Water released
-
నాగార్జున సాగర్ కుడికాలువకు నీరు విడుదల చేసిన అంబటి
-
బిరబిరా కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ కార్యరూపం దాల్చింది. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి దిగువన ఉన్న జూరాలకు కర్ణాటక జల వనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ డ్యామ్‌లో సరి పడినంత నీటి లభ్యత లేకపోవడంతో ఆల్మట్టి నుంచి శుక్రవారం అర్ధరాత్రి నారాయణపూర్‌కు నీరు విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి విడుదలైన నీరు ఆదివారం నారాయణపూర్‌కు చేరిన తర్వాత.. అక్కడి నుంచి జూరాలకు నీటి విడుదల ప్రక్రియ కొనసాగనుంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం కోరడం, దానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే నారాయణపూర్ సామర్థ్యం 37.64టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18.08 టీఎంసీల నీరుమాత్రమే ఉంది. నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరడంతో దిగువకు నీటి విడుదల సాధ్యం కాదు. దీంతో ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు నీటి విడుదల తప్పనిసరయింది. ఆల్మట్టిలోనూ 129.72 టీఎంసీల నిల్వలకు గానూ 30.38 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడ డెడ్‌స్టోరేజీకి ఎగువన కేవలం 12 టీఎంసీల నిల్వలే ఉన్నప్పటికీ తెలంగాణ అవసరాల దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి డ్యామ్ స్పిల్‌వే ద్వారా 5,161 క్యూసెక్కులు, పవర్‌హౌజ్ ద్వారా మరో 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఆదివారం ఉదయం నారాయణపూర్‌కు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌లో కొద్దిగా నిల్వలు పెరిగిన వెంటనే స్పిల్‌వే ద్వారా జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నారాయణపూర్ నుంచి జూరాలకు 180 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో కర్ణాటకలోని గూగల్, గిరిజాపూర్ అనే చిన్నపాటి రిజర్వాయర్లను దాటుకొని నీరు జూరాలకు చేరాల్సి ఉంటుంది. ఇలా జూరాలకు నీరు చేరేందుకు వారం రోజులు పట్టనుండగా, కనీసం ఒక టీఎంసీ నీరు జూరాలకు చేరే అవకాశం ఉంటుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఈ నీటితో జూన్ రెండో వారం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలకు సర్దుబాటు చేయవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఘనపురం పరవళ్లు
పాపన్నపేట(మెదక్): బీళ్లు వారిన మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. సింగూరు నుంచి మంగళవారం విడుదల చేసిన 1.6 టీఎంసీల నీరు వరదై పోటెత్తింది. మంజీర బ్యారేజి నుంచి 2 గేట్లు ఎత్తి వదిలిన నీరు 9,800 క్యూసెక్కుల పరిమాణంలో పరుగులు తీస్తోంది. ఎడారిలా మారిన మంజీర గర్భాన్ని తడుపుకుంటూ.. మార్గం మ«ధ్యలో చిన్న చిన్న మడుగులు నింపుకుంటూ.. గురువారం రాత్రికి ఘనపురం ప్రాజెక్టులోకి ప్రవేశించాయి. దీంతో ఘనపురం ఆనకట్ట కింద.. మంజీర తీరం వెంట వేసిన వరి పంటకు ప్రాణం పోసినట్లయింది. ఇక ఘనపురం ఆనకట్ట కింద ఉన్న 15 వేల ఎకరాల పంటలు గట్టెక్కినట్లేనని రైతన్నలు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రైతన్నల ఆశలకతీతంగా సింగూరు నుంచి విడిచిన 1.6 టీఎంసీల నీటితో ఘనపురం ప్రాజెక్టు కింద వేసిన పంటలతో పాటు, నిజాంసాగర్ ఆయకట్టుకు కూడా ప్రయోజనం కలగనుంది. సుమారు టీఎంసీ నీరు దిగువన ఉన్న నిజాంసాగర్‌కు చేరనుంది. ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన వర్షాలు కురువలేదు. అయినా ఆశ చావని రైతన్నలు జూన్ నెలలోనే మంజీర మడుగుల్లో నిలవ ఉన్న నీటిని.. బోరుబావుల ఊటలను నమ్ముకొని 18 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. కింది పొలాలను దృష్టిలో ఉంచుకొని.. సింగూరు ఎగువన సైతం వర్షాలు పడక పోవడంతో సింగూరు నిండలేదు. 29 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.17 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో మిషన్ భగీరథకే 6 టీఎంసీల నీరు అవసరం కానుంది. దీంతో సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా విడుదల కాలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుమారు 3 వేల ఎకరాల వరి పంట ఎండిపోయింది. దీంతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మాజీ డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందదర్‌రెడ్డి అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారు. సాధారణంగా అయితే ఘనపురం ప్రాజెక్టుకు ప్రస్తుత తరుణంలో 0.4 టీఎంసీలు సరిపోతాయని అంచనా. అయినప్పటికీ ప్రాజెక్టు దిగువన ఉన్న పంటపొలాలను, నిజాంసాగర్ ఆయకట్టు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ 1.6 టీఎంసీల నీటి విడుదల కోసం జీఓ విడుదల చేశారు. విడుదల చేసిన నీరు, రెండు రోజుల పాటు, ఘనపురం ఆనకట్ట పై నుంచి పొంగి పొర్లనుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వరదలు ఉదృతంగా ఉండే అవకాశం ఉన్నందున నది వైపు ఎవరూ వెళ్లొద్దని ఇరిగేషన్ ఈఈ యేసయ్య సూచించారు. -
జీహుజూర్
– టీడీపీ నేతలకు తొత్తులుగా పనిచేస్తున్న కీలక అధికారులు – ఇష్టారాజ్యంగా హంద్రీ–నీవా నీటి వినియోగం – హెచ్చెల్సీకి 10.5, హంద్రీ-నీవాకు 18.5 కలిపి మొత్తం 29 టీఎంసీలు జిల్లాకు చేరిన వైనం – అయినా 1.15 లక్షల ఎకరాల్లో ఆయకట్టు బీడు – జీబీసీతో పాటు శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితి – హంద్రీ–నీవా నీటి ఖర్చు రూ.222 కోట్లు –ఈ నీటిని ఒక్క ఎకరాకూ ఇవ్వలేదు –ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయడంలో అధికారులు విఫలం సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి పూర్తిగా వత్తాసు పలుకుతోందా? వాస్తవలతో సంబంధం లేకుండా వారి ఆదేశాలకు 'జీహుజూర్' అంటోందా? అధికార యంత్రాంగం వైఫల్యంతో 'అనంత'లో పాలెగాళ్ల రాజ్యం నడుస్తోందా? ఈ వైఖరితో లక్షలాదిమంది రైతుల భవిష్యత్తు అంధకారం అవుతోందా? కళ్లెదుటే నీటిపరవళ్లు కన్పిస్తోన్నా పొలాలకు పారించుకోలేని నిస్సహాయస్థితిలో రైతులు ఉన్నారా? వారి బాగోగుల కంటే అధికారపార్టీ మెప్పే ధ్యేయంగా అధికారులు పనిచేస్తున్నారా?.. హెచ్చెల్సీ, హంద్రీ–నీవా నీటి వినియోగం లెక్కలు, రైతులకు జరిగిన అన్యాయం బేరీజు వేసుకుంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాకు 29 టీఎంసీల నీళ్లు వచ్చినా అధికారులు మాత్రం ఆయకట్టును బీడుగా పెట్టారు. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ద్వారా ఈసారి జిల్లాకు 10.5 టీఎంసీల నీళ్లు చేరాయి. హంద్రీ–నీవా ద్వారా ఇప్పటి దాకా 18.5 టీఎంసీలు వచ్చాయి. అంటే మొత్తం 29 టీఎంసీలు చేరాయి. హెచ్చెల్సీ కింద అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌జిల్లాల్లో 2.84లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో అత్యధికంగా 'అనంత'లోనే 1.45లక్షల ఎకరాలు ఉంది. ఒక టీఎంసీ నీరు 10వేల ఎకరాల వరికి ఇవ్వొచ్చు. ఆరు తడి పంటలైతే 20వేల ఎకరాలకు ఇవ్వొచ్చు. ఈ లెక్కన 29 టీఎంసీలతో మూడు జిల్లాల్లో 2.84 లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీటిని ఇవ్వొచ్చు. కానీ 'అనంత' అధికారులు జిల్లాలోని 1.45 లక్షల ఎకరాలలో 1.15లక్షల ఎకరాలకు నీళ్లివ్వకుండా పొలాలను బీడుగా మార్చారు. హెచ్చెల్సీ, జీబీసీ, ఎంపీఆర్ పరిధిలోని సౌత్, నార్త్, తాడిపత్రి బ్రాంచ్కెనాల్తో పాటు పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సమృద్ధిగా నీరిచ్చే వనరులు జిల్లాలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రణాళిక లేకుండా, ప్రాధాన్యతా క్రమం పాటించకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా అధికారులు వ్యవహరించారు. 'నీరివ్వండి మహా ప్రభో!' అని పలుసార్లు వేలాది మంది రైతులు ఆందోళనలు చేపట్టినా కనికరం చూపలేదు. అధికార పార్టీ నేతలు ఎవ్వరి ఆదేశాలతో పనిలేకుండా, ఆయకట్టును పట్టించుకోకుండా చెరువుల పేరుతో విచ్చలవిడిగా నీటిని తరలించుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. హంద్రీ–నీవా నీటి విలువ రూ.222 కోట్లు శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఉన్న కర్నూలు జిల్లా మల్యాల నుంచి జిల్లాలోని బెళుగుప్ప మండలంలో గల జీడిపల్లి రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీరు ఎత్తిపోయాలంటే రూ.12కోట్ల కరెంటు బిల్లు వస్తుంది. ఈ లెక్కన జిల్లాకు చేరిన 18.5 టీఎంసీల విలువ రూ.222కోట్లు. జనవరి వరకూ నీటిని తీసుకునే అవకాశం ఉంది. మరో 7–10 టీఎంసీలు రావొచ్చు. ఇంతటి విలువైన నీటిని ప్రణాళిక లేకుండా వృథా చేశారు. హెచ్చెల్సీ నీటిని రాయదుర్గం, ఉరవకొండ పరిధిలో కొద్దిమేర ఆయకట్టుకు ఇచ్చారు. జీబీసీ పరిధిలో 50వేల ఎకరాలు, దిగువ ప్రాంతమైన ఎంపీఆర్ పరిధిలో 90వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ రెండికి నెలకిందట నీళ్లు ఇచ్చి ఉంటే వేరుశనగతో పాటు అన్ని రకాల పంటలను రబీలో సాగు చేసేవారు. అయితే..అధికారులు పట్టించుకోలేదు. ఎంపీఆర్ పరిధిలోని సౌత్, నార్త్ కెనాల్ ఆయకట్టుకు నీళ్లిచ్చి శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల రైతులను ఆదుకోవాలని ధర్నాలు చేశారు. అయినా చుక్కనీరు విడుదల చేయలేదు. రాప్తాడు, ధర్మవరంతో పాటు పలు నియోజకవర్గాల్లో చెరువుల కోసమంటూ నీటిని తరలించారు. 18.5 టీఎంసీలు చెరువులకు ఇచ్చారా? ఆయకట్టుకు ఇవ్వాల్సిన నీటిని వాటికి ఎందుకు మళ్లించారు? చెరువులకు, ఆయకట్టుకు మధ్య ప్రాధాన్యతను గుర్తించలేని స్థితిలో అధికారులు ఉన్నారా?.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రైతుసంఘాలు నిలదీస్తున్నాయి. సౌత్, నార్త్ కెనాళ్లకు ఇప్పడు నీళ్లిచ్చినా ఆరుతడి పంటలు పండించే అవకాశముది. కానీ ఆ దిశగా ఆలోచించడం లేదు. పోనీ ప్రజాప్రతినిధులైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. నీళ్లు అవసరమున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రైతులకు నీళ్లిప్పించే బాధ్యతను మాత్రం వారు విస్మరించారు. గతంలో హెచ్చెల్సీకి 26టీఎంసీలు వచ్చినప్పుడు ఆయకట్టుకు ఇచ్చి, చెరువులను నింపి, తాగునీటి అవసరాలకూ నిల్వ ఉంచేవారు. ఇప్పుడు అంతకుమించి నీరొచ్చినా ఆయకట్టుకు ఇవ్వలేకపోతున్నారు. అధికార పార్టీ నీడ నుంచి అధికార యంత్రాంగం బయటకు వచ్చి రైతుల ప్రయోజనాలు కాపాడాలని రైతుసంఘాలు అభ్యర్థిస్తున్నాయి. లేదంటే అన్నదాతలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
సాగర్ కుడికాలువకు నీరు విడుదల
గుంటూరు : సాగునీటి విడుదల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. నాగార్జున సాగర్ జలాశయం కుడి కాలువకు బుధవారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. కుడికాల్వకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల కాగా, ఈ నీరు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 8.35 లక్షల ఎకరాల్లోని పంటలకు అందుతుంది. రోజుకు 10 టీఎంసీల చొప్పున 25 రోజులపాటు విడుదల కొనసాగనుంది. మరోవైపు సాగునీటి విడుదల కోసం వైఎస్ఆర్ సీపీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ వినుకొండ, నర్సరావుపేటలో మహాధర్నాకు నేతలు పిలుపునిచ్చారు. ధర్నా పిలుపుతో సర్కార్‌లో చలనం వచ్చి సాగునీటిని విడుదల చేశారు. -
పరవళ్లు తొక్కుతున్న మంజీర
9 గేట్ల ఎత్తివేత.. 1.60 లక్ష్యల క్యూసెక్కుల నీరు విడదల అదే మట్టంతో ఇన్‌ఫ్లో.. పరిశీలించిన ఎస్పీ, ఎమ్మెల్యే పుల్కల్: మంజీర తీరం పరవళ్లు తొక్కుతుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా నీటి ప్రవాహం రావడంతో అ«ధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాతంలోని పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. శనివారం ప్రాజెక్టు నుంచి 9 గేట్లను ఎత్తి దిగువకు 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. శనివారం రాత్రి వరకు నీటి ఇన్‌ఫ్లో 1.60 లక్షలకు పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే నీటిని వదిలారు. కాగా శనివారం సింగూర్ ప్రాజెక్టును ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ టి. పద్మారావులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబూమోహన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పోచారం శివారుతో పాటు ప్రాజెక్టు కింద ఉన్న సింగూర్, లింగంపల్లి, ఇసోజీపేట, మిన్పూర్, కొడూర్, గంగోజీపేట, శివంపేట, వెండికొల్, కోర్పోల్ గ్రామా శివార్లలోని వందల ఎకరాల పంటలన వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు 6 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు ఉదయం వరకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో ఒకేసారి లక్షా 40 వేలకు పెరగడంతో ఇరిగేష్‌న్ ఎస్ఈ పద్మారావు అదనంగా మరో రెండు గేట్ల ద్వారా 1.60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం రాత్రికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అ«ధికారులు తెలిపారు. ప్రాజెక్టును సందర్శించిన ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం సింగూర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద సందర్శకులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. సింగూర్‌ను చూసేందుకు వచ్చే సందర్శకులు కూడా జాగ్రతలు పాటించాలని సూచించారు. ప్రాజెక్టు వద్ద గంగమ్మకు ఎమ్మెల్యే పూజలు సింగూకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ఎమ్మెల్యే బాబుమోహన్ శనివారం గంగమ్మకు పూజలు చేశారు. అయనతో పాటు మాజీ ఎంనీ మాణిక్‌రెడ్డి, తహసీల్దార్ శివారం పాల్గొన్నారు. -
నీళ్లెందుకు వదలరు?
కౌతవరం(గుడ్లవల్లేరు): నీళ్లెందుకు వదలడం లేదు... సీఈ ముందు ప్రజాప్రతినిధుల నిలదీత...నీళ్లెందుకు వదలడం లేదు.. కింది అధికారులపై సీఈ ఆగ్రహం.... నెపాన్ని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. కౌతవరం ఇరిగేషన్ బంగ్లాలో ఈ తమాషా చోటుచేసుకుంది. కాలువలకు ఎందుకు నీళ్లు వదలలేదని ఇరిగేషన్ ఇంజనీర్లపై సీఈ వై.సుధాకర్ మండిపడ్డారు. మూడు రోజులుగా బంటుమిల్లి కాల్వలో సాగునీరు రాకుండా నిలిపివేశారని సీఈకి పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మంగళవారం కౌతవరం ఇరిగేషన్ బంగ్లాకు వచ్చిన సీఈ ఎందుకు నీరు ఇవ్వటం లేదని స్థానిక అధికారులపై ఆగ్రహించారు. బంటుమిల్లి హెడ్ వద్ద కాల్వ గట్టు పటిష్టం చేసే పనులు చేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. దానితో ఆగ్రహించిన సీఈ వెంటనే 400 క్యూసెక్కులు వదలాలని ఆదేశించడంతో హుటావుటిన నీటి విడుదల చేశారు. నీరొచ్చినా నారు లేదని సీఈకి ఎమ్మెల్యే కాగిత చెప్పారు. బయట నుంచి ఎక్కువ ధరకు నారు కొనుగోలు చేసుకున్న తమ ప్రాంత రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారన్నారు. తీరా మూడు రోజులుగా నీరు నిలిపివేయటంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. -
ఐదు టీఎంసీల నీరు విడుదల చేయండి
అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం ప్రగతినగర్ : గోదావరి పుష్కరాలకు శ్రీరాంసాగర్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి పుష్కరాలు జరిగే జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింది భాగంలోని శ్రీరాంసాగర్, గుమ్మిర్యాల్, దోంచంద, సావె ల్, తడ్‌పాకల పుష్కర ఘాట్లకు శుక్రవారం రాత్రి నుంచే నీటిని వదలాలని ఆదేశించారు. ఎస్సారెస్పీలోని 10 టీఎంసీల నీటి నిలువలో నుంచి 5 టీఎంసీల నీరు పుష్కరాల కోసం విడుదల చేయాలన్నారు. పుష్కరాల ప్రారంభానికి ఒకటి, రెండు రోజుల ముందే ఘాట్లకు నీరు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కందకుర్తి, దాని కింది భాగంలోని ఇతర ఘాట్లలో నీటికి కొంత ఇబ్బంది ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ దిగువ భాగంలోని ఘాట్ల వద్ద భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. అన్ని ఘాట్లలో ప్రత్యామ్నాయ నీటి ఏర్పాట్లతో షవర్లు ఏర్పాటు చేయాలన్నారు. శనివారం రాత్రిలోగా అన్ని పుష్కర పనులు పూర్తి చేయూలని ఆదేశించారు. ఘాట్ల వద్ద అధికారులందరికీ విధులు కేటారుుంచాలని, పురోహితులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ధరలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయూలని చెప్పారు. అనంతరం జేసీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులు జిల్లాలోని అన్ని ఘాట్లలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారని, పనులు పూర్తి స్థాయిలోకి వచ్చాయని చెప్పారు. అన్ని ఘాట్లలో షవర్‌బాత్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐకేపీ పీడీ వెంకటేశం, డీపీఓ కృష్ణమూర్తి, పుష్కరాల లైజనింగ్ అధికారి సుధాకర్ పాల్గొన్నారు. -
సాగర్ జలాలొచ్చాయ్..
త్రిపురాంతకం: జిల్లా తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రధాన కాలువ నుంచి సోమవారం నీరు విడుదల చేశారు. జిల్లా సరిహద్దు 85/3 వద్ద 700 క్యూసెక్కుల నీరు జిల్లాలో ప్రవేశించింది. ఈ నీటితో అధికారులు తాగునీటి చెరువులు నింపనున్నారు. జిల్లాలోని తాగునీటి చెరువుల్లో నీటిమట్టం అడుగంటింది. 129 ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులున్నాయి. వీటిని ముందుగా నింపేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వీటి తరువాత మరో 160 మంచినీటి చెరువుల్ని నింపుతారు. తొలిరోజు 700 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా..క్రమేణా రెండు వేల క్యూసెక్కుల వరకు వచ్చే అవకాశం ఉందని సాగర్ డీఈ సత్యకుమార్ తెలిపారు. పది రోజుల పాటు నీరు విడుదల చేస్తారన్నారు. రైతులు సాగు అవసరాలకు ఈ నీటిని వినియోగించరాదని హెచ్చరించారు. సాగర్ కాలువలు పరిశీలించిన ఎస్ఈ : జిల్లాలోని తాగునీటి ట్యాంకులు నింపేందుకు సాగర్ జలాలు విడుదల చేసేందుకు ముందు ఎన్ఎస్పీ ఎస్ఈ కోటేశ్వరరావు సాగర్ కాలవపై పర్యటించారు. రామతీర్థం జలాశయం నుంచి జిల్లా సరిహద్దు 85-3 వరకు ప్రధాన కాలువపై పర్యటించి పరిస్థితులు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు తగిన సూచనలు, సలహాలను అందించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు విడుదలవుతున్న నీరు వృథా కాకుండా ఉపయోగించుకోవాలని కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోకి తాగునీరు ప్రవేశించే సమయంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో ఉండి పరిశీలించారు. ఆయన వెంట సాగర్ డీఈఈ సత్యకుమార్, ఏఈలు దేవేందర్, విజయేందర్ గుంటూరు జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు. -
మెట్టూరు నీళ్లు విడుదల
సాక్షి, చెన్నై:కర్ణాటక వర్షాలతో కావేరి పది రోజులుగా ఉగ్రరూపం దాల్చింది. నీటి ఉధృతితో మెట్టూరు డ్యాం నీటిమట్టం క్రమంగా పెరిగింది. నాలుగు రోజులుగా నీటి ఉధృతి లక్షకు పైగా ఘనపుటడుగుల్లో వస్తుండడంతో నీటి మట్టం ఆదివారానికి 110 అడుగులకు చేరింది. మరో మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే, మెట్టూరు డ్యాం పూర్తిగా నిండడం ఖాయం. దీంతో సంబా సాగు నిమిత్తం ముందుగానే నీటి విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశంతో మెట్టూరు డ్యాం నీటిని విడుదల చేయడానికి శనివారం రాత్రి అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ మకర భూషణం నేతృత్వం లో ఆ డ్యాం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆ డ్యాం మీదుగా పెద్ద వాహనాల అనుమతికి నిషేధం విధిం చారు. ద్విచక్ర వాహనాలను మాత్రం అనుమతించే పనిలో పడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, రవాణా మంత్రి ఎడపాడి పళని స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంబా సాగుకు నీళ్లు విడుదల చేస్తూ గేట్లను కొంత మేరకు పెకైత్తారు. ప్రస్తుతం 9 వేల ఘనపుటడుగుల మేరకు నీళ్లు విడుదల చేస్తున్నా, కావేరి ఉధృతి ఆధారంగా ఆ సంఖ్యను భారీగా పెంచే అవకాశం ఉంది. అప్రమత్తం : మెట్టూరు డ్యాం నీటి మట్టం 110 అడుగులకు చేరడంతో మొదటి వరద ప్రమాద హెచ్చరిక జారీ అయింది. 115 అడుగులకు చేరగానే, రెండో హెచ్చరిక, పూర్తిగా నిండగానే మూడో హెచ్చరిక జారీ చేయనున్నారు. కర్ణాటక నుంచి ఉబరి నీరు మరింతగా వస్తుండడం, డెల్టా జిల్లాల్లో వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మపురి, సేలం, ఈరోడ్, నామక్కల్, కరూర్, తిరుచ్చి, తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, అరియలూరు, పెరంబలూరు, కడలూరు జిల్లాలోని కావేరి తీరవాసులను అప్రమత్తం చేశారు. కావేరి నది దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నీటి ఉధృతి ఏ క్షణాన పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండారో వేయించారు. అలాగే, కావేరి లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులతో సంప్రదింపుల్లో ఉండాలని, నీటి ఉధృతి పెరిగిన మరుక్షణం పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. జలపాతంలోకి అనుమతి లేదు : హొగ్నెకల్‌లో సందర్శకులకు నిషేధం విధిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కావేరి తీరంలో ఉన్న ఈ హొగ్నెకల్ జలపాతం సందర్శకులకు ఓ కనువిందే. ప్రస్తుతం కావేరి పరవళ్లు తొక్కుతుండడంతో ఆ జలపాత వీక్షణం కోసం సందర్శకులు ఎగబడుతున్నారు. అయితే, కావేరి ఉధృతంగా ప్రవహిస్తుండడం, హొగ్నెకల్లోని పార్కులు, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను సైతం నీళ్లు ముంచెత్తడంతో అధికారులు మేల్కొన్నారు. హొగ్నెకల్ జలపాతంలోకి సందర్శకులను అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. ఆ పరిసర వాసులు హొగ్నెకల్ వైపుగా వెళ్లొద్దన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. హొగ్నెకల్‌కు 15 కిలో మీటర్ల దూరంలో ప్రత్యేక చెక్ పోస్టును ఏర్పాటు చేసి, వాహనాలను వెనక్కు పంపించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. 127 అడుగులకు పెరియార్ : కేరళ వర్షాలతో థెక్కడైలోని పెరియార్ డ్యాం నీటి మట్టం పెరుగుతోంది. ఈ డ్యాంపై సర్వ హక్కులను తమిళనాడు కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఈ డ్యాం నీటి మట్టాన్ని 142 అడుగులకు పెంచే విధంగా ఇటీవల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేరళ వర్షాలతో ఆ డ్యాంకు నీటి రాక పెరుగుతున్నది. సెకనుకు 2,300 ఘనపుటడుగుల మేరకు నీళ్లు డ్యాంలోకి వచ్చి చేరుతున్నారుు. దీంతో డ్యాం నీటి మట్టం 127 అడుగులకు చేరింది. నీటి మట్టం క్రమంగా పెరిగిన పక్షంలో తమకు పంటల సాగుకు, తాగునీటి నిమిత్తం నీళ్లు తగ్గుతాయన్న ఆశాభావంతో తేని, శివగంగై, విరుదునగర్, రామనాథపురం, మదురై వాసులు ఎదురు చూపుల్లో పడ్డారు. -
డెల్టాకు నీటి విడుదలపై సందిగ్ధం!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంపై తెలంగాణ సర్కారు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయం ప్రకారం ఈ నెల 25 నుంచి వచ్చే నెల 9 వరకు కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం భిన్నాభిప్రాయంతో ఉంది. తాగునీటి కోసం 10 టీఎంసీల నీరు అవసరం లేదని, తాగునీటి పేరిట నారుమళ్ల కోసం ఈ నీటిని వాడుకునే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకే దీనికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం తెలంగాణ సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి చర్చించినట్టు సమాచారం. -
ముగిసిన ప్రహసనం
అమలాపురం :గోదావరి డెల్టా ప్రధాన పంట కాలువలకు అధికారులు అన్న సమయానికే నీరు విడుదల చేశారు. ఇక రైతులు ఖరీఫ్‌కు నారుమడులు వేయడమే ఆలస్యం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడున్న పంట, మురుగు కాలువల పరిస్థితి చూస్తుంటే ఒకవైపు పొలాలకు నీరు సక్రమంగా అందే అవకాశం లేకపోగా, మరోవైపు ముంపునీరు దిగే పరిస్థితి కనిపించడం లేదు. కోట్లాది రూపాయలతో చేపట్టిన ఆధునికీకరణ పనులు ఈ ఏడాది కూడా నామమాత్రంగానే జరగడంతో శివారు భూములకు సాగు, ముంపునీరు ఇక్కట్లు తప్పేటట్టు లేవు. జిల్లాలో గోదావరి డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు సుమారు రూ.1,160 కోట్లతో జరగాల్సి ఉంది. గడచిన ఆరేళ్లలో ఇంతవరకు రూ.250 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది రూ.150 కోట్లతో పనులు చేపడతామని ప్రకటించిన అధికారులు వాటిని కేవలం రూ.50 కోట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీనిలో మురుగునీటి కాలువలకు రూ.30 కోట్లు, తూర్పు, మధ్యడెల్టాల్లో పంట కాలువలకు రూ.పది కోట్ల చొప్పున పనులు చేశారు. డ్రైన్లలో పూడికతీత పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కాలువలపై చేపట్టిన కొద్దిపాటి పనులు కూడా ఇంకా పూర్తికాకున్నా క్లోజర్ సమయం పూర్తయ్యిందని చెప్పి అధికారులు నీరు విడుదల చేసేశారు. ఉపాధి పనులే దిక్కు గోదావరి డెల్టాలో ప్రధాన పంట కాలువలు, చానల్స్, పంటె బోదెలు పూడుకుపోయి శివారుకు సాగునీరందని పరిస్థితి ఉంది. చాలాచోట్ల కాలువలు మట్టితో పూడుకుపోయాయి. వీటిలో పూడిక తొలగించలేదు. 2009లోనే ఈ పనులు పూర్తి చేసినందున కొత్తగా చేపట్టలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో పూడికతీత పనుల్లో చోటు చేసుకున్న అవినీతి పుణ్యమాని రెండేళ్లకే కాలువలు పూర్వపు స్థితికి చేరుకున్నాయి. కేవలం ఉపాధి నిధులతోనే అక్కడక్కడా చేపడుతున్న నామమాత్ర పనులే దిక్కయ్యాయి. ఇప్పుడు చేస్తున్న ఆధునికీకరణ పనులు కూడా డీపీ (డెరైక్టు పైప్)లు, కల్వర్టులు వంటి చిన్నచిన్న నిర్మాణాలే. ఈ నిర్మాణాల వల్ల నీటిఎద్దడి తీరే అవకాశం లేదు. చేసింది స్వల్పమే డెల్టా ఆధునికీకరణ పనులను తొమ్మిది ప్యాకేజీలుగా విభజిస్తే ఇప్పటి వరకు కేవలం ఐదు ప్యాకేజీల్లో పనులకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. మిగిలిన పనులను 16 చిన్న ప్యాకేజీలుగా చేయగా రెండు పనులకు మాత్రమే టెండర్లు పడ్డాయి. సుమారు రూ.650 కోట్ల పనులకు టెండర్లు ఖరారు కాగా, రూ.250 కోట్ల పనులు కూడా పూర్తి కాలేదు. ఈ ఏడాది తొలుత రూ.150 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపడతామన్న అధికారులు ఆ పనులను కేవలం రూ.50 కోట్లకే పరిమితం చేశారు. చిత్తశుద్ధి లేకనే ఇరిగేషన్ అధికారులకు చిత్తశుద్ధి లేకనే ఆధునికీకరణ పనులు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రబీకి క్రాప్ హాలీడే ప్రకటించి లాంగ్ క్లోజర్ ఇస్తే (ఆరు నెలలు) ఆధునికీకరణ పనులు చేయడానికి వీలవుతుందని ప్రతిఏటా అధికారులు వాదిస్తూ వస్తున్నారు. అయితే డెల్టా ఆధునికీకరణ పనుల నుంచి లాకులు, వంతెనల నిర్మాణం వంటి పనులు మినహాయించారు. నిర్మాణానికి సంబంధించి డీపీలు, రిటైనింగ్ వాల్స్ వంటి పనులు మాత్రమే ఉన్నాయి. ఆ పనులకు లాంగ్‌క్లోజర్ ప్రకటించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ‘కాలువలపై చేపట్టే నిర్మాణాలు ఎఫ్ఎస్ఎల్ (ఫుల్ సప్లయి లెవెల్) వరకు కట్టుకుంటే తరువాత సాగునీరు విడుదల చేసినా వాటిపై పనులు పూర్తి చేసే అవకాశముంది’అని రిటైర్డ్ ఈఈ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. ఇందుకు షార్ట్క్లోజర్ 45 రోజుల సమయం ఎక్కువేనని ఆయన చెబుతున్నారు. కోనసీమ తీర ప్రాంత మండలాల్లో నిత్యం నీరు పారాలి.. లేకుంటే అవి చౌడుబారిపోతాయి. ఇటువంటి చోట్ల లాంగ్‌క్లోజర్ ప్రకటించే అవకాశం కూడా లేదనే విషయాన్ని అధికారులు గుర్తించి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కాంక్రీట్ నిర్మాణ పనుల్లో పెద్దగా మిగిలే అవకాశం లేనందున ఈ పనులను అటు కాంట్రాక్టర్లు, ఇటు ఇరిగేషన్ అధికారులు పక్కనబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
8న ‘కడెం’ నీటి విడుదల
కడెం, న్యూస్‌లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు భూములకు వచ్చే నెల 8వ తేదీ నుంచి రెండో పంటకు నీరివ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయకట్టు నీటి సంఘాలు, రైతు నాయకులతో ఆదివారం స్థానిక విశ్రాంతి భవనంలో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్రావు, డీఈలు శివనాగరాజు, నూరొద్దీన్ హాజరయ్యారు. కుడి, ఎడమ కాలువల ఆయకట్టు కింద పంట భూములకు చివరి దాకా నీరందించాలని రైతులు, నీటి సంఘాల నాయకులు కోరారు. ప్రాజెక్టులోని నీరు సరిపోని పక్షంలో ఎస్సారెస్పీ నుంచి ఆరు టీఎంసీలు తెప్పించాలని అన్నారు. ప్రస్తుతం చివరి వరకు నీరిచ్చే సామర్థ్యం ప్రాజెక్టుకు లేదని, ఉన్న నీటితో ఆయకట్టు కింద కొంతవరకు మాత్రమే రబీకి.. అదీ ఆరుతడి పంటలకే నీరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రైతులు అంగీకరించకపోవడంతో చాలాసేపు అధికారులతో వాడీవేడిగా చర్చ సాగింది. వారబందీ పద్ధతిన.. ఆయకట్టు కింద డీ-30 వరకు వారబందీ పద్ధతిన నీరిస్తామని, వచ్చే నెల 8వ తేదీన నీటిని విడుదల చేస్తామని ఈఈ వివరిం చారు. దీనిపై సమావేశంలో తీర్మానించా రు. ప్రతీ పది రోజులు కాలువ మూసి ఉం టుందని, రైతులు పూర్తిగా ఆరుతడి పం టలు వేసుకోవాలని, ప్రతీ నీటి చుక్కను పొదుపుగా వాడుకుని అధికారులకు సహకరించాలని రైతులను కోరారు. సమావేశం లో నీటి సంఘాలు, డీసీల చైర్మన్లు జి.మోహన్‌రెడ్డి, శరత్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సత్యనారాయణ, కొత్త సత్తయ్య, ప్రాజెక్టు జేఈ లు నరేందర్, శ్రీనాథ్, జల సాధన సమితి అధ్యక్షుడు ఎన్.గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.