొసైటీల పేరిట రికార్డులు సృష్టిస్తున్నారు. తక్షణమే విచారణ జరపండి ఉన్నతాధికారులకు జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: ‘ఆప్కో’లో అవతవకలపై వార్తల నేపథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న మగ్గాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యంపై తక్షణమే విచారణ జరపాలని... అవకతవకలు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని చేనేత విభాగం డెరైక్టర్ ప్రీతి మీనాను ఆదేశించారు. లావాదేవీలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్పత్తి సామర్థ్యం లేని సొసైటీల నుంచి వస్త్రాల కొనుగోలుకు సంబంధించి త నిఖీలు చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విభాగం పనితీరుపై ప్రభావం చూపుతున్నందున ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డిప్యుటేషన్‌ను రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో 412 చేనేత సొసైటీలు ఉండగా.. అందులో 200 వరకు చురుగ్గా పనిచేస్తున్నాయని ఆప్కో జేఎండీ సైదా వివరించారు. మూడు వేల మగ్గాలకు 90 వేల మీటర్ల వస్త్ర ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగా 2104 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు రూ.92 కోట్లు విలువ చేసే వస్త్రాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. -
వాణిజ్య అవకాశాలను పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్ : ఇరు ప్రాంతాల నడుమ వాణిజ్య సంబంధాలకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు తమ దేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని పోలండ్ రాయబారి తోమస్జ్ లుకస్జక్ ఆహ్వానించారు. లుకస్జక్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 5, 6 తేదీల్లో బెంగళూరులో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘బారత్- మధ్య యూరోప్ వాణిజ్య సదస్సు’ రెండో విడత ఏర్పాట్లలో భాగంగా ఈ భేటీ జరిగింది. భారత్‌తో తాము ఏటా రెండు బిలియన్ల డాలర్ల విలువైన వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు లుకస్జక్ వెల్లడించారు. గృహోపకరణాలు, టెలివిజన్ల తయారీలో పోలండ్ ప్రపంచంలోనే అగ్రగామిగా వుందన్నారు. దీంతో జపాన్, కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలు పోలండ్‌లో పరిశోధన, అభివృద్ధి సంస్థలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. వ్యవసాయం, ఫర్నిచర్, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్ రంగాల్లో పోలండ్ ప్రతినిధుల బృందం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించింది. అక్కడున్న నైపుణ్య మానవ వనరులు, సరళీకృత విధానాలకు ఆకర్షితులై భారతీయులు కూడా పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ఆ బృందం ప్రస్తావించింది. తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం ప్రత్యేకతలను మంత్రి జూపల్లి పోలండ్ బృందానికి వివరించారు. ఇరు ప్రాంతాల నడుమ పెట్టుబడులకున్న అనుకూలతలు, మానవ వనరులు తదితరాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోనూ లుకస్జక్ బృందం భేటీ జరిపింది. ఇక్కడి అవకాశాలు, పారిశ్రామిక విధానంపై రాజీవ్ శర్మ పోలండ్ బృందానికి వివరించారు. పోచారంతో పోలండ్ రాయబారి భేటీ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్‌లో పోలండ్ రాయబారి థామస్ లుకాజుక్ తెలిపారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో ఆయన భేటీ అయ్యారు. గతంలో అమూల్ పాల ఉత్పత్తి సంస్థలో పెట్టుబడులు పెట్టామని, పన్నీర్, వెన్న తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించామని పేర్కొన్నారు. పోలండ్‌లో వ్యవసాయం, నీటి వనరుల సంరక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వ కృషి తదితర వివరాలను మంత్రికి వివరించారు. కాగా, నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఏర్పాటు చేసిన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల పోలండ్ రాజధానిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం కుదిరే అవకాశముందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. -
మంత్రి జూపల్లి ఓఎస్డీ వీరారెడ్డిపై విచారణ
సంగారెడ్డి మునిసిపాలిటీల్లో అవినీతి వ్యవహారం సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా సంగారెడ్డి మునిసిపాలిటీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకు బాధ్యులైన ఐదుగురు అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎం.జి.గోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కష్ణారావు పేషీలో ఓఎస్డీగా పనిచేస్తున్న జి.వీరారెడ్డి సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో వున్నారు. మిగతా నలుగురిలో సంగారెడ్డి మునిసిపాలిటీ మాజీ శానిటరీ ఇన్స్పెక్టర్ విక్రంసింహారెడ్డి, మాజీ అకౌంటెంట్ కె.లత, మాజీ మేనేజర్ రమేశ్, మాజీ కమిషన్ కేవీవీఆర్ రాజు ఉన్నారు. -
చెరకు రైతులను ఆదుకుంటాం
పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: చెరకు రైతులకు నష్టం కలిగించే ఏ చర్యలనూ సహించేది లేదని రాష్ట్ర పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. చక్కెర శాఖలో రైతులకు నష్టం కలిగే విధంగా వ్యవహరించిన అధికారులను, ఉద్యోగులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శెక్కర్ భవన్లో శుక్రవారం మంత్రి శాఖలోని వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. షుగర్ కమిషనర్ బధ్రు మాలోత్తో పాటు ఆ శాఖకు చెందిన పలువురు అధికారులు హాజరైన ఈ సమావేశంలో శాఖాపరంగా జరుగుతున్న నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలను అధికారులు, ఉద్యోగులు పూర్తిగా భ్రష్టు పట్టించారని, చక్కెర అమ్మిన డబ్బులను చెరకు రైతులకు చెల్లించకుండా మిగతా స్టాక్‌ను విక్రయిస్తూ నష్టం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు, ఉద్యోగుల పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, దీన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమీక్ష అనంతరం మీడియాతో జూపల్లి మాట్లాడుతూ ‘నిజాం డెక్కన్ షుగర్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నా లావాదేవీలకు సంబంధించి సరైన లెక్కలు లేవు. చెరకును క్రష్ చేసిన తరువాత వచ్చిన చక్కెర అమ్మకం డబ్బును రైతులకు చెల్లించడం లేదు. ఈ కంపెనీ యాజమాన్యం 80 వేల క్వింటాళ్ల చక్కెర విక్రయించి బ్యాంకుకు మాత్రం రూ. 10 కోట్లు కట్టింది. మిగతా రూ. 26 కోట్లు ఇతరత్రా వాడడం జరిగింది’ అని అన్నారు. షుగర్ కమిషన్ కింద ఎన్డీఎస్ఎల్లో ప్రభుత్వం తరపున పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్లు, కమిషనర్ బాధ్యతగా వ్యవహరించి చక్కెర అమ్మగా వచ్చిన డబ్బును రైతులకు చెల్లించేలా చూడాలని అన్నారు. చెరకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రూ. 11 కోట్లు రైతాంగానికి ఇచ్చారని, అయినా ఇంకా కొంత బకాయిలు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు ఇచ్చే ధర రూ. 2,200 అయితే అదనంగా రూ. 400 కలిపి రూ. 2,600 రైతాంగానికి చెల్లిస్తున్నామని మంత్రి చెప్పారు. కాగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బోధన్, సంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్లను మంత్రి మందలించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కేన్ కమిషనర్ వీరస్వామి, అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. -
పరిశ్రమలకు ప్రథమ గమ్యం.. తెలంగాణ
ఫ్రెంచి బృందంతో భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్ : భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రథమ గమ్యస్థానమని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్, భారత్‌తో ఆర్థిక సంబంధాల ప్రత్యేక ప్రతినిధి పాల్ హెర్మెలిన్ నేతృత్వంలోని 44 మంది ఫ్రెంచి ప్రతినిధుల బృందం మంత్రి జూపల్లితో బుధవారం సచివాలయంలో భేటీ అయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధన దిశగా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానంలోని ప్రత్యేకతలను మంత్రి జూపల్లి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చే వారికి విమానాశ్రయంలోనే ఎర్రతివాచీతో స్వాగతం పలికి, అవినీతి, జాప్యానికి తావులేకుండా పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌లో వున్న భౌగోళిక, వాతావరణ అనుకూలతలు వివరించారు. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ కంపెనీలు, ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థలు తెలంగాణలో తమ సంస్థల స్థాపించిన విషయాన్ని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపన ద్వారా భారత్, ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయన్నారు. తెలంగాణ ఆర్దికాభివృద్ధికి వివిధ రంగాల్లో సహకారం అందిస్తామని భారత్‌లో ఫ్రెంచి రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్ పేర్కొన్నారు. ప్రస్తుత భేటీ తెలంగాణలో ఫ్రెంచి సంస్థల భవిష్యత్ పెట్టుబడులకు బాటలు వేస్తుందన్నారు. ఆల్స్టార్మ్, డెసాల్ట్, ఈగిస్, జోడియాక్స్, లూమిప్లాన్, పోమా, సిస్ట్రా, థేల్స్ వంటి బహుళ రవాణా వ్యవస్థకు చెందిన సంస్థలతోపాటు ఏసీఎంఈ, సిటెలిమ్, ఎన్జీ, స్నెయిడెర్, సోలెయిర్ డెరైక్ట్ తదితర విద్యుత్ సంస్థల ప్రతినిధులు ఫ్రెంచి బృందంలో వున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోపాటు పట్టణాభివృద్ధి, హెచ్ఎండీఏ, ట్రాన్స్‌కో, పీసీబీ తదితర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఫ్రెంచి బృందం నేడు మరోమారు భేటీ కానుంది. -
పెట్టుబడులకు ఆస్ట్రేలియా సుముఖత
* మంత్రి జూపల్లిని కలసిన ఆస్ట్రేలియా బృందం * ప్రభుత్వ విధానాలను వివరించిన మంత్రి సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికీకరణ దిశలో వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఉన్నాయని ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ పార్లమెంటరీ కార్యదర్శి, ఎంపీ హాన్ స్టీవెన్ సియోబో గురువారం సచివాలయంలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. గనులు, వ్యవసాయం, నీటి యాజమాన్యం తదితర రంగాల్లో ప్రావీణ్యం కలిగిన ఆస్ట్రేలియాకు తెలంగాణలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని సియోబో అభిప్రాయం వ్యక్తం చేశారు. సూక్ష్మ సేద్యం, మౌలిక సౌకర్యాలు, విద్య, రోడ్డు భద్రత తదితర అంశాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు అవకాశం ఉందన్నారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి వివరించారు. భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ పాట్రిక్ సక్లింగ్, దక్షిణ భారత కాన్సుల్ జనరల్ సీన్ కెల్లీతో పాటు వాణిజ్య బృందం సభ్యులు మంత్రి జూపల్లిని కలిసిన వారిలో ఉన్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ మణికారాజ్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. హాంకాంగ్‌కు చెందిన మెజ్జో హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ జాన్ ఎడ్మండ్సన్ నేతృత్వంలోని ఈశాన్య ఆసియా పెట్టుబడిదారుల బృందం మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయింది. తైవాన్, జపాన్, హాంకాంగ్, చైనా దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఈ బృందంలో ఉన్నారు. సెల్‌ఫోన్ విడిభాగాలు, ఆటోమోటివ్ పార్టులు, గృహ, మౌలిక సౌకర్యాలకు సంబంధించిన యూనిట్లు రాష్ట్రంలో నెలకొల్పేందుకు ఈ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. భౌగోళికంగా హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతలను వివరించడంతో పాటు, ఎగుమతులు, రవాణాకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. డ్రైపోర్టులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు తదితర రంగాల అభివృద్ధికి సహకారం అందిస్తామని ఈశాన్య ఆసియా బృందం సభ్యులు హామీ ఇచ్చారు. రూ.1,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర ప్రణాళికతో త్వరలో వస్తామని ప్రకటించారు. -
పరిశ్రమలు స్థాపించని భూములు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: గతంలో అనుమతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేయని కంపెనీల నుంచి భూములు వెనక్కి తీసుకుంటామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ మార్గదర్శకాలు ఈ నెల 12న విడుదలవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు అవసరాలకు మించి భూములు కేటాయించి, ఆ తర్వాత పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించలేదన్నారు. భూములు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి ఇప్పటికే నోటీసులు జారీచేసినట్లు వెల్లడించారు. ఆయన మాటల్లోనే... ♦ గతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ అతి పెద్ద సమస్యగా ఉండేది. రాష్ట్రంలో ప్రస్తుతం టీఎస్ఐఐసీ ద్వారా 1.65 లక్షల ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకే భూములు పొందే అవకాశం ఉంది. విద్యుత్, నీటి సమస్యలు లేకపోవడం, భౌగోళికంగా, వాతావరణపరంగా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనువైన వాతావరణం ఉంది. ♦ నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని జిల్లాల్లోనూ ‘స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు’ ఏర్పాటు చేస్తాం. సాంకేతిక విద్యలో నాణ్యత పెంచేలా విద్యా విధానం రూపకల్పన జరుగుతోంది. లైఫ్‌సెన్సైస్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్, జెమ్స్ అండ్ జువెలరీ తదితర 14 రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నట్లు గుర్తించాం. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు వసతుల కల్పనపై దృష్టి సారించాం. ♦ ఫార్మా, లైఫ్‌సెన్సైస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించినందున ఆయా పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. పెట్టుబడుల కోసం రాష్ట్రాల నడుమ పోటీ ఉన్నా పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ముందుంటుంది. ♦ ప్రయోగాత్మకంగా గత జనవరి నుంచి ప్రారంభించిన టీఎస్ఐపాస్కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రస్థాయిలో 164 దరఖాస్తులు రాగా, రూ.6 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది జూన్ 2 నుంచి ఇప్పటి వరకు జిల్లాల్లో 5 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు అందాయి. ♦ ఈ నెల 12న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన పారిశ్రామిక విధానం మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. టీఎస్ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంగా మారబోతోంది. అమెరికాలో సదస్సుకు జూపల్లి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ నెల 15 నుంచి 18వరకు జరిగే ‘యుఎస్ బయో 2015’ సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి ఆయనతో పాటు వెళ్లనున్నారు. ప్రభుత్వం చేపట్టిన బయో, పారిశ్రామిక విధానాలను ఈ సదస్సులో వివరించనున్నారు. -
ఎయిర్‌పోర్టులోనే ఎదుర్కోలు
* పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ స్వాగతం * 12న ఐపాస్ మార్గదర్శకాల విడుదల కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు * స్వాగత ఏర్పాట్లపై నేడు మంత్రి జూపల్లి సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్) మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఈ నెల 12న జరిగే కార్యక్రమానికి హాజరయ్యే పారిశ్రామిక దిగ్గజాలకు మర్యాదల్లో ఎక్కడా లోటు రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతను ఓ ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థకు అప్పగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు బయటి ద్వారం వద్ద కాకుండా నేరుగా విమానాశ్రయంలోనే ఎదురేగి స్వాగతం పలకాలని నిర్ణయించారు. అతిథులకు స్థానికంగా బస ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై కేసీఆర్ పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహ్వాన పత్రాల పంపిణీ పూర్తి కావడంతో అతిథులకు అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రముఖులకు ఆహ్వానాలు... ఈ కార్యక్రమానికి వచ్చే 2 వేల మంది ప్రముఖులను కేటగిరీలుగా వర్గీకరించి ఆహ్వానాలు అందజేస్తున్నారు. సీఎంవోతోపాటు పరిశ్రమలశాఖ కార్యదర్శి ఆహ్వాన పత్రాల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు ముంబై వెళ్లి టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీని ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ మరో 130 మంది ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల ప్రముఖులకు స్వయంగా లేఖలు రాశారు. ఆహ్వాన పత్రాలు అందుకున్న వారిలో చాలా మంది పారిశ్రామిక దిగ్గజాలు సుముఖత వ్యక్తం చేస్తూ లేఖలు పంపినట్లు పరిశ్రమలశాఖ వర్గాలు వెల్లడించాయి. పరిశ్రమలశాఖ కమిషనరేట్, టీఎస్ ఐఐసీ, టీఎస్ ఎండీసీ తదితర ప్రభుత్వశాఖల అధికారులు అతిథుల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
ధూమ్..ధామ్‌గా
♦ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు 17 కమిటీల ఏర్పాటు ♦ జిల్లా సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు ♦ జూన్ 2న అమరవీరులకు నివాళితో ప్రారంభం ♦ జూన్ 7న శోభాయాత్రతో ముగింపు ♦ ‘సాక్షి’తో కలెక్టర్ శ్రీదేవి అంబరాన్నంటేలా తెలంగాణ సంబరాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పేలా జిల్లాలో తెలంగాణ ఆవిర్బావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. గురువారం జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలకు సంబంధించి ‘సాక్షి’ ప్రతినిధికి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జూన్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ వారోత్సవాల విజయవంతం కోసం ప్రత్యేకంగా 17 కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. 2వ తేదీ ఉదయం మహబూబ్‌నగర్‌లోని ఇందిరాపార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించడం ద్వారా ప్రారంభమయ్యే ఉత్సవాలు 7వ తేదీన నగరంలో శోభాయాత్రతో ముగుస్తాయని చెప్పారు. ఏడురోజుల పాటు జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఉదయం - సాయంత్రం మహబూబ్‌నగర్ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ప్రాంతానికి గల చరిత్ర ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. 2న అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. వివిధరంగాల్లో అద్భుత ప్రతిభా పాటవాలు కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు మండల, జిల్లా స్థాయిలో అవార్డులు ఇవ్వనున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటైందని కలెక్టర్ చెప్పారు. ఈ కమిటీ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో సమావేశమై అవార్డుకు అర్హులైన వారిని ఎంపిక చేస్తుందని వివరించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 675 దరఖాస్తులు అవార్డుల కోసం అందాయని, అయితే వీటిలో ఇంకా ఏఏ మండలాల వారు దరఖాస్తు చేసుకోలేదో పరిశీలించి వారికి అవకాశం వచ్చేలా చూడాల్సి ఉందన్నారు. జిల్లా కేంద్రంలో జూన్ 2న ఉదయం జిల్లా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అమరవీరులకు నివాళులు అర్పిస్తారని.. అనంతరం పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే సభలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పతాకావిష్కరణ చేసి ప్రసంగిస్తారని కలెక్టర్ వివరించారు. జూన్ 2నుండి ప్రతిరోజు సాహిత్యగోష్ఠి, అష్టవధానాలు, కవి సమ్మేళనాలు, సాహిత్యపరమైన చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తామని.. ఇవి జిల్లా పరిషత్ ఆడిటోరియంలో 7వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. సాయంత్రం సమయాల్లో జిల్లా పరిషత్ గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో అత్యధికం మహబూబ్‌నగర్ జిల్లా సంస్కృతిని, సాంప్రదాయాలను, చరిత్రను చాటిచెప్పేవే ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లాకు చెందిన ప్రముఖులు, మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా ప్రతినిధులు పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. వివిధరంగాల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి చివరిరోజు జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తామన్నారు. జూన్ 6న రాష్ట్రస్థాయి కళాకారుల బృందం జిల్లాకు రానుందని.. దాదాపు 200 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు. ఈ బృందానికి సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ నేతృత్వం వహిస్తారని.. వీరి కళాప్రదర్శన కోసం జెడ్పీ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నట్లు ఆమె చెప్పారు. రూ.11కోట్లతో కొనుగోలు చేసిన 408 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమిని 130మంది నిరుపేద ఎస్సీలకు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అభివృద్ధికి చిరునామాగా మహబూబ్‌నగర్‌ను మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో శ్రమశక్తికి కొదవ లేదని.. జిల్లాలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యవసాయ పరంగా మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కొల్లాపూర్ మామిడికి ప్రసిద్ధి గాంచిందని అలాగే బాలాపూర్, షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో అపారంగా పండిస్తున్న కూరగాయలు భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇందుకుగాను రైతులకు పంట దిగుబడిలో పాటించాల్సిన మెళకువలపై ఆధునిక సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని యోచిస్తున్నట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి వెల్లడించారు. -
నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం
మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ : విద్యారంగాన్ని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం శిక్షణనిచ్చేందుకు కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్‌ను శుక్రవారం మంత్రి జూపల్లి లాంఛనంగా ప్రారంభించారు. కన్యకా పరమేశ్వరి మంటపంలో కలెక్టర్ శ్రీదేవి సమక్షంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి నిరుద్యోగ యువతీ, యువకులనుద్ధేశించి మాట్లాడారు. యువతీ, యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలనే ఉద్ధేశ్యంతో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, కొల్లాపూర్ నియోజకవర్గంలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గంలోని పాఠశాలలు, వసతి గృహాల్లో కూడా స్టడీ అవర్స్ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవి మాట్లాడారు. సేవా సంస్థలు, ఆర్థిక సహకారం అందించే వారు ముందుకు వస్తే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. సమావేశంలో రిటైర్డ్ డీఆర్వో మదన్మోహన్రావు, స్టడీ సర్కిల్ డెరైక్టర్లు జగదీశ్వర్‌రెడ్డి, వాల మదన్మోహన్రావు, ఇన్చార్జి అర్జున్‌గౌడ్, ఎంపీపీ నిరంజన్‌రావు, జెడ్పీటీసీ హన్మం తు, రఘుపతిరావు, తదితరులున్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం
కేజీ టూ పీజీ విద్య అమలుకు కృషి మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల : రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలను అమలు చేసి వారి శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకుంటుందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు నూతనంగా పలు ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. గురువారం వీపనగండ్లలో స్వర్గీయ వంగూరు కృష్ణారెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40ఏళ్ల క్రితమే కృష్ణారెడ్డి నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో వీపనగండ్లలో పాఠశాల, హాస్టల్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 1969తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ప్రజలను చైతన్యం చేశారని చెప్పారు. సమితి ప్రసిడెంట్‌గా, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కేజీ టూ పీజీ విద్యను అమలు చేసి ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యతో పాటు రైతులకు, గ్రామాల్లో ప్రజలకు విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ ఏర్పాటే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎం.లోకారెడ్డి, తహశీల్దార్ దానప్ప, ఎంపీడీఓ కృష్ణయ్య, సర్పం చ్ క్యాతం శివుడు, పీఏసీఎస్ చైర్మన్ జగ్గారి శ్రీధర్‌రెడ్డి, పెద్దగంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, ఎత్తం బాలస్వామి, రవీందర్‌రెడ్డి, గోపి, రాకేష్, తదితరులు పాల్గొన్నారు. -
నూతన పద్ధతులతో అధిక దిగుబడి సాధించండి
రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్ వ్యవసాయం : రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రైతులు నూతన పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయితీపై రైతులకు వ్యవసాయ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచం కుగ్రామంగా మారిన పరిస్థిలలో భారతదేశం కూడా వ్యవసాయరంగంలో తగిన పోటీ ఇవ్వాలని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునాతన పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధిస్తుండగా, భారతదేశ రైతులు మాత్రం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సాంకేతిక పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలంపూర్‌లో ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా పారిశ్రామిక రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ యువతకు పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాలు కల్పించాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం ప్లానింగ్ కమిషన్ వైస్ చెర్మైన్ ఎస్.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం రానున్న కాలంలో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని అన్నారు. అనంతరం పార్లమెంటు సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జెడ్పీ చెర్మైన్ బండారి భాస్కర్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చెర్మైన్ నవీన్‌కుమార్ రెడ్డి, జేడీఏ ఉష పాల్గొన్నారు. -
అసెంబ్లీలో ‘ఇందూరు’ సమస్యలు
నిజామాబాద్ అర్బన్ : అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన పలు అంశాలను ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనంపై ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షాన్ని నిలదీశారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న విషయం ఎంతవరకు వాస్తవమో చెప్పాలన్నారు. ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసిన రైతులకు డబ్బులు చెల్లించడం లేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. డేల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్‌తో ఎన్ఎస్ఎల్ ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఈ విషయమై అడ్వకేట్ జనరల్ అభిప్రాయూన్ని కోరామన్నారు. రోడ్డు విస్తరణపై.. నిజామాబాద్ -డిచ్పల్లి రోడ్డు విస్తరణపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అసెంబ్లీలో మాట్లాడారు. మాధవనగర్ సమీపంలోని రైల్వేవంతెనపై రోడ్డు వంతెన నిర్మించే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయూ? ఉంటే అంచనా వ్యయంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల వివరాలు ఏమిటి? పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. నిజామాబాద్ -డిచ్పల్లి మార్గంలో 14.20 కిలోమీటర్ల పొడవులో 10.20 కిలోమీటర్ల రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, మిగతా నాలుగు కిలోమీటర్ల కోసం టెండర్లను పిలిచామని తెలిపారు. రెండు వరుసల ఆర్వోబీ కోసం అంచనా వ్యయం రూ. 44.07 కోట్లు అని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో అలైన్మెంట్, జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ పని పూర్తరుు్యందన్నారు. పనులు ప్రారంభించిన ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తామన్నారు.