ముద్ర రుణాల పేరుతో బురిడీ
ముద్ర రుణాల పేరుతో బురిడీ
Published Fri, Sep 30 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
ఉదయగిరి : ముద్ర రుణాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఉదయగిరిలో గురువారం కొంత మంది యువకులు ఒక గ్రూపుగా ఏర్పడి పలువురిని బురిడీ కొట్టించారు. ఓ వాణిజ్య బ్యాంక్ ప్రతినిధులమని చెప్పుకుంటూ కొంత మంది గుర్తుతెలియని యువకులు కొద్దిరోజుల నుంచి ఉదయగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాలతో పాటు ిలో జనాలను నమ్మించారు. ఒక్కోక్కరి వద్ద నుంచి రూ.180 వంతున వసూలు చేశారు. ఈ క్రమంలో స్థానికులకు అనుమానం వచ్చి వారిని పట్టుకుని ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకెళ్లి అసలు విషయం వాకబు చేశారు. వీరు మోసగాళ్లని తెలియడంతో షాక్‌కు గురయ్యారు. వీరిని ఎంపీడీఓ వీరాస్వామి విచారించగా తమను ఏ సంస్థ నియమించలేదని చెప్పారు. దీంతో ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో వారు భయపడి మళ్లీ ఇలాంటి వాటికి పాల్పడమని, క్షమించి వదిలేయమని చెప్పడంతో మందలించి వదిలేశారు.
Advertisement
Advertisement