
సాక్షి, సంగారెడ్డి: పుల్కల్ మండలం గొంగులూరు తాండాలో విషాదం చోటుచేసుకుంది. కన్నకూతుర్ని ఓ కసాయి తండ్రి దారుణంగా హతమార్చాడు. రమావత్ జీవన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. లాక్‌డౌన్ అమలవుతుండటంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన జీవన్ నిద్రిస్తున్న చిన్నారి అవంతిక (4)ను గొంత కోసి హత్య చేశాడు. ఇక కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిదే. అయితే, రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలు పనుల్లేక, తినేందుకు తిండిలేక తీవ్ర అవస్థలు పడుతున్నాయి.
ఎస్‌ఐ దురుసు ప్రవర్తన
సాక్షి, సంగారెడ్డి: సాక్షి మీడియాలో పనిచేస్తున్న పుల్కల్ విలేకరి పట్ల స్థానిక ఎస్‌ఐ నాగలక్ష్మి దురుసుగా ప్రవర్తించారు. ప్రెస్ మీట్ అంటూ పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఆయనను అరెస్టు చేశారు. ఎస్‌ఐ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (అందోల్ ప్రెస్ క్లబ్) నాయకులు జోగిపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment