పటాన్‌చెరు టౌన్, న్యూస్‌లైన్ : హోలీ పండుగ ముగ్గురి కుటుం బాల్లో విషాదం నింపింది. దీంతో ఆయా కుటుంబాన్ని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రంగులు కనుక్కోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి పుల్‌కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి కింద నీటిలో శవమై తేలాడు. ఎస్‌ఐ లోకేష్ కథనం మేరకు.. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామానికి ఆంజనేయులు, స్వరూ ప దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రమేష్ (24) రెండో వాడు. తండ్రి నిర్వహిస్తున్న హోటల్‌లో పని చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే హోలీని పురస్కరించుకుని ఆదివారం గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాడు.
అనంతరం స్నేహితులు లింగం, హరిశంకర్, విక్రమ్‌లతో కలిసి రమేష్ స్నానం చేసేందుకు పుల్‌కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి వద్దకు వచ్చాడు. ముగ్గు రు మిత్రులకు ఈత రాక పోవటంతో వారు ఒడ్డున కూర్చొని స్నానాలు చేశా రు. రమేష్ మాత్రం బ్రిడ్జి పై భాగంలో లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి నీట మునిగాడు. దీంతో విషయాన్ని రమేష్ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి చూడగా అప్పటికే చీకటి పడడంతో వెనుతిరిగి సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే రమేష్ మృతదేహం నీట తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
మరో సంఘటనలో సిద్దిపేట మం డలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన మల్యాల ప్రవీణ్ (15) బావిలో మునిగి దుర్మరణం చెందారు. గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన సత్త య్య, దేవవ్వలకు ముగ్గురు కుమారులు. రెండవ కుమారుడు మల్యాల ప్రవీణ్ (15) తొమ్మిదవ తరగతి చదువుతున్నా డు. హోలీ పండుగలో భాగంగా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రంగులు చల్లుకున్నారు. దీంతో ఒంటికి అంటిన రంగులు కడుక్కోవడానికి గ్రా మ శివారులో ఉన్న ఓ బావిలోకి ఈతకు వెళ్లారు.
ఈ క్రమంలో బావిలో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్రవీణ్ మునిగి పోయాడు. దీందో విషయాన్ని స్నేహితులు కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు చేరవేశారు. వారు బావి వద్దకు చేరుకుని మృతదేహం కోసం రెండు గంటల పాటు వెతికి బయటకు తీశారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూ సి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కిషన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీహరిగౌడ్‌లు కోరారు.
జేసీబీ గుంతలో పడి మరొకరు
పటాన్‌చెరు టౌన్ : కాలకృత్యాలకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జేసీబీ గుం టలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నందిగామలో సోమవారం చోటు చేసుకుంది. బీడీఎల్ భానూర్ పోలీసుల కథనం మేర కు.. రాజస్థాన్ రాష్ట్రం బైరాన్ మండలం అసాక్ గ్రామానికి చెందిన జితేందర్‌సింగ్ (25) మండల పరిధిలోని నందిగామలో గల ఓ ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే పరిశ్రమలో ఉన్న ఓ గదిలో బంధువులతో కలిసి ఉం టున్నాడు. అయితే సోమవారం హోలీ పండుగ కావడంతో పరిశ్రమలో ఉండే తోటి బంధువులతో కలిసి హోలీ ఆడా డు.
అనంతరం చిన్నాన్న మహేందర్‌సింగ్, మామయ్య జితేందర్‌తో కలసి స్నా నానికి వెళ్లాడు. అయితే ముందుగా జితేందర్ సింగ్ కాలకృత్యాలకు వెళ్లాడు. అనం తరం జేసీబీ గుంతలో దిగి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందా డు. అయితే జితేందర్ ఎంత సేపటికీ రాకపోవడంతో బంధువులు అక్కడికి వె ళ్లి చూసి విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్‌ఐ ప్రసాద్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
విషాదాన్ని నింపిన హోలీ
Published Tue, Mar 18 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement