లాకప్ డెత్తా? ఆత్మహత్యా ?
- మెదక్ జిల్లా పుల్కల్ ఠాణాలో ఘటన
పుల్కల్/జోగిపేట: లాకప్‌లో ఓ నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతను పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయాడని, ఇది ముమ్మాటికి లాకప్‌డెత్ అని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన జోగిపేట సీఐ నాగయ్యతో పాటు పుల్కల్ ఎస్‌ఐ లోకేష్, కానిస్టేబుళ్లు యాదగిరి, ఉదయ్‌కుమార్‌లను ఎస్పీ సుమతి సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
పుల్కల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దారెడ్డిపేటలో డిసెంబర్ 23న సదాశివపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మంజుల అలియాస్ స్వరూప (28)ను అదే గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య (35), తలారి పోచయ్య (34)లు హత్య చేశారు. అనంతరం మృతదే హాన్ని పెద్దారెడ్డిపేట శివారులోని ఓ చెరుకు తోటలో పెట్రోల్ పోసి నిప్పంటిం చారు. సదాశివపేట పోలీసులు మహిళ అదృశ్యం కేసుగా నమోదు చేసి పోచయ్యను అనుమానితుడిగా విచారిం చారు.
హత్య చేసింది తామేనని శవాన్ని పుల్కల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కాల్చినట్లుగా ఒప్పుకున్నారు. దీంతో పోచయ్యను సదాశివపేట పోలీసులు, జోగిపేట సీఐ నాగయ్యకు అప్పగించారు. హత్యానేరం కింద నింది తుడిని అరె స్టు చేసి జనవరి 31న రిమాండ్‌కు పం పాడు. ఇదిలాఉండగా, నాలుగు రోజుల క్రితం మరో నిందితుడు తలారి లక్ష్మయ్యను పుల్కల్ పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించ సాగారు. అయితే, పోలీసుల చిత్రహింసలను తట్టుకోలేక అతను గురువారం తెల్లవారుజామున పోలీస్‌స్టేషన్ లాకప్‌లోనే సంకెళ్లతో కూడిన గొలుసుతో ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, కొన ఊపిరితో ఉన్న లక్ష్మయ్యను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని పుల్‌కల్ ఎస్‌ఐ లోకేష్ చెబుతుండగా.. స్టేషన్‌లోనే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో సమగ్ర దర్యాప్తు కోసం మెజిస్టీరియల్ విచారణకు కలెక్టర్ ఆదేశించారు. కాగా ఈ ఘటనకు బాధ్యులైన సీఐ, ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.