బాబు వ్యాఖ్యలపై బ్యాంకర్ల మండిపాటు!
విజయవాడ : సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని బ్యాంక్ అధికారులు చెప్పారు. విజయవాడలో మంగళవారం ఏబీఓసీ కృష్ణాజిల్లా శాఖాధికారులు మీడియాతో మాట్లాడుతూ...తమపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని సోమవారం సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల అసమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని బాబు అన్నారు (చదవండి : బ్యాంకర్ల వల్లే అవస్థలు)
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదికాదన్నారు. క్యాష్ కంట్రోల్ తమ చేతిలో ఉండదని ఆర్బీఐ నుంచి డబ్బును వచ్చినట్లుగా పంపిణీ చేస్తున్నామని బ్యాంక్ అధికారులు చెప్పారు.