హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నేడు, రేపు (శుక్ర, శనివారం) బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయనున్నారు. ఈ రెండు రోజులు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు సాగవని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 శాతం వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్ తొలగింపు వంటి 11 డిమాండ్లతో కార్మిక శాఖ, కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని.. అందుకే సమ్మెకు సిద్ధమయ్యామని యూఎఫ్‌బీయూ తెలిపింది.
శుక్ర, శనివారాల్లో జరగనున్న సమ్మెలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్‌ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ, ఎన్‌ఓబీడబ్ల్యూ, ఎన్‌ఓబీఓ బ్యాంకింగ్ సంఘాలు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. గ్రామీణ బ్యాంకులు మాత్రమే సమ్మెలో పాల్గొనడం లేదని, మద్దతు మాత్రం తెలుపుతున్నట్లు ఆల్ ఇండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో మార్చి 11, 12, 13 తేదీల్లో కూడా సమ్మె ఉంటుందని యూఎఫ్‌బీయూ హెచ్చరించింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజు కూడా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలోనే పాల్గొంటారు. 2వ తేదీ ఆదివారం. అంటే వరుసగా 3 రోజులు బ్యాం కులు పనిచేయవు. పునఃప్రారంభం సోమవారమే.
Comments
Please login to add a commentAdd a comment