పరవళ్లు తొక్కుతున్న సింగూర్ ప్రాజెక్టు
9 గేట్ల ఎత్తివేత.. 1.60 లక్ష్యల క్యూసెక్కుల నీరు విడదల
అదే మట్టంతో ఇన్‌ఫ్లో.. పరిశీలించిన ఎస్పీ, ఎమ్మెల్యే
పుల్‌కల్: మంజీర తీరం పరవళ్లు తొక్కుతుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా నీటి ప్రవాహం రావడంతో అ«ధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాతంలోని పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. శనివారం ప్రాజెక్టు నుంచి 9 గేట్లను ఎత్తి దిగువకు 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.
శనివారం రాత్రి వరకు నీటి ఇన్‌ఫ్లో 1.60 లక్షలకు పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే నీటిని వదిలారు. కాగా శనివారం సింగూర్ ప్రాజెక్టును ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ టి. పద్మారావులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబూమోహన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
పోచారం శివారుతో పాటు ప్రాజెక్టు కింద ఉన్న సింగూర్, లింగంపల్లి, ఇసోజీపేట, మిన్‌పూర్, కొడూర్, గంగోజీపేట, శివంపేట, వెండికొల్, కోర్పోల్ గ్రామా శివార్లలోని వందల ఎకరాల పంటలన వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు 6 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు ఉదయం వరకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో ఒకేసారి లక్షా 40 వేలకు పెరగడంతో ఇరిగేష్‌న్ ఎస్‌ఈ పద్మారావు అదనంగా మరో రెండు గేట్ల ద్వారా 1.60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం రాత్రికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అ«ధికారులు తెలిపారు.
ప్రాజెక్టును సందర్శించిన ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం సింగూర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద సందర్శకులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. సింగూర్‌ను చూసేందుకు వచ్చే సందర్శకులు కూడా జాగ్రతలు పాటించాలని సూచించారు.
ప్రాజెక్టు వద్ద గంగమ్మకు ఎమ్మెల్యే పూజలు
సింగూకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ఎమ్మెల్యే బాబుమోహన్ శనివారం గంగమ్మకు పూజలు చేశారు. అయనతో పాటు మాజీ ఎంనీ మాణిక్‌రెడ్డి, తహసీల్దార్ శివారం పాల్గొన్నారు.