ఈజీఎంఎం ద్వారా 20 వేల ఉద్యోగాలు | 20 thousand jobs by EGMM | Sakshi
Sakshi News home page

ఈజీఎంఎం ద్వారా 20 వేల ఉద్యోగాలు

Published Tue, Nov 8 2016 3:44 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ఈజీఎంఎం ద్వారా 20 వేల ఉద్యోగాలు

ఈజీఎంఎం ద్వారా 20 వేల ఉద్యోగాలు

వచ్చే రెండేళ్లలో కల్పిస్తాం: మంత్రి జూపల్లి
 
 హైదరాబాద్: ఎంప్లారుుమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) ద్వారా వచ్చే రెండేళ్లలో 20 వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతేడాది శిక్షణ పొంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలు  చేస్తున్న వారితో సోమవారం ఇక్కడ తారామతి బారాదరిలో జరిగిన ఈజీఎంఎం సమ్మేళనంలో మంత్రి కృష్ణారావు మాట్లా డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తు న్నాయని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పరి శ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ నిస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించవచ్చని అన్నారు. ఉద్యోగాలు పొందేందుకు ఈజీఎంఎంను తొలిమెట్టుగా భావించాలని నిరుద్యోగులకు సూచిం చారు.

నిరుద్యోగులకు ఉపాధి, రాష్ట్ర ఆదాయం పెంచే లక్ష్యంతోనే నూతన పారిశ్రామిక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని మంత్రి అన్నారు. టీఎస్ ఐపాస్ కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 50 వేల కోట్ల పెట్టుబడులు, 2-3 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భవిష్యత్ లో ఈజీఎంఎం ద్వారా మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ సరైన మార్గనిర్ధేశం లేకనే గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఈజీఎంఎం ద్వారా నిరుద్యోగులకు అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు కూడా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈజీఎంఎం కృషి చేస్తోందన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రవిబాబు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈజీఎంఎం పనితీరు మెరుగ్గా ఉందని ప్రశంసించారు. అనం తరం ఈజీఎంఎం ద్వారా శిక్షణ పొందిన యువకుల విజయగాథలతో రూపొందించిన 100 స్మైల్స్ పుస్త కాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఉద్యోగాలు పొందిన యువతీ యువకులతోపాటుగా వారి తల్లిదండ్రులను కూడా మంత్రి జూపల్లి ఘనంగా సన్మానించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మధుకర్ బాబు, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement