![jaitly allocates rs 3 cr for mudra loans - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/1/mudra-final.jpg.webp?itok=dIX9KOSr)
సాక్షి, న్యూఢిల్లీ : స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముద్ర రుణాలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ముద్ర పథకం కింద ఔత్సాహిక వాణిజ్యవేత్తలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు అందచేయనున్నట్టు ప్రకటించారు. నైపుణ్యాల అభివృద్దికీ భారీగా నిధులు వెచ్చించనున్నట్టు వెల్లడించారు.
ఉపాధి రంగంలో ముద్ర పథకంతో పెనుమార్పులు చోటుచేసుకుంటాయన్నారు. విద్యారంగంలో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ. లక్ష కోట్లు కేటాయించారు. మత్స్యపరిశ్రమ, పశుసంవర్దక రంగాలకూ కిసాన్ క్రెడిట్ కార్డులు వర్తింపచేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment