Cucumber cultivation
-
దోస రైతులపై సుంకాల పిడుగు
భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన 26 శాతం సుంకాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయి. ఊరగాయ దోసకాయలు(జెర్కిన్స్) భారత్ నుంచి అమెరికాకు పెద్దమొత్తంలో ఎగుమతి అవుతున్నాయి. భారత్ దిగుమతులపై యూఎస్ విధించిన టారిఫ్‌లతో ఈ పంట రైతులకు నష్టం వాటిల్లనుందని నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 256.58 మిలియన్ డాలర్ల(రూ.2,124 కోట్లు) విలువైన 2.44 లక్షల టన్నుల జెర్కిన్స్ను అమెరికాకు ఎగుమతి చేసింది. 2019-2020 ఏడాదిలో ఇది 1.89 లక్షల టన్నులతో రూ.173 మిలియన్ డాలర్లు(రూ.1,400 కోట్లు)గా ఉండేది.ఇప్పటికే అమెరికాలో 9 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత పారిశ్రామిక రంగానికి ఈ సుంకాల పెంపు పెద్ద దెబ్బే. పెరిగిన టారిఫ్‌ల వల్ల మెక్సికో, కెనడా, టర్కీ వంటి దేశాలతో పోలిస్తే భారత జెర్కిన్స్కు పోటీ తక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జెర్కిన్స్కు సంబంధించి యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద మెక్సికో, కెనడా సుంకం మినహాయింపుల నుంచి ప్రయోజనం పొందుతాయని ఇండియన్ జెర్కిన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ పూవయ్య తెలిపారు. టర్కీపై భారత్ కంటే సుమారు 10 శాతం తక్కువ సుంకాన్ని విధించినట్లు చెప్పారు.99 శాతం ఎగుమతులే..భారతదేశంలో జెర్కిన్ ఉత్పత్తి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా ఉంది. వీటిపై అమెరికా లెవీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానాలపై ఆధారపడిన వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు దీనివల్ల ప్రభావితం చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే జెర్కిన్స్లో 99% పైగా ఎగుమతి అవుతున్నవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?అమెరికా మార్కెట్లో ఇండియా ఉత్పత్తులు పోటీతత్వాన్ని కోల్పోవడంపై పూవయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలను మునుపటి స్థాయికి పునరుద్ధరించడానికి ద్వైపాక్షిక చర్చలు జరపాలన్నారు. ఇరు దేశాలకు అనువైన విధానాలు అమలయ్యేలా పరిష్కారాలు ఆలోచించాలన్నారు. -
తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి
-
కిలో దోస@ రూ.1
పొదలకూరు(సర్వేపల్లి): పొదలకూరు మండలంలో దోస సాగు చేపట్టిన రైతులు నిండా మునిగారు. దోసకాయలు అడిగే నాథుడు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి ఏడాది దోస సాగులో లాభాలు గడించే రైతులు ఈ ఏడాది కూడా సాగుచేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయని ఆశించారు. అయితే దోసకాయల ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో దోసకాయలు రూ.1 మాత్రమే ధర పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర లేకపోవడంతో రైతులు చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరా దోస సాగుకు రూ.10 వేల వరకు ఖర్చుచేస్తే 150 కిలోల దిగుబడి సాధించే అవకాశం ఉంది. సొంత పొలం, ట్రాక్టర్ ఉంటే ఎకరాకు రూ.2 వేల వరకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. కౌలు రైతులకైతే ఎకరాలకు రూ.10 వేలు అవుతుంది. ఈ క్రమంలో 150 కిలోల దిగుబడి సాధిస్తే ధరలు లేని కారణంగా ఎకరాలకు రూ.150 మాత్రమే వస్తుంది. ఇంత తీవ్రస్థాయిలో నష్టం ఇటీవల కాలంలో ఏ పంట సాగులోనూ రాలేదని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్ ప్రాంతానికి కూడా రైతులు దోసకాయలను ఎగుమతి చేస్తున్నారు. అక్కడ కూడా డిమాండ్ లేకపోవడంతో రైతులకు ఆదాయం తగ్గిపోయింది. అయితే నెల్లూరు మార్కెట్ కంటే హైదరాబాద్ మార్కెట్ కొంత వరకు మేలంటున్నారు. ధరలు దిగాలు మండలంలో నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి, నావూరు, ముదిగేడు, పొదలకూరు, అయ్యగారిపాళెం తదితర గ్రామాల్లో సుమారు 100 ఎకరాల్లో దోస సాగు చేస్తున్నారు. నావూరుపల్లిలో ఒకే రైతు 30 ఎకరాల్లో దోస సాగు చేపట్టి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దోస సాగులో అనుభవం ఉన్నా మార్కెట్ ధరలు పడిపోతుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఆశలు ఆవిరయ్యాయ్ దోస సాగులో ఆదాయం పొందవచ్చని సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మా గ్రామంలో ముగ్గురు రైతులం 10 ఎకరాల్లో దోస సాగు చేసి నష్టపోయాం. దోసకాయలను అడిగే నాథుడు లేడు. మార్కెట్లో ధరలు పెరగకుంటే పశువులను వదిలివేయాలనే ఆలోచనలో ఉన్నాము. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. –కసిరెడ్డి మధురెడ్డి, రైతు, ముదిగేడు. సాగు చేసి నష్టపోయా 30 ఎకరాల్లో దోస సాగు చేసి నష్టపోయాను. కూలీలు, ఇతర ఖర్చులు చూసుకుంటే ఎకరాకు రూ.10 వేలు ఖర్చయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. హైదరాబాద్‌కు నేనే సొంతంగా ఎగుమతి చేస్తున్నాను. కిలో దోసకాయలు రూ.1 మాత్రమే పడుతున్నాయి. – తలచీరు అరుణప్రసాద్, రైతు, నావూరుపల్లి -
దోస సాగుతో ఆదాయం
జిల్లాలో రైతులు ఇప్పుడిప్పుడే దోస సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ పంటను ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చని కడప ఉద్యానశాఖ అధికారి రేణుకాప్రసాదరెడ్డి తెలిపారు. దోస రకాలు, పంటకాలం, సాగు కు అనుకూలించే నేలల గురించి రైతులకు తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... -కడప అగ్రికల్చర్ నేలలు: నీరు నిల్వని, ఒక మోస్తరు నుంచి సారవంతమైన గరప నేలలు, ఎర్రనేలలు, ఇసుక నేలలు, నల్లరేగడి నేలలు, మురికి నీరు ఇంకి పోయే నేలలు చాలా అనుకూలం. రకాలు: ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న రకాల్లో ప్రధానమైనవి కుందన్; కోహినూర్, నాంధారి-910, కళ్యాణ్ రకాలు ఉన్నప్పటికి ఎక్కువగా గోల్డెన్గ్లోరి, కుందన్ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఈనెల నుంచి జనవరి నెల 17వ తేదీలోపల విత్తనాలను పూడ్చుకోవద్దు. అయితే నాంధారి-910 రకం చాలా అనుకూలమైందని రైతులు చెబుతున్నారు. పంట కాలం: ఈ రకాలు అతి తక్కువ పంటకాలం అంటే కేవలం 2, 2 1/2 నెలలోపే దిగుబడులు మార్కెట్‌కు వస్తాయి. పంటను, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి సాగు చేసుకుంటే మంచిది. రైతులు ఆయా రకాలకు ఈ సీజన్లో మార్కెట్ ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం మంచిది. పొలం తయారీ ఇలా... భూమిని బాగా దుక్కిదున్ని మెత్త పరచుకోవాలి. పశువుల ఎరువు 2 టన్నులు లేదా అంతే పరిమాణంలో వానపాముల ఎరువు, 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేసిన తరువాత 6-8 అడుగుల దూరంలో బెడ్లు తయారు చేసుకోవాలి. డ్రిప్ సౌకర్యం చేయదలుచుకుంటే బెడ్ల మధ్యలో డ్రిప్ లేటరల్ పైపులను ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు పూడ్చడానికి ముందురోజు కనీసం 4-5 గంటలు డ్రిప్ ద్వారా నీరు పారించాలి. విత్తనం పూడ్చిన వెంటనే నీరు డ్రిప్ ద్వారా సాధారణంగా పారించాలి. సాగులో ఎరువుల, నీటి తడుల యాజమాన్యం పూడ్చిన వారంలోపు విత్తనాలు మొలకెత్తుతాయి. ఈ దశలో మొలకెత్తక ముందే గింజలను ఎలుకలు తినేయడం వల్ల చాలా చోట్ల ఖాళీలు ఏర్పడతాయి. అలాగే చిన్న మొలకలను మిడతలు, గుమ్మడి పురుగులు తినేయడం వల్ల కూడా ఖాళీలు ఏర్పడతాయి. వీటి నివారణకు ఫోరేట్ గుళికలు విత్తనం వేసే రోజే విత్తనం వద్ద 5-6 అంగుళాల లోతులో గుళికలు పడేలా పోయాలి. మొలకెత్తిన తరువాత తీగలు 3-4 ఆకుల దశలో 1 గ్రాము బోరాక్స్ లేదా సోలుబోరాన్ లీటరు నీటికి కలిపి వారంలో రెండుసార్లు పిచికారి చేయాలి. దీనివల్ల ఆడపూలు ఎక్కువగా వచ్చి మగపూలు తక్కువ ఏర్పడతాయి. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. మొలకెత్తిన వారం రోజుల తరువాత డ్రిప్ ద్వారా ప్రతి రెండు రోజులకు ఒకసారి ఎకరాకు 2 1/2 కిలోల యూరియా, 2 కిలోల పొటాష్ ఎరువులను 15 విడ తలుగా 45 రోజుల వరకు వేస్తుండాలి. ఆ తరువాత 2 కిలోల యూరియా, 3 కిలోల పొటాష్ ఎరువును నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా పంపించాలి. పూత, పిందె ప్రారంభమైన తరువాత మల్టికె-10 లేదా 0.5 మిల్లీ లీటర్ల స్కోర్‌ను లీటరు నీటికి కలిపి 2-3 సార్లు పిచికారీ చేయాలి. నీటిపారుదల: పంటను సాగు చేసిన కాలాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి రోజు లే దా రోజు విడిచి రోజుకు 2-3 గంటలు నీటిని డ్రిప్‌తో అందించాలి. కాయలు పెరిగే దశలో, పక్వానికి వచ్చే దశలో నీటి తడులలో హెచ్చు తగ్గులు లేకుండా పొలంలో తేమ తగు మాత్రంగా సమంగా ఉండేలా చూసుకోవాలి, లేకుంటే కాయలు పగుళ్లు వస్తాయి. సస్యరక్షణ: దోస పంటపై ప్రారంభ దశ నుంచే పురుగుల తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఎర్రనల్లి, గుమ్మడి పురుగులు వైరస్ తెగులు ఆశించే అవకాశం ఎక్కువ. గుమ్మడి పురుగులు రెండు ఆకుల దశ నుంచి 4 ఆకుల దశ మధ్యలో ఆరంజి రంగులో ఉండే ఈ గుమ్మడి పురుగులు ఆకులను, మొలకలను తిని నష్టపరుస్తాయి. దీని నివారణకు 2 మిల్లీ లీటర్ల క్వినాల్ఫాస్ లేదా 2 1/2 మిల్లీ లీటర్ల క్లోరిఫైరిపాస్ లీటరు నీటికి కలిపి ఒకసారి పిచికారి చేయాలి. ఎర్రనల్లి ఆరంజి,ఎరుపు రంగులో ఉండే సన్ననివి, నల్లులు పెద్దవి, పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా ఆకుల కింది చేరి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుని పోయి పురుగుదల లేకుండా మొక్క మందగిస్తుంది. ఈ ఎర్రనల్లి తీవ్రత ఎక్కువైతే ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు 2 మిల్లీ లీటర్ల ఎక్సోడస్+1 గ్రాము బయోస్పార్క్ లేదా 2 మిల్లీ లీటర్ల ఇధియాన్ లేదా 2 మిల్లీ లీటర్ల ప్రోపర్గేట్ లేదా 0.5 మిల్లీ లీటర్ల వర్టిమెక్ లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.