వైఎస్సార్ జిల్లా: ఏటీఎం కేంద్రాలు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారుతున్నాయి. ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం..సీసీ కెమెరాలు పనిచేయకపోవటంతో భద్రత డొల్లగా మారింది. దీంతో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్ శాఖ , బ్యాంకర్ల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. ఏటీఎం కేంద్రాల్లో చోరీలు యథేచ్ఛగా సాగి పోతున్నాయి.
వైఎస్‌ఆర్ జిల్లాలోని బద్వేల్‌లో పోరుమామిళ్ల రోడ్డులో గల ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో రూ.2.50 లక్షలు మాయమైయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులు బద్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు బ్యాంకు అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
బద్వేల్ ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో రూ.2.50 లక్షలు మాయం
Published Mon, Dec 9 2013 7:47 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement