‘ముద్ర’ రుణాలకు హామీ అవసరం లేదు | "mudra" is not required to guarantee loans | Sakshi
Sakshi News home page

‘ముద్ర’ రుణాలకు హామీ అవసరం లేదు

Published Mon, Mar 7 2016 3:36 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

"mudra" is not required to guarantee loans

ఎంఎస్‌ఎంఈడీసీఐ చైర్మన్ రామారావు

గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ముద్ర’ రుణాలు పొందేందుకు ఎలాంటి హామీలు అవసరం లేదని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బి.వి.రామారావు తెలిపారు. గుంటూరులోని ఆర్‌అండ్‌బీ ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో ఆదివారం  నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి హామీలు లేకుండానే రూ. 50 వేలు నుంచి రూ.10 లక్షల వరకు రుణా లు పొందవచ్చని తెలిపారు. బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వకుంటే తనకు ఫోన్ చేయాలని చెప్పారు. 9866649369, 8179422248లో ఎప్పుడు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. బ్యాంకు అధికారులకు రుణ దరఖాస్తు అందించిన వెంటనే రశీదు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement