- విద్యుత్ శాఖ తప్పిదాల ఫలితం..
- రెండు నెలల్లో ముగ్గురు రైతుల బలి
- తాజాగా మిన్‌పూర్ గిరిజన తండాలో ఘటన
పుల్‌కల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం గడచిన రెండు నెలల కాలంలో ముగ్గురు అన్నదాతలను పొట్టునపెట్టుకుంది. మండలంలో వరుసగా విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఆ శాఖ అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అన్నదాతల మృతికి పరోక్షంగా అధికారుల వైఫల్యాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇం దుకు తాజాగా ఆదివారం ఉదయం మిన్‌పూర్ గిరిజన తండాలో మరో ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన రామవత్ శ్రావణ్ (50) తనకున్న మూడెకరా ల్లో పొద్దుతిరుగుడు పంటలను సాగు చేశాడు. అయితే ఇటీవల కాలంలో లో ఓల్టేజీ కారణంగా పంటకు నీటిని అందించలేకపోయాడు.
దీంతో పంట ఎండిపోతుండడంతో ఆవేదనకు గురయ్యాడు. తెల్లవారు జామున వచ్చే కరెంట్‌తో పంటకు నీటిని అందించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆదివారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. అయితే వ్యవసాయ బో ర్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవడంతో బోర్ మో టార్ వేసిన స్టార్‌ట కాలేదు. దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి బోర్లకు వెళ్లే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే తన బోరు నడుస్తుందని భావించి ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.. అదేవిధంగా గతనెలలో ఇసోజిపేటకు చెందిన వడ్ల ఈశ్వరయ్య బోరు మోటార్‌ను ఆన్ చేసేందుకు వెళ్తుం డగా తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడకక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో రైతు బ్యాగరి జానయ్య విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. ఇలా నెల, రెండు నెలల కాలంలోనే ముగ్గురు రైతులు మృత్యువాత పడడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ట్రాన్స్‌కో డీఈని ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.
లైన్‌మెన్లకు సహాయకులు : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్‌మెన్లకు సహాయకులను నియమించుకుని వారితోనే పనులు చేయిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గతంలో మండల కేంద్రమైన పుల్‌కల్‌లో ఒకరి ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్‌మన్‌కు సమాచారం ఇచ్చాడు. అందుకు తన సహాయకుడు రాంరెడ్డిని పంపాడు. అయితే విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన కోపిల చంద్రయ్య సైతం బోర్ మోటార్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు వెళ్లి శాశ్వతంగా వికలాం గుడిగా మారడంతో ఆయన కుటుంబం రోడ్డున పడిం ది. ఇలా సంఘటనలు తరచుగా జరుగుతున్న విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు.
రైతన్నల ఉసురు తీస్తున్న కరెంట్
Published Mon, May 11 2015 12:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement