ఏటీఎం సెంటర్ల వద్ద గస్తీ ముమ్మరం: అనురాగ్ శర్మ | Police commissioner says Security tightened at ATM centers | Sakshi
Sakshi News home page

ఏటీఎం సెంటర్ల వద్ద గస్తీ ముమ్మరం: అనురాగ్ శర్మ

Published Wed, Nov 20 2013 7:44 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఏటీఎం సెంటర్ల వద్ద గస్తీ ముమ్మరం: అనురాగ్ శర్మ - Sakshi

ఏటీఎం సెంటర్ల వద్ద గస్తీ ముమ్మరం: అనురాగ్ శర్మ

హైదరాబాద్లోని ఏటీఎం సెంటర్ల వద్ద గస్తీని ముమ్మరం చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. నగరంలోని ప్రతి ఏటీఎం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఏటీఎంల వద్ద పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించామని అనురాగ్ శర్మ తెలిపారు.

బెంగళూరు నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఏటీఎంలో మహిళపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ స్పందించారు. బెంగళూరులో ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement