![Banks Need To Lend Rs One Lakh Crore To Meet MUDRA Target - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/3/2000.jpg.webp?itok=AQY88AHW)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముద్ర రుణాల లక్ష్యం రూ 3 లక్షల కోట్లకు చేరువ కావాలంటే కేవలం ఒక నెల వ్యవధిలో బ్యాంకులు రూ లక్ష కోట్ల మేర ఈ తరహా రుణాలను జారీ చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 22వరకూ బ్యాంకులు రూ 2 లక్షల కోట్ల ముద్ర రుణాలను పంపిణీ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఇప్పటివరకూ 3.89 కోట్ల ముద్ర రుణాలను మంజూరు చేశాయి.
2018-19 బడ్జెట్ ప్రకారం ప్రభుత్వం మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరాంతానికి రూ 3 లక్షల కోట్ల ముద్ర రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు ముద్ర రుణాల పంపిణీలో లక్ష్యాలను అధిగమించాయి. 2015 ఏప్రిల్ 8న ప్రారంభించిన ముద్రా రుణ పథకం కింద వ్యవసాయేతర చిన్న పరిశ్రమలకు గరిష్టంగా రూ పది లక్షల వరకూ రుణాలను అందచేస్తారు. ముద్ర పథకం కింద ఇప్పటివరకూ రూ 7.23 లక్షల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని 2019-20 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment