జూపల్లిని బర్తరఫ్ చేయాలి: నాగం
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ప్రాజెక్టులో అ క్రమాలు, అవకతవకలపై విచారణ జరిపిం చి మంత్రి జూపల్లి కృష్ణారావును బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈపీసీ టెండర్లలో జరిగిన అవినీ తిపైనా విచారణ జరిపించాలన్నారు. 2008లో ఇచ్చిన విజిలెన్స్ నివేదిక, ఆ తర్వాత కాగ్ ఇచ్చిన నివేదికల్లోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందన్నా రు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... కల్వకుర్తి ఐదు లిఫ్టుల్లో ఒక్క దానికే నీళ్లు వదిలి పాలమూరుకు స్వర్ణయుగమంటూ టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈ ఏడాది 3 నెలల కింద నీరు విడుదల చేసినా కనీసం మొక్కజొన్న, ఆరుతడి పంటలకు ఉపయోగపడేవన్నారు.కల్వకుర్తి కోసం రెండేళ్లలో రూ.245కోట్లు మాత్రమే ఖర్చు చేసి హరీశ్‌రావు రూ.2వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొవడం దారుణమన్నారు.