‘ఏటీఎం’ టెన్షన్
చెన్నై, సాక్షి ప్రతినిధి: బ్యాంకు లావాదేవీలను ఎంతో సులభతరం చేసిన ఏటీఎం కేంద్రాల రక్షణపై పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ఇటీవల బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యూరు. రాష్ట్రంలోని అన్ని ఏటీఎంలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డీజీపీ రామానుజం గురువారం ఆదేశాలు జారీచేశారు. బ్యాంకుల్లో మాత్రం ఎన్నో భద్రతా చర్యలు చేపట్టే నిర్వాహకులు ఏటీఎంల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రాష్ట్ర పోలీసుల పరిశీల నలో తేలింది. తమిళనాడులో
మొత్తం 22 వేల ఏటీఎంలు ఉండగా, వీటిల్లో 10 వేల ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డు లేరని తేలింది. చెన్నై నగరంలో 4,200 ఏటీఎంలలో 40 శాతం స్వేచ్ఛగా ఉన్నట్లు వెల్లడైంది.
నామమాత్రపు అర్హతలతో సాగుతున్న సెక్యూరిటీ గార్డుల నియామకం పూర్తి లోపభూయిష్టంగా మారింది. పోలీసు శాఖ నిబంధనల ప్రకారం ఎంతో కొంత సుశిక్షితులైన 40 ఏళ్లలోపు వారిని మాత్రమే గార్డుగా నియమించాలి. తక్కువ జీతానికి వస్తారనే కక్కుర్తితో కొందరు 60 ఏళ్లు పైబడిన వృద్ధులను నియమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వృద్ధాప్యం కారణంగా వీరు నిద్రపోవడం మినహా రక్షణగా విధులను నిర్వర్తించలేని పరి స్థితి. వీరి వద్ద రక్షణ కోసం ఎటువంటి ఆయుధాలు ఉండవు, దొంగపై తిరగబడే శక్తి కూడా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆరునెలల క్రితం తమిళనాడులో ఒక ఏటీఎం గార్డు దారుణ హత్యకు గురయ్యూ డు. కొన్ని ఏటీఎంలలో ఆటోమేటిక్ నిఘా కెమెరాలు కూడా లేవని తేలింది.
ఏటీఎం కార్డును వినియోగిస్తేనే తలుపు తెరుచుకునే విధానం అనేక చోట్ల అమలులో లేదు. ఇటువంటి నిర్లక్ష్యాల వల్లనే రాష్ట్రం లోని ఏటీఎంలలో చోరీ యత్నాలు సర్వసాధారణం గా మారిపోయాయి. రాష్ట్ర పోలీసు యంత్రాంగం బెంగళూరు ఘటనతో అప్రమత్తమైంది. అన్ని ఏటీఎంల వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిందిగా రాష్ట్ర డీజీపీ రామానుజం బ్యాంకు అధికారులను ఆదేశించారు. ప్రతి ఏటీఎంకు సెక్యూరిటీ గార్డును తప్పనిసరిగా నియమించాలని కోరా రు. ఏటీఎంలు ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.