
కౌడిపల్లి(నర్సాపూర్): జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తునికిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై రాజశేఖర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తునికి గ్రామానికి చెందిన మస్కూరి నీరుడి నారాయణ కొడుకు యాదగిరి (28) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి అలవాటుపడిన యాదగిరి ఏం పనిచేయకుండా జులాయిగా తిరిగేవాడు. సోమవారం రాత్రి అందరితోపాటు తిని పడుకున్న తరువాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని కిందకు దించే సరికే మృతి చెందాడు. గతంలో సైతం పలుమారు కుటుంబ సభ్యులతో గొడవపడి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. మృతునికి భార్య మంజూల, ఇద్దరు పిల్లలు గౌతమి, అఖిల్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment