దోస సాగుతో ఆదాయం | Cucumber cultivation of income | Sakshi
Sakshi News home page

దోస సాగుతో ఆదాయం

Published Sat, Jan 17 2015 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

దోస సాగుతో ఆదాయం

దోస సాగుతో ఆదాయం

జిల్లాలో రైతులు ఇప్పుడిప్పుడే దోస సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ పంటను ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చని కడప ఉద్యానశాఖ అధికారి రేణుకాప్రసాదరెడ్డి తెలిపారు. దోస రకాలు, పంటకాలం, సాగు కు అనుకూలించే నేలల గురించి రైతులకు తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
            -కడప అగ్రికల్చర్

 
నేలలు: నీరు నిల్వని, ఒక మోస్తరు నుంచి సారవంతమైన గరప నేలలు, ఎర్రనేలలు, ఇసుక నేలలు, నల్లరేగడి నేలలు, మురికి నీరు ఇంకి పోయే నేలలు చాలా అనుకూలం.
 
రకాలు: ప్రస్తుతం ప్రాచుర్యంలో  ఉన్న రకాల్లో ప్రధానమైనవి కుందన్; కోహినూర్, నాంధారి-910, కళ్యాణ్ రకాలు ఉన్నప్పటికి ఎక్కువగా గోల్డెన్‌గ్లోరి, కుందన్ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఈనెల నుంచి జనవరి నెల 17వ తేదీలోపల విత్తనాలను పూడ్చుకోవద్దు. అయితే నాంధారి-910 రకం చాలా అనుకూలమైందని రైతులు చెబుతున్నారు.
 
పంట కాలం: ఈ రకాలు అతి తక్కువ పంటకాలం అంటే కేవలం 2, 2 1/2 నెలలోపే దిగుబడులు మార్కెట్‌కు వస్తాయి. పంటను, మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి సాగు చేసుకుంటే మంచిది. రైతులు ఆయా రకాలకు ఈ సీజన్‌లో మార్కెట్ ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం మంచిది.
 
పొలం తయారీ ఇలా...
భూమిని బాగా దుక్కిదున్ని మెత్త పరచుకోవాలి. పశువుల ఎరువు 2 టన్నులు లేదా అంతే పరిమాణంలో వానపాముల ఎరువు, 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేసిన తరువాత 6-8 అడుగుల దూరంలో బెడ్లు తయారు చేసుకోవాలి. డ్రిప్ సౌకర్యం చేయదలుచుకుంటే బెడ్ల మధ్యలో డ్రిప్ లేటరల్ పైపులను ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు పూడ్చడానికి  ముందురోజు కనీసం 4-5 గంటలు డ్రిప్ ద్వారా నీరు పారించాలి. విత్తనం పూడ్చిన వెంటనే నీరు డ్రిప్ ద్వారా సాధారణంగా పారించాలి.
 
సాగులో ఎరువుల, నీటి తడుల యాజమాన్యం

పూడ్చిన వారంలోపు విత్తనాలు మొలకెత్తుతాయి. ఈ దశలో మొలకెత్తక ముందే గింజలను ఎలుకలు తినేయడం వల్ల చాలా చోట్ల ఖాళీలు ఏర్పడతాయి. అలాగే చిన్న మొలకలను మిడతలు, గుమ్మడి పురుగులు తినేయడం వల్ల కూడా ఖాళీలు ఏర్పడతాయి. వీటి నివారణకు ఫోరేట్ గుళికలు విత్తనం వేసే రోజే విత్తనం వద్ద 5-6 అంగుళాల లోతులో  గుళికలు పడేలా పోయాలి.

మొలకెత్తిన తరువాత తీగలు 3-4 ఆకుల దశలో 1 గ్రాము బోరాక్స్ లేదా సోలుబోరాన్ లీటరు నీటికి కలిపి వారంలో రెండుసార్లు పిచికారి చేయాలి. దీనివల్ల ఆడపూలు ఎక్కువగా వచ్చి మగపూలు తక్కువ ఏర్పడతాయి. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. మొలకెత్తిన వారం రోజుల తరువాత డ్రిప్ ద్వారా ప్రతి  రెండు రోజులకు ఒకసారి ఎకరాకు 2 1/2 కిలోల యూరియా, 2 కిలోల పొటాష్ ఎరువులను 15 విడ తలుగా 45 రోజుల వరకు వేస్తుండాలి. ఆ తరువాత 2 కిలోల యూరియా, 3 కిలోల పొటాష్ ఎరువును నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా పంపించాలి. పూత, పిందె ప్రారంభమైన తరువాత మల్టికె-10 లేదా 0.5 మిల్లీ లీటర్ల స్కోర్‌ను లీటరు నీటికి కలిపి 2-3 సార్లు పిచికారీ చేయాలి.
 
నీటిపారుదల: పంటను సాగు చేసిన కాలాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి రోజు లే దా రోజు విడిచి రోజుకు 2-3 గంటలు నీటిని డ్రిప్‌తో అందించాలి. కాయలు పెరిగే దశలో, పక్వానికి వచ్చే దశలో నీటి తడులలో హెచ్చు తగ్గులు లేకుండా పొలంలో తేమ తగు మాత్రంగా సమంగా ఉండేలా చూసుకోవాలి, లేకుంటే  కాయలు పగుళ్లు వస్తాయి.
 
సస్యరక్షణ: దోస పంటపై ప్రారంభ దశ నుంచే పురుగుల తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఎర్రనల్లి, గుమ్మడి పురుగులు వైరస్ తెగులు ఆశించే అవకాశం ఎక్కువ.
 
 గుమ్మడి పురుగులు
 రెండు ఆకుల దశ నుంచి 4 ఆకుల దశ మధ్యలో ఆరంజి రంగులో ఉండే ఈ గుమ్మడి పురుగులు ఆకులను, మొలకలను తిని నష్టపరుస్తాయి. దీని నివారణకు 2 మిల్లీ లీటర్ల క్వినాల్‌ఫాస్ లేదా 2 1/2 మిల్లీ లీటర్ల క్లోరిఫైరిపాస్ లీటరు నీటికి కలిపి ఒకసారి పిచికారి చేయాలి.
 
 ఎర్రనల్లి
 ఆరంజి,ఎరుపు రంగులో ఉండే సన్ననివి, నల్లులు పెద్దవి, పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా ఆకుల కింది చేరి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుని పోయి పురుగుదల లేకుండా మొక్క మందగిస్తుంది. ఈ ఎర్రనల్లి తీవ్రత ఎక్కువైతే ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు 2 మిల్లీ లీటర్ల ఎక్సోడస్+1 గ్రాము బయోస్పార్క్ లేదా 2 మిల్లీ లీటర్ల ఇధియాన్ లేదా 2 మిల్లీ లీటర్ల ప్రోపర్గేట్ లేదా 0.5  మిల్లీ లీటర్ల వర్టిమెక్ లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement