జోరుగా కల్తీ కల్లు విక్రయాలు | As rapid of adulterated liquor sales | Sakshi
Sakshi News home page

జోరుగా కల్తీ కల్లు విక్రయాలు

Published Sun, Sep 6 2015 11:19 PM | Last Updated on Fri, Aug 17 2018 5:07 PM

జోరుగా కల్తీ కల్లు విక్రయాలు - Sakshi

జోరుగా కల్తీ కల్లు విక్రయాలు

- జాడలేని ఎక్సైజ్ పోలీసులు
పుల్‌కల్ :
కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తనఖీలు నిర్వహించాల్సిన అధికారులు మాముళ్లు మత్తులో మునిగిపోయారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్తీకల్లు విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కొర్పోల్, వెండికోల్, పోచారం, బస్వాపూర్, ముదిమాణిక్యం, ఎస్. ఇటిక్యాల్, సింగూర్, పెద్దారెడ్డిపేట తదితర గ్రామాల్లో స్థానికంగానే కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. బస్వాపూర్‌లో కల్తీ కల్లు సేవించిన వారు నేరుగా ఇంటికి చేరే పరిస్థితి లేనది గ్రామస్తులు ఆరోపించారు. నాణ్యమైన కల్లు లేకపోవడంతో కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు.

దీంతో కల్లు ప్రియులు తమకు కిక్కు ఎక్కడం లేదంటే చాటు కల్లు వ్యాపారులు అధనంగా కావాల్సిన మత్తు పదార్థం (డైసోఫామ్)తో కూడిన మందును పై నుంచి వస్తారని తెలిపారు. దిన్ని సేవించిడం వల్ల పూర్తిగా మత్తులోకి వెళ్ల్లిపోతారని ఫలితంగా అనారోగ్యాలకు గురి కావడమే కాకుండా ప్రమాదాలకు సైతం గురైన సంఘటనలున్నాయి. ఇందుకు గత నెల రోజుల్లోనే పుల్‌కల్‌కు చెందిన ఐదు మంది యువకులు బస్వాపూర్‌లో కల్లు త్రాగేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మత్తులోకి జారి వాహనంపై నుంచి పడిన ఘటనలున్నాయి. ఇందులో ఇద్దరికి శాశ్వితంగా అంగవైకల్యం అయిన సందర్బాలున్నాయి.  సింగూర్‌లో సైతం రోడ్డుపైనే ఫీవర్ కల్లు అంటు విక్రయాలు జరుపుతుంటారు కాని అసలు ఆ ప్రాంతంలోనే ఈత చె ట్లు లేకుండా ఎలా పివర్ కల్లు తయారు అవుతుందో అధికారులకే తెలియాలి.

ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి సింగూర్ ప్రాజెక్టును చూసేందుకు వస్తుంటారు. దీంతో ఫీవర్ కల్లు అని విక్రహించి సంపాదించుకుంటున్నారు. కాని కల్తి కల్లు అనే విషయం మాత్రం తెలియడం లేదు.  సింగూర్‌లో కల్లు సేవించిన వారు తిరుగు ప్రయాణంలో గాని సేవించిన కల్లు దుకాణం వద్దనే మత్తులోకి జారి అక్కడే పండుకున్న సందర్బాలున్నాయి. కొర్పోల్‌లో సైతం రెండు డిపోలకు చెందిన కల్లు విక్రయాలు జరుపుతుండటంతో పోటీ పెరిగింది. దీంతో స్థానికులు గ్రామానికి ఎవ్వరు డబ్బులు ఎక్కువగా ఇస్తే వారే విక్రహించుకోవాలని సూచించడంతో గ్రామస్తులు డిమాండ్ చేసిన మేరకు ఒప్పదం చేసుకున్న ఇటిక్యాల్ సురేందర్‌గౌడ్ కొర్పోల్‌లో కల్లు విక్రయాలు నిర్వహిస్తున్నారు.

దీంతో కల్లు ధరను పెంచడమే కాకుండా కల్తీ కలు విక్రయాలు జరుపుతున్నారు. అయిన అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. పోచారంలో సైతం కల్తి కలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ సైతం పోటీ పడి విక్రయాలు జరుపడంతో మత్తు వచ్చేందుకు గాను డైజోఫాం పరిమితి మించి కలిపి విక్రయాలు జరుపుతున్నారు. ఇలా మండలంలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై జోగిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా కల్తి కల్లు విక్రహించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement