వజ్రకరూరు: బంగారం తాకట్టుపెట్టి పొందిన రుణాలు రైతులు వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని లేకపోతే ఆభరణాలను వేలం వేస్తామని బ్యాంకు అధికారు లు ప్రకటించడంపై వైఎస్సార్‌సీపీ, బీజే పీ, మాలమహానాడు నాయకులు, రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం స్థానిక స్టేట్ బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ బంగారు వేలంపాట నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయారన్నారు.
ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయు డు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం తో రైతులు రుణాలను చెల్లించలేదన్నా రు. రైతులకు గడువు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిబంధనలను సడలించాలన్నారు. రైతు రుణాలతోపా టు బంగారు రుణాలన్నీ మాఫీచేయాల ని డిమాండ్‌చేశారు. ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలు స్తంభించా యి. బంగారు వేలం పాటను ఆపాలని ,రైతులకు కొత్తరుణాలు ఇవ్వాలని, ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావారణ బీమాను వెం టనే విడుదల చేయాలని నినాదాలు చేశా రు. బ్యాంకు మేనేజర్ వచ్చి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.
మేనేజర్ అక్కడకు చేరుకుని రైతులు, నాయకుల తో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని సూచించినట్లు ఆమె వివరించా రు. గడువు కావాలని కోరుతూ వినతిపత్రం అందచేస్తే ఉన్నతాధికారులకు పం పి తగిన నిర్ణయం తీసుకుంటామని మేునేజర్ వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బ్యాంకు వద్ద అతికించిన వేలం నోటీస్‌ను తొలగించా రు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వడ్డెరఘురాములు, మాలమహానాడు రాష్ట్ర ఉ పాధ్యక్షుడు మొలకబాల రామాంజి నేయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు చిన్నపులికొండ, రియాజ్, బెస్త నాగరా జు, సామాజిక కార్యాకర్త రామాంజనేయులు పాల్గొన్నారు. ఐఎంఎస్ ఉపాద్యక్షుడు కిరణ్, సుధాకర్, మాలమహానాడు నాయకులు మనోహర్, నరసింహులు, రామక్రిష్ణ, దళిత నాయకులు సదా,మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామాంజనేయులు మద్దతు పలికారు.
బంగారం వేలం ప్రకటనపై రైతుల ఆగ్రహం
Published Sun, Feb 1 2015 11:27 AM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM
Advertisement
Advertisement