2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా.. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఏవై) కింద ముద్ర లోన్ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నిధులు లేని వారికి నిధులు సమకూర్చే ముద్రా పథకం.. వారి వృద్ధి, విస్తరణను మరింత సులభతరం చేయడానికి లోన్ పరిమితిని రెట్టింపు చేయడం జరిగింది. ఇది రాబోయే వ్యవస్థాపకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బలమైన వ్యవస్థాపక పర్యావరణాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
'తరుణ్ కేటగిరీ' కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్ర లోన్ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. అంటే వీరు ముద్ర లోన్ కింద రూ. 20 లక్షల లోన్ తీసుకోవచ్చు. అంతే కాకుండా రూ. 20 లక్షల వరకు ఉన్న పీఎంఏవై లోన్ హామీ కవరేజ్.. మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) కింద అందించనున్నారు.
ప్రధాన్ మంత్రి ముద్ర యోజన
ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY) అనేది కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. ఈ లోన్స్ మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లు అందిస్తారు. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లు ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా లోన్స్ మంజూరు చేస్తాయి.
పీఎంఏవై కింద లోన్స్ అనేవి పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం మొదలైన వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు మాత్రమే కాకుండా తయారీ, వ్యాపారం వంటి వాటికి కూడా అందిస్తారు. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఈ లోన్స్ చాలా ఉపయోగపడతాయి.
Union Budget 2024-25 provides special attention to #MSMEs and #manufacturing, particularly labour-intensive manufacturing.
👉New mechanism announced for facilitating continuation of bank credit to #MSMEs during their stress period
👉Limit of #Mudra loans increased from ₹10 lakh… pic.twitter.com/wPbMvnwBhz— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024
Comments
Please login to add a commentAdd a comment