Pulkal
-
లాక్డౌన్: కూతురు గొంతుకోసి హత్య!
సాక్షి, సంగారెడ్డి: పుల్కల్ మండలం గొంగులూరు తాండాలో విషాదం చోటుచేసుకుంది. కన్నకూతుర్ని ఓ కసాయి తండ్రి దారుణంగా హతమార్చాడు. రమావత్ జీవన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. లాక్డౌన్ అమలవుతుండటంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన జీవన్ నిద్రిస్తున్న చిన్నారి అవంతిక (4)ను గొంత కోసి హత్య చేశాడు. ఇక కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిదే. అయితే, రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలు పనుల్లేక, తినేందుకు తిండిలేక తీవ్ర అవస్థలు పడుతున్నాయి. ఎస్ఐ దురుసు ప్రవర్తన సాక్షి, సంగారెడ్డి: సాక్షి మీడియాలో పనిచేస్తున్న పుల్కల్ విలేకరి పట్ల స్థానిక ఎస్ఐ నాగలక్ష్మి దురుసుగా ప్రవర్తించారు. ప్రెస్ మీట్ అంటూ పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఆయనను అరెస్టు చేశారు. ఎస్ఐ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (అందోల్ ప్రెస్ క్లబ్) నాయకులు జోగిపేట ఎస్ఐ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. -
డాడీ మమ్మీ కావాలి..
మెదక్/పుల్కల్(అందోల్): ముఖం నిండా రక్తం మరకలు.. ఒంటినిండా దెబ్బలు.. అవేవీ ఆ బాలుడిని బాధించలేదు. అప్పటివరకూ నవ్వుతూ నవ్వించిన తల్లి కళ్లముందే విగతజీవిగా మారడం చూసి గుండెలవిసేలా రోదించాడు.. ‘డాడీ మమ్మీ కావాలి’ అంటూ మిన్నంటిన చిన్నారి రోదనలు అక్కడున్నవారందరిచేత కంటతడి పెట్టించింది. స్థానికంగా కలచివేసిన ఈ ఘటన పుల్కల్ మండల పరిధిలోని న్యూ ఓన్నపూర్ శివారులోని 161వ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దశంకరంపేట మండల పరిధిలోని జబ్బికుంట గ్రామానికి చెందిన గాందిరపల్లి సంగమేశ్వర్, భారతి(30) దంపతులు. వారికి శివప్రసాద్ (3) కుమారుడు ఉన్నారు. హైద్రాబాద్‌లోని ఓల్డ్ బోయినిపల్లి నుంచి శుభకార్యం నిమిత్తం గురువారం బైక్‌పై బయల్దేరారు. ఓన్నపూర్ శివారులోకి రాగానే ముందుగా వెళ్తున్న ట్రక్‌ను ఓవర్టేక్ చేయబోగా బైక్ వెనుకాల కూర్చున్న భారతి ఆమె ఒళ్లో కూర్చున్న శివప్రసాద్ ఇద్దరూ కిందపడిపోయారు. ట్రక్ వెనుక చక్రాలు అమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రీ, కొడుకులు గాయాలతో బయటపడ్డారు. రక్తం మడుగులో పడి ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి శివప్రసాద్ ‘‘డాడీ మమ్మీ కావాలంటూ’’ ఏడుస్తూ రోడ్డుపై అలాగే కూర్చుండిపోయాడు. ఇది చూసిన అక్కడున్నవారంతా కంటతడిపెట్టారు. పోస్టుమార్టం నిమిత్తం భారతి మృతదేహాన్ని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన తండ్రీకొడుకులను అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కారు-లారీ ఢీ: ముగ్గురు మృతి
-
కారు-లారీ ఢీ: ముగ్గురు మృతి
సంగారెడ్డి: పుల్కల్ మండలం సుల్తాన్పూర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-లారీ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పరవళ్లు తొక్కుతున్న మంజీర
9 గేట్ల ఎత్తివేత.. 1.60 లక్ష్యల క్యూసెక్కుల నీరు విడదల అదే మట్టంతో ఇన్‌ఫ్లో.. పరిశీలించిన ఎస్పీ, ఎమ్మెల్యే పుల్కల్: మంజీర తీరం పరవళ్లు తొక్కుతుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా నీటి ప్రవాహం రావడంతో అ«ధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాతంలోని పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. శనివారం ప్రాజెక్టు నుంచి 9 గేట్లను ఎత్తి దిగువకు 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. శనివారం రాత్రి వరకు నీటి ఇన్‌ఫ్లో 1.60 లక్షలకు పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే నీటిని వదిలారు. కాగా శనివారం సింగూర్ ప్రాజెక్టును ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ టి. పద్మారావులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబూమోహన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పోచారం శివారుతో పాటు ప్రాజెక్టు కింద ఉన్న సింగూర్, లింగంపల్లి, ఇసోజీపేట, మిన్పూర్, కొడూర్, గంగోజీపేట, శివంపేట, వెండికొల్, కోర్పోల్ గ్రామా శివార్లలోని వందల ఎకరాల పంటలన వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు 6 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు ఉదయం వరకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో ఒకేసారి లక్షా 40 వేలకు పెరగడంతో ఇరిగేష్‌న్ ఎస్ఈ పద్మారావు అదనంగా మరో రెండు గేట్ల ద్వారా 1.60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం రాత్రికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అ«ధికారులు తెలిపారు. ప్రాజెక్టును సందర్శించిన ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం సింగూర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద సందర్శకులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. సింగూర్‌ను చూసేందుకు వచ్చే సందర్శకులు కూడా జాగ్రతలు పాటించాలని సూచించారు. ప్రాజెక్టు వద్ద గంగమ్మకు ఎమ్మెల్యే పూజలు సింగూకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ఎమ్మెల్యే బాబుమోహన్ శనివారం గంగమ్మకు పూజలు చేశారు. అయనతో పాటు మాజీ ఎంనీ మాణిక్‌రెడ్డి, తహసీల్దార్ శివారం పాల్గొన్నారు. -
సాగుకు ఊపిరి
సింగూర్‌లో పెరిగిన నీటి మట్టం 16 టీఎంసీలకు చేరిన వరద నీరు పుల్కల్: ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సింగూర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే 16 టీఎంసీలకు నీరు చేరింది. ఆగస్టు 30 నాటికి కేవలం 4 టీఎంసీలు ఉండగా.. సెప్టెంబర్ 30 నాటికి 9 టీఎంసీలకు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈనెల 13 నుంచి 15వ తేది వరకు వచ్చింది. ఇంకా పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మరో 10 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ ఈఈ రాములు తెలిపారు. ఊపందుకున్న వ్యాపారం రెండు నెలల క్రితం వరకు పూర్తిగా అడుగంటిన సింగూర్ ప్రాజెక్టు ప్రస్తుతం కళకళలాడుతోంది. దీంతో బోటింగ్ చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో మూతపడిన వ్యాపారాలు సైతం ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వం అనుకుంటే సాగుకు నీరు సింగూర్ ప్రాజెక్టు నుంచి మండల పరిధిలో సాగుకు నీరు అందించే స్థాయికి వరద చేరింది. అయితే, ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత ఆగస్టు 15 నుంచే సింగూర్ ప్రాజెక్టు ద్వారా పంటల సాగుకు నీరు ఇస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కాల్వ పనులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులను పరుగులు పెట్టించాలి. అంతేకాకుండా ఆర్డీఓ పర్యవేక్షణలో కాల్వల పరిధిలోని భూసమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈక్రమంలో ఎత్తిపోతల పథకం వద్ద మినహా.. దాదాపుగా పనులు పూర్తయ్యాయి. కనీసం పదివేల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఎస్ఈ మదుసుధన్ ‘సాక్షి’కి తెలిపారు. -
తల్లి సజీవ దహనం.. చిన్నారి సురక్షితం
పుల్కల్ (మెదక్) : తల్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా సమీపంలోనే ఉన్న ఆమె కుమార్తె తృటిలో సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన శనివారం మెదక్ జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేటలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కౌడిపల్లి మండలం సిర్పురం గ్రామానికి చెందిన అంజయ్య కూతురు అంజలి(24)కి ముద్దాయిపేట గ్రామానికి చెందిన తాడ్మన్నూర్ గోపాల్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కూతురు మైత్రి(ఏడాదిన్నర) ఉంది. ఇటీవల ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజలి తనతో పాటు కూతురిని ఇంట్లోనే ఉంచి తలుపు గడియపెట్టింది. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తల్లి మంటల్లో కాలుతుండగా చిన్నారి భయంతో బిగ్గరగా ఏడ్చింది. అప్రమత్తమైన చుట్టుపక్కలవారు తలుపులు పగులగొట్టి మంటలు ఆర్పారు. తీవ్రంగా గాయపడిన అంజలిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. చిన్నారి తలకు, చేతికి కాలిన గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహిళ దారుణ హత్య
పుల్కల్ (మెదక్ జిల్లా) : పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామంలో ఓ మహిళ గురువారం దారుణ హత్యకు గురైంది. మృతురాలు ముదిమానిక్యం గ్రామానికి చెందిన సుశీల(28)గా గుర్తించారు. మహిళపై అత్యాచారం జరిపి అనంతరం వైరుతో గొంతు బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఎడ్లబండిని ఢీకొని ఇంజినీర్ మృతి
పుల్కల్ (మెదక్) : జీవనోపాధి కోసం వచ్చిన ఒక సివిల్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు ఎద్దుల బండిని ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలోని పెద్దారెడ్డిపేటలో చోటుచేసుకుంది. నల్ల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం రామన్నగూడెంకు చెందిన గుడుమల్ల సైదులు(37) మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి శివారులోని సింగూర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ పథకంలో ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ వద్ద సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కాగా, ఆయన పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం సింగూర్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటల ప్రాంతంలో తన బైక్‌పై వస్తుండగా పెద్దారెడ్డిపేటలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఎడ్ల (దున్నపోతుల) బండిని ఢీకొట్టి తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. సైదులుకు తల్లి, భార్య యశోదతో పాటు ఇద్దరు కుమారులున్నారు. -
డాంబర్.. యమ డేంజర్
పుల్కల్: ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో గడిపిన ఆ రెండు ప్రాంతాలు నేడు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కరువై మంచం పట్టాయి. శివ్వంపేటలోని వడ్డెరబస్తీ, కొత్తగడ్డ ప్రాంతాలు అనారోగ్యం, అస్వస్థతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రతి ఇంటా ఒకరు ఆస్పత్రుల పాలవుతున్నారు. జనావాసాల మధ్యలో అనుమతి లేకుండా నడుపుతున్న డాంబర్ మిల్లు ఈ పరిస్థితికి కారణమవుతోంది. ఈ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం ఘాటుకు పలువురు మహిళలు గర్భం సైతం కోల్పోతున్నారు. గర్భం దాల్చిన కొందరు మహిళలైతే ప్రసవమయ్యేంత వరకు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పుల్కల్ మండలం శివ్వంపేటలో అనుమతి లేకుండా డాంబర్ మిల్లు నడుస్తోంది. జనావాసాల మధ్యలో ఉన్న ఈ పరిశ్రమ తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతోంది. డాంబర్‌ను మరగబెట్టే క్రమంలో విపరీతమైన వాసన వస్తోంది. ఈ గాలి పీల్చిన వారు వాంతులు, ఆయాసానికి గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ కాసేపు సేద దీరేందుకు ఆరుబయటకు వస్తే వాసన కారణంగా తల తిరగడం, వాంతులు, దమ్ము వస్తున్నాయని కాలనీవాసులు అంటున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు ఆయాసంతో ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. పొగ, ఊపిరిసలపనివ్వని వాసనతో కడుపులో నొప్పి రావడంతో పాటు గర్భిణిలకు పెనుముప్పు వాటిల్లుతోంది. కొందరు గర్భం పోగొట్టుకున్న దాఖలాలున్నాయి. డాంబర్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వాసన, పొగలే ఇందుకు కారణమని గైనకాలజిస్టులు సైతం ధ్రువీకరిస్తున్నారు. జాడ లేని పీసీబీ అధికారులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న డాంబర్ మిల్లు వైపు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. పరిశ్రమ ద్వారా వచ్చే వాయు కాలుష్యంతో పలువురు రోగాల బారిన పడుతున్నారని ఫిర్యాదులందినా చర్యల్లేవు. పరిశ్రమ ఏర్పాటుకు ఒక్క అనుమతీ నిబంధనల ప్రకారం పొందలేదని, రెవెన్యూ, విద్యుత్, పీసీబీ, పబ్లిక్ హెల్త్ అధికారులు ముడుపులు తీసుకుని పరిశ్రమ ఏర్పాటుకు అనుమతినిచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అన్నీ అక్రమమే.. నిబంధనల ప్రకారం చిన్నతరహా పరిశ్రమను ఏరా్పాటు చేయాలన్నా తొలుత ప్రజాభిప్రాయం తీసుకోవాలి. అంతకంటే ముందు పరిశ్రమను స్థాపించే వ్యవసాయ భూమిని మార్పిడి చేయించుకోవాలి. ఇందుకు తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆయన డివిజనల్ రెవెన్యూ అధికారికి ప్రతిపాదిస్తారు. ఆయన అంగీకరిస్తేనే వ్యవసాయ భూమిని పరిశ్రమ ఏర్పాటుకు వీలుగా మార్చుకొనే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వానికి మార్కెట్ వాల్యూ ప్రకారం టాక్స్ చెల్లించాలి. కాని శివ్వంపేటలో ఏర్పాటు చేసిన డాంబర్ మిల్లు యాజమాని ఇవేమీ లేకుండానే రెండేళ్ల క్రితం దర్జాగా పరిశ్రమను ఏర్పాటు చేశారు. దీన్ని మరో పది ఎకరాల్లో విస్తరించేందుకు పనులు ప్రారంభించారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు!
పుల్కల్: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు తాము వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మిచుకునేందుకే తవ్వకాలు జరుపుతున్నామని చెబుతున్నా.. కాదు గుప్త నిధులకోసమే తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మండలంలోని శివ్వంపేట గ్రామంలో బండ బోయిని నర్సింలు ఇంటి సమీపంలోని స్థలంలో 50 నుంచి 60 ఫీట్ల లోతులో ఐదు వారాలుగా గుంత తీస్తున్నారు. రాత్రి పూట తవ్వకాలు జరుపుతుండటంతో ఆ ప్రాంతంలోని వారు ఆందోళనకు గురవుతున్నారు. బాత్ రూం నిర్మాణం కోసమైతే పగలు తవ్వకాలు నిర్వహిస్తారు. అయినా తొమ్మిది ఫీట్ల కంటే ఎక్కువ లోతు తీసే పరిస్థితి ఉండదు. కాని ఏకంగా 50 ఫీట్లకు పైగా తవ్వకాలు నిర్వహించడంతో అనుమానాలకు దారి తీస్తోంది. అది ఎవ్వరికీ అనుమానం రాకుండా చుట్టూ దడి నిర్మించి తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికీ సుమారుగా 50 ఫీట్లకు పైగా తీయడం వల్ల గుంతల్లో నీరు ఊరుతుంది. అయినా తవ్వకాలు కొనసాగిస్తునే ఉన్నారు. -
జోరుగా కల్తీ కల్లు విక్రయాలు
- జాడలేని ఎక్సైజ్ పోలీసులు పుల్కల్ : కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తనఖీలు నిర్వహించాల్సిన అధికారులు మాముళ్లు మత్తులో మునిగిపోయారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్తీకల్లు విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కొర్పోల్, వెండికోల్, పోచారం, బస్వాపూర్, ముదిమాణిక్యం, ఎస్. ఇటిక్యాల్, సింగూర్, పెద్దారెడ్డిపేట తదితర గ్రామాల్లో స్థానికంగానే కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. బస్వాపూర్‌లో కల్తీ కల్లు సేవించిన వారు నేరుగా ఇంటికి చేరే పరిస్థితి లేనది గ్రామస్తులు ఆరోపించారు. నాణ్యమైన కల్లు లేకపోవడంతో కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు. దీంతో కల్లు ప్రియులు తమకు కిక్కు ఎక్కడం లేదంటే చాటు కల్లు వ్యాపారులు అధనంగా కావాల్సిన మత్తు పదార్థం (డైసోఫామ్)తో కూడిన మందును పై నుంచి వస్తారని తెలిపారు. దిన్ని సేవించిడం వల్ల పూర్తిగా మత్తులోకి వెళ్ల్లిపోతారని ఫలితంగా అనారోగ్యాలకు గురి కావడమే కాకుండా ప్రమాదాలకు సైతం గురైన సంఘటనలున్నాయి. ఇందుకు గత నెల రోజుల్లోనే పుల్కల్కు చెందిన ఐదు మంది యువకులు బస్వాపూర్‌లో కల్లు త్రాగేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మత్తులోకి జారి వాహనంపై నుంచి పడిన ఘటనలున్నాయి. ఇందులో ఇద్దరికి శాశ్వితంగా అంగవైకల్యం అయిన సందర్బాలున్నాయి. సింగూర్‌లో సైతం రోడ్డుపైనే ఫీవర్ కల్లు అంటు విక్రయాలు జరుపుతుంటారు కాని అసలు ఆ ప్రాంతంలోనే ఈత చె ట్లు లేకుండా ఎలా పివర్ కల్లు తయారు అవుతుందో అధికారులకే తెలియాలి. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి సింగూర్ ప్రాజెక్టును చూసేందుకు వస్తుంటారు. దీంతో ఫీవర్ కల్లు అని విక్రహించి సంపాదించుకుంటున్నారు. కాని కల్తి కల్లు అనే విషయం మాత్రం తెలియడం లేదు. సింగూర్‌లో కల్లు సేవించిన వారు తిరుగు ప్రయాణంలో గాని సేవించిన కల్లు దుకాణం వద్దనే మత్తులోకి జారి అక్కడే పండుకున్న సందర్బాలున్నాయి. కొర్పోల్‌లో సైతం రెండు డిపోలకు చెందిన కల్లు విక్రయాలు జరుపుతుండటంతో పోటీ పెరిగింది. దీంతో స్థానికులు గ్రామానికి ఎవ్వరు డబ్బులు ఎక్కువగా ఇస్తే వారే విక్రహించుకోవాలని సూచించడంతో గ్రామస్తులు డిమాండ్ చేసిన మేరకు ఒప్పదం చేసుకున్న ఇటిక్యాల్ సురేందర్‌గౌడ్ కొర్పోల్‌లో కల్లు విక్రయాలు నిర్వహిస్తున్నారు. దీంతో కల్లు ధరను పెంచడమే కాకుండా కల్తీ కలు విక్రయాలు జరుపుతున్నారు. అయిన అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. పోచారంలో సైతం కల్తి కలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ సైతం పోటీ పడి విక్రయాలు జరుపడంతో మత్తు వచ్చేందుకు గాను డైజోఫాం పరిమితి మించి కలిపి విక్రయాలు జరుపుతున్నారు. ఇలా మండలంలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై జోగిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా కల్తి కల్లు విక్రహించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రైతన్నల ఉసురు తీస్తున్న కరెంట్
- విద్యుత్ శాఖ తప్పిదాల ఫలితం.. - రెండు నెలల్లో ముగ్గురు రైతుల బలి - తాజాగా మిన్పూర్ గిరిజన తండాలో ఘటన పుల్కల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం గడచిన రెండు నెలల కాలంలో ముగ్గురు అన్నదాతలను పొట్టునపెట్టుకుంది. మండలంలో వరుసగా విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఆ శాఖ అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అన్నదాతల మృతికి పరోక్షంగా అధికారుల వైఫల్యాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇం దుకు తాజాగా ఆదివారం ఉదయం మిన్పూర్ గిరిజన తండాలో మరో ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన రామవత్ శ్రావణ్ (50) తనకున్న మూడెకరా ల్లో పొద్దుతిరుగుడు పంటలను సాగు చేశాడు. అయితే ఇటీవల కాలంలో లో ఓల్టేజీ కారణంగా పంటకు నీటిని అందించలేకపోయాడు. దీంతో పంట ఎండిపోతుండడంతో ఆవేదనకు గురయ్యాడు. తెల్లవారు జామున వచ్చే కరెంట్‌తో పంటకు నీటిని అందించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆదివారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. అయితే వ్యవసాయ బో ర్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవడంతో బోర్ మో టార్ వేసిన స్టార్ట కాలేదు. దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి బోర్లకు వెళ్లే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే తన బోరు నడుస్తుందని భావించి ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.. అదేవిధంగా గతనెలలో ఇసోజిపేటకు చెందిన వడ్ల ఈశ్వరయ్య బోరు మోటార్‌ను ఆన్ చేసేందుకు వెళ్తుం డగా తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడకక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో రైతు బ్యాగరి జానయ్య విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. ఇలా నెల, రెండు నెలల కాలంలోనే ముగ్గురు రైతులు మృత్యువాత పడడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ట్రాన్స్‌కో డీఈని ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. లైన్మెన్లకు సహాయకులు : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్లకు సహాయకులను నియమించుకుని వారితోనే పనులు చేయిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గతంలో మండల కేంద్రమైన పుల్కల్లో ఒకరి ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్‌మన్‌కు సమాచారం ఇచ్చాడు. అందుకు తన సహాయకుడు రాంరెడ్డిని పంపాడు. అయితే విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన కోపిల చంద్రయ్య సైతం బోర్ మోటార్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు వెళ్లి శాశ్వతంగా వికలాం గుడిగా మారడంతో ఆయన కుటుంబం రోడ్డున పడిం ది. ఇలా సంఘటనలు తరచుగా జరుగుతున్న విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. -
లాకప్ డెత్తా? ఆత్మహత్యా ?
మెదక్ జిల్లా పుల్కల్ ఠాణాలో ఘటన పుల్కల్/జోగిపేట: లాకప్‌లో ఓ నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతను పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయాడని, ఇది ముమ్మాటికి లాకప్‌డెత్ అని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన జోగిపేట సీఐ నాగయ్యతో పాటు పుల్కల్ ఎస్ఐ లోకేష్, కానిస్టేబుళ్లు యాదగిరి, ఉదయ్‌కుమార్‌లను ఎస్పీ సుమతి సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుల్కల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దారెడ్డిపేటలో డిసెంబర్ 23న సదాశివపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మంజుల అలియాస్ స్వరూప (28)ను అదే గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య (35), తలారి పోచయ్య (34)లు హత్య చేశారు. అనంతరం మృతదే హాన్ని పెద్దారెడ్డిపేట శివారులోని ఓ చెరుకు తోటలో పెట్రోల్ పోసి నిప్పంటిం చారు. సదాశివపేట పోలీసులు మహిళ అదృశ్యం కేసుగా నమోదు చేసి పోచయ్యను అనుమానితుడిగా విచారిం చారు. హత్య చేసింది తామేనని శవాన్ని పుల్కల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కాల్చినట్లుగా ఒప్పుకున్నారు. దీంతో పోచయ్యను సదాశివపేట పోలీసులు, జోగిపేట సీఐ నాగయ్యకు అప్పగించారు. హత్యానేరం కింద నింది తుడిని అరె స్టు చేసి జనవరి 31న రిమాండ్‌కు పం పాడు. ఇదిలాఉండగా, నాలుగు రోజుల క్రితం మరో నిందితుడు తలారి లక్ష్మయ్యను పుల్కల్ పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించ సాగారు. అయితే, పోలీసుల చిత్రహింసలను తట్టుకోలేక అతను గురువారం తెల్లవారుజామున పోలీస్‌స్టేషన్ లాకప్‌లోనే సంకెళ్లతో కూడిన గొలుసుతో ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, కొన ఊపిరితో ఉన్న లక్ష్మయ్యను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని పుల్కల్ ఎస్ఐ లోకేష్ చెబుతుండగా.. స్టేషన్లోనే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో సమగ్ర దర్యాప్తు కోసం మెజిస్టీరియల్ విచారణకు కలెక్టర్ ఆదేశించారు. కాగా ఈ ఘటనకు బాధ్యులైన సీఐ, ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆశలు సజీవం
భారీ వర్షాలతో రైతుల్లో ఆనందం - పునాస పంటలకు జీవం - గోడ కూలి వృద్ధురాలి మృతి - పుల్కల్లో 8.24 సెంటీమీటర్ల వర్షం సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వానలు పునాస పంటలకు జీవం పోస్తున్నాయి. విత్తనం వేసిన రోజు నుంచి చినుకు కోసం వెయ్యి కళ్లలో ఎదురు చూసిన రైతులకు ఈ వర్షాలు ఎంతో ఊరట నిచ్చాయి. అల్ప పీడన ప్రభావంతో వర్షాలు కురవటంతో మొక్కజొన్న, పత్తి, మిరప, పెసర పంటలకు మేలు జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సగటున 32.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధిక వర్షపాతం. మూడు రోజులుగా ముసురు పడుతుండగా, శనివారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పుల్కల్ మండలంలో 8.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ మండలంలో 19.2మిల్లిమీటర్లు, పాపన్నపేటలో 44.6, చిన్నశంకరంపేటలో 67.8, రామాయంపేటలో 16.4 మి.మి.వర్షపాతం నమోదైంది. ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. చెరువులో కూడా కొంతమేర నీరు వచ్చింది. వరినాట్లు కొనసాగుతున్నాయి. పొలాల్లో నీరు నిల్వ కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. ఆరుతడి పంటలకు కూడా ఈ వర్షాలు ప్రాణం పోశాయి. ఇదిలా ఉండగా.. వైద్య, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం, ముందస్తు జాగ్రత్తలు చేపట్టక పోవడంతో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మిరుదొడ్డి మండలం కేంద్రంలో ఇంటి పై కప్పు కూలి ఆండాళమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. కౌడిపల్లి మండలం తిమ్మాపురంలో పాత పాఠశాల భవనం కూలిపోయింది. పాతపడి కూలిపోయే పరిస్థితి ఉండటంతో రెండేళ్లుగా ఆ భవనం వినియోగించడం లేదు. రే గోడు మండలం కొత్వాన్‌పల్లిలో అతిసార ప్రబలింది. గ్రామానికి చెందిన దాదాపు 10 మందికి పైగా అతిసారబారిన పడ్డారు. పిడుగు పడి ఎద్దు మృతి మిరుదొడ్డి :పిడుగు పడి ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని అందె గ్రామంలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సూకూరి లింగం శుక్ర వారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద ఎద్దును కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ నేపథ్యంలో ఎద్దుపై పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతి చెందిందని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఎద్దు విలువ సుమారు రూ. 45 వేలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. కాగా శనివారం తెల్లవారు జామున కురిసిన వర్షం కారణంగా మిరుదొడ్డి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న కాన్గంటి ముత్యాలుకు చెందిన ప్రహరీతో పాటు మరుగుదొడ్డి కుప్ప కూలి పోయింది. -
మద్యం అమ్మనీయమని ప్రతిజ్ఞ
పుల్కల్, న్యూస్‌లైన్ : ‘గుడుంబా తయారు చేయనీయం, మద్యం అమ్మనీయం.. గట్లైతేనే మా బతుకులు మంచిగ ఉంటయ్’ అంటూ మండలంలోని బొమ్మారెడ్డిగూడ తండా గిరిజనులు, సర్పంచ్ శోభాబాయి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. వివరాలకు వెళితే.. గుడుంబా, మద్యం తాగడం వల్ల మా సంసారాలు వీధుల పాలవుతున్నాయంటూ పలువురు గిరిజనులు శనివారం పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎంత సంపాదించినా మగవాళ్లు తాగనీకే సరిపోతోందని తెలిపారు. దీంతో సంసార ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో సారా, మద్యం ఎవరూ విక్రయించ కూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వివరించారు. ఒకవేళ ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే పోలీసులకు పట్టిస్తామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎవరైనా మద్యం, డబ్బు పంచితే వారిని కటకటాలలోకి నెట్టేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తీర్మాన పత్రాన్ని ఎస్ఐ లోకేష్‌కు అందించారు. మహిళ, యువజన సంఘాలతో కమిటీ మద్యంపై కదం తొక్కిన సందర్భంలో మహిళలు, యువజన సంఘాలతో ఓ కమిటీగా ఏర్పడ్డారు. మహిళల నుంచి లలిత, మేనక, లక్ష్మి, డ్వాక్రా గ్రామ సంఘాల నుంచి రేణుక, యువజన సంఘాల ఆద్వర్యంలో జైల్‌సింగ్, సుశీల్, తిలక్, గౌతమ్‌లను ఎన్నుకున్నారు. ఆ సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో పోలీసులతో కలిసి గుడుంబా తయారు చేసే సామగ్రి పగులగొట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ లోకేష్ మాట్లాడుతూ గుడుంబా, మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం తెలిస్తే 94409 01840, 084502 73733కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. -
విషాదాన్ని నింపిన హోలీ
పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్ : హోలీ పండుగ ముగ్గురి కుటుం బాల్లో విషాదం నింపింది. దీంతో ఆయా కుటుంబాన్ని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రంగులు కనుక్కోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి పుల్కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి కింద నీటిలో శవమై తేలాడు. ఎస్ఐ లోకేష్ కథనం మేరకు.. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామానికి ఆంజనేయులు, స్వరూ ప దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రమేష్ (24) రెండో వాడు. తండ్రి నిర్వహిస్తున్న హోటల్లో పని చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే హోలీని పురస్కరించుకుని ఆదివారం గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితులు లింగం, హరిశంకర్, విక్రమ్‌లతో కలిసి రమేష్ స్నానం చేసేందుకు పుల్కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి వద్దకు వచ్చాడు. ముగ్గు రు మిత్రులకు ఈత రాక పోవటంతో వారు ఒడ్డున కూర్చొని స్నానాలు చేశా రు. రమేష్ మాత్రం బ్రిడ్జి పై భాగంలో లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి నీట మునిగాడు. దీంతో విషయాన్ని రమేష్ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి చూడగా అప్పటికే చీకటి పడడంతో వెనుతిరిగి సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే రమేష్ మృతదేహం నీట తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. మరో సంఘటనలో సిద్దిపేట మం డలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన మల్యాల ప్రవీణ్ (15) బావిలో మునిగి దుర్మరణం చెందారు. గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన సత్త య్య, దేవవ్వలకు ముగ్గురు కుమారులు. రెండవ కుమారుడు మల్యాల ప్రవీణ్ (15) తొమ్మిదవ తరగతి చదువుతున్నా డు. హోలీ పండుగలో భాగంగా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రంగులు చల్లుకున్నారు. దీంతో ఒంటికి అంటిన రంగులు కడుక్కోవడానికి గ్రా మ శివారులో ఉన్న ఓ బావిలోకి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో బావిలో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్రవీణ్ మునిగి పోయాడు. దీందో విషయాన్ని స్నేహితులు కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు చేరవేశారు. వారు బావి వద్దకు చేరుకుని మృతదేహం కోసం రెండు గంటల పాటు వెతికి బయటకు తీశారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూ సి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కిషన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీహరిగౌడ్‌లు కోరారు. జేసీబీ గుంతలో పడి మరొకరు పటాన్చెరు టౌన్ : కాలకృత్యాలకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జేసీబీ గుం టలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నందిగామలో సోమవారం చోటు చేసుకుంది. బీడీఎల్ భానూర్ పోలీసుల కథనం మేర కు.. రాజస్థాన్ రాష్ట్రం బైరాన్ మండలం అసాక్ గ్రామానికి చెందిన జితేందర్‌సింగ్ (25) మండల పరిధిలోని నందిగామలో గల ఓ ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే పరిశ్రమలో ఉన్న ఓ గదిలో బంధువులతో కలిసి ఉం టున్నాడు. అయితే సోమవారం హోలీ పండుగ కావడంతో పరిశ్రమలో ఉండే తోటి బంధువులతో కలిసి హోలీ ఆడా డు. అనంతరం చిన్నాన్న మహేందర్‌సింగ్, మామయ్య జితేందర్‌తో కలసి స్నా నానికి వెళ్లాడు. అయితే ముందుగా జితేందర్ సింగ్ కాలకృత్యాలకు వెళ్లాడు. అనం తరం జేసీబీ గుంతలో దిగి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందా డు. అయితే జితేందర్ ఎంత సేపటికీ రాకపోవడంతో బంధువులు అక్కడికి వె ళ్లి చూసి విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్ఐ ప్రసాద్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
ఆడపిల్ల ఆత్మ రక్షణకు కరాటే అవసరమే
పుల్కల్, న్యూస్‌లైన్ : ఆత్మరక్షణకు ఆడపిల్లలకు కరాటే అవసరమంటున్నాడు మండలంలోని వెంకటకిష్టాపూర్ గ్రామానికి చెందిన కొండ్రేపల్లి రమేష్. తనకు మార్షల్ ఆర్ట్స్ అంటే అతనికి ప్రాణమని, ఇష్టంగా కష్టపడి నేర్చుకుని మాస్టర్ అయినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం సిద్దిపేటలో ఎంసీజే చేస్తూ తాను నేర్చుకున్న విద్యను పది మందికి నేర్పుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ర మేష్. 2007వ సంవత్సరంలో వెంకటకిష్టాపూర్లో ఇంటర్నేషనల్ శాలిన్ కుంగ్‌ఫూ లయన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించిన రమేష్.. 2010లో బ్లాక్ బెల్ట్ పొందాడు. 2011వ సంవత్సరంలో మల్కాజిగిరి సికింద్రాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియన్ టోర్నమెంట్లో బెస్ట్ ఇన్స్‌ఫెయిర్ అవార్డు పొందాడు. 2012లో సికింద్రాబాద్‌లో జరిగిన స్టేట్ లెవల్ టైగర్ కుంగ్‌ఫూలో కటాస్ అవార్డు సాధించాడు. 2013లో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డిగ్రీ అందుకున్నాడు. ఇలా అతను మార్షల్ ఆర్ట్స్‌లో ఓ వైపు విజయాలు సాధించుకుంటు మరోవైపు పేద పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం సిద్దిపేటలో ఎంసీజే చదువుతూ విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. అందులో పేద విద్యార్థులు, ఆడ పిల్లలకు ఉచితంగానే కరాటే నేర్పుతున్నాడు. ఇటీవల తన సొంత గ్రామంలో తన వద్ద కరాటే నేర్చుకున్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి జోగిపేట సీఐ సైదానాయక్ చేతుల మీదుగా వివిధ విభాగాల్లో బెల్టులను అందించారు. -
పేదలకు వరం రచ్చబండ
పుల్కల్, న్యూస్‌లైన్: రచ్చబండ కార్యక్రమం పేదలకు వరమని పుల్కల్ మాజీ జడ్పీటీసీ మల్లప్ప అన్నారు. పుల్కల్ ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో మంగళవారం జరిగిన రచ్చ బండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే రచ్చబండ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామస్థాయిలోని ప్రతి పేదవాని ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. మండలానికి ఇప్పటికే సుమారు 9 వందల కోట్లను డిప్యూటీ సీఎం మంజూరు చేశారన్నారు. సింగూర్ కాలువకు 99కోట్లు, సుల్తాన్పూర్ జేఎన్టీయూకు 3 వందల కోట్లు, సింగూర్ బ్రిడ్జి , గ్రామీణ రోడ్లు, ప్రభూత్వ భవనాలు, మురికి కాల్వలు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి డిప్యూటి సీఎం నిధులు మంజూరు చేయించారన్నారు. ప్రతి గ్రామంలో తాగు నీటి సమస్య లేకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మండలంలోని 25 గ్రామ పంచాయితీలకు ప్రభుత్వ నిధులు అందుతున్నాయన్నారు. సీఎం ఫ్లెక్సీ తొలిగించాల్సిందే రచ్చ బండ కార్యక్రమం ప్రారంభంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతుండగా స్థానిక టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఫ్లెక్సీపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్రపటాన్ని తొలగించాలని పట్టుబట్టారు. దీంతో చేసేదిలేక జేసీ శరత్ తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే స్టేజీ దిగి వెళ్లిపోయారు. రచ్చబండలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి రచ్చబండ కార్యక్రమం వల్ల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని మండల స్పెషలాఫీసర్ ఉషామార్తా పేర్కొన్నారు. మండలంలో 972 పింఛన్లు, 332 రేషన్ కార్డులు, 11 వందల 53 ఇండ్లు మంజూరయ్యాయని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద విద్యుత్ వినియోగదారులకు రూ. కోటి 10 లక్షల53 వేలు లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ డెరైక్టర్ రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అత్తను చంపిన అల్లుడికి జైలు
పుల్కల్, న్యూస్‌లైన్ : అత్తను చంపిన అల్లుడు ఎట్టకేలకు శుక్రవారం కటకటాల పాలయ్యాడు. ఈ కేసు విషయమై జోగిపేట సీఐ సైదానాయక్ శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. శంకరంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కుమ్మరి సంగమ్మ (50)కు నలుగురు కుమార్తెలు. వీరిలో మూడో కుమార్తె కవితకు నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటకు చెందిన కుమ్మరి లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. అయితే లక్ష్మణ్ ఇల్లరికం వచ్చాడు. అప్పటి నుంచి వారు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ నెల 8న టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామంలో జరిగే దినకర్మకు సంగమ్మ, అల్లుడు లక్ష్మణ్‌లు బైక్‌పై హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు బైక్‌పై వస్తూ.. పుల్కల్ మండలం తాడ్దాన్పల్లి గ్రామ శివారులోకి రాగానే రాత్రి కావడంతో వాహనాన్ని ఆపాడు. అనంతరం అత్త సంగమ్మను పత్తి చేలల్లోకి ఈడ్చుకెళ్లి రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అందులో భాగంగానే సంగమ్మ మృతదేహాన్ని బైక్‌పై కట్టుకుని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. అక్కడి వైద్యులకు బైక్ నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడిందని నమ్మబలికాడు. వారు పరీక్షలు చేయగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. అక్కడికి చేరుకుని పోలీసులు మృతిపై అనుమానం వ్యక్తం చేసి మృతురాలి కుమార్తెలకు సమాచారం అందించారు. వారు అక్కడికి రాగానే ఆరా తీశారు. నెల రోజులుగా లక్ష్మణ్ అత్తతో నాలుగవ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి, ఉన్న రెండెకరాల భూమిని తన పేరు రాయించాలని వేధిస్తున్నట్లు వివరించారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అందులో లక్ష్మణ్ నిందితుడిగా తేలడంతో శుక్రవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో పుల్కల్ ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ ఉన్నారు. -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ, 35మందికి గాయాలు
మెదక్ : మెదక్ జిల్లా సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 35మంది గాయపడ్డారు. పుల్కల్ మండలం సారేపల్లి వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.