mudra loans
-
ముద్ర లోన్ లిమిట్ పెంపు: రూ.10 లక్షల నుంచి..
2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించినట్లుగా.. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఏవై) కింద ముద్ర లోన్ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.నిధులు లేని వారికి నిధులు సమకూర్చే ముద్రా పథకం.. వారి వృద్ధి, విస్తరణను మరింత సులభతరం చేయడానికి లోన్ పరిమితిని రెట్టింపు చేయడం జరిగింది. ఇది రాబోయే వ్యవస్థాపకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బలమైన వ్యవస్థాపక పర్యావరణాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.'తరుణ్ కేటగిరీ' కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్ర లోన్ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. అంటే వీరు ముద్ర లోన్ కింద రూ. 20 లక్షల లోన్ తీసుకోవచ్చు. అంతే కాకుండా రూ. 20 లక్షల వరకు ఉన్న పీఎంఏవై లోన్ హామీ కవరేజ్.. మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) కింద అందించనున్నారు.ప్రధాన్ మంత్రి ముద్ర యోజనప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY) అనేది కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. ఈ లోన్స్ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్లు అందిస్తారు. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా లోన్స్ మంజూరు చేస్తాయి.పీఎంఏవై కింద లోన్స్ అనేవి పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం మొదలైన వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు మాత్రమే కాకుండా తయారీ, వ్యాపారం వంటి వాటికి కూడా అందిస్తారు. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఈ లోన్స్ చాలా ఉపయోగపడతాయి.Union Budget 2024-25 provides special attention to #MSMEs and #manufacturing, particularly labour-intensive manufacturing.👉New mechanism announced for facilitating continuation of bank credit to #MSMEs during their stress period👉Limit of #Mudra loans increased from ₹10 lakh… pic.twitter.com/wPbMvnwBhz— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024 -
చిరు వ్యాపారులకు రుణాల్లో భారీగా ఏపీ ‘ముద్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులకు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైంది. స్వయం ఉపాధి కోసం ముద్ర యోజన కింద ఎటువంటి పూచీ కత్తు లేకుండా రాష్ట్రంలో గత నాలుగేళ్లలోనే 44.63 లక్షల మందికి రూ. 49,313 కోట్ల మేర రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో అత్యధికంగా మహిళలకే మంజూరయ్యాయి. ఇప్పటికే చేస్తున్న వ్యాపారాలను మరింత విస్తరించడానికి లేదా కొత్తగా వ్యాపారం చేసేందుకు ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కోవిడ్ సమయంలో తిరిగి రాష్ట్రానికి వచ్చిన వారికి జీవనోపాధి కల్పించడానికి ముద్ర రుణాలను రాష్ట్ర ప్రభుత్వం విరివిగా ఇప్పించింది. గత మూడేళ్లుగా లక్ష్యానికి మించి చిన్న వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 135 శాతం మేర ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యం కాగా రూ.16,212 కోట్లను మంజూరు చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,838 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యమైతే రూ. 11,445 కోట్లు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని మించడం పట్ల ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల రుణాల రికవరీ బాగుందని, మహిళల రుణాల్లో నిరర్థక ఆస్తులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ముద్ర యోజన ద్వారా మహిళలు స్వయం ఉపాధి రంగంలో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ముద్ర కింద మూడు రకాల రుణాలను మంజూరు చేస్తున్నారు. శిశు పథకం కింద రూ. 50 వేల వరకు, కిశోర్ పథకం కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు, తరుణ్ పథకం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయి. టైర్ల ఫిట్ షాపుతో స్వయం ఉపాధి రాజమహేంద్రవరానికి చెందిన యోగిత సింహాచలం పీఎంఎంవై కింద పది లక్షల రూపాయల రుణం తీసుకుని పరమేశ్వర బెస్ట్ ఫిట్ టైర్ షాపు ఏర్పాటు చేశారు. తొలుత ఒక్కరితో ప్రారంభమైన ఆ షాపులో తరువాత మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కార్లకు టైర్లు ఫిట్ చేస్తున్నామని, త్వరలోనే మరింత విస్తరించడం ద్వారా మరో పది మందికి కూడా ఉపాధి కల్పిస్తామని సింహాచలం పేర్కొన్నారు. కర్టెన్ డిజైనర్ యూనిట్ తిరుపతికి చెందిన సులోచన డిజైనింగ్‌పై ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోవాలనే ఆలోచనతో కెనరా బ్యాంక్‌లో తరుణ్ పథకం కింద రుణం కోసం ధరఖాస్తు చేసుకుంది. కెనరా బ్యాంకు రూ. 7.5 లక్షల రుణం మంజూరు చేసింది. దీంతో ఆమె కర్టెన్ డిజైనర్ పేరుతో యూనిట్‌ను ప్రారంభించింది. మైక్రో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో కర్టెన్ల రూపకల్పనతో పాటు గృహోపకరణాలను తయారు చేయడం ప్రారంభించింది. మరో ఐదుగురికి ఉపాధి కూడా కల్పించారు. -
పీఎం ముద్రా లోన్ కింద లక్ష రూపాయల రుణమా? నిజమా?
సాక్షి, ముంబై: సోషల్‌మీడియా వచ్చిన తరువాత అబద్దాలు, తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్ విస్తరణ బాగా పెరిగింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉంటూ నిజానిజాలను ఫ్యాక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా ముద్రా లోన్ స్కీం కింద లక్ష రూపాయల రుణం వస్తోందంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్‌ను ట్వీట్ చేసింది. ప్రధాన మంత్రి ముద్రా లోన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గురించిన లేఖ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీని ప్రకారం లోన్ అగ్రిమెంట్ ఫీజులో రూ. 1,750కి బదులుగా రూ. 1,00,000 రుణం అందింస్తోంది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చినదని, ఎన్ఆర్ఐ ఫండింగ్ స్కీమ్ కింద వడ్డీ రేటు 5 శాతం ఉంటుందని పేర్కొంది. అంతేకాదు పాక్షిక చెల్లింపులకు ఎటువంటి రుసుము ఉండదంటూ ఒక నకిలీ లేఖ వైరల్ అయింది. An approval letter claims to grant a loan of ₹1,00,000 under the 𝐏𝐌 𝐌𝐮𝐝𝐫𝐚 𝐘𝐨𝐣𝐚𝐧𝐚 on payment of ₹1,750 as loan agreement charges #PIBFactCheck ◾️This letter is #Fake. ◾️@FinMinIndia has not issued this letter. Read more: 🔗https://t.co/cQ5DW69qkT pic.twitter.com/jKXEKbYupe — PIB Fact Check (@PIBFactCheck) January 30, 2023 అయితే ఈ లేఖను ఫ్యాక్ట్ చెక్ చేసి, పూర్తిగా నకిలీదని పీఐబీ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి సాయాన్ని దేన్నీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి లేఖను జారీ చేయ లేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ నకీలీదంటూ ట్వీట్ చేసింది. -
AP Government: ‘ముద్ర’ రుణాల్లో ప్రత్యేకముద్ర
సాక్షి, అమరావతి: ఎటువంటి తనఖా అవసరం లేకుండా సూక్ష్మ, చిన్న వ్యాపారులకు ఇచ్చే ‘ముద్ర’ రుణాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం మంచి పనితీరు కనబర్చింది. 2021–22 సంవత్సరానికి బ్యాంకులు లక్ష్యానికి మించి ముద్ర రుణాలు మంజూరు చేశాయి. 2021–22లో రూ.10,838 కోట్ల ముద్ర రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆరుశాతం అధికంగా రూ.11,445.42 కోట్ల రుణాలిచ్చాయి. మొత్తం 11,17,922 మంది ఖాతాదారులకు ఈ రుణాలను మంజూరు చేసినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం తాజా నివేదికలో పేర్కొంది. చదవండి: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ రాష్ట్రంలో లీడ్ బ్యాంక్‌గా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా రుణాలను మంజూరు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో కెనరా బ్యాంక్, ఎస్బీఐ, ఏపీజీబీ, ఏపీజీవీబీ ఉన్నాయి. రూ.2,075 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న యూనియన్ బ్యాంక్ రూ.2,251 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ అత్యధికంగా రుణాలిచ్చింది. ఈ బ్యాంకు రూ.317 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్దేశించగా రూ.302 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రైతులు, ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చే రుణాలపై ప్రత్యేకశ్రద్ధ చూపించడంతో లక్ష్యాన్ని మించి ముద్ర రుణాలను మంజూరు చేసినట్లు బ్యాంకింగ్ అధికారులు పేర్కొన్నారు. ముద్ర రుణం కింద రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. ఈ రుణాన్ని ఐదేళ్లలోపు చెల్లించాలి. దేశం మొత్తం మీద బ్యాంకులు 2021–22లో 5.37 కోట్ల ఖాతాలకు రూ.3,39,110.35 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. -
చిరు వ్యాపారులకు కేంద్రం శుభవార్త..!..త్వరలోనే..!
Small Cylinders in Ration Shops:చిరు వ్యాపారులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. త్వరలో రేషన్ షాపుల్లో చిరు వ్యాపారులకోసం అందుబాటులోకి తెచ్చిన ముద్రాలోన్ సేవల్ని రేషన్ షాపుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోనుంది. బుధవారం అంతర్ మంత్రిత్వ, అంతర్ రాష్ట్ర వర్చువల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే మాట్లాడుతూ.. కేంద్రం త్వరలోనే రేషన్ షాపుల్లో ముద్రాలోన్లతో పాటు ఇతర ఆర్ధిక సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు తెచ్చినట్లు తెలిపారు. వీటితో పాటు రేషన్ షాపుల్లో 5 కేజీల ఎఫ్టీఎల్(Free trade LPG) గ్యాస్ అమ్మకాల్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందు కోసం కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. 5.32 లక్షల రేషన్ షాపులు దేశ వ్యాప్తంగా 5.32 లక్షల రేషన్ షాపులు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 80 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుంది. అయితే త్వరలో కేంద్రం సిలిండర్ల రిటైల్ విక్రయాలతో పాటు రుణాలు,ఇతర ఆర్థిక సేవలను ప్రవేశపెట్టడం ద్వారా రేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. కేంద్రం నిర్వహించిన అంతర్ మంత్రిత్వ, అంతర్ రాష్ట్ర వర్చువల్ మీటింగ్‌లో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖతో పాటు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతినిధులు హాజరయ్యారు. రేషన్ వ్యవస్థను మరింత పట్టిష్టంగా మార్చే దిశగా కేంద్ర తెచ్చిన ప్రతిపాదనల్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతిచ్చాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. తనఖా లేకుండా 10లక్షల వరకు రుణాలు సామాజిక, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు, అట్టడుగు వర్గాలకు ఆర్థిక సమగ్రత, సహాయాన్ని అందించేందుకు కేంద్రం 2015 ఏప్రిల్ 8న ప్రధాన్‌మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పీఎంఎంవై కింద ఎలాంటి తనఖా లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, చిన్న ఆర్థిక సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు పొందవచ్చు. వ్యవసాయం అనుబంధ సంస్థలు, తయారీ, వాణిజ్యం, సేవల రంగాలలో ఆదాయం సృష్టించే చిన్న తరహా వ్యాపారాలకు ముద్ర రుణాలను మంజూరు చేస్తారు. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు, లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? -
ఆరేళ్లలో ముద్ర రుణాలు రూ.15 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గత ఆరేళ్లలో బ్యాంక్‌లు, వివిధ ఆర్థిక సంస్థలు ఉమ్మడిగా రూ.15 లక్షల కోట్ల ముద్ర రుణాలను మంజూరు చేశాయి. 28.68 కోట్ల లబ్ధిదారులకు ఈ రుణాల పంపిణీ జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020-21లో రూ.4.20 కోట్ల పీఎంఎంవై రుణాలు మంజూరయ్యాయి. రుణాల సగటు పరిమాణం రూ.52 వేలుగా ఉంది. దేశంలో ఎంటర్ప్రెన్యూర్ షిప్‌ను ప్రోత్సహించేందుకు 2015 ఏప్రిల్ 8న ప్రధాన్‌మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సామాజిక, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు, అట్టడుగు వర్గాలకు ఆర్థిక సమగ్రత, సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పీఎంఎంవై కింద ఎలాంటి తనఖా లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, చిన్న ఆర్థిక సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు పొందవచ్చు. వ్యవసాయం అనుబంధ సంస్థలు, తయారీ, వాణిజ్యం, సేవల రంగాలలో ఆదాయం సృష్టించే చిన్న తరహా వ్యాపారాలకు ముద్ర రుణాలను మంజూరు చేస్తారు. చదవండి: జియోకి స్పెక్ట్రమ్ అమ్మేసిన ఎయిర్టెల్! -
రూ. 3 లక్షలతో బిజినెస్ మొదలెట్టండి!
న్యూఢిల్లీ : మీరు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముద్ర లోన్ స్కీమ్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆదాయంతో పాటు ఉపాది కల్పించటానికి నిర్ధేశించబడిన ఈ పథకం చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించటానికి మార్గాలను సులభతరం చేస్తోంది. ప్రధాన మంత్రి ముద్ర యోజన( పీఎమ్ఎమ్వై) కింద బ్యాంకుల ద్వారా మీరు మీ వ్యాపారాలకు రుణాలు పొందవచ్చు. శిశు, కిశోర్, తరుణ్ విభాగాల కింద వ్యక్తులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటం జరుగుతుంది. మనం మొదలుపెట్టబోయే వ్యాపారానికి అయ్యే ఖర్చుని బట్టి ఈ మూడు విభాగాల్లో ఒకదాని కింద బ్యాంకులు మనకు రుణాలను ఇస్తాయి. ( ఇక ముద్రా ‘మొండి’ భారం..! ) 1) శిశు దీని రుణ పరిమితి రూ. 50వేల వరకు 2) కిశోర్ దీని రుణ పరిమితి రూ. 50వేలనుంచి రూ.5 లక్షల వరకు 3) తరుణ్ దీని రుణ పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 10లక్షల వరకు బిజినెస్ ఐడియాస్ ఈ క్రింది వ్యాపారాలను మొదలుపెట్టడానికి మీ చేతుల మీద నుంచి కొంత డబ్బు పెట్టుకుంటే మిగిలినది ముద్ర ద్వారా లోన్ పొందవచ్చు. ఈ వ్యాపారాలను ప్రారంభించటానికి మీ దగ్గర రూ. 3 లక్షలు ఉంటే సరిపోతుంది. 1) అప్పడాల తయారీ యూనిట్ దీనికోసం మీరు దాదాపు రూ.2లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం రూ. 8లక్షల దాకా రుణం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా 1.91లక్షలు సబ్సీడీ కూడా పొందవచ్చు. 2) లైట్ ఇంజనీరింగ్ యూనిట్ లైట్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన నట్లు, బోల్టులు, వాషర్లు, రివట్స్ల తయారీ యూనిట్ ప్రారంభించడానికి మీ దగ్గర రూ. 1.88లక్షలు ఉంటే చాలు. ఇందుకోసం మీరు ముద్ర ద్వారా రూ.2.21లక్షలు టర్మ్ లోన్‌గా, రూ. 2.30లక్షలు వర్కింగ్ కాపిటల్‌గా పొందవచ్చు. 3) కలప వస్తువుల తయారీ ఈ వ్యాపారం కోసం మీరు రూ. 1.85 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముద్ర ద్వారా రూ. 7.48లక్షలు రుణం పొందవచ్చు. 4) కంప్యూటర్ అసెంబ్లింగ్ ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి 30 శాతం ఖర్చు మీరు పెట్టుకుంటే మిగిలిన 70శాతం లోన్ ద్వారా పొందవచ్చు. ఇందు కోసం మీ దగ్గర రూ. 2.69లక్షలు ఉంటే చాలు. లోన్ ద్వారా రూ.6.29లక్షలు రుణం పొందే అవకాశం ఉంటుంది. -
ముద్రా రుణాలను జాగ్రత్తగా పరిశీలించాలి
ముద్ర రుణాల్లో పెరుగుతున్న మొండిబకాయిలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) కింద అనధికారిక రుణాలను విస్తరిస్తున్న బ్యాంకులు ఈ రుణాలను మరింత అప్రమత్తంగా పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం.కె.జైన్ సూచించారు. ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాలను ప్రస్తావిస్తూ బ్యాంకులు మదింపు దశలో రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యంపై దృష్టి పెట్టాలి, జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు. ముద్ర రుణాల ద్వారా చాలా కుటుంబాలను పేదరికంనుంచి బయటకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం. కానీ మొండిబకాయిలు పెరిగిపోతున్నాయని జైన్ వ్యాఖ్యానించారు. వీరికి రుణాలు ఇచ్చేసమయంలోనే బ్యాంకులు రీపేమెంట్‌కు సంబంధించి సరైన అంచనాలు వేసుకోవాలన్నారు. కాగా కార్పొరేట్యేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ సంస్థలకు రూ .10 లక్షల వరకు రుణాలు అందించడానికి పిఎంఎంవై 2015, ఏప్రిల్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఈ పథకం కింద ఎస్సీలు, ఎస్టీలు సహా 3.27 కోట్ల మంది స్వల్ప, చిన్న పారిశ్రామికవేత్తలకు రూ .7.28 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. -
‘ఆ లక్ష్యం నెరవేరాలంటే రూ లక్ష కోట్లు అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముద్ర రుణాల లక్ష్యం రూ 3 లక్షల కోట్లకు చేరువ కావాలంటే కేవలం ఒక నెల వ్యవధిలో బ్యాంకులు రూ లక్ష కోట్ల మేర ఈ తరహా రుణాలను జారీ చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 22వరకూ బ్యాంకులు రూ 2 లక్షల కోట్ల ముద్ర రుణాలను పంపిణీ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఇప్పటివరకూ 3.89 కోట్ల ముద్ర రుణాలను మంజూరు చేశాయి. 2018-19 బడ్జెట్ ప్రకారం ప్రభుత్వం మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరాంతానికి రూ 3 లక్షల కోట్ల ముద్ర రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు ముద్ర రుణాల పంపిణీలో లక్ష్యాలను అధిగమించాయి. 2015 ఏప్రిల్ 8న ప్రారంభించిన ముద్రా రుణ పథకం కింద వ్యవసాయేతర చిన్న పరిశ్రమలకు గరిష్టంగా రూ పది లక్షల వరకూ రుణాలను అందచేస్తారు. ముద్ర పథకం కింద ఇప్పటివరకూ రూ 7.23 లక్షల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని 2019-20 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
రూ. 3 లక్షల కోట్లతో బడ్జెట్ ‘ముద్ర’
సాక్షి, న్యూఢిల్లీ : స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముద్ర రుణాలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో పెద్దపీట వేశారు. ముద్ర పథకం కింద ఔత్సాహిక వాణిజ్యవేత్తలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు అందచేయనున్నట్టు ప్రకటించారు. నైపుణ్యాల అభివృద్దికీ భారీగా నిధులు వెచ్చించనున్నట్టు వెల్లడించారు. ఉపాధి రంగంలో ముద్ర పథకంతో పెనుమార్పులు చోటుచేసుకుంటాయన్నారు. విద్యారంగంలో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ. లక్ష కోట్లు కేటాయించారు. మత్స్యపరిశ్రమ, పశుసంవర్దక రంగాలకూ కిసాన్ క్రెడిట్ కార్డులు వర్తింపచేస్తామని చెప్పారు. -
మరో కేంద్ర పథకానికి ’పచ్చ’ ముద్ర
-
ముద్ర రుణాల పేరుతో బురిడీ
ఉదయగిరి : ముద్ర రుణాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఉదయగిరిలో గురువారం కొంత మంది యువకులు ఒక గ్రూపుగా ఏర్పడి పలువురిని బురిడీ కొట్టించారు. ఓ వాణిజ్య బ్యాంక్ ప్రతినిధులమని చెప్పుకుంటూ కొంత మంది గుర్తుతెలియని యువకులు కొద్దిరోజుల నుంచి ఉదయగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాలతో పాటు ిలో జనాలను నమ్మించారు. ఒక్కోక్కరి వద్ద నుంచి రూ.180 వంతున వసూలు చేశారు. ఈ క్రమంలో స్థానికులకు అనుమానం వచ్చి వారిని పట్టుకుని ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకెళ్లి అసలు విషయం వాకబు చేశారు. వీరు మోసగాళ్లని తెలియడంతో షాక్‌కు గురయ్యారు. వీరిని ఎంపీడీఓ వీరాస్వామి విచారించగా తమను ఏ సంస్థ నియమించలేదని చెప్పారు. దీంతో ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో వారు భయపడి మళ్లీ ఇలాంటి వాటికి పాల్పడమని, క్షమించి వదిలేయమని చెప్పడంతో మందలించి వదిలేశారు. -
సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలి
నెల్లూరు రూరల్ : మత్స్యకార సొసైటీలను ఏర్పాటు చేసుకొని, ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరాలని జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సీతారామరాజు సూచించారు. మత్స్యశాఖ కార్యాలయంలో ముద్ర రుణాలపై సొసైటీ సభ్యులకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్స్యపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గతేడాది 23.52 లక్షల చేపలు ఉత్పత్తయినా, వార్షిక తలసరి వినియోగం 9.5 కిలోల చేపల మేరే ఉందన్నారు. దీన్ని 13 కిలోలకు పెంచడం ద్వారా పోషకాహార లోపాలన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మార్కెట్లో తాజా చేపల అమ్మకం, ఎండు చేపల విక్రయం, హార్బరులో రిక్షాపై చేపల రవాణా, సంచార చేపల వాహనం, రిటైల్ దుకాణం, బతికిన చేపల అమ్మకం, ఎండు చేపల పరిశ్రమ, చేపల కియోస్క్, తదితర యూనిట్లను ముద్ర రుణాలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రావు మాట్లాడారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని సూచించారు. మత్స్యకార మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. రుణాలను సద్వినియోగం చేసుకుని, సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలన్నారు. మత్స్యశాఖ గూడూరు ఏడీ లక్ష్మీనారాయణ, ఎఫ్డీఓ చాంద్‌బాషా, కాలేషా, బీసీ కార్పొరేషన్ ఈడీ, బ్యాంకు అధికారులు, సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
‘ముద్ర’ రుణాలకు హామీ అవసరం లేదు
ఎంఎస్ఎంఈడీసీఐ చైర్మన్ రామారావు గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ముద్ర’ రుణాలు పొందేందుకు ఎలాంటి హామీలు అవసరం లేదని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బి.వి.రామారావు తెలిపారు. గుంటూరులోని ఆర్అండ్బీ ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఆదివారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి హామీలు లేకుండానే రూ. 50 వేలు నుంచి రూ.10 లక్షల వరకు రుణా లు పొందవచ్చని తెలిపారు. బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వకుంటే తనకు ఫోన్ చేయాలని చెప్పారు. 9866649369, 8179422248లో ఎప్పుడు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. బ్యాంకు అధికారులకు రుణ దరఖాస్తు అందించిన వెంటనే రశీదు తీసుకోవాలని సూచించారు.