ATM centers
-
ఏటీఎంలు ఎంత భద్రం?
ఉమ్మడి జిల్లాలోని 250 బ్యాంకుల పరిధిలో 500 ఏటీఎం వరకు ఉన్నాయి. ఇందులో కొన్ని ఏటీఎంలకు మాత్రమే ఒక్కో సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఈ లెక్క చాలు ఏటీఎంల భద్రత డొల్లతనానికి కొన్ని బ్యాంకులకు అయితే సెక్యూరిటీ సిబ్బంది లేరు. జిల్లాలోని కొన్ని ఏటీఎంలకు భద్రతా ప్రమాణాలు లేని అద్దె సెంటర్లలో నడిపిస్తున్నారు. గతంలో ఏటీఎంలలో చోరీలు జరిగినప్పుడు భద్రత పెంచుకోవాలని పోలీసులు సూచించినా మార్పు రాలేదు. ఖర్చు భారమనే సాకుతో బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. సాక్షి, మహబూబ్‌నగర్ : ఏటీఎంల వద్ద రక్షణ లేకుండాపోతుంది. ఫలితంగా దొంగతనాలు జరగడంతోపాటు డబ్బులు డ్రా చేసుకోవడానికి వచి్చన వారికి సైతం భద్రత కరువైంది. దీంతో ఏ ఏటీఎం వద్ద ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బ్యాంకులు నగదు ఉంచుతున్నాయే గాని.. వాటి దగ్గర రక్షణ కోసం అవసరమైన సెక్యూరిటీ గార్డులను నియమించడంలో పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దీంతో కొందరు దుండగులకు ఇవి మరోరకంగా ఉపయోగపడుతున్నాయి. మూడురోజుల కిందట జిల్లాకేంద్రంలోని రాజేంద్రనగర్ ఎస్బీఐ ఏటీఎంలో ఇద్దరు దొంగలు చోరీకి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు ఏటీఎం సంచరిస్తున్న వీడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో ఏటీఎంలలో దోపిడీ యత్నాలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏటీఎం వద్ద భద్రతపై ప్రత్యేక కథనం.. రూపాయి రూపాయి పొదుపు చేసుకోవడానికి పేదవారి నుంచి సంపన్న వర్గాల దాకా బ్యాంకింగ్ వ్యవస్థను నమ్ముకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 45 లక్షల మంది జనాభా ఉంటే అందులో 5 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు పొదుపు చేస్తున్నారు. అలాగే బ్యాంకుల్లో దాదాపు 30 లక్షల మంది ఖాతాదారులు నగదు పొదుపు చేస్తున్నారు. ఏటీఎంలలో, బ్యాంకులలో ప్రజాధనానికి రక్షణ కలి్పంచాల్సిన బ్యాంకుల ఎంత సురక్షితమనేది ఇప్పుడు.. ఖాతాదారుల్లో ఈమాత్రం భయాందోళనలు సహజమే. ఏటీఎంలు వచ్చాక ఇంట్లో.. జేబుల్లో నగదు నిల్వ చేసుకోవడం మరిచిపోయారు. అందుకే దొంగలు సైతం తమ పంథా మార్చుకున్నారు. ఇళ్లలో నగదు లభించదని గుర్తించి ఏకంగా ఏటీఎంలు లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. బ్యాంకులపై ఆధారపడుతున్న ఖాతాదారుల సంఖ్య పెరిగిన కొద్దీ కరెన్సీ ఖజానాకు భద్రత కలి్పంచాల్సిన బ్యాంకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. శిక్షణ పొందిన భద్రత సిబ్బందిని నియమించడంలో కాసింత వెనుకడుగు వేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 250 బ్యాంకులున్నాయి. ఆయా బ్యాంకుల్లో రోజుకు రూ.200 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో అన్ని బ్యాంకుల బ్రాంచీలకు సంబంధించిన ఏటీఎంలు దాదాపు 500 వరకు ఉన్నాయి. ఆర్బీఐ నిబంధన ప్రకారం ప్రతి బ్యాంకులో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది, ప్రతి ఏటీఎం సెంటర్ వద్ద ఇద్దరు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నిబంధనలో ఉన్నా కొన్నిచోట్ల ఒక్కరూ ఉండటం లేదు. ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగింత ఉమ్మడి జిల్లాలోని అన్ని బ్యాంకుల వారి ఏటీఎంలో నగదు నిల్వ చేయడానికి ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. ఏటీఏం సెంటర్ల దగ్గర ఈ ఫ్రైవేట్ ఏజెన్సీ వాళ్లే సెక్యూరిటీ వాళ్లను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకు వారు పేర్కొంటున్నారు. వీరు మాత్రం బ్యాంకు వాళ్లే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలంటున్నారు. వీరిద్దరి మధ్య రాజీలేక ప్రజల సొమ్ముకు భద్రత లేకుండాపోతోంది. పట్టణ ప్రాంతాల్లో కాకుండా శివారు ప్రాంతాల్లో ఉండే ఏటీఎంలలో భారీస్థాయిలో నగదు తీసుకునే సమయంలో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. కార్డుదారులకెంత రక్షణ.. జిల్లాలో ఏటీఎం కార్డుదారులకు బ్యాంకు ఖాతాల సంఖ్యను మించిపోయారు. ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు ఏటీఎం కార్డుల్ని వినియోగిస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో బ్యాంకులు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే కేవలం అత్యవసర సమయంలో మాత్రమే కాకుండా ఎప్పుడు నగదు అవసరమైతే అప్పుడు ఏటీఎంలను ఆశ్రయించడం పరిపాటి. కానీ వీటిలో అందె రక్షణ చర్యలు కార్డుదారుల ప్రాణలమీదకి తెచ్చే ప్రమాదం లేకపోలేదు. జిల్లా కేంద్రంలో ఉన్న పలు ఏటీఎంలను ఉదాహరణగా తీసుకుంటే.. లోపల కేవలం సీసీ కెమెరాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా పలు సందర్భాల్లో పని చేయవు. ఇక ఏటీఎంల బయట సెక్యూరిటీ వ్యవస్థ ఉండనే ఉండదు. పాలమూరు జిల్లాకేంద్రంలో.. పాలమూరు పట్టణంలో ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకు, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియాన్ బ్యాంకు, యూనియన్, హెచ్డీఎఫ్సీ, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు తదితర 80 బ్యాంకుల బ్రాంచిలు ఉన్నాయి. ఆ బ్యాంకుల పరిధిలో 27 ఏటీఎం సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇందులో ఎస్బీఐ ఏటీఎంలు 13, ఆంధ్రాబ్యాంకు 5, ఇండియన్ 2, యాక్సిస్ 3, ఐసీఐసీఐ 2, ఒక్కో బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలు ఉన్నాయి. పట్టణం చివరగా ఏర్పాటు చేసిన కొన్ని ఏటీఎంలలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో భారీగా నగదు జమ చేసినప్పుడు భద్రత ఉండటం లేదు. ఏటీరెం సెంటర్లు బ్యాంకర్ల పరిధిలో కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో అసలు సమస్య తలెత్తుతోంది. ఏజెన్సీ వాళ్లు చూసుకోవాలి.. జిల్లాకేంద్రంలో ఉన్న పలు ఏటీఎం సెంటర్లను ఏజెన్సీ వాళ్లకు అప్పగించాం. వాటిలో డబ్బులు వేయడం, ఇతర వ్యవహారాలు అన్నీ వారే చేస్తున్నారు. ఏటీఎం దగ్గర సెక్యూరిటీలను ఏర్పాటు చేయడం కూడా ఏజెన్సీ వాళ్లే చూసుకోవాలి. – కృష్ణమూర్తి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్, మహబూబ్‌నగర్ పెట్రోలింగ్ చేస్తున్నాం.. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో పలుమార్లు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ప్రధానంగా బ్యాంకుల నుంచి ఆయా ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు, రక్షణ కోసం సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. పోలీస్ శాఖ నుంచి రక్షణ చర్యలు తప్పక ఉంటాయి. – వెంకటేశ్వర్లు, ఏఎస్పీ, మహబూబ్‌నగర్ -
ఏటీఎంల వద్ద జాదుగాడు
గద్వాల క్రైం: నగదు కోసం ఏటీఎం సెంటర్ల వద్దకు ఖాతాదారులు నిత్యం వెళ్తుంటారు. అయితే కొందరు ఖాతాదారులకు నగదు డ్రా చేసుకునే విషయంలో మిషన్‌పై అవగాహన లేకపోవడంతో ఇతరుల సహాయంతో కోరడం కనిపిస్తుంది. ఇదే అదునుగా భావించిన జాదుగాళ్లు ఖాతాదారుల బలహీనతను లక్ష్యంగా చేసుకుని పలువురి ఖాతాలోంచి నగదు కొల్లగొట్టిన సంఘటన గద్వాలలో చోటు చేసుకుంది. ఇటీవల ధరూరు మండలం ఉప్పేరుకు చెందిన ఓ ఖాతాదారుడు నగదు విత్‌డ్రా చేసేందుకు గద్వాలలోని ఎస్బీహెచ్ఎ ఏటీఎంకు వెళ్లాడు. అయితే నగదు డ్రా చేయడం తెలియకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సహాయం చేస్తానని నమ్మబలికి సదరు వ్యక్తికి సంబంధించిన ఏటీఎం కార్డు, పిన్ నంబర్ తీసుకొని నగదు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత డబ్బులు రావడం లేదని ఖాతాదారునికి చెప్పి.. జాదుగాడు తన వద్ద ఉన్న మరో ఏటీఎం కార్డును చేతిలో పెట్టాడు. ఖాతాదారుడు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.8,500 నగదు డ్రా చేశాడు. దీంతో అసలు ఖాతాదారుడు నగదు డ్రా చేయకుండానే తన ఫోన్‌కు నగదు డ్రా చేసినట్లు గుర్తించి వెంటనే బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి తన కార్డును బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పలువురు వ్యక్తుల అమాయకత్వాన్ని అదునుగా భావించిన జాదుగాడు ఇదే తరహాలో మోసం చేసేందుకు పలు ఏటీఎంల వద్ద మాటు వేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం పట్టణంలోని అదే ఏటీఎం వద్ద నగదు డ్రా చేసుకునేందుకు గద్వాల మండలం కుర్వపల్లికి చెందిన ఓ ఖాతాదారు రాగా.. అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇలా వెలుగులోకి.. కుర్వపల్లికి చెందిన వ్యక్తి తన ఖాతాలోంచి నగదు డ్రా చేసినట్లు తెలుసుకుని ఉప్పేరుకు చెందిన ఖాతాదారుని నిలదీశాడు. అయితే తన ఖాతాలోంచి నగదు డ్రా అయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు మోసపోయామని గమనించారు. అయితే ఇక్కడే జాదుగాడు ఒకరికి తెలియకుండా మరొకరి ఏటీఎం కార్డుల ద్వారా నగదు బదిలీ చేయడం కొసమెరుపు. దీంతో పోలీసులు సైతం ఆ కేసును ఛేదించాలనే లక్ష్యంతో బ్యాంకుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇదో సినిమాను తలపించేలా ఉంది. ఇక ముందు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఒక వేళ ఫిర్యాదు చేయకుండా ఉంటే తనే దొంగగా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. అతి తెలివి ప్రదర్శించి.. జాదుగాడు అత్యంత తెలివిని ప్రదర్శించి ముందు మోసం చేసిన వ్యక్తి ఖాతాలోకి కుర్వపల్లికి చెందిన ఖాతాదారుని అకౌంట్లోంచి కొంత నగదు బదిలీ చేశాడు. అయితే ఖాతాలో కొంత నగదు డిపాజిట్ కావడంతో ఉప్పేరుకు చెందిన వ్యక్తి కాస్త అయోమయానికి గురయ్యాడు. అయితే కుర్వపల్లికి చెందిన సదరు ఖాతాదారు బ్యాంకు అధికారులకు నగదు డ్రా అయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం తెలుసుకుని ఉప్పేరుకు చెందిన వ్యక్తిపై కుర్వపల్లికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఫిర్యాదుదారుడే దొంగ
సాక్షి, విశాఖపట్నం : వ్యసనాలకు బానిసై... భారీగా అప్పులు చేసి... వాటిని తీర్చేందుకు పనిచేస్తున్న సంస్థకే పంగనామాలు పెట్టేందుకు సిద్ధమైన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తనపై దుండగులు దాడి చేసి రూ.20 లక్షలు దోచుకుపోయారంటూ నగర పోలీసులను పరుగులు పెట్టించిన నారావుల శ్రీనివాసరావే అసలు నిందితుడని, దోపిడీ అంతా నాటకమని నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఆర్కే మీనా శనివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన నారావుల శ్రీనివాసరావు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని సిటీ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో 12 ఏళ్లుగా క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ పని మీద హైదరాబాద్ వెళ్లిన శ్రీనివాసరావు చేతికి ఆ సంస్థ యజమాని పూర్ణేంద్ర రూ.19లక్షల నగదు ఇచ్చాడు. వాటికితోడు గాజువాకలోని బ్యాంకులో ఒక రూ.లక్ష విత్‌డ్రా చేసి విశాఖపట్నంలో ఉన్న అభిషేక్ కంపెనీ యాజమాన్యానికి అందజేయాలని ఆదేశించాడు. అక్కడి నుంచి రూ.19లక్షలు తీసుకుని బుధవారం(ఈ నెల 7న) ఉదయం విశాఖపట్నం వచ్చిన శ్రీనివాసరావు గాజువాకలోని బ్యాంకులో రూ.లక్ష డ్రా చేసి మొత్తం రూ.20లక్షలు తన స్కూటీ డిక్కీలో పెట్టాడు. ఆ డబ్బులు నగరంలోని అభిషేక్ కంపెనీ కార్యాలయంలో అందించేందుకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరాడు. అనంతరం పోర్టు రహదారిలో స్కూటీపై వెళ్తుండగా ఆర్సీపీఎల్ కంపెనీకి ఎదురుగా దుండగులు దాడి చేసి రూ.20లక్షలు దోచుకుపోయారని పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే తాను ఇబ్బందుల్లో ఉన్నట్లు తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. దాడి జరిగినట్లు నమ్మించేందుకు తనే తనపై బ్లేడుతో గాయపరుచుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఎయిర్‌పోర్టు జోన్ క్రైమ్ పోలీసులకు శ్రీనివాసరావు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో లోతుగా ఆరా తీశారు. సిటీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ సొమ్ము రూ.20లక్షలు కాజేసేందుకు తానే నాటకం ఆడినట్లు అంగీకరించాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు శరీరంపై గాయాలు చేసుకుని, దుస్తులు చింపుకున్నట్లు ఒప్పుకున్నాడు. వ్యసనాలకు బానిస కావడంతో భారీగా అప్పులు చేశానని, వాటిని తీర్చేందుకు ఈ డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. అందరినీ నమ్మించేందుకు తనను తానే బ్లేడ్‌తో కోసుకుని తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నారావుల శ్రీనవాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని సీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ స్వరూప, తదితరులు పాల్గొన్నారు. ఏటీఎం కేంద్రాల్లో జాగ్రత్త నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో నగదు విత్‌డ్రా చేసేటప్పుడు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సీపీ ఆర్కే మీనా సూచించారు. కేంద్రాల్లో దుండగులు కాచుకుని ఉంటున్నారని, అటువంటి వారితో జాగ్రత్తలు పాటించాలఅన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినా, దోపిడీ జరిగినా 100 నంబర్‌కి ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. డీసీపీ ఉదయ్‌భాస్కర్ బిల్లా, ఏడీసీపీ సురేష్‌బాబుల సూచల మేరకు కేసు దర్యాప్తు చేపట్టి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విశాఖ సిటీ క్రైం సీఐలు అవతారం, ఎన్.కాళిదాస్‌లతోపాటు ఎస్సైలు మన్మథరావు, సూరిబాబు, విజయ్‌కుమార్, హెచ్‌సీ మురళి, కానిస్టేబుల్ సుధాకర్‌లను అభినందించి రివార్డులు అందించారు. -
మళ్లీ మొదటికొచ్చిన నగదు సమస్య
= ఏటీఎంల్లో నగదు లేక ఖాతాదారుల ఇబ్బందులు = నగదు డ్రా కోసం వెళ్తే పది రూపాయల కాయిన్స్ ఇస్తున్న బ్యాంకర్లు కంభం : బ్యాంకుల్లో సరిపడా నగదు లేక.. ఏటీఎం సెంటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో 11 ఏటీఎం సెంటర్లు ఉన్నా నగదు లేక అవి నిరుపయోగంగా ఉన్నాయి. నెల రోజులుగా ఒకటి.. రెండు ఏటీఎం సెంటర్లు మినహా మిగిలిన ఏటీఎంలు పని చేసిన దాఖలాలు లేవు. అవి కూడా అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేదు. కేవలం కొద్ది మొత్తంలో నోట్లు ఉండగా మిగిలిన వారికి పది రుపాయల కాయిన్స్ ఇస్తున్నారు. దీంతో ఖాతాదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రూ.10 వేలు, రూ.20 వేలు విత్‌డ్రా తీసుకున్న వారు ఆ కాయిన్లు తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకూ నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేమో చిల్లరను నోట్లుగా మార్చుకోవాల్సి వస్తోంది. దుకాణాల్లో ఎక్కువ చిల్లర ఇస్తే తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. బ్యాంకులతో పాటు ఎస్బీఐ ఖాతాదారుల సేవా కేంద్రాల్లో సైతం పది రుపాయల కాయిన్స్ విత్‌డ్రాగా ఇస్తున్నారు. నగదు అవసరమై గురువారం బ్యాంకుకు వెళ్లి రూ.20 వేలు విత్‌డ్రా చేసా. అన్నీ పది రూపాయల కాయిన్స్ ఇచ్చారు. దాదాపు పది కేజీల పైన బరువు ఉన్నాయి. వీటిని ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు. --- చెన్నకేశవులు, కంభం బ్యాంకులో నగదు అందుబాటులో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. నగదు ఉన్నంత వరకూ ఇచ్చేస్తున్నాం. పది రూపాయల కాయిన్లు కొంతమేర ఉండటంతో వాటిని ఖాతాదారులకు అందిస్తున్నాం. --- రాఘవులు, ఎస్బీఐ మేనేజర్, కంభం -
ఆర్బీఐ షాక్:ఏటీఎంలకు మంగళం!
-
ఎనీటైమ్.. క్యాష్ కొంచెమే..
- ఏటీఎం కేంద్రాల కుదింపు.. పరిమితంగా నగదు - రూ.10 వేల ‘డ్రా’కే పరిమితం చేసే యోచనలో రిజర్వు బ్యాంకు - ఇప్పటికే బ్యాంకులకు మౌఖిక ఆదేశాలు.. కొత్త ఏటీఎంల ఏర్పాటు వద్దని సూచన - ఖాతాదారులను డిజిటల్ వైపు మళ్లించాలంటున్న ఆర్బీఐ.. ప్రైవేటు బ్యాంకులే తొలి టార్గెట్! - ఏప్రిల్ రెండో వారంలో స్పష్టత వస్తుందంటున్న బ్యాంకర్లు - గత ఐదు మాసాలుగా పనిచేయని ప్రభుత్వ బ్యాంకుల ఏటీఎంలెన్నో! సాక్షి, హైదరాబాద్ వీలైనంత మేరకు ఏటీఎం కేంద్రాలను కుదించుకోవాలని, అవసరం లేని చోట్ల మూసి వేయాలని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించింది. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేదాకా ఏటీఎంల్లో నగదును నింపవద్దని, కొన్ని ఏటీఎంలలో మాత్రమే పరిమితంగా నగదు ఉంచాలని ఫిబ్రవరి రెండో వారంలోనే సూచించినట్లు సమాచారం. అందువల్లే ఫిబ్రవరి చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం ఏటీఎంలు పనిచేయడం మానేశాయి. అక్కడక్కడా ఏటీఎంలలో నగదు పరిమితంగా లోడ్ చేస్తుండటంతో గంటలోపే ఖాళీ అవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు పరిస్థితి కాస్త కుదురుకున్నాక.. ఫిబ్రవరి చివరి వారం దాకా ఏటీఎంల్లో నగదుకు పెద్దగా ఇబ్బంది ఏర్పడలేదు. అయితే ఏటీఎంలలో నగదు విత్‌డ్రా పరిమితిని ఎత్తేస్తున్నామని ప్రకటించిన రిజర్వు బ్యాంకు... వాటికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని, అప్పటిదాకా ఏటీఎంల్లో నగదు ఉంచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకర్లకు అంతర్గతంగా సూచించింది. ఈ మేరకు బ్యాంకులు వాటికి అనుబంధంగా ఉండే ఏటీఎంలలోనూ డబ్బు లోడ్ చేయడం లేదు. ఆర్బీఐ లైసెన్స్ ఉండే ఏజెన్సీలు కూడా కొంతకాలంగా ఏటీఎంల్లో నగదు లోడ్ చేయడం లేదు. ఫలితంగా ఖాతాదారులు ప్రతి చిన్న అవసరానికి బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. పరిమితి రూ.10 వేలు? ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాదారులకు వారి ఖాతా నిర్వహణను బట్టి రూ.40 వేల నుంచి రూ.1.5 లక్షల దాకా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు గరిష్టంగా రూ.లక్షకు పరిమితం చేసినా ప్రైవేటు బ్యాంకులు రూ.1.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశమిచ్చాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులు దానిని రూ.10 వేలకు కుదించే అవకాశముంది. ఖాతాదారులెవరైనా రోజు రూ.10 వేలు మాత్రమే ఏటీఎంల నుంచి తీసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలు త్వరలో వెలువడతాయని, అప్పటిదాకా ఏటీఎంలలో డబ్బు లోడ్ చేయడంపై నియంత్రణ అమల్లో ఉందని ఎస్బీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘నోట్ల రద్దు’సమయంలో అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాకు ఎక్కువగా తోడ్పడిన ఎస్బీఐ ఏటీఎంలు ఇప్పుడు అసలు పనిచేయక పోవడం గమనార్హం. కొన్ని ఏటీఎంలలో మాత్రమే పరిమితంగా నగదు నింపుతున్నారు. మరోవైపు ఏటీఎంలలో నగదు కొరత, బ్యాంకు శాఖల్లో ఉచిత లావాదేవీలపై పరిమితి నేపథ్యంలో తమ వద్ద ఉన్న నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఖాతాదారులు వెనుకడుగు వేస్తున్నారు. డిజిటల్ వైపు మళ్లించడానికే.. ఖాతాదారులను డిజిటల్ వైపు మళ్లించడానికే ఆర్బీఐ ఈ ఆంక్షలు విధిస్తోందని... ఏప్రిల్ రెండో వారంలో దీనిపై స్పష్టత వస్తుందని ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక ఏటీఎంల కారణంగా తక్కువ సిబ్బందితో బ్రాంచీలను నెట్టుకొస్తున్నామని.. ఇప్పుడు ఖాతాదారులంతా బ్యాంకులకు వస్తే సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సి వస్తుందని, ఇది భారంగా మారుతుందని యాక్సిస్ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. రూ.10 వేలు అంతకంటే ఎక్కువ నగదు అవసరమయ్యేవారు బ్యాంకులకు రావడం మొదలుపెడితే తమ కౌంటర్లను పెంచుకోవాల్సి వస్తుందని సిండికేట్ బ్యాంకు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఐదు నెలలుగా పనిచేయని ఏటీఎంలు ఎన్నో.. నోట్ల రద్దు అనంతరం నవంబర్ పదో తేదీ తరువాత నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి సుమారు 1,500 ఏటీఎంలు తెరుచుకోనేలేదు. మరో వెయ్యి ఏటీఎంలు పనిచేస్తున్నా... కేవలం బ్యాలెన్స్ తెలుసుకోవడం, క్రెడిట్‌కార్డు, ఇతర బిల్లులు చెల్లించడం వంటి సేవలకే పరిమితం అవుతున్నాయి. దీంతో అనవసరంగా వేలకు వేలు అద్దె చెల్లించడం కంటే వాటిని మూసేయడమే మేలని భావిస్తున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారం నాటికి రిజర్వుబ్యాంకు నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడితే దానికి తగ్గట్టుగా చర్యలు చేపడతామని అంటున్నారు. -
కాసులకు కటకట
⇒ రూ.3,000 కోట్లు జిల్లాలో నెలకు కావాల్సింది ⇒ రూ.112 కోట్లు ఈ నెలలో రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చింది ఏటీఎం కేంద్రాల్లో నగదు లేక ఇక్కట్లు జిల్లాలో నోట్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, పింఛన్‌దారులు నగదుకోసం బ్యాంకుల వద్దకు వెళ్తే వారికి నిరాశే మిగులుతుంది. అధికశాతం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. గతేడాది నవంబరు 8వ తేదీ రాత్రి నుంచి పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో నగదు కోసం నానా తిప్పలు పడ్డారు. రెండు నెలల తర్వాత కొంత కుదుట పడింది. ప్రస్తుతం మళ్లీ అవే కష్టాలు పునరావృతమయ్యాయి. నెల్లూరు(సెంట్రల్): రిజర్వ్ బ్యాంక్ నుంచి సకాలంలో నగదు రాకపోవడంతో జిల్లాలో ప్రజలకు నగదు కష్టాలు పూర్తిగా తీరడంలేదు. దీంతో బ్యాంకుల్లో నగదు కట్టించుకోవడం తప్ప ఇచ్చే పరిస్థితి దాదాపుగా లేదు. రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుకున్నంత మొత్తం నగదు బ్యాంకులకు సరఫరా కాక పోవడంతోనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, కావలి, కోవూరు, నాయుడుపేట, నెల్లూరు, సూళ్లూరుపేటలలోని బ్యాంకులకు గతంలో రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా నగదు వచ్చేది. నోట్ల రద్దుతో ఈ బ్యాంకులకు నగదు రావడంలేదు. ఇవేగాక జిల్లా మొత్తంగా ఉన్న బ్యాంకులకు ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయిలో నగదు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన పట్టణాల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. ఇక గ్రామాలలోని వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇదే విధంగా నగదు రాకుండా ఉంటే తీవ్రమైన నగదు కొరత ఏర్పడే ప్రమాదముందని పలువురు బ్యాంకు అ«ధికారులే పేర్కొంటున్నారు. రూ.3 వేల కోట్లకు రూ.112 కోట్లు.. జిల్లాలో 424 బ్యాంకులు, 482 ఏటీఎం కేంద్రాలున్నాయి. రోజుకు అన్ని బ్యాంకుల్లో లావాదేవీలకు కనీసం రూ.100 కోట్లు అవసరం. అంటే నెలకు రూ.3 వేల కోట్లు కావాల్సి వస్తే ఇప్పటి వరకు జిల్లాకు వచ్చింది రూ.112 కోట్లు మాత్రమే. ఈ నెల 10వ తేదీ వరకు పరిశీలిస్తే మొత్తం రూ.వెయ్యి కోట్లు కావాల్సి ఉంది. అయితే రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చింది రూ.112 కోట్లు. ఈ విధంగా ఉంటే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పింఛన్, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ ఎలా పంపిణీ చేస్తారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల మొదటి వారం దాటినా ఇప్పటి వరకు చాలా మంది వారి జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉందంటే నగదు కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతోంది. దీంతోపాటు వ్యాపారులు, రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 95 శాతం ఏటీఎంలు మూత జిల్లాలో 482 ఏటీఎం కేంద్రాలున్నాయి. నగదు లేక పోవడంతో 95 శాతం ఏటీఎం కేంద్రాలు మూసి ఉన్నారు. నెల్లూరు నగరంలో అయ్యప్పగుడి నుంచి గాంధీబొమ్మ వరకు పరిశీలిస్తే రెండు మూడు మినహా ఎక్కడా ఏటీఎం కేంద్రాలు తీసిన దాఖలాలు లేవు. ఎస్బీఐ, ఎస్బీహెచ్ ఏటీఎంలు దాదాపుగా మూతపడి ఉన్నాయి. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కోవూరు, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జీతాలు తీసుకోలేని పరిస్థితి మొదటి వారం వచ్చినా జీతాలు తీసుకోలేని పరిస్థితి. నగరంలో ఎక్కడికెళ్లినా ఏటీఎం కేంద్రాలు మూసేసి ఉన్నాయి. కొన్ని ఉన్నా నో.. క్యాష్ బోర్డు పెట్టారు. బ్యాంకులకు వెళదామన్నా డబ్బులు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ ఇబ్బందులు నాకొక్కడికే కాదు. చాలా మంది ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. –వి.శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగి ఏటీఎంలు పనిచేయడం లేదు ఏటీఎంలలో నగదు ఉండటంలేదు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నా అవసరాలకు నగదు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడకు వెళ్లినా నోక్యాష్ బోర్డులు పెట్టి ఉన్నారు. మరో రెండు రోజులు సెలవులు ఉండటంతో నగదు కోసం ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. –భాస్కర్, కావలి, ప్రైవేట్ ఉద్యోగి ఆర్బీఐ నుంచి వస్తేనే ఆర్బీఐ నుంచి మాకు నగదు వస్తేనే బ్యాంకులకు సరఫరా చేయగలం. ప్రస్తుతం ఈ నెలలో కొద్దిగా మాత్రమే నగదు వచ్చింది. జిల్లాలోని బ్యాంకులకు నిత్యం లావాదేవీలు జరపాలంటే రోజుకు రూ.100 కోట్లు అవసరం ఉంటుంది. మార్చి నెల కావడంతో కూడా ఇబ్బందికరంగా ఉంది. ఉన్న కాస్త నగదును సర్దుబాటు చేస్తున్నాం. నగదు వచ్చేదాకా ఏమీ చేయలేని పరిస్థితి. –వెంకట్రావ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ -
నోటు కోసం కోటి కష్టాలు
సాక్షి, అమరావతి: వరుసగా మూడు రోజుల సెలవు తర్వాత మంగళవారం బ్యాంకులు తెరుచుకోవడంతో నగదు తీసుకోవడానికి జనం పోటెత్తారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీగా క్యూకట్టారు. ఇక్కడా అక్కడా అన్న తేడా లేదు.. పల్లెటూరు నుంచి పట్టణాల దాకా రాష్ట్రమంతా ఇదే విధమైన పరిస్థితి కనిపించిం ది. తెల్లవారకుండానే పలుచోట్ల క్యూలు కట్టారు. నగదు కోసం పనులన్నీ మానుకుని క్యూల్లో వేచి చూశారు. ‘ఈ రోజైనా డబ్బులు దొరికితే ఇబ్బందులు తొలుగుతాయి’ అని ఆశించా రు. అయితే చాలా మందికి ఆశ నిరాశగానే మారింది. కొంతమందికే నగదు చేతికి వచ్చింది. అదీ అరకొరగానే. ఒక్కో ఖాతాదారుడికి కొన్ని చోట్ల రెండు వేలు చొప్పున ఇస్తే.. మరి కొన్ని చోట్ల ఆరువేలు చొప్పున బ్యాంకర్లు పంపిణీ చేశారు. రాత్రి పొద్దు పోయేవరకూ క్యూల్లో నుంచున్నా చాలా మందికి ఆ కాస్త నగదు కూడా దొరకలేదు. పలు జిల్లాల్లో ఏటీఎంలు పనిచేయలేదు. ఏటీఎంలలో నగదు పెడతారేమోనన్న ఆశతో జనాలు అక్కడే కూర్చుండిపోవడం కూడా కనిపించింది. పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద గంటలకొద్నీ క్యూలైన్లలో నిలబడలేక అవస్థలు పడ్డారు. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. క్యూ లైన్లలో మహిళలదీ అదే పరిస్థితి. ఇక జీ తం డబ్బులు తీసుకుందామని బ్యాంకులకు వచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. సెలవు పెట్టి వచ్చినా నగదు చేతికిరాలేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేయని ఏటీఎంలు.. తూర్పుగోదావరి జిల్లాలో 931 ఏటీఎంలు ఉంటే.. మంగళవారం సాయంత్రం వరకూ ఒక్క ఏటీఎం కూడా పనిచేయలేదు. రాజమండ్రి వద్ద ఏటీఎంలో నగదు పెట్టిన గంటకే డబ్బు లు అయిపోవడంతో బ్యాంకుపై జనం ఎగబడ్డారు. దీంతో మేనేజర్ కొంత సమయం తీసుకొని తిరిగి నగదు నింపడంతో ప్రజలు శాంతించారు. అలాగే కర్నూలు జిల్లాలోని 475 ఏటీఎం ల్లో కేవలం రెండు మాత్రమే కొద్ది సేపు పనిచేశాయి. వైఎస్సార్ జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మినహా మరెక్కడా ఏటీఎంలు పనిచేయలేదు. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. పనిచేసిన ఏటీఎంల్లో రెండు వేల నోటు వస్తుండటంతో చిల్లర మార్చుకోలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కాగా, బ్యాంకులకు జనం భారీ ఎత్తున తరలిరావడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. అంతేగాక అదనంగా ప్రైవేటు సెక్యూరిటీ సేవలను వినియోగించుకున్నారు. కొనసాగుతున్న నగదు కొరత పెద్ద నోట్ల రద్దయి ఐదు వారాలు గడుస్తున్నా అటు బ్యాంకులకు, ఇటు ప్రజలకు కష్టాలు తీరడంలేదు. బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆర్బీఐ నుంచి అదనపు నిధులు రాకపోగా, ప్రజల నుంచి డిపాజిట్లు కూడా తగ్గిపోయాయి. కేవలం రెండు వేల నోట్లు తప్ప మిగిలిన చిన్న నోట్లు బ్యాంకులకు తిరిగి రావడం లేదని ఎస్బీఐ మేనేజర్ ఒకరు చెప్పారు. దీంతో ఇప్పటికీ కేవలం నాలుగు వేలు, ఆరువేలు మించి ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. శుక్రవారం వచ్చిన 20, 50 నోట్లను మంగళవారం మధ్యాహ్నానానికి అన్ని శాఖలకు పంపిణీ చేసినట్లు బ్యాంకర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నగదు మరో రెండు రోజులకు సరిపోతుందని, శుక్రవారం లోపు మళ్లీ నగదు వస్తే ఫర్వాలేదు కానీ, లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అర్థరాత్రి నుంచే క్యూలో.. వైఎస్సార్ జిల్లాలోని రాయచోటిలో సోమవారం రాత్రి నుంచే జనాలు బ్యాంకుల వద్దకు వచ్చి క్యూలైన్లలో నిద్రించారు. జిల్లాలో అక్కడక్కడ తోపులాటలు జరిగాయి. అయితే ఈ పరిస్థితిని ఊహించిన పోలీసులు ముందస్తుగా బ్యాంకుల ఎదుట బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో కొంతమేరకు ఒత్తిడి తగ్గింది. ప్రొద్దుటూరు మున్సిపల్‌కార్యాలయంలో పింఛన్ల పంపిణీ రసాభాసగా మారింది. ఐసీఐసీఐ బ్యాంకు చెందిన పంపిణీ సిబ్బంది రాకపోవడంతో పింఛన్‌దారులు ఆందోళన చేశారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు బ్యాంకు మేనేజర్లు తీవ్ర ఒత్తడి ఎదుర్కొంటున్నారు. ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. కర్నూలు నగర కేంద్రంలోని ట్రెజరీశాఖకు నగదు రాకపోవడంతో ఉద్యోగులందరూ బ్యాంకును చుట్టుముట్టారు. తాము జీతం ఇంత వరకూ తీసుకోలేదని మండిపడ్డారు. బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకునే దాకా పరిస్థితి వచ్చింది. అయితే, కేవలం మీ శాఖకు రూ.5 లక్షలు ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పడంతో తన వల్ల కాదంటూ మేనేజర్ బ్రాంచ్ నుంచి వెళ్లిపోయే పరిస్థితి. పలుచోట్ల ధర్నాలు గంటల తరబడి క్యూలో నిల్చొన్నాక బ్యాంకు అధికారులు వచ్చి చెల్లింపులకు డబ్బుల్లేవు, డిపాజిట్ చేసేవారే లోపలకి రండి అనడంతో ఖాతాదార్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మేము మనుషులమనుకుంటున్నారా.. యంత్రాలమనుకుంటున్నారా..’ అంటూ గుంటూరు జిల్లా రొంపిచర్ల ఎస్బీహెచ్ ఎదుట మంగళవారం వృద్ధులు, పింఛన్‌దారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఇదే జిల్లా యడ్లపాడు ఎస్బీఐ బ్రాంచి ఖాతాదారులు, పెన్షనర్లు జాతీయ రహదారి పైకి వెళ్లి రాస్తారోకో చేశారు. తుళ్లూరు మండలం పెద్దపరిమిలోలోనూ ఇదేపరిస్థితి నెలకొంది. స్థానిక చైతన్యగోదావరి బ్యాంకు ముందు ఉదయం నుంచి క్యూలో ఉన్న ఖాతాదార్లకు బ్యాంకు సిబ్బంది డబ్బుల్లేవని చెప్పడంతో ఆందోళనకు దిగారు. బ్యాంకు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు రివ్యూలో పాల్గొనేందుకు వస్తున్న ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ల వాహనాలను ఖాతాదార్లు అడ్డుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారికి డబ్బులు రాలేదని మేనేజర్ సమాధానం ఇవ్వటంతో ఖాతాదారులను శాంతింపజేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. డబ్బులు వస్తాయని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకొన్నారు. క్యూలైన్లో కుప్పకూలిన వృద్ధుడు జంగారెడ్డిగూడెం రూరల్: పింఛను సొమ్ము కోసం గంటలతరబడి క్యూలైన్లో నిల్చొన్న వృద్ధుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం కేతవరంలో మంగళవారం చోటు చేసుకుంది. బొర్రా వెంకట్రావు (65) అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామంలోని ఎస్బీఐ కియోస్క్ బ్రాంచికి వెళ్లి క్యూలో నిల్చొన్నాడు. కొద్దిసేపటికి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని ఆటోలో జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించాడు. క్యూలో సొమ్మసిల్లిన యువతి క్రోసూరు: ఇంటి ఖర్చుల కోసం నగదు తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన ఓ యువతి గంటల తరబడి క్యూలో నిలబడలేక సొమ్మసిల్లి పడిపోయింది. గుంటూరు జిల్లా క్రోసూరులోని ఎస్బీఐ బ్రాంచి వద్ద ఈ ఘటన జరిగింది. మంగళవారం పెద్దసంఖ్యలో జనం బారులుతీరడంతో బ్యాంకు సిబ్బంది లోపలికి కొంతమందిని అనుమతిస్తూ తలుపులు వేసుకొని పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూలో నిలుచున్న యువతి అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. మిగిలినవారు ఆమెకు సపర్యలు చేయటంతో తేరుకుంది. ఏటిఎంలో నగదు పెట్టం ‘ఏటీఎంలో నగదు పెట్టడం జరగని పని. నగదు పెట్టిన గంటలోపే ఖాళీ చేస్తున్నారు. పైగా అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డు దారులు వినియోగించుకొంటున్నారు. అందుకని కేవలం మా బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందించాలంటే బ్యాంకులోనే చెల్లింపులు చేయాలని నిర్ణయించాం. అంతకంటే మేమేమీ చేయలేం’ క్రోసూరు ఎస్బీఐ మేనేజర్ కిరణ్ కుమార్ కరాఖండిగా చెప్పారు. క్యూలో నిలవలేక... పిట్టలవానిపాలెం: నగదు కోసం బ్యాంకుకు వచ్చిన ఓ వృద్ధుడు క్యూలో నిలబడిన కొద్దిసేపటికే నీరసించి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకు శాఖ వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. మండలంలోని గోకరాజు నల్లిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన రిటైర్డు ఉద్యోగి నల్లిబోయిన సాంబయ్య పింఛను కోసం బ్యాంకు ముందు క్యూలో నిలబడ్డారు. కొద్దిసేపటికి నీరసించి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జన వేదన తిరగలేక చస్తున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఏటీఎంలలో ఎక్కడ డబ్బులొస్తున్నాయోనని తిరుగుతున్నా. ఏడు ఏటీఎంల వద్దకెళితే డబ్బులు రావడంలేదు. చివరికి ఇక్కడకొచ్చా. మూడు గంటలు నిలబడితే గానీ డబ్బులు రాలేదు. డబ్బుల కోసం నరకం చూస్తున్నాం. – రామారావు, గాంధీనగర్, విజయవాడ ఈ వయసులో ఈ బాధేంటి? ఈ వయసులో నాకు ఈ బా«ధేంటీ.. మంచంలో ఉన్న నేను ఇద్దరి సహకారంతో పింఛన్ కోసం బ్యాంక్‌కు రావాల్సి వచ్చింది. కాళ్లు, చేతులు సహకరించక అల్లాడుతున్న మాలాంటి వారిని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది. మా ఉసురు తగులుతుంది. – హుస్సేన్‌బీ, వృద్దురాలు, మాచర్ల, గుంటూరు జిల్లా పెళ్లికి డబ్బులివ్వకపోతే ఎలా? ఈ నెల 24న మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కోసం ముందుగా తెచ్చుకున్న రూ.లక్ష అనంతసాగరం సిండికేట్ బ్యాంక్‌లో జమ చేశాం. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే అంత మొత్తం ఇవ్వలేమంటున్నారు. మేము పెళ్లి ఎలా చేయాలో దిక్కు దోచటం లేదు. –షేక్ గుల్జార్, సోమశిల, నెల్లూరు జిల్లా జీతం కూడా తీసుకోలేకపోతున్నాం జీతం కూడా తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలకు సమయానికి వెళ్లడం తప్పనిసరి. బ్యాంకులేమో పది గంటలు అయితే తప్ప తెరుచుకోవడం లేదు. శుక్రవారం ఏటీఎం వద్ద క్యూలో నిలబడి రెండు వేలు తీసుకున్నా. మరలా ఈరోజు పాఠశాల ముగియడంతోనే వచ్చి క్యూలో నిల్చున్నా. నావంతు ఎప్పటికి వస్తుందో.. అప్పటిదాకా నోట్లు ఉంటాయో లేదో అర్థం కావడం లేదు. – రవి, ఉపాధ్యాయుడు, ఒంగోలు పెన్షన్ రాకపోతే ఇబ్బంది నాకు ప్రతినెలా రూ.14 వేలు పెన్షన్ వస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో రూ.2 వేలు ఇస్తున్నారు. మందులకు సరిపోని పరిస్థితి. నిత్యావసర సరుకులు, ఇతర ఖర్చులకు చాలా ఇబ్బంది పడుతున్నాం. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. – కావలి ఎర్రియ్య, రిటైర్డు ఉద్యోగి, పాలకొల్లు బతుకు దైవాధీనం పెద్ద నోట్ల రద్దు నుంచి బతుకు దైవాధీనంగా ఉంది. బ్యాంకుల్లో నోట్లు దొరుకుతాయో లేదో అన్నట్లు పరిస్థితి ఉంది. నేను విజయనగరంలో ఉండి పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్నాను. నాకు రోజుకు రూ.100, రూ. 200 అవసరమవుతాయి. ఇక్కడ బ్యాంకు ఖాతా లేకపోవడంతో ఏటీఎంకే వెళతాను. కానీ చాలా ఏటీఎంల్లో డబ్బులు ఉండడం లేదు. ఉన్న వాటిల్లో నుంచి రూ. 2000 నోటు వస్తోంది. ఆ నోటుకు చిల్లర దొరక్క అవస్థలు పడుతున్నాను. – బి.అప్పలనాయుడు, పెనసాం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా రెండు వేల నోటుతో పాట్లు రెండు వేలు కోసం ఏటీఎంల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. నేను మూడు రోజులుగా డబ్బులు అత్యవసరమై అమలాపురంలోని రెండు ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడ్డాను. నా వంతు రాకుండానే డబ్బులు అయిపోయాయి. మంగళవారం రెండు వేలు నోటు వచ్చింది. ఆ నోటును మార్చేందుకు మూడు గంటలు కష్టపడ్డాను. – డేగల నాగేంద్రబాబు, పేరూరు. అమలాపురం. పిల్లాడి ఫీజు కట్టాలని.. మా అబ్బాయికి ఎమ్‌ఫార్మసీ సీటు వచ్చింది. ఫీజు కట్టాలన్నా కట్టలేని పరిస్థితి. అక్కడేమో పాతనోట్లు తీసుకోరు. బ్యాంకుల్లో కొత్త నోట్లు ఇవ్వరు. సాధారణ ప్రజలకు ఇలాంటి కష్టాలు తగవు. గత మూడు రోజులుగా రాజాం వచ్చి ఏటీంలు ముందు నిలవడమే తప్ప క్యాష్ పొందలేని పరిస్థితి వచ్చింది. ఏటీఎంలు పని చేయక, బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటీ? – కంచరాపు వెంకటరమణ, రైతు, మేడమర్తి, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా ఈ కష్టం కంటే చావడం మేలు పింఛన్ డబ్బు కోసం వారం రోజు లుగా తిరుగుతున్నా. నడవలేని స్థితిలో ఉన్న నన్ను మా పక్కింటి వారు రిక్షాలో బ్యాంక్‌కు తీసుకొచ్చారు. ఇక్కడికి వస్తే విపరీతమైన జనా లు. డబ్బు ఎలా తీసుకోవాలో, ఎప్పుడిస్తారో అర్థం కావడం లేదు. మాలాంటి పేదలకు ఎందుకింత కష్టం?! ఈ కష్టాల కంటే దేవుడుపైకి తీసుకెళ్లినా బాగుండేది. – లక్ష్మక్క, మరువకొమ్మ కాలనీ, అనంతపురం రూ. 200 ఇచ్చి వేధిస్తున్నారు పింఛన్ డబ్బులో ఈ నెల ఒకటో తేదీన రూ. 200 ఇచ్చారు. రోజూ నేను బ్రహ్మంగారిమఠం నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి వెళుతున్నాను. చార్జీలకే డబ్బు అయిపోతోంది. మంగళవారం ఉదయం నుంచి క్యూలో కూర్చున్నాను. నా వంతు సాయంత్రం వచ్చింది. అయితే నాకు ఇవ్వలేదు. గతంలో నాకు పంపిణీ చేసిన సిబ్బంది ద్వారానే తీసుకోవాలని చెబుతున్నారు. ఆమె ఎప్పడు వస్తుంది. నాకు పింఛన్ ఎప్పుడు ఇస్తుందో అర్థం కావడం లేదు. – సుంకమ్మ, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లా -
పగలైనా.. రాత్రయినా.. పడిగాపులే!
-
పగలైనా.. రాత్రయినా.. పడిగాపులే!
ఎక్కడికెళ్లినా నో క్యాష్ బోర్డులే నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతుల రాస్తారోకో తిప్పర్తి: పెద్ద నోట్ల రద్దుతో నగదు కొరత తీవ్రంగా ఉండటంతో నల్లగొండ జిల్లాలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో నోక్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. తిప్పర్తి ఏపీజీవీబీ బ్యాంకులో వారం రోజులుగా డబ్బుల కొరత పీడిస్తోంది. ఒక్కో ఖాతాదారుడికి రూ.1,000 చొప్పున మాత్రమే అందజేస్తున్నారు. ఈ మధ్యనే ధాన్యం అమ్ముకున్న రైతులు రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. సరిపడా కొత్త నోట్లు రాలేదని బ్యాంక్ అధికారులు చెప్పడంతో ఆగ్రహానికి లోనైన రైతులు, ప్రజలు శనివారం నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై రాస్తారోకో చేశారు. పెళ్లికి పైసలివ్వండి సారూ మెదక్ మున్సిపాలిటీ: ‘మా నాన్న మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నారు. నా పెళ్లి కోసం బ్యాంకులో లోన్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాం. అయితే పోరుున నెల 9నుంచి పెద్దనోట్లు రద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రూ.4.80 లక్షలు (రూ.1000, 500నోట్లు) పట్టణంలో గల ఎస్బీహెచ్ బ్యాంకులోని మా నాన్న ఖాతాలో జమ చేశాం. ఇప్పుడు నాకు పెళ్లి సంబంధం కుదిరింది. ఇంట్లో చిల్లిగవ్వలేదు. అబ్బారుు వాళ్లు పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి ఎల్లుండి వస్తామని చెప్పారు. ఇప్పుడేం చేయాలో మాకు అర్థం కావడం లేదు. దీంతో మా డబ్బులను ఇవ్వాలని ఇన్చార్జి కలెక్టర్ సురేష్‌బాబును శనివారం కలసి మొర పెట్టుకున్నారు మెదక్ పట్టణం గోల్కొండ వీధికి చెందిన మున్సిపల్ కార్మికుడు బంజపల్లి పెంటయ్య కూతురు బాలమణి. వారంలో ఒకసారి రూ.24 వేలు మాత్రమే ఇస్తామంటున్నారని, మొత్తం డబ్బు వచ్చేలా ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. ‘చెప్పు’కో వంతు! బచ్చన్నపేట: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. డిసెంబర్ నెల ప్రారంభం కావడంతో.. అటు ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఇటు ధాన్యం అమ్ముకున్న రైతులు బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే ఓపిక లేక కొందరు తమ పాదరక్షలను నంబర్ కోసం క్యూలో పెట్టుకుంటున్నారు. ఇలాంటి దృశ్యమే బచ్చన్నపేటలోని సెంట్రల్ బ్యాంకు ఎదుట శనివారం కనిపించింది. వైద్యం అందక చిన్నారి మృతి మణుగూరు రూరల్: బ్యాంకుల్లో నోట్లు చేతికి రాక.. సకాలంలో వైద్యం అందక ఓ చిన్నారి ప్రాణాలు విడిచాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమితిసింగారానికి చెందిన నాగెల్లి నిర్మల, సైదులు దంపతుల కుమారుడు విజయ్(2) శుక్రవారం తండ్రితో కలిసి ట్రాలీ ఆటో లో వెళ్తుండగా.. అది బోల్తాపడింది. దీంతో విజయ్ తలకు తీవ్ర గాయాలయ్యారుు. తొలుత భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ఆపరేషన్ చేయాలని, దానికి రూ.50వేలు కట్టాలని వైద్యులు చెప్పా రు. తెలిసినవారిని అడిగినా రెండు మూడు వేల రూపాయలు కూడా సమకూరలేదు. డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పడంతో సకాలంలో బ్యాంకు నుంచి డబ్బులు రాక తన మనవడు మృతిచెందినట్లు ఏసోబు(జగ్గన్న) విలపిస్తూ చెప్పాడు. ఆపదలో కూడా బ్యాంకు వారు డబ్బులిచ్చేందుకు నిబంధనలు పెట్టడంవల్లే విజయ్ మృతి చెందాడని, దీనికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. చాయ్‌కి చిల్లర లేక చెక్కు! పెద్దపల్లి: పెద్దనోట్ల రదుతో చిల్లర వ్యాపారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని కమాన్ వద్ద దాస్ హోటల్లో స్నేహితులతో కలిసి చాయ్ తాగిన కొందరు యువకులు తమ వద్ద చిల్లర లేక పోవడంతో యజమాని దాస్‌కు రూ.35 చెక్కు రూపంలో ఇచ్చారు. రూ.2వేల నోటు ఇస్తే చిల్లర లేదనడంతో చెక్కు ఇచ్చినట్లు కొండి సతీష్, బండారి సునిల్, పడాల సతీష్, గుండ అరుణ్ వెంకటేశ్, శ్రీనివాస్ తెలిపారు. -
ఏటీఎంల వద్ద ఆందోళన చేస్తే చర్యలు: సవాంగ్
విజయవాడ: బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద రాజకీయపక్షాలు ఆందోళన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నగరంలోని ఏటీఎం కేంద్రాల వద్ద పరిస్థితులను పరిశీలించిన ఆయన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు ముందుగానే హెచ్చరికలు జారీచేశారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకే కాదు వ్యాపారులకు సమస్యలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులే విజయవాడ ఏటీఎం సెంటర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. నగరంలోని అన్ని ఏటీఎం సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం బారులు తీరారు. దాదాపు చాలా ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రూ.30 లక్షలకు మించి నగదును ఏటీఎం కేంద్రాల్లో ఉంచలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. రూ.2వేలకు మించి నగదు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో ఏటీఎం మెషీన్ నుంచి డబ్బు రావడం లేదని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఆందోళన చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధమని నగర సీపీ తెలిపారు. -
చుక్కలు చూపిన ఏటీఎంలు
-
చుక్కలు చూపిన ఏటీఎంలు
- ఎక్కడికెళ్లినా ‘నో క్యాష్’ బోర్డులు - అప్డేట్ కాని సాఫ్ట్వేర్.. కనిపించని రూ.2 వేల నోట్లు సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ‘ఔట్ ఆఫ్ సర్వీస్..’ ‘ఔట్ ఆఫ్ ఆర్డర్..’ ‘నో క్యాష్..’ ‘క్లోజ్డ్..’ రాష్ట్రంలో శుక్రవారం ఎక్కడ చూసినా ఏటీఎం కేంద్రాల వద్ద కనిపించిన బోర్డులివి! ఏటీఎంలు పనిచేయకపోవడంతో జనం నరకం చూశారు. అటు బ్యాంకులకు వెళ్తే బారులు.. ఇటు ఏటీఎంలకు వెళ్తే ‘నో క్యాష్’ బోర్డు లు చూసి తలలు పట్టుకున్నారు. వరుసగా మూడోరోజూ ‘నోటు’ కోసం అల్లాడారు. చిల్లర తిప్పలూ తప్పలేదు. హైదరాబాద్ తోపాటు కొన్ని పట్టణాల్లో అరకొరగా పని చేసిన ఏటీఎం కేంద్రాల్లో కేవలం రూ.100 నోట్లు మాత్రమే అందారుు. రూ.2 వేల నోటు జాడే కనిపించలేదు. జనం పోటెత్తడంతో అటు బ్యాంకులు కూడా చేతులెత్తేశారుు. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.4 వేలు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నా.. కరెన్సీ కొరతతో చాలాచోట్ల రూ.2 వేలు మాత్రమే చేతిలో పెట్టారుు. ఇక ఆసుపత్రుల్లో పాత నోట్లు చెల్లుతాయని కేం ద్రం స్పష్టంగా చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ‘పాత నోట్లు చెల్లవు..’ అంటూ ఏకంగా బోర్డులు పెట్టేయడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. మొత్తమ్మీద ‘కరెన్సీ ఎమర్జెన్సీ’నుంచి రాష్ట్రం ఇంకా తేరుకో లేదు. ఆర్థిక కార్యకలాపాలు గాడినపడలేదు. చిరు వ్యాపారాల నుంచి బడా షాపింగ్‌మాల్స్ వరకు లావాదేవీలు స్తంభించిపోయారుు. హైదరాబాద్‌లో ఏటీఎంలు పనిచేయక పోవడంతో శుక్రవారం ఒక్కరోజే రూ.300 కోట్ల లావాదేవీలు నిలిచిపోయారుు. బ్యాంకులు కిటకిట నోట్ల మార్పిడి, నగదు డిపాజిట్ చేసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకులు కిటకి టలాడారుు. నగదు మార్పిడి కేవలం రూ.4 వేల వరకే పరిమితం చేయడంతో అత్యవసర పనులు, వివాహలు వంటి శుభ కార్యాలు న్నవారు నానా అవస్థలు పడ్డారు. పోస్టాపీసుల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బ్యాంకులు, పోస్టా ఫీసుల వద్ద వందల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడంతో పలు చోట్ల తోపులాటలు చోటుచేసు కున్నారుు. డబ్బులు మార్చు కోవడానికి బ్యాంకుల్లో సహా యకులు లేకపోవడంతో దర ఖాస్తులు నింపడం రానివారు అనేక కష్టాలు పడుతున్నారు. నోట్ల మార్పిడికి వికారాబాద్ జిల్లాలో జనం అవస్థలు పడ్డారు. వికారా బాద్, తాండూరు, పరిగి, కొడంగల్ సెగ్మెంట్లలో బ్యాంకుల వద్ద ఉదయం నుంచే ప్రజలు క్యూ కట్టారు. చంటిపిల్లలతో వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్త నోట్ల పంపిణీ ప్రారంభించిన రెండు రోజులుకే సిద్దిపేట జిల్లాలో బ్యాంకులు చేతులెత్తేశారుు. కొన్ని బ్యాంకుల్లో గురువారానికే డబ్బు అరుు పోరుుంది. ఏటీఎంలలో చాలాచోట్ల వాటిలో డబ్బులే పెట్టలేదు. కరీంనగర్ జిల్లాలో కొన్ని బ్యాంకుల్లో కొత్త రూ.2 వేల నోటు అందిం చగా, చాలా బ్యాంకుల్లో రూ.100 నోట్లనే అందిస్తున్నారు. జిల్లాలో ఏటీఎంలు కూడా పని చేయలేదు. పోస్టాఫీసుల్లో ఖాతాలున్న నగదు జమ చేసినా.. కొత్త నోట్లు ఇంకా రాకపోవడంతో ఖాతాదారులకు ఇవ్వలేక పోతున్నారు. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. బార్లు, మద్యం దుకాణాలు వెలవెల బార్లు, మద్యం దుకాణాలు మందుబాబుల తాకిడిలేక వెలవెలబోతున్నారుు. హైదరాబాద్‌లో అమ్మకాల్లో సుమారు 40-50 శాతం వరకు కోత పడిందని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్య ప్రాంతాల్లోని బార్లు, మద్యం దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో మద్యం సరఫరా చేస్తున్నారు. ధర తక్కువ ఉండే చీప్ లిక్కర్ అమ్మకాల్లో 60 శాతం మేర కోతపడినట్లు పేర్కొన్నారు. మహానగరం పరిధిలో 500 మద్యం దుకాణాలు, మరో 571 బార్లుండగా.. అందులో సగం దుకాణాలకు గిరాకీ లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రిలో రద్దీ.. తోపులాట నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాయంత్రం వరకు ఏటీఎంలు పనిచేయలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్, మోటకొండూరుతోపాటు భువనగిరిలో పలుచోట్ల ఉదయం 11 గంటల నుంచి ఏటీఎంలు పనిచేశారుు. గుట్టలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగి అద్దాలు ధ్వంసమయ్యారుు. పోలీసులు కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అప్డేట్ కాని సాఫ్ట్వేర్ ఏటీఎం కేంద్రాలు పని చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మిషన్లలో నింపేందుకు పూర్తి స్థారుులో కొత్త కరెన్సీ రాకపోవడం ఒకటి. ఏటీఎం మిషన్లకు రూ.2 వేల నోటు కొత్త. అందులోని సాఫ్ట్వేర్ కొత్త నోటును గుర్తిం చే లా ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ చేయకుండా నోట్లు నింపినా ఫలితం ఉండదని అధికారులు చెప్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ నడుస్తోందని, పూర్తరుున తర్వాత ఏటీఎంలు పని చేస్తాయంటున్నారు. శనివారానికి సాఫ్ట్ వేర్‌ను అప్డేట్ చేస్తామని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో 45 రకా ల ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులవి 7 వేల ఏటీఎంలు ఉన్నట్లు అం చనా. కరెన్సీ కొరత, సాఫ్ట్వేర్ సమస్యల వల్ల శుక్రవారం 300 కోట్ల లావాదేవీలు ఆగిపోయాయని అధి కారులు అంచనా వేస్తున్నారు. అమాయకులకు టోకరా ఖిల్లాఘనపురం: పెద్ద నోట్ల మార్పిడి కోసం గంటలపాటు నిలబడి సామాన్యులు అలిసిపోతుంటే.. ఇదే అదునుగా తీసుకుని మోసగాళ్లు చేతివాటం ప్రదర్శించారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురంలో శుక్రవారం రెండు బ్యాంకుల వద్ద జనాలను మోసగించి రూ.66 వేలతో మోసగాళ్లు పరారయ్యారు. ఘనపురం ఆంధ్రా బ్యాంక్ వద్ద నోట్లు మార్చుకునేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. షాపురానికి చెందిన శాంతన్న రూ.16,500, సాముల వెంకటేశ్ రూ.15,500తో బ్యాంక్‌కు వచ్చారు. చదువు రాకపోవడంతో ఓచర్ రారుుంచుకునేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఆశ్రరుుంచారు. అతను ఓచర్ రాస్తానని నమ్మబలికి, నోట్లు లెక్కబెడుతానని రూ.32 వేలు తీసుకున్నాడు. తర్వాత వైట్ పేపర్ తెమ్మని శాంతన్నకు చెప్పాడు. అతను రాకపోవడంతో పిలుచుకొస్తానని చెప్పి ఆ దుండ గుడు జారుకున్నాడు. కొంతసేపటికి ఇద్దరు అతడి కోసం వెతికారు. కనిపించకపోవడంతో మోసపోయామని అర్థ మై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోళీపురం ఎస్బీహెచ్ లో నోట్లను మార్చుకునేందుకు సల్కెలాపురానికి చెందిన మాదాసు భద్రయ్య, నర్సమ్మ దంపతులు బ్యాంక్‌కు రాగా, భద్రయ్య క్యూలో నిల్చున్నాడు. ముందున్న వ్య క్తి భద్రయ్యతో మాట్లాడుతూ బ్యాంకు వద్ద ఇంతమందిమి లైన్ లో ఎండకు ఉన్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. పై అధికారులకు ఫోన్ చేస్తా ఓ రీచార్జ్ కార్డు తీసుకురమ్మని చెప్పాడు. తన లైను పోతుందని, తన డబ్బులు కూడా బ్యాంకులో వేయాలని కోరుతూ ఆ వ్యక్తికి భద్రయ్య రూ.34 వేల నగదు ఇచ్చి, కార్డు కోసం వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి సదరు వ్యక్తి పరారయ్యాడు. రెండ్రోజుల్లో పెళ్లి.. ఏం చేయాలి? ‘‘రెండ్రోజుల్లో నా కూతురు పెళ్లి ఉంది. నా దగ్గర రూ.1000, రూ.500 ఉన్నారుు. పెళ్లి సరుకులకు, ఏ పనికెళ్లినా పెద్ద నోట్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. నేనేం చేయాలి? బ్యాంకుకు వెళ్తే రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఉన్నత వర్గాలకంటే సామాన్యులే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. - మోడెం కొమరయ్య, గార్ల, మహబూబాబాద్ జిల్లా నోట్లు చెల్లక.. వైద్యం అందక పెద్ద నోట్లు చెల్లక.. చిల్లర లేక.. చివర కు వైద్యం అందక ఓ వృద్ధురాలు ఆందో ళనకు గురైంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన శివ్వమ్మ తీవ్ర కడుపు నొప్పితో శుక్రవారం వెల్దుర్తిలోని ఓ ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ చేరుుంచుకోవాలని డాక్టర్ చెప్పడంతో అక్కడికి వెళ్లింది. అక్కడ ఫీజు రూ.200కుగాను రూ.500 నోటిస్తే చెల్లదన్నారు. బ్యాంకుల్లో ఖాతా, గుర్తింపు కార్డు లేకపోవడంతో పెద్దనోటు చెల్లుబాటు కాక కడుపునొప్పితోనే ఇంటిముఖం పట్టింది. నేను బ్యాంకుల చుట్టూ ఎలా తిరగాలి ఈ నెల 20న డెలీవరీ కోసం డాక్టర్ సమయం ఇచ్చారు. ఆస్పత్రికి వెళ్తే రూ.500 నోట్లు తీసుకోవడం లేదు. నా వద్ద రూ.500 నోట్లు మాత్రమే ఉన్నారుు. బ్యాంకులో రోజు 4 వేలకు మించి డబ్బులు మార్పిడి చేయడం లేదు. ఎవరి అకౌంట్ ఉంటే వారే.. ఆధార్ కార్డుతో స్వయంగా వస్తేనే మార్పిడి చేస్తామంటున్నారు. కానీ.. నేను ఎటూ తిరగలేని పరిస్థితి ఉంది. - మమత, మంచిర్యాల -
విమానాల్లో వచ్చి ఏటీఎంలలో చోరీలు..
- ఏటీఎం కేంద్రాలను టార్గెట్ చేసిన ముఠా - ఢిల్లీ నుంచి విమానాల్లో వస్తూ ఇక్కడ నేరాలు - ఐదుగురిని అరెస్టు చేసిన సిటీ పోలీసులు హైదరాబాద్ : ఢిల్లీ కేంద్రంగా ముఠాగా ఏర్పడి విమానాల్లో హైదరాబాద్‌కు వస్తూ... ఇక్కడి వ్యక్తి సహాయంతో ఏటీఎం సెంటర్లు కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ముఠాను హబీబ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్‌లో స్థానికుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పశ్చిమ మండల డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు మంగళవారం వెల్లడించారు. వీళ్లు రెండు నెలల కాలంలో రూ.4.32 లక్షల మేర మోసం చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయని, బయటపడనివి ఇంతకు భారీగానే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. న్యూ ఢిల్లీకి చెందిన, ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న బిపిన్, సయ్యద్ అజారుద్దీన్, షేక్ అషద్ అలీ, ఇంతికాబ్ ఆలం, మహ్మద్ షాబాజ్ ఖాన్‌లతోపాటు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. నిత్యం విమానాల్లో ఢిల్లీ నుంచి వస్తూ సిటీలో ఉన్న ఐదు బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాలను టార్గెట్‌గా చేసుకున్నారు. సెక్యూరిటీగార్డులు లేని, ఒకే కేంద్రంలో రెండు మిషన్లు ఉన్న వాటిల్లోనే పంజా విసురుతున్నారు. ఐదుగురూ కలిసి వాటి దగ్గరకు వెళ్లి... ముగ్గురు బయట కాపుకాయగా, ఇద్దరు లోపలకు వెళ్తారు. మొదటి పంథాలో చిప్ మాదిరిగా ఉండే ప్లాస్టిక్ ముక్కను వినియోగించి ఏటీఎం మిషన్ పని చేయకుండా చేసి వినియోగదారులు కార్డు పెట్టి తీసేదాకా వేచి చూస్తారు. ఆపై సదరు మిషన్ పని చేయట్లేదని చెప్పి పక్కనే ఉన్న మిషన్ వినియోగించమంటారు. ఆ సమయంలో వారి పిన్ నెంబర్ తెలుసుకుంటారు. దీని ఆధారంగా మొదటి మిషన్‌ను వినియోగించి డబ్బు డ్రా చేస్తున్నారు. ఇక రెండో పంథాగా నిరక్షరాస్యులు, వృద్ధులతో పాటు ఏటీఎం వినియోగం తెలియని వాళ్లను ఎంచుకుంటున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాస్తూ అలాంటి వారికి సహాయం చేస్తున్నట్లు నటించి పిన్ నెంబర్ తెలుసుకుని డబ్బు డ్రా చేసి ఇస్తున్నారు. ఏటీఎం కార్డు తిరిగి ఇచ్చే సమయంలో దాన్ని మార్చేసి డూప్లికేట్ కార్డు అంటగడుతున్నారు. ఆపై సదరు కార్డు, తెలుసుకున్న పిన్ నెంబర్ సాయంతో డబ్బు డ్రా చేస్తున్నారు. ఈ రెండు పంథాల్లో పశ్చిమ మండల పరిధిలోని హబీబ్‌నగర్, ఆసిఫ్‌నగర్, ఎస్సార్‌నగర్‌ల్లో ఏడు నేరాలు చేసినట్లు రికార్డుల్లోకి ఎక్కాయి. పోలీసుల దృష్టికి రాకుండా రూ.10 వేల కంటే తక్కువ మొత్తాలు తస్కరించినవి దీనికి రెండు రెట్లు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. వీరి కదలికలపై సమాచారం అందుకున్న హబీబ్ నగర్ పోలీసులు మంగళవారం తాడ్‌బండ్ చౌరస్తాలోని ఏటీఎం కేంద్రం వద్ద వీరిని పట్టుకున్నారు. బిపిన్ పరారు కాగా... మిగిలిన ఐదుగురూ చిక్కారు. వీరి నుంచి రూ.1.5 లక్షల నగదు, సెల్ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.గోషామహల్ ఏసీపీ కె.రామ్‌భూపాల్‌రావు, హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్, డీఐలు ఆర్.సంజయ్‌కుమార్, ఎం.సుమన్కుమార్లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. -
దృష్టి మరల్చి చోరీలు..
పంజగుట్ట(హైదరాబాద్ సిటీ): ఏటీఎం సెంటర్ వద్ద కాపుకాసి... డబ్బు డ్రా చేసేందుకు వచ్చే వారికి సాయం చేస్తున్నట్టు నటించి.. వారి ఏటీఎం కార్డు మార్చేసి డబ్బు డ్రా చేసుకుపోతున్న ఓ పాతనేరస్తుడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.77 వేల నగదు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా వెల్ధుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన డి.సిద్దేశ్ (25) ఇంటర్ వరకు చదివి వ్యవసాయ పనులు చేసేవాడు. గ్రామంలో ఒకసారి ఏటీఎం సెంటర్‌కు నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏటీఎం మిషీన్ ఆపరేటింగ్ రాక తికమకపడుతుంటే సిద్దేశ్ అతనికి సాయం చేశాడు. ఇద్దరి ఏటీఎం కార్డులు ఒకే బ్యాంక్‌వి కావడంతో డబ్బులు డ్రా చేసే సమయంలో మారిపోయాయి. సిద్దేశ్ అకౌంట్ లో కేవలం రూ. 3 వేలు ఉండగా... గుర్తుతెలియని వ్యక్తి అకౌంట్లో రూ. 40 వేలు ఉన్నాయి. ఆ కార్డు పిన్ నెంబర్ తెలియడంతో సిద్దేశ్ ఆ డబ్బు డ్రా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇదే తరహా మోసాలు మొదలెట్టాడు. ఇదే కేసులో గతంలో కర్నూలులో అరెస్టై జైలుకెళ్లాడు. నగరానికి మకాం మార్చి... జైలు నుంచి బయటకు వచ్చాక తన మకాం నగరానికి మార్చాడు. ఎర్రగడ్డలో స్నేహితుడు లక్షీ్ష్మకాతం ఇంట్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. కాకినాడకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగేశ్వర్రావు తన కొడుకును కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం నిమ్స్‌లో చేర్పించాడు. ఫిబ్రవరి 3న నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించగా రాలేదు. అప్పటికే అక్కడ కాపుకాసిన సిద్దేశ్ తాను సాయం చేస్తానని కార్డు తీసుకుని, ఏటీఎం పిన్ తెలుసుకున్నాడు. నాగేశ్వర్రావు దృష్టి మరల్చి అతని ఏటీఎం కార్డుకు బదులు అదే బ్యాంక్‌కు చెందిన మరో కార్డు అతడి చేతిలో పెట్టి.. ఈ ఏటీఎంలో నగదు లేదు, వేరే ఏటీఎంకు వెళ్లి డ్రా చేయండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు. 15 నిమిషాల తర్వాత నాగేశ్వర్రావు కార్డుతో సోమాజిగూడలోని మరో ఏటీఎం నుంచి రూ.22 వేలు డ్రా చేశాడు. ఆ మరుసటి రోజే సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న నాగలక్ష్మి కార్డును కూడా ఇదే విధంగా మార్చేసి రూ. 30 వేలు డ్రా చేశాడు. ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే టాక్స్ పడుతుందని.... ఫిబ్రవరి 17న ఎస్సార్ నగర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు ప్రేమ్‌నగర్‌కు చెందిన బి.సూర్యనారాయణ అనే కూలీ రూ. 50 వేలు ఆన్లైన్ క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా తన స్నేహితుడి అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అక్కడే ఉన్న సిద్దేశ్ ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేస్తే ట్యాక్స్ పడుతుంది. నీ అకౌంట్లో ఉన్న నగదు పోతుంది. నా అకౌంట్లో నగదు ఉంది. అకౌంట్ టు అకౌంట్ మారిస్తే ట్యాక్స్ పడదు’’ అని నమ్మబలికాడు. దీంతో సూర్యనారాయణ తన వద్ద ఉన్న రూ. 50 వేలు సిద్దేశ్‌కు ఇచ్చాడు. సిద్దేశ్ తన బ్యాంక్ ఏటీఎం కార్డును మిషీన్లో పెట్టి మినీ స్టేట్మెంట్ తీసి దానిని సూర్యనారాయణకు ఇచ్చి నగదు ట్రాన్స్ఫర్ అయిపోయిందని నమ్మబలికాడు. చదువు రాని సూర్యనారాయణ నిజమే అనుకుని వెళ్లిపోయి.. కొద్దిసేపటి తర్వాత స్నేహితుడికి ఫోన్ చేసి వాకబు చేయగా డబ్బు రాలేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సూర్యనారాయణ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పట్టివేత... దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. బుధవారం రాజీవ్‌నగర్ ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సిద్దేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా... ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 77 వేల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దేశ్పై కర్నూలులో 3, గుత్తిలో 2, పంజగుట్టలో 2, ఎస్సార్ నగర్లో 1 మెత్తం 8 కేసులు ఉన్నాయని, ఇతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, డీఐ షేక్ జిలానీ, ఎస్సై శ్రీనివాస్ నిందితున్ని గుర్తించిన హోంగార్డు తిమ్మారెడ్డి పాల్గొన్నారు. -
రెండు ఏటీఎం కేంద్రాలపై దాడి
♦ మెదక్ జిల్లాలో తెగబడ్డ దోపిడీ ముఠా ♦ శివ్వంపేటలో రూ. 80 వేలు చోరీ ♦ నిజాంపేటలో విఫలయత్నం రామాయంపేట/పుల్కల్: మెదక్ జిల్లాలో ఏటీఎంలపై దోపిడీ దొంగలు మరోసారి తెగబడ్డారు. ఐదుగురు సభ్యులున్న ముఠా పుల్కల్ మండలం శివ్వంపేట, రామాయంపేట మండలం నిజాంపేటలోని టాటా ఇండిక్యాష్ ఏటీఎం కేంద్రాలపై గంటల వ్యవధిలో దాడి చేసింది. శివ్వంపేటలో దాదాపు రూ. 80 వేల నగదుతో ఉడాయించగా.. నిజాంపేటలో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లడానికి విఫలయత్నం చేసింది. వివరాలివీ.. పుల్కల్ మండలం శివ్వంపేటలోని ప్రధాన రహదారిపై గల ఇండిక్యాష్ ఏటీఎం కేంద్రంపై మంగళవారం అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు. గ్యాస్ కట్టర్‌తో మెషిన్‌ను ధ్వంసం చేసి రూ. 80 వేలు తస్కరించారు. గంటల వ్యవధిలో బుధవారం తెల్లవారుజామున 3.40 గంట లకు రామాయంపేట మండలం నిజాంపేటలోని ఏటీఎం కేంద్రంపై దుండగులు దాడి చేశారు. బొలెరో వాహనంలో వచ్చిన ఈ దుండగులు నేరుగా వాహనం నుంచే వైరు కనెక్షన్ తీసుకుని నిమిషాల మీద కట్టర్‌తో ఏటీఎంను కత్తిరించారు. ఈ అలికిడికి ఏటీఎం కేంద్రం భవనం పై గదిలో అద్దెకున్న సైనికుడు బెస్త సిద్దిపేట ఎల్లంతోపాటు ఇంటి యజమాని భూమాగౌడ్ నిద్రలేచి కిందికి వచ్చారు. ఏటీఎం కేంద్రంలోకి వైరు లాగి ఉండటాన్ని గమనించారు. వీరి రాకను గమనించిన దుండగులు.. సైనికుడు ఎల్లంపై రాయితో దాడిచేసి వాహనంలో పారిపోయారు. ఆ వెంటనే ఎల్లం 100 నంబర్‌కు ఫోన్‌చేసి పోలీస్ కంట్రోల్ రూమ్కుసమాచారమిచ్చాడు. సైనికుడు, ఇంటి యజమాని సకాలంలో రాకపోతే దుండగులు డబ్బు ఎత్తుకెళ్లేవారు. ఏటీఎంను కట్టర్‌తో కత్తిరించినా డబ్బులు భద్రంగానే ఉన్నాయని పోలీ సులు తెలిపారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాల కోసం ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సుమతి రెండు చోట్ల ఏటీఎం కేంద్రాలను సందర్శించారు. ధ్వంసమైన ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మూడు నెలల క్రితం ఇలాగే... ఇదిలావుంటే మూడు నెలల క్రితం ఇదే తరహాలో దుండగులు ఒకేరోజు మూడు ఏటీఎం కేంద్రాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. 2015 డిసెంబర్ 16న సంగారెడ్డి పాత బస్టాండ్‌లోని ఇండి క్యాష్ ఏటీఎం కేంద్రంలో రూ.3.21 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుంచి కౌడిపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలో దోపిడీకి విఫలయత్నం చేశారు. చివరగా మెదక్‌కు చేరుకున్న దుండగులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేశారు. ఏటీఎంకు మంటలు అంటుకోవడంతోపాటు పోలీసుల రాకను గమనించి పరారైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలోనే మరోసారి ఏటీఎంలను టార్గెట్ చేయడం గమనార్హం. -
15 రోజులు.. 10 నేరాలు.. 40 లక్షలు!
ఏటీఎంల్లోని డ్రాప్‌బాక్సులు టార్గెట్ చేసిన ఉత్తరాది ముఠా ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రూ.11 లక్షలు సీజ్,మరో రూ.16 లక్షలు ఫ్రీజ్ హైదరాబాద్: నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో ఉన్న డ్రాప్బాక్సుల నుంచి చెక్కులు దొంగిలించడం... వాటిపై ఉన్న వివరాలు మార్చి ముందే తెరిచిన బ్యాంకు ఖాతాల్లో వాటిని డిపాజిట్ చేయడం... ఏటీఎం, ఆన్లైన్ ద్వారా కాజేయడం... ఈ పంథాలో రెచ్చిపోతూ 15 రోజుల వ్యవధిలో 10 నేరాలు చేసి రూ.40 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రామ్‌గోపాల్‌పేట పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.11 లక్షలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాల్లో ఉన్న మరో రూ.16.34 లక్షలు ఫ్రీజ్ చేశామని మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. సైఫాబాద్ ఏసీపీ జె.సురేందర్‌రెడ్డితో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనవివరాలు వెల్లడించారు. ముంబైలో ముఠాగా... రాజస్థాన్‌లోని జాలూర్ ప్రాంతానికి చెందిన మనీష్ గేనారామ్ ప్రజాపతి పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ముంబైకి వలసవెళ్లి అక్కడి ఓ హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేశాడు. ఆ సమయంలోనే ఇతడికి ఉత్తరప్రదేశ్ నుంచి ముంబై వలస వచ్చిన పరేష్ విశాల్కుమార్తో పరిచయమైంది. బీసీఏ పూర్తి చేసిన ఇతడు కొంతకాలం వారణాసిలో ఆధార్ కార్డుల ప్రాజెక్టులో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేశాడు. ‘డ్రాప్‌బాక్సు’ల్ని టార్గెట్ చేసుకుంటే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని ప్రజాపతికి సలహా ఇచ్చాడు. దీంతో రాజస్థాన్, బీహార్, మహారాష్ట్రల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ముంబైలోనే స్థిరపడిన హర్చంద్రామ్, గుల్షన్, చెలారామ్, మనీష్గుప్తాలతో ముఠా ఏర్పాటు చేసిన ప్రజాపతి రంగంలోకి దిగాడు. గుల్షన్ ప్రోద్బలంతో నగరానికి వచ్చిన ముఠా ఓల్డ్ బోయగూడ, విఠల్వాడీల్లో వ్యాపారస్థులమంటూ రెండు ఖరీదైన ఇళ్లను ‘అగ్రిమెంట్’పై అద్దెకు తీసుకుంది. ఈ అగ్రిమెంట్లతో పాటు తమ గుర్తింపుకార్డుల్ని వినియోగించిన విశాల్, మనీష్‌లు నగరంలోని 14 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వీరు డ్రాప్ బాక్స్‌లు పగులగొట్టి చెక్కులు తస్కరిస్తారు. వీటిలో కంపెనీల పేరుతో ఉన్న వాటిని ఎంచుకుని, ఆ చెక్కులపై సంతకం, నగదు మినహా మిగతా వివరాలను బ్లేడు, ఎరేజర్ సాయంతో తుడిచేస్తారు. రంగు పెన్సిళ్లు, పెన్నులు వినియోగించి చేతి రాత సరిపోలేలా తమ పేర్లు రాసుకుంటారు. ఇవి అకౌంట్ పెయిడ్ చెక్కులు కావడంతో తన ఖాతాల్లోకి డిపాజిట్ చేసి ఏటీఎంల ద్వారా నగదు డ్రా చేయడం, కార్డు ద్వారా బంగారం వంటివి ఖరీదు చేయడం చేసి అంతా పంచుకుంటారు. ఫిర్యాదుతో కదలిక... గత నెల 6న హార్డ్‌వేర్ వ్యాపారి ఎస్.కిరణ్‌కుమార్ సత్యవరపు హార్డ్‌వేర్ సంస్థకు చెల్లించడానికి రూ.2.66 లక్షలు చెక్కు రావ్గోపాల్పేటలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలోని డ్రాప్‌బాక్సులో వేశారు. ఈ చెక్కుకు సంబంధించిన నగదు సికింద్రాబాద్‌లోని ఎంజీరోడ్‌లో ఉన్న యుకో బ్యాంకు నుంచి పరేష్ విశాల్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలోకి వెళ్లిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ తరహా కేసులు నగరంలో మరో 9 నమోదయ్యాయి. దీంతో ఆర్ పేట ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్, అదనపు ఇన్స్పెక్టర్ బి.జానయ్య, ఎస్సై ఎస్.సైదులు గౌడ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిఘా పెరిగే అవకాశం ఉందని భావించిన ముఠా... చెన్నై, ముంబైలకు వెళ్లి ఈ తరహా నేరాలు కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈలోపు పోలీసులు మంగళవారం బోయగూడ, విఠల్వాడీల్లోని ఇళ్లతో పాటు మరో డెన్‌లో దాడి చేశారు. ప్రజాపతి, విశాల్, హర్చంద్ చిక్కగా... మిగలినవారు పరారయ్యారు. బాధితులు ఉంటే తమను సంప్రదించాలని డీసీపీ కమలాసన్‌రెడ్డి కోరారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. -
‘డబ్బా’లతో దోచేస్తారు..!
* ‘ఏటీఎం కేంద్రం’గా కొత్త తరహా మోసం * డబ్బు వచ్చే చోట ‘డబ్బా’లు పెడుతున్న వైనం * జోరుగా ఫోన్‌కాల్స్ ద్వారా మోసాలు * అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వినియోగదారుడు అబిడ్స్ ప్రాంతంలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. నగదు డ్రా చేసుకునేందుకు మిషన్‌లో కార్డు పెట్టడంతో పాటు మిగిలిన తతంగం పూర్తి చేశాడు. అయితే ఎంత సేపు వేచి చూసినా... డబ్బుతో పాటు స్లిప్ కూడా రాలేదు. సాంకేతిక సమస్యగా భావించి వెనుదిరిగాడు. ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాకపోవచ్చు... ఏటీఎం కేంద్రాలను అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల కొత్త ఎత్తు కూడా కావచ్చునని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఉత్తరాదిలో జోరుగా సాగుతున్న ఈ తరహా మోసాలు నగరంలోనూ చోటు చేసుకునే అవకాశం ఉందని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కేవలం ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బా, ట్రాన్స్పరెంట్ టేప్‌లను ఆధారంగా చేసుకునే నేరగాళ్లు తమ ‘పని’ ఎలా పూర్తి చేసుకుంటున్నారన్న దానిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సీసీలు( కెమెరాలు, సెక్యూరిటీ) లేని కేంద్రాలే లక్ష్యం చేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్లు, కెమెరాలను ఏర్పాటు చేసి ‘ఏటీఎం ఫ్రాడ్స్’ చేయాలంటే నేరగాడికీ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. పైగా ఇందుకు పెట్టుబడి కూడా ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుంది. ‘డబ్బా ఫ్రాడ్’కు పాల్పడే వారికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి అవసరం లేకుండానే పని పూర్తవుతోంది. ప్రధానంగా సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు లేని, జనసమర్థ ప్రాంతాలు, ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న ఏటీఎంలనే వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘డబ్బా’ తయారీలోనే ప్రత్యేకం... ఏటీఎం మిషన్ నుంచి నగదు బయటకు వచ్చే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు వీరు ప్రత్యేకమైన డబ్బాను రూపొందిస్తున్నారు. ఇది ఓ వైపు మిషన్‌కు ఉన్న మాదిరిగానే క్యాష్ స్లాట్‌ను తలపించేలా ఉంటూ, మరో వైపు ఖాళీగా ఉంటుంది. దీన్ని మిషన్ నుంచి నగదు బయటకు వచ్చే ప్రాంతంలో చాకచక్యంగా అతికించేయడంతో వినియోగదారుడికి ఏటీఎం మిషన్‌లో భాగంగానే కనిపిస్తుంది. ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు నివసించే ప్రాం తాల్లోని ఏటీఎంలను లక్ష్యంగా ఎంచుకున్న నేరగాళ్లు ప్రతి నెలా మొదటి వారంలోనే ఏటీఎం మిషన్లకు డబ్బాలను అమరుస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. స్లిప్ రాకుండా టేప్... క్యాష్ స్లాట్ దగ్గర డబ్బాను ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు... బ్యాలెన్స్ స్లిప్ సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినియోగదారులకు డబ్బు రాకుండా, స్లిప్ వస్తే వారు అనుమానించి, తక్షణం బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏటీఎం మిషన్‌ను పరిశీలిస్తాడు. వీటిని ఆస్కారం లేకుండా చేసేందుకు నేరగాళ్లు స్లిప్ సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను స్లిప్ బయటకు వచ్చే భాగంలో ట్రాన్స్పరెంట్ టేప్‌ను అతికించేస్తున్నారు. డబ్బు ‘డబ్బా’లోనే ఈ ‘ఏర్పాట్లు’ చేసిన ఏటీఎం కేంద్రంలోకి వెళ్లిన వినియోగదారులు కార్డు పెట్టడం నుంచి నగదు ఎంత కావాలో ఎంటర్ చేయడం వరకు అన్నీ పక్కాగా చేసినా... డబ్బు బయటకు రాదు. మిషన్ నుంచి డ్రా అయ్యే సొమ్ము నేరగాళ్లు ఏర్పాటు చేసిన డబ్బాలో పడిపోతుంది. టేప్ ఉన్న కారణంగా స్లిప్ సైతం బయటకు రాదు. దీంతో మిషన్ పని చేయట్లేదని భావించే వినియోగదారులు మరో ఏటీఎంకు వెళ్లిపోతాడు. కాస్త దూరంలో ఉంటూ దీన్ని కనిపెట్టే నేరగాళ్లు వెంటనే వచ్చి డబ్బాలో పడిన నగదు తీసుకుంటారు. ఎస్సెమ్మెస్ వచ్చినా.. వినియోగదారులు ఏటీఎం మిషన్లను వినియోగించినప్పుడు నగదు బయటకు రాకపోయినా... డ్రా అయినట్లు సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) వచ్చేస్తోంది. దీనిపై సదరు బ్యాంక్ కాల్ సెంటర్‌ను సంప్రదిస్తే 24 గంటల్లో నగదు తిరిగి ఖాతాలోకి వెళ్లిపోతుందని చెప్తున్నారు. సాంకేతిక సమస్యలతో పాటు అనేక సందర్భాల్లో అలానే జరుగుతోంది కూడా. అయితే ‘డబ్బా ఏటీఎం’ను వినియోగించినప్పుడూ వినియోగదారులకు వచ్చే ఎస్సెమ్మెస్‌లు ఈ తరహాకు చెందినవిగానే భావించి నష్టపోతున్నారు. జోరుగా కాల్స్ మోసాలు ఫోన్‌కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం తెలుసుకుని టోకరా వేస్తున్న నేరగాళ్లకూ కొదవ లేకుండా పోతోంది. నగర సైబర్ క్రైమ్ పోలీసులకు రోజుకు కనీసం మూడు ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు ఫోన్లు చేసి బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటున్నారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలంటూ సీవీవీ కోడ్, ఓటీపీలనూ తీసుకుంటున్నారు. ఆపై ఆన్లైన్ షాపింగ్స్, క్లోన్డ్ కార్డులతో డబ్బు డ్రా చేసేస్తున్నారు. అప్రమత్తతే పరిష్కారం ‘ఏటీఎం కేంద్రాల్లో డబ్బాల ద్వారా చేసే నేరాలు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తతే పరిష్కారం. సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు ఉన్న ఏటీఎం కేంద్రాలనే ఎంచుకోవడం ఉత్తమం. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఏ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు’ - విజయ్ ప్రకాష్ తివారీ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ -
అగ్నిప్రమాదంలో రెండు ఏటీఎం మిషన్లు దగ్ధం
-
ఏటీఎం సెంటర్లలో అగ్నిప్రమాదం: రెండు మిషన్లు దగ్ధం
హైదరాబాద్: హైదరాబాద్ శివారులో నాగోల్‌లోని ఏటీఎం సెంటర్లలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు చేలరేగడంతో ఏటీఎం సెంటర్లలో ఉన్న ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు సంబంధించిన రెండు ఏటీఎం మిషన్లు పూర్తిగా దగ్ధమైనట్టు సమాచారం. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏటీఎంలలో చోరీ: రూ.43లక్షలు ఖాళీ
బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా) : వర్ని, కోటగిరి మండలాల్లోని ఏటీఎంలపై మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. నాలుగు ఏటీఎంలపై గురిపెట్టి ఏకంగా రూ.43,32,000లను ఎత్తుకెళ్లారు. వర్ని మండలం రుద్రూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎస్బీఐకు చెందిన ఏటీఎంలో చొరబడిన దొంగలు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో షట్టర్‌ను తొలగించి లోపలికి చొరబడ్డారు. ఏటీఎంకు ఇరువైపుల గ్యాస్కట్టర్తోనే తొలగించి, క్యాష్ ట్రేను ఎలా ఉంటే అలా ఎత్తుకెళ్ళారు.ఆ క్యాష్ ట్రేలో సుమారు రూ.31.48లక్షల నగదు ఉంది. అనంతరం పక్కనే బస్టాండ్ వద్ద ఉన్న ఇండియన్ ఏటీఎంలో చొరబడిన వీరు అందులో ఏటీఎం ధ్వంసానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడి నుంచి నేరుగా కోటగిరి మండల కేంద్రానికి వెళ్ళి, అక్కడ ఉన్న ఎస్బీహెచ్ ఏటీఎంలోకి చొరబడి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి గ్యాస్ కట్టర్తోనే తమ పని పూర్తి చేశారు. దానిలో రూ.9.50లక్షల రూపాయలను ఎత్తుకెళ్ళారు. అనంతరం పక్కనే ఉన్న ఇండియన్ ఏటీఎంలోకి చొరబడి, అందులోని రూ. 2.34లక్షల నగదును దోచుకెళ్ళారు. ఇలా మొత్తం 43.32లక్షల సొత్తుతో ముఠా పారిపోయింది. ఏటీఎంలలో చోరీ జరిగిన విషయం ఉదయం వరకు ఎవరికీ తెలియరాలేదు. చోరీ జరిగిన విషయం తెలుసుకొన్న పోలీసులు ఖంగుతిన్నారు. ఈ చోరీలు మొత్తం తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటలలోపే జరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా తెలిసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన గురించి తెలుసుకొన్న నిజామాబాద్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సందర్శించి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని, మహారాష్ట్రకు చెందిన ముఠా ఈ దొంగతనానికి పాల్పడి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయా బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదు మేరకు వర్నీ, కోటగిరి ఎస్సైలు కేసులను నమోదు చేశారు. -
ఏటీఎంలు పెడితే డబ్బొస్తుంది!
ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు డబ్బుకు కటకటగా ఉంది. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ భారమవుతోందట. సాధారణంగా టాయిలెట్ల బయటివైపు బిల్‌బోర్డులు పెట్టి ప్రకటనల కోసం వాటికి అద్దెకివ్వడం సాధారణమే. అలాకాకుండా ఈ టాయిలెట్ల ద్వారా ఇంకా అదనపు ఆదాయం సంపాదించాలని ఆలోచించిన కార్పొరేషన్ అధికారులకు ఓ ఐడియా వచ్చింది. కొత్తగా కట్టబోయే 150 పబ్లిక్ టాయిలెట్లలో ఏటీఎంలు ఏర్పాటు చేయడానికి వీలుగా గదులు పెడతారట. వీటిని ఆసక్తి చూపిన బ్యాంకులకు అద్దెకిచ్చి ఆదాయం పొందుతామని మేయర్ రవీంద్ర యాదవ్ చెప్పారు. టాయిలెట్ల నిర్వహణ సరిగా ఉంటే సరి... లేకపోతే మాత్రం కంపుకొట్టే ఏటీఎంలలో డబ్బులు తీసుకునేందుకు జనం ముందుకొస్తారా? కార్పొరేషన్ మరో ఆలోచన కూడా చేస్తోంది. మున్సిపల్ స్కూళ్ల ప్రాంగణాల్లోని కొంతభాగాన్ని ఏటీఎం కేంద్రాలు, కోచింగ్ సెంటర్లకు అద్దెకివ్వాలని ప్రతిపాదనలు రూపొందిస్తోంది. -
ఎవరికీ పట్టని ఏటీఎంలు
సాక్షి, గుంటూరు: ఏటీఎం సెంటర్ల భద్రతను ఆయా బ్యాంకులు గాలికి వదిలేస్తున్నాయి. గుంటూరు నగరంలో చాలా ప్రాంతాల్లోని ఏటీఎంలకు డోర్ లాక్‌లు పనిచేయడం లేదు. 24 గంటల పాటు ఏటీఎం తలుపులు బార్లా తెరిచే ఉంటున్నప్పటికీ, సంబంధిత బ్యాంకర్లు పట్టించు కోవడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది నియామకాలు సైతం నామమాత్రంగా జరుగుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక పోవడంతో ఏటీఎంల వద్ద ఖాతాదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. నిత్యం కోట్లాది రూపాయలు ఈ ఏటీఎంల నుంచి ఖాతాదారులు డ్రా చేసుకుంటున్నారు. సెలవు దినాల్లో కూడా ఏటీఎంలు పనిచేస్తున్నాయి. భద్రతా సిబ్బంది పర్యవేక్షణ లోపం కారణంగా ఏటీఎంలలోకి నిజమైన ఖాతాదారులు వెళుతున్నారా లేక ఇతరులు వెళుతున్నారో వారికి పట్టదు. నగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. దొంగల దృష్టి ఏటీఎంలపై పడింది. దీంతో ఏ క్షణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయోనని ఖాతాదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల నెల్లూరు, వైజాగ్, హైదరాబాద్‌లో ఏటీఎంలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డ సంఘటనలు జిల్లా ప్రజలను కలవరపరుస్తున్నాయి. ఏటీఎంల వద్ద తారసపడుతున్న అనుమానితులను ప్రశ్నించే భద్రతా సిబ్బంది కరువయ్యారు. మూసుకున్న నిఘా నేత్రాలు... జిల్లాలో సుమారు 200 బ్యాంకులు తమ ఖాతాదారుల సౌలభ్యం కోసం ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. వీటిల్లో గతంలో ఏర్పాటు చేసిన ఏ ఒక్క ఏటీఎంకు సీసీ కెమెరా లేదు. కొత్తగా ఏర్పాటు చేసుకునే ఏటీఎంలకు మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చే స్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అర్బన్ జిల్లాలో అత్యధికంగా 80 ఏటీఎంలు ఏర్పాటు చేసింది. అలాగే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) 28 ఏటీఎంలు ఏర్పాటు చేసుకుంది. ఆంధ్రాబ్యాంకు 26 ఏటీఎంలు, ఐసీఐసీఐ బ్యాంకు 15, హెచ్డీఎఫ్సీ 6, యాక్సిస్ 11, ఇండియన్ బ్యాంకు 5, కరూర్ వైశ్యాబ్యాంక్ 2, కెనరా బ్యాంక్ 5, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు 4, ధనలక్ష్మీ 1, బ్యాంక్ ఆఫ్ బరోడా 1, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2, యూకో బ్యాంక్ 2, విజయా 1, ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ 1, సిండికేట్ బ్యాంక్ రెండు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌తో పాటు మరికొన్ని గ్రామీణ బ్యాంకులు కూడా ఖాతాదారులను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఏటీఎంలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే సగానికి పైగా ఏటీఎంలో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. డోర్లాక్లపై శ్రద్ధ ఏదీ..? నగరంలోని పలు ఏటీఎం కేంద్రాలకు డోర్‌లాక్‌లు లేవు. దీంతో వినియోగదారులు గుంపులుగా లోపలకు వెళుతున్నారు. ఏసీలు పనిచేయక సర్వర్లు అప్పుడప్పుడూ మొరాయించడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు. ఏటీఎం లోపలకు వెళ్ళాలంటే ముందుగా ఏటీఎం కార్డుతో డోర్ లాక్ తెరుచుకునే విధానం ప్రవేశపెట్టిన బ్యాంకులు.. రాన్రానూ వాటిని తొలగించాయి. అలారంలు ఉన్నప్పటికీ, అవికూడా సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది. బ్యాంకర్లకు క్లాసు తీసుకున్న అర్బన్ ఎస్పీ ఇటీవల గుంటూరు లక్ష్మీపురం రోడ్డులో వరుసగా చోటుచేసుకున్న భారీ చోరీల నేపథ్యంలో ఇప్పటికే బ్యాంకర్లతో అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి సమావేశమయ్యారు. ప్రధానంగా బ్యాంకు ఆవరణలతో పాటు సంబంధిత ఏటీఎంల వద్దకూడా సీసీ కెమెరాలు, అలారంలు, సెక్యూరిటీ సిబ్బంది విధిగా ఉండాలని చెప్పారు. వారంలోగా వీటన్నింటినీ మార్చుకోవాలని లేదంటే, తాము సూచించిన నియమాలు అమలయ్యే వరకు లావాదేవీలు నిలిపివేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, పోలీస్ హెచ్చరికలను కొన్ని బ్యాంకులు మాత్రమే పాటించగా చాలావరకు బేఖాతరు చేయడంపై ఎస్పీ సీరియస్‌గా ఉన్నారు. బ్యాంకు ఏటీఎంల దొంగతనాలపై ప్రజల్లో చైతన్యం కోసం డాక్యుమెంటరీలును చిత్రించి సీడీలు విడుదల చేశారు. సినిమా థియేటర్లలో కూడా డాక్యుమెంటరీ ప్రసారాలు చేయాలని పోలీసులు కోరి సీడీలు పంపిణీ చేశారు. బ్యాంకర్లు ఇప్పటికైనా స్పందించి ఏటీఎంల భద్రతపై ప్రత్యేక శ్రద్ధచూపాలని పోలీసులు, ప్రజలు కోరుతున్నారు. -
ఏటీఎం కేంద్రాల వద్ద భద్రత కరువు
సాక్షి, ఒంగోలు: ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. బ్యాంకుల్లో గంటల తరబడి క్యూలో నిలబడే బాధ తప్పడం, ఎక్కడికి వెళ్లాలన్నా డబ్బు వెంట పట్టుకుని ఉంటూ బిక్కుబిక్కుమనే కన్నా అవసరమైనప్పుడు నగదు డ్రా చేసుకునే వసతి ఉంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు చూస్తే..బ్యాంకులు ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయే కానీ వాటి బాగోగులు పట్టించుకోవడం మానేశాయి. ఏటీఎంలు తరచూ రిపేర్లనో, నగదు లేదనో బోర్డు తగిలించి పేరుకు మాత్రమే ఉన్నాయనిపిస్తున్నారు. అనేక చోట్ల ఏటీఎం సెంటర్లకు రక్షణగా నిలిచే సెక్యూరిటీ గార్డులు ఉండటం లేదు. ఏటీఎంలపై పోలీస్ నిఘా కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. దీంతో ఏటీఎంల వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ బుధవారం జిల్లావ్యాప్తంగా జరిపిన విజిట్‌లో అనేక చోట్ల ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ గార్డులు లేని దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ జరిపే పోలీసులు ఏటీఎంలకు షట్టర్లు మూసి ఉంటే ప్రత్యేకంగా వాటి వద్దకెళ్లి పరిశీలించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానం అనేక చోట్ల అమలు కావడం లేదు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు సంబంధించి 380 శాఖలకు గాను 180 ఏటీఎం సెంటర్లున్నాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు ప్రతి శాఖకు ఒక ఏటీఎంను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాల కోసం అన్వేషణ, సెక్యూరిటీ విషయంలో కొన్ని బ్యాంకు శాఖలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. అన్ని బ్యాంకులు తమ ఏటీఎంల వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసినప్పటికీ పలువురు అవకతవకలకు పాల్పడుతుండటంతో అలాంటి వారిని తొలగించినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం అనేక ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరు. అన్ని ఏటీఎంలలో సీసీ కెమెరాల సౌకర్యం ఏర్పాటు చేసినా వాటికి సంబంధించిన ఫుటేజ్‌లు కేవలం ఆరు నెలల వరకు మాత్రమే సక్రమంగా ఇమేజ్‌లు కనిపించే అవకాశం ఉంది. ఒంగోలులో... ఒంగోలు నగరంలో మొత్తం 58 బ్యాంకు శాఖలకు సంబంధించి 20 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. నగరంలోని నెల్లూరు బస్టాండ్‌లో ఉన్న కార్పొరేషన్, కెనరా, సిండికేట్ బ్యాంకుల వద్ద, సంతపేటలోని ఎస్బీహెచ్ వద్ద, వీఐపీ రోడ్డులోని ఎస్బీఐ, కొణిజేడు బస్టాండ్ వద్ద గల కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరు. అద్దంకిలో.. కొరిశపాడు మండలంలో మేదరమెట్ల, రావినూతల, పమిడిపాడుల్లో ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. మండలంలో ఉన్న ఏటీఎంలలో ఏఒక్క సెంటరుకూ సెక్యూరిటీ లేదు. అద్దంకి లోని ఏటీఎంలలో బంగ్లారోడ్లలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటరు వద్ద ఎలాంటి సెక్యూరిటీ ని ఏర్పాటు చేయలేదు. పంగులూరు మండలంలో ఉన్న ఒక్క ఏటీఎంలో సహితం సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. చీరాలలో... చీరాల పట్టణంలో అనేక బ్యాంకు శాఖలకు చెందిన ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డుల్లేరు. ఎస్బీహెచ్ బ్యాంకు పక్కన, ఎంజీసీ మార్కెట్ వద్ద ఉన్న ఏటీఎంలకు సెక్యూరిటీగార్డులు లేరు. అలానే హైస్కూల్ రోడ్డులోని ఐఓబీకు కూడా సెక్యూరిటీ గార్డు లేరు. దర్శిలో... ఓరియంటల్, సిండికేట్, పొదిలి రోడ్డులోని ఎస్బీఐ కౌంటర్లు మాత్రమే పనిచేస్తున్నప్పటికీ అక్కడ సెక్యూరిటీ గార్డుల్లేరు. దర్శి ప్రాంతం నుంచి అనేక ఆర్టీసీ సర్వీసులు హైదరాబాద్ వైపు రాత్రి వేళ ఉన్నాయి. పలువురు ప్రయాణిలు ఈ ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద రక్షణ లేక పోవడంతో ఏటీఎం కార్డుదారులు వెళ్లటానికి భయపడుతున్నారు. కొండపిలో... కొండపి భారతీయస్టేట్ బ్యాంకు పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు, టంగుటూరులోని ఒంగోలు వెళ్లే రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఎస్బీహెచ్ ఏటీఎం, కొండపి రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎం, శింగరాయకొండ ట్రంకురోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం, ప్రశాంతి థియేటర్ ఎదురుబజార్లో కెనరాబ్యాంకు ఏటీఎం, సోమరాజుపల్లి పంచాయతీలో ఉన్న ఆంధ్రాబ్యాంకు వద్ద శింగరాయకొండలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న సిండికేట్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుల్లేరు. పొన్నలూరులో ఉన్న స్టేట్‌బ్యాంకు ఏటీఎం వద్ద అదే విధంగా మండలంలోని అగ్రహరంలో ఉన్న ఆంధ్రాబ్యాంకు ఏటియం వద్ద సైతం సెక్యూరిటి గార్డులను ఏర్పాటు చేయలేదు. మార్కాపురంలో.. మార్కాపురంలో 10 ఏటీఎం సెంటర్లు, తర్లుపాడులో 1, పొదిలిలో 3, కొనకనమిట్లలో 1చొప్పున కేంద్రాలు ఉండగా, వీటిలో పలు చోట్ల సెక్యూరిటీ సిబ్బంది లేరు. ఆంధ్రాబ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్ మినహా ఇతర బ్యాంక్‌ల్లో సెక్యూరిటీ గార్డులు లేరు. పర్చూరులో.. పర్చూరులో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డుల్లేరు. గన్నవరం సర్కిల్లో ఉన్న ఏటీఎం కేంద్రం సక్రమంగా పనిచేయకపోగా ఎలాంటి సెక్యూరిటీ లేదని జనం పేర్కొంటున్నారు. కారంచేడులో ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ లేదు. చినగంజాంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఉన్న ఏటీఎం కేంద్రానికి, సినిమాహాలు సెంటరులో ఉన్న ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ సిబ్బంది లేరు. సంతనూతలపాడులో... పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న యాక్సిస్‌బ్యాంక్‌కు చెందిన ఏటీఎం కౌంటర్లో, రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డులేడు. -
ఇక పోస్టల్ ఏటీఎం సెంటర్లు
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని తపాలా శాఖ అందిపుచ్చుకుంటోంది. ఇప్పటివరకు బ్యాంకులకే పరిమితమైన ఏటీఎం సెంటర్లను పోస్టాఫీసుల్లోనూ నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సేవింగ్స్ బ్యాంకు(ఎస్బీ) ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాలలో హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. తొలుత ఈ పోస్టాపీసుల్లో ఏటీఎం సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఇన్ఫోసిస్ కంపెనీ, ఇంజినీర్ల బృందం ఇటీవల ఆదిలాబాద్, మంచిర్యాల కార్యాలయాలను సందర్శించింది. వచ్చే ఏడాది మార్చిలోపు పోస్టల్ ఏటీఎంలను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత జిల్లాలోని పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు న్యూ ఢిల్లీలోని తపాలా శాఖ కేంద్ర కార్యాలయం కార్యదర్శి కమల గోపినాథ్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. 2లక్షల మంది ఎస్బీ ఖాతాదారులు.. జిల్లాలో 2లక్షల మంది సేవింగ్ బ్యాంక్ ఖాతాదారులు ఉన్నారు. వీరు ఖాతాల్లో ఎప్పుడైనా న గదు వేసుకోవచ్చు. అవసరాన్నిబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆదిలాబాద్ హెడ్ పోస్టాఫీసు ప రిధిలో లక్షా 20వేల మంది,మంచిర్యాల హెడ్‌పోస్టాఫీసు పరిధిలో 80వేల మంది వరకు ఎస్బీ ఖాతాదారులు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండింటి పరిధిలో 63 సబ్ పోస్టాఫీసులు, 451 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి. ఖాతాల పరిశీలన మొదలు.. ఏటీఎం సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలంటే ప్రాథమికంగా హెడ్‌పోస్టాఫీసు పరిధిలో ఉన్న ఎస్బీ ఖాతాలను పరిశీలించి వాటి వివరాలను కంప్యూటర్లో పొందుపర్చాలి. ఆ దిశగా హెడ్ పోస్టాఫీసు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా జిల్లాలోని సబ్ పోస్టాఫీసులు తమ కార్యాలయ పరిధిలోని ఖాతాలను తాజాగా లావాదేవీలు జరుపుతున్నట్లు ధ్రువీకరిస్తారు. ఆయా సబ్పోస్టాఫీసుల పరిధిలోని బ్రాంచ్ పోస్టాఫీసులకు కూడా ఉన్న ఎస్బీ అకౌంట్లను సైతం పరిశీలించి సర్టిఫై చేస్తున్నారు. త్వరలోనే పోస్టు ఖాతాదారులకు ఏటీఎం సౌకర్యం అందుబాటులోకి రానుంది. గంటల తరబడి పోస్టాఫీసుల్లో నిలబడే అవసరం లేకుండా పోతుంది. మెరుగైన సేవలు.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తపాలా శాఖ జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాలలో పోస్టల్ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం సర్వే కూడా పూర్తయ్యింది. జిల్లాలోని 2 లక్షల మంది ఎస్బీ ఖాతాదారులకు ఈ సౌకర్యం అందుబాటులో రానుంది. - జె.పండరి, పోస్టల్ సూపరింటెండెంట్, ఆదిలాబాద్ -
బద్వేల్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో రూ.2.50 లక్షలు మాయం
వైఎస్సార్ జిల్లా: ఏటీఎం కేంద్రాలు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారుతున్నాయి. ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం..సీసీ కెమెరాలు పనిచేయకపోవటంతో భద్రత డొల్లగా మారింది. దీంతో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్ శాఖ , బ్యాంకర్ల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. ఏటీఎం కేంద్రాల్లో చోరీలు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్లో పోరుమామిళ్ల రోడ్డులో గల ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో రూ.2.50 లక్షలు మాయమైయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులు బద్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు బ్యాంకు అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
ఏటీఎం సెంటర్లలో ప్యానిక్ అలారం
=తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న పోలీసులు =మరికొన్ని విధివిధానాలు ఖరారు =నెల రోజుల గడువిచ్చాం : కొత్వాల్ అనురాగ్ శర్మ సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు ‘ఏటీఎం ఉదంతం’తోపాటు నగరంలో బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద వరుసగా చోటు చేసుకుంటున్న చోరీలు, దోపిడీల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భత్రతా చర్యలపై నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో పాటు అదనపు కమిషనర్లు అంజనీ కుమార్ (శాంతిభద్రతలు), సందీప్ శాండిల్య (నేరాలు), సంయుక్త కమిషనర్ (స్పెషల్‌బ్రాంచ్) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇందులో బ్యాంకు అధికారులకు పోలీసులు చేసిన సూచనలివీ... ఏటీఎం కేంద్రాల్లో ‘ప్యానిక్ అలారం’ ఏర్పాటు చేయాలి. లోపల ఉన్న వినియోగదారుడు ఏవైనా అనుమానాస్పద పరిణామం గమనిస్తే దీన్ని మోగిస్తే అంతా అప్రమత్తం అవుతారు. ఈ కేంద్రాలకు ముందు భాగంలో ఉండే అద్దాలు పూర్తి పాదర్శకంగా ఉండి, లోపల ఏం జరుగుతోందో బయటి వ్యక్తులకు కనిపించేలా ఏర్పాటు చేయాలి. వీటి షట్టర్లు పటిష్టంగా ఉండటంతో పాటు సాధారణ వ్యక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కిందికి లాగే అవకాశం లేకుండా ఏర్పాటు చేయాలి. ఏటీఎం కేంద్రం, బ్యాంకుల లోపల, బయట కచ్చితంగా సీసీ కెమెరా ఉండాలి. అది పూర్తి క్వాలిటీతో లోపలికి వచ్చే, బయటకు వెళ్లే వారిని స్పష్టంగా చిత్రీకరించే దిశలో ఏర్పాటు చేయాలి. పబ్లిక్ అడ్రస్‌సిస్టం ఏర్పాటు చేసుకుని ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ అప్రమత్తం చేయాలి. బ్యాంకులతో పాటు ఏటీఎం కేంద్రాల వద్దా కచ్చితంగా సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీరు సుశిక్షుతులై ఉండేలా చూడాలి. పోలీసు అధికారులు సైతం తమ పరిధిలోని బ్యాంకులను నిత్యం సందర్శిస్తూ అవసరమైన సహాయసహకారాలు, సూచనలు అందించాలి. నెల రోజుల గడువిచ్చాం : అనురాగ్ శర్మ ‘బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల భద్రతను పటిష్టం చేయడంతో పాటు నేరాల నివారణ కోసం బ్యాంకు అధికారులకు అనేక సూచనలు చేశాం. వీటిని కచ్చితంగా అమలు చేయాలని కోరాం. నెల రోజుల పాటు గడువు ఇచ్చాం. అప్పటి లోగా అమలు కాకుంటే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’. -
బెంగళూరులో 1,137 ఏటీఎంలకు తాళం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో 1,137 ఏటీఎం కేంద్రాలకు సోమవారం పోలీసులు తాళం వేశారు. గత వారం ఓ ఏటీఎంలో జరిగిన దాడి నేపథ్యంలో నగరంలోని అన్ని కేంద్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని కోరినప్పటికీ బ్యాంకులు పట్టించుకోకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సిబ్బంది ఏర్పాటుకు ఆదివారం వరకు గడువు ఇచ్చినప్పటికీ బ్యాంకులు విస్మరించాయన్నారు. ఇదిలావుంటే, ఒక్కొక్క ఏటీఎం భద్రత నిమిత్తం నెలకయ్యే సుమారు రూ.45 వేల ఖర్చును ఖాతాదారులపై మోపాలని బ్యాంకులు భావిస్తున్నట్టు సమాచారం. -
ఇదేం భద్రత?
-
ఏటీఎం సెంటర్ల వద్ద గస్తీ ముమ్మరం: అనురాగ్ శర్మ
హైదరాబాద్‌లోని ఏటీఎం సెంటర్ల వద్ద గస్తీని ముమ్మరం చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. నగరంలోని ప్రతి ఏటీఎం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఏటీఎంల వద్ద పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించామని అనురాగ్ శర్మ తెలిపారు. బెంగళూరు నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఏటీఎంలో మహిళపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ స్పందించారు. బెంగళూరులో ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. -
త్వరలో ఏపీజీబీ ఏటీఎం కేంద్రాలు
పర్చూరు, న్యూస్‌లైన్: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా త్వరలో ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్టూరుల్లో ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంకు ఒంగోలు రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్ పేర్కొన్నారు. పర్చూరు శాఖ తరఫున శనివారం డిపాజిట్ల సేకరణ ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా బ్యాంకు సిబ్బంది ఖాతాదారులతో రోడ్‌షో చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఒంగోలు రీజియన్ పరిధిలోని 60 శాఖల ద్వారా మార్చి 2013 నాటికి రూ. 1500 కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు. 2014 మార్చి నాటికి రూ. 1800 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వీటిలో రూ. 600 కోట్ల డిపాజిట్లు సేకరించి, రూ. 1200 కోట్ల రుణాలివ్వనున్నట్లు పేర్కొన్నారు. పర్చూరు శాఖ ద్వారా రూ. 8 కోట్ల డిపాజిట్లు సేకరించి, రూ. 23 కోట్ల రుణాలిచ్చినట్లు వివరించారు. త్వరలో ఏటీఎం సౌకర్యంతో పాటు రైతులకు కిసాన్ స్మార్ట్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ బ్యాంకుల్లో తొలిసారి ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్న బ్యాంకు తమదేనన్నారు. మొండి బకాయిల వసూళ్ల కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వసూలుకాని బకాయిల కోసం ఒన్‌టైమ్ సెటిల్మెంట్ అవకాశాన్ని రుణగ్రహీతలకు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ క్యాంపులు సెప్టెంబర్ 3న అద్దంకి, 4న కందుకూరు, 5న ఒంగోలుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాంపులను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు పొందిన రైతులు రుణాన్ని సకాలంలో చెల్లిస్తే తిరిగి వెంటనే రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. 5 కోట్ల విలువైన 1800 సోలార్ యూనిట్లు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. యూనిట్లకు 40 శాతం నాబార్డు రాయితీ, 10 శాతం లబ్ధిదారుని వాటా, 50 శాతం బ్యాంకు రుణం అందజేస్తుందన్నారు. ఆధార్ అనుసంధానం తో లభించే అన్ని పథకాలు తమ బ్యాంక్ ద్వారా పొందవచ్చని వివరించారు. సీనియర్ సిటిజన్స్‌కు తమ బ్యాంక్ ద్వారా 0.75 శాతం అదనపు వడ్డీ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ జి.రాధాకృష్ణ, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు, స్వయం సహాయక గ్రూపుల మహిళలు పాల్గొన్నారు.