సాక్షి, బెంగళూరు: బెంగళూరులో 1,137 ఏటీఎం కేంద్రాలకు సోమవారం పోలీసులు తాళం వేశారు. గత వారం ఓ ఏటీఎంలో జరిగిన దాడి నేపథ్యంలో నగరంలోని అన్ని కేంద్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని కోరినప్పటికీ బ్యాంకులు పట్టించుకోకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సిబ్బంది ఏర్పాటుకు ఆదివారం వరకు గడువు ఇచ్చినప్పటికీ బ్యాంకులు విస్మరించాయన్నారు. ఇదిలావుంటే, ఒక్కొక్క ఏటీఎం భద్రత నిమిత్తం నెలకయ్యే సుమారు రూ.45 వేల ఖర్చును ఖాతాదారులపై మోపాలని బ్యాంకులు భావిస్తున్నట్టు సమాచారం.